
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్‌గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!
క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్‌ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...
శక్తిని పెంచుతుంది..
మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
గుండెకు బలాన్నిస్తుంది..
రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.
జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..
జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.
మానసిక బలం
రోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.
చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.
పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.
ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.