ఆస్ట్రేలియాలో ‘బేర్‌ఫుట్ వాకింగ్’ ఇప్పుడు చాలామంది అలవాటు చేసుకుంటున్నారు. ఉత్తకాళ్లతో నడవడం భారతీయులకు వేల ఏళ్లుగా తెలిసినా ఆ తర్వాత వ్యాయామ నడక కోసం తగిన షూస్, చెప్పులు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. కాని ‘భూమితోపాదాలను తాకించడం’ వల్ల ఆరోగ్యమని ఇంకా ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఉత్తకాళ్ల నడక ప్రయోజనాలేమిటి?
ఆస్ట్రేలియాలో ఉత్త కాళ్లతో నడవడం ఇప్పుడు ఒక వ్రతంలా పాటిస్తున్నారు. కొందరు మార్నింగ్ వాక్ కోసం ఉత్త కాళ్లను ఉపయోగిస్తుంటే మరికొందరు ఎల్లవేళలా చెప్పులు, షూస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇదొక పెద్ద ధోరణిగా మారిందక్కడ. మన దేశంలో చెప్పుల్లేనిపాదాలతోనే జనం నడిచారు. ఇప్పటికీ నడిచేవారున్నారు. కాని ఆరోగ్య చర్యల్లో భాగంగా చెప్పుల్లేకుండా భూస్పర్శను ΄÷ందడం అనేది మెల్లమెల్లగా మన దేశంలోనూ కనిపిస్తోంది. గతంలో చూస్తే చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ తన జీవితంలో ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. ఆయన ఎన్ని దేశాలు తిరిగినా ఖాళీపాదాలతోనే తిరిగాడు. ఇక ఇటీవల యువ దర్శకుడు అనుదీప్ ఖాళీపాదాలతో నడకను ప్రచారం చేస్తున్నాడు. ఆస్ట్రేలియా వారైనా గానీ, ఇలా నడవడాన్ని ఇష్టపడుతున్నవారుగానీ చెబుతున్నదేమిటి? ఇలా నడవడం వల్ల ఉపయోగాలేమిటి?
ఎక్కడ నడవాలి: ఉత్తపాదాలతో నడిచే వారు కూసు రాళ్లు లేదా ముళ్లు లేని మట్టి బాటల్లోగాని, గడ్డి మైదానంలోగాని, ఇసుక దారుల్లోగాని నడవడం మంచిదని నిపుణులు అంటున్నారు. సూపర్ మార్కెట్‌లో లేదా నున్నటి రాళ్లు పరిచిన స్థలాల్లో నడిస్తే జారి పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
1. ప్రకృతితో అనుసంధానం
ప్రకృతిలో పుట్టిన మనిషి ప్రకృతితో అనుసంధానం కావడం లేదు. ప్రకృతి స్పర్శను అనుభవించడం లేదు. ఏíసీ గదుల్లో ఉంటూ కాలికి నేలంటకుండా జీవిస్తున్నాడు. నేల తగిలితే– కాలి కింద భూమికి ఉన్న రకరకాల స్వభావాలు అంటుతూ ఉంటే ప్రకృతితో ఒక అనుసంధానం ఏర్పడుతుంది. వినమ్ర భావన కలుగుతుంది. ఇంకా మామూలు భాషలో చె΄్పాలంటే కళ్లు నెత్తికెక్కి ఉంటే అవి కిందకు దిగుతాయి.
2. విద్యుదయస్కాంత సమతుల్యత
ఖాళీపాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగెటివ్ అయాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల శరీరంలో పేరుకున్న అయాన్లను ఇవి బేలెన్స్ చేస్తాయి. దాని వల్ల శరీరంలోని విద్యుదయస్కాంత స్థితి సమతుల్యం అవుతుంది. దీంతో వాపులు తగ్గడం, నిద్ర బాగా పట్టడం వీలవుతుంది.
3. ఒత్తిడి దూరం
ఖాళీపాదాలతో నడవడం వల్లపాదాలలో ఉండే నరాలు క్రమబద్ధంగా తాకిడికి లోనవుతాయి. దాని వల్ల ఒత్తిడి దూరమయ్యి సేదదీరిన భావన కలుగుతుంది.
4. సరైన పోశ్చర్
ఖాళీపాదాలతో నడిచినప్పుడుపాదాలు, కాళ్లు, మడమలు అనుసంధానంలోకి వస్తాయి. చెప్పులు లేదా షూస్ వేసుకుని నడిచేటప్పుడు తెలియకనే నడకపోశ్చర్ మారుతుంది. కాని ఖాళీపాదాలతో నడిచేటప్పుడు నడకకు వీలుగా శరీరం సరైనపోశ్చర్‌కు వస్తుంది. అంతేకాదు కాలి కండరాలు బలపడతాయి. శరీరాన్ని సరిగ్గా బేలెన్స్ చేస్తూ నడవడం తెలుస్తుంది. కాళ్లను పూర్తిగా ఆన్చి నడవడం వల్ల నడకలో కుదురు వస్తుంది.
5. రక్తప్రసరణ
ఖాళీపాదాలతో నడవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పాదంపై ఒత్తిడి పడటం వల్ల రక్తప్రసరణలో చురుకు వచ్చి గుండెకు మేలు జరుగుతుంది. అంతేకాదుపాదాలపై ఉండే మృతకణాలు వదిలి΄ోయి చర్మం మెరుగవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment