![Health: Do You Know What Happens When Iron And Calcium Are Taken Together? - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/30/Iron-Calcium.jpg.webp?itok=pyNa6-Zv)
ఐరన్, కాల్షియం
మానవ శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం అనే రెండూ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. అందుకే వైద్యనిపుణులు వివిధ రకాల కారణాల వల్ల క్యాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవలసిందిగా పేషెంట్లకు సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు సప్లిమెంట్లను కలిపి తీసుకుంటే.. కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయి.
ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల వాటి ద్వారా అందాల్సిన ప్రయోజనాలు శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి గుర్తుంచుకోవాలి..
ఐరన్ తీసుకునే సమయంలో పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ తీసుకోండి.
ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి.
సూచించిన దానికంటే ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment