ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..! | How Many Hours Do You Sleep A Day | Sakshi
Sakshi News home page

ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..!

Published Sat, Jan 20 2024 1:49 PM | Last Updated on Sat, Jan 20 2024 1:49 PM

How Many Hours Do You Sleep A Day - Sakshi

'రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైనా నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.'

రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైనా నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర మంచిదని అధ్యయనంలో రుజువైంది.

రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయన వేత్తలు గుర్తించారు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించేందుకు సమయాన్ని కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇవి చదవండి: ఇయర్‌ వాక్స్‌.. లాభమా? నష్టమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement