awareness
-
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫెక్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన. -
పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్, హోఫ్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష అన్నారు. అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అని నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోఫ్ ఫర్ లైఫ్ సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హోఫ్ ఫర్ సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది. -
బ్రెయిన్ ఇంజురీలను నివారించడం ఎలా? పోలీసులకు అవగాహనా కార్యక్రమం
ప్రముఖ ఆసుపత్రి ఆలివ్ పోలీసుల అధికారుల కోసం బ్రెయిన్ ఇంజురీ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రాంను నిర్వహించింది. ప్రమాదాలు చోటు చేసుకుని, మెదడు తీవ్రగాయాలైన వ్యక్తుల ప్రాణాలను ఎలా కాపాడాలో తెలిపే విధంగా హైదరాబాద్‌లోని పోలీసులకు అవగాహన కల్పించింది. మెదడు గాయాల గురించి అవగాహన పెంచడం, ప్రభావవంతమైన నివారణ చర్యలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆలివ్ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కార్యక్రమం మెదడు గాయాల ప్రమాదాలు , ముందస్తు గుర్తింపు, నివారణ చర్యల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మెదడు గాయాల అవగాహన, నివారణపై నిపుణుల చర్చలు జరిగాయి. ఆసుపత్రి వైద్యులు వివిధ రకాల మెదడు గాయాలు, వాటి దీర్ఘకాలిక ఆరోగ్య చిక్కులు, సరిగ్గా నయం కావడానికి ముందస్తు జాగ్రత్తలు, చికిత్స అవసరంపై సమాచారాన్ని అందించారు. ఈ గాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి రహదారి భద్రత, హెల్మెట్లు ధరించడం, కార్యాలయ భద్రత వంటి నివారణ చర్యలను కూడా సెషన్ నొక్కి చెప్పింది. సమాజం మరియు పోలీసుల భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ, చట్ట అమలు అధికారులు మరియు స్థానిక ప్రభుత్వం భద్రతా ప్రోటోకాల్‌లను నిర్ధారించడంలో, అవగాహన పెంచడంలో ఎలా సహాయ పడతాయో ఈ కార్యక్రమం హైలైట్ చేసిందిహైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ నుండి ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరిలో DCP- చంద్ర మోహన్ సౌత్ వెస్ట్ జోన్, ట్రాఫిక్ ACP ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ ఘోషమల్, ఇన్స్పెక్టర్ మున్నవర్ కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ అవగాహనను వ్యాప్తి చేయడంలో, భద్రతను నిర్ధారించడంలో చట్ట అమలు కీలక పాత్రను వారు గుర్తు చేశారు. బ్రెయిన్ ఇంజురీ, నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స ప్రాముఖ్యతను ఆలివ్ నొక్కి చెబుతుంది. బ్రెయిన్ ఇంజురీలపై పెరుగుతున్న ఆందోళనల మధ్యఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మెదడు గాయాలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయనీ, అందుకే ముందస్తు వైద్యం ద్వారా ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఆలివ్ హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ రఘుర్కం తేజ తెలిపారు. మెదడు గాయాల బాధితులకు మరింత అవగాహన కల్పించడానికి , ఉత్తమ సంరక్షణను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమాలను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.ఈ కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్, DCP- చంద్ర మోహన్, ట్రాఫిక్ ACP ధనలక్ష్మి సౌత్ వెస్ట్ జోన్ ఘోషమల్, ఇన్స్పెక్టర్ మున్నవర్ కుల్షుంపురా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య కుల్షుంపురా, ఆసిఫ్ నగర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, గోల్కొండ ACP సయ్యద్ ఫియాజ్, ఘోషమల్ ట్రాఫిక్ CI బాలాజీ ధరావత్, గుడిమల్కాపూర్ CI రవి , టోలిచౌకి ట్రాఫిక్ CI సుధాకర్ ఉన్నారు. వైద్యుల సూచనలను స్వీకరించడంతోపాటు , వారి వ్యక్తిగత అధికార పరిధిలో ప్రజా భద్రతను ప్రోత్సహించడానికి దీన్ని ఆచరణలో చేర్చగల పద్ధతులను నేర్చుకున్నారు. భద్రతా ప్రోటోకాల్‌లు అమలుతోపాటు, మెదడు గాయం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేసే విధంగా తమ బృందాలకు, సంఘాలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమంలో నేర్చుకున్న వాటిని వినియోగిస్తామని పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. -
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న వార్తలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి. ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు ఈ ఇమ్మిగ్రేషన్ సెమీనార్‌కు ముఖ్యవక్తలుగా విచ్చేసి అనేక కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జన్మత:పౌరసత్వం, హెచ్ ఒన్ బీ నుంచి గ్రీన్ కార్డు వరకు అనుసరించాల్సిన మార్గాలు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్4 వీసా ఇలాంటి ఇమ్మిగ్రేషన్ అంశాలపై భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సెమీనర్లో పాల్గొన్న వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఇమ్మిగ్రేషన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ సెమీనార్ నిర్వహణ కోసం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల కృషి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సెమీనార్‌కు విచ్చేసిన భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలకు నాట్స్ నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ సెమీనార్ విజయవంతం కావడంలో శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరి కీలక పాత్రలు పోషించారు. తెలుగు వారికి ఎంతో ఉపయుక్తమైన ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ టీంను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు. -
మాటతో మాయచేస్తూ...మనసుల్ని దోచుకుంటాడు!
గత కొంతకాలంగా చిన్నారుల్లో ఫోన్ వాడే అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. ఆ అలవాటును మాన్పించేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు చేపట్టాడు నగరానికి చెందిన ప్రముఖ వెంట్రిలాక్విజం కళాకారుడు సంతోష్ కుమార్. వివిధ రకాల జంతువుల బొమ్మలతో పప్పెట్ షోలు నిర్వహిస్తూ చిన్నారుల్లోని ఫోన్, టీవీ చూసే అలవాటును మాన్పిస్తున్నారు. అలాంటి అలవాట్లతో వచ్చే అనర్థాలను తెలియజేస్తూ వారిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నాడు. – సుల్తాన్‌బజార్ చిన్నారుల్లోని మానసిక స్థితిని మార్చేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు వెంట్రిలాక్విజం కళాకారుడు సంతోష్ కుమార్. తద్వారా నగరంలోని ఎందరో తల్లిదండ్రుల మన్ననలను పొందుతున్నాడు. నగరంలోని పేరొందిన కార్పొరేట్ పాఠశాలలతో పాటు అమెరికా, జర్మనీ, జపాన్, లండన్, శ్రీలంక లాంటి దేశాల్లో తనదైన శైలీలో ప్రదర్శనలు ఇస్తూ జాతీయస్థాయిలో అవార్డులను అందుకుంటున్నారు. చిన్నారుల్లో మార్పుకు దోహదం.. కార్టూన్ షోలకు ఎడిక్ట్ అయిన చిన్నారులను వాటి ద్వారా రుగ్మతలను దూరం చేసేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్న తల్లిదండ్రులు టీవీ, మొబైల్ ఎడిక్షన్ నుంచి వారిని మాన్పించే విషయంలో విఫలమ వుతున్నారు. ఈ క్రమంలో తన వెంట్రిలాక్విజం కళతో పలు పాఠశాలల ఆహ్వానం మేరకు 30 నిమిషాల పప్పెట్ షో నిర్వహిస్తున్నాడు. తద్వారా వివిధ జంతువులు, తోలు బొమ్మల ద్వారా వెంట్రిలాక్విజం చేస్తూ చిన్నారుల్లోని అలవాట్లను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. విద్యాబోధన ద్వారానే కాకుండా ఇలాంటి షోల ద్వారా చిన్నారుల్లో ఎంతో మార్పు వస్తుందని పలు పాఠశాలల యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయస్థాయి అవార్డు.. దేశ విదేశాల్లో వెయ్యికి పైగా షోల ద్వారా చిన్నారుల మానసిక పరివర్తనలో మార్పుతెచ్చేందుకు కృషిచేసిన సంతోష్‌కు ఎర్లీ చైల్డ్‌హుడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ నెల 15న ముంబయిలో జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇదే ప్రోత్సహంతో చిన్నారుల మానసిక స్థితిని మార్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పప్పెట్ షోలు నిర్వహిస్తానని, అయితే దానికి ప్రభుత్వ సహకారం కావాలని సంతోష్ కోరుతున్నాడు. -
ఊబకాయంపై పోరు : 10 మంది కీలక వ్యక్తులను నామినేట్ చేసిన పీఎం మోదీ
ఊబకాయం (Obesity)పై అవగాహన పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Modi) వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్య ముప్పును అరికట్టడానికి చర్యలు తీసు కోవాలని ప్రజలను ఉద్బోధించిన ప్రధాని తాజాగా ఊబకాయంపై పోరాటంలో సహాయం చేయడానికి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra), నటుడు మోహన్ లాల్ (Mohanlal)తోపాటు వివిధ రంగాలకు చెందిన 10 మందిని సోమవారం నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరిస్తూ, ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4— Narendra Modi (@narendramodi) February 24, 2025 దేశంలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని ఆదివారం జరిగిన మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె తీసుకోవడం 10 శాతం తగ్గించడంతోపాటు, ఈ చాలెంజ్‌ను మరో పది మందికి అందించాలని ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని కోరారు. ప్రధానమంత్రి డబ్ల్యూహెచ్‌వో WHO డేటాను ఉటంకిస్తూ, 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ లెక్కలు చాలా తీవ్రమైనవని, ఇలాఎందుకు జరుగుతుందో మనమందరం ఆలోచించాలని పిలుపినిచ్చారు. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది అని అన్నారు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఅలాగే దీనికి సంబంధించిన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను విస్తృతం చేసేందుకు తానుఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు మరో 10 మందిని నామినేట్ చేయాలని కూడా వారిని అభ్యర్థిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నామినేట్ చేసిన ప్రముఖులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ భోజ్‌పురి గాయకడు, నటుడు నిరాహువాహిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలింపిక్ విజేత మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయ ఘోషల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి ఉన్నారు. ఈ పదిమంది ఎంతమందిని నామినేట్ చేస్తారో.. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో చూద్దాం.! -
World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్నీ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ "యునైటెడ్ బై యునిక్". కేన్సర్ కారకాలు, సంరక్షణపై దృష్టి సారించి, సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం. వ్యక్తిగతీకరించిన చికిత్సలు, మద్దతుపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. 2000లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఈ రోజును ప్రారంభించింది. కేన్సర్ వ్యాధి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంఘాలు, సంస్థలను సమీకరించే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరిగింది. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, అందరికీ సంరక్షణలో మెరుగుదల చూడాలనే సంకల్పంతో కేన్సర్ సమాజం ఐక్యంగా ఉంది అని UICC అధ్యక్షురాలు, స్వీడిష్ కేన్సర్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఉల్రికా అరెహెడ్ అన్నారు.దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, తరువాతి కేన్సర్దే. 2050 నాటికి కేసులలో 77 శాతం పెరుగుదల అంచనా. ఫలితంగా 1.32 కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. 2022లో 90.6 లక్షల మంది మరణించారు. ప్రతీ ఏడాది 10 లక్షల మంది పిల్లలు తమ తల్లిని కోల్పోతున్నారు. 10.4 లక్షల మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతున్నారు. నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, కడుపు కేన్సర్, లివర్ కేన్సర్ ప్రధానంగా ఉన్నాయి.సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, ట్యూమర్, కణితి, గడ్డలుగా మారే స్థితినే కేన్సర్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యాధి ముందస్తుగా గుర్తించడం వల్ల చాలావరకు ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు కాదు, బాధిత వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన మానసిక, భావోద్వేగాలకు సంబంధించి కూడా. అయితే వివిధ రకాల అపోహలతోపాటు అవగాహన లేక పోవడం, భయం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తరువాతే గుర్తిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనట్టు ఏ వ్యాధికైనా చికిత్సకంటే ముందస్తుగా గుర్తించడం కీలకం. ఈ సూత్రం కేన్సర్ విషయంలో ఇంకా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.కేన్సర్‌ను గుర్తించేందుకు ముఖ్యమైన లక్షణాలుఉన్నట్టుండి అనూహ్యంగా బరువు తగ్గడం. ఎలాంటి కారణం అంటే, డైటింగ్, వ్యాయామం, లేకుండానే నెలకు ఐదు కేజీలకంటే ఎక్కువ బరువు తగ్గితే ప్రమాద సంకేతమని గుర్తించాలి. సుదీర్ఘం కాలం పాటు జ్వరం వేధించడం. కేన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోవడం. సాధారణంగా ఎలాంటి గాయమైనా మూడు నాలుగు వారల్లో నయం కావాలి. అలా కాని పక్షంలో అనుమానించాలి. గాయం తగ్గకపోగా, లక్షణాలు పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.నోట్లో ఎంతకీ మానని పుండ్లు. నోట్లో పుండ్లు ఏర్పడి చాలాకాలం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. పొగాకు, గుట్కా, పాన్ నమలడం లాంటి అలవాట్లున్నవారు మరింత జాగ్రత్తపడాలి.అకారణంగా అలిసిపోవడం కేన్సర్‌లో మరో ప్రధాన కారణం. విపరీతమైన అసలట. నీరసం, ఓపిక లేకుండా అయిపోవడం. ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోవడం. నిస్సత్తువగా అనిపించడం. ప్రధానంగా లుకేమియా కేన్సర్ సోకిన వారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన రక్తహీనత. రక్తంలో హిమగ్లోబిన్ శాతం గణనీయంగా తగ్గిపోవడం.శరీరంపై కొత్తగా మచ్చలు పుట్టుకు రావడం, పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్ పిగ్మెంటేషన్)ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడంలాంటి సమస్యలున్నా జాగ్రత్తపడాలి. సుదీర్ఘకాలం పాటు,వాంతులు వేధించడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం లాంటి లక్షణాలు పెద్దపేగు కేన్సర్ వల్ల కావచ్చునేమో అనుమానించాలి.రొమ్ముల్లో, వృషణాల్లో, గొంతులో ఏదైనా గడ్డలు తగిలితే అనుమానించాలి. రొమ్మునుంచి రక్తం, చీము లాంటి స్రావాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే పురుషాంగం లేదా యోనిపై మానని పుండ్లు ఉండే సాధారణ ఇన్ఫెక్షన్ అవునా? కాదా నిర్ధారించుకోవాలి. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడటం, మూత్రం రంగు మారడం, పదే పదే మూత్రానికి వెళ్లాలని పించడం, లేదా అసలే నీరుడు బంద్ కావడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ కేన్సర్లకు దారి తీయవచ్చు.మలంలో విపరీతంగా రక్తం, రంగు మారడం పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఈ పైన చెప్పిన లక్షణాలు మూడు లేదా నాలుగు వారాలకు మించి కొనసాగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దానికి కారణాలను నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. సైలంట్ కిల్లర్కేన్సర్ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దాకా గుర్తించడం కష్టం. మరో విధంగా చెప్పాలంటే.. దాదాపు నాలుగో స్టేజ్‌లో బయటపడతాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ , అండాశయ కేన్సర్ లాంటి నిశ్శబ్దంగా చుట్టుముడతాయి. ఈ మహమ్మారికి చిన్నాపెద్దా, ముసలీ ముతకా, స్త్రీ, పురుష అనే దయాదాక్షిణ్యాలేవీ ఉండవు. అందుకే అవగాహన, అప్రమత్తత అవసరం. -
ఒక్కసారి బానిసైతే.. మీ లైఫ్ క్లోజ్..
-
‘సజ్జనార్ సార్.. ఇలాంటి వారిని ఏం చేయలేమా?’
తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్ అధికారికానూ సోషల్ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా. తాజాగా.. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్ సెక్షన్లోనే చర్చ జరుపుతున్నారు.సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయలేమా? అని..చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!! అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్లైన్ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయాలని, వాటని ప్రమోట్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి! -
సెలబ్రిటీలు మెచ్చిన స్టార్
అమెరికాలో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చిన రేవంత్ హిమంత్సింగ్కా ఫుడ్ లేబుల్స్ చదవడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి, ఆరోగ్య అక్షరాస్యతను మెరుగుపరచడానికి నడుం కట్టాడు. సర్టిఫైడ్ హెల్త్‌కోచ్ అయిన రేవంత్ జంక్ ఫుడ్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే లక్ష్యంతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగివచ్చాడు. ఒకప్పుడు ఫైనాన్స్, హెల్త్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్...మొదలైన వాటికి సంబంధించి సెల్ఫ్–హెల్ఫ్ బుక్ ప్రచురించాడు. ఇందులో ప్యాకేజ్డ్ గూడ్స్ లేబుల్స్‌పై కూడా ఒక చాప్టర్ ఉంది. సోషల్ మీడియాలో రేవంత్ ఎలా పాపులర్ అయ్యాడు అనే విషయానికి వస్తే...పిల్లల హెల్త్–డ్రింక్ బోర్న్‌విటాపై ఒక వీడియో విడుదల చేశాడు. డ్రింక్‌లో చక్కెర మొత్తాన్ని ఈ వీడియో హైలైట్ చేస్తుంది ఇది సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పుణ్యమా అని రేవంత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. ఆ తరువాత ‘ఫుడ్‌ఫార్మర్’ ట్యాగ్‌లైన్‌తో మ్యాగీ, మ్యాంగో జ్యూసెస్లాంటి ప్యాకేజ్డ్ కంటెంట్‌పై అవగాహన కలిగించడానికి మరిన్ని వీడియోలు చేశాడు. సెలబ్రిటీలు కూడా ఈ వీడియోలను షేర్ చేసేవారు.వివిధ వేదికలపై మాట్లాడే ఆహ్వానాలు రావడం, తరచూ పర్యటనలు చేయడం ఇబ్బందిగా మారడంతో కోల్కత్తా నుంచి ముంబైకి మకాం మార్చాడు హిమంత్సింగ్కా. పాఠశాలలో హెల్త్‌పై సబ్జెక్ట్ లేదు. వైద్యులతో కలిసి డయాబెటిస్, పీసీఓఎస్లాంటి సబ్జెక్ట్లపై కోర్సులు రూపొందించాలనుకుంటున్నాను. కోర్సుల ఫీజులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నాను. ప్రజలను ఆరోగ్య అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది’ అంటున్నాడు. ‘ఫుడ్‌ఫార్మర్’గా పాపులర్ అయిన రేవంత్ తాజాగా ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్–2024’ జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by Revant Himatsingka (@foodpharmer)(చదవండి: -
సోల్‌మేట్స్‌తో సోషల్‌గా...మనసుకు మేలే..!
సోషల్ మీడియా చేసే చెరుపు గురించి చర్చ ఉన్నప్పటికీదానిని సరిగా ఉపయోగిస్తే మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.స్నేహాలు, సమూహాలు మనకంటూ కొందరున్నారన్న భరోసా ఇస్తేసలహాలు సూచనలు కూడా ఇక్కడి నుంచి అందడం వల్లఆందోళన దూరం అవుతుందంటున్నారు.సోషల్ మీడియాను మెరుగ్గా ఎలా అర్థం చేసుకొని ఉపయోగించాలి?సోషల్ మీడియా అంటే అదొక అవాస్తవిక ప్రపంచం, అక్కడున్న వారికి ఇబ్బందులు తప్పవు, మహిళల మీద ట్రోలింగ్ ఉంటుంది అనే అభి్ర΄ాయాలు చాలామందిలో ఉన్నాయి. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంది. సోషల్ మీడియాను సరిగ్గా వాడితే మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్, నిరాశ వంటివాటితో ఇబ్బంది పడేవారికి సోషల్ మీడియా ధైర్యాన్ని, మద్దతును, అర్థం చేసుకునే స్నేహితులను అందిస్తుందని అంటున్నారు.ఆత్మీయ బంధాలను అల్లుకోవచ్చుసోషల్ మీడియాలోని స్నేహాలన్నీ వ్యర్థమని, అక్కడ పరిచయమైన వారిలో నిజాయితీ ఉండదనే అ΄ోహ చాలామందిలో ఉంది. కానీ మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారిలోని నిజాయితీని గుర్తించొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. అనేక ్ర΄ాంతాల్లో నివసిస్తున్న వారు, అనేక సామాజిక, ఆర్థిక నేపథ్యాలున్నవారు సోషల్‌మీడియాలో తారసపడుతుంటారు. అందులో మన భావాలకు, అభి్ర΄ాయాలకు తగ్గవారిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారితో స్నేహం చేయడం ద్వారా మనలోని ఒంటరితనం దూరమవుతుంది. సోషల్‌మీడియాలో పరిచయమై ఆ తర్వాత అత్యంత ఆత్మీయ మిత్రులుగా మారినవారు బోలెడంత మంది ఉన్నారు. ఇవి మనసుకు బలం ఇస్తాయి.అభిరుచులకు తగ్గ స్నేహాలు మన చుట్టూ ఉన్నవారు మన అభిరుచులకు తగ్గట్టే ఉంటారని అనుకోలేం. కానీ సోషల్‌మీడియాలో ఒకే అభిరుచి, ఇష్టాయిష్టాలు కలిగిన వారు ఒకచోట చేరే అవకాశం ఉంటుంది. పుస్తక ప్రియులైతే ఒకచోట, చిత్రలేఖనం ఇష్టమైనవారంతా ఒకచోట, సినిమాలపై ఆసక్తి ఉంటే ఒక గ్రూప్, ప్రయాణాలు ఇష్టపడేవారు మరో గ్రూప్.. ఇలా మన ఇష్టాలకు తగ్గట్టు మెలిగే వారు కనిపిస్తారు. ఆ అంశాల గురించి చర్చిస్తారు. వారి అనుభవాలు వినొచ్చు. మన అభి్ర΄ాయాలు పంచుకోవచ్చు.. ఈ గ్రూపులు మన అవగాహన పరిమితిని విస్తృతం చేస్తాయి. తద్వారా మనసును విశాలం చేస్తాయి.అభిప్రాయాలు సరి చేసుకోవచ్చుసోషల్ మీడియా భిన్నాభిప్రాయాలు వినిపించే వేదిక. మన చుట్టూ ఉన్నవారి అభిప్రాయాలే కాక, ఎక్కడో ఉన్నవారి అభిప్రాయాలు మనం తెలుసుకోవచ్చు. అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు, సంయమనం చాలా ముఖ్యం. మన మాటే చెల్లాలి, మనం చెప్పిందే వినాలి అనే ఆధిపత్య ధోరణి ఉండకూడదు. కొన్ని అభిప్రాయాలు మన మీద లైట్ వేస్తాయి. మన మూస అభిప్రాయాలను మారుస్తాయి. నెగెటివ్ అభిప్రాయాలను దూరం చేసుకునేందుకు సాయం చేస్తాయి. ఇదంతా ఎందుకు అనంటే ఖాళీగా ఉండే మైండ్‌ను అర్థవంతమైన వ్యాపకంలో పెట్టడానికే. దీనివల్ల డిప్రెషన్ దూరమవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజాలు కావనేది గుర్తించాలి. అలాంటి ఫేక్ వార్తలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రచారం చేసేవారిని దూరంగా ఉంచాలి.నూతన అంశాలపై ఆసక్తి గాజులు ఎలా తయారు చేస్తారో తెలుసా? అద్దం ఎలా తయారవుతుంది? ఇంట్లో ఖాళీ డబ్బాలతో ఏదైనా అలంకరణ వస్తువులు చేయొచ్చా? చార్ధామ్ యాత్ర అంటే ఏమిటి? ఇలా మనకు తెలియని అంశాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. వీడియోల ద్వారా నేరుగా పరిశీలించొచ్చు. ఆసక్తి ఉంటే ప్రయత్నించవచ్చు. నూతన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి సోషల్ మీడియా ఉపయోగకారి. తద్వారా మనమూ కంటెంట్ క్రియేటర్లుగా మారొచ్చు. ఇదంతా మనసును ఉత్సాహ పరిచే అంశమే.నిపుణుల సలహాలకు వేదికవేసవిలో ఏ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొచ్చు? బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఏ రంగులు మేలు? ఇలా అనేక ప్రశ్నలు మనకుంటాయి. కానీ సమాధానాలు ఇచ్చేందుకు అన్నిసార్లూ నిపుణులు మనకు అందుబాటులో ఉండరు. ఆ లోటును సోషల్‌మీడియా తీరుస్తుంది. ఇక్కడ అనేకమంది నిపుణులు అందుబాటులో ఉంటారు. కొందరు నిపుణులు కాకపోయినా, తమ అనుభవంతో మన సందేహాలను నివృత్తి చేయగలరు. దీనివల్ల మనకు శ్రమ తగ్గుతుంది. అయితే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో సోషల్‌మీడియా సలహాలు పాటించకపోవడం మేలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.సృజనాత్మకతకు వేదిక ఒక చక్కని కవిత రాశారా? పదిమందితో పంచుకోవాలని ఉందా? ఒక చిత్రం గీశారా? దాన్ని అందరికీ చూపించాలని ఉందా? సోషల్ మీడియా మన సృజనాత్మకతకు చక్కటి వేదిక. ఎంతోమంది అక్కడ పాపులర్ అయ్యారు, అవుతున్నారు. వారికంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఉన్నచోటే ఆగి΄ోకుండా సృజనకు వేదిక అందించి, సృజనకారుల్లో ఉత్సాహం నింపడం సోషల్ మీడియాలో సాధ్యం. మానసిక ఉల్లాసానికి సృజనాత్మక ప్రదర్శనలు చాలా మేలు చేస్తాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి!సోషల్ మీడియాలో సంయమనం టించాలి. వ్యక్తిగతంగా దూషించడం, టార్గెట్ చేయడం, వేధించడం వంటివి చేయకూడదు.సోషల్ మీడియాను పరిమితంగానే వాడాలి. దానికి అడిక్ట్ అయి΄ోకూడదు.పూర్తి వ్యక్తిగత వివరాలు, ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోకూడదు.సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏవైనా వేధింపులు, మోసం, ట్రోలింగ్ వంటివి ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలి. వెంటనే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయాలి. -
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్ధులు అత్యుత్తమ కాలేజీల్లో ఎలా సీట్లు పొందాలి.? దానికి ముందుస్తుగా ఎలాంటి కసరత్తు చేయాలి.? ఎలాంటి పరీక్షలకు సిద్ధం కావాలి.? మిడిల్ స్కూల్, హైస్కూల్ స్థాయిలోనే దానిని ఎలా సన్నద్దమవ్వాలనే కీలక విషయాలపై ఈ సదస్సు ద్వారా నాట్స్ అవగాహన కల్పించింది. సెడార్ రాపిడ్స్, మారియన్, రాబిన్స్, హియావత నగరాల నుండి పలువురు భారతీయ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. అయోవా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త శివ రామ కృష్ణారావు గోపాళం ఈ సదస్సుకు అనుసంధానకర్త వ్యవహారించారు. కృష్ణ ఆకురాతి, సాగర్ పురాణం, జగదీష్ బాబు బొగ్గరపులు ఈ సదస్సులో ఎన్నో విలువైన సూచనలు చేశారు. తల్లిదండ్రుల, విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు.. విద్యార్ధుల చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శివ రామకృష్ణారావు గోపాళం తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్ధులకు కాలేజీ ప్రవేశాలపై చక్కటి అవగాహన ఇలాంటి సదస్సుల వల్ల లభిస్తుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం కోసం ఇంత చక్కటి సదస్సును ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు గిరీష్ కంచర్ల, నవీన్ ఇంటూరి అవసరమైన ఆహార ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత అనుభవాలను వివరించిన హిమాన్షు భూషణ్, రవి కొంపెల్లాలకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. సుమన్ ఒంటేరు ఫోటోగ్రాఫింగ్, ఆడియో విజువల్ సిస్టమ్‌లలో సహాయం చేసినందుకు నాట్స్ అభినందించింది. అయోవాలో కాలేజీ ప్రిపరేషన్ అవగాహన సదస్సు విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి) -
భారత సైన్యం చేస్తున్న మేలు..!
ప్రపంచం 21వ శతాబ్దంలో ఉంది. విశ్వమంతా అరచేతిలో ఇమిడిపోయినంత టెక్నాలజీతో స్మార్ట్‌గా జీవిస్తోంది ప్రపంచం. మదిలో మెదిలిన సందేహానికి సమాధానాన్ని నిమిషంలో తెలుసుకోగలిగినంత టెక్నాలజీ అందుబాటులో ఉంది. అయినప్పటికీ గర్భిణి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియని జీవితాలు ఇంకా ఉన్నాయి. భారతీయ సైన్యంలో మహిళల బృందం ఇటీవల వారిని సమావేశపరిచి ప్రెగ్నెన్సీ అవేర్నెస్ సెషన్ నిర్వహించింది. అత్యంత ఆసక్తిగా వినడంతోపాటు ఇంత వరకు తమకు ఈ సంగతులు చెప్పిన వాళ్లు లేరని, మొదటిసారి వింటున్నామని ఆనందం వ్యక్తం చేశారా మహిళలు. ఇంతకీ ఇంతటి వెనుకబాటులో మగ్గిపోతున్న వాళ్లెవరంటే ఆఫ్రికా ఖండంలోని అబేయీ వాసులు. ఆల్ ఉమెన్ ప్లాటూన్ చొరవ సూడాన్, సౌత్ సూడాన్ల మధ్య తలెత్తిన వివాదంలో అబేయీ నలిగిపోతోంది. అబేయీలో శాంతి స్థాపన కోసం యునైటెడ్ నేషన్స్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మనదేశం నుంచి గత ఏడాది ఆల్ ఉమెన్ ప్లాటూన్ అబేయీలో అడుగుపెట్టింది. ఆ బృందం పేరు ‘యునైటెడ్ నేషన్స్ ఇంటిరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ ఫర్ అబేయీ (యూనిస్ఫా)’. మన మహిళా సైనికులు అబేయీలో శాంతి స్థాపనతోపాటు ప్రజారోగ్యం కోసం కూడా పని చేస్తోంది. అందులో భాగంగా కెప్టెన్ జస్ప్రీత్ కౌర్, ఇండియన్ బెటాలియన్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అభిజిత్ ఎస్‌లు అబేయీలోని రుమాజక్ గ్రామంలో స్థానిక మహిళలను సమావేశపరిచి వారికి గర్భధారణ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణి తీసుకోవాల్సిన పోషకాహారం, ఈ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన హెల్త్ చెకప్‌లు, ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో తీసుకోవాల్సిన శ్రద్ధ మొదలైన విషయాలను వివరించారు. సేఫ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ గురించి బొమ్మలతో వివరిస్తూ ప్రచురించిన చిన్న పుస్తకాలను కూడా పంచారు. భారతీయ సైనిక మహిళల బృందం చొరవను, స్థానిక మహిళల ఆనందాన్ని యూఎన్ మిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. (చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
సంసారం.. ఆర్ధిక చదరంగం!
హైదరాబాద్‌కు చెందిన మనీషా (30) పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే భర్తతో ఆమెకు వాదోపవాదాలు నిత్య కృత్యంగా మారాయి. అది కూడా ఆర్ధిక అంశాలపైనే. పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే మనీషా దంపతులు ఒకరికొకరు పరిచయస్థులు. ఎన్నో అంశాలపై గంటల తరబడి మాట్లాడుకున్న వారే. ‘‘అతడి గురించి నాకు అంతా తెలుసనుకున్నా. కానీ, ఆర్థిక అంశాల నిర్వహణ గురించి ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు. అక్కడే మేము తప్పటడుగు వేశామని అనిపిస్తోంది’’ అన్నది మనీషా అంతరంగం. వైవాహిక బంధం చిరకాలం వర్ధిల్లాలంటే దంపతుల మధ్య చక్కని అవగాహన, పరస్పర గౌరవం, అభిమానం ఉంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ, ఆర్థిక అవగాహన కూడా ఉండాలన్నది నిపుణుల సూచన. తమకు ఏ ఆహారం అంటే ఇష్టం, తమకు నచ్చే సినిమాలు, మెచ్చే పర్యాటక ప్రాంతాలు.. ఇలా మూడు ముళ్లకు ముందే ముచ్చట్లు ఎన్నో చెప్పుకోవడం, పరస్పర ఇష్టాలు పంచుకోవడం చేస్తుంటారు. కానీ, ఆర్థిక అంశాలు, భవిష్యత్ ఆర్ధిక లక్ష్యాల గురించి చర్చించుకునే వారు బహుశా చాలా తక్కువగా ఉంటారు. ఇలా చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో మనీషా ఉదంతం చెబుతోంది. అందుకే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడానికి ముందే భవిష్యత్ ఆర్ధిక పథంపై మనసు విప్పి చర్చించుకోవడం ఎంతో అవసరం. దీని ప్రాధాన్యతను తెలియజెప్పే కథనమే ఇది... మారుతున్న పరిస్థితులు.. ఆర్ధిక విభేదాలు వైవాహిక బంధంలో చిచ్చుపెట్టే ప్రమాదం లేకపోలేదు. ఆర్థికంగా అప్పుల పాలై, బయట పడే మార్గం తోచక సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అమెరికాకు చెందిన ‘జిమెనెజ్ లా ఫర్మ్’ చేసిన అధ్యయనంలో.. ఆ దేశంలో 29% విడాకులకు ఆర్ధిక విభేదాలే కారణం అవుతున్నట్టు తెలిసింది. అమెరికా స్థాయిలో ప్రస్తుతం మన దేశంలో బంధాల విచ్ఛిన్నానికి ఆర్ధిక అంశాలు కారణం కాకపోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో మనదేశంలోనూ మహిళల ఆర్ధిక సాధికారత మెరుగుపడుతూ వస్తోంది. పెళ్లయిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొనసాగేందుకు యువతరం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో వారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదు. కనుక ఆర్ధిక అంశాలపైనా దంపతుల మధ్య ఏకాభిప్రాయం, పరస్పర అంగీకారాలు ముఖ్యమే. చర్చించుకోవడమే మెరుగైన మార్గం వివాహం తర్వాత ఆర్ధిక విభేదాలు పొడచూపకూడదని అనుకుంటే, అందుకు ఎలాంటి జంకు లేకుండా ‘మనీ’ గురించి సౌకర్యంగా మాట్లాడుకోవడమే మంచి పరిష్కారం. ‘‘దంపతుల్లో చాలా మంది ఆర్ధిక అంశాల గురించి మాట్లాడుకోవడానికి సంకోచిస్తుంటారు. డబ్బు మనిషనో లేదా ఆధిపత్యం చెలాయిస్తున్నారనో పొరపడతారన్నది వారి ఆందోళన. కానీ విడాకులకు ఆర్ధిక అంశాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. కనుక ఈ అంశాలపై చర్చించుకోవడం ఎంతో ముఖ్యం’’ అని ఫిన్‌సేఫ్ ఎండీ మృణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆర్ధిక నిర్ణయాలను అప్పటి వరకు కలిగి ఉన్న ఆర్ధిక అవగాహనే నిర్ణయిస్తుంది. తమ నిర్ణయాలను గౌరవించే, ఏకీభవించే భాగస్వామిని గుర్తించడం వైవాహిక బంధం విజయవంతానికి కీలకమని నిపుణుల సూచన. విల్లా, కారు తదితర ఆకాంక్షలు ఏవైనా ఉన్నాయా? ఎప్పటిలోపు వాటిని సాధించాలని అనుకుంటున్నారు? వివాహం తర్వాత తొలి ప్రాధాన్యం ఏ లక్ష్యానికి? వినోదం, విహారానికి ఎక్కువ ఖర్చు చేయాలని అనుకుంటున్నారా? డబ్బు విషయంలో బాధ్యతగా ఆలోచిస్తున్నారా? చక్కదిద్దుకోవాల్సిన ఆర్ధిక ప్రతికూలతలు ఏవైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నింటిపై స్పష్టత అవసరం. ‘‘ఆర్థిక అలవాట్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఒకరు ఎంతో పొదుపరి అయి ఉంటారు. మరొకరు ఖర్చు చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఇది వివాదానికి దారితీస్తుంది. కొన్ని విభేదాలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. కానీ, కొన్ని ఓ పట్టాన పరిష్కారం కావు. అందుకని ఒకరినొకరు ఆర్థిక అంశాలపై చర్చించుకొని, నిర్ణయాలను ఉమ్మడిగా తీసుకోవాలి’’ అని ఆనంద్ రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ సూచించారు.ప్రణాళిక ప్రకారం దంపతుల మధ్య వచ్చే కలతలకు ఎవరో ఒకరు అధికంగా ఖర్చు చేయడం ప్రధాన కారణం. ఒకరు ఎంతో పొదుపుగా రూపాయి, రూపాయి కూడబెడుతుంటే, మరొకరు ఖర్చు చేయడాన్ని ఆనందిస్తుంటే వారి మధ్య ప్రశాంతత కష్టం. విభేదాలు రాక మానవు. ఖర్చు చేసే అలవాట్లు అన్నవి ఒకరి మానసిక తీరుపైనే ఆధారపడి ఉంటాయి. కొందరు షాపింగ్‌లో ఆనందాన్ని వెతుక్కుంటారు. సంపదతో గౌరవం వస్తుందని భావిస్తుంటారు. బ్యాంక్ ఖాతాలో సరిపడా నిధులు లేకపోయినా గొప్ప కోసం ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలుకు మొగ్గు చూపిస్తుంటారు. ఒక భాగస్వామి పొదుపు, మదుపు (పెట్టుబడి)కు ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. ఆర్ధిక వెసులుబాటు పరిమితంగా ఉండడం ఇందుకు నేపథ్యం కావొచ్చు. అందుకే ఆర్ధిక భద్రత దృష్ట్యా పొదుపు చేస్తుండొచ్చు. దీనికి విరుద్ధమైన ధోరణి కలిగిన భాగస్వామి తోడైనప్పుడు అది స్పర్థకు దారితీస్తుంది. ‘‘భాగస్వాములు ఇద్దరూ స్వేచ్ఛను గౌరవించుకోవాలి. అదే సమయంలో చర్చించుకుని, పరస్పర అంగీకారానికి వచ్చే పరిణతి కూడా అవసరం’’ అనేది జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా సూచన. ఏ తరహా ఆర్ధిక వ్యక్తిత్వాన్ని మీరు నచ్చుతారన్న స్పష్టత ఉండాలి. అప్పుడు కాబోయే జీవిత భాగస్వామితో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఆర్ధిక అంశాల నిర్వహణపై మాట్లాడుకోవాలి. బడ్జెట్ ఏర్పాటు, ఆర్ధిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని, వాటికి కట్టుబడి ఉండేలా అంగీకారానికి రావాలి. కేవలం పొదుపు అనే కాదు, జీవనశైలి అలవాట్లు, ఆనందాల కోసం భాగస్వాములు ఇద్దరూ ఆదాయంలో 10% బడ్జెట్ కేటాయించుకోవడంలో తప్పు లేదన్నది నిపుణుల సూచన. కేటాయింపులు అన్నీ పోను మిగులు ఉంటే, ఆ మొత్తాన్ని తమ అభిరుచుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఆధిపత్యం పనికిరాదు.. మనీ విషయాల్లో ఆధిపత్య ధోరణి పనికిరాదు. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్నింటినీ తానే తీసుకోవాలన్న ధోరణి సరికాదు. ఈ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ‘‘ఆర్ధిక అంశాల నిర్వహణ గురించి తనకు ఎంత మాత్రం తెలియదన్నది నా భర్త సమాధానం. కానీ, ఖర్చుల గురించి నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా.. ఆయన కొట్టిపారేస్తుంటారు’’ అని ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ నిపుణురాలు అంజలి వర్మ వాపోయారు. కేవలం పురుషులే ఆర్జనా పరులుగా ఉన్న కుటుంబాల్లో ఈ తరహా ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. భార్య విద్యావంతురాలై, గృహిణిగా కొనసాగుతున్నా, ఆమెకు ఆర్ధిక అంశాలపై అవగాహన ఉన్నా కానీ, కుటుంబ నిర్ణయాల్లో సమాన భాగస్వామ్యం కలి్పంచే తీరు అన్ని చోట్లా కనిపించదు. రాణించే మహిళలు ఉన్న చోట పురుషులు అభద్రతా భావానికి లోనవుతుంటారని, అది కలహాలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆర్ధిక అంశాల్లో తమ భాగస్వామ్యం ఏ మేరకు అన్న దానిపై పెళ్లికి ముందే యువతీ, యువకులు తప్పకుండా ప్రశి్నంచుకోవాలని సూచిస్తున్నారు. ఆర్ధిక బాధ్యతలను ఎలా పంచుకుంటారని కూడా ప్రశ్నించుకోవాలి. ఇరువురి మధ్య సరైన అవగాహన కుదిరినప్పుడే ఏడడుగులు వేయడం సరైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడుల ఎంపికలు పెట్టుబడుల విషయంలోనూ దంపతుల మధ్య అవగాహన, పరస్పర అంగీకారం అవసరమే. ఒకరు అధికంగా రిస్క్ తీసుకుంటే, మరొకరు పరిమిత రిస్క్ ఉన్న పెట్టుబడులకే పరిమితం కావొచ్చు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇద్దరూ భిన్న మార్గాలను అనుసరించడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల మెరుగైన రాబడులకు, రక్షణ తోడవుతుంది. ఒక విధంగా ఇది ఈక్విటీ, డెట్ కలయికగా భావించొచ్చు. అయితే ఆయా అంశాలపై కాబోయే దంపతులు ఇద్దరూ చర్చించుకోవాలి. ఏఏ సాధనాలు ఎలా పనిచేస్తాయి, అందులో ఉండే రిస్‌్కలు, వచ్చే రాబడుల గురించి పూ ర్తి అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడు సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలకు అవరోధాలు ఏర్పడొచ్చు. అవసరం అనుకుంటే ఈ విషయంలో ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవాలి.గోప్యత ప్రమాదకరం రుణాలు తీసుకోవడం, అప్పులతో కొనుగోళ్లు చేసే విషయాలను జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని సందర్భాల్లో దాచి పెడుతుంటారు. ఇది విశ్వాసలేమికి దారితీస్తుంది. ఇదే మాదిరి ఎన్నో విషయాలు తనకు తెలియకుండా చేస్తుండొచ్చని భాగస్వామి సందేహించడానికి అవకాశం కలి్పస్తుంది. అందుకే ఇలాంటివి భాగస్వామికి చెప్పి చేయాలి.ధన సాయం తమ బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల్లో ఎవరికైనా ఆర్ధిక సాయం చేసే ముందు, తమ ఆర్థిక అవసరాలకే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఇతరులకు సాయం చేయడానికి ముందు తమ ఆర్ధిక భవిష్యత్‌కు భరోసా కలి్పంచుకోవడం అవసరమని జీవైఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సీఈవో రోహిత్ షా పేర్కొన్నారు. డబ్బు సాయం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే? పరిస్థితి ఏంటన్నది ప్రశి్నంచుకోవాలి. మరీ ముఖ్యంగా భాగస్వామికి తెలియకుండా ఇలాంటి ధన సాయాలు చేస్తే, అవి కాపురంలో కలహాలకు దారితీసే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. రుణ భారం తమకు కావాల్సిన ప్రతిదీ ఈఎంఐపై సమకూర్చుకోవడం కొందరికి అలవాటు. ఇందుకోసం క్రెడిట్‌కార్డు రుణాలనూ వాడేస్తుంటారు. అధిక వడ్డీలతో కూడిన రుణాలు ఊబిలోకి నెట్టేస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ తరహా అలవాట్ల గురించి పెళ్లికి ముందే కాబోయే భాగస్వామికి చెప్పడం ఎంతో అవసరం. ఆదాయం, వ్యయాలు, పెట్టుబడుల ప్రణాళికలు, ఖర్చు చేసే అలవాట్లు, రుణాలు తదితర అంశాల గురించి సమగ్రంగా చర్చించుకోవడం, ఆర్ధిక సలహాదారుల సాయం తీసుకోవడం, పరస్పర అంగీకారం, గౌరవం, పారదర్శకత ఇవన్నీ.. వైవాహిక బంధంలో ఆర్ధిక సంక్షోభాలు రాకుండా నివారిస్తాయి. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!
వరంగల్: టెక్నాలజీ.. మానవాళికి ఎంత మంచి చేస్తోందో.. ఆకతాయిలు, సంఘ విద్రోహుల చేతిలో పడి అంతే చెడు చేస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అనుసరించి వ్యాపార అభివృద్ధి, స్నేహం, నాలెడ్జి పెంచుకుంటున్న వారు కొందరైతే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న వారు మరికొందరు. కాగా, ఇటీవల ట్రయల్ రూమ్, హాస్టల్ గదుల్లో స్పై కెమెరాలు (సీక్రెట్ కెమెరా) అమర్చిన ఘటనలు వింటున్నాం. విస్తరిస్తున్న టెక్నాలజీని ఇలా అడ్డదిడ్డంగా వినియోగిస్తే తర్వాత జైలుకెళ్లడం ఖాయం.స్వల్ప పరిమాణంలో ఉండే ఈ స్పై కెమెరాలతో ఆకృత్యాలకు ఒడిగడుతున్న వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడి్జలు..ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ ఏ కెమెరా కన్ను మనపై ఉందో తెలియని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా మహిళలు ఇలాంటి కెమెరాలకు బలవుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. అయితే కాస్త అప్రమత్తంగా ఉండి టెక్నాలజీని ఎలా వినియోగించాలో తెలిస్తే స్పై కెమెరాలను ఇట్టే గుర్తించే వీలుంది. అలా గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తే ఆకతాయిల పని పట్టేందుకూ అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో స్పై కెమెరా పని విధానం, ఆ కెమెరాను గుర్తించే వివిధ మార్గాల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మోషన్ డిటెక్షన్, సౌండ్ టెక్నాలజీ..కొన్ని శక్తివంతమైన స్పై కెమెరాల్లో బ్యాటరీని ఆదా చేయడం కోసం సౌండ్, మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ పొందుపరుస్తారు. గతంలో హాస్టళ్లలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఒక్కొక్కటి సుమారు రూ.3వేల లోపు విలువైన స్పై కెమెరా సౌండ్ యాక్టివేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మహిళలు బాత్రూం రావడానికి ముందు డోర్ తీయగానే ఆ శబ్దానికి ఆటోమేటిక్‌గా కెమెరా యాక్టివేట్ అయి వీడియో రికార్డ్ చేస్తుంది. వ్యక్తుల కదలికలను బట్టి దానంతట అదే రికారి్డంగ్ అవుతుంది. ఒకసారి చార్్జచేస్తే రెజల్యూషన్ బట్టి నాలుగైదు గంటల పాటు నిరంతరాయంగా ఈ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయి.స్పై కెమెరాలతో ప్రమాదాలు..స్పై కెమెరాల ద్వారా మహిళల నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తున్న వారు ఇటీవల అధికమవుతున్నారు. మరికొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళలకు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇలా అనుమానాస్పదంగా ఉన్న స్పై కెమెరాలను గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను స్టార్ట్ఫోన్లో వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేయాలి. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఫ్లోర్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. వీడియో ఫుటేజీ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులతో చర్చించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో భాగంగా చాలా మంది మహిళలు నగరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్నారు. వారు ఉండే గదులు, బాత్రూమ్లను నిశితంగా పరిశీలించాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ స్పై కెమెరాలకు చెక్ పెట్టాలి.మొబైల్స్‌తోనూ..స్పై కెమెరాలు మాత్రమే కాదు, నిరంతరం మొబైల్ ద్వారా కూడా పబ్లిక్ ప్లేస్ల్లో మహిళల కదలికలు రికార్డు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్ గ్రౌండ్లో వీడియోని రికార్డ్ చేసే యాప్స్‌ని వాడుతున్నారు.ఎన్నో రకాలు..చాలా మంది అనుకుంటున్నట్లు చూడటానికి కెమెరా మాదిరి ఉండదు. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా రకరకాల వస్తువుల రూపంలో రూపొందిస్తారు. అనేక స్పై కెమెరాలను గమనిస్తే జేబులో పెన్, షర్టు బటన్స్, టేబుల్ మీద పెట్టే చిన్న క్లాక్‌లు, రిస్ట్ వాచీలు, ఫ్లవర్ వాజ్‌లు, కీచైన్లు, హ్యాంగర్స్, ఇంట్లో ఉండే ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, స్విచ్‌బోర్డులు, బల్బులు ఇలా అనేక విధాలా స్పై కెమెరాలు దొరుకుతున్నాయి.అనేక రకాల పరీక్షలు..స్పై కెమెరాలను గుర్తించేందుకు టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని రకాల కెమెరాలున్న ప్రదేశాల్లో ఫోన్ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే ఆది కాల్ డ్రాప్ అవుతుంది. ఆయా కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది. ఇటీవల కాల్ డ్రాప్ అనేది తరచూ ఎదుర్కొనే సమస్య కావడంతో స్పై కెమెరా ఉందని అనుమానించలేని పరిస్థితి. ఇక ట్రయల్ రూమ్స్‌లో అమర్చే అద్దాలు రెండు రకాలుంటాయి. సహజంగా అద్దం ఒకవైపు మన రూపాన్ని చూపిస్తూ, దాని వెనుక భాగంలో వేరే రంగుతో కోటింగ్ చేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి, ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. మీకు అలాంటి అనుమానం వస్తే అద్దంలో కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే ఆ అద్దం అవతలి వైపు మీ దృశ్యాలను చూపిస్తుందని గ్రహించాలి. లైట్లన్నీ ఆఫ్ చేసి, ఫ్లాష్ లైట్‌ని అద్దం మీద వేసినప్పుడు అవతలి వైపు ఏదైనా ఉందేమో తెలుస్తుంది.గుర్తించడం ఎలా?స్మార్ట్ఫోన్లు వాడేవారికి గూగుల్ ఫ్లే స్టోర్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ అనే యాప్ చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ఐ ఫోన్లు వినియోగించే వారికి స్పై హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ఉపయోగపడుతుంది. స్పై కెమెరాలు వెలువరించే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించడం ద్వారా గదిని పూర్తిగా డార్క్ చేసినప్పుడు నిర్దిష్ట స్థలంలో కెమెరా ఉందా లేదా అనే విషయం గమనించి మొబైల్ అప్లికేషన్లో వాటిని చూపిస్తాయి. స్పై కెమెరాలను గుర్తించడానికి బగ్ డిటెక్టర్ అనే ప్రత్యేక పరికరాలుంటాయి.ఇవి చదవండి: అమెరికాను వణికిస్తున్న హరికేన్ హెలెన్ -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వామ్మో..! మనిషిపై మశక సైన్యం!!
దోమలు చూడటానికి చిన్నగా ఉంటాయి గాని, ఇవి అత్యంత ప్రమాదకరమైన జీవులు. ప్రపంచంలో ఏటా పాముకాటుతో మరణిస్తున్న వారి కంటే దోమకాటుతో మరణిస్తున్న వారే ఎక్కువ. పాముకాటు వల్ల ఏటా దాదాపు 1.37 లక్షల మంది మరణిస్తుంటే, దోమకాటు వల్ల వ్యాధులకు లోనై మరణించే వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటోంది. దోమలు ఎంత ప్రమాదకరమైనవో అర్థమవడానికి ఈ లెక్క చాలు. ఈ భూమ్మీద 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నాయి. అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ దోమల బెడద ఉండనే ఉంది. దోమలు మనుషుల కంటే చాలా ముందు నుంచే భూమ్మీద మనుగడ సాగిస్తున్నాయి. ఇవి దాదాపు డైనోసార్ల కాలం నుంచే అంటే, 25.1 కోట్ల సంవత్సరాల నుంచి భూమ్మీద ఉన్నాయి.భూమ్మీద మిగిలిన ప్రదేశాలతో పోల్చుకుంటే, ఉష్ణమండల ప్రదేశాల్లో, నీరు ఎక్కువగా నిల్వ ఉండే చోట దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు నీరులేని చోట, నీరు ప్రవహించే చోట దోమలు మనుగడ సాగించలేవు. నిల్వ నీరు ఉన్న ప్రదేశాలే దోమలకు సురక్షిత స్థావరాలు. మన దేశంలో ఎక్కువ రాష్ట్రాలు ఉష్ణమండల ప్రదేశాలే! ఇక్కడి వాతావరణం దోమల విజృంభణకు చాలా అనుకూలంగా ఉంటుంది. దోమలు భూమ్మీద కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నా, దోమల సగటు ఆయుఃప్రమాణం మాత్రం తక్కువే! ఒక దోమ బతికేది 10 నుంచి 56 రోజుల లోపే! ఇంత అల్పాయుర్దాయంలోనే దోమలు సృష్టించాల్సిన విధ్వంసమంతా సృష్టిస్తాయి.దోమల్లో ఆడదోమలు మాత్రమే మనుషుల రక్తాన్ని పీలుస్తాయి. ఒక ఆడ దోమ రోజు విడిచి రోజు 150–200 వరకు గుడ్లు పెడుతుంది. దోమ గుడ్లు పెట్టడానికి 50 మిల్లీలీటర్ల నిల్వనీరు చాలు. దారి పక్కన పడి ఉండే చిన్న చిన్న కొబ్బరిచిప్పలు, పాత టైర్లు, వాడటం మానేసి మూలపడేసిన ఎయిర్ కూలర్లు వంటివి దోమలకు ప్రశస్థమైన ఆవాసాలు. ఇలాంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి, వంశాభివృద్ధి చేసుకుంటాయి. దోమలను నిర్మూలించడానికి మనం ఎన్ని రకాల మందులను వాడుతున్నా, దోమలు వాటిని తట్టుకునేలా తమ నిరోధకతను నిరంతరం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. దోమలు మందులను తట్టుకునే శక్తి పెంచుకునే కొద్ది వాటి వల్ల మనుషులకు ముప్పు మరింతగా పెరుగుతుంది. ఆడదోమలు మనుషుల రక్తాన్ని పీల్చే క్రమంలో వాటి నుంచి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు మనుషుల రక్తంలోకి చేరి, వ్యాధులను కలిగిస్తాయి.దోమలు కలిగించే వ్యాధులు..దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, లింఫాటిక్ ఫైలేరియాసిస్, రిఫ్ట్వ్యాలీ ఫీవర్, యెల్లో ఫీవర్, జికా, జపానీస్ ఎన్సెఫలిటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్లను కలిగించే వ్యాధుల్లో 17 శాతం వ్యాధులు దోమల వల్లనే వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 9.6 కోట్ల మంది దోమకాటు వ్యాధులకు లోనవుతున్నారు. వారిలో అత్యధికంగా దాదాపు 4 లక్షల మంది మలేరియా వల్ల, 40 వేల మంది డెంగీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి వల్ల మరణాల బారిన పడిన వారిలో ఐదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా ఉంటుండటం విచారకరం. దోమల కారణంగా తలెత్తే తీవ్ర వ్యాధులు, వాటి లక్షణాలను తెలుసుకుందాం.మలేరియా..ఈ వ్యాధి అనాఫలిస్ దోమ వల్ల వ్యాపిస్తుంది. ఈ దోమ రాత్రివేళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మజీవి కారణంగా మలేరియా వస్తుంది. వీటిలో ఒకరకం జాతికి చెందిన సూక్ష్మజీవి కారణంగా సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, అపస్మారక స్థితికి చేరడం, మూత్రపిండాలు విఫలం కావడం వంటి లక్షణాలు ఉంటాయి.చికెన్ గున్యా..ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ ద్వారా వ్యాపించే ఒకరకం వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఎడిస్ ఈజిపై్ట దోమ ఎక్కువగా పగటివేళ కనిపిస్తుంది. చికున్ గున్యా సోకిన వారికి జ్వరం, విపరీతమైన తలనొప్పి, తీవ్రమైన కీళ్లనొప్పులు వస్తాయి.డెంగీ..డెంగీకి కూడా ఎడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంతగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.డెంగీని నిరోధించే వొబాకియా..వొబాకియా అనే బ్యాక్టీరియా డెంగీ వ్యాప్తిని అరికట్టగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మలేసియా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లోని పరిశోధక సంస్థల్లో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు వొబాకియా బ్యాక్టీరియాను ప్రయోగించి, డెంగీ వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ ఈజిపై్ట దోమల శరీరంలోకి వొబాకియా బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి, వాటిని బయటి వాతావరణంలోకి విడిచిపెట్టాక, వాటి ద్వారా డెంగీ వ్యాప్తి పెద్దగా జరగలేదు. వొబాకియా బ్యాక్టీరియా ఎక్కించిన తర్వాత దోమలకు పుట్టిన తర్వాతి తరాల దోమల్లో కూడా డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దోమల నివారణ మార్గాలు..దోమలను సమర్థంగా నివారించుకోవడం ద్వారా మాత్రమే దోమకాటు వ్యాధుల బారి నుంచి మనం తప్పించుకోగలం.– మనం ఉండే ఇళ్లలోకి, గదుల్లోకి దోమలు రాకుండా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్లు వాడాలి.– దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరంపై పూత మందులు వాడటం కూడా ఒక మార్గం.– దోమలు కుట్టకుండా ఉండాలంటే, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలి.– దోమలు మురికి దుస్తులపై ఆకర్షితమవుతాయి. అందువల్ల శుభ్రమైన దుస్తులు ధరించాలి.– ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిత్యం ప్రవహించేలా కాల్వలను శుభ్రం చేసుకోవాలి.అపోహలు, వాస్తవాలు..అపోహ: దోమలన్నీ మనుషులను కుడతాయి.వాస్తవం: ఆడ దోమలు మాత్రమే మనుషులను, జంతువులను కుడతాయి. ఆడ దోమల్లో పునరుత్పత్తి శక్తి కోసం మనుషులు, జంతువుల రక్తం అవసరం.అపోహ: కొన్ని రకాల రక్తమంటేనే దోమలకు ఇష్టంవాస్తవం: ముఖ్యంగా ‘ఓ–పాజిటివ్’ రక్తమంటే దోమలకు ఇష్టమని, అందుకే ఆ రక్తం ఉన్నవారిని ఎక్కువగా కుడతాయనే ప్రచారం ఉంది. నిజానికి దోమలను ఆకర్షించేది రక్తం కాదు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా. చర్మంపై కొన్నిరకాల బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.అపోహ: తెల్లచర్మం ఉన్నవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.వాస్తవం: దోమలు కుట్టినప్పుడు తెల్లచర్మం ఉండేవారి శరీరంపై దద్దుర్లు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. దోమల లాలాజలంలో ఉండే ఎంజైమ్ వల్ల దురద పుట్టి దద్దుర్లు ఏర్పడతాయి. దోమలు కుట్టడానికి మనుషుల రంగుతో సంబంధం లేదు.అపోహ: దోమలన్నీ వ్యాధులను కలిగిస్తాయి.వాస్తవం: ప్రపంచంలో 3,600 జాతులకు పైగా దోమలు ఉన్నా, వీటిలో చాలా జాతులకు చెందిన దోమలు అసలు మనుషుల జోలికి రావు. అయితే, మనుషులను కుట్టే జాతులకు చెందిన దోమల్లో ఎక్కువ జాతులు వ్యాధులను మోసుకొస్తాయి.అపోహ: గబ్బిలాలను ఆకట్టుకుంటే దోమలు పరారవుతాయి.వాస్తవం: దోమలను పారదోలాలంటే, పెరట్లోకి గబ్బిలాలను రప్పించాలనే ప్రచారం ఉంది. దోమలు, ఈగల వంటి కీటకాలను గబ్బిలాలు తినడం నిజమే గాని, అవి దోమలను పూర్తిగా నిర్మూలించలేవు.అపోహ: మనుషుల పరిమాణంతో సంబంధం లేకుండా దోమలు వారిని కుడతాయి.వాస్తవం: చిన్నగా కనిపించే వారి కంటే పెద్దగా కనిపించే మనుషులనే దోమలు ఎక్కువగా కుడతాయి. చిన్న పిల్లల కంటే దోమలు పెద్దలనే ఎక్కువగా కుడతాయి. పిల్లల కంటే పెద్దలు తమ ఊపిరిలో కార్బన్ డయాక్సైడ్ను ఎక్కువగా విడిచిపెడతారు. చాలా దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పసిగట్టగల దోమలు త్వరగా పెద్దల వైపు ఆకర్షితమవుతాయి.మరిన్ని మశక విశేషాలు..గుడ్డు దశ నుంచి పూర్తిగా ఎదిగిన దశకు చేరుకోవడానికి దోమకు వారం నుంచి పదిరోజులు పడుతుంది.చెమట కారణంగా చర్మంపై పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసే వాసనలు దోమలను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెమట చిందిన పాదాలను శుభ్రం చేసుకోకుండా కాసేపు అలాగే వదిలేస్తే, వాటిపై దోమలు దాడి చేస్తాయి.కొన్ని రకాల వాసనలు దోమలను గందరగోళానికి గురిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి వాసనల వైపు దోమలు రావు. వెల్లుల్లి తిన్నట్లయితే, చెమట వాసనలో మార్పు వస్తుంది. వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయ ముక్కలను ఒంటికి రుద్దుకున్నట్లయితే, దోమలు దరిదాపులకు రావు.దోమలు అతి నెమ్మదిగా ఎగురుతాయి. దోమల వేగం గంటకు ఒకటి నుంచి ఒకటిన్నర మైళ్లు. తేనెటీగలు ఎగిరే వేగంతో పోల్చుకుంటే, ఇది పదోవంతు మాత్రమే!దోమలు ఎగురుతున్నప్పుడు బాగా రొదగా ఉంటుంది. దోమలు ఎగిరేటప్పుడు వాటి రెక్కలు సెకనుకు 300–600 సార్లు రెపరెపలాడతాయి. వాటి కారణంగానే ఈ మశక సంగీతం వినిపిస్తుంది.దోమ బరువు 2 మిల్లీగ్రాములు. ఆడదోమ చిన్నిపొట్ట నిండటానికి లీటరులో 50 లక్షలవంతు రక్తం సరిపోతుంది. ఒక్కోసారి ఆడదోమలు తమ శరీరం బరువుకు సమానమైన నెత్తురు తాగేస్తాయి. వెన్నెల రాత్రులలో దోమలు మరింతగా విజృంభిస్తాయి. వెన్నెలలో దోమలకు తమ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపించడమే దీనికి కారణం. చీకటి రాత్రుల కంటే వెన్నెల రాత్రులలో దోమలు ఐదురెట్లు ఎక్కువగా మనుషులను కుడతాయి.దోమలను ముదురు రంగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. రక్తం తాగే ఆడ దోమలు ఎక్కువగా చీకటి ప్రదేశాలను స్థావరంగా చేసుకుంటాయి. అందుకే అవి ముదురు రంగు దుస్తులు వేసుకునే వారి వైపు ఆకర్షితమవుతాయి. -
మా బాబు.. ఒకచోట కుదురుగా ఉండటం లేదు..!?
మా బాబు వసు 5 సంవత్సరాలు. ఒకచోట నిలకడగా ఉండMýంండా, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో, స్కూల్లో బయటా కూడా ఇలాగే చస్తుంటాడు. బయట ఫంక్షన్లకు తీసుకెళితే తనను పట్టుకోవడం, తన చుట్టూ తిరగడంతోటే సరిపోతుంది. అందువల్ల ఈ మధ్య బయటకు వెళ్లడం కూడా తగ్గించేశాం. వాళ్ల నానమ్మేమో, ఇది పిల్లల్లో మామూలే అంటుంది. ఈ మధ్య వాళ్ల స్కూల్ టీచర్ మమ్మల్ని పిలిచి, మా బాబు మీద అనేక కంప్లయింట్లు చెప్పింది. మాకు చాలా ఆందోళనగా ఉంది. – కె. మాధవి, సికింద్రాబాద్పిల్లల మెదడులో ఉండే సెల్ఫ్ కంట్రోల్ విభాగం లోని లోపాల వల్ల, వారసత్వ లక్షణాల రీత్యా, కొందరు పిల్లలకు మీరు చెప్పిన లక్షణాలు రావచ్చు. దీనిని హైపర్ యాక్టివిటీ లేదా ఏడీహెచ్‌డీ అంటారు. నిలకడ లేకపోవడం, చదువు మీద ఏకాగ్రత లేకపోవడం, వస్తువులు విసిరేయడం, సహనం లేకపోవడం, ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, స్కూల్లో వస్తువులు మరచిపోవడం, ఈ సమస్య ముఖ్య లక్షణాలు. వీరికి తెలివితేటలు బాగానే ఉన్నప్పటికీ, ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడతారు.ఇలాంటి వారిని ఎంత చిన్నవయసులో గుర్తించి, సరిౖయెన చికిత్స చేయిస్తే అంత తొందరగా దీంట్లోంచి బయట పడతారు. ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, అవసరమైతే కొద్ది మోతాదులో కొన్ని మందులు వాడటం ద్వారా వీరిని పూర్తిగా బాగు చెయ్యచ్చు. పేరెంట్స్, టీచర్లు ఇలాంటి వారిని త్వరగా గుర్తించగలిగితే తొందరగా బాగుపడతారు. మైకేల్ ఫిలిప్స్ అనే స్విమ్మర్ ఈ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుని బాగుపడి, ఒలింపిక్స్‌లో 20కి పైగా స్వర్ణ పతకాలు సాధించాడు. చైల్డ్ సైకియాట్రిస్ట్‌ల సూచనలు తీసుకోవడం, పాటించడం మేలు చేస్తుంది.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్, సైకియాట్రిస్ట్, విజయవాడ -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
ఒక్క నెత్తుటి చుక్కతో.. అరవైకి పైగా పరీక్షలు!
రక్తంలో చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే, వేలిమొనపై సూదితో గుచ్చుతారు. అప్పుడు వచ్చే నెత్తుటి చుక్కను గ్లూకోమీటర్ మీద పెట్టి పరీక్షిస్తారు. గ్లూకోమీటర్ ద్వారా నెత్తుటి చుక్కను పరీక్షిస్తే, కేవలం రక్తంలో చక్కెర స్థాయి మాత్రమే తెలుస్తుంది. దానివల్ల శరీరంలోని ఇతరేతర లోపాలేవీ బయటపడవు. అయితే, ఒకే నెత్తుటి చుక్కతో అరవైకి పైగా అంశాలను తెలుసుకునే పరీక్షను లండన్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.వేలిమొన నుంచి సేకరించిన ఒకే ఒక్క నెత్తుటి చుక్కతో శరీరంలోని అరవైకి పైగా లోపాలను తెలుసుకోగల పరీక్షను లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా లాంజెన్బర్గ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా పందొమ్మిది రకాల క్యాన్సర్, నరాలకు సంబంధించిన మోటార్ న్యూరాన్ డిసీజ్, గుండెజబ్బులు సహా అరవైఏడు రకాల వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 40 వేల మంది రోగులపై ఈ పరీక్ష నిర్వహించి శాస్త్రవేత్తలు విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఈ వివరాలను ‘నేచర్ మెడిసిన్’ తాజా సంచికలో ప్రచురించారు. -
Health: ఒత్తిడి, ఆందోళనను తగ్గించే.. 5–4–3–2–1 టెక్నిక్!
అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్‌కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు.. అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్‌నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది. -
హెయిర్.. కేర్..! బట్టతలను దాటి విస్తరించిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్!
సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల మాత్రమే కాదు.. ఇప్పుడు శరీరంలో పలు అవసరమైన చోట్ల కేశాలను కోల్పోవడం/లేకపోవడం కూడా సమస్యలుగానే భావిస్తున్నారు. ఆధునికుల్లో సౌందర్య పోషణ పట్ల పెరిగిన ప్రాముఖ్యత నేపథ్యంలో అవసరమైన చోట కేశాల లేమి సమస్యలకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను అనేకమంది పరిష్కారంగా ఎంచుకుంటున్నారు.ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను పొందుతున్న వినియోగదారుల్లో 25–45 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఈ మార్కెట్ 25–30శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. బట్టతలకు మాత్రమే కాకుండా కను»ొమలు, మీసాలు, గెడ్డం కోసం కూడా మగవారు అలాగే నుదుటి భాగంలో జుట్టు పలచబడటం (ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్) వంటి కారణాలతో మహిళలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఆశ్రయిస్తుండటంతో ఈ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది.యూనిట్ వారీగా వ్యయం..ఒకచోట నుంచి హెయిర్ స్ట్రిప్ కట్ చేసి చేసే ఎఫ్యుటి, స్ట్రిప్‌తో సంబంధం లేకుండా చేసేది ఎఫ్యుఇ పేరిట రెండు రకాల ట్రాన్స్‌ప్లాంటేషన్ పద్ధతులున్నాయి. కేశాలనేవి ఒకటిగా కాకుండా 3, 4 చొప్పున మొలుస్తాయి కాబట్టి వాటిని ఫాలిక్యులర్ యూనిట్‌గా పిలుస్తారు. ఒక్కో యూనిట్‌ను పర్మనెంట్ హెయిర్ ఉన్న చోట నుంచి తీసి అవసరమైన చోట అమర్చడానికి యూనిట్‌కు రూ.50 నుంచి రూ70 వరకూ వ్యయం అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే బట్టతల సమస్య పరిష్కారానికి కనీసం రూ.70వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చుపెట్టాలి. కను»ొమలు తదితర చిన్నచిన్న ట్రాన్స్‌ప్లాంటేషన్ తక్కువ వ్యయంతో రూ.10, రూ.15వేల వ్యయంతో గంట, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే తలభాగం మీద పూర్తిస్థాయిలో చేయాలంటే ఒక పూట నుంచి ఒక రోజు మొత్తం క్లినిక్‌లో ఉండాల్సి రావొచ్చు. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంతరం కొంత కాలం అధిక టెంపరేచర్‌కు గురికాకుండా జాగ్రత్తపడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేమితో అనర్థాలు...తక్కువ రెమ్యునరేషన్‌తో సరిపుచ్చడానికి.. పలు క్లినిక్‌లు అర్హత లేని వ్యక్తుల ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. దీంతో శరీరంపై మచ్చలు పడటం, బేసి వెంట్రుకలు, జుట్టు అపసవ్యంగా పెరగడం దగ్గర నుంచీ తీవ్రమైన ఇన్ఫెక్షన్, జుట్టురాలడం వరకు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాల్సి రావొచ్చు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెర్మటాలజిస్ట్లకు సైతం అత్యవసరంగా శిక్షణ ఇస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం సరైన నిపుణుల పర్యవేక్షణలో జరిగే చికిత్సలు ఖచి్చతంగా సురక్షితమే.అరకొర శిక్షణతో.. నో..హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన సౌందర్య ప్రక్రియలను నిర్వహించడానికి యూట్యూబ్ లేదా ఇతర ప్లాట్ ఫారమ్‌లలో శిక్షణ వీడియోలను చూస్తే సరిపోదని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) తేల్చి చెప్పింది. సర్జికల్ అసిస్టెంట్/టెక్నీíÙయన్లు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) పర్యవేక్షణలో ఇవి చేయాలని సూచించింది. సౌందర్య ప్రక్రియలేవీ అత్యవసర శస్త్రచికిత్స కిందకురావు. శిక్షణ లేని వ్యక్తి చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.వైద్యంతో పరిష్కారం కాకపోతేనే..వంశపారంపర్యంగా వచ్చే బట్టతల విషయంలో ఎలా ఉన్నా మిగిలిన చోట్ల ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లే ముందు తప్పకుండా వైద్య పరమైన పరిష్కారం అన్వేíÙంచాలి. ఉదాహరణకు కను»ొమ్మలు కోల్పోతే.. అల్ట్రా వయెలెంట్ లైట్ వినియోగించి మాగి్నఫైయింగ్ లెన్స్‌లను వినియోగించి దానికి కారణాన్ని గుర్తించాలి. చికిత్సకు అవకాశం ఉంటే చేయాలి. లేని పక్షంలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంచుకోవాలి. అవకాశం ఉంటే కొన్ని మందులు అప్లై చేసి చూస్తాం. స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా వినియోగిస్తాం.. ఎల్ఎల్ ఎల్టి, లో లెవల్ లోజర్ థెరపీతో కూడా వెంట్రుకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనా.. సమస్యను సరైన విధంగా నిర్ధారించి అవసరం మేరకు చికిత్స చేసే అర్హత కలిగిన వైద్యుడి దగ్గరే చేయించుకోవాలి. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలకూ కారణం కావొచ్చు.– డా.జాన్ వాట్స్, డెర్మటాలజిస్ట్, సీనియర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ -
కాలు బెణికితే RICE! చేయాల్సిన ప్రథమచికిత్స ఇదే!
కాలు బెణికినప్పుడు పైకి ఎలాంటి గాయం కనిపించకపోయినా లోపల సలుపుతుంటుంది. ఇలాంటప్పుడు చేయాల్సిన ప్రథమచికిత్స కోసం ఇంగ్లిష్‌లో ‘రైస్’ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి.– R అంటే రెస్ట్. అంటే కాలికి విశ్రాంతి ఇవ్వాలి. (24 నుంచి 48 గంటలపాటు).– I అంటే ఐస్‌ప్యాక్ పెట్టడం. ఐస్‌క్యూబ్స్‌ను నేరుగా గాయమైన చోట అద్దకూడదు. ఐస్ నీళ్లలో గుడ్డ ముంచి బెణికిన చోట అద్దాలి.– C అంటే కంప్రెషన్. అంటే బెణికిన ప్రాంతాన్ని క్రాప్ బ్యాండేజ్‌తో కాస్తంత బిగుతుగా ఒత్తుకుపోయేలా (కంప్రెస్ అయ్యేలా) కట్టు కట్టవచ్చు. అది అందుబాటులో లేకపోతే మామూలు గుడ్డతోనైనా కట్టు కట్టవచ్చు.– E అంటే ఎలివేషన్. అంటే బెణికిన కాలు... గుండెకంటే కాస్త పైకి ఉండేలా పడుకోవడం. అంటే కాలికింద దిండు పెట్టుకోవడం మేలు.బ్యూటిప్స్..ఫేషియల్ మసాజ్..– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.– ముఖ చర్మం అందంగా కనిపించాలంటే ఫేస్ మసాజ్ చేసుకోవాలి, దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. -
ఎవరో చేసిన తప్పుకి.. తనను తాను శిక్షించుకోవటం!
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కోపానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే.ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక పోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతుంది.కోపంతో ఊగిపోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త పోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కోపాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె పోటు వరకు.తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా తప్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాకపోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక పోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని.మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కోపాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే పోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది.పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కోపాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
ప్రెగ్నెన్సీలో.. సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య!
నాకు ఐదవ నెల ప్రెగ్నెన్సీ. ప్రతిరోజు మోషన్ ఫ్రీగా రాక ఇబ్బంది పడుతున్నాను. ఏ మందులూ పని చెయ్యడం లేదు.ప్రెగ్నెన్సీలో ఇది చాలా సాధారణ సమస్య. హార్డ్ మోషన్‌తో పాటు పెయిన్‌ఫుల్‌గా కూడా ఉండొచ్చు. దీని వల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, క్రాంప్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో సరిగ్గా నీళ్లు తీసుకోకపోవడం అసలు కారణం. హార్మోనల్ చేంజెస్‌తో బొవల్ మూవ్మెంట్ కూడా బాగా తగ్గుతుంది. నీళ్లు సరిగ్గా తాగక బొవల్ మూవ్మెంట్ స్పీడ్ తగ్గి మోషన్ గట్టిపడటంతో మలబద్ధ్దకం మొదలవుతుంది.తినే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉన్నా, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకున్నా, స్టూల్ బల్క్ తగ్గి కూడా మోషన్ హార్డ్ అవుతుంది. ఎక్సర్సైజెస్, యోగా చేసిన వారిలో టమ్మీ మజిల్స్ స్టిములేట్ అవుతాయి. దానితో మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. మీరు రోజుకు నాలుగైదు లీటర్ల నీరు తాగండి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం.. బీన్స్, ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. మోషన్ ఫ్రీగా అయ్యే లాక్సాటివ్ సిరప్స్ తీసుకోవాలి. వీటిలో స్టిములేటింగ్ లాక్సాటివ్స్ అంటే బొవల్ ఫాస్ట్‌గా మూవ్ అయ్యేటట్టు చేసేవి వాడాలి. కొన్ని మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.మీరు అవి గుర్తించి డాక్టర్‌కి చెప్పాలి. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను ఇస్తారు. వారంలో కనీసం మూడుసార్లు కూడా మోషన్‌కి వెళ్ళకపోతే మలబద్ధకంగా పరిగణించాలి. థైరాయిడ్ డిసీజ్, ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్‌లాంటి కండిషన్స్ ఉన్న వారిలో ఇంకా ఎక్కవ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఐదుగురిలో ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కొంతమందిలో ఎందుకు మలబద్ధకం వస్తుందో చెప్పలేము. అలాంటప్పుడు హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, లాక్సాటివ్స్తో ట్రీట్మెంట్ ఇస్తాము.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ఈ సమస్యను.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు! ఇదీ..
నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడమీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.ఇద్దరికీ ట్రీట్మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్‌కి ఏ ఇన్ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు!
రాత్రివేళల్లో నిద్రపోయేముందు బ్రష్ చేసుకోడాన్ని అందరూ తప్పనిసరిగా అలవరచుకోవాలి. ఎందుకంటే మెలకువతో ఉన్నప్పుడు అందరూ తినడానికీ, మాట్లాడటానికీ... ఇలా అనేక పనుల కోసం నోటిని అనేక మార్లు తెరుస్తుంటారు. కానీ నిద్రలో కనీసం ఏడెనిమిది గంటలు నోరు మూసుకుపోయే ఉండటంతో నోట్లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా వృద్ధిచెందుతాయి.రాత్రిపూట నోటిలో ఊరే లాలాజలం కూడా చాలా తక్కువే. ఫలితంగా నోట్లో సూక్ష్మజీవులు విపరీతంగా పెరిగిపోయి, అవి దంతాలకు హానికరమైన యాసిడ్నూ ఉత్పత్తి చేస్తుంటాయి. అందువల్ల నోటి ఆరోగ్యం దెబ్బతినడంతో పళ్లూ తీవ్రంగా దెబ్బతినే అవకాశం పగటి కంటే రాత్రి పూటే ఎక్కువ. అందుకే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకునే అలవాటు పళ్లకు జరిగే హానిని గణనీయంగా తగ్గించడంతోపాటు నోటి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది.ఇవి చదవండి: చచ్చు గింజలు తింటే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? -
అందంగా లేననే అనుమానం..!?
అంజలి సింగ్.. ఢిల్లీకి చెందిన విద్యార్థి. 21 ఏళ్లు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి తెలుగు, తండ్రి పంజాబీ. ఆమెకు తన బాడీ ఇమేజ్ గురించి అసంతృప్తి. అదెంతవరకు వెళ్లిందంటే.. 24 గంటలూ దాని గురించే ఆలోచించేంతగా. తను అట్రాక్టివ్‌గా లేననే మాట మనసులో తిరుగుతూనే ఉంటుంది. దాంతో ఒకటికి పదిసార్లు అద్దంలో చూసుకోవడం, కనిపించిన లోపాలను సరిచేసుకోవడానికి గంటలు గంటలు వెచ్చించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది.సోషల్ మీడియా ప్రభావం..తన డిజైనర్ పనికోసం ప్రేరణ పొందేందుకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను స్క్రోల్ చేయడం ఆమె ఆందోళనకు మూలంగా మారింది. పూర్తిగా మేకప్ వేసుకున్న, భారీగా ఎడిట్ చేసిన మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల పిక్స్ చూసి, వాళ్లతో పోల్చుకుంటుంది. తను వాళ్లలా స్లిమ్‌గా లేనని, అందుకే తాను ఆకర్షణీయంగా లేనని బాధపడుతుంది.కేలరీల కొలత..స్లిమ్ అవ్వడం కోసం కేలరీలను నిశితంగా ట్రాక్ చేస్తుంది. ఏది తిన్నా, తాగినా కేలరీలు లెక్కేసుకుంటుంది. త్వరగా బరువు తగ్గుతారని ట్రెండ్ అయిన కీటో డైట్ కూడా పాటించింది. యాంగ్జయిటీ ఎక్కువైనప్పుడు విపరీతంగా తినేసి, ఆ వెంటనే గిల్టీగా ఫీలై కొన్ని రోజులపాటు భోజనం పూర్తిగా మానేస్తోంది. ఇవన్నీ కలసి తనకు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టాయి.సామాజిక ఒత్తిడి..అంజలి నాన్న తరఫు బంధువులందరూ తెల్లగా, ఫిట్‌గా ఉంటారు. దాంతో వాళ్లు అంజలిని కలసినప్పుడల్లా ‘కొంచెం స్లిమ్‌గా, కాస్త ఛాయ మెరుగ్గా ఉంటే అందంగా ఉండేదానివి’ అని కామెంట్ చేస్తుంటారట. వాస్తవానికి అంజలి అందంగానే ఉంటుంది. కానీ బంధువుల మాటలు, సోషల్ మీడియాలో కనిపించే జీరోసైజ్ మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పోల్చుకోవడం ఆమె అభద్రతాభావానికి కారణమయ్యాయి. వాటికి తోడు ఫ్రెండ్స్ కూడా బరువు తగ్గడం గురించి, డైటింగ్ గురించి తరచూ మాట్లాడటం తన ఆందోళనను మరింత తీవ్రం చేసింది. తాను అట్రాక్టివ్‌గా లేననే ఆలోచనతో పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లడం మానేసింది. ఎలాగైనా స్లిమ్‌గా, ఫిట్‌గా కావాలనే కోరిక తనపై ఒత్తిడిని పెంచుతోంది. అన్నీ కలసి ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నతస్థాయికి చేరాలనే కోరికను అడ్డుకుంటున్నాయి.థెరపీతో పరిష్కారం..అంజలిలాగే చాలామంది యువతులు జీరోసైజ్ కోసం కష్టపడుతుంటే, యువకులు సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్‌లలో చెమటోడుస్తున్నారు. ఇలాంటివారు ముందుగా చేయాల్సింది అమితాభ్బచ్చన్, రజనీకాంత్లకు సిక్స్ ప్యాక్‌లు లేవని.. అందరూ ఐశ్వర్యారాయ్‌లా ఉండలేరని గుర్తించాలి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీ ద్వారా బాడీ ఇమేజ్ పట్ల అంజలి.. తనకున్న నెగెటివ్ భావనలను, వాటికి మూలకారణాలను అర్థం చేసుకుంది. ఐదు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది.పాజిటివ్ బాడీ ఇమేజ్ కోసం..మీ బాడీ ఇమేజ్ పట్ల మీకున్న ప్రతికూల, విమర్శనాత్మక ఆలోచనలను గుర్తించండి. అవి వాస్తవికతపై ఆధారపడి ఉన్నాయా లేక సోషల్ స్టాండర్డ్స్ ద్వారా వక్రీకరించబడ్డాయా? అనేది గమనించండి.– మీ ప్రతికూల ఆలోచనలను గుర్తించాక, ‘నా ఫ్రెండ్‌తో నేనిలాగే మాట్లాడతానా? ఇలాగే విమర్శిస్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.– అవాస్తవికమైన బాడీ ఇమేజ్ ప్రమాణాలను ప్రోత్సహించే సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగా ఉండండి.– ఆకారం కంటే ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. డా¯Œ ్స, యోగా లేదా ఈత వంటి వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి.– అద్దం ముందు నిలబడి మీ సానుకూల లక్షణాలపై దృష్టి పెట్టండి. ‘ఎవరి అందం వారిదే’, ‘నేను ప్రత్యేకం’, ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉన్నాను’ అని చెప్పుకోండి.– బాడీ ఇమేజ్‌తో కాకుండా టాలెంట్‌తో స్ఫూర్తి పంచే కళాకారులు, డిజైనర్లు, క్రియేటర్లను అనుసరించండి. మీరు ఎలా ఉన్నారనేది కాకుండా, మిమ్మల్ని మీరుగా అంగీకరించే స్నేహితులతో కనెక్ట్ అవ్వండి.– ఈ సెల్ఫ్–హెల్ప్ టిప్స్ సరిపోవనిపిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
నగరవాసుల్లో 'నోమో ఫోబియా'
ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి అదే మరో చేత్తో మనల్ని తన గుప్పిట్లోకి తెచ్చేసింది స్మార్ట్‌ఫోన్. అయితే సరికొత్త ధైర్యాలతో పాటు భయాలను కూడా మనకు చేరువ చేస్తోంది. సరదాలను తీర్చడంతో పాటు సమస్యలనూ పేర్చేస్తోంది. రోజంతా ఫోన్‌తోనే గడిపే స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో నోమో ఫోబియా అనే సరికొత్త అభద్రతా భావం పెరుగుతోందని ఒప్పో కౌంటర్‌పాయింట్ చేసిన అధ్యయనం వెల్లడించింది.ఈ ఫోబియా తీవ్రతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1,500 మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఈ అధ్యయనం జరిగింది. అదే విధంగా నోమోఫోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియా అంటే... మొబైల్ ఫోన్ నుంచి దూరం అవుతానేమో అనే భయంతో పుట్టే మానసిక స్థితి అని జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లో ప్రచురించబడిన అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్ ల మితిమీరిన వినియోగం వల్ల సంభవించే మానసిక రుగ్మతల్లో ఇది ఒకటిగా తేలి్చంది. – సాక్షి, సిటీబ్యూరోఅప్పటిదాకా చేతిలోనే ఉన్న పోన్ కాసేపు కనబడకపోతే లేదా దూరంగా ఉంటే చాలు.. నా ఫోన్ ఏది? ఎక్కడ ఉంది? ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా... అంటూ ఆందోళనగా, అసహనంగా, గాభరాపడిపోవడం అలాగే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతుందేమో అనే కంగారుపడేవాళ్లని చాలా మందినే మనం చూస్తున్నాం. అయితే వారిలో ఇది చూడడానికి సాధారణ సమస్యగా కనిపిస్తున్నా.. అది సాధారణం కానే కాదని, ఆ సమయంలో కలిగే భయాందోళనలు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.కారణం ఏదైనా సరే.. మన ఫోన్‌కు కొద్దిసేపైనా సరే దూరంగా ఉండాలనే ఆలోచన ఎవరికైతే ఆందోళన కలిగిస్తుందో.. తరచుగా తమ ఫోన్‌ను తరచి చూసుకోవడం వంటి లక్షణాలతో నోమో ఫోబియా బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇది ప్రతీ నలుగురు స్మార్ట్ ఫోన్ ప్రియుల్లో ముగ్గురిని ప్రభావితం చేస్తోందని, నగరాలు/ గ్రామాలు తేడా లేకుండా ఇది దాదాపు 75 శాతం జనాభాపై దాడి చేస్తోందని అధ్యయన నిర్వాహకులు అంటున్నారు. మితమే హితం..డిజిటల్ అక్షరాస్యత అందరికీ అలవడాలి. బాధ్యతాయుతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. సమస్య ముదిరితే అంతర్లీన ఆందోళన లేదా డిపెండెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ, కౌన్సెలింగ్ అవసరం కావచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి. అంటే ‘టెక్–ఫ్రీ’ సమయాలు లేదా ప్రాంతాలు వంటివి. శారీరక శ్రమ మానసికోల్లాసం కలిగించే ఆఫ్‌లైన్ కార్యకలాపాలు వంటి హాబీల్లో పాల్గొనడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఆరోగ్యంపై దు్రష్పభావం.. నోమోఫోబియాతో ఆందోళన, శ్వాసకోశ మార్పులు, వణుకు, చెమట, ఆందోళన, అయోమయ స్థితి వగైరాలు కలుగుతున్నాయి. అలాగే నిద్రలేమి, ఏకాగ్రత లేమి, నిర్లక్ష్యాన్ని ప్రేరేపించి వ్యక్తిగత సంబంధాలను విస్మరించేలా చేస్తుంది. కారణం ఏదైనా సరే.. స్మార్ట్ఫోన్లపై అతిగా ఆధారపడటం వల్ల ముఖ్యమైన అప్డేట్లు, సందేశాలు లేదా సమచారాన్ని కోల్పోతారనే భయంతో వ్యక్తులు ఈ ఫోబియాకు గురవుతున్నారు.అధ్యయన విశేషాలివీ..– నో మొబైల్ ఫోబియానే షార్ట్ కట్లో ‘నోమో ఫోబియా‘గా పేర్కొంటున్నారు. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ ఫోన్ దగ్గర లేకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది.– అధ్యయనంలో పాల్గొన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది తమ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు రకరకాల మానసిక అసౌకర్యాలకి గురవుతున్నారని అధ్యయనం తేలి్చంది. ఆ సయమంలో వీరిలో ఆందోళన, ఆత్రుత, డిస్కనెక్ట్, నిస్సహాయత, అభధ్రత భావాలు ఏకకాలంలో ముప్పిరిగొంటున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా బ్యాటరీ పనితీరు సరిగా లేదనే ఏకైక కారణంతో 60 శాతం మంది తమ స్మార్ట్ఫోన్లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది.– ఈ విషయంలో మహిళా వినియోగదారుల (74 శాతం మంది)తో పోలిస్తే పురుష వినియోగదారులు (82 శాతం మంది) ఎక్కవ సంఖ్యలో ఆందోళన చెందుతున్నారని అధ్యయనంలో తేలింది.– ఫోన్ ఆగకూడదనే ఆలోచనతో 92.5 శాతం మంది పవర్–సేవింగ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సైతం ఉపయోగిస్తున్నారని తేలి్చంది.– ‘ముఖ్యంగా 31 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారిలో బ్యాటరీ గురించిన ఆందోళన ఎక్కువగా ఉంది. తర్వాత స్థానంలో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు’ అని రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.సాంకేతికత రోజువారీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, నోమోఫోబియా, దాని అనుబంధ సవాళ్లను పరిష్కరించడం ఒక క్లిష్టమైన అంశం కాబోతోంది. ఆరోగ్యకరమైన సాంకేతికత అలవాట్లను పెంపొందించడం స్మార్ట్ఫోన్లతో కాకుండా వ్యక్తుల మ«ధ్య సంబంధాలను శక్తివంతం చేయడం వంటివి నోమోఫోబియా ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి. -
ఐవీఎఫ్‌తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్‌లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్‌లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్‌లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండడం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగు నీరు కలుషితం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలోనూ ప్రజలు సహరించాలని కోరారు. దోమల ఉత్పత్తిని తగ్గించడానికి, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.కలుషిత నీటి నివారణ కోసం క్లోరినేషన్ చేసిన లేదా కాల్చి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవద్దని, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సంబంధిత ఆస్పత్రిని, వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. -
23 నుంచి ‘పొలం పిలుస్తోంది’
సాక్షి, అమరావతి: ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కమిషనర్ నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ పొలంబాట పట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించాలన్న సంకల్పంతో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి సీజన్లో వారానికి 2 రోజుల పాటు, రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి మంగళ, బుధవారాల్లో తలపెట్టే ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు.పరిశోధన కేంద్రాలు, కేవీకేల శాస్త్రవేత్తలనూ భాగస్వాములను చేస్తున్నారు. మండలాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉదయం రైతు క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఆర్బీకేలో రైతులతో సమావేశమవుతారు. సీజన్ ముగిసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లాకో కో–ఆర్డినేటర్‌ను నియమిస్తున్నారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు మండల స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంతో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడం, సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించడం చేస్తారు. -
రొటీన్ చెకప్ స్కాన్‌లో రెండు ఓవరీస్‌లో సిస్ట్స్ ఉన్నాయి... ఏం చేయాలి?
నాకు 45 ఏళ్లు. రొటీన్ చెకప్ స్కాన్‌లో రెండు ఓవరీస్‌లో 3 సెం.మీ, 5 సెం.మీ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని భయంగా ఉంది. – రుబీనా, గాజులరామారంఆ వయసులో చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఓవరీస్‌లో సిస్ట్స్ ఫామ్ కావచ్చు. ఆ ఏజ్‌లో అంటే మెనోపాజ్‌కి ముందు క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ. సింపుల్ సిస్ట్స్ అయితే అసలు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆ సిస్ట్స్ 5 సెం.మీ కన్నా ఎక్కువుంటే చిన్న కీహోల్ సర్జరీ ద్వారా సిస్ట్ని మాత్రమే తీసేసి టెస్టింగ్‌కి పంపిస్తారు. ఓవరీస్ నుంచి 2– 3 సెం.మీ సైజులో ప్రతినెలా అండాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు ఇంకాస్త పెద్ద సైజులో కూడా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.3 సెం.మీ కంటే ఎక్కువ ఉంటేనే సిస్ట్ అంటాము. ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటాయి. అవి సింపుల్ సిస్ట్స్. కొంతమందికి బ్లడ్ ఫిల్ అయిన సిస్ట్స్ ఉంటాయి. వాటిని ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ అంటారు. డెర్మాయిడ్ సిస్ట్‌లో ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. మీరు ఇంటర్నల్ పెల్విస్ స్కాన్ చేయించుకోండి. అందులో సిస్ట్ సైజ్, దాని తీరు స్పష్టంగా తెలుస్తాయి. ఏ సింప్టమ్ లేకుండా ఈ సిస్ట్స్ చాలామందిలో స్కానింగ్‌లోనే తెలుస్తాయి. అప్పుడు వాటి నేచర్‌ని బట్టి సైజ్‌ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. పదిలో ఒకరికి మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది.కొంతమందికి కింది పొట్టలో నొప్పి, లైంగికంగా కలసినప్పుడు నొప్పి, యూరినరీ ప్రాబ్లమ్స్, మోషన్ డిఫికల్టీస్ ఉండవచ్చు. అలాంటి వారికి వెంటనే కొన్ని రక్తపరీక్షలు చెయ్యాలి. ఫ్యామిలీ హిస్టరీని కూడా డీటేయిల్డ్‌గా తీసుకుంటారు. సిస్ట్ వల్ల సమస్య ఉందని తేలితే క్లోజ్ ఫాలో అప్‌లో డాక్టర్ మీకు విషయాన్ని వివరిస్తారు. చాలా సిస్ట్‌లకు వెయిట్ అండ్ వాచ్ పాలసీయే సూచిస్తారు. మీకున్న సింప్టమ్స్, బ్లడ్ రిపోర్ట్స్, సైజ్‌ని బట్టి ఎంత తరచుగా స్కాన్స్ ద్వారా రీచెక్ చెయ్యాలో చెప్తారు. సిస్ట్ సైజ్ 5–7 సెం.మీ ఉన్నప్పుడు ఏడాదికి ఫాలో అప్ ఉంటుంది. ఏడాదికి మళ్లీ స్కాన్ చేయించుకోమని సూచిస్తారు. 7 సెం.మీ కన్నా ఎక్కువ ఉంటే ఎమ్మారై స్కాన్ చేయించుకోమంటారు. ఈ దశలో సర్జరీని సజెస్ట్ చేస్తారు.మీ వయసుకి ఓవరీస్ని పూర్తిగా తీసేయడం మంచిది కాదు. 50–52 ఏళ్ల వరకు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ చాలా అవసరం. అందుకే లాపరోస్కోపీ ద్వారా కేవలం సిస్ట్ని మాత్రమే తీసేస్తారు. ఒకవేళ ఆ సిస్ట్ మెలికపడి పక్కనున్న బవెల్, బ్లాడర్ మీదికి స్ప్రెడ్ అయిన కొన్ని అరుదైన కేసెస్‌లో ఓవరీస్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. మీరొకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. ఇంటర్నల్ స్కాన్ చేసి డీటేయిల్డ్‌గా చూస్తారు.ఇవి చదవండి: స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా? -
స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా?
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ పెయిన్ సివియర్‌గా ఉంటోంది. స్కాన్‌లో ఓవరీస్‌లో చాకొలేట్ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. వీటివల్ల ప్రమాదమేమైనా ఉంటుందా? – కునాలిక, వైజాగ్ఇవి కొన్నిసార్లు గర్భసంచి పొరలోని టిష్యూ పెల్విస్‌లో ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా మీద పెరుగుతాయి. పీరియడ్స్ టైమ్‌లో గర్భసంచిలో బ్లీడింగ్ అయినట్టే వేరేచోట కూడా బ్లీడ్ అయ్యి సిస్ట్స్ పెయిన్ వేస్తాయి. పీరియడ్స్‌లో పొట్టలో నొప్పి, యూరిన్‌లో, మోషన్లో లోయర్ బాడీ అంతా నొప్పి ఉండొచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణమేమీ లేదు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్స్‌కి సంబంధించిన కారణాలు ఉంటాయి.ఇవి పదిమందిలో ఒకరికి ఉంటాయి. ఎమ్మారై స్కాన్‌లో కన్ఫర్మ్గా ఇది ఎండోమెట్రియాసిస్ అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్‌ని వాడాల్సి వస్తుంది. పారాసిటమాల్, ట్రామడాల్ లాంటివి బాగా పనిచేస్తాయి. మీ ఏజ్ గ్రూప్ వారికి హార్మోన్ పిల్స్ బాగా పెయిన్ రిలీఫ్‌ని ఇస్తాయి. ఇవి ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ లేదా చాకొలేట్ సిస్ట్స్‌ని కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి. కంబైన్డ్ ఓరల్ కంట్రాసెప్టివ్ పిల్స్‌ని క్రమం తప్పకుండా నెలంతా వేసుకోవాలి.ఈ మాత్రలతో వికారం, తలనొప్పి వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. 3 నుంచి 6 నెలల్లో మినిమమ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాకొలేట్ సిస్ట్స్ సైజ్ 5 సెం.మీ కన్నా ఎక్కువున్నా, హార్మోన్స్ పనిచేయకపోయినా లాపరోస్కోపీ సర్జరీ సూచిస్తారు. ఈ సిస్ట్స్‌ని తీసేసిన తరువాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవుతుంది. కానీ రికరెన్స్ అంటే మళ్లీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. క్లోజ్ ఫాలో అప్ స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో కావాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.కొంతమందికి GnRH analogue ఇంజెక్షన్స్ ఇస్తారు. సర్జరీ తరువాత కూడా కొందరికి వీటిని సజెస్ట్ చేస్తారు. లాపరోస్కోపీ సర్జరీలో సిస్ట్స్‌ని తొలగించి.. ఏమైనా ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఉంటే వాటిని కూడా fulgurate చేస్తే పెల్విక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు క్లోజ్ ఫాలో అప్‌లో ఉండాలి.ఇవి చదవండి: ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా? -
ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా?
సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.కెరీర్లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్‌ను, పెయింటింగ్‌ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్‌కు వచ్చింది.‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.కారణాలు..– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి. – సారిక తన జీవితాన్ని ఆన్లైన్లో చూసే పర్ఫెక్ట్ లైఫ్‌లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది. – నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్‌లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.లక్షణాలు..– సోషల్ మీడియా అప్డేట్స్ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..సెల్ప్ హెల్ప్ టిప్స్..– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి. – చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్‌ను ఆపేయండి. – మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి. – మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్‌ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్‌ను అనుసరించవద్దు. – స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి. – ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి. – మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్‌ను కలవండి. – కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్ -
పుస్తకం చదవటంలో.. ఏకాగ్రత లోపమా? అయితే ఇలా చేయండి!
ఈ రోజుల్లో.. పిల్లలు చేత పుస్తకం పట్టి, పదినిమిషాలు చదవాలంటే.. ఓపికతో కూడుకున్న పనిగా, ఇబ్బందిగా భావిస్తున్నారు. అందులో వారికి ఇష్టంలేని సబ్జెక్ట్ గురించైతే చెప్పనవసరం లేదు. పుస్తకం ఇలాగ తెరిచి వామ్మో.. ఈ సబ్జెక్టా అంటూ పక్కనెట్టుస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్ కి పుస్తక పఠనంపై దృష్టి పెట్టడమనేది చాలా పెద్ద సమస్యగా మారింది.దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఓపిక లేకపోవడం, ఇతర చిన్న చిన్న కారణాలు, మరెన్నో.. మరి ఇటువంటి కారణాలకు సహజంగా చదువుపై ఏకాగ్రత పొందాలంటే కొన్ని పర్యావసనాలు ఎంచుకోవాల్సిందే. తదుపరి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ కలగడం, అంకితభావంతో తమ చదువుల్లో నిమగ్నమై ఉండటం, చదువులో పురోగతి సాధించడంవంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే, శ్రద్ధతో చదవడంతో విద్యార్థులు ఎక్కువ సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు, దీంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతంది.పాటించాల్సిన చర్యలు..పర్యావరణం..చదువుకోవడానికి ఎప్పుడూ ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. చుట్టూ ఉన్న స్థలం శుభ్రంగా ఉండటం మరీ ఉత్తమం. వీలైతే, సహజ కాంతి, సౌకర్యవంతమైన కుర్చీ, పొందిగ్గా కూర్చునే విధానం ఎంతో అవసరం. చదివేంతవరకైనా మన ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.సమయం..మనకున్న రోజుకి 24 గంటల సమయంలో ఇతర అవసరాలకి చాలా సమయం పోగా, చదువుకై కొంత సమయాన్ని కెటాయంచుకోవడం అవసరం. అలా వీలు పడలేదంటే వెంటనే షెడ్యూల్‌ని తయారుచేసుకుని దానిని అనుసరించడం ఎంతో కీలకం. ప్రతిరోజూ చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని.. పెద్ద లక్ష్యాల వైపుగా కొనసాగడం సులభమైన మార్గం. ప్రతీ 45-60 నిమిషాలకు.. 5-10 నిమిషాల విరామం తీసుకోవడం అవసరం. ప్రస్తుత జనరేషన్ లో 7-8 గంటల నిద్ర మరీ ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామంతో దృష్టి, ఏకాగ్రత మెరుగుపడుతుంది.సాంకేతికత..ఓపిక, సహనానికై పోమోడోరో వంటి టెక్నిక్స్ సహాయంగా మారుతుంది. పోమోడోరో టెక్నిక్‌లో.. 25 నిమిషాల పనికి 5 నిమిషాల విరామంగా విడమర్చి ఉంటుంది. సంక్లిష్ట భావనలను అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి మైండ్ మ్యాపింగ్‌ని ఉపయోగించండి. పదజాలం, వాస్తవాలను గుర్తుంచుకోవడానికి ఫ్లాష్‌కార్డ్‌లను ఉపయోగించండి. మీ చదువులో మీకు సహాయపడే ఆన్లైన్ ట్యుటోరియల్లు, వీడియోలు, కథనాలతో కూడిన ఆన్లైన్ మాద్యమాలను ఉపయోగించడం సులభమైన మార్గం.మనస్తత్వం..ప్రతీనిమిషం సానుకూలంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ మన శక్తి సామర్థ్యాలపై విశ్వాసం వీడొద్దు. ధ్యానం మీ దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఎవరైనా సహాయం కోరితే సానుకూలంగా స్పందించండి. ఇతరులనుంచి సాయంకోరడంలో ఇబ్బంది పడటం, చివరికి చిక్కుల్లో పడటం చేయకండి. సజావుగానే, తేలికగా అడగడానికి ప్రయత్నించండి.ప్రతీ వ్యక్తి భిన్నంగా ఉండాలనే నియమం ఎక్కడా కూడా లేదు. అది కొందరికి సాధ్యం అవచ్చు. మరికొందరికి కాకపోవచ్చు. అలా ఉండకపోవడానికి గల లోపాలను గుర్తించి, అవసరమైన జాగ్రత్తలు పాటించడం మేలు. శ్వాస విషయంలో గట్టిగా గాలి తీసుకోవడం, నెమ్మదిగా వదలడం ఇలా 5 నిమిషాల శ్వాసవ్యాయామంతో అలోచనా శక్తి మెరుగుపరుచుకోవచ్చు. -
కిచెన్ టిప్స్.. ఇక కల్తీ కథ కంచికే!
కల్తీ... కల్తీ... కల్తీ. కల్తీ లేని వస్తువు కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. బతకాలంటే రోజుకు మూడుసార్లు తినాలి. హోటల్లో తిందామంటే పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వంటల్లో రంగులేస్తారు. ఇంట్లో శుభ్రంగా వండుకుని తిందామంటే... వంట దినుసులు కల్తీ. మిరప్పొడి కొందామంటే అందమైన ప్యాకింగ్ మీద నోరూరించే ఎర్రటిరంగు ఫొటో ఉంటుంది.లోపల మిరప్పొడి ఏ రంగులో ఉందో కనిపించదు. ఇంటికి తెచ్చి ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక్కోసారి రంపం పొట్టులా, ఇటుక పొడిలా నిర్జీవంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఎర్రటి ఎరుపుతో ఇది కారంపొడేనా లేక గోడలకేసే రంగా అన్నంత చిక్కగా ఉంటుంది. మనం దాదాపుగా వంటల్లో రోజూ వాడే ఐదు దినుసులను ఎలా పరీక్షించుకోవచ్చో చూద్దాం.మిరప్పొడి: ఒక కప్పు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ మిరప్పొడి వేయాలి. మిరప్పొడి నీటిమీద తేలుతూ ఉండి రేణువులు నీటిని పీల్చుకుంటూ మెల్లగా మిరప్పొడి మొత్తం కప్పు అడుగుకు చేరుతుంది. కల్తీ మిరప్పొడి అయితే నీటిలో వేయగానే అడుగుకు చేరుతుంది. అంతేకాదు, కప్పు అడుగుకు చేరేలోపు రంగు వదులుతూ నీటిని ఎర్రగా మారుస్తుంది.ఇంగువ: ఇంగువకు మండే గుణం ఎక్కువ. ఇంగువ కల్తీని తెలుసుకోవడానికి అదే మంచి గీటురాయి కూడా. ఇంగువను చిన్న ముక్క తీసుకుని మంట మీద పెడితే వెంటనే మంట అంటుకుని ఇంగువ ముక్క మండిపోతుంది. కల్తీ ఇంగువ అయితే వెంటనే మండదు. మంట మీద పెట్టి వెలిగించే ప్రయత్నం చేసినా సరే వెలగకుండా మాడిపోతుంది. ఇంగువ పొడి కొనేవాళ్లకు కూడా ఇదే చిట్కా. చిన్న పేపర్ మీద పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాగితాన్ని వెలిగించాలి. కాగితంతోపాటే ఇంగువ కూడా మంటను ఆకర్షిస్తే అది అసలైన ఇంగువ. కాగితం మండిపోయి ఇంగువ పొడి నల్లబారి సరిగా మండకపోతే అది కల్తీ ఇంగువ అని అర్థం.మిరియాలు: మిరియాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే... బొ΄్పాయి గింజలను కలుపుతారు. ఒక కప్పు నీటిలో టీ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు బరువుగా ఉంటాయి నేరుగా నీటి అడుగుకు చేరతాయి. బొ΄్పాయి గింజలు తేలిక. కాబట్టి అవి నీటిలో తేలుతాయి.జీలకర్ర: జీలకర్రలో ఏ గింజలు కలుపుతారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ అసలు జీలకర్ర, అందులో కలిపిన గింజలు ఒకేరకంగా కనిపించడానికి కొద్దిగా నల్లరంగు కలుపుతారు. జీలకర్రను పావు టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసి బాగా రుద్దాలి. చేతులకు నలుపు అంటితే కల్తీ జీలకర్ర అని అర్థం.పసుపు: పసుపుకు కూడా రంగులద్దుతారు. అర టీ స్పూన్ పసుపును కప్పునీటిలో వేయాలి. మిరప్పొడి వలెనే ఇది కూడా నీటిని పీల్చుకుంటూ మెల్లగా నానుతూ అడుగుకు చేరుతుంది. రంగు కలిపిన పసుపు అయితే నీటి అడుగుకు చేరే లోపే రంగు వదులుతుంది. వేసిన వెంటనే నీరు చిక్కటి పసుపురంగులోకి మారుతాయి. -
ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టడంలేదు!
విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.కానీ విజయ్‌కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్‌కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.నిద్రలేమికి కారణాలు..- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి. - షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. - యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..- స్లీప్ ఆప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.మంచి అలవాట్లతో మంచి నిద్ర..మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి. - రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి. - కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి. - నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు. - పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. - గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. - ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవడం తప్పనిసరి. - నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. - లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. - ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఎవరి నిద్ర వారిదే..నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. - త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు. - గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. - ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. - పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం..
వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఇదే. సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామానికి తోడు రోజువారీ పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.రోజువారీ ఆహారం..ఉదయం రెండు ఇడ్లీలు లేదా 60 గ్రాముల గింజ ధాన్యాలు లేదా 25 గ్రాముల పప్పులతో 150 మిల్లీ లీటర్ల పాలు తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల సమయంలో ఏదో ఒక పండు, నిమ్మరసం లేదా జామకాయ తింటే మేలు. ఇవేవీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసు పాలైనా తాగాలి. మధ్యాహ్నం భోజనంలో 75 గ్రాముల గింజ ధాన్యాలు, ఆకుకూరలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు 50 గ్రాముల గింజ ధాన్యాలతో చిరుతిండి, ఒక కప్పు పాలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా రెండు చపాతీలు లేదా పుల్కాలు కూరగాయలతో తినాలి. ఒకవేళ కూరగాయ, పెరుగు వద్దనుకుంటే 100 గ్రాముల మాంసాహారం తీసుకోవచ్చు.నీరు.. పాలు..పరిశ్రుభమైన నీటినే తాగాలి. ఎత్తు, బరువుకు సరిపడా నీరు తాగితే 50 శాతం రుగ్మతలు దరిచేరవు. ఎక్కువగా కాచి వడబోసిన నీటినే తీసుకోవాలి. నీటితో పాటు పాలు కూడా చాలా అవసరం. రోజుకు 250 ఎం.ఎల్. పాలు తాగాలి. కాఫీ, టీ అలవాటు ఉన్న వారు రోజుకు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ తీసుకోకపోవడమే శ్రేయస్కరం.పప్పు ధాన్యాలు కీలకంఆహారంలో పల్లీలు, మినుములు, శనగలు, బాదం పప్పు వంటివి ఏదో ఒకటి ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూర కనీసం 100 గ్రాములు తీసుకోవాలి. జామ, నిమ్మ, ఉసిరి ఏదో ఒక దానిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. రోజూ ఉడికించిన గుడ్డు, వారంలో ఒకసారి చికెన్, మటన్ తినాలి.తాజా పండ్లు, కూరగాయలు మేలు..ప్రతిపూట భోజనానికి ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే సూక్ష్మ పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు, నారింజ రంగులో ఉండే పండ్లు కొన్నిరకాల దీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పండ్లను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.వీటికి దూరంగా ఉండాల్సిందే..నిల్వ చేసిన ఆహారం, తీపి పదార్థాలు తీసుకోరాదు. బయట దొరికే రెడీమేడ్ ఆహారం, ఉప్పుతో కూడిన ఆహారం, కూల్‌డ్రింక్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.జలుబు నివారణకు..ఈ కాలంలో ఎక్కువగా పీడించేవి జలుబు, దగ్గు, ఆయాసం. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం మిరియాలు, అల్లం, వెల్లుల్లి బాగా ఉపయోగపడతాయి. వీటిని అవసరం మేరకు వేడినీరు, పాలు, టీలో ఏదేని ఒకదానిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.మంచి ఆహారంతో ఆరోగ్యంఆహారం బాగా ఉడికించి తినాలి. ఏ, సీ, డీ, కే విటమిన్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంధత్వంతో పాటు పిల్లల్లో వాంతులు, విరేచనాలు, తట్టు, శ్వాసకోస సంబంధ వ్యాధులను నివారించేందుకు ఏ విటమిన్ బాగా పని చేస్తుంది. తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారెట్, మునగాకు, మామిడి, బొప్పాయి, గుమ్మడి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇలా చేస్తే రోగకారకాలను నియంత్రించవచ్చు. – బాలాజీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి -
టీనేజర్ల రక్షణ కోసం.. సరికొత్తగా స్నాప్‌చాట్!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ నేరాలకు టీనేజర్లు బాధితులుగా మారకుండా చూసేందుకు ప్రముఖ వ్యక్తిగత సంబంధాల యాప్.. స్నాప్‌చాట్ కొత్త ఫీచర్లను జత చేసింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు ఓ సమావేశంలో తెలిపారు.నిజమైన స్నేహాలను బలోపేతం చేస్తూ హానికరమైన సంబంధాలను అరికట్టే దిశగా ఇవి రూపొందాయని, బ్లాకింగ్ కేపబులిటీస్‌ను అభివృద్ధి చేయడం, లొకేషన్ షేరింగ్‌ను సరళీకృతం చేయడం, స్నేహబంధాల రక్షణ టూల్స్‌ను విస్తరించడం, ఇన్–చాట్ వార్నింగ్స్‌ను పెంచడం.. వంటి మార్పు చేర్పులతో ఫీచర్లు జత చేశామని వివరించారు.ఈ సందర్భంగా టీన్ ఆన్లైన్ సేఫ్టీపై ఏర్పాటు చేసిన ప్యానెల్ చర్చలో నటి, స్నాప్ స్టార్ నితాన్షి గోయెల్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్(వైఎల్ఎసి) సహ వ్యవస్థాపకులు అపరాజితా భత్రి, స్పాన్ పబ్లిక్ పాలసీ హెడ్ ఉత్తరా గణేష్ పాల్గొన్నారు.ఇవి చదవండి: Neenu Rathin: తక్కువ కాలంలోనే.. ‘సోషల్ ఎంటర్ప్రెన్యూర్’గా.. -
Beauty Tips: అందానికి 'ఓట్లు'..
ఓట్స్ ఆరోగ్యపోషణతోపాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. ఓట్స్‌తో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో చూద్దాం.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్పౌడర్లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిక్స్‌ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతమవుతుంది.మొటిమలు తగ్గాలంటే టేబుల్ ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును ఓట్స్ పీల్చుకోవడం వల్ల మొటిమలు వాడిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నాలుగు వారాల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ సహజమైన బ్లీచ్. చర్మాన్ని తెల్లబరుస్తుంది. మృదువుగా మారుతుంది కూడా.ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, బాదం ΄÷డి టేబుల్ స్పూన్, తేనె టేబుల్ స్పూన్, పాలు లేదా పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి వలయాకారంలో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు చర్మకణాల్లో పట్టేసిన మురికి వదులుతుంది. ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వేస్తుంటే ప్రత్యేకంగా స్క్రబ్ క్రీమ్‌లు, బ్లీచ్‌లు వాడాల్సిన అవసరం ఉండదు.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ΄÷డి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు ఉన్నవాళ్లు బాదం ఆయిల్ లేకుండా ప్యాక్ వేసుకోవచ్చు.ఇవి చదవండి: Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం! -
పెయిన్‌కిల్లర్స్ అబ్యూజ్..! పెయిన్ తగ్గించడమా? ప్రాణసంకటమా?
మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్ కిల్లర్స్‌ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్ అప్సెట్), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్ అల్సర్స్) రావచ్చు.అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్ కిల్లర్స్ వల్ల రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్‌ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.కిడ్నీలపైన: కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్‌కిల్లర్ టాబ్లెట్స్లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్‌కిల్లర్స్ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్ వంటì వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం – చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్‌కు తెలపాలి.దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... – పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. – అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. – కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి. – పెయిన్ కిల్లర్స్ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు -
వానల్లో వార్మ్‌గా, బ్రైట్‌గా.. ఉండాలంటే ఇలా చేయండి..
మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది! వానజల్లులు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి కానీ ఇంటి వాతావరణాన్ని గ్లూమీగా మార్చేస్తాయి. మనసుతో ఇల్లూ పోటీపడాలంటే ఇంటీరియర్ బ్రైట్‌గా ఉండాల్సిందే! అందుకే..ఇంట్లో రంగు రంగుల వాల్ ఆర్ట్, కళాత్మక వస్తువులు, కుండీలు, క్యాండిల్ హోల్డర్లు.. వంటి ఉపకరణాలను చేర్చండి. గదిలోని ఒక గోడను బ్రైట్ కలర్‌తో పెయింట్ చేయండి. దీంతో ఆ స్థలం సజీవంగా మారిపోతుంది. లేదంటే కంటికింపైన వాల్‌పేపర్‌ను అతికించినా సరే! కుషన్ కవర్లు, కర్టెన్లూ డార్క్ కలర్స్వే ఎంచుకోండి.వర్షాకాలం తేమ ఎక్కువ కాబట్టి వుడెన్ కాకుండా ఫైబర్, మైక్రో ఫైబర్ ఫర్నీచర్‌ను తెచ్చుకోండి. దీపాలతో వెలుగుకే పరిమితం కాదు. గాలినీ శుద్ధి చేస్తాయి. వెచ్చదనాన్నీ అందిస్తాయి. అయితే సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను వెలిగిస్తే చుట్టూ ఉన్న వాతావరణం మరింత ప్లెసెంట్ మారుతుంది. çపుస్తక ప్రియులు ఒక ఫైబర్ బుక్ షెల్ఫ్‌ను కిటికీలకు దగ్గరగా అమర్చుకోవచ్చు. చినుకుల సొగసును ఆస్వాదిస్తూ, నచ్చిన పుస్తకం చదువుకుంటూ, వేడి వేడి తేనీటిని సేవించవచ్చు. ఇలా మీ సృజనకూ పని చెప్పి.. మాన్సూన్లో మీ ఇంటిని ఇంకింత అందంగా మలుచుకోవచ్చు.ఇవి చదవండి: ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది? -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
జుట్టు రాలడం.. బరువు తగ్గడం జింక్ లోపం కావచ్చు!
మన శరీరానికి జింక్ చాలా అవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.అకారణంగా జుట్టు రాలుతున్నా, బరువు తగ్గుతున్నా, గాయాలు త్వరగా నయం కాకపోతున్నా జింక్ లోపం గా అనుమానించాలి. ఇదే కాదు, శరీరంలో జింక్ లోపం ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయో, నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.గాయాలు నయం కాకపోవడం..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి.బరువు తగ్గడం..జింక్ లోపం వల్ల జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేకమైన ఇతర ఆరోగ్యసమస్యలూ ఉత్పన్నమవుతాయి.జుట్టు రాలడం..జింక్ లోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది కాబట్టి అకారణంగా జుట్టు రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. దానికి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుని సమస్య సద్దుమణిగితే నిశ్చింతగా ఉండవచ్చు.తరచూ జలుబు..జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది.చూపు మసక బారడం..ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మందగిస్తుంది. చూపు మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి.అయోమయం..మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.సంతానోత్పత్తిపై ప్రభావం..జింక్ లోపం పురుషులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రభావితమవుతుంది. మీరు తండ్రి కావాలనుకుంటే తప్పనిసరిగా జింక్ తీసుకోవడంపై శ్రద్ధ వహించాలి. తగినంత పరిమాణంలో జింక్ తీసుకోని పురుషులు తండ్రి కావడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.రోగనిరోధక శక్తి బలహీనం..శరీరానికి సంబంధించి అనేక విధులకు జింక్ అవసరమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది. కానీ మీ శరీరంలో జింక్ లోపం ఉంటే అది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని గుర్తుంచుకోండి.ఇలా నివారించాలి..జింక్ లోప నివారణకు శనగలు, గింజ ధాన్యాలు, పుచ్చగింజలు, జనపనార గింజలు, ఓట్స్, జీడిపప్పు, పెరుగు, డార్క్ చాకొలెట్లలో జింక్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జింక్ లోపం ఉన్నవారు ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.ఇవి చదవండి: వామ్మో..! పెరుగుతో.. వీటిని కూడా కలిపి తింటున్నారా..?? -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
ఇంటి శుభ్రతకై.. ఇలా చేస్తున్నారా? జాగ్రత్త!
ఇంటిని శుభ్రంగా ఉంచడం కోసం ముందుగా గుమ్మం దగ్గర ఉండే డోర్మ్యాట్ని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభించాలి. ఎందుకంటే మనం ఇంట్లోకి, బయటకి తిరిగేటప్పుడు కాళ్లకు ఉండే మట్టి అంటేది డోర్ మ్యాట్కే కాబట్టి డోర్ మ్యాట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి డోర్మ్యాట్ని మారుస్తుండాలి. అందుబాటులో ఉంచుకోవడం..– శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నింటినీ మన చేతికి అందేలా ఉంచుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. పని కూడా సులువు అవుతుంది.– కిటికీలు తెరిస్తే వెలుతురుతోపాటు దుమ్ము కూడా వచ్చేస్తుంది. అందుకే కిటికీల రెక్కలను కొద్దిసేపు తెరిచి ఉంచిన తర్వాత మళ్లీ మూసేయాలి.– ఇక కిటికీ అద్దాలకీ దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అంటి పెట్టుకుని ఉంటాయి. అందువల్ల కిటికీలను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే సీజనల్ అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు.బూజు దులపటం..– ఇంటినంతా చక్కగా కడిగి శుభ్రంగా ఉంచడంతో పాటు గోడ మూలల్లో ఉన్న బూజును కూడా దులపాలి.– ఇంట్లో చెత్తని తొలగించడంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండకూడదు.– ముఖ్యంగా బాత్రూమ్లో, వంటగదుల్లోనూ సూక్ష్మజీవులు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.– ఇంటి ముందు చెట్లు ఉంటే పరిశుభ్రమైన గాలి వస్తుంది. తేమ శాతం తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు.– ఇక ఇంటిని శుభ్రం చేయడమంటే చాలా పెద్ద సమస్య. వస్తువులను శుభ్రంగా కడిగే ముందు ఎక్కువగా దుమ్ము పేరుకునే వస్తువులను ముందుగా శుభ్రం చేసుకుంటే సగం పని అయిపోతుంది. దీనికి కింది సూచనలు పాటిస్తే సరిపోతుంది.సీలింగ్ ΄్యాన్స్..– సీలింగ్ ΄్యాన్లను తుడవకుండా ఉంటే వాటిపై దుమ్ము ఎక్కువగా చేరుతుంది. దానివల్ల ఇంట్లో ఉండే ఫర్నిచర్‌పై దుమ్ము పడుతుంది. కాబట్టి ఫ్యాన్‌ను మొదట శుభ్రం చేయాలి. కంప్యూటర్..– కంప్యూటర్, లాప్టాప్ కీబోర్డు ఎప్పటికప్పుడు శుభ్రం చే సుకోకపోతే తొందరగా పాడైపోయే అవకాశం ఉంది.టీవీ..– టీవీ స్క్రీన్‌ను ఒక శుభ్రమైన మెత్తటి బట్టతో తుడవాలి. అలాగే టీవికి ముందు వైపు కన్నా వెనుక భాగంలో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. దాన్ని దులపడటం చాలా అవసరం.అద్దాలు..– ఇంట్లో ఉండే అద్దాలను, గాజు పాత్రలను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టండి. ఇలా చేయటం వల్ల పాత్రలు కొత్తవిగా కనిపిస్తాయి.పక్కబట్టలు మడతపెట్టడం..– రోజంతా పని చేసిన తర్వాత వచ్చి సేదదీరేది బెడ్ మీదనే. మీ పడకగది మురిగ్గా ఉండటం చూస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. కాబట్టి నిద్ర లేవగానే దుప్పటిని దులిపి మడతబెట్టాలి. బెడ్‌షీట్‌ను నీట్‌గా సర్దాలి.దుస్తుల శుభ్రం..– ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే అలసట రావడం సహజమే, పైగా అందుకు ఎక్కువ సమయం కూడా పడుతుంది.– ధరించే దుస్తులలో రకాన్ని బట్టి వేటికవి విడదీసి ఉతికితే సులభంగా ఉంటుంది.చెత్తను వదిలించుకోవడం..– ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసి బయట పడేసి తర్వాత అన్నిటినీ సర్దటం మంచిది.– ఈ అలవాటును అందరూ తప్పక పాటించాలి.– వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి.– టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.– ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.– అలాగే మీకేదన్నా దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం మంచిది.నిద్రించే ముందే..– మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు అన్నిటినీ శుభ్రం చేసే అలవాటు చేసుకోవాలి.– ముఖ్యంగా పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి.– వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.పరిసరాల పరిశుభ్రత..మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి, పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం. ఇది అందరి బాధ్యత. ఇంటి శుభ్రత కోసం మీరొక్కరే కాదు, కుటుంబసభ్యులు కూడా కృషి చేయాలి. అలా మీరే తర్ఫీదు ఇవ్వడం అవసరం. చిన్న పిల్లలు కదా, వాళ్లేమి చేయగలరులే అని వదిలేస్తే, తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చిన్నప్పటినుంచి పిల్లలకు కూడా ఎక్కడ తీసిన వస్తు సామగ్రిని అక్కడ పెట్టడం అలవాటు చేయడం అవసరం.ఇవి చదవండి: తేలిగ్గా చేయగలిగే సింపుల్ ఎక్సర్సైజ్.. ఏంటో తెలుసా? -
వామ్మో.. మైనర్ల డ్రైవింగ్! జర జాగ్రత్త!!
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని పోలీస్ శాఖ విస్తృత ప్రచారం జనం చెవికెక్కడం లేదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఎక్కడా మార్పు కనిపించటం లేదు.పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా వినడం లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగదని జనం అభిప్రాయపడుతున్నారు.సోమవారం కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపిస్తూ ‘సాక్షి’ కంటపడగా క్లిక్ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
మౌత్ అల్సర్ నుంచి ఉపశమనానికై.. ఇలా చేయండి!
కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడటం, కొన్ని రకాల వ్యాధులతో బాధపడటం వల్ల నోటిలో పుళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఊరికినే కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏమైనా తాగినా, తిన్నా చాలా బాధగా ఉంటుంది. మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనెను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న కంకి ఒలిచేటప్పుడు వచ్చే సిల్క్ దారాల్లాంటి కార్న్ సిల్క్‌ను వృథాగా పడేస్తారు. కానీ అవి కిడ్నీ రాళ్లను బయటకు పంపడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. వాటిని నీటిలో ఉడికించి చల్లారాక వడగట్టి తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో కొత్తగా రాళ్లు ఏర్పడవు. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడంలో కార్న్ హెయిర్ ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లను తరచూ తాగడం, కొబ్బరి నూనెను పూయడం, అలానే ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా నోటిపూత తగ్గుతుంది. ఎందుంకటే కొబ్బరి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మాని΄ోతుంది.పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఎంతో ఉపశమనం గా ఉంటుంది.తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. రోజుకు నాలుగైదు సార్లు తులసాకులు నమలడం వల్ల నోటిపూత తొందరగా తగ్గి΄ోతుంది.చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా నోటిపూతను తగ్గిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..? -
కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి!
రాత్రిపూట మంచి నిద్రలో ఉన్నప్పుడు హఠాత్తుగా మెలకువ వస్తుంది. ఏ బాత్ రూమ్‌కో వెళ్లాల్సి వచ్చి కాలు కింద పెడదామని చూస్తే అడుగు ముందుకు పడదు. పిక్కలు, కండరాలు పట్టేసినట్లుంటుంది. చాలామందికి ఇదొక బాధాకరమైన అనుభవం. అంతేనా.. మండుటెండలో చెమట పట్టేలా కష్టపడుతున్నప్పుడు ఉన్నట్లుండి తొడ కండరాలు పట్టేసి విపరీతమైన బాధతో కుంటుతూ నడవాల్సి వస్తుంతది. ఒక్కోసారి మంచి చలికాలంలో వేళ్లు కొంకర్లుపోయినట్లుగా అయి΄ోయి ఎంత ప్రయత్నించినా అవి అలాగే బిగుసుకు΄ోయి బాగా నొప్పితో పళ్ల బిగువున బాధను అణిచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. దీనినే కండరాలు పట్టెయ్యడం లేదా మజిల్ క్రాంప్స్ అంటారు. దీనికి కారణాలు, నివారణోపాయాలను తెలుసుకుందాం.మనం శారీరక శ్రమ చేసినప్పుడు చెమటతో పాటు ఉప్పు రూపంలో సోడియమ్ ను కూడా చాలా వరకూ కోల్పోతాం. సోడియమ్ తగ్గడం వల్ల శరీరంలోని కండరాలు...ముఖ్యంగా పిక్క, తొడ, భుజం కండరాలు పట్టేసినట్లుగా నొప్పికి గురవుతాయి. అందుకే చాలామందికి ఎండాకాలంలో తరచూ ఈ సమస్య ఎదురవుతుంది. వేసవికాలంలో ఆటగాళ్లు చాలామంది ఈ సమస్యకు గురవుతుంటారు. ఇంకా కొందరిలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అయినప్పుడు కూడా సోడియమ్‌ను కోల్పోతారు. అలాంటివారిలో కూడా ఒళ్లు నొప్పులు రావడం, నీరసపడి΄ోవడం జరుగుతుంది.కారణాలు...మహిళల్లో చాలామంది కుటుంబ సభ్యులకు తినిపించడంలోనే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ, తాము తినడానికి రెండో ్రపాధాన్యత ఇస్తుండటం వల్ల వారికి తగిన క్యాల్షియం, ఇతరపోషకాలూ సరిగా అందక ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా... థైరాయిడ్..మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల వచ్చే వ్యాధిని హై΄ోథైరాయిడిజమ్ అంటారు. హై΄ోథైరాయిడ్ ఉన్నవారికి మజిల్ క్రాంప్స్ ఎక్కువగా వస్తుంది. ఇది ఏ వయస్సు వారికైనా రావచ్చు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే ఎక్కువ దూరం పరుగెత్తలేరు. మహిళలకైతే రాత్రి సమయంలో పిక్కలు నొప్పిపెడుతుంటాయి. మగవారు కూడా ఎక్కువ దూరం నడవలేరు.శరీరం ద్రవాలు కోల్పోవడం..సాధారణంగా శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల కండరాలు అకస్మాత్తుగా బిగుసుకు΄ోతాయి. వాంతులు, విరేచనాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, శారీరక శ్రమ వల్ల కూడా ఇలా కావచ్చు. ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళన, పని ఒత్తిడి, టైట్ షెడ్యూల్స్, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు మజిల్ క్రాంప్ సమస్య అధికంగా ఉంటుంది.నివారణ..వేసవిలో వచ్చే మజిల్ క్రాంప్స్ నివారణకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం నుండి ద్రవాలను కోల్పోకుండా చూసుకోవాలి.ఒకవేళ ఎక్కువగా ద్రవాలను కోల్పోయే పరిస్థితి ఉంటే నిమ్మకాయ రసంలో ఉప్పు కలుపుకుని తాగడం లేదా కొబ్బరినీళ్లు తాగడం... ఈ రెండూ అందుబాటులో లేక΄ోతే కనీసం కాసిని మంచి నీరు తాగడం. తాజాపండ్లు తినడం మంచిది.క్యాల్షియమ్ లోపం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తుంటే క్యాల్షియమ్ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. దానికి మనం తినే ఆహారంలో పాలు, పాల ఉత్పాదనలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.చలి కారణంగా వచ్చే మజిల్ క్రాంప్స్‌ను నివారించడానికి ఉన్ని దుస్తులు ధరించాలి. చలికి ఎక్కవగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పొగతాగడం, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయాలి.ఒత్తిడి వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి ∙హై΄ోథైరాయిడిజమ్ వల్ల వచ్చే మజిల్ క్రాంప్స్‌ను తగ్గించడానికి తగిన చికిత్స తీసుకోవాలి.ఇవి చదవండి: ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే! -
ప్రతిరోజూ ఓ అరగంట నడిచారో.. ఈ సమస్యలిక దూరమే!
మనకు తెలిసిన విషయమే కదా అని తేలిగ్గా తీసిపారేయద్దు. అలాగే బద్ధకించవద్దు. క్రమం తప్పకుండా రోజూ ఓ అరగంట పాటు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. స్లిమ్‌గా ఉండవచ్చు. డయాబెటిస్, బీపీ వంటి వాటికి దూరంగా ఉండచ్చు.అన్నింటికీ మించి రోజంతా ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉండచ్చు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నడవడం కాదు... మన నడక ఎలా ఉండాలి... ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడవాలి... వంటి ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం..!క్రమం తప్పకుండా నడవడం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా, శారీరక వ్యాయామాలు, కార్యకలాపాలు ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఇతర సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయని చెబుతారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాల పాటు చేసే మార్నింగ్ వాక్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.వ్యాయామాలన్నింటిలోనూ అతి తేలికపాటి వ్యాయామం ఏదంటే నడకే అని చెప్పచ్చు. బరువును నియంత్రించడంలో, కేలరీలను కరిగించడంలో వాకింగ్‌ను మించిన మందే లేదు. క్రమబద్ధమైన నడక వార్థక్య ఛాయలను నివారిస్తుంది. అయితే ఆ నడక ఎలా ఉండాలి... ఎప్పడు చేయాలో చూద్దాం...శక్తిని పెంచుతుంది..మార్నింగ్ వాక్ ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతోనే చేయాలి. అలా ఖాళీ కడుపుతో చేసే మార్నింగ్ వాక్ శక్తి స్థాయిని పెంచుతుంది. శరీరం, మనస్సు సాంత్వన పొంది, కణజాలాలు శక్తిని పొందేలా చేస్తుంది. వాకింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ శక్తి స్థాయులను పెంచడానికి గొప్ప మార్గం. ఇది అలసట తగ్గించి,, ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.గుండెకు బలాన్నిస్తుంది..రోజూ ఉదయాన్నే అరగంటపాడు చురుగ్గా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సాధారణ వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని, రక్త΄ోటును తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పును ముందుగానే తగ్గించుకోవచ్చు.జీర్ణవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది..జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడవడం మంచిది. ఈ అభ్యాసం మీ ఉదర కండరాల సహజ సంకోచాన్ని ్ర΄ోత్సహిస్తుంది.మానసిక బలంరోజూ నడవడం వల్ల మెరుగైన ఆత్మగౌరవం, మెరుగైన మానసిక స్థితి, ఆందోళన సమస్యలతో సహా మీ మానసిక ఆరోగ్యానికి వాకింగ్ గొప్ప ప్రయోజనాలను కలిగిస్తుంది. శారీరక శ్రమ మీ శరీరం మానసిక స్థితి ఆత్మగౌరవాన్ని మెరుగుపరిచే ఎండార్ఫిన్ లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.చక్కటి నిద్ర: తెల్లవారుజామున వెలువడే సూర్యరశ్మి సహజంగా మీ సిర్కాడియన్ రిథమ్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీ దినచర్యకు 30 నిమిషాల మార్నింగ్ వాక్ అలవాటుతో మీ మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. శారీరక శ్రమ మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది.పనితీరు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాకింగ్ వంటి మితమైన వ్యాయామం, కాలక్రమేణా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే వాయిదా వేయకుండా నడుద్దాం. నడకను పడక ఎక్కనివ్వకుండా చూద్దాం.ఖాళీ కడుపుతో 30 నిమిషాల మార్నింగ్ వాక్ అనే నియమాన్ని అలవాటుగా చేసుకోవటం వల్ల రోజంతా శక్తిని పొందుతారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వార్థక్య లక్షణాలు తొందరగా దరిచేరకుండా ఉంటాయి. దీనిని తేలిగ్గా తీసేయకుండా దిన చర్యలో చేర్చడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. -
World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!
తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..చుట్టుపక్కల చూడరా...ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్‌కు అప్పగించింది.‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.ఆ విషాదంలో నుంచే..కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.సుప్రజఒకరోజు పెరియ నీలంకరై బీచ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్‌లాంటి ఎన్నో అవార్డ్లు అందుకుంది సుప్రజ.విజ్జీ–ది టర్టిల్ గర్ల్..భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్పార్క్లోకి వాలంటీర్‌గా అడుగుపెట్టింది విజయ.విజయఅప్పుడు ఆమె మద్రాస్‌లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్పార్క్లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.అరుణోదయం..ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలిఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.నుపుల్ కాలే‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్‌వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్‌లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు! -
ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు!
ఆస్ట్రేలియాలో ‘బేర్‌ఫుట్ వాకింగ్’ ఇప్పుడు చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. ఉత్తకాళ్లతో నడవడం భారతీయులకు వేల ఏళ్లుగా తెలిసినా ఆ తర్వాత వ్యాయామ నడక కోసం తగిన షూస్, చెప్పులు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. కాని ‘భూమితోపాదాలను తాకించడం’ వల్ల ఆరోగ్యమని ఇంకా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఉత్తకాళ్ల నడక ప్రయోజనాలేమిటి?ఆస్ట్రేలియాలో ఉత్త కాళ్లతో నడవడం ఇప్పుడు ఒక వ్రతంలా పాటిస్తున్నారు. కొందరు మార్నింగ్ వాక్ కోసం ఉత్త కాళ్లను ఉపయోగిస్తుంటే మరికొందరు ఎల్లవేళలా చెప్పులు, షూస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇదొక పెద్ద ధోరణిగా మారిందక్కడ. మన దేశంలో చెప్పుల్లేనిపాదాలతోనే జనం నడిచారు. ఇప్పటికీ నడిచేవారున్నారు. కాని ఆరోగ్య చర్యల్లో భాగంగా చెప్పుల్లేకుండా భూస్పర్శను ΄÷ందడం అనేది మెల్లమెల్లగా మన దేశంలోనూ కనిపిస్తోంది. గతంలో చూస్తే చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ తన జీవితంలో ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. ఆయన ఎన్ని దేశాలు తిరిగినా ఖాళీపాదాలతోనే తిరిగాడు. ఇక ఇటీవల యువ దర్శకుడు అనుదీప్ ఖాళీపాదాలతో నడకను ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వారైనా గానీ, ఇలా నడవడాన్ని ఇష్టపడుతున్నవారుగానీ చెబుతున్నదేమిటి? ఇలా నడవడం వల్ల ఉపయోగాలేమిటి?ఎక్కడ నడవాలి: ఉత్తపాదాలతో నడిచే వారు కూసు రాళ్లు లేదా ముళ్లు లేని మట్టి బాటల్లోగాని, గడ్డి మైదానంలోగాని, ఇసుక దారుల్లోగాని నడవడం మంచిదని నిపుణులు అంటున్నారు. సూపర్ మార్కెట్లో లేదా నున్నటి రాళ్లు పరిచిన స్థలాల్లో నడిస్తే జారి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.1. ప్రకృతితో అనుసంధానంప్రకృతిలో పుట్టిన మనిషి ప్రకృతితో అనుసంధానం కావడం లేదు. ప్రకృతి స్పర్శను అనుభవించడం లేదు. ఏíసీ గదుల్లో ఉంటూ కాలికి నేలంటకుండా జీవిస్తున్నాడు. నేల తగిలితే– కాలి కింద భూమికి ఉన్న రకరకాల స్వభావాలు అంటుతూ ఉంటే ప్రకృతితో ఒక అనుసంధానం ఏర్పడుతుంది. వినమ్ర భావన కలుగుతుంది. ఇంకా మామూలు భాషలో చె΄్పాలంటే కళ్లు నెత్తికెక్కి ఉంటే అవి కిందకు దిగుతాయి.2. విద్యుదయస్కాంత సమతుల్యతఖాళీపాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగెటివ్ అయాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల శరీరంలో పేరుకున్న అయాన్లను ఇవి బేలెన్స్ చేస్తాయి. దాని వల్ల శరీరంలోని విద్యుదయస్కాంత స్థితి సమతుల్యం అవుతుంది. దీంతో వాపులు తగ్గడం, నిద్ర బాగా పట్టడం వీలవుతుంది.3. ఒత్తిడి దూరంఖాళీపాదాలతో నడవడం వల్లపాదాలలో ఉండే నరాలు క్రమబద్ధంగా తాకిడికి లోనవుతాయి. దాని వల్ల ఒత్తిడి దూరమయ్యి సేదదీరిన భావన కలుగుతుంది.4. సరైన పోశ్చర్ఖాళీపాదాలతో నడిచినప్పుడుపాదాలు, కాళ్లు, మడమలు అనుసంధానంలోకి వస్తాయి. చెప్పులు లేదా షూస్ వేసుకుని నడిచేటప్పుడు తెలియకనే నడకపోశ్చర్ మారుతుంది. కాని ఖాళీపాదాలతో నడిచేటప్పుడు నడకకు వీలుగా శరీరం సరైనపోశ్చర్కు వస్తుంది. అంతేకాదు కాలి కండరాలు బలపడతాయి. శరీరాన్ని సరిగ్గా బేలెన్స్ చేస్తూ నడవడం తెలుస్తుంది. కాళ్లను పూర్తిగా ఆన్చి నడవడం వల్ల నడకలో కుదురు వస్తుంది.5. రక్తప్రసరణ ఖాళీపాదాలతో నడవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పాదంపై ఒత్తిడి పడటం వల్ల రక్తప్రసరణలో చురుకు వచ్చి గుండెకు మేలు జరుగుతుంది. అంతేకాదుపాదాలపై ఉండే మృతకణాలు వదిలి΄ోయి చర్మం మెరుగవుతుంది. -
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్యాకెట్లపై ఆకర్షణీయమైన ఫొటోలు, తక్కువ ధరలు ఆఫర్లు చూసి మోసపోవద్దు. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. విత్తనాల బెడద రైతులకు సవాల్‌గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లోకి వస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని చేయాలని వ్యసాయాధికారులు సూచిస్తున్నారు.తక్కువ ధరలు, ఆఫర్లు నమ్మొద్దు.. వర్షాలు పడితే చాలు రైతుల హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరుతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆ ఆఫర్ల కోసం డీలర్లు రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండవచ్చు. ఫొటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీ వారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం మంచిదని వ్యవసా«యాధికారులు పేర్కొంటున్నారు.రైతులు తీసుకోవాలి్సన జాగ్రత్తలు..1. గుర్తింపు పొందిన దుకాణం నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తేనే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.2. విత్తనాలు కొన్న అనంతరం దుకాణం నుంచి తప్పనిసరిగా రశీదు తీసు కోవాలి.3. విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్‌పై ఉన్న లేబుల్, లాట్ నంబర్ రశీదుపై నమోదు చేసుకొని, భద్రపర్చుకోవాలి.4. తొలుత విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్‌పై చూసి కొనాలి.విత్తనాలపై అవగాహన ఉండాలి..విత్తనాలపై రైతులు అవగాహన ఉండాలి. కొన్న ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. రసీదులు, ప్యాకెట్లను భద్రపర్చుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో నాసిరకమా? అనేది చూసుకోవాలి.– వెండి విశ్వామిత్ర, వ్యవసాయాధికారి, బోథ్ -
ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఒక్క నిమిషం.. ఫోన్ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్ ఫోన్ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్‌లు సూచిస్తున్నారు.ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్ ఫోన్. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్ ఫోన్‌తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయలేకపోయినా, రాత్రి ఫోన్ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.కేస్‌స్టడీ.. 1ఆఫీస్ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్ అయ్యాడు. ఫోన్ గుర్తొచ్చింది. టీ పాయ్ మీద లేదు. టీవీ ర్యాక్ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్‌తో రింగ్ చేయించాడు. రింగ్ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్ వినపడలేదు. సుందర్‌కు చెమటలు పట్టాయి. మైండ్ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్ కొని ఫోన్‌పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్.. మొబైల్ ఫోన్.. అదిపోతే... అదిపోతే... మైండ్ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్ లో అయి ఉంది’ అని. ఫోన్ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.కేస్ స్టడీ.. 2ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్‌లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్ ఫోన్ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్‌కు నోమొ ఫోబియా ఉంది.కేస్ స్టడీ.. 3దుర్గారావు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అందవని. కాల్స్ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్ కోసం హోటల్ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.నష్టాలు..1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్‌తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్‌ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్‌ను నష్టపోతారు. పనులు పెండింగ్‌లో పడతాయి.3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్‌ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.4. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.5. ఫోన్ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్‌ని కనిపెట్టుకుని ఉంటారు.ఎలా బయటపడాలి?1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్‌ను పక్కన పడేయడంప్రాక్టీస్ చేయండి.2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మొదలుపెట్టండి.3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లో పడేయడమో, మ్యూట్ చేసి జేబులో పడేయడమో చేయండి.4. ఫోన్ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.6. ఫోన్లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్ కంప్యూటర్లోనో మెయిల్స్లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్ ఎప్పుడుపోయినా మరో సిమ్ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు! -
తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?
జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్–హైదరాబాద్, ఎన్ఐఎన్ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్‌లైన్స్ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్‌లైన్స్‌లో ముఖ్యమైనవి..మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్ సప్లిమెంటరీ ఫుడ్‌ను ఇవ్వాలి.చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్‌ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.కండలు పెంచేందుకు ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.ఇవి చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! -
బిహార్ మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కేన్సర్ ఎలాంటిదంటే?
బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్‌కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి. గొంతు కేన్సర్‌కు కారణమేమిటి?– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది.– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్‌లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి -
ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్‌ఫామ్ గురించి సింగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్స్ లేదా మెటల్ ఫెన్స్ లేదా రోజ్ హెడ్ నెయిల్స్ సహాయంతో వ్యవసాయ సీజన్ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్ షీట్ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్ షీట్ కప్పి చైన్‌లింక్ ఫెన్స్‌కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం! -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్‌లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్‌తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్‌గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్‌లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
మీ బ్రెయిన్ ఆక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్లో విటమిన్ బి12 ఉండేలా చూసుకోండి.అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్‌గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్డోర్ గేమ్స్ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు! -
నగరం ఓటెత్తాలని..
జీహెచ్ఎంసీ సిబ్బంది బస్తీలు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మీకు ఓటుందా అని అడిగి.. ఒకవేళ ఓటు ఉంటే.. తప్పకుండా ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రం వైపు అడుగులేసేలా వారిని ఒప్పిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని జీవీకే వన్‌మాల్‌లో ఇటీవల ఓ ఫ్లాష్‌మాబ్‌లో భాగంగా మోడరన్, శాస్త్రీయ నృత్యాలూ ప్రదర్శించారు. ఎందుకిదంతా అని చూస్తే ‘నా ఓటు–నా హక్కు’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. జీహెచ్ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల సభ్యులు, రిసోర్స్‌పర్సన్స్ వారి పిల్లలతో నిర్వహించిన ఈ కార్యక్రమం మాల్‌కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఓటుపై ఆలోచనలో పడేసింది. పరమపద సోపానం (వైకుంఠపాళి) ఆటలో స్వర్గానికి చేరుకునేందుకు మెట్లెక్కించే నిచ్చెనలు, పాతాళానికి పడిపోయేలా మింగేసే పాములు ఉండటం తెలిసిందే. ఆ ఆటలో ఎప్పుడు పాము మింగుతుందో, ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో తెలియదు కానీ.. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంధకారమవుతుంది అని చెబుతూ ఏ పనులు చేస్తే నిచ్చెన ఎక్కవచ్చో, ఏవి చేస్తే పాతాళానికి పడిపోతారో తెలియజేసేలా ఖైరతాబాద్ సర్కిల్లో పరమపద సోపానం ఆటతోనూ అవగాహన కల్పించారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్షరాస్యతశాతం ఎక్కువగా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్‌కు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగానూ మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 287 ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు, ప్రైవేట్ వ్యాపారాలు సాగిస్తున్న వారితోపాటు ఉద్యోగుల్లో సైతం ఇదే వైఖరి ఉంది. అందుకే వారికి కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులతో 158 ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీటితోపాటు 584 పోలింగ్ బూత్‌ల పరిధిలో అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ బూత్ పరిధిలోని వారిని పోలింగ్ కేంద్రాల దాకా అడుగేసేలా చేయడం ఈ గ్రూపుల పని. ‘వాక్ టు పోలింగ్ స్టేషన్’ పేరిట కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెరిగేందుకు పనిచేస్తున్నాయి.ఇంకా ఏం చేస్తున్నారంటే.. 18 ఏళ్లలోపు విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం రూపొందించే వీడియోల్లో ఉత్తమమైన పది వీడియోలకు రివార్డులివ్వనున్నారు. బూత్‌లెవెల్ అధికారులు తమ బూత్‌లో పోలింగ్‌శాతాన్ని గతంలో కంటే పదిశాతం పెంచితే రూ. 5 వేలు రివార్డుగా ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆదివారం నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5కే రన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ బోర్డులపై ఎన్నికల సమాచారం తెలియజేస్తున్నారు. ఓటరు అవగాహనకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వెబ్సైట్లోనూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. వారానికోమారు ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్లెట్ల వద్ద ఓటరు అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛఆటోల మైకుల ద్వారానూ ప్రచారానికి సిద్ధమయ్యారు.ఇప్పటి వరకు..» స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కింద నా ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే ప్రతిజ్ఞతో ప్రసాద్స్ ఐమాక్స్‌లో, కొన్ని పార్కుల్లో భారీ తెరలపై సంతకాల సేకరణ చేపట్టారు. » జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో, పాతబస్తీలోని మక్కా మసీదులోనూ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. » ఓటు వేస్తాననే సంకల్ప పత్రాలను విద్యార్థులకు అందజేస్తూవాటిపై వారి తల్లిదండ్రులు సంతకాలు చేశాక తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అలా దాదాపు రెండు లక్షల సంకల్ప పత్రాలు సేకరించారు. » ఓటుహక్కు గురించి బస్తీల్లో, కాలనీల్లో క్విజ్లు, మెహందీలు, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులందజేస్తూ ఆసక్తి కల్పిస్తున్నారు. » ఒక ఆదివారం హెరిటేజ్ వాక్ నిర్వహించిన సందర్భంగా దారుల్షిఫా నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వరకు ఓటు హక్కుకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు. » పార్కులు, బస్స్టేషన్లు, గోడలపై రాతల ద్వారానూ, రేషన్‌షాపులు, సిటిజె¯న్ సర్వీస్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. » ఓట్’ అనే అక్షరాల్లా కనిపించేలా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.ఎన్నికల దాకా..ఎన్నికలు జరిగేంత వరకు ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో స్వీప్ కార్య క్రమాలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఇప్పటికే నిర్వహించిన 2కే రన్లో సీఈఓ వికాస్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు. -
Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స!
ఈ ఫొటోను చూడండి. ఇందులో ఉన్నది షుగర్ పేషెంట్లు. ఒకరితో ఒకరు షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ అవగాహన కల్పించుకుంటున్నారు. ‘చికిత్స కంటే అవగాహన ముఖ్యం’ అంటారు ప్రియా దేశాయ్. బెంగళూరులో ఆమె పేదవారి కోసం ఉచిత క్లినిక్‌లు నడుపుతున్నారు. డయాబెటిస్, బి.పి ఉన్న వారికి సదస్సులు నిర్వహిస్తూ ఉచిత మందులు అందేలా చూస్తున్నారు. ప్రతి ఉదయం ఈ క్లినిక్‌ల ముందు క్యూ కట్టే పేషెంట్లను చూస్తే ప్రియా సేవ తెలుస్తుంది.బెంగళూరులోని శాంతి నగర్లో ఉన్న ‘అనాహత్’ క్లినిక్‌కు వెళితే ఒక బోర్డు మీద ఐదారు రకాల భోజనం ప్లేట్ల ఫొటోలు ఉంటాయి. వాటిలో రొట్టె, కూర, అన్నం, ఇతర కూరలు ఉంటాయి. ప్రతి ప్లేట్ కింద స్టార్లు ఇచ్చి ఉంటారు. ఐదు స్టార్లు ఇచ్చిన భోజనం ప్లేట్‌ను ఆహారంగా తీసుకోవాలని బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సులభంగా అర్థమయ్యేలా చె΄్తారు. మీ ప్లేట్లో ఏముంది అనేదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఈ క్లినిక్‌లో వారానికి రెండుసార్లు జరిగే అవగాహన సదస్సుల్లో తెలియచేస్తారు. ఇలాంటి అవగాహన దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీల తీవ్రతను తగ్గిస్తాయని అంటారు ప్రియా దేశాయ్. ఆమె ఈ క్లినిక్ నిర్వాహకురాలు.10 వేల మందికి ఒక క్లినిక్బెంగళూరు జనాభా కోటీ ముప్పై లక్షలకి పైనే. కాని ఇక్కడ మొత్తం 147 ్ర΄ాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రే ఉన్నాయి. అంటే దాదాపు 80 వేల మందికి ఒక క్లినిక్. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా 30 వేల మందికి ఒక క్లినిక్ ఉండాలి. ఆదర్శవంతమైన ΄ాలనా నిర్వహణ అంటే 10 వేల మందికి ఒక క్లినిక్. ఇలాంటి స్థితిలో పేదలకు ఎలా మంచి వైద్యం అందుతుంది అని అడుగుతారు ప్రియా దేశాయ్. జర్నలిజం అభ్యసించిన ప్రియ తన తల్లి రాణీదేశాయ్ స్ఫూర్తితో వైద్య సేవారంగంలోకి వచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన రాణీ దేశాయ్ తన కుమార్తెతో కలిసి ‘అనాహత్ క్లినిక్’కు అంకురార్పణ చేశారు. బెంగళూరులో ఉన్న పేదలకు వైద్యం అందించాలనేది అనాహత్ సంకల్పం. నేరుగా క్లినిక్‌కు వచ్చేవారికి వైద్యం అందిస్తూనే హెల్త్ క్యాంప్స్ ద్వారా స్లమ్స్‌లో వైద్య చికిత్స అందించడం అనాహత్ లక్ష్యం. ఇప్పటికి 3 లక్షల మందికి హెల్త్ క్యాంప్స్ ద్వారా వైద్యం అందించారు ప్రియ తన తల్లి రాణీదేశాయ్ చేయూతతో.బీపీ, షుగర్ బాధితులు‘నగరాల్లో పని చేసే దిగువ ఆదాయ వర్గాల వారు సమయానికి భోజనం చేయరు. ఆహార అలవాట్లు, నిద్రలో క్రమశిక్షణ ఉండదు. శరీరాన్ని పట్టించుకోరు. దానివల్ల బీపీ బారిన పడుతున్నారు. షుగర్ వచ్చిన వారికి షుగర్ వచ్చిన సంగతి కూడా తెలియడం లేదు. మా క్లినిక్‌కు రోజుకు వంద మంది వస్తారు. ఎక్కువ మందికి ఇవే సమస్యలు. మా కౌన్సిలింగ్స్ వల్ల ఎక్కడ ఏ పనిలో ఉన్నా రాత్రి ఎనిమిదికి భోజనం చేయడం నేర్చుకున్నారు చాలామంది’ అంటారు ప్రియా దేశాయ్. మిత్రుల దాతల సహాయంతో ఈ క్లినిక్‌ను నడుపుతున్న ప్రియ తగిన సహాయం దొరికితే సేవను విస్తరించవచ్చు అని తపన పడుతుంటారు. 70 రకాల పరీక్షలుఅనాహత్ క్లినిక్‌లో 70 రకాల టెస్ట్‌లు ఉచితంగా చేస్తారు. 100 రకాల మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుల పరీక్ష ఉంటుంది. వీరే కాకుండా ఫిజియోథెరపిస్ట్లూ సేవలు అందిస్తారు. ‘ఆనంద’ అనే కార్యక్రమం ద్వారా సైకియాట్రీ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. ‘అన్నింటికంటే ముఖ్యం మేము పేషెంట్స్‌ను ఒక కమ్యూనిటీగా మారుస్తాం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిని ఒక గ్రూప్‌గా చేసి వారే ఒకరితో మరొకరు మాట్లాడుకుని తామంతా ఈ వ్యాధులను ఎదిరించవచ్చు అనే ధైర్యం పొందేలా చేస్తాం’ అన్నారు ప్రియ. చికిత్స అందించడం ఎంత ముఖ్యమో వ్యాధి పట్ల అవగాహన, నివారణ అంతే ముఖ్యమని భావిస్తారు ఈ క్లినిక్‌లో. అందుకే బెంగళూరు పేదలు అనాహత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రియను, ఆమె తల్లి రాణి దేశాయ్‌ను అభిమానిస్తున్నారు.‘స్లమ్స్‌లో ఉన్నవారు క్లినిక్స్‌కు రారు. స్లమ్స్‌లో హెల్త్ క్యాంప్స్ విస్తృతంగా... క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడి చికిత్స మొదలవుతుంది. లేకుంటే అనవసర మరణాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే అందరూ ఈ విషయమై ముందుకు రావాలి’ అని కోరుతున్నారు ప్రియ. -
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!!
పనీర్‌తో ఎన్ని రకాలు వండవచ్చో తెలుసా! అలాగే ఒక కేజీ పనీర్ తయారు కావాలంటే ఎన్ని పాలు కావాలో తెలుసా? పాలను విరగ్గొట్టి నీరు మొత్తం కారిపోయే వరకు బరువు పెట్టి ఎదురు చూసే సమయం ఎవరికీ ఉండడం లేదు. పైగా మనం ఇంట్లో తయారు చేసే పనీర్ మెషీన్లో చేసినట్లు క్యూబ్స్‌గా రావడం కష్టం. రెస్టారెంట్లో తిన్న పనీర్లాగ ముక్కలుగా ఉంటే తప్ప పిల్లలు ఇష్టపడరు. ఇంకేం చేస్తాం... రెడీమేడ్‌గా మార్కెట్లో దొరికే పనీర్ తెచ్చుకుని సింపుల్‌గా వండేస్తాం.పనీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిన తర్వాత ఇటీవల పనీర్ వాడకం పెరిగింది. అయితే వాడకం పెరిగినంత వేగంగా పనీర్ తయారీ పెరుగుతోందా? పనీర్ లభ్యత పెరుగుతోంది కానీ సహజమైన పనీర్ తయారీ జరగడం లేదు. మార్కెట్లో దొరికే పనీర్‌లో అసలు కంటే నకిలీ ఎక్కువ.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఢిల్లీ– ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఉన్న ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేసినప్పుడు 13వందల కిలోల నకిలీ పనీర్ దొరికింది. దొరికింది గోరంతే, నిజానికి నకలీ పనీర్ వ్యాపారం కొండంత జరుగుతోంది. మనం ఇంట్లో వండుకోవడానికి కొనుక్కున్న పనీర్ అసలుదా కల్తీదా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే పరీక్షించుకోవడానికి మూడు పద్ధతులను తెలియచేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.పనీర్ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. పనీర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్ అయితే రంగు మారదు.పనీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్‌ను వాడుకోవచ్చు.ఇంత ప్రక్రియ లేకుండా వాసన ద్వారా కూడా పనీర్ స్వచ్ఛతను గుర్తించవచ్చు. కంపెనీ ప్యాకింగ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర లేకుండా లూజ్‌గా అమ్ముతుంటారు. ఆ పనీర్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని వాసన చూడాలి. పాల వాసన వస్తే అది మంచి పనీర్. అప్పుడు రుచి చూడవచ్చు. మెత్తగా పాల రుచిని గుర్తు చేస్తుంటే కొనుక్కోవచ్చు. అలా కాక నమిలినప్పుడు రబ్బర్లాగ సాగుతుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు. అలాగే పాలతో చేసిన పనీర్ అయినా సరే పుల్లటి వాసన వస్తుంటే అది సహజమైనదే అయినా తాజాగా లేదని అర్థం. దానిని కూడా కొనకూడదు.నిర్ధారిత అధీకృత ముద్ర, కంపెనీ ప్యాకింగ్ ఉన్న పనీర్ కొనేటప్పుడు కూడా దాని కాల పరిమితిని సరి చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు.పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. పాల వ్యాపారులు ఒకప్పుడు పాలను కల్తీ చేసేవాళ్లు. ఇప్పుడు నకిలీ పాలను తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో? ఎక్కడ తింటున్నామో? ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీంచుకోవాలి, పరీక్షించుకోవాలి. -
Dr Evita Fernandez: సిజేరియన్లను తగ్గించడమే లక్ష్యం...
‘‘ప్రసవం స్త్రీకి పునర్జన్మ లాంటిది. ఆ మరుజన్మ ఆమెకు ఎంతో ఆనందకరమైన అనుభూతిగా జీవితాంతం మిగిలి΄ోవాలి. అందుకోసమే నా కృషి’ అన్నారుహైదరాబాద్లోని ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ చెయిర్‌పర్సన్, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్. ప్రసవ సమయంలో కీలకమైన మంత్రసానుల ఆవశ్యకతను గుర్తించి చేపట్టిన శిక్షణా కార్యక్రమాలతో ΄ాటు గర్భిణులకు ప్రీ చైల్డ్ బర్త్ అవేర్నెస్ క్లాసులను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మిడ్వైఫరీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ఈ డాక్టర్ 2011లో తెలంగాణలో మొట్టమొదటి ్ర΄÷ఫెషనల్ మిడ్వైఫరీ సర్వీసెస్ ్ర΄ారంభించారు. మే5 ‘ఇంటర్నేషనల్ మిడ్వైఫ్ డే..’ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎవిటాను కలిసినప్పుడు మాతాశిశు సంరక్షణలో మంత్రసానుల కీలక ΄ాత్ర, గర్భిణులకు అవగాహన కలిగించే ఎన్నో విషయాలను తెలియజేశారు. ‘‘సాధారణ ప్రసవాలను ్ర΄ోత్సహించాలి. అవసరం లేని సిజేరియన్స్ శాతాన్ని తగ్గించాలి. మాతా, శిశు సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఐదేళ్లలో సిజేరియన్ల శాతం బాగా తగ్గించగలిగాం. దీనికి గర్భిణుల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. మహిళలు తమ శరీరం గురించి అర్ధం చేసుకుని, భయాలు తొలగి΄ోయేలా, ప్రసవానికి సంబంధించి వీలైనంత అవగాహన పెంచుకుంటే ఒత్తిడిని తగ్గించుకొని ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి ప్రసవం గౌరవప్రదంగా, ఆనందకరమైన అనుభవంగా మారాలి. అందుకు తగిన ప్రణాళికలు ఎప్పుడూ చేస్తుంటాం.ప్రసూతి సేవలకు వెన్నెముకమంత్రసాని వ్యవస్థ స్త్రీ చుట్టూ, స్త్రీల కోసం కేంద్రీకృతమైంది. గర్భవతికి మద్దతు, గోప్యత, విశ్వాసం కలిగిస్తుంది. 2007 నాటికి ఏడాదికి 5వేలకు పైగా డెలివరీ చేసేవాళ్లం. ఎంతోమంది గర్భిణులు ముఖ్యంగా చిన్నవయసు వారిలో ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు నన్ను బాగా కలిచి వేసేవి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల గురించి చదవడం, తెలుసుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పటిదాకా మేం అనుసరించిన ప్రసవ పద్ధతుల్లో మార్పులు అవసరం అని గ్రహించాను. ఈ క్రమంలో ప్రసూతి మరణాల రేటు తక్కువ ఉన్న దేశాలు మిడ్వైఫరీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిసింది. అయితే, మన దేశంలో ఆ వెసులుబాటు లేదు. ఒకప్పుడు గ్రామాల్లో ఒక అనుభవం ఉన్న మంత్రసాని ఉండేది. తల్లిలా చూసుకునే అనుభవజ్ఞురాలైన మంత్రసాని దేశంలోని అన్ని ఆసుపత్రులలో ఉండటం అత్యవసరం అనిపించింది. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలకు అత్యున్నత స్థాయి గల ప్రసూతి సంరక్షణ అవకాశాన్ని కలిగించవచ్చని అనిపించింది. అలాగే, అనవసరమైన సిజేరియన్లు తగ్గించడానికి కూడా ఈ ప్రక్రియ ఎంతగానో దోహపడుతుంది.తెలంగాణలో..ఈ ఆలోచన చేసిన వెంటనే వెనకడుగు వేయకుండా 2011లో రెండేళ్ల అంతర్గత ్ర΄÷ఫెషనల్ మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పిఎమ్ఇటి) ్ర΄ోగ్రామ్ను ్ర΄ారంభించాం. మొదట పైలట్ ్ర΄ాజెక్ట్ పూర్తి చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి హెల్త్‌కేర్ ఎకో సిస్టమ్‌లో మంత్రసానుల ప్రవేశం మొదలైంది. 2018లో ఫెర్నాండేజ్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి నర్సుల కోసం మిడ్‌వైఫరీలో 18 నెలల సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ్ర΄ారంభించాం. మిడ్‌వైఫ్స్ కోసం రూ΄÷ందించిన ఈ కోర్సు తెలంగాణలోనే మొట్టమొదటిది. మొదట తెలంగాణలోని పది మారుమూల ఆసుపత్రుల్లో 30 మంది నర్సులకు మిడ్‌వైఫరీలో శిక్షణ ఇవ్వడం, ప్రసూతి సంరక్షణలో గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడింది. ఇప్పుడు తెలంగాణలో సహజ ప్రసవాల శాతం పెరుగుతుంది. ఈ పని ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో..ఇటీవలే పీఎమ్టీ ్ర΄ోగ్రామ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ ్ర΄ారంభించాం. యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో, బర్మింగ్హమ్ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. మొదటగా తెనాలిలో ఈ ్ర΄ాజెక్ట్ పూర్తయ్యింది. తర్వాత సి–సేఫ్ ్ర΄ాజెక్ట్స్ జిజిహెచ్ రాజమహేంద్రవరం, జిజిహెచ్ ఏలూరు, జిజిహెచ్ మచిలీపట్నం, డిహెచ్ అనకాలపల్లిలో చేయబోతున్నాం.విస్తరణ వైపుగా... నవాబుల కాలంలో హైదరాబాద్‌లో మా అమ్మ నాన్నలు లెస్లీ, లౌర్డెస్ ఫెర్నాంyð జ్లు రెండు పడకలతో ఫెర్నాండెజ్ ఆసుపత్రిని ్ర΄ారంభించారు. ఆ రోజుల్లో మాతా, శిశు మరణాలను చూసి వాటిని అడ్డుకోవాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఆ తర్వాత నేను బాధ్యతలు తీసుకునే నాటికి 30 పడకలకు పెరగింది. స్త్రీ వైద్య నిపుణురాలిగా, నిర్వాహకురాలిగా నా బాధ్యతలను విస్తరిస్తూ వస్తున్నాను. ఫలితంగా ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ నేడు 300 పడకల సామర్థ్యంతో మూడు ఆసుపత్రులు, రెండు ఔట్ పేషెంట్ క్లినిక్‌లు, నర్సింగ్ స్కూల్‌కి పెరిగింది. ఈ క్రమంలో వారి ఆశయాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి జరిగింది. మాతా, శిశు సంరక్షణపై దృష్టి సారించి వారి ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన వైపుగానూ విస్తరించింది’’ అని వివరించారు. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోర్ల అనీల్‌కుమార్ -
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
-
Health: మీరు ఈ తొమ్మిది అలవాట్లు వదులుకుంటే.. సక్సెస్ గ్యారంటీ!
‘పదే పదే ఏం చేస్తామో అదే మనం. ఎక్సలెన్స్ అనేది ఒక పని కాదు, ఒక అలవాటు’ అంటాడు అరిస్టాటిల్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. అవే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. తొమ్మిది అలవాట్లు 90శాతం సమయాన్ని వృథా చేస్తాయని సైకాలజిస్టులు గుర్తించారు. వాటిని మార్చుకునే మార్గాలు కూడా సూచించారు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.1. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం..అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్. అలా అనుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనమైందంటూ బాధపడుతుంటారు. అందుకే అందరిలోనూ, అన్నిటిలోనూ.. చిన్నవో, పెద్దవో లోపాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించాలి. పాజిటివ్స్‌ను చూస్తూ ముందుకు సాగాలి.2. మల్టీ టాస్కింగ్..ఒకేసారి పలు పనులు చేయడం గొప్ప విషయంగా భావిస్తుంటారు. కానీ నిజానికి మెదడు ఒకసారి ఒక అంశంపైనే ఫోకస్ చేయగలదు. ఈ విషయం అర్థంకాక మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ‘పోమోడోరో టెక్నిక్’ ఉపయోగించండి. అంటే, ఒక పని మొదలుపెట్టాక 20 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యాస పెట్టడం. ఆ పని పూర్తయ్యాకనే మరో పని ప్రారంభించడం.3. చేసిందే చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశించండి..చేసిన పనే చేస్తుంటే వచ్చిన ఫలితాలే వస్తాయి. భిన్నమైన ఫలితాలు రావాలంటే భిన్నంగా ప్రయత్నించాలి. అందుకే మీ అలవాట్లను ట్రాక్ చేయండి. అందులో ఏవి పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే వాటిని మార్చుకోండి. 4. ప్రతిదానికీ ‘అవును‘ అని చెప్పడం..కొందరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం అడిగినా ‘నో’ చెప్పలేక, ‘ఎస్’ చెప్పేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ‘నో’ చెప్పడం నేర్చుకోండి. ఎందువల్ల మీరు ఆ పని లేదా సహాయం చేయలేరో వివరించడం నేర్చుకోండి. 5. వాయిదా వేయడం..ఎప్పటిపని అప్పుడు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండటం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీ కలలను నాశనం చేస్తుంది. మిమ్మల్నో పరాజితుడిగా నిలుపుతుంది. అందుకే నిద్ర లేవగానే, ఉదయాన్నే ముఖ్యమైన పనిని చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేయడం ఈ రోజే మొదలుపెట్టండి. నెల రోజుల్లో అది అలవాటుగా మారుతుంది. 6. అతిగా ఆలోచించడం..వర్తమానం కంటే ఎప్పడో జరిగిన వాటి గురించో లేదా ఏదో జరుతుందనో అతిగా ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతాం. అందుకే మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పుస్తకంలో లేదా డైరీలో రాసుకోండి. నాలుగు రోజుల తర్వాత అందులో ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని నిజం కాలేదో పరిశీలించండి. ఆలోచనలన్నీ నిజం కావని, అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మీకే అర్థమవుతుంది. 7. క్లోజ్డ్ మైండ్ సెట్..చాలామంది ‘నాకు లెక్కలు రావు’, ‘నాకు ఇంగ్లిష్ రాదు’ అని క్లోజ్డ్ మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ మనందరం ఒకే రకమైన మెదడుతో పుట్టాం. ఆ తర్వాతే అన్నీ నేర్చుకుంటాం. అంటే, మనందరం లెర్నింగ్ మెషి¯Œ లా పుట్టాం. అందువల్ల ఏదైనా నేర్చుకోవచ్చనే ‘గ్రోత్ మైండ్ సెట్’ను అలవరచుకోండి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. 8. నెగెటివ్ వ్యక్తులు..కొంతమంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం నిరాశపరుస్తూ ఉంటారు, మీ ఉత్సాహాన్ని తమ మాటలతో నీరు కారుస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనను ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరవ్వండి. వారితో స్నేహం చేయండి. 9. బాధిత మనస్తత్వం..ప్రపంచమంతా అన్యాయంగా ఉందని, అందరూ ద్రోహమే చేస్తారని కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. అది విక్టిమ్ మైండ్ సెట్. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసిక సమస్యల పాలవుతారు. అందుకే తక్షణం ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఇతరులపై నిందలు వేయడం ఆపండి. మీ చర్యలకు, మీ జయాపజయాలకు మీరే బాధ్యత తీసుకుని ముందుకు సాగండి.— సైకాలజిస్ట్ విశేష్ -
వేసవి కాలంలో.. కళ్ల మంటలా? అయితే ఇలా చేయండి!
ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చాలామందికి కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడి మంటలు రావడం సర్వ సాధారణం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం.ఇలా చేయండి..పాలలో కాని కలబంద రసంలో కానీ దూదిని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుందిగంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుందినిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు కలిపి కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా,స్వచ్ఛంగా ఉంటాయికళ్ళు మంటగా వుంటే చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీరు కళ్ళ లోని దుమ్ముకణాలు, మలినాలను తీసివేయడంలో సహాయపడుతుందిదూదిని రోజ్ వాటర్‌లో ముంచి కనురెప్పులపై 10–15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే కంటిగాయాలకి, కళ్ళ మంటలకి ఉపశమనం లభిస్తుందిదూదిని పాలలో ముంచి కంటిచుట్టు తుడవాలి. తర్వాత చల్లనినీటితో శుభ్రంగా కడుక్కోవాలిదోసకాయ ముక్కల్ని కట్ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే కళ్ళ మంట నుంచి ఉపశమనం పొందవచ్చుశుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని చల్లటి నీటితో తడిపి నీరంతా పిండేయాలి. ఆ వస్త్రంలో కొన్ని మల్లెపూలు లేదా నంది వర్ధనం పూలు ఉంచి కళ్లమీద ఆ వస్త్రాన్ని ఉంచుకుంటే చల్లగా ఉండడంతోపాటు తలనొప్పి తగ్గుతుందిపచ్చి బంగాళదుంపను చక్రాల్లా తరిగి ఆ ముక్కలను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళమంటల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి చదవండి: 'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా! -
'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా!
ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు పుదీనా. దీనిని నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం.పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ్రపోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ పుదీనా వాటర్ తీసుకుంటే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది.పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్య లు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. çపుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది.అందానికి కూడా!పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనాది ప్రత్యేక స్థానం. చర్మ సమస్యలను నివారిస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గించడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం, తేనె, పుదీనా కలిపి తీసుకుంటే ఆరోగ్యాన్ని అది బాగు చేస్తుంది.పుదీనాతో ఉత్సాహం..వేసవిలో అధిక దాహం, అలసట సర్వ సాధారణం. అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అలసటగా ఉన్నప్పుడు పుదీనా వాటర్‌లో కాస్తంత నిమ్మరసం, పటికబెల్లం లేదా చిటికడు బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే అలసట ఇట్టే తీరుతుంది.ఇవి చదవండి: ఆరోగ్యం విషయంలో.. ఇలా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త! -
Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి!
మారుతున్న వేడి వాతావరణం కారణంగా చర్మ సమస్యలు రావచ్చు. పాదాల విషయానికొస్తే.. దుమ్ము, దూళితో పాదాలు నలుపెక్కే అవకాశం ఉంది. చెమటతో మరింత మందంగా చీలికలేర్పడవచ్చు. కనుక మృదువైన పాదాల సంరక్షణకై ఈ చిన్న చిట్కాలు ఏంటో చూద్దాం.ఇలా చేయండి..చేతులు, పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మతొక్కతో రుద్దితే పోతాయి.సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి.రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్‌తో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి.స్నానం పూర్తయిన తర్వాత పమిస్ స్టోన్‌తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుగా ఉంటాయి.ఇవి చదవండి: ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్ -
Apr-25, World Malaria Day: ఏంటి? వైరల్ ఫీవరా! ఇలా జాగ్రత్త పడండి..
3, 4 రోజులకి పైబడి జ్వరంగా ఉండటం, వాంతులు, విరేచణాలు కావటం, చలిగా ఉండటం ఇవన్నీ మలేరియా వ్యాధికి కారకాలవచ్చు. మలేరియా సోకితే చాలా ప్రాణంతకంగా భావించే గత రోజుల్లో.. ప్రస్తుతం వాటికి తగిన మాత్రలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి, మలేరియా వ్యాధిగా గుర్తించి నిర్ధారణ పరీక్షల నిమిత్తం జాగ్రత్తలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి విషపూరిత జ్వరాల నుంచి, పీడిత వ్యాధుల నుంచి ముందుగానే నివారిత వ్యాక్సిన్లు ప్రతి ఒక్కరికీ ఇస్తున్నారు. వ్యాధి సోకాక ఇబ్బంది పడటం కన్నా, ముందుగానే వ్యాధి నివారణకు, కారకాలైన దోమలను నివారించుటలో ప్రతీ ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేడు 'ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..'చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్' 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. ఇది 'ప్లాస్మోడియం' జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ఇవి 5 రకాలు. అవి.. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్. ఈ పరాన్నజీవులతో మలేరియా సోకే అవకాశం ఉంది.ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి మరొకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ధారించడం జరిగింది. ఈ వ్యాధిని అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో “ఆఫ్రికా మలేరియా డే" ఆచరించిగా. ప్రపంచ దేశాలు ఏప్రిల్ 25ను 'వరల్డ్ మలేరియా డే'గా ఆచరిస్తూ వస్తున్నాయి.ఇలా వ్యాపిస్తుంది..అపరిశుభ్రత వాతావరణం, చెత్తా చెదారంతో కూడిన తడి ప్రదేశాలతో వ్యాధికి అవకాశంఆడ అనాఫిలిస్ దోమకాటుతో ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియాగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.చిన్నపిల్లలకు, గర్భిణులకు త్వరగా సోకడమే కాకుండా చాలా ప్రమాదకరంగా మారుతుంది.వ్యాధి లక్షణాలు..చలి, వణుకుతో కూడిన జ్వరం రావడం. వాంతులు విరేచణాలు కావడం.ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల పరసర ప్రాంతాలలో మలేరియా సోకే అవకాశం.ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా ఉండవచ్చు.మురికి, నీటి నిలువ, రద్దీ ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా సోకుతుంది.మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది.మలేరియా రాకుండా జాగ్రత్తలు..వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.ఇళ్లలో, చుట్టూర పరిసర ప్రాంతాల్లో దోమల దోమలపొగగానీ, మందుగానీ చల్లించాలి.నివసిస్తున్న ప్రదేశాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలి.అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి.. లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారే అవకాశం.. కనుక వాటి నుంచి ముందు జాగ్రత్తలు తీసువకోవాలి.ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు. డాక్టర్ సూచనల మేరకు వాటిని ఉపయోగించాలి.వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలచే.. వ్యధిని అరికట్టవచ్చు.దీర్ఘకాలం వినియోగించగలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాలతో మలేరియా వ్యాధి నివారణ సాధ్యపడుతుంది.ఇవి చదవండి: Parenting Tips: పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..! -
Beauty Tips: పసుపుతో పింక్ లిప్స్..
ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాగానీ, కొన్ని సమస్యలు మనకు తెలియకుండానే పెద్ద తలనొప్పిగా మారుతాయి. వాటినుంచి ఎలా తప్పుకొవాల్లో కూడా తెలీక ఇబ్బంది పడుతుంటాం. మరి ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే ఇలా ప్రయత్నం చేసి చూడండి.. ఇలా చేయండి.. పాలలో చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట మర్దన చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని ఉదయం నీటితో కడిగేయాలి. రోజూ రాత్రిపూట క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల పెదవులు గులాబి రంగులోకి మారతాయి. చిటికెడు పసుపులో మూడు చుక్కల నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. హెయిర్ కలర్గానీ హెన్నాగానీ జుట్టుకు పెట్టే ముందుకు చెవులు, నుదురుకు పెట్రోలియం జెల్లిని రాయాలి. తరువాత హెన్నా పెట్టుకోవాలి. చెవులు, నుదురు ్రపాంతంలో హెన్నా పడ్డప్పటికీ నీటితో కడిగితే ఇట్టే పోతుంది. పెట్రోలియం జెల్లి లానే ఆలివ్ ఆయిల్‌ను కూడా డైకు ముందు చెవులు, నుదురు, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. తరువాత డై పడినా నీటితో కడిగితే పోతుంది. ఇవి చదవండి: Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి! -
Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
కిచెన్‌లో.. వంటచేసేటప్పుడు చిన్న చిన్న వస్తువులతో విసిగిపొతూంటాం. కొన్నిరకాల తిను బండారాలను కాపాడలేక, మరికొన్ని వస్తువులను ఎక్కువకాలం నిల్వచేయలేక ఇబ్బంది పడుతూంటాం. అలాగే కొన్ని పదార్థాలనుంచి వెలువడే చెడు వాసనతో కూడా తలనొప్పిగా భావస్తాం. మరి వీటినుంచి బయటపడాలంటే ఈ కిచెన్టిప్స్ ఓసారి ట్రై చేయండి.. కుల్చానుకాల్చేటప్పుడు.. పాన్ మీద కుల్చాను వేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టాలి. ఒక వైపు కాలాక మరో వైపు తిప్పి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెడితే కుల్చా చక్కగా కాలుతుంది. చివరగా నూనె లేదా నెయ్యి చల్లుకుని సర్వ్ చేసుకుంటే కుల్చా చక్కగా కాలి రుచిగా వస్తుంది. ఉల్లిపాయ తరిగాక.. ఉల్లిపాయను ముక్కలుగా తరిగాక చేతులు ఉల్లివాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు బంగాళ దుంప ముక్కతో చేతులను ఐదు నిమిషాలు రుద్ది, తరువాత నీటితో కడిగితే ఉల్లివాసన వదులుతుంది. ఇవి చదవండి: సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా! -
వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్!
వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది. వడదెబ్బ నివారణ గురించి పశువైద్యాధికారి సగ్గం మహేశ్ రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బబారిన పడతాయి.’ వడదెబ్బ ప్రాణాంతకమే.. వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటు పడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి. నివారణకు ముందస్తు చర్యలు.. వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళలో మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజుకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈద నివ్వాలి. గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తయిన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి నీరు చల్లాలి. వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషిత నీరు తాగకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డుపై వరిగడ్డివేసి మధ్యాహ్నం వేళ్లలో నీరివ్వాలి. షెడ్ల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడ గాల్పుల నుంచి, తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. పశువులకు గోమార్లు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలో అందుబాటులో ఉంచాలి. వడదెబ్బ లక్షణాలు.. వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభావంతో చూలు పశువుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పశువుల్లో పునురుత్పత్తి ప్రక్రి య కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. చికిత్స ఇలా.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానికి పలుమార్లు కడగాలి. తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షన్లు వేయించాలి. రక్తంలోకి సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోలైట్స్ అందిస్తే నీరసం నుంచి పశువులు బయటపడతాయి. - సగ్గం మహేశ్, పశువైద్యాధికారి -
Beauty Tips: చర్మం మృదువుగా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు!
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ఇలా చేయండి.. పెసరతో మెరుపు మేనికి పెసరపిండి వాడితే చర్మకాంతి ఇనుమడిస్తుంది. పెసలలో ఉండే ప్రోటీన్లు చర్మ మృదుత్వాన్ని కాపాడతాయి. టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది. టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది. ఇవి చదవండి: గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే! -
ఈ మల్టీకలర్ ఫేస్‌మాస్క్ ధర వింటే షాకే..!
కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్‌మాస్క్‌లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్‌ను వాడాల్సిందే.. దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్‌లో మల్టీ కలర్స్‌ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్మెంట్ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పోర్టబుల్గానూ, కంఫర్టబుల్‌గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్‌స్టయిల్‌కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. ఈ స్కిన్‌కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు. ఇవి చదవండి: ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా! -
Health: పెరిగే వయసుతో.. ఈ సమస్యలూ పెరుగుతాయని మీకు తెలుసా!
వయసు పెరుగుతున్నకొద్దీ వెంట్రుకలు తెల్లబడుతుంటే రంగు వేస్తాం. కానీ మార్పులకు లోనయ్యే చర్మాన్ని ఏం చేయగలం? ఎవరెంత రంగు వేసినప్పటికీ... చర్మం తీరును బట్టే ఎదుటివారి వయసును అంచనా వేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి కొన్ని రకాల వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్ మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్‌ప్యూరా వరకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అవేమిటో, వాటి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు / నిర్వహణ పద్ధతులూ, చికిత్సలను తెలుసుకుంటే.. పరుగులు తీసే వయసుకు స్పీడ్‌కు బ్రేకులు వేసి, యూత్‌ఫుల్‌గా కనిపించేందుకు తోడ్పడే కథనమిది. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటిపొరను ఎపిడెర్మిస్, మధ్యపొరను డెర్మిస్, దాని కింద సబ్‌క్యుటేనియస్ పొర అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎపిడర్మిస్ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలోనే ఉంటూ మేనికి రంగునిచ్చే మెలనోసైట్స్ ఉత్పత్తి తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల చర్మం పారదర్శకంగా ఉండి, లోపలి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. ఇక డెర్మిస్ పొరలో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్, ఎలాస్టిన్ అనే కణజాలాలు ఉంటాయి. వీటివల్లనే చర్మం బిగుతుగా ఉంటుంది. ఈ బిగువు తగ్గడం వల్లనే వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం సాగి, వదులవుతుంది. డర్మిస్లోని రక్తనాళాలూ బలహీనమవుతాయి. అందుకే వయసు పైబడినవారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. ఇక సబ్‌క్యుటేనియస్ పొరలో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోవడం వల్ల చర్మం మునుపటిలా కాకుండా పలచబారిపోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులు, నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్ గ్రంథులు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు తగ్గుతూ పోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. నునుపుదనాన్ని కోల్పోతుంది. వెరసి... ఈ సమస్యలన్నింటి వల్ల చర్మం పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవడంతోపాటు ముడతలు కూడా పడుతుంది. వయసు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. జీరోసిస్ లేదా ఏస్టియోటిక్ డర్మటైటిస్ : దీన్నే వాడుకలో చర్మం పొడిబారిపోవడం అంటారు. ఈ సమస్య ముందుగా మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత దుస్తులు కప్పని ఇతర భాగాల్లోనూ కనిపిస్తుంది. ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ : చర్మానికి రంగును ఇచ్చే మెలనోసైట్స్ తగ్గడం వల్ల చర్మం పాలిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్స్పాట్స్ లేదా లెంటిజీన్స్ అంటారు. చర్మానికి బాగా ఎండ తగిలే ప్రదేశాలలో ఇవి ఎక్కువగా వస్తాయి. చెర్రీ యాంజియోమాస్ : ఈ సమస్య ఉన్నవారిలో కొద్దిపాటి రాపిడికే రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉండడంతో పాటు చర్మంపై నుంచి రక్తనాళాలు ఎరుపు రంగులో పైకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ‘చెర్రీ యాంజియోమాస్’ అంటారు. సెబోరిక్ కెరటోసిస్ : చర్మంపై ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన కందిగింజ సైజులో సెబోరిక్ కెరటోసిస్ అనే గోధుమరంగు మచ్చలు వస్తాయి. స్కిన్ ట్యాగ్స్ లేదా యాక్రోకార్డాన్స్: చర్మం వదులుగా.. ముడత పడినట్లుగా అయి... అదనపు చర్మంలా పొడుచుకు వచ్చి, పులిపిర్లలా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా మెడమీద, బాహుమూలాల వద్ద, తొడలపైన కనిపిస్తాయి. పర్‌ప్యూరా అండ్ హిమటోమాస్: చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారి సులువుగా చిట్లుతాయి. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా కనిపిస్తుంది. దాన్ని సినైల్ పర్‌ప్యూరా అంటారు. ఒకవేళ రక్తం పేరుకుపోయి, చర్మం ఉబ్బుగా కనిపిస్తే దాన్ని హిమటోమా అంటారు. ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్: వయసు పైబడిన వారిలో చర్మానికి చాలా తేలికగా అలర్జీలు వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని అంటారు. కెరటో అకాంథోమా: వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే కొందరిలో కాయల్లా కనిపించే వాటిని నాన్ క్యాన్సరస్ స్కిన్ గ్రోత్స్గా చెబుతారు. అవి చాలా పెద్దగా, చుట్టూ ఎత్తుగా... మధ్యలో కొద్దిగా గుంటలా ఉంటాయి. జాగ్రత్తలు.. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలాకాలం పాటు చర్మాన్ని సంరక్షించుకోవడమే కాదు... యూత్‌ఫుల్‌గా కనిపించేలా కూడా చూసుకోవచ్చు. అందుకోసం చేయాల్సినవి.. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. బాగా గాఢంగా ఉండి, ఎక్కువ సువాసనలు వెదజల్లే సబ్బులు వాడకూడదు. బాత్ ఆయిల్స్‌ను దూరం పెట్టాలి. పొగ తాగడం మానేయాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు సస్‌స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. సమతులాహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి. గోరు వెచ్చటి నీటితోనే స్నానం చేయాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఆహారం: చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, పండ్లతోబాటు బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. చికిత్స: సమస్యను బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయసు మళ్లిన వారిలో బేసల్ సెల్ ఎపిథిలియోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా వంటి చర్మ క్యాన్సర్స్ కనిపించవచ్చు. మరికొన్ని తీవ్ర సమస్యలు.. ఇన్ఫెక్షన్లు: వయసు పైబడుతున్న వారి చర్మం తేలిగ్గా ఇన్ఫెక్షన్స్కు గురవుతుంది. బార్టీరియా వల్ల – ఫాలిక్యులైటిస్, సెల్యులైటిస్; ఫంగస్ వల్ల – క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్ ఇన్ఫెక్షన్స్; వైరస్ వల్ల – జోస్టర్ వంటివి సోకుతాయి. సోరియాసిస్: పెరిగే వయసుతో సోరియాసిస్ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పొడిగానూ ఆ తర్వాత వెండిరంగు పొట్టు రాలుతున్న లక్షణాలు కనిపిస్తాయి. న్యూరోడర్మటైటిస్: ఇందులో ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉంటుంది. — డా. ఎస్. సుష్మా సుకృతి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్. ఇవి చదవండి: చిన్నారులు బరువు పెరుగుతున్నారా? అయితే జాగ్రత్త! -
Beauty Tips: చర్మం మృదువుగా.. ముడతలు లేకుండా ఉండాలంటే..?
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ముఖ చర్మం మృదువుగా ముడతలు లేకుండా ఉండాలంటే చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకు బీట్రూట్ దుంప బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను చెక్కు తీసి సన్నగా తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి ΄్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. అలాగే కొన్ని గులాబీ ఆకులను తీసుకుని వాటికి తగినన్ని నీటిని చేర్చి మెత్తగా రుబ్బుకుని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగుని ఇస్తుంది. ఇవి అందుబాటులో లేక΄ోయినా లేదా తగిన సమయం లేకున్నా, ముఖంపై రోజ్‌వాటర్‌ను చల్లుకున్నా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖంపై, బుగ్గల పైన తేనె రాసుకుని ఆరాక శుభ్రం చేసుకున్నా ముఖం స్మూత్‌గా.. మెరుస్తూ కనిపిస్తుంది. ఇవి చదవండి: క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి.. -
నెల ముందే.. నిప్పులు చెరిగే సూరీడుతో.. జర జాగ్రత్త!
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్‌గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్‌గా నిపుణులు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా. ఎండ ప్రభావం.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు? -
Beauty Tips: పాదాల శుభ్రతలో.. ఇది అస్సలు మంచిది కాదు!
పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చర్మం మీద మృతకణాలు తొలగించడం ప్రధానం. ఇంట్లోనే చేసుకోగలిగిన సింపుల్ పెడిక్యూర్ చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి. పాదాలను శుభ్రం చేయడానికి వాడే పమిస్ స్టోన్ మరీ పాతదై పోయి స్టోన్ రంధ్రాలు మురికితో నిండినప్పటికీ కొందరు దానినే ఉపయోగిస్తుంటారు. అది అసలు మంచిది కాదు. దాని వల్ల చర్మం మీదున్న మృతకణాలు తొలగకపోగా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా చేయండి.. గోరు వెచ్చటి నీటిలో రెండు చుక్కలు లిక్విడ్ సోప్ లేదా షాంపూ వేసి కలిపి అందులో పాదాలను పది నిమిషాల సేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాలను, వేళ్లను పమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైలర్తో రుద్ది శుభ్రం చేయాలి. పాదాలను పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ లేదా బాడీ క్రీమ్ రాయాలి. క్రీమ్ రాసిన తర్వాత పాదాలకు, వేళ్లకు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు అలసట తొలగి సాంత్వన పొందుతాయి. రక్తప్రసరణ మెరుగవడంతో పాదాల నొప్పులు, పాదాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇవి చదవండి: Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్ -
'అతిగా దాచుకోవడం కూడా జబ్బే..' అని మీకు తెలుసా!?
రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్‌కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇల్లంతా ఆ ఫైల్స్‌తోనే నిండిపోతే? వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే? ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే? వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే? ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే? భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే? దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్‌లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే. హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు.. హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్‌కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్‌లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు. టీనేజ్ లో మొదలు.. హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది. ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.. తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం.. అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం.. అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం.. వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం.. మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం.. అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం.. దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు.. అస్పష్టమైన కారణాలు.. హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది. తక్షణ చికిత్స అవసరం.. కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్‌ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి. ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి. డెసిషన్ మేకింగ్‌ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి. గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి. ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి. ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. హోర్డింగ్ డిజార్డర్‌కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
హెల్త్: మహిళల్లో.. ఈ 'డీప్ వీన్ థ్రాంబోసిస్' సమస్యను గురించి విన్నారా!?
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద పెట్టినంత శ్రద్ధ తమ విషయానికి వచ్చేసరికి మహిళలు గాలికి వదిలేస్తారు. కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోరు. దాంతో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి, అది తీవ్రరూపం దాల్చేవరకు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అలాంటి సమస్యల్లో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ ఒకటి. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వచ్చే సమస్య అయినప్పటికీ... మహిళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. గర్భధారణ నుంచి హార్మోన్ల సంక్లిష్టతల వరకు అనేక అంశాలు డీప్ వీన్ థ్రాంబోసిస్కు దారితీస్తాయి. రక్తనాళాల్లో.. ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి 20 మందిలో ఒకరికి... వారి జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. మహిళల్లోనే ప్రభావం చూపడానికి కారణాలు.. ప్రెగ్నెన్సీ: స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి గల కారణాలలో గర్భధారణ ఒకటి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు ఈ ముప్పు ఉంటుంది. గర్భధారణ తర్వాత రక్తనాళాల్లో రక్తప్రవాహం కాస్త నెమ్మదించడం మామూలే. దాంతో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగడం. గర్భసంచి బాగా సాగడం: దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పడి రక్తం సాఫీగా ప్రవహించడానికి ఆటంకం కలుగుతుంది. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు: వీటిల్లోని హార్మోన్లతో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాదాపు ప్రతి గర్భనిరోధక మాత్రలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిన్ ఉండటంతో అవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేసే అవకాశాలు పెరుగుతాయి. పైగా ఈస్ట్రోజెన్... కాలేయాన్ని ప్రేరేపించి... రక్తంలో ఉండే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ రక్తం గడ్డకట్టేలా చేసే ఫైబ్రినోజెన్ను ఎక్కువగా స్రవింపజేస్తుంది. దీనికితోడు గర్భనిరోధక మాత్రల్లో వాడే కొన్ని రకాల కాంబినేషన్స్ పిల్స్ వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుంది. అందువల్ల గర్భనిరోధక మాత్రలు వాడేవారు డాక్టర్ సలహా మేరకే వాడాలి. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ: మెనో΄ాజ్ తర్వాత తీసుకునే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీలోని మందుల్లో ఈస్ట్రోజెన్,ప్రోజెస్టిన్ కాంబినేషన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజెన్ పైన పేర్కొన్న ప్రభావాన్నే చూపడంతో డీప్ వీన్ థ్రాంబోసిస్ ముప్పు పెరుగుతుంది. అందువల్ల ఈస్ట్రోజెన్ మందుల్ని చర్మానికి అంటించే ΄్యాచ్ల రూపంలో ఇస్తే ఈ ముప్పు తగ్గుతుంది. జీవనశైలి అంశాలు: శారీరక శ్రమ లేకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉండటం, స్థూలకాయం, ΄÷గతాగడం వంటివి రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. స్మోకింగ్ ద్వారా దేహంలోకి చేరే నికోటిన్ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. వేర్వేరుగా లక్షణాల తీవ్రత.. డీప్ వీన్ థ్రాంబోసిస్లో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించక΄ోవచ్చు. దానికితోడు లక్షణాల తీవ్రతలో కూడా మార్పులుండవచ్చు. కొందరిలో రక్తపుగడ్డ చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. కొన్ని సాధారణ లక్షణాలు.. రక్తం గడ్డ కట్టినచోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, ΄ాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం కాలిలో డీవీటీ ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టి పడడం ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపించినా లేదా కాలం గడుస్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతూ పోతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించాలి. కొన్నిసార్లు రక్తనాళంలో ఏర్పడ్డ ఈ గడ్డ (క్లాట్) రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ, గుండె రక్తనాళల్లోకి చేరి, గుండెస్పందనలను ఆపివేసే ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అనే కండిషన్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. చికిత్స.. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం. రక్తాన్ని పలచబార్చే మందులైన యాంటీ కోయాగ్యులెంట్స్ వాడటం.. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఔషధాల్ని వాడటం. నివారణ.. మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టు తీయని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడకుండా ఉంటుంది. తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం ఒకేచోట స్థిరంగా కూర్చుని ఉండకుండా కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకోవటం రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం గర్భం దాల్చిన మహిళల కుటుంబ సభ్యుల్లో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చిన ఆరోగ్య చరిత్ర ఉంటే ముందే డాక్టర్‌కు ఈ విషయాన్ని చెప్పడం మంచిది. — డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, కన్సల్టెంట్ వాస్క్యులార్ – ఎండో వాస్క్యులార్ సర్జన్ ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..!
గుండె పెరిగే సమస్యను ఇంగ్లిష్‌లో హార్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ అనీ, వైద్య పరిభాషలో కార్డియో మెగాలీ అని అంటారు. నిజానికి ఇదేమీ వ్యాధి కాదు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు (మెడికల్ కండిషన్ల) కారణంగా కనిపించే ఒక లక్షణం. గుండె ఎందుకు విస్తరిస్తుందో, అందుకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలేమిటో, దీని నివారణ, చికిత్స ప్రక్రియలను తెలుసుకుందాం. రక్తాన్ని సరఫరా చేసే ఓ పంప్ లాంటిది గుండె. ఈ పంపు బలహీనమైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు గుండె విస్తరిస్తుంది. కొందరిలో ఈ పరిస్థితి తాత్కాలికం కాగా... మరికొందరిలో ఎప్పటికీ మందులు వాడటం, చికిత్స కొనసాగించడం అవసరం కావచ్చు. ఈ సమస్య తీవ్రమైనదా కాదా అన్నది గుండె పెరగడానికి కారణమైన అంశాన్ని బట్టి ఉంటుంది. గుండె పెరగడం.. రకాలు.. గుండె కాస్త పెరిగినప్పటికీ... ఒక దశ వరకూ అది మామూలుగానే పనిచేస్తుంది. ఒక దశకు చేరాకే అనర్థాలు కనిపిస్తాయి. గుండె పెరిగిన కారణాలూ, తీరును బట్టి ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. అవి.. డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె పెరిగితే ఇందులో గుండె కింది గదులు (వెంట్రికిల్స్) రెండూ పెరుగుతాయి. అధిక రక్తపోటు కారణంగా గుండె ఎడమవైపు కింది గది మందంగా మారవచ్చు. ఇలా కండరం మందంగా మారి గుండె పెరగడాన్ని ‘హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి’ అంటారు. ఒక్కోసారి ఏ కారణమూ లేకుండానే గుండెపెరగవచ్చు లేదా ఇతమిత్థంగా కారణం తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిని ఇడియోపథిక్ డయలేటెడ్ కార్డియో మయోపతి అంటారు. కారణాలు.. గుండె కండరానికి ఇన్ఫెక్షన్ (మయోకారై్డటిస్) వచ్చేలా చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు. గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఏదైనా దెబ్బతినడం వల్ల కొన్ని గదుల్లోకి రక్తం ఎక్కువగా వెళ్తూ ఉండటం. గుండె చుట్టూరా ఉండే ఒక పొరలోకి ద్రవాలు చేరడం వల్ల ఇలా జరగడాన్ని పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటారు. దీన్ని ఎక్స్–రే ద్వారా కనుగొంటారు. రక్తహీనత వల్ల అన్ని అవయవాలకూ ఆక్సిజన్ తగినంతగా అందదు. అలా అందించే ప్రయత్నంలో గుండె మరింత ఎక్కువగా పని చేయాల్సి రావడంతో. మహిళల్లో గర్భధారణ సమయంలో గుండె పెరిగే కండిషన్ అయిన పెరిపార్టమ్ కార్డియోమయోపతి వల్ల. కార్డియాక్ అమైలాయిడోసిస్ అనే కండిషన్లో రక్తంలో అమైలాయిడ్ ప్రోటీన్ మోతాదులు పెరగడంతో (ఇందులో గుండె గోడలు మందంగా మారతాయి). దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో థైరాయిడ్ గ్రంథి స్రావంలో అసమతుల్యతల వల్ల పల్మునరీ హైపర్‌టెన్షన్ అనే హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు వల్ల గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె కుడివైపు గదులు పెరగవచ్చు. మద్యం తాగేవారిలో లేదా మాదకద్రవ్యాలు తీసుకునేవారిలో దీర్ఘకాలంలో గుండె పెరిగే ప్రమాదం ఉంది. కొందరిలో జన్యు సమస్యల కారణంగా పుట్టుకతోనే గుండె, దాని విధుల్లో తేడాలు రావడంతో పాటు గుండె పెరగవచ్చు. లక్షణాలు.. శ్వాస సరిగా అందకపోవడం కాళ్ల / పాదాల వాపు బరువు పెరగడం (ముఖ్యంగా దేహం మధ్యభాగంలో.. సెంట్రల్ ఒబేసిటీ) తీవ్రమైన అలసట కొందరిలో గుండెదడ లేదా గుండె లయ తప్పడం. నిర్ధారణ పరీక్షలు.. కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్–రే, సీటీ లేదా ఎమ్మారై స్కాన్, ట్రెడ్‌మిల్‌పై చేయించే స్ట్రెస్ పరీక్ష, అరుదుగా గుండె కండరాన్ని సేకరించి చేసే బయాప్సీ. చికిత్స.. గుండె పెరగడానికి కారణమైన అంశం ఆధారంగా చికిత్స చేస్తారు. ఉదాహరణకు.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల వచ్చే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌లో ఆ అడ్డంకి తొలగింపు ద్వారా. రక్తపోటును నియంత్రించే మందుల్ని వాడటం ద్వారా. గుండె కవాటాలలో లోపాల వల్ల గుండె పెరిగితే వాల్వ్‌లకు తగిన రిపేరు చేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా. మద్యపానం లేదా మాదక ద్రవ్యాల వల్ల గుండె పెరిగితే ఆ అలవాటును మాన్పించడం ద్వారా. ఇతర మందుల వాడకంతోనూ.. కాళ్లవాపులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా మూత్రం వచ్చేలా చేసే డై–యూరెటిక్స్తో రక్తపోటు పెరిగినప్పుడు యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులతో. రక్తాన్ని పలచబార్చే యాంటీ కోయాగ్యులెంట్స్తో. గుండె లయ తప్పినప్పుడు యాంటీ అరిథ్మియా డ్రగ్ అనే మందును వాడతారు. గుండె కొట్టుకోవడం ఆగితే ఇం΄్లాంటబుల్ కార్డియోవెర్టర్ డీ ఫిబ్రిలేటర్తో తిరిగి గుండె కొట్టుకునేలా చేస్తారు. గుండె స్పందనల వేగం పెరిగినా లేదా తగ్గినా క్రమబద్ధం చేసే ‘పేస్‌మేకర్’ అమర్చడం ద్వారా. లెఫ్ట్ వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ) అనే ఉపకరణాన్ని. గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరమైన వారు తమకు సరిపడే గుండెకోసం వేచి చూస్తున్నప్పుడు. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్) చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బైపాస్ శస్త్రచికిత్సతో. చివరి ప్రత్యామ్నాయంగా గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుతారు. ఇవి చదవండి: మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి.. -
మెడి టిప్: ఇలా మాత్రం 'చెవి' ని శుభ్రం చేయకండి..
పెరుగుతున్న కాలుష్యానికి ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. మనకు తెలియకుండానే రోగాల బారిన పడుతున్నాం. ఈ కాలుష్యానకి చెవి, ముక్కు, కంటి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. చెవి విషయానికొస్తే, చిన్న పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలోనూ వినికిడి లోపం పెరుగుతంది. వాటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి చెవిని కాపాడడంలో.. చేయాల్సిన జాగ్రత్తలను చూద్దాం. చెవులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.. పల్లెటూళ్లలో వేసవి సెలవులు రాగానే ఈత నేర్చుకోవడం కోసం పిల్లలు నీటి కుంటలు, చెరువులకు వెళ్తుంటారు. చెరువుల్లోని మురికి నీరు చెవుల్లోకి చేరి ఇన్ఫెక్షన్లు రావచ్చు. అందువల్ల ఈత నేర్చుకోవాలనుకునే పిల్లలు పరిశుభ్రమైన నీళ్లలోనే దిగాలి. చెవులను శుభ్రం చేయడానికి కొందరు గోరువెచ్చగా కాచిన కొబ్బరి నూనె, ఆముదం చెవుల్లో పోస్తారు. ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌క్రీముల వంటివాటితో గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవే ఇన్ఫెక్షన్లు చెవులకూ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చెవి, గొంతు, ముక్కు.. భాగాల్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తను మరింతగా పాటించాలి. పై జాగ్రత్తలు పాటించాక కూడా.. గులివి, చీము వంటి సమమస్యలతో పాటు.. చెవిపోటు ఎక్కువగా వస్తున్నా, సరిగా వినిపించకపోయినా.. వీలైనంత త్వరగా ఈఎన్టీ వైద్యనిపుణులను సంప్రదించాలి. ఇవి చదవండి: హాయి హాయిగా... కూల్ కూల్‌గా! -
ఇంటిప్స్: కిచెన్‌లో బొద్దింకల సమస్యా?
రోజురోజుకి వంటగది అంటేనే భయంగా మారుతున్న పరిస్థితి అని కొందరు వాపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం బొద్దింకల బెడద అంటుంటారు. కానీ ఈ బొద్దింకల సమస్యను సులువుగా తొలగించడానకి పరిష్కార మార్గం మనచేతిలోనే ఉన్నదని మీకు తెలుసా! మరవేంటో తెలుసుకుందాం. పరిష్కార మార్గాలు.. కాసిని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్ పైప్ దగ్గర పెట్టాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. మూలల్లో బోరిక్ ΄ûడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇవి చదవండి: హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో? -
హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో?
మానవ శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం అనే రెండూ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. అందుకే వైద్యనిపుణులు వివిధ రకాల కారణాల వల్ల క్యాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవలసిందిగా పేషెంట్లకు సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు సప్లిమెంట్లను కలిపి తీసుకుంటే.. కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయి. ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల వాటి ద్వారా అందాల్సిన ప్రయోజనాలు శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుర్తుంచుకోవాలి.. ఐరన్ తీసుకునే సమయంలో పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ తీసుకోండి. ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి. సూచించిన దానికంటే ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు. ఇవి చదవండి: హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!? -
హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!
ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అరటి పండు.. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. పైనాపిల్‌లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కివీ పండ్లు.. ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. యాపిల్.. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్‌గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా.. -
Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా..
వేసవిలో సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్య డీ హైడ్రేషన్. సరైన సమయంలో గుర్తించకపోతే ఇదిప్రాణాపాయానికి కూడా దారితీసే ప్రమాదం లేకపోలేదు. శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగాలంటే ద్రవపదార్థాలు తగినన్ని ఉండడం అవసరం. ఒకోసారి రకరకాల కారణాల వల్ల శరీరంలోని ద్రవపదార్థాలు ముఖ్యంగా నీటి శాతం బాగా తగ్గిపోయి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒకోసారిప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు మరీ ఎక్కువ. అందువల్ల డీ హైడ్రేషన్‌ని నివారించేందుకు ఈ చిట్కాలు. డీ హైడ్రేషన్ గురికాకుండా ఉండాలంటే కనీసం రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. దాహంగా అనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే నీరు తాగాలి. డీహైడ్రేషన్ కు గురయ్యామని సూచించే మొట్ట మొదటి సంకేతం ’దాహం’ అనిపించటం. డీ హైడ్రేషన్‌ను ఎలా గుర్తించాలంటే..? నోరంతా పొడిబారినట్లు, బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్నా తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కోబోతున్నట్లు సంకేతంగా భావించాలి. తీవ్ర అలసట, నిద్ర పోవాలనే కోరిక ఉండడమూ డీ హైడ్రేషన్ లక్షణాలే. అలా ఉన్నప్పుడు చాలామంది నిద్రకు ఉపక్రమిస్తారు. దానికి బదులుగా వెంటనే కొంచెం మంచి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. భరించరాని తలనొప్పి కూడా డీహైడ్రేషన్ ను తెలియజేసే సాధారణ లక్షణం. సాధారణంగా కండర తిమ్మిర్లు శరీరంలో ఎలక్ట్రోలేట్ స్థాయుల అసమతుల్యతకు కారణంగా చెబుతారు. అయితే ఇది కూడా డీహైడ్రేషన్ ను సూచించే మరొక గుర్తు. కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయాలి. డీహైడ్రేషన్ ను తెలియచేసే తీవ్రమైన సంకేతాల్లో ఇది ఒకటి. ముదురు పసుపు రంగులో మూత్రం రావడం, మూత్ర విసర్జనలో మంటగా అనిపించడం డీ హైడ్రేషన్‌కు సంకేతాలు. అలాంటప్పుడు సబ్జా నీళ్లు లేదా బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇవేవీ అందుబాటులో లేనప్పుడు కనీసం వెంటనే నీటిని తాగడం కూడా ప్రమాద నివారణకు సహకరిస్తుంది. చర్మం సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అంటే చర్మాన్ని పట్టుకుని లాగి వదిలితే వెంటనే వెనక్కి వెళ్లకుండా పైన నిలిచినట్లుగా ఉండే ఈ సమస్యలో ఉన్నట్లే భావించాలి. అస్పష్టమైన కంటిచూపు కూడా డీహైడ్రేషన్ సూచించే ఒక గుర్తు. రక్తంలో తక్కువ చక్కెర స్థాయులు ఉన్నప్పుడు కూడా అస్పష్టమైన కంటిచూపు కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా నిర్ణీత సమయానికి భోజనం చేయలేకపోతే వెంటనే గ్లూకోజ్ నీరు తాగాలి. సులువుగా చేయగలిగేది తగినన్ని నీళ్లు తాగడం. కనీసం అదైనా సరిగా చేస్తుంటే ప్రమాదాన్ని నివారించిన వారమవుతాం. ఇవి చదవండి: ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే -
అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్‌తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్‌కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్‌ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది. గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్‌కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్‌గివర్‌గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్. ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థకు సి.ఇ.ఓ. దీపిక స్థాపించిన సంస్థ తాను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్‌ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్ కూడా ఈ సంస్థ వల్ల పొందారు. గోల్ఫ్ ప్లేయర్ అనిషా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ ప్రఖ్యాత బాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్ క్రీడను ప్రొఫెషనల్ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్ లెవల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్ సూచన మేరకు ఫౌండేషన్ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా. స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది. ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది -
బ్యూటిప్స్: వేసవిలో జుట్టు సమస్యా? అయితే ఇలా చేయండి!
వేసవిలో ఉడకపోతతో ఇబ్బంది పడుతూంటాం. చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ప్రధానంగా ఈ మండుటెండల్లో జుట్టు రాలిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా దానిని అరికట్టవచ్చు. గ్రీన్ టీ.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ జుట్టు పెరుగుదలను, బలాన్ని పెంచుతుంది. 2–3 గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో నానబెట్టండి. చల్లారిన తర్వాత, మీ జుట్టు, తలపై మసాజ్ చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెంతి గింజల పేస్ట్ మెంతులను రాత్రంతా నానబెట్టి, ఆపై వాటిని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ గ్రోత్–బూస్టింగ్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 30–40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇవి చదవండి: Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది -
మెడి టిప్స్: ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతో.. ఈ సమస్యకు చెక్!
మన జీర్ణవ్యవస్థలోని ఆహారనాళంలో ప్రతి చదరపు మిల్లీమీటరులోనూ కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీవక్రియలకు తోడ్పడటంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. దీనిలో ఏదైనా తేడాలు రావడాన్ని ‘డిస్బయోసిస్’ అంటారు. ఇది మూడు విధాలుగా రావచ్చు. మొదటిది మేలు చేసే బ్యాక్టీరియా బాగా తగ్గిపోవడం, రెండోది హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య ప్రమాదకరంగా పెరగడం, జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా వైవిధ్యం దెబ్బతినడం. ఇలా జరిగినప్పుడు డాక్టర్లు ్రపో–బయాటిక్స్ సూచిస్తారు. ఇవి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారం. కానీ తాజా పెరుగు, మజ్జిగ, పులవడానికి వీలుగా ఉండే పిండితో చేసే ఇడ్లీలు, దోసెల వంటి ఆహారంతోనే ‘డిస్ బయోసిస్’ తేలిగ్గా పరిష్కారమవుతుంది. అప్పటికీ తగ్గకపోతేనే ‘ప్రో–బయాటిక్స్’ వాడాల్సి వస్తుంది. కాబట్టి ‘డిస్ బయోసిస్’ నివారణ కోసం ముందునుంచే పెరుగు, మజ్జిగ వంటివి వాడటం ఆరోగ్యానికే కాదు.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
హెల్త్: గుటక వేయడం కష్టమవుతోందా? అయితే ఇలా చేయండి..
నోట్లో ఉన్న ఆహారాన్ని నమిలాక మింగివేసే ప్రక్రియ చాలా సులువుగా జరుగుతున్నట్లు అనిపిస్తుందిగానీ, నిజానికి ఇదొక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో నోరు, జీర్ణవ్యవస్థ తాలూకు కండరాలూ, నరాలు ఇవన్నీ పాలుపంచుకుంటాయి. కొన్నిసార్లు కొన్ని అంతరాయాలూ, అవాంతరాలతో గుటక వేసే ఈ ప్రక్రియ కష్టమవుతుంది. ఇలా మింగడం కష్టమయ్యే కండిషన్‌ను ‘డిస్ఫేజియా’ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి పరిష్కారాలేమిటి అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుటక వేసే ప్రక్రియ ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ఓరల్ ఫేజ్.. ఓరల్ ఫేజ్‌లో నోట్లో ఆహారాన్ని నమలడం లేదా చప్పరించడం జరుగుతుంది. అలా ఆహారాన్ని గొంతులోకి పంపడానికి సిద్ధం చేసే దశ వరకు ఓరల్ ఫేజ్ అంటారు. ఇందులో నోరు, నాలుక, పెదవులు, దంతాలు పాలుపంచుకుంటాయి. ∙ఇక ఫ్యారింజియల్ ఫేజ్ అంటే... తిన్నది కాస్తా గొంతు దగ్గర్నుంచి ఆహార నాళంలోకి చేరే దశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఎపిగ్లాటిస్ పొర విండ్ పైప్‌ను మూసుకుపోవడం వల్ల ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఆహారనాళంలోకే వెళ్తుంది. ∙ఈసోఫేజియల్ ఫేజ్ దశలో ఆహారం ఈసోఫేగస్ అనే పైప్ ద్వారా ఆహారనాళంలోకి చేరుతుంది. అక్కడి నుంచి కడుపులోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మింగడం అనేది చాలా సులువుగా మన ప్రమేయం లేనట్టుగా జరిగినట్లు అనిపించినా, నిజానికి మింగడం అన్నది మన సంకల్పంతోనే జరుగుతుంది. గుటక వేయడంలో సమస్యలూ... కారణాలు ఫ్యారింజియల్ ఫేజ్.. గుటక వేసే దశలైన ఓరల్, ఫ్యారింజియల్, ఈసోఫేజియల్ దశల్లో ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా మింగడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డిస్ఫేజియా’ అంటారు. ఒక్కోసారి జీర్ణ వ్యవస్థను నియంత్రించే నరాల సమస్య వల్ల కూడా గుటక వేయడం సాధ్యం కాకపోవచ్చు. గుటక వేయలేకపోడానికి మరికొన్ని కారణాలు.. ఈసోఫేజియల్ ఫేజ్.. మరీ చిన్న పిల్లల్లో... తల్లిపాలు తాగడంలో ఇబ్బందులు, మరికాస్త పెద్ద పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో శరీరాన్ని బిగబట్టడం; నమలలేకపోవడం, తినడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. తినే సమయంలో దగ్గు రావడం లేదా పొలమారడం ∙తరచూ వాంతులు చేసుకోవడం ∙నోటి నుంచి ముక్కు నుంచి చొల్లు కారడం ∙గాలి తీసుకోవడానికీ, తినడానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం తరచూ నెమ్ము లేదా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడటం ∙గొంతు గరుకుగా మారడం లేదా గొంతులోంచి గాలి రావడం ఇక పెద్దవయసువారిలో.. తల, మెడ, ఆహార వ్యవస్థ, శ్వాసకోశవ్యవస్థలో కండరాలూ, వాటిని నియంత్రించే నరాల సమస్యతో మింగడం కష్టం కావచ్చు. ఇందుకు దారితీసే పరిస్థితుల్లో కొన్ని.. గొంతు లేదా తల భాగంలో దెబ్బ తగలడం మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు వెన్నుపూసకు గాయం కావడం అల్జైమర్స్ మతిమరపుతో గుటకవేయలేకపోవడం మల్టిపుల్ స్కి›్లరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్, వయసు పైబడటంతో వచ్చే సమస్యలు గొంతు లేదా తలకు సంబంధించిన క్యాన్సర్‌తో మింగలేకపోవడం కొన్ని రకాల అనారోగ్యాలకు శస్త్రచికిత్స చేయడం వల్ల మింగలేకపోవడం కారణమేదైనప్పటికీ గుటక వేయలేని పరిస్థితితో పాటు నోటి నుంచి అదేపనిగా చొల్లు కారడం, తినేటప్పుడు విపరీతంగా దగ్గురావడం, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు.. బాధితుల లక్షణాలను బట్టి.. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన పరీక్షలు; నోటి పరీక్షలు, స్వరపేటికకు సంబంధించిన పరీక్షలు; నరాలకు సంబంధించిన లోపాలను తెలుసుకోడానికి సీటీ స్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై హెడ్ అండ్ నెక్ వంటి పరీక్షలు అవసరం. వీటితో పాటు మాడిఫైడ్ బేరియమ్ స్వాలో టెస్ట్; వీడియో ఫ్లోరోస్కోపీ, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ (ఫీస్) / ట్యూబ్ ఇవాల్యుయేషన్ వంటివి అవసరాన్ని బట్టి చేయించాల్సి రావచ్చు. చికిత్స.. సమస్య ఏ కారణంతో వచ్చిందనే అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పక్షవాతం లేదా యాక్సిడెంట్ వంటి కేసుల్లో సర్జరీతో పరిస్థితిని చక్కదిద్దాల్సి రావచ్చు. (ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఆహారం గుటకవేయలేని పరిస్థితి ఉంటే రైల్స్ ట్యూబ్ ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తారు). ఈసోఫేజియల్ దశలో వచ్చే సమస్యలకు ఈసోఫేజియల్ డయలేషన్, స్టెంట్ ప్లేస్మెంట్ చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఓరల్, ఫ్యారింజియల్ దశల్లో వచ్చే సమస్యలను స్వాలోయింగ్ థెరపీ వంటి చికిత్స అవసరం పడవచ్చు. క్యాన్సర్, గ్యాస్ట్రిక్ సమస్యల్లో దాని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స, మందులతో చికిత్స వంటి రకరకాల చికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. — డాక్టర్ ఈ.సీ. వినయకుమార్, సీనియర్ ఈఎన్టీ సర్జన్. -
'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?
'దేహ నిర్మాణంలోనూ, దారుఢ్యంలోనూ ఎముకలది కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడు. ఆరోగ్యంగానూ ఉంటాడు. చిన్న వయసులో ఎముకలు చాలా ఫ్లక్సిబుల్గా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకల్లోకి క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నిండుతూ పోతుంటాయి. ఫలితంగా ముప్ఫయిల వయసు నాటికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ గరిష్ఠ స్థాయికి చేరాక మళ్లీ ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా తగ్గడాన్ని ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అంటారు. మెల్లగా తగ్గుతూపోతుంటే చాలాకాలం బలంగా ఉంటుంది. లేదంటే బలహీనపడుతుంది. ఈ 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ కథా కమామిషు చూద్దాం.' 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలంటే...? మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సిమెంటు అనుకుంటే... సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ ‘డి’ ఈ కాంక్రీటును కలిపే నీరుగా భావిస్తే.. ఇదంతా ఎముకలో బలంగా కూరేలా చేసేది మనం చేసే వ్యాయామం. ఈ మూడు గరిష్ఠంగా కలగలిసి ఎంత బలంగా కూరినట్లు అయితే ఎముక అంత బలంగా మారుతుంది. అలా రూపొందే ఎముక సాంద్రత మీద ఎముక బలం ఆధారపడి ఉండటంతో.. ఎముక ఆరోగ్యానికి ‘బోన్ మినరల్ డెన్సిటీ’ అన్నది ఓ సూచికగా ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ 30వ ఏటికి వచ్చేసరికి దాదాపుగా గరిష్టంగా కొంతకాలం పాటు ఉండి, మళ్లీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతుంటుంది. ప్రోగ్రెసివ్ బోన్ లాస్ మహిళల్లో మరింత ఎక్కువ. ఎముకలు తమ సాంద్రత కోల్పోయే కండిషన్ పురుషుల కంటే మహిళల్లో చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్లలో వ్యాయామం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉండటం, అదీగాక 45 ఏళ్లు దాటాక రుతుస్రావం ఆగిపోవడం, దాంతో మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. ఎముక సాంద్రత తగ్గడానికి కారణాలు.. మన ప్రమేయం లేనివి.. కొందరికి జన్యుపరంగానే ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వారిలో వంశపారం పర్యంగానే చాలా పెద్దవయసు వచ్చేవరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే మార్చలేని అంశం. ∙కొందరిలో కుషింగ్ సిండ్రోమ్, హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తిలేకపోవడంతో ఆహారానికి దూరంగా ఉండటం), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గి, ఆ తర్వాత ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. కొందరు తరచూ కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం, అవి తగ్గడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ వంటి మందులు వాడుతుండటం... ఎముక సాంద్రతను తగ్గిస్తాయి. జెండర్ కారణాలు.. మహిళల విషయంలో.. అందునా వాళ్లలో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ. ఎత్తు తక్కువగా ఉన్న మహిళల్లో రిస్క్ ్రపోగ్రెసివ్ బోన్లాస్ ముప్పు మరింత ఎక్కువ. (అంటే.. బరువు అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). మన చేతుల్లో/ నియంత్రణలో ఉండే అంశాల విషయానికి వస్తే.. మన నియంత్రణలో ఉండే కొన్ని అంశాలు పాటించడం ద్వారా ప్రోగ్రెసివ్ బోన్ లాస్‌ను నివారించవచ్చు. అదెలాగంటే.. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండటం. దేహానికి విటమిన్–డి సమకూరేలా లేత ఎండలో వ్యాహ్యాళిగా తగినంత వ్యవధి పాటు తిరగడం. (నేరుగా పడే, తీవ్రమైన ఎండలో తిరగకూడదు). రోజుకు 30 – 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం. మన జీవనశైలి మార్చుకోవడం అంటే కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవడం. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. కంటినిండా తగినంతగా నిద్రపోవడం. ఒకవేళ కౌమార, యౌవన దశల్లో వ్యాయామానికి దూరంగా ఉండటం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు లోనైతే ఎముక సాంద్రత తగ్గిపోవడంలో వేగం పెరుగుతుంది. ఎముకలు త్వరగా గుల్లబారిపోయి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఎముక సాంద్రత తెలిసేదెలా..? ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అనే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ పరీక్షే ఎముక సాంద్రత తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. బాధితుల వయసు ఆధారంగా ఎముక సాంద్రతను లెక్కగడతారు. దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దాంతో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలూ అవసరం పడవచ్చు. ఎముక సాంద్రత పెంచుకోవడం కోసం.. ప్రోగ్రెసివ్ బోన్లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తే... ఎముక సాంద్రత పెంచుకోడానికి దోహదపడుతుంది. యుక్తవయసు పిల్లల్ని ఆరుబయట ఎండలో ఆడేలా ్రపోత్సహించడం. పెరిగే వయసు నుంచే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతోపాటు బ్రాకలీ వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడటం. చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల దేహంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడంతో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి ఈ అలవాట్లు నేర్పితే.. అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి, ప్రోగ్రెసివ్ బోన్ లాస్ తగ్గుతుంది. దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం (ఫాల్), ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తుంటి ఎముకల వంటివి విరగడాన్ని నివారించవచ్చు. — డాక్టర్ సుధీర్‌రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. -
‘పాపులరైజింగ్ సైన్స్’.. గ్రామీణ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ కానుక
చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ ‘సైన్స్ పాపులరజైషన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద ఏడు రాష్ట్రాల్లో 9193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3లక్షల20వేల702 పుస్తకాలను పంపిణీ చేసింది. 2026 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్‌లోని మొత్తం 50 వేల స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అవగాహన కల్పించడాన్ని ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎమ్)లలో కెరీర్‌ను ఎంచుకోవడం పట్ల విద్యార్థులను సన్నద్ధులను చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న స్కూళ్లు, విద్యార్థులు బయోటెక్.ఐఐటీఎమ్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఐటీ మద్రాస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి కోరారు. ఈయన ఇప్పటివరకు 70 సైన్స్ పుస్తకాలను ప్రభుత్వ హై స్కూళ్లలో చదివే విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ‘సైన్స్ పాపులరైజేషన్’ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు క్లిష్టతరమైన సైన్స్ పరిశోధనలకు సంబంధించిన విషయాలను వారికి అర్ధమయ్యే భాషలో చేరవేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ప్రోగ్రామ్‌కు అవసరమయ్యే వనరులను సమకూర్చడంలో ఐఐటీ పూర్వ విద్యార్థులు, అకడమిక్‌గా సైన్స్ నేపథ్యం ఉన్న ఇతర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
ఇంటిప్స్: మురికిని ఇకపై సులభంగా వదిలించండి..
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఇలా చేయండి.. వాటర్ బాటిల్లో సగం వరకు నీళ్లుపోయాలి. మిగతా సగంలో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, ఐస్ ముక్కలను వేసి బాగా షేక్ చేయాలి. ఇలా పది నిమిషాలు చేసిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధానంలో బాటిల్ కడగడం వల్ల బాటిల్లో సూక్ష్మజీవులు పూర్తిగా పోతాయి. టీస్పూను వంటసోడా, రెండు టీస్పూన్ల వెనిగర్‌ను బాటిల్లో వేసి మూతపెట్టాలి. ఇరవై నిమిషాల తరువాత బాటిల్‌ను బాగా షేక్ చేసి కడగాలి. ఇలా కడిగిన బాటిల్‌ను మూతతీసి పూర్తిగా ఆరిన తరువాత వాడుకోవాలి. వంటసోడా, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా మాడిన గిన్నె, ఫ్రైపాన్పై రాసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత డిష్వాషర్తో రుద్ది కడిగితే మురికి మొత్తం తొలగి పోతుంది. గోరువెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారు గంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. ఇవి చదవండి: బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు! -
బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
కొంతమంది స్కిన్ చాలా మెరిసిపోతుంది. మరి కొంతమందికి మాత్రం డ్రై స్కిన్, మొటిమలు, టాన్, పిగ్మంటేషన్, మచ్చలు, డల్ స్కిన్ వంటి సమస్యలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పతారు. నలుగురిలోకి వెళ్ళలేరు. అయితే, విటమిన్ ఇ చర్మానికి సంబంధించిన అనేక సమస్యల్ని దూరం చేస్తుంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏయే లాభాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇలా చేయండి.. చర్మ సమస్యలకి విటమిన్ ఇ చక్కటి ఉపశమనం. ఇందుకోసం టీ స్పూన్ బొప్పాయి జ్యూస్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ని తీసుకోవాలి. అందులోనే విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్కిన్ టోన్ పెరగడానికి: కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్‌ని అంతే పరిమాణంలో పెరుగు, గుడ్డుతో కలపండి. దీనిని బాగా మిక్స్ చేయండి. దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత శుభ్రం చేయండి. ముఖం మెరిసిపోతుంది. విటమిన్ ఈ ఆయిల్‌ని కలబందతో కలిపి కూడా వాడొచ్చు. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. కాంతిమంతంగా మారుతుంది. టీ స్పూన్ పరిమాణంలో గ్రీన్ టీ తీసుకోండి. అందులోనే తేనె కూడా వేయండి. తర్వాత కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ వేయండి. వీటన్నింటిని కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇవి చదవండి: చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు -
క్షయ.. వ్యాధి నిర్మూలనకై ప్రభుత్వం పటిష్ట చర్యలు!
కాకినాడ: క్షయ.. నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణం మీదకు తెస్తుంది. ఈ వ్యాధికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతి సీహెచ్‌సీలో టీబీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈవిధంగా జిల్లాలో మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, ఒక సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 10 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. క్షయ కేసులను గుర్తించేందుకు ప్రతి సీహెచ్‌సీలో ఎక్స్‌రే యూనిట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 10 మంది టీబీ హెల్త్ విజిటర్లు పని చేస్తున్నారు. క్షయ వ్యాధిని నిర్ధారించేందుకు కాకినాడ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో రెండు సీబీ నాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో 19 ట్రూనాట్ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఆరోగ్య కేంద్రాన్ని మైక్రోస్కోప్ సెంటర్‌గా మార్చి టీబీ లక్షణాలున్న వ్యక్తి నుంచి కళ్లె (ఉమ్ము) సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆ శాంపిల్‌లో టీబీ క్రిములుంటే ఆ వ్యక్తికి డాట్ ప్రొవైడర్ ద్వారా మందులు ఇస్తూ వ్యాధిని తగ్గించేందుకు 6 నుంచి 8 నెలల పాటు చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా మందులు.. టీబీ చికిత్సకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందజేస్తున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా నిర్ణీత కాలం మందులు వాడకపోతే అది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారుతుంది. దీనికి రెండేళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. టీబీ నిర్మూలనకు రూ.2 లక్షల నుంచి రూ.18 లక్షల విలువ జేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మందులు మింగించిన పర్యవేక్షకులకు (డాట్ ప్రొవైడర్‌కు) రూ. వెయ్యి నుంచి రూ.5 వేల పారితోషికం అందిస్తున్నా రు. క్షయ వ్యాధిగ్రస్తులకు నెలవారీ వైద్య ఖర్చులకు నిక్షయ పోషణ యోజన ద్వారా రూ.500 చొప్పున అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా క్షయతో బాధ పడుతున్న 1,743 మందికి గత ఏడాది ప్రతి నెలా రూ.500 చొప్పున రూ.4,19,7000 జమ చేశారు. ఆధునిక పరికరాలతో పరీక్షలు.. వ్యాధిని కచ్చితంగా నిర్ధారణ చేసే సీబీ నాట్ మెషీన్లు కాకినాడ జీజీహెచ్‌తో పాటు తాళ్లరేవు, పెద్దాపురం, పండూరుల్లోని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేశారు. ఈ మెషీన్ హెచ్ఐవీ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు, చిన్న పిల్లలల్లో క్షయ, ఎండీఆర్ టీబీని గుర్తించడంలో కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,244 మంది క్షయ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరికి నిక్షయ్ మిత్ర ద్వారా, దాతల సహకారంతో పోషకాహార కిట్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. ఇందులో 673 మంది నమోదు చేసుకుని రోగులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. వీరిలో కొంతమంది కొందరు రోగులను దత్తత తీసుకుని, మరీ వారికి కావాల్సిన పౌష్టికాహార కిట్లు అందజేస్తూండటం విశేషం. క్షయ నిర్మూలనే లక్ష్యం జిల్లాను క్షయ రహితంగా చేయడ మే లక్ష్యంగా టీబీ రోగులకు చికిత్స అందిస్తున్నాం. అదే సమయంలో నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2030 నాటికి క్షయ ముక్త భారత్ లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ జె.నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ. -
ఈ వేసవిలో పంటలు, పశు పోషక రక్షణ ఎలా?
ఈ వేసవిలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5–8 డిగ్రీల సెల్షియస్ మేరకు ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు ప్రచండ వడగాడ్పులు వీచే సూచనలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో పంటలు, తోటలను సాగు చేసే రైతులు, పశు పోషకులు గత వేసవిలో కన్నా అధికంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.. తీవ్రమైన ఉష్ణోగ్రతల వలన పంట పెరుగుదల, దిగుబడి గణనీయంగా తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలో పెరుగుదల మందగించడం, పురుగులు, తెగుళ్ళు పెరగడం, ఆకులు మాడిపోవడం, పువ్వులు, పండ్లు రాలిపోవడంతో పాటు పండ్ల పరిమాణంలో తగ్గుదల కనిపిస్తుంది. వేడి వాతావరణం వలన పాలు ఇచ్చే పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 0.5 నుండి 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన పశువులు ఎక్కువగా నీటిని తీసుకొని తక్కువ మేత తినడం వలన పాల దిగుబడి 11 శాతం వరకు తగ్గుతుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను, పండ్ల తోటలను కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా కొంత వరకు నష్టాన్ని నివారించుకోవచ్చు. పంటల నిర్వహణ.. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల వంగడాలను, రకాలను ఎంచుకోవాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పంట దశ, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్రాంతాల్లో తేమ సున్నిత దశల్లో పంటకు నీటి తడులు ఇవ్వాలి. వరి పంటలో పొట్ట, పూత దశల్లో (10 శాతం వెన్ను నుండి పూత బయటకు వచ్చినప్పుడు) 0.5% కె.ఎన్.03 పిచికారి చేస్తే వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలతో కలిగే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెం.మీ. ఎత్తున నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుంచి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెం.మీ. లేదా 5 సెం. మీ. నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువ ఉన్నప్రాంతాల్లో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్న పంట పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కాబట్టి, రైతులు పైరుకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు.. నీటి వసతి అధికంగా ఉన్నప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుదైతే, ఒక రోజుకు ఒక చెట్టుకు 150–240 లీటర్ల నీరు అవసరం. అవకాశం ఉన్నచోట సేంద్రియ పదార్థాలైన గడ్డి తదితర పదార్థాలతో మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన (మల్చింగ్) చేయటంతో పాటు బిందు సేద్యానికి ్రపాధాన్యత ఇవ్వాలి. ఆచ్ఛాదన చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి, మొక్కకు అందుబాటులో ఉంటుంది. వరి గడ్డి లేదా స్థానికంగా లభించే సేంద్రియ పదార్థాలు లేదా పాలిథిన్ షీట్లను మొక్కల మొదళ్ళ చుట్టూ కప్పాలి. మామిడి తోటలో ఏప్రిల్ – మే మాసంలో 1% పొటాషియం నైట్రేట్ (13–0–45) మందును 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితుల్లో నల్లి (మైట్) ఉధృతి పెరుగుతుంది. నివారణకు 30 మి.లీ. డైకోఫోల్ లేదా 20 మి.లీ. ్రపొపారై్గట్ లేదా 20 మి.లీ. ఇథియాన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఒకటి లేదా రెండేళ్ల వయస్సు గల పండ్ల తోటలు లేదా కొత్తగా నాటిన తోటల చుట్టూ వేసవిలో వడగాల్పుల ప్రభావం తగ్గించడానికి సరుగుడు లేదా వెదురు మొక్కలను నాటుకోవాలి. కూరగాయ తోటల్లో ఏం చేయాలి? అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షిచుకోవచ్చు. బిందు సేద్యం చేసే పంటల్లో ప్రతి రోజూ అరగంట (ఉదయం, సాయంత్రం) 2సార్లు నీరివ్వాలి. ప్రధాన పంటపై వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి, మొక్కజొన్నను 3–4 వరుసల సరిహద్దు పంటగా వేసుకోవాలి. ప్రతి 20–25 మీటర్ల దూరంలో అంతర పంటగా వేసుకోవాలి. 50% షేడ్ నెట్‌ను వాడి పంటలపై అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కోళ్ళు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి షెడ్లల్లో ఫ్యాన్లను, ఫాగర్లను అమర్చాలి. షెడ్లను వరి గడ్డితో కప్పి స్ప్రింక్లర్లు అమర్చాలి. కోళ్ళు ఎక్కువ మోతాదులో దాణా తినటం కోసం మెత్తటి దాణాతో పాటు చల్లని తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. – డా. లీలారాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్. పశువులను కాపాడేదెలా? వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వల్ల ఉష్ణతాపానికి గురై పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు తీవ్ర అసౌకర్యానికి, అనారోగ్యానికి లోనుకావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. కాబట్టి, పశుపోషకులు, గొర్రెలు– మేకల పెంపకదారులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని పశువులు, గొర్రెలు మేకలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతిని పాటించడం ద్వారా ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల సంరక్షణ ఇలా.. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారతాయి. పశువులు సరిగా నడవలేక, తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, మేత తక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు రావచ్చు. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. వడదెబ్బకు గురైన పశువుల్లో దాహం పెరుగుతుంది. తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణించే ప్రమాదం ఉంటుంది. పశువుల మేపు.. వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలో వేర్వేరుగా ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉ. పూట 6 నుంచి 10 గంటల వరకు, సా. 5 నుండి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది. వేసవి తాపానికి గురైన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దాహంతో ఉన్న పశువులు మురుగునీరు తాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లవేళలా మంచి చల్లని తాగునీరు ఇవ్వాలి. అంతర పరాన్న జీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా తాగించాలి. వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగాలి. తల నుదుటి మీద మంచుముక్కలు ఉంచాలి లేదా చల్లని గోనె సంచిని దానిపై క΄్పాలి. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తగిన చికిత్స చేయించాలి. – డా. జి. మంజువాణి, సంచాలకులు, పశువైద్య, పశు సంవర్థక శాఖ, హైదరాబాద్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బోరు బావుల రీచార్జ్‌తో నీటి భద్రత! 22న వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ వెబినార్ గత వానాకాలంలో రుతుపవనాల వైఫల్యం వల్ల భూగర్భంలోకి వాన నీరు సరిగ్గా ఇంకకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేకప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతున్నాయి. కాలువ కమాండ్ ఏరియాల్లో సైతం పొలాల్లో, నివాసప్రాంతాల్లో కూడా పలువురు ఇప్పటికే కొత్త బోరు బావులు తవ్వుతున్నా, చాలా వాటిల్లో ఆశించినంతగా నీరు లభించని పరిస్థితి. ఎండిపోయిన బోరు బావులు, కొద్దొగొప్పో నీరు పోస్తున్న బోరు బావుల చుట్టూ వాన నీటి ఇంకుడు గుంత (రిచార్జ్ పిట్)ను నిర్మించుకోవటం ద్వారా కృత్రిమంగా భూగర్భ జలాలను పెంపొందించుకోవటమే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం. వీటిని నిర్మాణం ద్వారా ఈ ఎండాకాలంలోనూ కురిసే అకాల వర్షాలకు వృథాగా పోయే నీటిని సమర్థవంతంగా బోర్ల దగ్గరే భూమిలోకి ఇంకింపజేసుకోవచ్చు. అయితే, వాననీటిని ఇంకింపజేసే ఇంకుడు గుంత నిర్మాణానికి ఎండిపోయిన బోర్లన్నీ పనికిరావు. ‘ట్యాంకర్ టెస్ట్’ చేసి నిర్థారించుకోవాల్సి ఉంటుంది. ఈ అత్యాధునిక బోర్వెల్ రీచార్జ్ టెక్నిక్‌ను సికింద్రాబాద్‌లోని ‘వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ (డబ్ల్యూ.ఎల్.ఎఫ్.)’ గత 14 ఏళ్లుగా ప్రజలకు అందిస్తోంది. ఈ అంశంపై రైతులకు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు డబ్ల్యూ.ఎల్.ఎఫ్. ఈ నెల 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తెలుగులో ఉచితంగా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ఈ క్యూ.ఆర్.కోడ్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ ఫామ్ ద్వారా పేర్లను ఈ నెల 18 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి వాట్సప్ ద్వారా వెబినార్ లింక్ పంపుతారు. ప్రవేశం ఉచితం. రూ.200 చెల్లించిన వారికి బోర్ల వద్ద వాన నీటి సంరక్షణపై ఆంగ్ల పుస్తకాన్ని పంపుతారు. వివరాలకు.. సీనియర్ జియాలజిస్ట్ రామ్మోహన్ – 94401 94866, 040 27014467. 16, 17న సేంద్రియ రైతులతో ముఖాముఖి! హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో గ్రామభారతి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో నాబార్డ్ తోడ్పాటుతో సేంద్రియ వ్యవసాయ, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన ‘కిసాన్ ఎక్స్పో’ 2వ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సామ ఎల్లారెడ్డి తెలిపారు. ఆరోగ్యదాయక సేద్యం చేస్తున్న గ్రామీణ సేంద్రియ/ ప్రకృతి వ్యవసాదారులను, వారి ఉత్పత్తులను ప్రత్యక్షంగా నగరవాసులకు పరిచయం చేయటం కోసం వినియోగదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించటం ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రకృతి సేద్య రంగ ప్రముఖులు డా. జీవీ రామాంజనేయులు, విజయరామ్, కొప్పుల నరసన్న తదితరులు అతిధులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 97040 66622. ఇవి చదవండి: Dr Supraja Dharini: తాబేలు గెలవాలి -
కిడ్నీ సమస్యలు ఈ కారణాలతో కూడా రావచ్చు.. జాగ్రత్త!
'ఇది వేసవి. డీ–హైడ్రేషన్‌కు గురయ్యే కాలం. సాధారణంగా మూత్రపిండాల్లో (కిడ్నీల్లో) రాళ్లు వేసవిలో తరచూ బయటపడుతుంటాయి కాబట్టి ఈ సమస్యకు వేసవిని ఓ సీజన్‌గా పరిగణిస్తుంటారు. పైగా ఈనెల 14వ తేదీ ‘వరల్డ్ కిడ్నీ డే’ సందర్భంగా మూత్రపిండాల్లో రాళ్లలాంటి సాధారణ సమస్యలు మొదలుకొని, సీకేడీ వంటి మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలూ, వాటి పరిష్కారాలపై అవగాహన కోసమే ఈ కథనాలు'. కిడ్నీలో రాళ్లు ఎంత సాధారణ సమస్య అంటే ఒకరి 70 ఏళ్ల జీవితకాలంలో 20% మంది పురుషుల్లో, 10% మంది మహిళల్లో ఏదో ఒక దశలో అవి కనిపిస్తాయి. అయితే రాళ్లు రావడమన్నది పురుషుల్లో ఎక్కువ. వాటి వల్ల కిడ్నీ దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసి, జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాటి గురించి తెలుసుకుని, కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు అవకాశమున్నవారు జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. రాళ్లూ.. రకాలు.. మన ఆహారంలో, తాగే పానీయాల్లో క్యాల్షియమ్ వంటి అనేక ఖనిజాలూ, లవణాలు ఉంటాయి. జీవక్రియలు జరిగే సమయంలో ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్, సిస్టయిన్ వంటి స్ఫటికాలు ఏర్పడవచ్చు. అలాగే ఇంకొందరిలో రాళ్లు రూపొందే ప్రక్రియను అరికట్టే సిట్రేట్లు తక్కువగా ఉండవచ్చు. అలాంటివారితో పాటు... నీళ్లు తక్కువగా తాగేవారిలో లవణాలన్నీ ఒకేచోట కేంద్రీకృతమై క్రమంగా గట్టిబడి రాయిలా మారేందుకు అవకాశాలు ఎక్కువ. దేహంలోని వడపోత ప్రక్రియ అంతా కిడ్నీలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాళ్లు ఏర్పడే అవకాశాలెక్కువ. కిడ్నీరాళ్లలో ప్రధానమైనవి కాల్షియమ్ ఆగ్జలేట్స్ (70 – 80%). మిగతావి క్యాల్షియమ్ ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్, సిస్టైయిన్స్ వంటివి. ఇక ట్రిపుల్ ఫాస్ఫేట్‌గా పేరున్న మెగ్నీషియమ్, అమోనియమ్ ఫాస్ఫేట్లతో తయారయ్యే స్ట్రువైట్ అనే రాళ్లు చాలా అరుదుగా, పెద్దగా ఏర్పడతాయి. దాంతో స్ట్రువైట్ రాళ్లతో కిడ్నీ ఫెయిల్యూర్‌కు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు.. కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ బాధితుల్లో 'ప్రోటియస్ వల్గారిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా కూడా స్ట్రువైట్ రాళ్లు ఏర్పడి, మరింత సంక్లిష్టతలకూ, ప్రమాదాలకూ దారితీసే అవకాశముంది. ఎవరిలో ఎక్కువ..? నీళ్లు చాలా తక్కువగా తాగేవాళ్లలో ఉప్పు ఎక్కువగా తీసుకునేవారిలో మాంసాహారాలూ, చక్కెరలు ఎక్కువగా తినేవారిలో ఉబకాయం ఉన్నవారిలో డయాబెటిస్, పేగు వ్యాధులు లాంటి సమస్యలు ఉన్నవారిలో క్రోన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, యూరిక్ యాసిడ్ మోతాదులు ఎక్కువగా పెరిగే గౌట్, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, రీనల్ ట్యుబ్యులార్ అసిడోసిస్, హైపర్పారాథైరాయిడిజమ్ వంటి సమస్యలున్న వారిలో సిప్రోఫ్లాక్సిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్, సల్ఫా డ్రగ్స్, హెచ్ఐవీ మందులు వాడేవాళ్లతో పాటు, బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ (అందులోనూ రూక్స్–ఎన్–వై గ్యాస్ట్రిక్ బైపాస్) చేయించుకున్నవారిలో. లక్షణాలు... నడుము లేదా వీపువైపు ఉరఃపంజరం కిందిభాగంలో భరించలేనంత తీవ్రమైన నొప్పి. ఒక్కోసారి ఈ నొప్పి పక్కలకూ, కిందివైపునకూ, పొట్ట వైపునకూ, కొందరు పురుషుల్లో వృషణాల సంచివైపునకూ పాకుతుంది. ఇది అలలు అలలుగా వస్తూపోతూ ఉంటుంది. నొప్పితో పాటు.. వికారం లేదా వాంతులు జ్వరం మూత్రంలో రక్తం కనిపించడం మూత్రవిసర్జనలో మంట కొందరిలో రాయి కారణంగా మూత్రం వస్తున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ, రాయి అడ్డుపడుతుండటం వల్ల మూత్ర విసర్జన జరగకపోవచ్చు. ఇలాంటి వాళ్లలో మూత్రం ఆగి, ఆగి చుక్కలు చుక్కలుగా పడుతుండవచ్చు. అరుదుగా కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ మరేదో సమస్యతో డాక్టర్ దగ్గరికి వచ్చి, పరీక్షలు చేయించినప్పుడు చాలా పెద్దరాయి కారణంగా అప్పటికే కిడ్నీ చాలావరకు చెడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. నిర్ధారణ.. మూత్రపిండాలు, యురేటర్, బ్లాడర్ల సీటీ స్కాన్, ఎక్స్–రే, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో కిడ్నీలో రాళ్లను కనుగొంటారు. కొన్నిసార్లు మూత్రపరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష అవసరం కావచ్చు. చికిత్స.. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగమని బాధితులకు సూచిస్తుంటారు. దాంతో రాయి రూపొందడానికి వీల్లేకుండా లవణాలు ఎప్పటికప్పుడు మూత్రంలో కొట్టుకుపోవడంతో పాటు... కొన్నిసార్లు రాయి దానంతట అదే బయటపడేందుకు అవకాశముంటుంది. ఉప్పు, మాంసాహారం తగ్గించమని సూచిస్తుంటారు. అలాగే కొందరిలో రాయి ఏర్పడటానికి దోహదం చేసే పాలకూర, టమాటాకు దూరంగా ఉండమని సూచిస్తారు. ఇది కేవలం కిడ్నీలో రాయి ఏర్పడేందుకు అవకాశమున్నవారికి మాత్రమే. మిగతా ఆరోగ్యవంతులు వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇక శస్త్రచికిత్సల విషయానికి వస్తే.. యురేటరోస్కోపిక్ రిమూవల్ : ఎండోస్కోప్ సహాయంతో బ్లాడర్లోకీ, కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఉండే నాళాలైన యురేటర్లలోంచి ఈ ప్రక్రియ ద్వారా రాళ్లు తొలగిస్తారు. ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ : రాళ్లు పెద్దవిగా ఉంటే ఈ షాక్ వేవ్స్ సహాయంతో వాటిని చిన్న చిన్న ముక్కలుగా /΄ûడర్‌గా పొడిపొడి చేస్తారు. దాంతో రాళ్ల ΄ûడర్ మూత్రంలో వెళ్లిపోతుంది. పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్ఎల్) : ఈ ప్రక్రియలో నడుం పక్క భాగం నుంచి కిడ్నీలోకి ఒక పైప్‌ను రాయి ఉన్నచోటికి పంపి, ఆ పైప్ ద్వారా రాయిని బయటకు తీసుకొస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ – సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)కి మొదటి కారణం మధుమేహం, రెండోది దీర్ఘకాలిక రక్తపోటు. మూడో కారణం గ్లోమరులార్ డిసీజ్. ఈ సమస్య ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటుంది. ఫలితంగా కాళ్లవాపు, ముఖం వాచినట్లుగా ఉండటం, మూత్రం నురగలా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కారణాలేమీ లేకుండానే కిడ్నీలు దెబ్బతినవచ్చు. కిడ్నీలోని మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటస్టిషియల్ వ్యాధులు, కొన్ని జన్యుపరమైన జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)కి కారణం. అయితే ఈ కారణాలన్నింటిలోనూ డయాబెటిస్, హైబీపీ వల్లనే 70– 80 శాతం కిడ్నీవ్యాధికి దారితీస్తాయి. ఎవరెవరిలో... ఎందువల్ల? చిన్నపిల్లల్లో సీకేడీ ఉందంటే అది జన్యుపరమైన జబ్బుల వల్ల వచ్చిందేమోనని చూడాలి. మధ్యవయసు వారిలోనైతే... ఇందుకు అదుపులో లేని డయాబెటిస్, అధిక రక్తపోటు కారణమని అనుమానించాలి. లక్షణాలు.. వికారం ఆగకుండా వాంతులు ఎప్పుడూ నీరసంగా ఉండటం కాళ్లవాపులు ముఖం వాపు ఆకలి తగ్గడం ఊపిరి అందకపోవడం ఆయాసం రాత్రివేళ మూత్రం కోసం ఎక్కువగా నిద్రలేవాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా తక్కువగా రావడం, మూత్రంలో రక్తస్రావం... వంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలు 50 శాతం దెబ్బతిన్న తర్వాతే బయటపడవచ్చు. చికిత్స.. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోగలిగినప్పుడు కిడ్నీ బాధితులు ఓ సాధారణ వ్యక్తి జీవించినంత కాలం జీవించవచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు. మొదటిది హీమో డయాలసిస్; రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమో డయాలసిస్ : ఇది యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. వారానికి మూడు సార్లు రోజు విడిచి రోజు డయాలసిస్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాలి. ఈ ప్రక్రియకు నాలుగు గంటలు పడుతుంది. పెరిటోనియల్ డయాలసిస్: ఇది ఇంట్లోనే చేసుకునే డయాలసిస్. దీన్నే ‘కంటిన్యువస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్’ (సీఏపీడీ) అని కూడా అంటారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స.. కిడ్నీ తొంభై శాతం పాడైనప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చివరి ఆప్షన్‌గా డాక్టర్లు సూచిస్తారు. కిడ్నీలను పదిలంగా కాపాడుకోవాలంటే.. డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ పరీక్షను చేయిస్తూ... రీడింగ్స్ 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారు తమ బీపీని 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో కొవ్వులు, కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం తక్కువగా తీసుకుంటూ... శాకాహారం, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. మన ఆహారంలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే గింజధాన్యాలు, సోయాబీన్స్, చాక్లెట్ల వంటి వాటిని తగ్గించాలి. క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. నిమ్మజాతి పండ్లు, ఆరెంజ్ జ్యూస్ వంటివాటివి డాక్టర్ల సూచనల మేరకు తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ వల్ల ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాంతో దేహంలో నీళ్లు తగ్గి డీహైడ్రేషన్‌కు గురవుతాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశమిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. కూల్‌డ్రింక్స్‌కూ దూరంగా ఉండటం మంచిది. ఏవైనా మందులు లేదా విషపదార్థాలు ఒంట్లోకి రాగానే వాటిని విరిచేసి, వడపోసి బయటకు పంపే బాధ్యతలు కాలేయం, కిడ్నీలవే. నొప్పి నివారణ మందుల వంటి కొన్ని ఔషధాలు దీర్ఘకాలంలో కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున డాక్టర్ సలహాలు, సూచనలు లేకుండా ఏ రకమైన ‘ఆన్ కౌంటర్ డ్రగ్స్’ వాడకూడదు. మూత్రం ఇన్ఫెక్షన్స్ని సరైన పద్ధతిలో, సరైన మందులతో, సరైన సమయంలో వైద్యం చేయించుకుని, పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి. — డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు... -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం!
‘మహిళలను గౌరవిద్దాం’ అనే మాట తరచూ వింటుంటాం. మహిళ గురించి మాట్లాడే ఉన్నతమైన పదాలు మహిళా దినోత్సవం వరకే పరిమితం అవడం కూడా చూస్తుంటాం. ‘సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించే క్రమంలో స్త్రీ గౌరవానికి, రక్షణకు వెన్నుదన్నుగా నిలిచేది కూడా మొదట మహిళే అయి ఉండాలి’ అంటూ వివిధ రంగాలలోని మహిళలు తమ మాటల ద్వారా ఇలా వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఆ మాటలను ఆచరణలోనూ పెట్టి మంచి ఫలితాలను చూద్దాం. ప్రయత్నించడం మానకూడదు.. మగవారితో పోల్చితే ఇంట్లో, ఆఫీసులోనూ స్త్రీల పాత్ర ఎక్కువే. రెండుచోట్లా నిబద్ధతతో పని చేస్తుంటారు. కానీ, రెండు చోట్లా అర్థం చేసుకునేవారుండరు. విసుగు అనిపిస్తుంటుంది. అలాగని, మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ముప్పై ఏళ్ల క్రితం నేను పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాసులో అమ్మాయిలు ఐదు శాతం కన్నా తక్కువే ఉండేవారు. ఇప్పుడు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌లో 60 నుంచి 70 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్స్‌లో కొన్నింటిని గర్ల్స్ హాస్టల్‌గా మార్చేద్దామని కూడా చూస్తున్నాం. పీహెచ్‌డి చేసే అమ్మాయిల సంఖ్యా పెరిగింది. పోరాడి సీట్లు, పదవులు దక్కించుకుంటున్నాం. అయితే, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ హోదాలో ఉన్న ముందు ఎవరిని వారు గౌరవించుకోవాలి. చదువులో, హోదాలో సమానత్వం కోసం పాటుపడాలనే కాదు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలనుకోవాలి. కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలమనే ధైర్యం ఉండాలి. రక్షించడానికి ఎవరో ఒక మగవాడైనా ఉండాలి అనే ఆలోచనను దూరం పెట్టాలి. అప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకు తగిన సత్తాను సంపాదించుకోవడం మన లక్ష్యం అవ్వాలి. ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ సమాజంలో మనల్ని ఉన్నతంగా చూపుతుంది. –ప్రొఫెసర్ సి.వి. రంజని, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఓయూ వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు.. స్లోగన్స్ చెబుతున్నారు. కానీ, పాటించడం లేదు. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. కానీ, మగవారు స్త్రీని శారీరకంగా బలహీనులుగానే చూస్తారు. ఆమె శక్తి తెలిస్తే మగవారిలో ఆ ఆలోచనే రాదు. ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైనా ఉంటే ఆ సంఘటనను, సదరు వ్యక్తులను కాకుండా ముందు ఆమె వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తుంటారు. ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశంలోకి ఒక మహిళ రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అక్కడా వేధింపులు తప్పవు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లి చేసుకున్న అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే, పుట్టింటి సహకారం అందక ఆ అమ్మాయి బతుకుదెరువులో చాలా వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె జీవనం గురించి తప్పుగా మాట్లాడే మగవాళ్లు ఉన్నారు. సమస్యను ఎదుర్కోవడంలో గొడవ తప్పక జరుగుతుంది. కానీ, సింగిల్ ఉమెన్ గొడవ పడితే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. తల్లి తన కూతురుకి ఒంటరిగా ఎలా జీవించాలో చెబుతూనే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ‘ఆమె’గౌరవానికి సంబంధించిన దారుణమైన వీడియోలు చూస్తున్నాం. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ‘అమ్మాయి ఎలాంటిది?’ అని ఆమెను నెగిటివ్ంగాప్రొజెక్ట్ చేస్తున్నారు. స్వలాభం కోసం చేసే ఇలాంటి ఎన్నో పనులు ‘ఆమె’ గౌరవాన్ని తీసేస్తూ బతికేస్తున్నారు. – డాక్టర్ జయశ్రీ కిరణ్, కాకతీయ ఫౌండేషన్, హైదరాబాద్ మన మీద మనకు నమ్మకం! మగవారితో పోల్చుకుంటే టైమ్ మేనేజ్ చేయగల శక్తి స్వతహాగా స్త్రీకి ఉంటుంది. ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడితే అది ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గర కావల్సిందే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యం బాగా లేదనో, సరైన చదువు లేదనో, కుటుంబ బాధ్యతలు ఉన్నాయనో.. ఇలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన కలలను మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు. నాకు స్కూల్ వయసులో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అయినా యోగా ట్రైనర్‌గా, బ్యుటీషియన్‌గా మేకప్ అకాడమీ నడుపుతున్నాను. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే నా పనులు చేసుకుంటూ వచ్చాను. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా కెందుకు ఈ సమస్య వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సానుభూతి తప్ప బయటి నుంచి గౌరవం కూడా లభించదు. మనమీద మనకున్న నమ్మకమే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. – రూప, యోగా టీచర్ అండ్ బ్యూటీషియన్ భయం బిడియంతో శక్తి తగ్గుతుంది.. స్త్రీలను గౌరవించండి అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఆ మాట వినటమే మన దౌర్భాగ్యం. ఎందుకంటే స్త్రీని గౌరవించాలి అని చెబితే గాని తెలియని సమాజంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు స్త్రీకి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయే వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. మారుతున్న టెక్నాలజీతో పాటు మనలో కూడా మార్పు రావాలి. భయం, బిడియం అనే భావాలతో స్త్రీ తన శక్తిని గుర్తించటం లేదు. ఒక తల్లి యవ్వనంలో ఉన్న తన కూతురుతోనో కొడుకుతోనో తన చిన్నప్పటి కబుర్లు, నెరవేరని కలలు, రక్తసంబంధాలు, స్నేహితుల గురించి, జీవితంలో అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొనే నేర్పరితనం... చర్చించడం లేదనిపిస్తోంది. నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా స్త్రీ ఎప్పుడూ మెలకువతో తనను తాను కాపాడుకోవాలనే స్పృహతో ఉండాలి. పాలకులు కూడా స్త్రీని అన్ని రంగాల్లో పైకి తెస్తున్నాం అని చెబుతుంటారు. కానీ, అమ్మాయిలపై అఘాయిత్యాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. స్వతంత్ర దేశం కోసం ఎందరో స్త్రీలు తమ ్రపాణాలర్పించారు. వారి ్రపాణత్యాగాన్ని స్మరణ చేసుకున్నా మహిళగా ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనలో మనకు ఐకమత్యం ఉండాలి. ఏ కారణం వల్ల ఒంటరిగా ఉంటున్న స్త్రీని సాటి స్త్రీ అర్థం చేసుకొని, ఆమెకు మద్దతునివ్వగలిగితే చాలు ధైర్యం పెరుగుతుంది. స్త్రీలు ఒకరికి ఒకరుగా నిలవాలి. పనిమనిషి పనిని కూడా గౌరవించడం కుటుంబంలో వారికే అర్ధమయ్యేలా తెలపాలి. పారిశుద్ధ్య కార్మికురాలి, పనిమనిషి, రోజువారీ పనుల్లో తారసపడే ప్రతి స్త్రీని గౌరవించాలని పిల్లలకు చె΄్పాలి. రేపటి తరంలో వచ్చే మార్పు కూడా సమాజానికి మేలు కలుగజేస్తుంది. – వి. ప్రతిభ, బిజినెస్ ఉమెన్ ఇవి చదవండి: International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ -
మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం?
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటిని దానం చేసే వారి సంఖ్య తక్కువగానూ ఉంది. మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయనే విషయాన్ని చాలావరకు గుర్తించడం లేదు. మట్టిలో కలవడం కంటే.. కట్టెలో కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలగాలి. అప్పుడే మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్‌లో అవయవ దానం పరిస్థితి ఎలా ఉంది? దేశంలో అవయవ దానం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది మరణిస్తున్నారు. దీనివల్ల తమ వారి ప్రాణాలను నిలుపుకోవడం కోసం వారి బంధువులు పడుతున్న వేదన ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూత్రపిండాల కొరతతోనే దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణం బలవుతోంది. ఫలితంగా ప్రతి ఏటా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి మూత్రపిండాలు: దేశంలో దాదాపు 2,00,000 మూత్రపిండాలు అవసరం ఉండగా.. కేవలం 4,000 మార్పిడి (2 శాతం) మాత్రమే జరుగుతుంది. కాలేయం: లక్షమందికి కాలేయం అవసరం ఉండగా..500 (0.5%) మాత్రమే లభిస్తున్నాయి. గుండె: 50,000 మందికి గుండె అవసరం ఉంది.కానీ 50 మార్పిడులు (0.1%). మాత్రమే జరుగుతున్నాయి. కార్నియా: 1,00,000 ప్రజలకు కార్నియా అవసరం. అయితే 25,000 మాత్రమే (25 శాతం) అందుబాటులో ఉంది. అవయవ దానం విషయంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి అవగాహన లేకపోవడం: చాలా మందికి అవయవ దానం గురించి తెలియదు. అపోహలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు: అవయవ దానానికి ఆటంకాలుగా మారాయి. కఠినమైన చట్టాలు: కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ మంది మహిళలు దానం చేస్తారు. కానీ తక్కువ మంది అవయవాలను అందుకుంటారు. ఆసుపత్రుల కొరత: దేశంలో కేవలం 301 ఆసుపత్రులు మాత్రమే ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నాయి. జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం.. పై కారణాలతో భారత్‌లో అవయవ దానాల రేటు కేవలం 0.34శాతం మాత్రమే ఉంది. ఇక పోతే మరణించిన వారి అవయవాలను దానం చేసేందుకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రూ.149.5 కోట్ల బడ్జెట్‌తో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది. అవయవ దాన రేటులో తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవగాహన ప్రచారాలు, విద్య, సమాజ ప్రమేయం చాలా అవసరం. మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం అవయవ దానం జీవించి ఉన్న దాత ను చి లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత చేయవచ్చు. బ్రెయిన్ డెత్ అనేది రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కారణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్‌డెత్‌గా నిర్ధారిస్తారు. జీవించి ఉన్న వారు కిడ్నీలు, ప్యాంక్రియాస్‌లోని భాగాలు, కాలేయంలోని భాగాలను దానం చేయవచ్చు. మరణం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ పేగులను దానం చేయవచ్చు . అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు. చివరగా.. అవయవదానంపై అవగాహనను పెంచి అపోహాలను దూరం చేద్దాం. అవయవ దానాన్ని ప్రోత్సహించి, అవసరమైన వారికి జీవితాన్ని బహుమతిగా ఇద్దాం. -
World Anti-Obesity Day: ఊబకాయం తగ్గేదెలా?
'ప్రస్తుత సమాజంలో ఊబకాయం ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఆరోగ్య సమస్యల్లో ఇది ప్రధాన సమస్యగా మారుతోంది. మారుతున్న జీవన విధానంలో ఆహార అలవాట్లు మారుతుండటం ఊబకాయం (ఒబెసిటీ) వ్యాధికి కారణమని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం ఇందుకు కారణం. పెద్దలతో పాటు చిన్నారులు ఊబకాయం బారినపడడం ఆందోళన కల్గిస్తుంది. ఈనెల 4న ప్రపంచ ఊబకాయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న కథనం'. సమస్య ఇలా.. పెద్దవారితో సహా, చిన్నపిల్లలు 20 శాతం ఈ ఊబకాయం వ్యాధి బారినపడుతున్నారు. నెయ్యి, డాల్డా, నూనె అధిక మోతాదులో కలిసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినటంతో రక్తంలో కొవ్వు శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఊబకాయ బాధితుల్లో 40 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు వీరిని పట్టిపీడిస్తున్నాయి. పక్షవాతం, నరాల సమస్యలు వంటివి దారితీస్తున్నాయి. గత పదేళ్లలో ఆహార అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల చిన్నారుల్లో ఊబకాయ సమస్య తీవ్రంగా ఉంది. ముందు జాగ్రత్తలు.. సమతుల్యమైన ఆహారపు అలవాట్లు రోజు తీసుకోవాలి. వ్యాయమాన్ని కొనసాగిస్తే బరువు పెరగకుండా కాపాడుకోగలుగుతాం. ఒబెసిటీకి గురయ్యాక చేసే వర్కవుట్ల కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ బి.రవికుమార్, ఎండీ, జనరల్ మెడిసిన్, నిర్మల్ వ్యాయమాలు చేయాలి.. చాలామంది ఒబెసిటీకి గురవుతుంటారు. మొదటి నుంచే బరువు పెరుగకుండా సమతుల్యత పాటిస్తే ఊబకాయాన్ని కచ్చితంగా నివారించవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు, మానసిక ప్రశాంతత, రోజు వ్యాయమాలు చేయాలి. – ఎండపల్లి అశోక్ కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు, నిర్మల్ జాగ్రత్తలు ఇవే.. ఊబకాయ సమస్యతో బాధపడేవారు శరీర బరువు తగ్గాలంటే వారంలో రెండు రోజులు ఉపవాసం చేయాలి. 20 ఏళ్లు దాటినవారు ప్రతీరోజు 2,500 కేలరీలు తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్న ఈ కేలరీలు దాటకుండా చూసుకోవాలి. మిగిలిన రెండు రోజుల్లో కేవలం పావు వంతు అంటే 500 కేలరీలు మాత్రమే తీసుకోవాలి. కార్పొహైడ్రేట్లు తక్కువగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలతోపాటు అన్నానికి బదులు రాగి, జొన్న, చేపలు, చికెన్ తీసుకోవాలి. కాఫీ టీ తీసుకోవచ్చు. తరచూ నీటిని తాగుతూ ఉండాలి. ఇవి చదవండి: మగపిల్లల పెంపకం! -
పట్టణ ప్రజల్లో ‘బీమా’పై పెరుగుతున్న చైతన్యం
న్యూఢిల్లీ: పట్టణ ప్రజల్లో జీవిత బీమా పట్ల అవగాహన పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి జీవిత బీమా రక్షణ ఉన్నట్టు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ (ఐపీక్యూ) 6.0లో ద ప్రొటెక్షన్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 45కి చేరుకుందని, ఇది ఐపీక్యూ 5.0లో 43గానే ఉందని తెలిపింది. ప్రజల్లో రక్షణ పట్ల పెరుగుతున్న అవగాహన, ఆమోదాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఐదేళ్ల ఇండియా ప్రొటెక్షన్ క్వొటెంట్ను పరిశీలించి చూస్తే ఐపీక్యూ 1.0లో 35 నుంచి ఐపీక్యూ 6.0లో 45కు చేరుకుందని, పది పాయింట్లు పెరిగినట్టు వివరించింది. ఆర్థిక సామర్థ్యాలను నిర్మించుకునే దిశగా పట్టణ ప్రజల ప్రయాణాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రొటెక్షన్ క్వొటెంట్ 49 పాయింట్లతో దక్షిణ భారత్ ఆర్థికంగా ఎంతో రక్షణ కలిగినట్టు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత పశి్చమ భారత్ 42 పాయింట్ల నుంచి 46 పాయింట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పట్టణ ప్రజల ఆర్థిక రక్షణ స్థాయిలను లెక్కించేందుకు ఐపీక్యూ అచ్చమైన కొలమానంగా మారినట్టు మ్యాక్స్‌లైఫ్ ఎండీ, సీఈవో ప్రశాంత్ త్రిపాఠి అన్నారు. -
పరీక్షలతో ఒత్తిడిగా ఫీలవుతున్నారా? అయితే ఇలా చేయండి..!
"పదో తరగతి, ఇంటర్ పరీక్షలతోపాటు పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు నోటిఫికేషన్లు వచ్చాయి. టెన్త్ పరీక్షలకు దాదాపు నెల రోజుల సమయం ఉండగా, ఇంటర్మీడియెట్ పరీక్షలకు రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో పిల్లలు చాలా కష్టపడి చదువుతుంటారు. ఉత్తమ మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. అత్యుత్తమ మార్కులు సాధించాలన్న లక్ష్యంతో సమయాన్ని వృథా చేయకుండా చదువుతుంటారు. సరిగా నిద్ర పోరు. ఆహారం కూడా సరిగా తీసుకోరు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. ప్రణాళిక లేమి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా తీవ్రమైన ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతారు. పైగా మార్కుల గురించి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలు కూడా వీరిని కుంగుబాటుకు గురిచేసే ప్రమాదముంది. పరీక్షల కోసం సిద్ధమయ్యేటపుడు లేదా జరుగుతున్నపుడు విద్యార్థులు, అభ్యర్థులు పలు విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించేందుకు, కుంగుబాటు నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!" ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి.. పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. జంక్ ఫుడ్ తాత్కాలికంగా మంచి అనుభూతినిస్తుంది.. కానీ, ఇది జీవక్రియలను మందగింపజేసి అలసటకు, బద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి, సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించండి. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే పాలు, పెరుగుతో తయారు చేసిన పదార్థాలతోపాటు మాంసకృత్తులు కలిగివున్న కోడిగుడ్డును తినాలి. పండ్లలో అరటి, యాపిల్, బొప్పాయి, సపోటా పండ్లను తింటే మెదడు చురుకుగా పని చేస్తుంది. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు శరీరంలో నీటిశాతం తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి రోజు ఎనిమిది పెద్ద గ్లాసుల నీటిని తాగాలి. పుష్కలంగా నీరు తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండండి. మీ స్టడీ డెస్క్‌పై, మీతోపాటు వాటర్ బాటిల్‌ను పెట్టుకోండి. నీటితోపాటు పుదీనా ఆకులు, లేదా నిమ్మకాయలతో తయారు చేసిన రసాయనాలను తీసుకోండి. ఈ సీజన్లో మీ శరీరం డీహ్రెడేషన్కు గురవుతుంది. కాబట్టి నీటితోపాటు జ్యూస్‌లు తీసుకోవడం చాలా కీలకం. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్ వంటి ఉత్ప్రేరక పదార్థాలు ఒత్తిడిని పెంచే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలి. సమయానికి తినాలి.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో టైం టు టైం భోజనం చేయాలి. పరీక్షలకు సన్నద్ధమయ్యేటపుడు, పరీక్షా సమయాల్లో భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం, చికాకు, తక్కువ శక్తికి దారితీయవచ్చు. పరీక్షల సమయంలో షెడ్యూల్ పెట్టుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తినేలా చూసుకోండి. జ్ఞాపకశక్తిని పెంచేలా.. జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్నట్లు, అవిసె గింజలు (అల్సీ), గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు (టిల్), సోయాబీన్ నూనె, కనోలా నూనె వంటివి తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన సప్లిమెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో వీటిని తీసుకోవాలి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా, విటమిన్లు A, C, E వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక ఒత్తిడి కారణంగా మెదడు కణాలకు హానిని తగ్గిస్తాయి. ఎక్కువగా మేలుకోకూడదు.. రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని చదవడం వల్ల శరీరంలో కూడా వివిధ రకాల ప్రభావాలు ఏర్పడతాయి. ప్రధానంగా ఒత్తిడిని మరింత పెంచడంతోపాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. అందువల్ల విద్యార్థులు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విధిగా నిద్రపోవాలి. సంపూర్ణ విశ్రాంతి పొందిన తర్వాత పరీక్షల తయారీకి తిరిగి కొత్త ఉత్సాహం పుంజుకోవచ్చు. తద్వారా మీరు చదివినదంతా మెరుగ్గా గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాయామం అవసరం! రోజూ కనీసం 15–20 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. తద్వారా శరీరం, మనసు కూడా పునరుత్తేజం పొందుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఫలితంగా మన శక్తిసామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. విరామం ముఖ్యం.. పరీక్షల సమయం ముంచుకొచ్చే కొద్ది అనేక మంది విద్యార్థులు క్షణం తీరిక లేకుండా చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల మెదడుపై వత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా చదివిన విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల విద్యార్థులు విడతల వారీగా విరామం తీసుకోవడం చాలా అవసరం. తేలికపాటి ఆటలు, సామాజిక–ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సంగీతం, డైరీ రాయడం, చిత్రలేఖనం తదితర అభిరుచులతో మనసు తేలికపరుచుకోవాలి. టైం టేబుల్ ప్రకారం.. పరీక్షలకు సమయం తక్కువ ఉన్నందున విద్యార్థులు ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి అనే విషయంపై ఓ ప్రణాళికను రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా టైం టేబుల్‌ను కూడా తయారు చేసుకొని ఆ సమయం ప్రకారం చదవాలి. చాలా మంది విద్యార్థులు కష్టతరమైన సబ్జెక్టులను చివరగా చదవుదామన్న అభిప్రాయం ఉంటుంది. అయితే ఇది సరైన అభిప్రాయం కాదని విద్యావేత్తలు అంటున్నారు. ముందు కష్టతరమైన పాఠ్యాంశాలను చదవడం పూర్తి చేస్తే ఆ తరువాత సులభతరమైన పాఠ్యాంశాలను త్వరగా చదివి పూర్తి చేసుకోవచ్చు. ఒత్తిడిని సూచించే కొన్ని సంకేతాలు.. కడుపులో తిప్పుతున్న అనుభూతి వికారంగా అనిపించడం అరచేతుల్లో చెమటలు పట్టడం మైకం కమ్మినట్లు అనిపించడం గుండె వేగంగా కొట్టుకోవడం మెదడులో శూన్య భావన ఏకాగ్రత లోపం అయోమయం, భారంగా, నిస్పృహగా అనిపించడం కుదురుగా ఉండకపోవడం, రోదించడం, పళ్లు కొరకడం, వ్యాకులత, అటూ ఇటూ తిరగడం, గోళ్లు కొరకటం వంటివి ‘నేనిది చేయలేను’, ‘నేనిందుకు తగను’ వంటి ఆలోచనలు. మరిన్ని జాగ్రత్తలు! సబ్జెక్టుకు సంబంధించిన అవసరమైన వివిధ చర్చనీయాంశాలు, తేదీలు, వనరుల గురించి ముందుగానే సమాచారం సేకరించుకోవాలి. దీనివల్ల చివరి నిమిషపు హడావుడి తప్పుతుంది. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చదువుకు తగిన వాతావరణం సృష్టించుకోవడం కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఏ పనినైనా ఓ క్రమపద్ధతి ద్వారా చేయడం వల్ల సమయాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. పని పూర్తి చేయడానికి మీకెంత సమయం పడుతుందో వాస్తవ అంచనా వేసుకుని, దానికి కట్టుబడటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్ష రోజున మీకు కావాల్సినవేమిటో నిర్ణయించుకుని ముందు రాత్రే సిద్ధంగా ఉంచుకోండి. అలాగే పరీక్షకు వెళ్లేముందు మీకు ఆందోళనగా అనిపిస్తే కాస్త నిదానించి, నిండైన శ్వాసతో ఏకాగ్రత సాధనకు ప్రయత్నించండి. నిండుగా ఊపిరి పీలుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఆపైన ఊపిరి బిగబట్టి 3 అంకెలు, ఊపిరి విడుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఇలా మీరు స్థిమితపడే దాకా శ్వాస మీదనే ధ్యాసను కొనసాగించండి. పరీక్ష వేళ ప్రశ్నపత్రంలో మీకు జవాబు తెలిసిన ప్రశ్నలకే ముందు సమాధానాలు రాయండి. ఇతరులు ఏం చేస్తున్నారో పట్టించుకోకండి. డాక్టర్‌ను సంప్రదించండి.. పరీక్షల సమయంలో మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటుకు గురైనపుడు అందుబాటులో ఉన్న సమాచారంతో స్వీయవైద్యానికి ప్రయత్నించకూడదు. పరిస్థితి తీవ్రతను బట్టి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైనపుడు డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలి. ఈ మధ్య నిర్మల(పేరు మార్చాం)కు నిద్రపట్టడం పెద్ద సమస్యగా మారింది. భోజనం కూడా సరిగా చేయాలనిపించడం లేదు. తరచూ తలనొప్పితో బాధపడుతోంది. చీటికీమాటికీ చిరాకు పడుతోంది. కుంగుబాటుకు లోనవుతోంది. రోజురోజుకూ మరింత ఆందోళనకు గురవుతోంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటోంది. దీంతో సరిగ్గా చదవలేకపోతోంది. దీనికంతటికీ కారణం త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటం. ఆమె పరీక్షలకు సిద్ధమయ్యే ప్రయత్నం బాగా చేస్తున్నా అనవసర భయాందోళనలకు గురవుతోంది. ఇది ఒక్క నిర్మల సమస్యే కాదు.. టెన్త్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది విద్యార్థుల పరిస్థితి. మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి.. ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో కచ్చితంగా మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. పూర్తిగా చదువు మీదనే శ్రద్ధ ఉంచాలి. మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే చదువుకున్నప్పటికీ ఏకాగ్రత సన్నగిల్లుతుంది. దీంతోపాటు మంచి నిద్ర, ఆహారం తీసుకోవాలి. కొన్ని గంటల పాటు చదివిన తరువాత మొక్కలకు నీళ్లు పోయడం, పెయింటింగ్, ఇతర మంచి అలవాట్లతో రిలాక్స్ కావాలి. తరువాత మరలా చదువుపై దృష్టి సారించాలి. – పి.వి.సునీత, సైకాలజిస్ట్, వన్‌స్టాప్ సెంటర్ మార్కులు, గ్రేడ్లు ముఖ్యం కాదు.. పరీక్షల సమయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో ఉంది. పిల్లలు తగినంత నిద్రపోయేలా చూడాలి. మంచి ఆహారం తినేలా చూడాలి. అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా వారిని ప్రోత్సహించాలి. మార్కులు, గ్రేడ్లు మాత్రమే జీవితం కాదని ధైర్యం చెప్పాలి. – డాక్టర్ వెంకటరాముడు, సూపరింటెండెంట్, మానసిక వైద్యశాల, రిమ్స్ -
World Cancer Day Feb-4 : 'జీన్' సైలెన్సింగ్ ఎడిటింగ్!
'మనం ఏదైనా రాస్తుంటాం. లేదా సినిమా కోసం రీల్స్ తీస్తుంటాం. తీరా రాశాక లేదా తీశాక అది అంత సరిగా లేదని లేదా కోరుకున్నట్లుగా రాలేదనీ లేదా తీసిన సమాచారం అవసరం లేదనిపిస్తుంది. అప్పుడు మనం చేసే పని ‘ఎడిటింగ్’! అలాగే.. మన ప్రతి ఒక్కరి జీవితంలో.. మన అవయవ నిర్మాణం, వికాసం, ఆరోగ్యచరిత్ర.. వీటన్నింటికీ మూలం ఈ రాత లేదా రీల్స్ రూపంతో పోలిక గల జన్యువులు. ఎక్కడైనా పదాలు తప్పుగా వస్తే వాటిని సవరించినట్లుగా, సినిమాలో రీల్స్ తప్పుగా వస్తే వాటిని సరి చేసినట్టుగానే.. ఈ జన్యు పొరబాట్లనూ సరి చేసే ప్రక్రియే ‘జీన్ ఎడిటింగ్’. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలతో జన్యులోపాలతో వచ్చే క్యాన్సర్లనూ లేదా జబ్బులను పూర్తిగా నయం చేయవచ్చు. ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ అత్యంత కొత్త చికిత్స విధానాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.' మన దేహం మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది. కణం మధ్యలోని న్యూక్లియస్‌లో క్రోమోజోములుంటాయి. ఈ క్రోమోజోములన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలతో కలగలసిన జన్యువులతో నిర్మితమై ఉంటాయి. మన దేహం తాలూకు అన్ని జీవక్రియలూ వాటి మీదే ఆధారపడి నడుస్తుంటాయి. అంటే జీవకణంలో జరిగే మొత్తం ప్రాసెసింగ్‌కు ఈ ఆర్ఎన్ఏలు దోహదపడుతుంటాయి. అవి చేసే పనులను బట్టి ఎమ్ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీ ఆర్ఎన్ఏ అనే రకాలతో ప్రోటీన్ల రూపకల్పనకు సహాయపడుతుంటాయి. ఈ ఆర్ఎన్ఏ, డీఎన్ఏల ప్రాసెసింగ్ ప్రక్రియల్లో తేడాలు జరిగినప్పుడు అవి వ్యాధుల రూపంలో.. ప్రధానంగా క్యాన్సర్లుగా బయటపడతాయి. జన్యులోపాలతో వ్యాధులు ఎలాగంటే.. కొన్ని మన జన్యువుల మూలస్థానాల్లో పొరబాటు జరిగినప్పుడు.. అది ఓ జబ్బు రూపంలో అందునా క్యాన్సర్ల రూపంలో ఎలా బయటపడతాయో చూద్దాం. ఉదాహరణకు బీసీఆర్ ఏబీఎల్ అనే జన్యువులో లోపం వల్ల టైరోసిన్ కైనేజ్ అనే ఓ ఎంజైము నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది అత్యధికంగా తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయమంటూ దేహానికి ఆదేశాలు అందజేస్తుంది. దాంతో ఓ తెల్లరక్తకణం జీవితకాలం పూర్తి కాకుండానే అనేక తెల్లరక్తకణాలు పుట్టుకొస్తుంటాయి. పాలు విరిగినప్పుడు పనికిరాని విధంగానే.. రక్తంలో లోపభూయిష్టమైన తెల్లరక్తకణాలు గుంపులు గుంపులుగా గుమిగూడిపోయి, పూర్తిస్థాయి మెచ్యురిటీ రాకుండానే నశించిపోయి రక్తం విరిగినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడం వల్ల అది ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ అనే బ్లడ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఒక జన్యువు చెడిపోవడం వల్ల/ లోపం కలగడం వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా రకాలే ఉంటాయి. కొత్త చికిత్స ప్రక్రియలేమిటి? అవి ఎలా పనిచేస్తాయంటే... జన్యువులు, జెనెటిక్ కోడ్స్‌లో వచ్చే మ్యూటేషన్లు, వాటి కారణంగా ఉత్పన్నమయ్యే లోపాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించడానికి పరిశోధకులు సరికొత్త విధానాలను కనుగొంటున్నారు. వాటిల్లో జీన్ ఎడిటింగ్లూ, జీన్ సైలెన్సింగ్లన్నవి ఇటీవలే కనుగొన్న విధానాలు. అదెలాగంటే.. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కణంలోని జీవక్రియల్లో రకరకాల ఆర్ఎన్ఏలు.. (తాము ఏ రకానికి చెందినవన్న దాన్ని బట్టి).. జన్యు సమాచారాన్ని అందజేయడం, నిక్షిప్తపరచడం వంటి పనులు చేస్తాయి. ఇవన్నీ ఎమైనో యాసిడ్లూ, ప్రోటీన్లు ఏర్పడటం ద్వారా జరుగుతుంటాయి. ఇలాప్రోటీన్లు రూపొందే సమయంలో కొన్ని అదనంగా ఏర్పడవచ్చు. మరికొన్ని ఏర్పడాల్సిన విధంగా ఏర్పడకుండా మిస్ కావచ్చు. లేదా ఇంకొన్ని తప్పుడు సీక్వెన్స్‌లో ఏర్పడవచ్చు. వీటిల్లో ఏది జరిగినా.. అది వ్యాధిగా వ్యక్తమవుతుంది. చక్కదిద్దడానికి పరిశోధకులు చేస్తున్నదేమంటే.. ఇలా జన్యువుల్లోని లోపాల వల్ల వచ్చే క్యాన్సర్లను చక్కదిద్దడానికి పరిశోధకులు కొన్ని ఎడిటింగ్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వారు మొత్తం ఆర్ఎన్ఏ కాకుండా... తమకు కావాల్సిన మేరకు చిన్న చిన్న ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ స్ట్రాండ్స్ రూపొందిస్తారు. ఇలా రూపొందించిన స్ట్రాండ్స్ను ‘యాంటీ సెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్స్’ (ఏఎస్ఓ)లని అంటారు. కణంలోని జన్యుసమాచారాన్ని అందించడం, ఉపయోగించడం వంటి కార్యకలాపాలు జరిగే సమయంలో.. బహిర్గతం కావాల్సినప్రోటీన్ భాగాలు బయటకు రాకపోయినా, లోపలే ఉండాల్సినవి బయటకు వచ్చినా లేదా ఆర్ఎన్ఏ రూపంలో తేడాలు వచ్చినా అది క్యాన్సర్‌గా బయటపడుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పరిశోధకులు రూపొందించిన ఈ ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’, సంక్షిప్తంగా ఏఎస్ఓలనేవి చిన్న చిన్న స్ట్రాండ్స్గా ఏర్పడి.. ప్రధానంగా ఈ కింద పేర్కొన్న పద్ధతుల్లో వాటిని చక్కదిద్దుతాయి. అదెలాగంటే.. 1. ఆర్ఎన్ఏలో లోపభూయిష్టమైనప్రాంతం ఉంటే.. ఈ చిన్న స్ట్రాండ్స్ అక్కడికి వెళ్లి ప్రమాదకరమైన దాన్ని తొలగించడం లేదా పూర్తిగా కత్తిరించి మాయం చేయడం చేస్తాయి. (ఇది ఒకరకంగా ఎడిటింగ్ లాంటి ప్రక్రియ). 2. ఈ ఏఎస్ఓలు.. ఆర్ఎన్ఏ లోని లోపభూయిష్టమైనప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా జన్యులోపాలను చక్కదిద్దుతాయి. ఇక్కడ ఏఎస్ఓలు రెండు రకాలుగా పని చేస్తాయి. మొదటిది లోపభూయిష్టం కావడం వల్ల అవాంఛితమైన జన్యుపదార్థాలను అసలు పుట్టకుండా చేయడం లేదా ఆలస్యం చేయడం. 3. మరో ఇతర ఆరోగ్యకరమైన జన్యువు లోంచి.. తనకు కావాల్సిన విధమైన కార్యకలాపాలు నిర్వహించే ఆరోగ్యకరమైన జన్యువునే ఉద్భవింపజేసి, దాన్ని ఇక్కడ వాడుకునేలా చేస్తాయి ఈ ఏఎస్ఓలు. ఇలా చేయడం ద్వారా స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ అనే వెన్నుకు సంబంధించిన కండరాల వ్యాధి, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా అనే మతిమరపు వ్యాధులకు పరిశోధకులు ఇప్పటికే సమర్థమైన చికిత్సా విధానాలను, పూర్తిస్థాయి పరిష్కారాలను కనుగొన్నారు. ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’లను రూపొందింది ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే.. ప్రకృతి చాలా అద్భుతమైనదీ, సంక్లిషమైనది. మన దేహంలోని ఒక కణంలో పది పక్కన పదమూడు సున్నాలు పెట్టినన్ని జన్యువులు ఉంటాయి. అంతేకాదు.. రోజుకు మన దేహంలో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇన్నిన్ని కణాల్లో ఇంతగా విభజన జరిగే సమయంలో ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొరబాటు జరగకమానదు. వీటిని సరిచేయడం కోసమే మన దేహంలో ‘మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ మెకానిజమ్’ అనే ప్రక్రియ ద్వారా పొరబాట్లను చక్కదిద్దడం జరుగుతుంది. ఏఎస్ఓ జీన్ మాడిఫికేషన్లూ, ఎడిటింగ్లూ, సైలెన్సింగ్లను జీన్ మాడిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే నేర్చుకున్న పరిశోధకులు... ఇప్పుడు వీటినే లోకకళ్యాణం కోసం ఉపయోగిస్తూ కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొంటున్నారు. చివరగా.. ఇప్పుడు ఇదే ప్రక్రియనూ, ఇవే సిద్ధాంతాలను ఉపయోగించి.. కొన్ని జన్యువులను ఎడిటింగ్ చేయడం ద్వారా, అవ్యక్తంగా ఉండాల్సిన మరికొన్ని జన్యువులు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నిశ్శబ్దపరచడం (సైలెన్సింగ్) ద్వారా సీఎమ్‌ఎల్ మొదలుకొని చాలా రకాల క్యాన్సర్లకు చికిత్సలను కనుగొని పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం ఒకే జన్యువు లోపం వల్ల ఒకే వ్యాధి వచ్చే కేసుల్లోనే ఈ తరహా చికిత్స పనిచేస్తుందంటూ పరిశోధకులు దీని పరిమితులనూ చెబుతున్నారు. ఈ తరహా చికిత్సతో చాలా క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండటం మనకు దగ్గర్లో కనిపిస్తున్న ఓ ఆశారేఖ. క్యాన్సర్ చికిత్స కోసం మరికొన్ని కొత్త పద్ధతులు.. జీన్ సైలెన్సింగ్, జీన్ ఎడిటింగ్ అన్నవి ప్రయోగాత్మకంగా విజయవంతమైన చికిత్స ప్రక్రియలు. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొన్ని దేశాలలో కొంతవరకు అందుబాటులోకి వచ్చిన మరికొన్ని ఆధునిక, ఆసక్తికరమైన చికిత్స, నిర్ధారణ ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో.. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. క్యాన్సర్ చికిత్సలోనూ పరిశోధకులు కృత్రిమ మేధ సహాయం తీసుకుంటున్నారు. క్యాన్సర్ సెల్ కూడా ఒక కణమే కాబట్టి దాని జన్యుపటలాలను మనిషి ఒక్కడే అర్థం చేసుకోవాలంటే చాలా టైమూ, శ్రమ వృథా అయ్యే అవకాశముంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఏఐ’ సహాయంతో క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్‌ను విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా తుదముట్టించవచ్చో తెలుసుకుని, ఆ మేరకు కొత్త చికిత్సలను రూపొందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ నోస్ (ఈ–నోస్)తో క్యాన్సర్ వాసన పసిగట్టే ప్రయత్నం.. క్యాన్సర్ వ్యాధి కణం చాలా చాలా చిన్నగా ఉంటుంది. దాని సైజుకు దాదాపు నాలుగు వందల రెట్లు పెరిగాకే.. ఆ కణజాలాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో క్యాన్సర్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుంది. అయితే ఒక చిన్న మూత్రపరీక్షతో చాలా చాలా తొలిదశలోనే క్యాన్సర్‌ను కనుగొనే సాంకేతికతను అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న ‘బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్’ కు చెందిన పరిశోధకులు. ఒక ఎలక్ట్రానిక్ ముక్కును వీరు రూపొందించారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళల్లో వాళ్ల మూత్రపు వాసన ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు క్యాన్సర్‌ను పసిగడుతుంది. దీన్ని ‘ఈ–నోస్’ అని పిలుస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... చాలా చవగ్గా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్.. క్యాన్సర్ కణం తాలూకు జన్యుపటలం ఆరోగ్యకరమైన కణంలా కాకుండా విభిన్నంగా ఉండటమే కాదు.. విపరీతంగా కూడా ప్రవర్తిస్తుంటుంది. టీఆర్కే ఫ్యూజన్ప్రోటీన్ అనే ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణ జన్యుపటలంలోనిప్రోటీన్ల చైన్’లలో మార్పులేవైనా చేయడం ద్వారా అది తనంతట తాను నశించిపోయే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ఇది జరిగితే క్యాన్సర్ చికిత్సలో అది ఓ విప్లవాత్మకమైన మార్పు అవుతుంది. హైపర్‌థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్.. కీమోథెరపీ ప్రయోగం మరింత విస్తృతంగా.. కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది దేహంలోని ఒక భాగంలో ఉన్న క్యాన్సర్‌పైనే కాకుండా దేహంలోని మొత్తం కణాలపైనా పనిచేస్తుంటుంది. దీనికి భిన్నంగా ప్రయోగించేదే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ. ఇందులో పొట్ట తెరిచి కడుపు కుహరంలో మందును ఉంచుతారు. అక్కడది విపరీతమైన వేడిపుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను మాడ్చేస్తుంది. ఆరోగ్యకరమైన కొన్ని కణాలూ భస్మమైనప్పటికీ అవి మళ్లీ పుడతాయి. కానీ క్యాన్సర్ కణాలు పూర్తిగా మటుమాయమైపోతాయిగానీ మళ్లీ పుట్టవు. ఈ థెరపీని కొన్ని కడుపు క్యాన్సర్లలో వాడుతున్నారు. డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవి చదవండి: బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది! -
నేను జీవించే ఉన్నాను!
‘‘సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) కారణంగా నేను చనిపోలేదు... బతికే ఉన్నాను. దురదృష్టం ఏంటంటే.. అనేక మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల వారు వారి జీవితాలను కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల మాదిరి కాదు. ఇందుకు మెరుగైన చికిత్స ఉంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్, వైద్య పరీక్షలతో వెంటనే ఈ క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ్రపాణాలు కోల్పోకుండా ఉండేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పిద్దాం’’ అని పేర్కొన్నారు నటి, మోడల్ పూనమ్ పాండే. ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓపోస్ట్ షేర్ అయింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరణ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే కాన్పూర్పోలీసులకు, అక్కడి మీడియాకు పూనమ్ పాండే మరణంపై సరైన స్పష్టత లేదు. దీంతో పూనమ్ జీవించే ఉన్నారని, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా తాను మృతి చెందినట్లు ఫేక్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఫైనల్‌గా ఇదే నిజమైంది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగానే తన చావును ఫేక్ చేసినట్లుగా పూనమ్ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వీడియోలు షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 4) వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే పూనమ్ ఈ విధంగా చేయడం వివాదాస్పదంగా మారడంతో మరికొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ‘‘అవును.. నా చావును ఫేక్ చేశాను. కానీ సడన్‌గా అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. సైలెంట్‌గా జీవితాలను ముగించే వ్యాధి అది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. నా చావు వార్త సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చను పైకి తెచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఓ సెలబ్రిటీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిందన్న వార్త దేశవ్యాప్తంగా ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను చేయాలనుకున్నది ఇదే. నేను ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అంటూ వీడియోలు షేర్ చేశారు పూనమ్. -
బొట్టు.. బొట్టు.. మెట్ట భూముల్లో పచ్చని పంట చిగురించేట్టు!
మారుతున్న కాలానుగుణంగా.. వ్యవసాయ పద్ధతులలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా.. కొందరు రైతులు మైదానంలాంటి మెట్ట భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. వర్షాకాలం వరకు ఎందుకు ఎదురుచూపులంటూ.. వారి వద్దనున్న నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగించి పచ్చని పంటలు పండిస్తున్నారు. వారిని గురించి తెలుసుకుందాం. స్ప్రింక్లర్లతో సాగు చేస్తున్న కొత్తిమీర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాడుగులపల్లి మండలంలోని సాగర్ ఆయకట్టేతర ప్రాంత రైతులు బిందు, తుంపర సేద్యంపై దృష్టి సారించారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని మెట్ట భూముల్లో పచ్చని పంటలు పండిస్తున్నారు. తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 3 నుంచి 4 వేల ఎకరాల్లో వేరుశనగ, కొత్తమీర, దోస, ఇతర కూరగాయలు పండిస్తున్నట్లు మండల ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం పరికరాలు సబ్సిడీపై అందిస్తే మరింత మంది రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది. ఇవి చదవండి: ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు! -
ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!
రైతులు బెండసాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంటున్నారు. హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్. దీనివలన భూసారంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రసాయన ఎరువుల ఖర్చులను ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. వచ్చే వేసవి బెండ సాగుకు అనుకూలమని, పంట సాగుకు అవలంబించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే.. వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందు వలన పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది. నేలలు : సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం గల తేలికపాటి రేగడి నేలలు అనుకూలం. విత్తే సమయం : వర్షాకాలపు పంటకు జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు : వేసవి పంటకు ఎకరాలకు 7 నుంచి 8 కిలోల విత్తన సరిపోతుంది. రకాలు : పర్భని క్రాంతి, అర్కఅనామిక, అభయ విత్తన శుద్ధి.. విత్తనాలను విత్తే ముందు 12గంటలు నీటిలో నాన బెట్టాలి. ఆవు మూత్రం ద్రావణంలో (1:5 నిష్పత్తిలో నీటిలో కలిపి) 30 నిమిషాలు శుద్ధి చేయాలి. విత్తనశుద్ధికి 100 మి.లీ. ఆవు మూత్రం, 100 గ్రాములు ఆవు పేడ, 100 గ్రాములు గట్టుమట్టి, లేదా పుట్ట మట్టి కలిపిన నీటిలో ఒక గంట వరకు నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భీజామృతం లేదా అమృత జలం లేదా పంచగవ్యం ద్రావణంలో 8గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పొలం తయారీ, విత్తే పద్ధతి.. నేలను 4–5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంలో బోదెలపై 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో రంధ్రానికి 2–3 విత్తనాలను విత్తుకోవాలి. పోషకాల యాజమాన్యం.. 10 నుంచి 15 మి.లీ. కోడిగుడ్లు, నిమ్మకాయ రసం ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దిగుబడులు పెంచవచ్చు. మొక్కలు మొలిచిన 3–4 రోజుల్లో తొలిసారి 3 శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి. పూత దశకు ముందే 5 శా తం పంచగవ్య పిచికారీ చేయాలి. పంట రెండు వారాల వయస్సులో 400 లీటర్ల జీవామృతం సాగు నీటిలో అందించాలి. మొక్క 4–6 ఆకుల దశలో తులసీ–కలబంద కషాయం పిచికారీ చేయాలి. పంటపై 2 శాతం పంచగవ్య పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి. రక్షణ పంటలు : తోట చుట్టూ జొన్న, సజ్జ, బంతి మొక్కలను పెంచాలి. అంతర పంటలు : పైరు మధ్యలో బంతి మొక్కలను ఎర పంటగా వేయాలి. అంతర పంటలుగా ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. నీటియాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 4–5 రోజులకు రెండోసారి నీరు పారించాలి. వేసవి పంటకు అయితే ప్రతి 4–5 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు పెట్టాలి. దిగుబడి : 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. భూసార యాజమాన్యం ఇలా.. దబోల్కర్ పద్ధతిలో వివిధ రకాల విత్తనాలను విత్తి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి. ఎకరానికి పశువుల ఎరువు 10 టన్నులు, 500 కిలోల ఘనజీవామృతం, వేప పిండి 100 కిలోలు, వేరుశనగ పిండి 32–40 కిలోలు, 2 కిలోలు అజోస్పైరిల్లం, 2 కిలోలు పాస్పోబ్యాక్టీరియా, ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం, 15 రోజుల వ్యవధిలో సాగు నీటిలో అందించాలి. -
'జంక్ ఫుడ్' ఎంత ప్రమాదకరమో..! మాన్పించాలంటే ఇలా చేయండి!
పీజా, బర్గర్, శాండ్విచ్, కూల్ డ్రింక్స్ లాంటి జంక్ ఫుడ్స్‌కు అలవాటుపడిన పిల్లలు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరు. రోజూ జంక్‌ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఇది పట్టని పిల్లలు అదే కావాలని మొండికేస్తుంటారు. ఇటువంటి వారిని జంక్ఫుడ్ని దూరంగా ఉంచాలంటే ఇలా చేయండి చాలు.. ఇష్టమైనవి వండండి.. జంక్‌ఫుడ్ పూర్తిగా మాన్పించాలంటే.. ముందుగా పిల్లలు బాగా ఇష్టపడే వంటకాలను వండాలి. పిల్లలు ఏది తినడానికి ఆసక్తి చూపుతున్నారో అవి మాత్రమే వారికి చేసిపెట్టాలి. పెద్దలు తినేదే రోజు పెడితే అది నచ్చక బయట ఫుడ్‌కి అలవాటు పడతారు. ఇంట్లో ఫుడ్ మొహం మొత్తకుండా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఉపయోగించి బర్గర్స్, పిజ్జాలను ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి. అలవాట్లు.. వీలైనంత త్వరగా పిల్లల ఆహారపు అలవాట్లు మార్చాలి. అలవాట్లు మార్చుకోకపోతే జంక్‌ఫుడ్ మానరు. మీరు చేసే ఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో వివరిస్తూ, బుజ్జగిస్తూ చెబితే బయట తినే అలవాటును మానుకుంటారు. పోషకాల గురించి వివరించాలి.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పిల్లలకు పెట్టే రకరకాల డిష్‌లను వేటితో తయారు చేశారు, వాటిలో పోషకాలు ఏం ఉంటాయి? అవి శరీరానికి చేసే మేలుని చక్కగా వివరిస్తే ఇంటి ఫుడ్‌ని తినడానికి ఆసక్తి చూపి జంక్ ఫుడ్‌ని అస్సలు ముట్టరు. ఈ పద్ధతులను అనుసరిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా మారడం ఖాయం. ఇవి చదవండి: నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి.. -
హెల్త్ టిప్స్: మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
ప్రస్తుతం మనం జీవిస్తున్న శైలిలో.. ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన శరీరంలో కూడా మార్పులు సహజమే. ఆహారపు అలవాట్ల వలన గానీ, విరామం లేకుండా శ్రమించడం వలన గానీ.. శరీరంలో బరువు పెరగడం, చర్మ సమస్యలు, గుండె జబ్బులు రావడం, రక్తపోటుతో బాధపడటం లాంటి సమస్యలను ఎదుర్కుంటున్నాం. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించడం తప్పనిసరి. బరువును అదుపులో ఉండాలంటే.. ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు రాత్రి నానబెట్టి.. తెల్లవారు జామున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. మినపప్పు వెన్నుపూసకు బలాన్నిస్తుంది. అంతేకాదు మినపప్పులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆవాలు గుండెకు మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు అందిస్తాయి. ఇవి చదవండి: 'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..! -
'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..!
ఈ రోజుల్లో కొంతమందికి చిన్న వయసులోనే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గాని, కొన్ని అలవాట్ల వల్ల గాని కంటి చూపు మందగిస్తుంది. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. పోషకాల లోపం.. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు, క్యారట్, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోండి. చత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం.చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇవి కూడా చదవండి: 'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!? -
'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!?
భారతీయులు ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు దగ్గు సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాల టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సుగుణాలు గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి.. కొంతమందిలో వాతావరణంలోని తేమ పరిమాణాలు తగ్గడం పెరగడం కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే చలికాలంలో తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాలతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం.. శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి.. ఈ దగ్గు కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. కొంతమందిలో చలి కారణంగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణ క్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోండి. ఇవి చదవండి: నడుము నొప్పా? సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి! -
నడుము నొప్పా? సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి!
నడుంనొప్పి ఉన్నవారు ఆ బాధ బయటకు చెప్పుకోలేరు. చాలా ఇబ్బంది పడుతుంటారు. తరచు పడకకే పరిమితం అయిపోవలసి వస్తుంటుంది. నొప్పి వచ్చినప్పుడల్లా సింపుల్‌గా ఒక పెయిన్ కిల్లర్‌ను వేసేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మాత్ర నొప్పితోపాటు క్రమంగా మనల్నీ కిల్ చేస్తుంటుందన్న విషయాన్ని మరచిపోవద్దు. నడుంనొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు... సింపుల్‌గా తగ్గిపోతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం... బాగా నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది. చిన్న చిన్న టిప్స్‌తో నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు. పడుకునే సమయంలో వెనుక భాగంపై ఒత్తిడి పడుతుంది. నడుంనొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని నిద్రించడం వల్ల, కాళ్ళు ఎత్తుగా పెట్టడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. సరైన శిక్షణతో వ్యాయామం.. నడుం నొప్పి నుంచి ఉపశమనం నడుంనొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండుసార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి. కాల్షియం, విటమిన్ డి.. ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువ బాధించవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. చెప్పుల విషయంలో జాగ్రత్త నడుంనొప్పిని నివారించడం కోసం చెప్పుల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఎత్తు మడమల చెప్పులు ఎక్కువగా వేసుకునే వారికి నడుంనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ మడమ ఉన్న చెప్పులను ధరించండి. ఇవి మన నడుంపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక్క అంగుళం కంటే తక్కువ మడమ ఉంటేనే ఫలితం బాగుంటుంది. సరైన పొజిషన్.. ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ప్రతిరోజూ గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. బరువు తగ్గించుకోవడం.. నడుం నొప్పికి మరొక కారణం విపరీతమైన బరువు. ఎక్కువ బరువు ఉన్న వారిలోనూ నడుమునొప్పి విపరీతంగా వస్తుంది. బరువు తగ్గితే సహజంగానే నడుం నొప్పి నుండి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గటం పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, చిన్న చిన్న మార్పులతో నడుం నొప్పి ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మందులతోనే నడుము నొప్పి తగ్గాలని చూడకుండా, పై చిట్కాలు పాటించి చూడండి. కచ్చితంగా విపరీతమైన బాధ నుండి కాస్తయినా ఉపశమనం పొందుతారు. ఇవి చదవండి: బిడ్డ పుట్టినట్టు, ఏడుస్తున్నట్టు కల వస్తే.. అపశకునమా! -
కిచెన్‌లో తుప్పు సమస్యలతో ఇబ్బందా? ఇలా ట్రై చేయండి..
'ప్రతీ ఇంట్లో ఎదుర్కునే సమస్యలలో వంట గది ఒకటి. వంట గది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యమంటారు. అయితే వంట ఇంటిని అందంగా, హెల్దీగా ఉంచుకోవడం అంత ఈజీకాదు. ఇందుకోసం చాలామంది మహిళలు తెగ ఖంగారుపడుతూ ఉంటారు కూడా. అయితే 24 గంటలూ కిచెన్ అద్దంలా మెరుస్తూ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..' ముఖ్యంగా తిండి పదార్థాలతో పాటు కొన్ని రకాలైన స్టీల్ బౌల్స్ కూడా తుప్పు పడుతూంటాయి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికిగా మారటం. మరో ప్రధాన సమస్య బల్లులతో పంతం పట్టడం.., లేదంటే దూరంగా పారిపోవటంలాంటిది చేస్తుంటారు.' మరి ఇలాంటి సమస్యలను తేలికగా దూరం చేయడానికి ఈ టిప్స్‌ని ఉపయోగించండి. స్టీల్ పాత్రలు వెలిసిపోయి పాతపడినట్లుగా అనిపిస్తే... అయిపోయిన టూత్ పేస్టు ట్యూబ్‌ని ముక్కలుగా కత్తిరించి, లోపల ఉన్న కొద్దిపాటి పేస్టుని స్టీల్ పాత్రకు రాసి టూత్ బ్రష్‌తో రుద్దాలి. రెండు చుక్కలు నీళ్లు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి. వెండిసామాన్లు కూడా టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి అంతా పోయి కొత్తవాటిలా కనిపిస్తాయి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్, చిన్న అద్దాలు మురికి పట్టి సరిగా కనిపించకపోతే కొద్దిగా టూత్‌పేస్టు వేసి రుద్ది, వస్త్రంతో తుడిస్తే దుమ్మూధూళి, మరకలు పోయి అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. మిరియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలను సమపాళల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్ప్రే బాటిల్ల్లో వేయాలి. ఈ మిశ్రమాన్ని బల్లులున్న ప్రాంతంలో స్ప్రే చేస్తే ఘాటు వాసనకు బల్లులు పారిపోతాయి. ఇవి చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్! -
ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..!
'రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైనా నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.' రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైనా నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర మంచిదని అధ్యయనంలో రుజువైంది. రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయన వేత్తలు గుర్తించారు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించేందుకు సమయాన్ని కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇవి చదవండి: ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా? -
ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా?
'కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏ తాళం చెవో, పెన్ను రీఫిలో, పొడవుగా చుట్టిన కాగితాన్నో, ఏవీ దొరక్కపోతే చేతివేళ్లతోనో చెవిలో సంగీతం పాడిస్తుంటారు. ఈ చికాకంతా ఎందుకని చాలామంది స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేస్తుంటారు. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.' ఇంతకీ చెవి ఎలా శుభ్రం చేయాలో చూద్దాం... కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్‌ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. అంతేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి. దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మరి ఇయర్ వాక్స్‌ని ఏం చేయాలి? దాని జోలికి వెళ్లకుండా ఉండడమే సరి. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టక్కరలేదు. ఎందుకంటే, చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఈఎన్టీ నిపుణుని కలవండి. ఇవి చదవండి: 'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా? -
'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా?
ప్రతిరోజూ మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడడమే కాకుండా, చర్మ సమస్యలు రాకుండా రక్షణ కవచంలా ఉంటాయని మీకు తెలుసా? ఇలా ఒక్క చర్మ సమస్యలే కాదు,.. రక్తప్రసరణ, గుండె జబ్బులు, అల్సర్లు, వివిధ అనేక సమస్యల నుంచి కాపాడటంలో దివ్య ఔషధంగా పని చేస్తుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపలో ఎ,సి బి6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రోటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలోని క్యాప్సైసిన్ అనే పదార్థం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది. పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు పచ్చి మిర్చితో చేసిన ఫుడ్ తీసుకోవడం మేలు చేస్తుంది. పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరప మెదడులోని ఎండార్ఫిన్లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఇవి కూడా చదవండి: మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి! -
మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి!
చాలా మంది కాలి చీలమండల ప్రాంతంలో నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల నడవటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నొప్పి రాకుండా వివిధ రకాల ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మందు ప్రభావం తగ్గిన వెంటనే, నేనున్నానంటూ మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఇంటి నివారణ చిట్కాల సహాయంతో పాదాల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మడమల నొప్పులు ఏ సీజన్లో అయినా రావచ్చు కానీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమౌతుంది. ఈ నొప్పులకు కారణాలు అనేకం. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు లేదా చెప్పులు ధరించడం, శరీరంలో కాల్షియం లోపించటం వంటివి ముఖ్య కారణాలు. అల్లం మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవటం మంచిది. దీనికిగాను ముందుగా రెండు కప్పుల నీళ్లలో అల్లం వేయాలి. తరువాత దానిని మరగనివ్వాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత అందులో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి సేవించడం వల్ల వల్ల చీలమండల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. చేప ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి. రాక్‌సాల్ట్ మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రాతి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్‌సాల్ట్ వేయండి. ఆ తర్వాత, ఈ నీటిలో పాదాలను 10–15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి, వాపు ఉపశమిస్తాయి. ఐస్ క్యూబ్స్ మడమల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఐస్‌క్యూబ్‌లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. లవంగ నూనెతో మసాజ్ మడమ నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగ నూనెతో సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగ నూనెతో మసాజ్ చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పసుపు మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపునీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ మడమల నొప్పి. వాపు వంటి సమస్యలు ఉంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపకరిస్తుంది. కాసిని వేడినీళ్లలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇవి చదవండి: కుకింగ్ టు కామెడీ క్వీన్స్.. -
చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
'చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్లవాపులు రావడం మామూలే. గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి మూడు నెలల్లో (చివరి ట్రైమిస్టర్లో) కాళ్ల వాపు రావడం ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘జెస్టెషనల్ అడిమా’ అంటారు. ఇలా కాళ్లవాపులు రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలూ – పరిష్కారాలపై అవగాహన కోసం ఈ కథనం.' గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ల వాపులు రావడం.. అందునా అవి ఉదయం పూట కొద్దిగా ఉండి, క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండటం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి. దేహనిర్మాణ పరమైన (అనటామికల్) కారణం.. గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడి వైపునకు కాస్తంత ఒరుగుతుంది. కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్ వీన కేవా శరీరానికి కుడివైపునే ఉంటుంది. గర్భసంచి కుడి వైపునకు ఒరగడం వల్ల.. అది ఇన్ఫీరియర్ వీన కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ల నుంచి గుండె వైపునకు రక్తప్రవాహం సాఫీగా సాగక కాళ్లవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్కమీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్ సమస్యలు.. గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి. మనదేశ మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కాళ్ల వాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్/కౌంట్ (సీబీపీ/సీబీసీ) వంటి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణం. మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు రావచ్చు. కాళ్లవాపు తగ్గడానికి చేయాల్సిందిదే.. మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు. వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందుగాని, డెస్క్ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా పీటగానీ, స్టూల్‌గాని వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలు ΄ాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారూ,.. అలాగే ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారూ, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపులు తగ్గని వారు.. తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోవాలి. - డాక్టర్ రమ్యతేజ కడియాల, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్ ఇవి కూడా చదవండి: చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త! -
చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త!
'చలిగా ఉండే ఈ సీజన్లో ఎంత వ్యాయామం చేసినా వెంటనే చెమట పట్టనందున ఎంతసేపైనా ఎక్సర్సైజులు చేసుకోవచ్చు అనేది ఫిట్నెస్ ఫ్రీక్ల ఆసక్తి. అయితే ఈ సీజన్లో ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ తాలూకు ప్రభావం ఉంటుంది. అంతేకాదు.. చలికాలంలో ‘ఇన్వర్షన్’తో పాటు ఈ ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ల ప్రభావంతో ఊపిరితిత్తుల మీదా, ఆ అంశం ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలుంటాయి. అందుకే చలిలో చెమట పట్టదనీ, అలసట రాదనీ వ్యాయామాలు చేసేవాళ్లూ, అలాగే చల్లటి వాతావరణంలో హాయిగా ఆరుబయట తిరగాలనుకునే వాళ్లు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్లెవల్ ఓజోన్’ ప్రభావమేమిటో, అది ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది.' రోడ్డు మీద పొగలు చాలా ఎక్కువగా వెలువరుస్తూ వాహనాలు వెళ్లాక.. చాలాసేపటివరకు ఆ పొగ చెదిరిపోదనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఆ పొగనుంచి పయనించే వాహనదారులంతా కాసేపు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం కూడా సహజమే. మామూలుగానే ఉండే ఈ పరిస్థితికి తోడు.. శీతకాలంలోని చలివాతావరణంలో ఈ పొగ మరింత ఎక్కువ సేపు అలముకుని ఉంటుంది. ఇందులో పొగమంచూ, కాలుష్యం కలిసిపోయి ఉండటం వల్ల ‘స్మాగ్’ అనే కాలుష్య మేఘం చాలాసేపు కొనసాగుతూ.. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. ‘ఇన్వర్షన్’, ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’లనే వాతావరణ అంశాలు ఈ ‘స్మాగ్’ను, దాంతో సమస్యలనూ మరింత తీవ్రతరం చేస్తాయి. ఇన్వర్షన్ అంటే.. మామూలుగా ఎత్తుకుపోయిన కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నది తెలిసిందే. ఎత్తులకు వెళ్లినకొద్దీ నిర్ణీతమైన రీతిలో ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని ‘ల్యాప్స్ రేట్’ అని కూడా అంటారు. ఇది వాతావరణ సహజ నియమం. కానీ కొన్నిసార్లు దీనికి వ్యతిరేకమైన ప్రభావం చోటు చేసుకుంటుంది. అంటే.. నేలమీదనే బాగా చల్లగా ఉండి, పైభాగంలో వేడిమి ఎక్కువగా ఉంటుంది. సహజ వాతావరణ నియమానికి భిన్నంగా ఉండటం వల్లనే.. ఈ ప్రక్రియకు ‘ఇన్వర్షన్’ అని పేరు. కాలుష్యమేఘంతో ఊపిరితిత్తులూ, ఓవరాల్ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఇలా.. ముక్కు ముందుగా ఓ ఏసీ యూనిట్లా పనిచేస్తుంది. అతి చల్లటి గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా తొలుత ముక్కులోకి వెళ్లిన గాలి కాస్తంత వేడిగా మారి, దేహ ఉష్ణోగ్రతకు కాస్త అటు ఇటుగా సమానంగా ఉండేలా మారాకే ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అంత చల్లటిగాలి ఊపిరితిత్తులకు నష్టం చేయకుండా ఉండేందుకే ముక్కు ఈ పనిచేస్తుంది. కానీ గాల్లోని రసాయనాల వల్ల తొలుత ముక్కులోని సున్నితమైన పొరలపై దుష్ప్రభావం పడుతుంది. దాంతో ముక్కులో మంటగా అనిపిస్తుంది. అలర్జీలూ కనిపిస్తాయి. అటు తర్వాత గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే ట్రాకియా, బ్రాంకియాలో ఇరిటేషన్ రావచ్చు. కాలుష్యాలను ముక్కు చాలావరకు వడపోసినప్పటికీ, కొన్ని లంగ్స్‌లోకి వచ్చేస్తాయి. వాటిని బయటకు పంపేందుకు ఊపిరితిత్తుల్లో మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్ అనే నిర్మాణాలు కొవ్వొత్తి మంటలా కదులుతూ కాలుష్యాలను పైవైపునకు నెడుతుంటాయి. సీలియరీ ఎస్కలేటర్స్ పని మాత్రమే కాకుండా.. అక్కడ కొన్ని స్రావాలు (మ్యూకస్) ఊరుతూ, అవి కూడా కాలుష్యాలను బయటకు నెడుతుంటాయి. సీలియా చుట్టూ ఉండే స్రావాలలో ఇమ్యునోగ్లోబ్యులిన్స్, తెల్లరక్త కణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్టీరియా, వైరస్‌లనుంచి మాత్రమే కాకుండా కాలుష్యాల బారి నుంచీ చాలావరకు కాపాడుతుంటాయి. సన్నటి వెంట్రుకల్లాంటి కదులుతూ ఉండే ఈ సీలియాలు అలల్లా వేగంగా కదలడం ద్వారా శ్వాస వ్యవస్థలోకి చేరిన కాలుష్య పదార్థాలు, వ్యర్థాలు, బ్యాక్టీరియా, ఇతర కణాలను బయటకు నెట్టేస్తూ ఉంటాయి. ఈ సీలియా సమర్థంగా పనిచేయడానికి వీటి చుట్టూ ఉత్పత్తి అయ్యే మ్యూకస్‌తో శరీరంలో రోజు 15–20 మి.లీ. మ్యూకస్ (ఫ్లెమ్) తయారవుతూ ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల నుంచి ముక్కు వరకు చేరిన మ్యూకస్ ఎండిపోతూ, గాలికి రాలిపోతూ ఉంటుంది. కాలుష్యాల వల్ల ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు గళ్ల/తెమడలా పడటం, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అది నల్లగా ఉండటం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ సీజన్లో ఊపిరితిత్తులతో పాటు ఆరోగ్య రక్షణ కోసం చేయాల్సినవి.. కాలుష్యాల నుంచి దూరంగా ఉండాలి. అందుకోసం వీలైనంతవరకు సూర్యుడు బాగా పైకొచ్చి చలి తగ్గే వరకు ఇంట్లోంచి బయటకు రాకపోవడం మంచిది. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముక్కు అడ్డుగా మాస్క్ లేదా మఫ్లర్ లేదా పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి. ఈ సీజన్లో వాకింగ్, ఇతర వ్యాయామాలను కాలుష్యం లేని చోట మాత్రమే చేయాలి. లేదా చలికాలంలో కేవలం ఇన్డోర్ వ్యాయామాలకు పరిమితమైతే మేలు. ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థలో భాగంగా సీలియాలు సమర్థంగా పనిచేయడానికి గాలిలో తేమ బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం చలి వాతావరణంలో ఆవిరి పట్టడం మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల్లో స్రావాలు ఎక్కువగా చేరినా, శ్వాసకు ఇబ్బంది అయినా తొలుత ఆవిరిపట్టడం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ సలహా మేరకు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. తెమడ / గళ్ల (స్పుటమ్)ను బయటకు తెచ్చేందుకు దోహదపడే దగ్గును మందులతో అణచకూడదు. మందులు వాడాల్సివస్తే డాక్టర్ సలహా మేరకు క్రమంగా దగ్గును తగ్గించేలా చేసే మందులు వాడాలి. దగ్గుతో పాటు కఫం పడుతున్నప్పుడు.. ఆ కఫం తేలిగ్గా బయట పడేందుకు కఫాన్ని పలచబార్చే మందుల్ని డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఈ చలికాలంలో కాలుష్యాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), ఆస్తమా వంటి మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించి సమస్యకు అనుగుణంగా మందులు వాడాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవల్ ఓజోన్ అంటే.. వాతావరణం పైపొరల్లో ఓజోన్ లేయర్ ఉంటుందనీ, అది ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి సమస్త జీవజాలాన్ని రక్షిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. భూమి మీదా ఓజోన్ ఉంటుంది. దీన్ని ‘స్మాగ్ ఓజోన్’ లేదా ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ అంటారు. ఇది వాతావరణంలోని కొన్ని వాయువులతో పాటు మరికొన్ని రసాయనాల చర్యల వల్ల ఆవిర్భవిస్తుంది. కొంతమేర సూర్యరశ్మి కూడా ఈ కాలుష్యమేఘం ఆవరించేందుకు దోహదపడుతుంది. ఫలితంగా.. పొగ, మంచు (ఫాగ్ ప్లస్ స్మోక్) కలిసి ఉండే స్మాగ్‌తో పాటు ఈ గ్రౌండ్ లెవల్ ఓజోన్ కూడా కలసిపోతుంది. దీనికి తోడు వాతావరణంలోని నల్లటి నుసి, ధూళి కణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్), పుప్పొడీ.. ఇవన్నీ కలగలసి దట్టమైన కాలుష్య మేఘం ఏర్పడుతుంది. వాతావరణంలోని ఇన్వర్షన్తో ఏర్పడ్డ చల్లదనం కారణంగా ఈ కాలుష్యమేఘం చాలాసేపు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ కాలుష్యంలోంచి ప్రయాణాలు చేసేవారిలో.. తొలుత అక్కడి కాలుష్య రసాయనాలో ముక్కులో ఇరిటేషన్, ఆ తర్వాత ఊపిరి తిత్తులూ దుష్ప్రభావానికి లోనవుతాయి. ముక్కు, శ్వాసమార్గంలో మంట, ఊపిరి తేలిగ్గా అందకపోవడం, శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతులో మంట, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలూ, వృద్ధుల్లో కొంతమేర ప్రాణాపాయం కలిగే అవకాశాలూ లేకపోలేదు. మరికొన్ని సందర్భాల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి ప్రమాదకరమైన జబ్బులకు దారితీయడం లేదా ఆస్తమా ఉన్నవారిలో ఇది అటాక్‌ను ట్రిగ్గర్ చేయడం వంటి అనర్థాలు సంభవిస్తాయి. - డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఇవి చదవండి: మావాడు ఎవరితోనూ కలవడండీ -
World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త!
ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్‌ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది. సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా నిలిచింది. ► సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది. సైబర్ ఫేక్... ► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి. ► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం. ► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. ► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డిజిటల్ వేగం వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది. అప్రమత్తతే అడ్డుకట్ట ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్‌లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్లైన్లో బహిరంగ పరచకూడదు. ఆన్లైన్ అగ్రిమెంట్లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు. – అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మీ తలలో 'గుయ్య్య్' మంటూ సన్నని శబ్దమా.. అయితే జాగ్రత్త!
'చెవి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టుగా చెవిలోనో లేదా తలలోనో గుయ్య్య్ మంటూ హోరు. ఇలా గుయ్‌మంటూ శబ్దం వినిపించడాన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘టినైటస్’ అంటారు. ప్రజల్లో ఇదెంత సాధారణమంటే.. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 16 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ ‘టినైటస్’ బాధించే జనాల సంఖ్య తక్కువేమీ కాదు. అన్ని వయసుల వారినీ వేధిస్తూ లక్షలాది మందిని బాధించే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.' టినైటస్తో చెవిలో లేదా తలలో హోరున శబ్దం అదేపనిగా వినిపిస్తున్నప్పుడు నొప్పి కంటే.. దాన్ని విడిపించుకోలేకపోవడంతో విసుగుతో కూడిన నిస్పృహ వేధిస్తుంది. కొందరిలో ఇది గర్జన అంతటి తీవ్రంగా కూడా వినిపిస్తుండవచ్చు. కొందరిలో ఎడతెగకుండా వినిపిస్తున్నప్పటికీ.. మరికొందరిలో మాత్రం వస్తూ, పోతూ ఉండవచ్చు. ఇలా వస్తూపోతూ వినిపిస్తుండే హోరును ‘పల్సేటింగ్ టినైటస్’ అంటారు. దీని వల్ల ప్రాణాపాయం లేకపోయినప్పటికీ.. దేనిమీద ఏకాగ్రతా, దృష్టీ నిలపలేకపోవడం, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దాంతో నిరాశా నిస్పృహలకూ, తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే అవకాశముంది. ఎందుకిలా జరుగుతుందంటే.. ఈ కింది అంశాలు టినైటస్కు దోహదపడవచ్చు లేదా అవి ఈ సమస్యను తీవ్రతరం చేసే అవకాశమూ ఉంది. అవి.. చెవిలో పేరుకుపోయే గులివి లేదా చెవిలో ఇన్ఫెక్షన్ దీర్ఘకాలంపాటు బయట ఏదైనా హోరుకు అదేపనిగా ఎక్స్పోజ్ కావడం వినికిడి తగ్గడం / వినికిడి సమస్యలు ఇంకేమైనా మందులు తీసుకుంటూ ఉండటంతో వాటి దుష్ప్రభావంగా తలలో లేదా మెడభాగంలో ఎక్కడైనా గాయాలు కావడం దీర్ఘకాలపు అనీమియా, డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మైగ్రేన్ వంటి తలనొప్పులు ముప్పుగా పరిణమించే అంశాలు.. సాధారణంగా టినైటస్ ప్రాణాపాయం కాకపోయినా, కొన్ని సందర్భాల్లో అది తీవ్రమైన ముప్పు తెచ్చిపెట్టే అంశంగా పరిణమించే ప్రమాదం ఉంది. ఆ ముప్పులేమిటంటే.. నిటారుగా నిల్చోలేక, ఎటో ఓ పక్కకు తూలిపోయే బ్యాలెన్సింగ్ సమస్య రావడం. వినికిడి సమస్యలు వస్తూపోతూ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన వినికిడి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇలాంటి సందర్భాల్లో వెంటనే ఈఎన్టీ నిపుణులను కలిసి, తమకు మీనియర్స్ డిసీజ్ (కళ్లు తిరుగుతుండే లక్షణాలతో కూడిన లోపలి చెవిని ప్రభావితం చేసే వర్టిగో లాంటి వైద్య సమస్య), అకాస్టిక్ న్యూరోమా (ఒక రకం నరాల సమస్య) వంటి జబ్బులేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. నిర్ధారణ.. దీని లక్షణాలు కొన్ని ఇతర సమస్యలతోనూ పోలుతున్నందువల్ల దీన్ని జాగ్రత్తగా, ఖచ్చితంగా నిర్ధారణ చేయడమన్నది చాలా కీలక అంశం. టినైటస్ నిర్ధారణకు ఈఎన్టీ నిపుణులు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిలో కొన్ని.. బాధితుల వైద్య చరిత్ర: వీరి మెడికల్ హిస్టరీని సునిశితంగా పరిశీలించడం. అంటే వారికి వినిపిస్తున్న శబ్దాలు ఎలాంటివి, మునుపు తల, మెడ వంటి చోట్ల ఏమైనాగాయాలయ్యాయా, ఇతరత్రా ఏమైనా వైద్యసమస్యలున్నాయా వంటి అంశాలని పరిశీలిస్తారు. వినికిడి పరీక్షలు: వినికిడి లోపం ఏదైనా ఉందా, ఉంటే ఏమేరకు వినికిడి కోల్పోయారు వంటి అంశాలు. ఇమేజింగ్ పరీక్షలు: కొన్ని సందర్భాల్లో ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించి, చెవిలో లేదా మెదడులో ఏమైనా మార్పులు వచ్చాయా అని పరిశీలించడం. చికిత్స / మేనేజ్మెంట్.. అన్ని రకాల వైద్యపరీక్షల తర్వాత.. ఒకవేళ చెవిలో గులివి లేదా చెవి ఇన్ఫెక్షన్తో ఈ సమస్య వచ్చినట్టు గుర్తిస్తే ఆ మేరకు గులివిని క్లీన్ చేయడం లేదా చెవి ఇన్ఫెక్షన్ తగ్గించేందుకు అవసరమైన మందులు వాడాలి. ఎమ్మారై / సీటీ స్కాన్ వంటి పరీక్షల్లో మెదడులోగానీ, చెవిలోగాని గడ్డలు లేవని తేలితే.. అక్కడ టినైటస్కు ఉన్న కారణాలనూ, బాధితులపై ప్రభావాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాధితుల్లో తీవ్రమైన యాంగ్జైటీ ఉన్నప్పుడు టినైటస్ను తగ్గించే మందులతో పాటు, యాంటీ యాంగ్జైటీ మందుల్ని వాడాలి. కొన్నిసార్లు ఓరల్ స్టెరాయిడ్స్ లేదా అవసరాన్ని బట్టి ఇంట్రా టింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లూ, కొన్ని రకాల హియరింగ్ ఎయిడ్స్ వంటివి వాడాల్సి రావచ్చు. డా. సంపూర్ణ ఘోష్, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ ఇవి చదవండి: ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..! -
ఈ జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లల్లో ఆస్తమా ఇక దూరమే..!
'ఇప్పుడున్న చలి వాతావరణం కొందరు పిల్లల్లో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. చిన్నవయసులోనే నివారిస్తే, పెద్దయ్యాక ఆస్తమా బారినపడే అవకాశం తగ్గుతుంది. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..' జాగ్రత్తలు.. పిల్లలకు ఇచ్చే ఆహారంలో వరి అన్నంతో పాటు పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి వంటి వెజిటబుల్స్‌తో వండిన కూరలూ.. అలాగే మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో ఉన్న చిరుధాన్యాలతో చేసిన తిరుతిండ్లు తప్పక తినిపించాలి. వంటలో వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్ వంటివి వాడాలి. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు, అల్లం, మిరియాల పొడి వంటి సహజ మసాలా దినుసుల్లో ఆస్తమానూ, దాని తీవ్రతను తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి వాటిని తగినంతగా వాడుతుండాలి. కిస్మిస్, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినిపిస్తుండాలి. పండ్లలో బెర్రీ పండ్లు, బొ΄్పాయి, ఆపిల్ వంటివి ఇస్తుండాలి. తీసుకోకూడని వాటి విషయానికి వస్తే.. ఆహారంలోని కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్, బ్రెడ్స్, కూల్‌డ్రింక్స్‌లలో వాడే పలు పదార్థాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మేలు. ఇవి చదవండి: మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి! -
మీ చిన్నారులలో ఈ సమస్యా..? అయితే వెంటనే ఇలా చేయండి!
'చిన్నపిల్లల చర్మం చాలా కోమలంగా ఉంటుంది. చలికాలంలో వారి చర్మం పొడిబారడంతో అనేక సమస్యలు వస్తాయి. మొదటే మృదువైన చర్మం. దానికి తోడు చలికాలంలో పొడిబారి పగలడం, చిట్లడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘అటోపిక్ డర్మటైటిస్’ అంటారు. ఈ సీజన్లో నెలల పిల్లలు మొదలు.. ఎదిగిన పిల్లల్లోనూ అనేక వయసు చిన్నారులో కనిపించే అటోపిక్ డర్మటైటిస్ సమస్యలు, వాటికి పరిష్కారాలను తెలిపే కథనమిది.' అటోపిక్ డర్మటైటిస్లో మొదట్లో చర్మం పొడిబారి, దురదతో ఎర్రగా మారుతుంది. పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘లైకెనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద ఇంకా పెరుగుతుంది. దాంతో మరీ ఎక్కువగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం మరింత మందమవుతుంది. ఈ ప్రక్రియలు ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) సాగుతుంటాయి. కొందరిలో ఇదొక దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా కూడా మారవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే.. చలికాలంలో చెమ్మ (తేమ) ఇగిరిపోతూ ఉండటంతో చర్మం పొడిబారడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఇలాంటప్పుడు చర్మం పొడిబారి, ఎర్రబారుతుంది. కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఆస్తమా, డస్ట్ అలర్జీలు ఉండేవారిలో అటోపిక్ డర్మటైటిస్ సమస్య ఎక్కువ. వివిధ వయసుల పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఇలా.. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు.. ఈ వయసు పిల్లల్లో చర్మం ఎర్రబారడం ప్రధానంగా ముఖంపైన, మెడ దగ్గర కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో దేహంలోని ఏ ప్రాంతంలోనైనా ఇలా జరిగే అవకాశముంది. ఉదాహరణకు పాకే పిల్లల్లో వాళ్ల మోకాళ్లు నేలకు ఒరుసుకుపోతుండటం వల్ల మోకాళ్ల దగ్గర ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడమన్నది చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే.. మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ వయసు పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురద వచ్చి, అది పగులు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో.. ఈ వయసు పిల్లల్లో చర్మం పొడిబారడం కాస్త ఎక్కువ. పైగా ఈ పొడిబారడమన్నది మోకాళ్ల కింది భాగంలో ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు.. పొడి బారినప్పుడు బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా కనిపిస్తుంటాయి. ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవులు పొడిబారి, పగుళ్లలాగా వస్తుంది. పెదవుల చుట్టూ చర్మమంతా పగుళ్లుబారి ఓ సరిహద్దులా స్పష్టంగా కనిపిస్తూ, ఆ భాగం మంట పుడుతుంటుంది. దీన్ని ‘పెరీ–ఓరల్ డర్మటైటిస్’ అంటారు. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో.. ఏడేళ్ల వయసు నుంచి (అంతకంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే) పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కాబట్టి ఈ వయసునుంచి లక్షణాల తీవ్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. అయితే ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. చికిత్స / మేనేజ్మెంట్ తొలి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్): అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు తొలి దశల్లో చికిత్స చాలా తేలిక. చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ వంటివి రాస్తే చేస్తే చాలు. పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం తగ్గుతుంది. రాత్రి నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం: సబ్బులు, డిటర్జెంట్లు.. అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్నది చూసుకోవాలి. అలా జరుగుతుంటే.. సబ్బులను, డిటర్జెంట్లను మార్చాలి. ఘాటైన సబ్బులకు బదులు మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్ తో శుభ్రం చేసుకోవాలి. పిల్లల్ని పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. పిల్లల్లో అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి (ముఖ్యంగా నట్స్, సీ ఫుడ్), ఒకవేళ ఆ ఆహారాలతో అలర్జీ వస్తుంటే వాటి నుంచి దూరంగా ఉంచాలి. పూత మందులతో చికిత్స: పిల్లలకు ఎమోలియెంట్స్ అని పిలిచే.. లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్ వంటివి పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయాలి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా వాడే స్టెరాయిడ్స్ కూడా వాడవచ్చు. పైపూతగా వాడే స్టెరాయిడ్స్‌ను ఎక్కువ రోజులు వాడకుండా ఉండేందుకు టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ వాడవచ్చు. డాక్టర్ల సలహా మేరకు పైపూత యాంటీబయాటిక్, స్టెరాయిడ్ కాంబినేషన్స్‌ను వాడవచ్చు. నోటిద్వారా తీసుకోవాల్సిన మందులు: నిద్రకు ముందు డాక్టర్ సలహా మేరకు నాన్ సెడెటివ్ యాంటీహిస్టమైన్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. రెండోదశ చికిత్స: మొదటిదశ చికిత్స (ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్)తో అంతగా ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ డోస్ పెంచడమూ, అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్ చికిత్స: కొంతమంది పిల్లలకు అల్ట్రావయొలెట్ బి– కిరణాలతో చికిత్సతో మంచి ఫలితాలు వస్తాయి. మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్): నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం లాంటి ఈ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే జరగాలి. వెట్ ర్యాప్ టెక్నిక్.. అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటే ‘వెట్ ర్యాప్ టెక్నిక్’తో మంచి ఫలితాలుంటాయి. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట ఎమోలియెంట్స్ పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన బ్యాండేజ్‌ను ఒక పొరలా కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొరలా పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. దీన్నే వెట్ ర్యాప్ టెక్నిక్ అంటారు. దీంతో అటోపిక్ డర్మటైటిస్ తీవ్రతను తగ్గించవచ్చు. లక్షణాలు.. చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటిగుల్లలూ రావచ్చు. ఎర్ర బారినచోట చర్మం పొట్టు కట్టినట్లు అవుతుంది. మందంగానూ (లైకెనిఫికేషన్) మారుతుంది. కొన్నిసార్లు కాస్తంత పొట్టు రాలడంతోపాటు అక్కడ గాటు కూడా పడవచ్చు. మందంగా తెట్టుకట్టిన చర్మం పై పొర లేచిపోయినప్పుడు అక్కడ ద్రవం ఊరుతుండవచ్చు (ఊజింగ్). ఈ దశలోనూ చికిత్స అందకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ ఇవి చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..! -
ఈ ఆకుకూరలు తిన్నారా..! ఇకపై మీ ఆరోగ్యానికి
'ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అందుకే ఇంచుమించు అందరూ ఆకుకూరలు తింటారు. అయితే కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి సమృద్ధిగా పోషకాలు సమకూరి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చుననే విషయం మాత్రం అందరికీ తెలియదు. అందుకే ఏయే వ్యాధులకు ఏయే ఆకుకూరలు తినడం మంచిదో తెలుసుకుందాం. కొన్ని రకాల అనారోగ్య లక్షణాలకు కొన్ని రకాల ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో చూద్దాం..' అవిసె ఆకుకూర అవిసె ఆకులు రుచికి కారంగా... కొంచం చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి ∙ఏకాదశి, శనివారం, శివరాత్రి వంటి ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా తినాలి. దానివల్ల ఉపవాసం మూలంగా వచ్చిన నీరసాన్ని బాగా తగ్గించి, ఉత్సాహాన్నిస్తుంది. గాయాలకు, దెబ్బలకు ఇది మంచి మందు. దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా వేస్తే తొందరగా తగ్గుతాయి. జలుబు, రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గుతాయి. చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి ఇస్తే మంచిది. కరివేపాకు కరివేపాకును మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం, వాతం సమతుల్యంలో ఉంటాయి. విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు కూడా కరివేపాకు తినడం వల్ల తగ్గుతాయి. కరివేపాకును ముద్దలా చేసి విషజంతువుల కాట్లకు, దద్దుర్లకు బ్యాండేజీలా కడితే సులువుగా తగ్గుతాయి. కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాధిని నివారిస్తుంది. కామంచి ఆకు కూర చాలా చిన్న సైజులో అంటే కందిగింజంత సైజులో ఉండే కామంచి పళ్లని చాలామంది తింటారు. అయితే దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరం ఉబ్బుతో కూడి ఉన్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్భుతంగా పనిచేస్తుంది. కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరిస్తుంది. గుంటగలగర జుట్టు సమస్యలకు వాడే మందుగా మాత్రమే ఇది అందరికీ తెలుసు కానీ, దీనిని లోపలికి తీసుకోవడం వల్ల శరీరంలోని వాత, కఫాలను పోగొడుతుంది. దంతాలకు, చర్మానికి చాలా మంచిది. తలనొప్పి, వాపు, దురదలని నివారిస్తుంది. హెర్నియా, ఆయాసం, పొట్టలోని క్రిములు రుమాటిజం, భయంకరమైన రక్తక్షీణత, గుండెజబ్బు, చర్మరోగం వంటి వాటికి బాగా పని చేస్తుంది. గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి. చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు. గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది. గోంగూర గోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు. రేజీకటి రోగం కలవారికి ఈ కూర చాలా మేలు చేస్తుంది. గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి. గోంగూరను నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి. బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది. గంగపాయల కూర రుచికి పుల్లగా ఉండే ఈ ఆకు పాలకంటే, వెన్నకంటే మంచిది. దీనిలో ఎ, బి విటమినులు సమృద్ధిగా ఉన్నాయి. పాలకంటే, వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉందని పరిశోధనలలో తేలింది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి అధికం. ఈ కూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. రక్తహీనత ఉన్న వారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే దుష్టపదార్థాలను తొలగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు. ఎముకలు, దంతాల పెరుగుదలకు అది అత్యంత అవసరం. కుష్టు, మూత్రాశయంలో రాళ్లు వంటి సమస్యలతో బాధ పడేవారు ఈ కూరని ఆహారంలో భాగం చేసుకోవాలి. వెంట్రుకలకు బలాన్ని ఇస్తుంది. కొత్తిమీర కొత్తిమీర కషాయంలో పాలు, పంచదార కలిపి సేవిస్తే రక్తంతో కూడిన మొలల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, ఆకలి మందగించడం, కడుపులో గ్యాస్.. వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి. కొత్తిమీరను వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరుతుంది. కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది. నోరు పూసినప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. చామాకు చామ ఆకు కూర చాలా మంచిది. జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర అద్భుతంగా పనిచేస్తుంది. పైల్స్‌తో బాధపడేవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. మూత్రవ్యాధులున్న వారికి మంచి మందు. నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి. -
పసి 'హృదయాలు' కూడా లయ తప్పుతున్నాయి.. కారణం !?
'పసిహృదయాలు లయ తప్పుతున్నాయి. చిన్నప్రాయంలోనే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లు.. కారణం ఏదైతేనేమీ పసిహృదయాలు పట్టేస్తున్నాయి. గుండెపోటు(హార్ట్ఎటాక్)కు గురవుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సెకండ్‌వేవ్ ముగిసిన తర్వాత క్రమంగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి.' ప్రాణాలు పోతున్నాయి.. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. మన శరీరంలో అతి ప్రధాన అవయవం గుండె. దీన్ని కాపాడుకోవడంలో నిర్లక్ష్యం దరి చేరనీయొద్దు. గతంలో దీర్ఘకాలిక వ్యాధులబారిన పడిన వారు, వయస్సు మళ్లిన వారు గుండెపోటుకు గురైన సంఘటనలు చూశాం. కానీ కొన్నాళ్లుగా టీనేజ్ యువత గుండెపోటుతో మరణిస్తుండడం కలవరం కలిగిస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధిక మద్యపానం, ధూమపానం, బీపీ, షుగర్, లావు పెరగడం, ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా గుండెపోటుకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అవగాహన కల్పిస్తున్న వైద్య, ఆరోగ్యశాఖ గుండెపోటుకు కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కల్పిస్తుంది. హఠాత్తుగా గుండెపోటుకు గురైన వారికి అందించాల్సిన అత్యవసర చికిత్స, టెక్నిక్స్‌పై గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సీపీఆర్ అండ్ ఏఈడీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్(75), ఎంఎల్‌హెచ్‌పీ(63), సూపర్వైజర్లు(79), స్టాఫ్‌నర్సు(85), ఏఎన్ఎం(145), ఆశలు(475), ఫార్మసిస్టులు(5), ల్యాబ్‌టెక్నీషియన్స్(19), ఇతరులు(318) మొత్తంగా 1,264 మందికి వైద్యాధికారులు సీపీఆర్ శిక్షణ ఇచ్చారు. ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండే ఆర్టీసీ సిబ్బంది, జర్నలిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, పోలీస్, ప్రజాప్రతినిధులు తదితరులకు సీపీఆర్ విధానంతో గుండెపోటుకు గురైన వ్యక్తులను ప్రాణాపాయం నుంచి రక్షించేలా అవగాహన కల్పించారు. గుండెపోటు లక్షణాలు.. హార్ట్ డిసీజ్‌కు గురయ్యే వారిలో ఎక్కువగా పోస్ట్ కోవిడ్ బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇటీవల వస్తున్న గుండె సమస్యల్లో కరోనా బాధితులే ఎక్కువ. చాతిలో అసౌకర్యంగా ఉండడం, నొప్పి రావడం, పిండినట్లు అనిపించడం. భుజం, చేయి, వీపు, మెడ, దవడకు వ్యాపించే నొప్పి, ఎగువ బొడ్డు వరకు నొప్పి అనిపించవచ్చు. చెమటలు పట్టడం, అలసటగా ఉండటం, గుండెల్లో మంట, మైకము కమ్మడం. వికారంగా ఉండటం, శ్వాస ఆడకుండా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాటించాల్సిన జాగ్రత్తలు! ముఖ్యంగా ఆహార నియమాల్లో మార్పు అవసరం. తీసుకునే ఆహారంలో పీచు(ఫైబర్) పదార్థం ఎక్కువగా ఉండాలి. శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు అందేలా చూసుకోవాలి. విటమిన్ లోపాలు రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ పెంచే కొవ్వు పదార్థాలు, మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. మద్యపానం,ఽ ధూమపానం, పొగాకులకు దూరంగా ఉండాలి. సరైన వ్యాయామం చేయాలి. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు పాటించాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా వేపుళ్లు, అధిక మాంసాహారం తీసుకోవద్దు. - 'సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్దెనిమిదేళ్ల విద్యార్థిని గత నెలలో హైదరాబాద్‌లోని కళాశాలలో తరగతిగదిలోనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటు(కార్డియక్ అరెస్ట్)కు గురైందని వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది.' - 'కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన పదమూడేళ్ల సుశాంత్ క్రిస్మస్ రోజున తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లాడు. అక్కడే వేడుకల్లో అందరి ముందే హఠాత్తుగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. హుటాహుటిన సిరిసిల్లకు తరలించినప్పటికీ ప్రాణాలు గాలిలో కలిశాయి. అప్పటి వరకు తమతోపాటు సంతోషంగా గడిపిన కొడుకు గంటలోపే జీవచ్ఛవంలా మారడంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండా పోయింది.' నిర్లక్ష్యం చేయొద్దు.. చాతిలో నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గుండె వ్యాధిగా అనుమానం ఉంటే కార్డియాలజిస్టు వద్దకు వెళ్లాలి. సడన్ హార్ట్ఎటాక్తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని రక్షించడానికి కార్డియో పల్మనరీ రెసిపిటేషన్(సీపీఆర్), ఆటోమెటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్(ఏఈడీ) శిక్షణ ఇచ్చాం. – సుమన్ మోహన్‌రావు, డీఎంహెచ్‌వో ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి.. గుండెపోటుకు గురైన వారికి ఇచ్చే మందు టెనెక్టప్లేస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. శరీరంలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంతో గుండెపోటు వస్తుంది. అన్ని వయస్సుల వారు శరీరానికి సరైన వ్యాయామం అందించాలి. జంక్‌ఫుడ్ తినకుండా ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకుంటూ.. బీపీ, షుగర్ పేషెంట్లు ఎప్పటికప్పుడు వైద్యుల సూచనలు పాటించాలి. – డాక్టర్ మురళీధర్‌రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
వింటర్లో సెల్యులైటిస్తో సమస్యా..? అయితే ఇలా చేయండి!
'సెల్యులైటిస్ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.' చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు. ప్రేరేపించే అంశాలు.. స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం. లక్షణాలు.. ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి.. ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్నెస్) నొప్పి, వేడిగా అనిపించడం జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) రావడం. కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్ డింప్లింగ్) చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే.. సెల్యులైటిస్ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు.. చర్మం పొడిబారడం (డ్రైస్కిన్): ఈ సీజన్లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్నూ నివారించవచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం: చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది. సెల్యులైటిస్ నివారణ ఇలా... చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి. ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్ సోప్ వాడాలి. మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది. చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు. గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి. చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు. చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి. తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్ నిరపాయకరంగా గడిచిపొతుంది. ఇవి చదవండి: వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి! -
వింటర్లో ముఖం తేటగా ఉండాలంటే వెంటనే ఇలా చేయండి!
'చలికాలంలో ముఖం పొడిబారిపోవడమూ, పెదవులు పగలడం, ముఖంపై ముడతలు రావడం చాలా సాధారణం. అందరికీ తెలిసిన చిట్కా వ్యాజలైన్ రాయడంతో పాటు ఈ కాలంలోనూ ముఖం తేటగా, ఆరోగ్యంగా ఉంచేందుకు పాటించాల్సిన చిట్కాలివి..' చలికాలంలో ఉదయం, సాయంత్రం మంచుకురుస్తున్నా.. మధ్యాహ్నపు ఎండ తీక్షణంగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది. ఈ మంచుకూ, మధ్యాహ్నపు ఎండకూ నేరుగా ముఖచర్మం ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈకాలంలో ఉండే మంచు, పొగ కలిసిన కాలుష్యం.. స్మాగ్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. తేలికపాటి వ్యాయామం వల్ల ముఖానికి తగినంత రక్తప్రసరణ జరిగి ముఖం తేటగా మారుతుంది. రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో ముఖం తేటబారుతుంది. ఆహార పరంగా.. అన్ని రకాల పోషకాలు అందే సమతులాహారాన్ని రోజూ తీసుకోవాలి. అయితే చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఇది సరికాదు. రోజూ తప్పనిసరిగా మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఆకుకూరలు, కూరగాయలూ, ములగకాడల వంటి తాజా కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికే పండ్లను తప్పక తీసుకోవాలి. ఇందులోని నీటిమోతాదులూ, పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి ముఖాన్ని తేటగా కనిపించేలా చేస్తాయి. డ్రైఫ్రూట్స్ పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. అందులో జీడిపప్పు వంటి కొవ్వులు ఎక్కువగా ఉండే నట్స్ కంటే బాదం పప్పు వంటి కొవ్వులు తక్కువగా ఉండే నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చదవండి: గుడిలో తీర్థం, ప్రసాదాలు ఎందుకు ఇస్తారో తెలుసా? కారణమిదే! -
హార్ట్ఎటాక్ సమస్య వెంటాడుతుందా..? అయితే ఇలా చేయండి!
'ఈ మధ్య కాలంలో దాదాపుగా 30 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు తరచుగా మృతి చెందుతూ ఉండడం ఆందోళనలకు గురిచేస్తోంది. ప్రణాళిక లేని ఆహారపు అలవాట్లు, మద్యపానం, సరైన వ్యాయామం లేకపోవడం, క్రిమిసంహారక మందులతో పండించిన కూరగాయలు, దినుసులు వంటివాడకం మితిమీరిపోవడంతోనే ఇలాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.' పెరుగుతున్న హృద్రోగ, కాలేయ సమస్యలు తరచుగా ఆకస్మిక మరణాలు నాలుగుపదుల వయసువారే అధికం అసమతుల్య ఆహారపు అలవాట్లు, జీవనశైలే కారణం క్రమబద్ధమైన నియమాలు పాటించాలంటున్న ఆరోగ్యనిపుణులు ఎన్నో కారణాలు.. ప్రధానంగా గుండె లయతప్పడానికి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు పెద్దగా కారణాలేవి లేకుండానే ఇటువంటి ప్రమాదం సంభవిస్తుంది. కొందరిలో మాత్రం గుండె కండరం మందం కావడం, పుట్టుకతో గుండెలో ఉండే లోపాలు, కర్ణికలు పెద్దగా ఉండడం, జన్యుపరంగా తలెత్తే ఇతర ఇతర సమస్యలు రక్తంలో ఖనిజలవణాల సమతుల్యత లోపించడం, మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి కారణమవున్నాయి. బాగున్న కండరం మధ్యభాగంలోని కణాలు అతి చురుకుగా స్పందించడంతో కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. దీంతో శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, ఫలితంగా తలతిరగడం, స్పహ తప్పి కోల్పోవడం, నిమిషాల వ్యవధిలోని మరణం సంభవించడం వంటి వాటికి ఆస్కారం ఉంటుంది. జీవనశైలిలో మార్పుతోనే నివారణ.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఒత్తిడిలతో కూడిన జీవన విధానంలో ప్రశాంతత లోపించడం సమయభావంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం నడక, వ్యాయామక కసరత్తులు, యోగా, మెడిటేషన్ వంటివి నిపుణుల పర్యవేక్షణలో చేయడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాలేయ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా ఆహారపు అలవాట్లు ప్రభావం చూపుతాయి. సరైన ఆహారపు అలవాట్లు లేని వ్యక్తుల్లో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి.. ఈ రోజుల్లో ఎటువంటి ఆరోగ్య సమస్య ఎటువైపు నుంచి మంచికొస్తుందో తెలియనిస్థితిలో ఉన్నాం. ఆరో గ్యపరంగా శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకునే విధంగా నియమాలు పాటించాలి. ఆహారం పరంగా, శారీరకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎండపెల్లి అశోక్‌కుమార్, మైథిలీ వెల్నెస్ సెంటర్, నిర్మల్ నిరంతర పరీక్షలతోనే నివారణ గుండె సంబంధిత జబ్బులు ప్రస్తుత కాలంలో అధికమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు గుండె, కాలేయ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరీక్షలను చేయించుకోవాలి. – డాక్టర్ ఎం.ఎస్. ఆదిత్య, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
హెల్త్ టిప్స్: ఈ చిట్కాలు వాడారో.. ఇకపై ఆరోగ్య సమస్యలు దూరమే!
'మన ఆరోగ్యం బాగుకై ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. తీరికలేక మరెన్నో బాధ్యతలతో పరుగెడుతుంటాం. ఇలాంటి క్రమంలో ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూంటుంది. దుమ్ము, దూళి, టెన్షన్స్, అవిరామం మరెన్నో కారణాలచే అనారోగ్యం పాలై, బాగుకోసం మెడిసిన్స్ వాడుతుంటాం. ఇకపై ఇలాంటి వాటికి స్వస్తి పలకడానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ వాడితే ఎంతో మేలని చెప్పవచ్చు. మరి అవేంటో చూద్దాం!' కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే వ్యర్థపదార్థాల నుంచి కాలేయానికి రక్షణ దొరుకుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి. పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. అల్లం, జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా.. అందులో ఉండే ’మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఇవి చదవండి: మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!? -
మీకు తెలుసా! వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుందో!?
'సాధారణంగా కొందరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థకు మరింత మేలు జరుగుతుందని మీకు తెలుసా!?' ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇది కాకుండా, కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఎ, ఇ మొదలైనవి నెయ్యిలో లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. చర్మం ఆరోగ్యంగా... ప్రకాశవంతంగా మారుతుంది. కొవ్వు కరిగిపోతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది వెచ్చని నీటితో లేదా ఆహారంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇవి కూడా చదవండి: రక్తహీనతతో బాధ పడుతున్నారా.. అయితే ఇవి తీసుకోండి! -
ఆస్తమా 'దమ్ముందా'? ఇలా చేసి చూడండి! వెంటనే..
'చలికాలంలో చర్మసమస్యలు, జుట్టు రాలిపోవడం వంటివి ఎంత సాధారణమో, ఆస్త్మారోగులకు ఆయాసం ఎక్కువ కావడం, ఆర్థరైటిస్ అంటే కీళ్ల జబ్బులు ఉన్నవారికి కీళ్లనొప్పులు పెరగడం అంతే సహజం. గతవారం మనం కీళ్లజబ్బులకు పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కాబట్టి ఈవారం ఆస్త్మా రోగులు ఏం చేయాలి, ఏం చేయకూడదు.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.' దగ్గు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా మొదలైనవన్నీ శ్వాసవాళాలకి, ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులే. ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ వ్యాధి. దీనికి వయసుతో నిమిత్తంలేదు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. సరిపడని తత్వం అంటే ఎలర్జీ, దుమ్ము, ధూళి, పొగ, ధూమపానం, ఘాటైన వాసనలు, కాలుష్య వ్యర్థాలు, చలి వాతావరణం సరిపడకపోవటం వంటివి. ముందుగా శీతాకాలంలో ఆస్త్మా రోగులు ఎలా ఉండాలో చూద్దాం! శరీర తత్వాన్ని అనుసరించి ఏ పదార్థం తీసుకుంటే ఉబ్బసం వస్తుందో, ఆ పదార్థం లేదా పదార్థాలను పూర్తిగా మానివేయాలి. నిల్వ ఉన్న పదార్థాలకు ఉబ్బసం వ్యాధిగ్రస్థులు దూరంగా ఉండాలి. మంచినీరు ఎక్కువగా తాగాలి. ఉబ్బసం ప్రకోపించినప్పుడు, మరింతగా ఎక్కువ నీరు తాగాలి. రోగ నిరోధకశక్తిని పెంచేది విటమిన్–సి. అందువలన విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరలు అవసరం. ఆ క్రమంలో ప్రతిరోజు కనీసం ఒక సిట్రస్ పండు అయినా తప్పనిసరిగా తినాలి. మాంసాహారులయితే ఒమేగా–3 ఫాటీ యాసిడ్స్‌తో కూడిన చేపలను, కోడిమాంసాన్ని తీసుకోవచ్చు. శ్వాసనాళాలలోని జిగురు పొర పల్చబడకుండా ఉండటానికి కోడి మాంసం దోహదం చేస్తుంది. ఉబ్బసానికి వాడే అల్లోపతి మందులు చాలావరకు స్టెరాయిడ్ మందులు. వీటి వలన మంచితోబాటు కీడు కూడా జరుగుతుంది. ఉదయం పూట వేప నూనె ముక్కులో రెండు చుక్కలు వేసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందు ఆవాల నూనె ఛాతీ మీద, గొంతుకు రాయాలి. ఆస్తమాతో బాధపడుతున్న వారు చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నట్టే.. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం కూడా అవసరం అవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా స్పందించినప్పుడు అది ఆహారపరమైన అలర్జీలకు దారితీస్తుంది. ఇది కొంతమందిలో ఆస్తమాకు దారితీయవచ్చని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ 'డి' ఆస్తమా నుంచి రక్షణనిచ్చే వాటిలో విటమిన్ డి ది కీలక పాత్ర. ముఖ్యంగా 6 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు డి విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు రూపంలో విటమిన్ డి అందుతుంది. పాలు, గుడ్లు కొందరిలో అలర్జీకి కారణమవుతాయి. పడని వారు వీటిని తీసుకోకూడదు. విటమిన్ 'ఎ' శరీరంలో విటమిన్ ఎ తగినంత ఉన్న పిల్లలకు ఆస్తమా సమస్య తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు గుర్తించాయి. పిల్లలలో విటమిన్ ఎ అధికంగా ఉంటే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందట. క్యారట్, బ్రకోలీ, ఆలుగడ్డ, పాలకూర తదితర వాటిల్లో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. పండ్లు రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా నివారణకు ఉపయోగపడతాయి. మెగ్నీషియం మెగ్నీషియం తక్కువగా ఉంటే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. కనుక గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, పాలకూర తదితర మెగ్నీషియం తగినంత లభించే వాటిని తీసుకోవాలి. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులకు ఉపశమనం. వీటిని దూరం పెట్టాలి.. పులిసిన పదార్థాలు, పొగతాగటం, మత్తుపానీయాలను సేవించటం, మసాలా దినుసులు, తీపి పదార్థాలు. కడుపునిండా తినడం కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమాకు కారణం కాకపోయినా, ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండడం అవసరం. సల్ఫైట్స్ అనే ప్రిజర్వేటివ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. ప్యాకేజ్డ్ పచ్చళ్లు, ప్యాకేజ్డ్ లెమన్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పై సల్ఫైట్స్ ఉంటాయి. కాఫీ, టీ, కొన్ని రకాల సుగంధ, మసాల దినుసుల్లోని శాలిసిలేట్స్ కూడా ఉబ్బసాన్ని పెంచుతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వాడే ప్రిజర్వేటివ్‌లు, ఆర్టిఫీషియల్ కలర్స్, ఫ్లావర్స్ తోనూ సమస్య పెరుగుతుంది. ఇవి చదవండి: అర్ధరాత్రి 1-4గంటల మధ్యలో నిద్ర లేస్తున్నారా? ఆత్మలు కల్లోకి.. -
చెరకు పంట జాగ్రత్తలు మరవకు! లేదంటే?
'చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ పంటలు వేసినప్పటీ నుంచి చేతికందే వరకు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన పద్ధతులు పాటించకుండా పాత పద్ధతులను పాటిస్తే నష్టపోతారు. కొంత మంది రైతులు చెరకు పక్వానికి రాకముందే క్రషింగ్‌కు తరలిస్తూ ఉంటారు. దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. చెరకు పంట పక్వానికి వచ్చిందా ?లేదా? కొన్ని మెలకువలు పాటించాలి.' - ప్రస్తుతం చేతికొచ్చిన చెరకు పంటను నరకుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బసంత్‌పూర్–మామిడ్గి గ్రామాల శివారులో గల ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం.విజయ్‌కుమార్ మాట్లాల్లోనే.. పక్వానికి వచ్చిందా.. లేదా? పక్వానికి వచ్చిన చెరకు తోటల ఆకులు పచ్చ రంగులోంచి పసుపు రంగులోకి మారుతాయి. చెరకులో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. గడలు లావై అక్కడక్కడ చిరు పగుళ్లు ఏర్పడి కన్నులు బాగా ఉబ్బినట్లు అవుతాయి. తోటలో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. చిట్ట చివర నాలుగైదు కణుపులు దగ్గర దగ్గర ఏర్పడి వాటి నుంచి పుట్టు ఆకులు ఒకే చోట కుచ్చువలె ఏర్పడుతాయి. కొన్ని రకాల్లో పూత పూయడం కనబడుతుంది. శాసీ్త్రయంగా గమనిస్తే చెరకును రెండు భాగాలు నరికి వాటి రసంను వేర్వేరుగా గానుగాడిస్తే వాటిలోని ఘన పదార్థాలు సమానంగా ఉండాలి. చేతి రిఫ్రాక్టో మీటర్ ద్వారా కూడా చెరకు పక్వానికి వచ్చింది తెలుసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు! చీడ పీడలు ఆశించిన చెరకును ముందుగా క్రషింగ్‌కు తరలించాలి. లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడులతో రసం నాణ్యత తగ్గుతుంది. బెల్లం తయారు చేశాక మెత్తగా ఉంటే నిల్వకు పనిరాదు. ఏదైనా ప్రమాదశాత్తు చెరకు కాలిపోతే ముందుగా దాన్ని నరికివేయాలి . లేకపోతే తూకం తగ్గి రోజుకు 3 శాతం చొప్పున తగ్గుతుంది. పూత వచ్చిన, బెండు బారిన చెరకును నరకడం ఆలస్యం చేయరాదు. పూత వచ్చిన చెరకు గడల్లో చివరి ఆరు కండాలు తీసేసి మిగిలిన చెరకును ఫ్యాక్టరీకి తరలించాలి. చెరకును భూ మట్టానికి నరకాలి. రెండు మూడు అంగుళాలు వదిలి నరకడం వల్ల ఎకరానికి రెండు మూడు టన్నులు దిగుబడి తగ్గుతుంది. కింది భాగంలో పంచదార పాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చెరకు వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోయి బలమైన గాలులు వీచినా చెరకు ఒరిగిపోదు. చెరకు క్రషింగ్‌కు తరలించే ముందు చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి లేకుండా తరలించాలి. చెత్తా చెదారంతో తరలించడం వల్ల పంచదార దిగుబడిలో 10 శాతం నష్టం వాల్లుతుంది. నీటి ముంపునకు గురైన తోటల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కణుపుల వద్ద వచ్చే వేర్లను తొలగించాలి. వేర్లను తీసేయకుండా చెరకును అలాగే క్రషింగ్‌కు తరలిస్తే 0.4 నుంచి 0.6 శాతం మేర పంచదార దిగుబడి తగ్గుతుంది. నరికిన తర్వాత నరికిన చెరకును 24 గంటల్లో ఫ్యాక్టరీకి సరఫరా చేయాలి. ఆలస్యమైన కొద్ది చెరకు తూకంలో 2 నుంచి 4 శాతం, రసనాణ్యతలో ఒక శాతం తరుగుదల కనిపిస్తోంది. నరికిన చెరకు తొందరగా ఫ్యాక్టరీకి తరలించలేని పక్షంలో కట్టిన చెరకు మోపులను నీడలో పెట్టి వాటిపై చెత్తను కప్పి నీరు పలుచగా పోయాలి.\ రైతులు సాగు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఇలాంటి మెలకువలు పాటిస్తేనే లాభాలు సాధిస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇవి చదవండి: బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం! -
Dr. Neelima Arya: ‘షి నీడ్స్’ నీలిమ!
ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు. హైదరాబాద్ వాసి నీలిమా ఆర్య నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్‌లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్ లెక్చరర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లాను. అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్‌కు ఆంగ్ల ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది. ► ఐదు ప్రాజెక్ట్స్‌తో సేవా రంగం ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్‌తో ‘యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా’ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్ ద నీడ్ ప్రాజెక్ట్ చేశాను. రోడ్‌సైడ్ ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేశాం. ‘మిషన్ భద్రత’ పేరుతో ఒక్కో సెట్లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్ రవిత మేయర్ ఈ లో దుస్తులను డిజైన్ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం. ► లో దుస్తుల ప్రాముఖ్యత.. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్‌లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ►సాధికారతలో భాగంగా.. ఆర్య రసోయి–క్లౌడ్ కిచెన్ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, ఆంట్రప్రెన్యూర్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను. ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య. – నిర్మలారెడ్డి -
పదవీ విరమణకు పెరుగుతున్న ప్రాధాన్యత
న్యూఢిల్లీ: భారతీయుల్లో విశ్రాంత జీవనం పట్ల అవగాహన పెరుగుతోంది. గతంలో జీవిత లక్ష్యాల్లో పదవీ విరమణ ప్రణాళికకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, పీజీఐఎం ఇడియా నిర్వహించిన ‘రిటైర్మెంట్ రెడీనెస్ సర్వే, 2023’ పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది తాము రిటైర్మెంట్ ప్రణాళిక కలిగి ఉన్నట్టు చెప్పడం గమనార్హం. 2020లో నిర్వహించిన సర్వేలో వ్యక్తుల ఆర్థిక ప్రాధాన్యతల్లో రిటైర్మెంట్ (పదవీ విరమణ)కు 8వ స్థానం ఉంటే, అది ఈ ఏడాది సర్వేలో 6వ స్థానానికి చేరుకుంది. రిటైర్మెట్ అనేది కుటుంబ బాధ్యతల్లో భాగమని గతంలో భావించేవారు. కానీ, కొన్నేళ్ల కాలంలో దీనికి నిర్వచనంలో మార్పు వచి్చంది. వ్యక్తిగత సరక్షణ, స్వీయ గుర్తింపునకు రిటైర్మెంట్ను కీలకంగా ఇప్పుడు ఎక్కువ మంది భావిస్తున్నారు. తమ కోరికల విషయంలో రాజీ పడకుండా ఆర్థిక అంశాలపై నియంత్రణను కోకుంటున్నారు. ‘‘కరోనా మహ మ్మారి కొన్ని ముఖ్యమైన అశాలను ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. స్వీయ గుర్తింపు, స్వీయ సంరక్షణ, స్వీయ విలువ అనేవి కుటుంబ బాధ్యతల నిర్వహణతోపాటు వ్యక్తుల ప్రాధాన్య అంశాలుగా అవతరించాయి’’అని పీజీఐఎం మ్యూచువల్ ఫండ్ సీఈవో అజిత్ మీనన్ పేర్కొన్నారు. సర్వేలోని అంశాలు ► రూ.20–50వేల మధ్య ఆదాయం కలిగిన వారిలో, రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారు 2020లో 49 శాతంగా ఉంటే.. 2023 సర్వే నాటికి 67 శాతానికి పెరిగారు. ► రిటైర్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020 నాటికి రిటైర్మెంట్ ప్రణాళిక కలిగిన వారిలో 14 శాతం మందే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే, తాజాగా అది 24 శాతానికి పెరిగింది. ► పదవీ విరమణ తర్వాత జీవనానికి పెద్ద మొత్తంలో నిధి అవసరమని ఎక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. 2020లో సగటున రూ.50 లక్షలకు ప్రణాళిక రూపొందించుకుంటుంటే, అది రూ.73.44 లక్షలకు పెరిగింది. ► కరోనా మహమ్మారి మిగిలి్చన జ్ఞాపకాల నేపథ్యంలో మరింతగా ఇన్వెస్ట్ చేస్తూ, ఆర్థిక భద్రత కలి్పంచుకోవాల్సిన అవసరాన్ని మూడింట రెండొంతుల మంది గుర్తిస్తున్నారు. ► ఆర్థిక ప్రణాళిక కలిగిన వారిలో 50 శాతం మంది పదవీ విరమణ తర్వాత ఆర్థిక మదగమనం ఏర్పడితే ఎలా అన్న ఆందోళనతో ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, జీనవ వ్యయం ఆందోళన కలిగించే ఇతర అంశాలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం గురించి 56 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. -
అందుబాటులో ఉచిత న్యాయ సేవలు.. సద్వినియోగ పరుచుకోండి
గద్వాల క్రైం: ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలను అందించాలనే లక్ష్యంతో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని జిల్లా జడ్జి కుషా అన్నారు. గురువారం లీగల్ సర్వీస్ డే సందర్భంగా కోర్టు ఆవరణలో జాతీయ లీగల్ సర్వీస్ డే కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకునే క్రమంలో లాయర్లకు ఫీజులు చెల్లించలేని వారికి లీగల్ సర్వీస్ చేయూత అందిస్తుందన్నారు. ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, మహిళలు, పిల్లలు, లైంగిక దాడులు, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక – శారీరక హింస మొదలైన వాటి నుంచి న్యాయం పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారని, ఈ క్రమంలో పాఠశాల, కళాశాల యాజమాన్యులతో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు సైతం చేపట్టామన్నారు. చట్ట పరిధిలోని ప్రతి సమస్యలకు ఉచితంగా న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ డే ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జడ్జిలు కవిత, ఉదయ్‌నాయక్ కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. చట్టాలపై అవగాహన అవసరం అలంపూర్: అట్టడుగు, వెనకబడిన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే నేష్నల్ లీగల్ సర్వీస్ అధారిటీ లక్ష్యమని, ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ కమలాపురం కవిత అన్నారు. అలంపూర్‌లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గురువారం నిర్వహించారు.ఈ సమావేశానికి జడ్జీ కమలాపురం కవిత ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఏడాది నవంబర్ 9వ తేదిన నేషనల్ లీగల్ సర్వీసెస్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో వెనకబడిన పేద, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయం, న్యాయ సేవలను అందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వం, సామాజిక న్యాయం ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందన్నారు. కొందరికి న్యాయం ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికి సమానమైన హక్కుగా వర్తిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ నరసింహులు, న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్ కుమార్, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, కిషన్ రావు, సాయితేజ ఉన్నారు. -
హైవే పెట్రోలింగ్‌పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్!
గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్ ఫెయిల్ అయి సెంట్రల్ మీడియన్ పక్కన నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్ లైట్లు వెలగలేదు.. డ్రైవర్ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఏంటా హెల్ప్‌లైన్ వ్యవస్థ? 1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్‌లైన్ నెంబర్. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది. ఏం సాయం అందుతుందంటే.. ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్ బూత్ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్ వాహనం, క్రేన్ ఉండే టోయింగ్ వెహికిల్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది. ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్ చేస్తారు. ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది. హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుంది..: అవసరమైన వారు 1033 హెల్ప్‌లైన్‌కు (ఉచితం) ఫోన్ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్ ఫోన్‌కు ఓ లింక్ అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు. అవగాహనే లేదు.. జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్‌లైన్ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్ చేస్తు న్నారు. 1033కి ఫోన్ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు లోకల్ పోలీసు స్టేషన్‌కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. -
వాటర్ విమెన్! ఆమె నదిలో నీళ్లు కాదు కన్నీళ్లని చూస్తోంది!
వాటర్ ఉమన్ నదుల గొప్పతనం గురించి చెప్పమంటే మాటల్లో ఎన్ని అయినా చెబుతాం. అలాంటి పుణ్య నదులు నిర్లక్ష్యం బారిన పడి జీవం కోల్పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం పట్టించుకోము. ఈ ధోరణికి భిన్నమైన మహిళ శిర్ప పథక్. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శిర్పకు నదులు అంటే ఇష్టం. వాటికి సంబంధించిన పురాణ కథలు అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం వెయ్యిన్కొక్క కిలోమీటర్ల పాదయాత్ర చేసింది... సన్నని ప్రవాహమై బయలుదేరే గోమతి ప్రయాణంలో బలపడుతుంది. ‘ప్రయాణం గొప్పతనం బలం’ అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకేనేమో ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదానికి బలం ఇవ్వడానికి పాదయాత్ర చేసింది శిర్ప పథక్. పారిశ్రామిక వ్యర్థాలు, నివాసాలలో నుంచి వచ్చే మురుగు నీరు... మొదలైన వాటి వల్ల గోమతి అనేక ప్రాంతాలలో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం జరగడం లేదు. ‘గంగానదితో పోల్చితే గోమతి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది’ అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన నదిని మనమే రక్షించుకుందాం’ అంటుంది శిర్ప. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన శిర్ప పథక్ ‘వాటర్ ఉమన్’గా పేరు తెచ్చుకుంది. ‘గోమతి నదిని రక్షించుకుందాం’ నినాదంతో పదిహేను జిల్లాలలో ఊళ్లు, పల్లెలు, పట్టణాల గుండా సాగిన పాదయాత్రలో ఆ పుణ్యనది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసింది. ‘పరిస్థితి ఇది. మనం చేయాల్సింది ఇది’ అంటూ స్పష్టంగా చెప్పింది. ప్రతిరోజు 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసింది. ‘నది ఒడ్డున మొక్కలు నాటుదాం’ అని ప్రజలతో ప్రమాణం చేయించింది. శిర్ప వెంట ప్రజలు వచ్చేవాళ్లు. పర్యావరణ సంబంధిత విషయాలను చర్చిస్తూ ఆమె పాదయాత్ర ముందుకు సాగేది. ‘ఆక్రమణలను అడ్డుకుందాం. పుణ్యనదిని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడేది. ఈ పాదయాత్రలో పాల్గొన్న వందలాది మంది ప్రజలు మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు. ‘నా పాదయాత్రలో భాగంగా నది చుట్టు పక్కల ప్రాంతాలలో నివసించే ఎంతోమందితో మాట్లాడాను. నది పరిస్థితి తెలిసినప్పటికీ ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేశాను’ అంటుంది శిర్ప. శిర్ప విషయానికి వస్తే... నదుల సంరక్షణ గురించి పల్లెలు, పట్టణాల గుండా యాత్ర చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో నర్మద నది సంరక్షణ కోసం 3600 కిలోమీటర్ల యాత్ర చేసింది. ‘నదులకు ఏమైతే మనకేమిటి? మనం హాయిగానే ఉన్నాం కదా అనే భావన నుంచి బయటికి రావాలి. నదుల మనుగడలోనే మనుషుల మనుగడ ఉంది. ప్రకృతి వనరులే మన శక్తులు. నదులకు ముప్పు వాటిల్లితే మన కుటుంబ పెద్దలకు ముప్పు వాటిల్లినట్లుగా భావించి తక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. మనిషికి రక్తం ఎంత అవసరమో నది ఆరోగ్యానికి కలుషితం కాని నీరు అంతే అవసరం’ అంటోంది శిర్ప. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాకు చెందిన శిర్ప ఉన్నత చదువులు చదివింది. ‘ఏదో ఒక ఉద్యోగం చేయడం కంటే నదుల పరిరక్షణకు నా వంతుగా ఏదైనా చేస్తాను’ అంటూ ప్రయాణం మొదలు పెట్టింది. ఆ ప్రయాణం వృథా పోలేదని ఎన్నో ఊళ్లలో వచ్చిన మార్పు తెలియజేస్తుంది. నదిలో నీళ్లు మాత్రమే కాదు ఆ నది కార్చే కన్నీళ్లు కూడా ఉంటాయి. నీళ్లు అందరికీ కనిపిస్తాయి. కన్నీళ్లు కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఆ కొందరు అందరిలో అవగాహన రావడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఒక వ్యక్తి... వాటర్ ఉమన్ శిర్ప పథక్. ‘నా వల్ల ఏమవుతుంది అనే మాట బలహీనమైది. నా వల్ల కూడా అవుతుంది అనేది బలమైనది. బలమైన మాటే మన బాట అయినప్పుడు మార్పు సులభం అవుతుంది’ అంటుంది శిర్ప పథక్. (చదవండి: చిద్విలాస చిత్రగణితం! మ్యాథ్స్‌తో ఆర్ట్‌ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!) -
దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా.. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు. పూర్తి బందోబస్తు.. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి పోరాటాన్ని నిలపనున్నారు. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు. -
టెకీల కోసం ఓటు బాట
ఐటీ హబ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు ఐటీ ఉద్యోగులు ఓటు వేసేలా అవగాహన సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు పోలింగ్‌కు దూరంగా ఉంటారనే అపవాదును తొలగించే దిశగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు వారికి చేరువలో బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఓటింగ్ రోజున సెలవు వచ్చిది కదా అని ఎంజాయ్ చేసే టెకీలను పోలింగ్ కేంద్రం వైపు రప్పించేందుకు కార్పొరేట్ సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటోంది. రాజధానిలో ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీతోపాటు బహుళజాతి సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేలా సంస్థలు ఉద్యోగులను ప్రేరేపిస్తున్నాయి. హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లు.. ఎన్నికలపై వర్క్ ఫ్రం హోమ్ ప్రభావం ఆఫీసుల్లో కియోస్క్ లు ఇప్పటికీ పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అవలంబిస్తున్నాయి. ఈ విధానాలు ఐటీ హబ్ నియోజకవర్గాల్లో ఎన్ని కలపై కొంతమేర ప్రభావాన్ని చూపించవచ్చు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవడం కష్టమేనని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ఉద్యోగులకు సహాయం చేయడానికి త్వరలోనే ప్రత్యేక డ్రైవ్‌లను చేపట్టనున్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐటీ కారిడార్‌లోని వివిధ కార్యాలయాల్లో కియోస్‌్కలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ హబ్‌లో పెరిగిన ఓటర్లు.. ఐటీ కేంద్రాలైన మణికొండ, నానక్‌రాంగూడ, నార్సింగి, ఉప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాలు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు సంస్థలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ విజయతీరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో టెకీలను పోలింగ్ స్టేషన్లకు రప్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నాయి. వారిని పోలింగ్ కేంద్రానికి రప్పించేలా ఏర్పాటు చేస్తున్నాయి. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్ అంటే మినీ ఇండియా. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారిలో చాలామందికి స్వస్థలాల్లోనే ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఉద్యోగులు స్థానికంగా ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలూ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాయి. కనీసం మూడు నెలలపాటు ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాయి. ఆ తర్వాత బదిలీపై వెళితే ఓటును సంబంధిత నియోజకవర్గానికి మార్పు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఓటరు కార్డులో చిరునామాలను అప్‌గ్రేడ్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు సాయం అందిస్తున్నాయి. హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లు.. ‘లెట్స్ ఓట్’ అనే స్వచ్ఛంద సంస్థ గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, విద్యా సంస్థలతోపాటు ఫేస్బుక్, ఎక్స్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఓటర్ హెల్ప్‌లైన్, సీవిజిల్ వంటి మొబైల్ యాప్‌లపై ప్రచారం చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పెరగకపోయినా.. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఓ ప్రతినిధి చెప్పారు. మరోవైపు, ఎన్నికల సంఘం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, కమ్యూనిటీ సెంటర్లు, హైరైజ్ భవనాల్లో పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అంశంపై కసరత్తు చేస్తోంది. -
భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రత్యేక దృష్టి సారించాయి. విద్యుత్ భద్రతపై ఇప్పటికే అనేక సూచనలను ప్రజలకు ఇచ్చినప్పటికీ ఇంకా అక్కడక్కడా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా కొంతమంది విద్యుత్ సిబ్బందితోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరిగిన తరువాత సమీక్షించుకోవడం కాకుండా వాటిని అరికట్టేందుకు పటిష్ట చర్యల్ని అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి. వినియోగదారులకు ప్రత్యేకంగా భద్రతా సూచనల్ని రూపొందించాయి. భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల యజమానులు, రైతు కూలీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనలను రూపొందించాయి. వీటిని అందరికీ తెలియజేసేందుకు ‘భద్రతా అవగాహనా రథం’ పేరుతో ప్రత్యేక ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్నాయి. విద్యుత్ సిబ్బందికీ జాగ్రత్తలు లైన్ క్లియర్ (ఎల్సీ) సరిగ్గా లేకుండా ఏ లైన్ మీద పని చేయరాదు. సమీపంలో వేరే లైన్ ఉంటే దానికి కూడా ఎల్సీ తీసుకోవాలి. విద్యుత్ లైన్ల నిర్వహణ, బ్రేక్ డౌన్ ఆపరేషన్స్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ చేసే సమయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్, రబ్బర్ గ్లవ్స్, గమ్ బూట్స్, సేఫ్టీ బెల్ట్స్ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలి. అలాగే ఒక్కరే ఎప్పుడూ వెళ్లకూడదు. వేరొకరిని తోడు తీసుకువెళ్లాలి. పంట పొలాలకు అనధికార విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. అటువంటివి లేకుండా సిబ్బంది తరచూ తనిఖీలు చేపట్టాలి. సబ్ స్టేషన్ ఆవరణలో గొడుగు వేసుకుని వెళ్లకూడదు. కడ్డీలు, తీగలు వంటివి తగిన జాగ్రత్తలు లేకుండా తీసుకుపోకూడదు. కొత్త సర్విస్ ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు విద్యుత్ లైన్ కింద ప్రమాదకరంగా ఉంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 48, క్లాజ్ 63 ఆఫ్ రెగ్యులేషన్స్ 2010 ప్రకారం సర్వీసును తిరస్కరించి లైన్ షిఫ్ట్ చేయాలి. భవన నిర్మాణ కార్మికులకు ఇవీ సూచనలు విద్యుత్ లైన్లు కింద ఎటువంటి నిర్మాణాలు చేయరాదు. విద్యుత్ స్తంభానికి సమీపంలో లేదా స్తంభానికి ఆనుకుని ఇల్లు, ఎలివేషన్, డూములు, మెట్లు నిర్మాణం చేయకూడదు. ఇనుప చువ్వలు, లోహ పరికరాలు విద్యుత్ లైన్లు కింద తప్పనిసరి పరిస్థితులలో ఎత్తినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జేసీబీలు, క్రేన్లు ఉపయోగించేటప్పుడు, బోర్లు డ్రిల్ చేస్తున్నప్పుడు వాటి లోహపు తొట్టెలు, పైపులు విద్యుత్ లైన్లకు తగిలి ప్రాణాపాయం సంభవించవచ్చు. ధాన్యం, ప్రత్తి, గడ్డి, ఊక, కొబ్బరి చిప్పలు, కలప వంటి వాహనాలు అధిక లోడుతో విద్యుత్ లైన్లు కింద వెళ్లడం ప్రమాదకరం. సామాన్య ప్రజలకూ హెచ్చరికలు విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే లైన్ల కింద చెట్టు కొమ్మలు తొలగించాలి. తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను తాకకూడదు. ఇల్లు, షాపు మీటర్‌కి పోల్ నుంచి తీసుకొనే సర్విస్ వైరుకి ఎటువంటి అతుకులు లేకుండా చూసుకోవాలి. సర్వీస్ వైరుకి సపోర్ట్ వైరుగా రబ్బరు తొడుగు గల జీఐ తీగలను వాడాలి. ఇంటి ఆవరణలో ఎర్తింగ్ తప్పనిసరి. డాబాల మీద విద్యుత్ లైన్లకి దగ్గరగా బట్టలు ఆరవేయరాదు. తడి బట్టలతో, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకూడదు. వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాన్ని,సపోర్ట్ వైర్లను ముట్టుకోకూడదు. అనధికారంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు వేయడం చట్టవిరుద్ధమే కాదు ప్రాణాలకు ప్రమాదం. అధిక సామర్థ్యం గల ఫ్యూజు వైర్లను వాడరాదు. వాటివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి గృహోపకరణాలు కాలిపోతాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పక్కన, విద్యుత్ లైన్లు క్రింద తోపుడు బండ్లు, బడ్డీలు పెట్టడం ప్రమాదకరం. ప్రచార రథాన్ని అందుబాటులోకి తెచ్చాం ఏపీ ఈపీడీసీఎల్ ముందుగా ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. భద్రత సూచనలకు సంబంధించిన ఆడియోలను తయారుచేసి సంస్థ పరిధిలోని అన్ని సెక్షన్ కార్యాలయాలకు ఇప్పటికే పంపించాం. ఇకనుంచి ప్రతినెలా 2వ తేదీన క్రమం తప్పకుండా విద్యుత్ భద్రతా అవగాహన కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోని సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశించాం. వినియోగదారులు అవసరమైతే టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్ -
గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు!
నెల రోజుల క్రితం కదిరికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే హార్ట్ఎటాక్ అని తేలింది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడమేమిటని వైద్యులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారం రోజుల క్రితం అనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె నొప్పిగా ఉందని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఇంతలోనే సమస్య తీవ్రమైంది. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కారణమేమంటే తీవ్రమైన గుండె పోటు అని వైద్యులు చెప్పారు. ఎందుకిలా? నేడు వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో హృదయం గురించి సవివరంగా తెలుసుకుందాం! సాక్షి ప్రతినిధి, అనంతపురం: జీవన శైలి మార్పులు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వెరసి గుండెకు పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. గుండె జబ్బు ఒక్కసారే వచ్చి పడేది కాదు. అంతకుముందు ఎన్నో సంకేతాలు చిట్టి గుండె నుంచి వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడమని సూచిస్తుంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం చేటు తెస్తోంది. చివరికి ప్రాణాలూ తోడేస్తోంది. ఒక్క అనంతపురం రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 3 వేల పైగా జబ్బులకు రూ. 450 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, అందులో రూ.129 కోట్లు పైగా గుండెజబ్బులకే కేటాయించడం చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయచ్చు. ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం ఏర్పాటు చేసి గుండె గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా యత్నం చేస్తోంది కూడా. ఈ ఏడాది థీమ్ "హృదయాన్ని ఉపయోగించండి గుండె గురించి తెలుసుకోండి". అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది కూడా. పల్లెలకూ పాకిన మాయదారి జబ్బు.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా గుండెపోటు కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ జీవనశైలి జబ్బులు ఎగబాకడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించడంలో కనబరిచే నిర్లక్ష్యమే శాపమవుతోందని స్పష్టం చేసింది. యువకుల్లోనూ.. ఒకప్పుడు 55 ఏళ్లు దాటితేగానీ గుండె సంబంధిత జబ్బులొచ్చేవి కావు. కానీ నేడు 35 ఏళ్లకే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. గుండెపోటును సైలెంట్ కిల్లర్‌గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గుండె పోటుకు రకరకాల కారణాలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆజ్యం పోస్తున్నట్టు హృద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. పొగాకు, ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం అధిక రక్తపోటు ఉంటే, నియంత్రణలో ఉంచుకోలేకపోవడం చెడు కొలె్రస్టాల్ అంటే ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపిడ్స్) ఉండటం శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ నూనెల (ట్రైగ్లిజరాయిడ్స్) శాతం వయసుకు, ఎత్తుకు మించి బరువు(ఊబకాయం) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో నిర్లక్ష్యం కుటుంబ చరిత్ర ప్రభావం కాపాడుకోవాలి ఇలా రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం. కొవ్వులున్న ఆహారం తగ్గించి పీచు ఆహారం ఎక్కువగా తీసుకోవడం (కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, చిరు ధాన్యాలు) బరువును అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం ఆరుమాసాలకోసారి 2డీ ఎకో వంటివి చేయించడం చెడు కొలెస్ట్రాల్‌ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం వ్యాయామమే శ్రీరామరక్ష గుండెజబ్బుల రాకుండా ఉండాలంటే రోజూ 40 నిముషాల నడక లేదా జాగింగ్, స్విమ్మింగ్ చేయాలి. కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రోజుకు 3 గ్రాములకు మించి ఉప్పు, నెలకు 500 మిల్లీ లీటర్ల మించి ఆయిల్ వాడకూడదు. ముఖ్యంగా పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుంది. పొగతాగడం, మద్యం అనేవి ఎప్పుడూ గుండెకు శత్రువులే. –డాక్టర్ వంశీకృష్ణ, హృద్రోగ నిపుణులు, అనంతపురం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వెద్యం ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారికీ గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానంతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీలో కార్పొరేట్ స్థాయిలో హృద్రోగులకు సేవలు అందిస్తున్నాం. అటువంటి శస్త్రచికిత్సలు ప్రైవేట్‌గా చేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. ఇప్పటి వరకూ దాదాపు 400 వరకు ఆంజియోప్లాస్టీ,యాంజోగ్రామ్ ఆపరేషన్లు విజయవంతంగా చేశాం. – డాక్టర్ సుభాష్‌చంద్రబోస్, కార్డియాలజిస్టు (చదవండి: జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అలా వాడితే..) -
రిస్క్ లపై ఇన్వెస్టర్లలో అవగాహన అంతంతే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కష్టపడి సంపాదించే ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇదే క్రమంలో పెట్టుబడి సాధనంగా మ్యుచువల్ ఫండ్స్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ, ఇన్వెస్టర్లలో రిస్కులు, తమ రిస్కు సామర్థ్యాలపై అవగాహన అంతంతమాత్రంగాన ఉంటోంది. సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడంలో తమ రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, వ్యవహరించడం కీలకాంశమని 89 శాతం మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నప్పటికీ .. వాస్తవంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకుంటున్న వారు 27 శాతమే. 53 శాతం మంది ఇన్వెస్టర్లు తమ వ్యక్తిగత రిస్కుల మదింపు విషయంలో ధీమాగా వ్యవహరించలేకపోతున్నారు. యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ (ఏఎంసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో ఉండే రిస్కుల విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 1,700 మంది పైచిలుకు యాక్సిస్ ఎంఎఫ్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సర్వే నివేదిక ప్రకారం ఫండ్ రిస్కులను మదింపు చేసేందుకు రిస్్క–ఓ–మీటర్ అనే సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని 55 శాతం మందికి, అలాగే వ్యక్తిగత రిస్కులను మదింపు చేసుకునేందుకు రిస్క్ ప్రొఫైలర్‌ను ఉపయోగించుకోవచ్చని 69 శాతం మందికి అవగాహన లేదు. దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా వారికి మరింత తోడ్పాటు అందించేందుకు పరిశ్రమ కృషి చేస్తోందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. సర్వేలో మరిన్ని అంశాలు.. ► ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రామాణికంగా తీసుకోతగిన అంశాల్లో, దాని గత పనితీరు కూడా ఒకటని 59% మంది ఇంకా విశ్వసిస్తున్నారు. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించాల్సిన అవసరం, కాంపౌండింగ్ ప్రయో జనాల గురించి తెలిసినప్పటికీ చాలా మంది ఇ న్వెస్టర్లు పలు సందర్భాల్లో తమ పెట్టుబడులను ముందుగానే ఉపసంహరించుకుంటున్నారు. ► పరిశ్రమ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 22.2% మంది ఈక్విటీ ఇన్వెస్టర్లు 12–24 నెలల పాటే తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. 48.7% మంది తమ పోర్ట్‌ఫోలియోను రెండేళ్లు, అంతకన్నా తక్కువ వ్యవధిలోనే రిడీమ్ చేసుకుంటున్నారు. ► పెట్టుబడులు పెట్టేటప్పుడు తమ రిస్కు సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పిన 27% మందిలో దాదాపు 64% మందికి రిస్కు సామర్థ్యాలను మదింపు చేసుకోవడానికి రిస్క్ ప్రొఫైలర్ సాధనాన్ని ఉపయోగించుకోవచ్చని తెలియదు. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 30% మందికి మాత్రమే రిస్క్ ప్రొఫైలర్ గురించి అవగాహన ఉంది. ► 61% మందికి రిస్్క–ఓ–మీటర్ దేన్ని సూచిస్తుందనేది తెలియదు. ఇది ‘ఫండ్’ రిసు్కను సూచిస్తుందని 16% మందికి మాత్రమే తెలుసు. తాము పెట్టుబడులు పెట్టే ముందు రిస్కోమీటర్ను చూసుకునే ఇన్వెస్ట్ చేస్తామని సదరు ఇన్వెస్టర్లు తెలిపారు. -
పాములుంటాయ్..! జాగ్రత్త..!!
నిర్మల్: జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరా ల్లో ఆడుకుంటూ మరికొందరు, రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతి చెందిన ఘటనలున్నాయి. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారులో నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా మూఢవిశ్వాసాలతో మంత్రాలు చేయించడం, పసరు మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. జిల్లాలో ప్రస్తుతమున్న చల్లని వాతావరణానికి పచ్చని చెట్లు, పొదలు తోడు కావడం, వర్షానికి వరదనీటి ప్రవాహం వస్తుండడంతో పాములు ఆరుబయట విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జనావాసాల మధ్య, నిల్వ నీరున్న కుంటల్లో దర్శనమిస్తున్నాయి. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలో ఉండే గుంతలు, చెట్లపొదల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అటుగా వెళ్లి ఆడుకుంటున్న చిన్నపిల్లలు పాముకాటుకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇళ్ల ముందు, ఆరుబయట నిలిపి ఉంచుతున్న ద్విచక్ర వాహనాలు, కారు ఇంజిన్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాము కాటును ఇలా గుర్తించాలి.. పాము కరిస్తే ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది.. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా? అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు ఉంటుంది. కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఇవీ.. జాగ్రత్తలు పొలం పనులకు వెళ్లే రైతులు, అడవుల్లో పశువుల వెంట తిరిగేవారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్ వెంట తీసుకెళ్లాలి. పాములు ఎక్కువగా మోకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులు ధరించాలి. కాళ్ల కిందకు ఉండే దుస్తులు వేసుకోవాలి. కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎవరైనా పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్స ఇలా.. పాముకాటు వేసినప్పుడు నోరు లేదా బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు. కంగారులో నాటువైద్యులను ఆశ్రయించవద్దు. పాము కాటు వేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాలి. కాటు వేసిన భాగంలోని మూడు అంగుళాల పైభాగాన గుడ్డతో కట్టాలి. మందులు అందుబాటులో ఉంచాం అన్ని ప్రభుత్వ దవా ఖానలు, పీహెచ్‌సీల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వానాకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
ట్యాబ్‌ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠశాలల ను విద్యాశాఖ ఐటీ బృందం స్వయంగా పరిశీలించి ట్యాబ్‌ల పనితీరును పరీక్షిస్తోంది. విద్యార్థులకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు అ న్ని పాఠశాలల్లోనూ ఈ బృందం అన్ని ట్యాబ్‌లను పరిశీలిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఐటీ నోడల్ ఆఫీ సర్ సీహెచ్ రమేశ్ కుమార్ నేతృత్వంలో బృందం ఈ ప్రక్రియను ప్రారంభించింది. మండలానికి ఇ ద్దరు ఐటీ నేపథ్యం ఉన్న ఉపాధ్యాయుల చొప్పున 1,360 మందితో పాటు జిల్లా నోడల్ ఆఫీసర్లు కూ డా ఇందులో పాలుపంచుకుంటున్నారు. తొలుత సాంకేతిక సమస్యలపై దృష్టిపెట్టనున్నారు. సమస్యలను పరిష్కరించడంతోపాటు వాటి వినియోగంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ని ర్వహిస్తున్నారు. వాస్తవానికి ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్ తప్ప ఇంటర్నెట్ కంటెంట్‌ను అప్లోడ్ చేసేందుకు, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా ట్యాబ్‌ల సాఫ్ట్వేర్ రూపొందించారు. సరైన అవగాహన లేక కొందరు విద్యార్థులు యాప్స్ డౌన్లోడ్ చేసేందుకు యత్నించడంతో అవి సాంకేతికంగా నిలిచిపోతున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందీ విద్యార్థులు గుర్తించలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిన్నింటికి పరిష్కారంగా విద్యాశాఖ ఐటీ బృందం ఇప్పుడు అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్ అథెంటికేటర్ సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేస్తోంది. డౌన్‌లోడ్‌కు యత్నిస్తే హెచ్ఎంకు మెసేజ్ విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల్లో ఎలాంటి మా ర్పులు చేసినా వెంటనే ఉన్నత స్థాయిలోని వారికి ఓటీపీ మెసేజ్ వచ్చేలా ఐటీ బృందం చర్యలు తీ సుకుంటోంది. అన్ని ట్యాబ్‌ల్లోనూ గూగుల్ అథెంటి కేటర్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా విద్యార్థి ట్యాబ్‌లో మార్పులు చేసేందుకు యత్నిస్తే వెంటనే సంబంధిత స్కూలు హెచ్ఎంకు, రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్ సిబ్బందికి, మండల స్థాయిలో ఐటీ సహాయకులుగా పనిచేసే ఉపాధ్యాయులకు సైతం సమాచారం వెళ్తుంది. దీంతో ఏ పాఠశాలలో ఏ విద్యార్థి తప్పుచేశారో సులభంగా తెలిసిపోతుంది. ప్రసుత్తం ఉన్న ట్యాబ్‌లను సరైన రీతిలో విని యోగించకపోవడమే తప్ప.. వాటిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని స్టేట్ ఐటీ నోడల్ అధికారి రమేశ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇకపై ఆ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఏర్పాట్లు చేశామ న్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక సచి వాలయ డిజిటల్ అసిస్టెంట్‌కు ట్యాబ్‌ల వినియో గంపై శాస్త్రీయ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.