iron
-
అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. రంగంలోకి ఎలాన్ మస్క్
వాషింగ్టన్ డీసీ: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ వడివడిగా పావులు కదుపుతున్నారు. ఇందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ని ట్రంప్ రంగంలోకి దించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. సోమవారం ఓ రహస్య ప్రాంతంలో ట్రంప్,ఇరవానిల మధ్య భేటీ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. రెండు నుంచి మూడుగంటల పాటు జరిగిన ఈ భేటీ సానుకూలంగా జరిగినట్లు వెల్లడించింది. అయితే ఈ భేటీపై అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలుఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 1న ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఇరాన్ తెలిపింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ సుప్రీంనేత ఆయాతుల్లా అలీ ఖమేనీ ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. తమని తక్కువ అంచనావేయొద్దని,తమకు జరిగిన నష్టానికి ఇజ్రాయెల్‌కు బదులిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.రంగంలోని ఎలాన్ మస్క్అయితే ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ప్రతిదాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అణు, చమురు క్షేత్రాలపై దాడి చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధించామవి.., అలా కాదని ప్రతి దాడులు పాల్పడితే ఆ తర్వాత జరిగే పరవ్యసనాలను తాము బాధ్యులం కాదని తేల్చింది.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఎలాన్ మస్క్ ఐక్యరాజ్యసమితికి టెహ్రాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానితో భేటీ అవ్వడం ప్రపంచ దేశాల్లో ఆసక్తికరంగా మారింది. 👉చదవండి : ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు -
తండ్రికొడుకు ప్రాణం తీసిన మంచం
సేలం: ఇనుప మంచం పడి తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటన దిండుగల్ లో ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. దిండుగల్ సమీపంలో ఉన్న సానర్పట్టి కాలియమ్మన్ కోవిల్ వీధికి చెందిన గోపీకన్నన్ (35) టైలర్‌గా పని చేస్తున్నాడు. ఇతని భార్య యోగేశ్వరి (32) నత్తం ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తుంది. వీరికి కుమారుడు కార్తిక్ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి యోగేశ్వరి పనికి వెళ్లడంతో ఇంట్లో గోపీకన్నన్ మద్యం మత్తులో ఇనుప మంచంపై పడుకుని నిద్రపోయాడు. అతని పక్కన నేలపై కార్తిక్ పడుకున్నాడు. ఈ స్థితిలో వేకువజామున ఇనుప మంచం బోల్టు ఊడి కింద పడింది. దీంతో మంచం మధ్యలో తల చిక్కుకుని గోపికన్నన్ కింద పడుకుని ఉన్న కుమారుడు కార్తిక్‌పై పడ్డాడు. దీంతో తండ్రీ, కొడుకులు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున లోగేశ్వరి తన భర్త, కుమారుడిని తనిఖీ చేసేందుకు వెళ్లింది. విరిగిన ఇనుప మంచంలో తన భర్త, కొడుకు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె గుర్తించింది. ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. సానర్పట్టి పోలీసులు కేసు నమోదు చేశారు -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్‌నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్‌ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్‌లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్‌ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు. -
హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో?
మానవ శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం అనే రెండూ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. అందుకే వైద్యనిపుణులు వివిధ రకాల కారణాల వల్ల క్యాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవలసిందిగా పేషెంట్లకు సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు సప్లిమెంట్లను కలిపి తీసుకుంటే.. కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయి. ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల వాటి ద్వారా అందాల్సిన ప్రయోజనాలు శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుర్తుంచుకోవాలి.. ఐరన్ తీసుకునే సమయంలో పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ తీసుకోండి. ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి. సూచించిన దానికంటే ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు. ఇవి చదవండి: హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!? -
వేడి వేడి ప్రెషర్ కుకర్ ఉండగా... ఐరన్ బాక్స్ దండగా
‘లిమిటెడ్ రీసోర్స్ నుంచే కొత్త ఐడియాలు జనించునోయి’ అని మరోసారి చెప్పడానికి ఈ వైరల్ వీడియో క్లిప్ సాక్ష్యం. కోల్‌కతాకు చెందిన మౌమితా చక్రవర్తి వేడి వేడి ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించి షర్ట్‌ను ఐరన్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ట్విట్టర్లో రీపోస్ట్ చేసిన ఈ వీడియో రెండు లక్షల యాభై వేల వ్యూస్‌ను దాటింది. -
ఇదేందిది.. ప్రజర్ కుక్కర్‌ను ఇలానూ వాడొచ్చా?
కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలోని వస్తువులతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటువంటివాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఇన్నాళ్లూ ఈ సంగతి మనకు తెలియలేదే.. అని ఆశ్యర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఓ యువతి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. హాట్ ప్రజర్ కుక్కర్‌ను ఉపయోగించి ఆ యువతి దుస్తులు ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఆ యువతి ఇండక్షన్ స్టవ్ నుంచి దించి, దానిని తీసుకుని గదిలోకి పరిగెడుతుంది. తరువాత ఆ కుక్కర్ సాయంతో ఒక షర్ట్ ఇస్త్రీ చేస్తుంది. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ 17 సెకన్ల వీడియో @Babymishra_ అనే ఖాతాతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, ఆరు వందల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్ ‘ఆమె సృజనాత్మకతకు వందనం’ అని రాయగా, మరొక యూజర్ ‘ఇస్త్రీ పెట్టె నూతన ఆవిష్కరణ. వెంటనే పేటెంట్ తీసుకోవాలి’ అని రాశారు. प्रिय दीदी जी को दंडवत प्रणाम 🙏 pic.twitter.com/ux2XkGpMSX — Shubhangi Pandit (@Babymishra_) March 12, 2024 -
రిఫ్రెష్ అవుదామని టీ తెగ తాగేస్తే..ఆ శక్తి తగ్గిపోతుంది!
అలసిన శరీరాన్ని సేదతీర్చడంలోనూ, మనసును సాంత్వన పరచడంలోనూ టీ ని మించింది లేదని అందరూ అంటారు. అలాగని టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగితే శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందంటున్నారు. టీలో అధికంగా ఉండే టానిన్ ఐరన్ శోషణను నిరోధిస్తుంది. ఐరన్ లోపం వల్ల శరీరంలో బలహీనత, అలసట, నిద్రలేమి, అనేక ఇతర సమస్యలు పెరుగుతాయి. టీ లో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది విశ్రాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, వికారం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుంది. జీర్ణ సమస్యలు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జీర్ణశక్తిని ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. గుండెల్లో మంట ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గుండెల్లో మంట పుడుతుంది. దీని కారణంగా ఆహార నాళంలో యాసిడ్ ఏర్పడి యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో పాటు పుల్లని తేన్పులు, వికారం కలుగుతాయి. నిద్ర సమస్యలు... కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు టీ తాగడం అలవాటు. అయితే ఇది వారి నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన సమస్యను కలిగిస్తుంది. రాత్రి పడుకునే ముందు టీ కి బదులు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. పేగులపై దుష్ప్రభావం... అధికంగా తాగే టీ మన పేగులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా టీ తీసుకునే వ్యక్తులు కెఫిన్, టానిన్ల కారణంగా ఆందోళన, ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. -
పండ్లను ఇనుములా మార్చి సుత్తిగా తయారుచేయొచ్చా!
ఫొటోలో కనిపిస్తున్న అరటిపండు నిజానికి ఒక సుత్తి. అలాగని అరటిపండు ఆకారంలో ఇనుముతో తయారుచేసిన సుత్తి కాదు. నిజమైన అరటిపండుతోనే రూపొందించిన సుత్తి ఇది. ఆశ్చర్యపోతున్నారా? ఈ మధ్యనే జపాన్‌కు చెందిన ‘ఐకెడా’ అనే కంపెనీ ఈ అద్భుతమైన అరటి సుత్తిని ప్రవేశపెట్టింది. సాధారణ వాతావరణంలో అరటిపండు మొత్తగా ఉంటుంది. కానీ మైనస్ డిగ్రీ సెల్సియస్ వాతవరణంలో పూర్తిగా గడ్డకట్టి .. బలమైన రాయి, సుత్తి కంటే గట్టిగా, బలంగా ఉంది. అలా ఫ్రీజ్ చేసిన అరటిపండుతో గోడకు మేకులు కొట్టే వీడియోలు ఇప్పటికే యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. దీని ఆధారంగానే ‘ఐకెడా’ గడ్డకట్టిన అరటిపండును తీసుకొని కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మెటల్ ప్రాసెసింగ్ చేసి ఈ అరటిసుత్తిని తయారుచేసింది. ఇదే విధంగా గతంలోనూ పైనాపిల్, బ్రోకలీ వంటివాటికీ మెటల్ ప్రాసెసింగ్ చేశారు. అయితే కొనుగోళ్లలో వాటన్నింటి కంటే ఈ అరటి సుత్తే టాప్‌లో నిలిచి వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇది వివిధ రకాల సైజుల్లో ధర రూ. వెయ్యి నుంచి రూ. ఆరువేల వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. (చదవండి: పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?) -
ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి జతకట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) అయితే ఈ మూవీ గ్లింప్స్‌లో..' ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు. ప్రస్తుతం 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్లో ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ డైలాగ్‌ను సైతం విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ డైలాగ్‌కు ప్రభాస్ మిర్చి సినిమాలో విలన్‌తో ఫోన్లో మాట్లాడే డైలాగ్‌ను జోడించారు. ఇంటర్నెట్.. అసలు ఏం నడుస్తోంది? అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ ఐరన్ డైలాగ్‌ను జతచేసి పోస్ట్ చేయడంతో ఐరనే వంచాలా ఏంటి(#Airanevanchalaenti), ఫ్యామిలీ స్టార్ (#FamilyStar) ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఏకంగా పోస్టర్‌నే రిలీజ్ చేసింది. (ఇది చదవండి: వరుణ్‌తేజ్- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్!) అయితే దీని వెనుక మరో కారణం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఐరన్ డైలాగ్, విజువల్స్ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్.. వాటిని తిప్పికొట్టేందుకు టీమ్ ఇలా ప్లాన్ చేసిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Maakkuda 🤣🤣 #AiraneVanchalaEnti #FamilyStar https://t.co/nHkerzL0Zk — Sri Venkateswara Creations (@SVC_official) October 26, 2023 Have you said it yet :) pic.twitter.com/5dWTnHJIEp — Vijay Deverakonda (@TheDeverakonda) October 26, 2023 -
వేదాంతా ఐరన్, స్టీల్ బిజినెస్ షురూ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీత ప్రణాళికల్లో భాగంగా వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 1 ముఖ విలువగల లక్ష ఈక్విటీ షేర్ల అధీకృత మూలధనంతో సంస్థకు తెరతీసింది. గత నెల 29న ప్రకటించిన బిజినెస్‌ల విడదీత ప్రణాళికలకు అనుగుణంగా ఐరన్, స్టీల్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసినట్లు వేదాంతా వెల్లడించింది. విభిన్న విభాగాలైన అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ తదితరాలను 5 కంపెనీలుగా విడదీసేందుకు గత నెలలో వేదాంతా నిర్ణయించిన విషయం విదితమే. తద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇనుము, స్టీల్ బిజినెస్ నిర్వహణకు తాజాగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుధవారం వేదాంతా బేస్ మెటల్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
వినాయక మండపం వద్ద భక్తులకు తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం: విశాఖపట్నంలో వినాయక మండపం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన చాక్లెట్ వినాయక మండపం వద్ద ఈదురు గాలులకు మండపంపై రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో వెనుకనే కూర్చున్న భక్తులపై సిమెంట్ రేకులు పడ్డాయి. భక్తులు తప్పుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తికి తలపై ఇనుప రాడ్డు పడింది. స్వల్ప గాయాలు అయ్యాయి. నిబంధనలు పాటించకుండా స్టాల్స్ ఏర్పాటుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తిరుమల: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన -
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
నోయిడా: నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోలో దారుణం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ఓ మోడల్ రాంప్ వాక్ చేస్తుండగా ఇనుప స్తంభం మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందాలపోటీ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి రాంప్ మీద తళుకులీనుతున్న అందమైన మోడల్స్ మీదే ఉంది. వారంతా ఫ్యాషన్ షోలో లీనమైపోయారు. వరుసక్రమంలో రాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా యధాప్రకారం రాంప్ మీద నడక మొదలుపెట్టింది. అంతలోనే లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం ఉన్నట్టుండి కూలింది. అది నేరుగా వంశిక మీద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బాబీ రాజ్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలవడంతో వైద్యం నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణ నేపధ్యంలో అడిషనల్ డిసిపి మోహన్ అశ్వతి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రాగా గుర్తించాము. ఆమె మరణం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాము. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాము. ఈవెంట్ నిర్వహిస్తున్న వ్యక్తి తోపాటు లైటింగ్ అమర్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: మన్మోహన్ సింగ్ ఒక పిరికిపంద.. అమిత్ షా -
2 వేల ఏళ్ల క్రితమే ఇనుము పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: ఇనుము తయారు చేసిన తర్వాత మిగిలిన వ్యర్ధమిది.. దీన్ని చిట్టెంగా పేర్కొంటారు. ఈ చిట్టెం రాళ్ల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. శాతవాహనుల కాలంలోనే మన వద్ద ఇనుము పరిశ్రమ విలసిల్లిందనటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులో ఇలాంటి చిట్టెం నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఇనుము పరిశ్రమలకు నిలయంగా ఉండేదని, నాటి పరిశ్రమ తాలూకు అవశేషాలుగా ఇప్పుడు ఈ చిట్టెం రాళ్లు వెలుగుచూస్తున్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. చిట్యాలలో తమ బృందం సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శ్యాంసుందర్‌లు స్థానిక మూలోని గుట్ట సమీపంలోని తాళ్లగడ్డలో వ్యవసాయ క్షేత్రంలో చిట్టెం రాళ్లను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమిని వ్యవసాయయోగ్యంగా మార్చే పనులు చేస్తున్నప్పుడు 20 అడుగుల చుట్టు కొలతగల ఇటుకల కట్టడం ఆనవాళ్లు వెలుగుచూసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఇనుము కరిగించేందుకు వాడే మూసలు, పెద్ద గొట్టాలు, భారీ గాగుల పెంకులు లభించినట్టు పేర్కొన్నారు. బయటపడిన భారీ ఇటుకలు 16 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇటుకలు కూడా బయటపడినట్టు వెల్లడిస్తున్నారు. ఇనుము కరిగించగా మిగిలిన బొగ్గు బూడిద కూడా వెలుగు చూస్తోందని పేర్కొంటున్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర పరికరాలకు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇనుము పరిశ్రమలు ఉండేవనటానికి ఈ ఆధారాలు, ఇనుము దేవతగా పేర్కొనే మమ్మాయి దేవతారాధన ఆనవాళ్లు స్థానికంగా ఉన్నాయని హరగోపాల్ పేర్కొన్నారు. చిట్టెం పతం నుంచే చిట్యాల ఊరి పేరు వచి్చందని ఆయన వెల్లడించారు. సమీపంలోని పెద్ద మందడి, చిన్న మందడి, అమ్మాయిపల్లి, గణపురం, మానాజిపేటల్లో నాటి చారిత్రక ఆధారాలున్నాయని తెలిపారు. -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్‌ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్‌ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్‌తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్‌లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్‌లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక..
భోపాల్: బొగ్గు గనిలో ఇనుము చోరీ చేసేందుకు వెళ్లిన నలుగురు దొంగలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లా కాల్రిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గని నుంచి బయటకు తీశారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ బొగ్గు గనిలోని జంక్ మెషీన్లలో ఇనుమును దొంగిలించేందుకు వెళ్లారు. ఓ వ్యక్తి బయట కాపలాగా నిలబడగా.. మిగిలిన నలుగురూ గనిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి ఎంతసేపైనా ఉలుకూ పలుకూ లేకపోవడంతో బయట నిలబడిన వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్థులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెస్క్యూ టీంతో బొగ్గు గని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. అయితే వారు అప్పటికే చనిపోయారు. లోపల ఊపిరాడకపోవడం వల్లే వీరు మరణించి ఉంటారని చెప్పారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రూ.44లక్షలు విలువ చేసే 110 టన్నుల తుక్కును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్క్రాప్ డీలర్లపై చర్యలు తీసుకున్నప్పుడు ఇది బయటపడింది. దొంగలు ఇనుమును దొంగిలించి డీలర్లకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. చదవండి: ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య! -
Puneeth Rajkumar: ఐరన్ స్క్రాప్‌తో పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం
తెనాలి: కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల వినతిపై ఆయన నిలువెత్తు ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు. టన్నున్నర ఐరన్ స్క్రాప్‌ను వినియోగించి నాలుగు నెలలు శ్రమించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ప్రతిష్టించనున్నారు. -
కదిలే ఇల్లు! ధర తక్కువ...ఎక్కడికైనా తీసుకుపోవచ్చు
హనుమకొండ: సొంతిల్లు నిర్మించుకుకోవాలంటే నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆ చోటే ఉంటుంది. కానీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్లు వస్తున్నాయి. వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన మొబైల్ హౌజ్ నగరవాసులను ఆకట్టుకుంంటోంది. వడ్డేపల్లికి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి–వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ప్లాట్‌లో ఇల్లు కట్టాలనుకున్నారు. ఎక్కువ డబ్బులు అవుతుండటంతో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకుని, వారిని సంప్రదించారు. రూ. 8.50 లక్షలతో కిచెన్, సింగిల్ బెడ్ రూం, అటాచ్డ్ బాత్ రూం, హాల్‌తో పూర్తిగా ఐరన్ ఉపయోగించిన మొబైల్హౌస్ను నిర్మించారు. లారీలో తీసుకువచ్చి బిగించేశారు. ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది. 30 ఏళ్లకుపైగా పటిష్టంగా ఉంటుందని గ్యారంటీ ఇచ్చినట్లు సతీష్‌గౌడ్ తెలిపారు. ఇల్లు 4 టన్నుల బరువు ఉంది. (చదవండి: 63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్) -
అమితాబ్ బచ్చన్‌కు గాయం.. విపరీతమైన రక్తస్రావం.. కుట్లు
ముంబై: ఇటీవల తన ఎడమ కాలికి గాయమైందని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. ఇనుప ముక్క కాలిపిక్కను చీల్చడంతో విపరీతంగా రక్తస్రావమైందని, కుట్లు కూడా పడ్డాయని ఆదివారం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని డాక్టర్లు గట్టి సలహా ఇచ్చినా గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్‌పతి చిత్రీకరణలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎడమ కాలి పిక్కకు బ్యాండేజీతో కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో పరుగెత్తుతున్న ఫొటోలను శనివారం ఆయన పోస్ట్ చేశారు. -
నిజాయితీకి నిలువెత్తు రూపమై.. రూ.4 లక్షల విలువైన నగను..
సాక్షి, అమలాపురం: స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా ఉంటున్న మల్లేశ్వరరావు దంపతులు నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచారు. తమ వద్దకు బ్యాగ్‌లో ఉన్న రూ.4 లక్షల విలువైన బంగారు నగను సంబంధిత వ్యక్తులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్ ఆర్.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మాసిన తన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఆమె ఇస్తారు. ఎప్పటిలాగే రెండు రోజుల కిందట డాక్టర్ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. అప్పటికే ఆ బ్యాగ్‌తో ప్రయాణించి వచ్చిన ఆమె తనకు చెందిన రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్‌ను అదే బ్యాగ్‌లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. ఈలోగా బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్ సాయిశిల్ప కుటుంబీకులు మధనపడుతున్నారు. ఇంతలో ఆ బ్యాగ్‌లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు ఆ బంగారు నగ కనిపించింది. దీంతో ఆ బంగారు నగను ఆ దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్ సాయిశిల్పకు అందజేశారు. వారి నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి దంపతులు.. మల్లేశ్వరరావు దంపతులను సోమవారం సత్కరించారు. వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని భూపయ్య అగ్రహారం ప్రజలు అభినందించారు. చదవండి: (చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి) -
తుక్కు విక్రయంతో రైల్వేకు రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తుక్కు ఇనుము విక్రయం ద్వారా దక్షిణ మధ్య రైల్వే 103 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రైల్వేలో ఇనుప తుక్కు విపరీతంగా పేరుకుపోతుండగా.. చోరీలు జరగడంతోపాటు కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. దీనికి పరిష్కారంగా దక్షిణ మధ్య రైల్వే ‘జీరో స్క్రాప్ పాలసీ’ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇనుప తుక్కును వదిలించుకునేందుకు దానిని ఎప్పటికప్పుడు విక్రయించేలా అనుమతి ఇచ్చింది. డివిజన్ల పరిధిలోని అన్ని సెక్షన్లలో ఇనుప తుక్కును గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. ట్రాక్‌ల పక్కన ఇనుప తుక్కు గరిష్టంగా నెల రోజుల కంటే ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు స్పష్టం చేశారు. విరిగిన రైలు పట్టాలు, పీ–వే ఐటమ్స్, లోకోలు, కోచ్‌లు, వేగన్లకు సంబంధించి తుక్కును ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేసి ఇ–ప్రొక్యూర్‌మెంట్‌కు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకోసం యూజర్ డిపో మాడ్యూల్‌ను అన్ని స్టోర్ డిపోల వద్ద ఉంచారు. ఈ విధానం సత్ఫలితాలిస్తోంది. ఇంతకుముందు ప్రతి మూడు నెలలకు ఒకసారి తుక్కును విక్రయించేవారు. దీనివల్ల ఇనుము తుప్పు పట్టి సరైన ధర వచ్చేది కాదు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు తుక్కును విక్రయిస్తుండటంతో అధిక ధర వస్తోంది. రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 103 రోజుల్లోనే తుక్కు విక్రయాలతో ఏకంగా రూ.100 కోట్ల ఆదాయం రావడం విశేషం. 2021–22లో మొదటి మూడు నెలల్లో రూ.51 కోట్ల ఆదాయం రాగా, 2022–23లో రూ.100 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. రానున్న రోజుల్లో జీరో స్క్రాప్ పాలసీని మరింత సమర్థంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు అన్ని డివిజన్ల అధికారులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. -
Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్‌సి అయ్యింది
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్ ఎం.ఎల్.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్డిఏ గవర్నమెంట్‌ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్‌లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది. కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి. 2019. జుడీషియల్ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్‌పూర్‌లో అక్కడి రైల్వేస్టేషన్ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు. కట్ చేస్తే – భక్తియార్‌పూర్‌లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్‌లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్ ప్రభుత్వం. తాను ఆర్.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఉన్నారు. ‘లాలూగారు నిన్ను ఎం.ఎల్.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 20న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ఆర్.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్. ముగ్గురు పిల్లల తల్లి మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్ రజక్ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్‌పూర్‌లోని రైల్వేస్టేషన్ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్ టీవీ చానల్స్‌లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్.జె.డి. నేతలు అంటున్నారు. మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్‌లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు. -
Hair Fall: జుట్టు రాలకుండా ఉండాలంటే..?
జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కోని యువత ఇంచుమించు ఇటీవల కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ఐరన్, విటమిన్ – సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. జుట్టు రాలిపోకుండా చేసే వాటిలో ఐరన్ కీలకమైనది. మనకు ఐరన్ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి తీసుకోవాలి. మాంసాహారంలో.. కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అవసరం. విటమిన్–సి కోసం: ఉసిరిలో విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జింక్: గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారం లో జింక్, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్సు చేస్తోంది. జింక్‌కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితోపాటు సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యతతో జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్‌ను కలిసి వారి సలహా మేరకు మందులు, పోషకాలు తీసుకోవడం మంచిది.