కరోనా బారీనుంచి ఆ సమయంలో ఎన్నోరకాల ఫేస్‌మాస్క్‌లను వాడారు. వాటి వలన ఫలితాలు, నష్టాలు కూడా అనుభవించారు. అదొక విధమైతే.., ఈ చర్మ సమస్యలు మరో విధము. వయసు పెరిగేకొద్దీ చర్మం ముడతలు బారుతుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. ఈ సమస్యలను డీల్ చేయాలంటే ఈ లైట్ థెరపీ మాస్క్‌ను వాడాల్సిందే..
దీన్ని 15 నుంచి 25 నిమిషాల వరకు ముఖానికి పెట్టుకుని ఉంచితే.. మంచి ఫలితం లభిస్తుంది. ఆప్షన్స్‌లో మల్టీ కలర్స్‌ని మార్చుకోవడంతో వివిధ చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎటువంటి నొప్పి, శ్రమ, ఇబ్బంది లేకుండా ముఖంలో మెరుపుని సొంతం చేసుకోవచ్చు. ఈ మాస్క్ సాయంతో రెడ్, బ్లూ, ఆరెంజ్, పర్పుల్, వైట్, గ్రీన్, సియాన్ ఇలా మొత్తంగా 7 రంగుల్లో ట్రీట్‌మెంట్‌ని అందుకోవచ్చు. రిమోట్ సాయంతో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇది పోర్టబుల్‌గానూ, కంఫర్టబుల్‌గానూ పని చేస్తుంది. స్త్రీల సౌలభ్యం, సౌకర్యం కోసం రూపొందిన ఈ ఎల్‌ఈడీ బ్యూటీ మాస్క్.. ఫుడ్–గ్రేడ్ సిలికాన్ మెటీరియల్‌తో తయారైంది. ఇంట్లోనే కాదు ప్రయాణాల్లోనూ సులభంగా ఉపయోగించుకోవచ్చు, ఈ మాస్క్ బిజీ లైఫ్‌స్టయిల్‌కి సరైనది. ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏపని చేసుకుంటూ అయినా దీన్ని చక్కగా వాడుకోవచ్చు.
ఈ స్కిన్‌కేర్ టూల్.. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. బ్లూ లైట్ చికాకు, అలసటలను దూరం చేస్తుంది. వైట్ లైట్ చర్మానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది. సియాన్ లైట్ స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా ఒక్కో కలర్ ఒక్కో సమస్యను దూరం చేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే హోమ్ స్పాను ఎంజాయ్ చేయొచ్చు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,083 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment