sleeping time
-
ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు!
మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి. శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్లా, రంబ్లింగ్ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్‌గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్‌కి బ్రిస్టల్ హమ్, టావోస్ హమ్, విండ్సర్ హమ్ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రిస్టల్ హమ్.. ఇంగ్లాడ్‌లోని బ్రిస్టల్‌లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ పైలాన్లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట. టావోస్ హమ్.. ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు. విండ్సర్ హమ్.. ఇంగ్లాడ్‌లోని విండ్సర్‌లో వినిపించే ఈ హమ్.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు.. తాము హమ్ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్‌కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు. ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్‌షిప్‌మ్యాన్ ఫిష్ లేదా టోడ్ ఫిష్‌లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్ చెవిన పడుతున్నాయని వాదించారు. మరోవైపు ఈ హమ్మింగ్ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..!
'రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైనా నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.' రోజు మొత్తంలో కనీసం ఆరు గంటలైనా నిద్రపోని వారిలో గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. నిద్రలేమి కారణంగా తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా అది శరీరంలోని రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. తద్వారా రక్తనాళాల్లో ఒత్తిడి ఏర్పడి అది మెల్లగా గుండెపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర మంచిదని అధ్యయనంలో రుజువైంది. రాత్రివేళల్లో ఆరు గంటలు కంటే తక్కువ సమయం నిద్రించినవారిలో 27 శాతం మేర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధ్యయన వేత్తలు గుర్తించారు. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని పనులు ఉన్నా.. నిద్రించేందుకు సమయాన్ని కేటాయిస్తే.. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇవి చదవండి: ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా? -
పైకప్పు కూలిపడి అయిదుగురు మృత్యువాత
లక్నో: ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పైకప్పు కొంతభాగం కూలిపడిన ఘటనలో తల్లిదండ్రులు, వారి ముగ్గురు చిన్నారులు మృత్యువా తపడ్డారు. ఆలంబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ రైల్వే కాలనీలో శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల సమయంలో పారిశుధ్య సిబ్బంది గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి శిథిలాల నుంచి చంద్ర, సరోజినీ దేవి(35), వారి పిల్లలు హర్షిత్(13), హర్షిత(10), అన్‡్ష(5) మృతదేహాలను వెలికి తీశారు. కాలనీలోని వారుంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, ఖాళీ చేయమని నోటీసులిచ్చినా పట్టించుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. -
నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్ర.. ఈ డివైజ్ గురించి తెలుసుకోవాల్సిందే!
‘కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి చెప్పాడు గాని, కునుకు పట్టడమే గగనమై కుమిలిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉంటారు. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఎన్నో మందులు మాకులు చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా, నిద్రలేమి బాధితుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యకు తాము తయారు చేసిన చిన్న పరికరం ఇట్టే చెక్ పెట్టేస్తుందని ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ చెబుతోంది. ‘బనాలా సెన్స్’ అనే ఈ పరికరం చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్‌కు చెందిన స్విచ్‌లు ఉంటాయి. పక్కమీదకు చేరి నిద్రకు ఉపక్రమించే ముందు, దీనిని తలగడకు కాస్త దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్‌ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331) మాత్రమే! చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
Health Tips: తినగానే పడక మీదకి వెళ్తున్నారా.. అయితే..
Health Tips In Telugu: ఇటీవల ఆరోగ్యస్పృహ పెరగడం వల్ల తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం లేదుగానీ... గతంలో చాలామంది రాత్రి భోజనం కాగానే వెంటనే పడక మీదికి చేరేవారు. ఇప్పటికీ ఇలాంటివాళ్లు ఉన్నారు. నిజానికి తిన్న వెంటనే పడక మీదికి చేరడం వల్ల అసిడిటీ ప్రభావంతో కడుపులో ఇబ్బందులు పెరుగుతాయి. ఓ సీసా నిండా నీళ్లు ఉన్నప్పుడు, దాన్ని నిలబెట్టకుండా... పక్కకు ఒరిగేలా చేస్తామనుకోండి. దానిలోని ద్రవం సీసా గొంతు భాగంలోకి వచ్చినట్టే... మన కడుపులోని ద్రవాలూ గ్రావిటీ వల్ల ఫుడ్పైప్లోకి వస్తాయి. దాంతో మన కడుపులోని యాసిడ్... అన్నంపై పనిచేయడానికి బదులుగా గొంతులోంచి పైకి తన్నినట్లుగా అవుతుంది. దాంతో గొంతులో వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపులోని అన్నంపై యాసిడ్ ప్రభావం తగ్గి, అది త్వరగా అరగకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉండటం (బ్లోటింగ్) వంటి అనర్థాలన్నీ జరుగుతాయి. అందుకే భోజనం తిన్న వెంటనే, పడక మీదికి ఒరిగిపోకుండా... ఆహారానికీ, నిద్రకూ కనీసం రెండు గంటల వ్యవధి ఇవ్వడం అవసరమన్నది వైద్యనిపుణుల సలహా. చదవండి👉🏾Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! -
అతిగా నిద్ర పోతున్నారా అయితే..?
సాక్షి, న్యూఢిల్లీ: రోజుకు కావాల్సిన నిద్రకన్నా తక్కువ గంటలు నిద్రపోతే గుండెపోటు, డిమెన్షియా, స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని ఇంతకాలం వైద్యులు చెబుతూ వచ్చారు. రోజుకు కావాల్సిన దానికన్నా ఎక్కువ గంటలు నిద్రపోతే, అంటే దాదాపు పది గంటలు నిద్ర పోతే గుండెపోటు వచ్చి గుటకాయస్వాహా అనడానికి రెట్టింపు ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఇప్పుడు తాజా పరిశోధనలో తేల్చారు. రోజుకు ఐదు గంటలకన్నా తక్కువ సేపు నిద్రపోతే మనిషిలో గుండెపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఉంటుందని, అదే పది గంటలు నిద్రపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం రెండింతలు పెరుగుతుందని 4,60,000 మందిపై జరిపిన పరిశోధనల ద్వారా బ్రిటీష్ వైద్యులు తేల్చి చెప్పారు. జన్యుపరంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ, కావాల్సినంత శరీర వ్యాయామం చేస్తున్నప్పటికీ పది గంటల వరకు నిద్ర పోయే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని వారు చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియోలోజి’ అనే పత్రికలో ప్రచురించారు. గుండెపోటు వచ్చే అవకాశం జన్యుపరంగా ఉన్న వారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోతే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని కూడా వారంటున్నారు. ఎక్కువ గంటలు నిద్రపోతే గుండెలో రక్తప్రవాహం మందగించి గుండెలో మంట, నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని, తక్కువ గంటలు నిద్ర పోవడం వల్ల జన్యువులు నశించి గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల తక్కువ గంటలు నిద్రపోతారు. లేదా ఇతరత్ర బిజీ ఉండడం వల్ల కొందరు తక్కువ గంటలు నిద్ర పోతారు. ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే ఆరు కన్నా తక్కువ గంటలు నిద్రపోయేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుందని, అదే తొమ్మిది గంటలకన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే అవకాశం 34 శాతం పెరుగుతుందని పరిశోధనా వ్యాసాన్ని రాసిన డాక్టర్ సెలైన్ వెట్టర్ వివరించారు. అందుకనే ఏమో ‘అతి నిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు’ అంటూ తెలుగు సినీ గేయ రచియిత ఓ పాట రాశారు. -
దెయ్యాలు నిజంగానే ఉన్నాయా?
సాక్షి, వెబ్ డెస్క్ : మీరు కళ్లు తెరచి పడుకుంటున్నారా?, నిద్రిస్తున్న సమయంలో ఏవైనా వింత శబ్దాలు మీకు వినిపిస్తున్నాయా?. సహజంగా ఒకసారి, రెండుసార్లు ఇలాంటి సంఘటనలు జరిగితే పట్టించుకోకుండా వదిలేస్తాం. అదే పదేపదే శబ్దాలు వినిపిస్తే మాత్రం అనుమానం(ఏదో ఉందని) మొదలవుతుంది. ఏదో గుర్తించలేని అదృశ్య శక్తి మనల్ని వెంబడిస్తుందని భావిస్తాం. ఒక్కోసారి పడుకున్న చోటును ఎటూ కదలలేకపోతాం. దీంతో మనల్ని ఎవరో వెంటాడుతున్నారన్న భయం పెరిగిపోతుంది. అప్పటినుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తాం. చీకటి పడుతుంటుంది. ఇంటికి వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. రాత్రికి మళ్లీ ఏం జరుగుతోందనని హడలెత్తిపోతుంటాం. ఇలాంటి అనుభూతులన్నీ దెయ్యాలు, భూతాల వల్ల కాదని సైకాలజీ ప్రొఫెసర్ ఎలైస్ గ్రెగరీ తేల్చేశారు. గోల్డ్‌స్మిత్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో ఆయన పని చేస్తున్నారు. హఠాత్తుగా నిద్రలో నుంచి లేచి ఇంట్లో ఏదో ఉన్నట్లు భావించే వారు అధికంగా బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్నారని చెప్పారు. ఇదే వారిని మానసిక ప్రశాంత నుంచి దూరం చేస్తోందని వెల్లడించారు. నిద్ర పక్షవాతం నిద్ర మొత్తం 3 స్టేజ్లలో ఉంటుందని గ్రేగ్ చెప్పారు. మనుషులు మొదట మెల్లగా నిద్రలోకి జారుకుంటారని, సమయం గడిచే కొద్దీ గాఢ నిద్రలోకి వెళ్తారని, ఆ తర్వాత రకరకాల కలల్లోకి వెళ్తామని గ్రెగరీ పేర్కొన్నారు. ఈ దశలో కలలోని పనులను మనం నిజంగానే చేస్తున్నట్లు భావిస్తామని, బెడ్‌పై కాళ్లు, చేతులు, ముఖ కవళికలు కలకు అనుకూలంగా మారతాయని చెప్పారు. ఈ స్థితిని నిద్ర పక్షవాతం అంటారని చెప్పారు. బాగా పొద్దుపోయిన తర్వాత నిద్రించేవారిలో ఈ మూడు స్టేజ్‌లు పూర్తికావని దాంతో వారు పగటిపూట అవిశ్రాంతిగా ఫీల్ అవుతారని తెలిపారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మెల్కొన్న తర్వాత కూడా కదలలేకపోవడం, ఏదో జరుగుతున్నట్లు ఫీల్ అవ్వడం వంటివి జరుగుతాయని వివరించారు. -
ఏడు గంటలు నిద్ర లేకుంటే...
న్యూయార్క్ : రోజూ రాత్రి కనీసం ఏడుగంటల నిద్ర లేకుంటే కుంగుబాటు, యాంగ్జైటీ ముప్పు 80 శాతం పెరుగుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. రోజుకు ఏడు గంటల నిద్ర అవసరమని దీనిలో కనీసం గంట పాటు నిద్ర కరవైనా నీరసం, నిస్సత్తువ, అలసట ఆవహించే ప్రమాదం 60 నుంచి 80 శాతం వరకూ ఉంటుందని అథ్యయనం వెల్లడించింది. మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువని, వారి హార్మోన్ల కారణంగా కుంగుబాటు ముప్పు అధికమని పేర్కొంది. ఏటా 25 శాతం మంది నిద్రలేమితో బాధపడుతుండగా, ఏడు శాతం మంది కుంగుబాటు బారినపడుతున్నారు. రోజుకు పెద్దలు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రించాలని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సూచించింది. కుంగుబాటు రుగ్మతకు చికిత్స అందించే సమయంలో వైద్యులకు తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని అథ్యయనం చేపట్టిన జార్జియా సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 20,851 మందిని టెలిఫోన్ ద్వారా ప్రశ్నలు అడగడం ద్వారా ఈ సర్వే నిర్వహించారు. అథ్యయనంలో భాగంగా వారి నిద్ర అలవాట్లను, ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అథ్యయన వివరాలను న్యూరాలజీ, సైకియాట్రి, బ్రైన్ రీసెర్చి జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
రైళ్లలో పగటి నిద్ర బంద్
► ఇక బెర్తుల్లో రాత్రి 10 నుంచి ► ఉదయం 6 వరకే పడుకోవాలి ► ప్రయాణికుల మధ్య తగాదాల నేపథ్యంలో నిద్రించే సమయం కుదించిన రైల్వే బోర్డు సాక్షి, హైదరాబాద్: ‘ఉదయం 11 గంటలు.. మిడిల్ బెర్త్ ప్రయాణికుడు పడుకునే ఉండటంతో లోయర్ బెర్త్‌లో కూర్చోడానికి కుదరలేదు.. అలా ఓ వైపు వంగి టీ తాగుతుంటే అది ఒలికి నా ఖరీదైన డ్రెస్ పాడైంది. ఆ నష్టానికి పరిహారం ఎవరిస్తారు’ అంటూ కాజీపేటకు చెందిన ప్రవీణ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుబ్బారావు.. ఢిల్లీకి హైదరాబాద్‌లో రైలెక్కాడు.. మిడిల్ బెర్త్ టికెట్.. భోజనం చేయటం, కాలకృత్యాలు తప్ప మిగతా సమయం పడకకే పరిమితమయ్యాడు.. దీంతో లోయర్ బెర్త్‌పై ఇతరులు కూర్చోడానికి కుదరలేదు.. వారు వారించినా పట్టించుకోలేదు.. ఇది కంపార్ట్మెంట్ వారికి చికాకుగా మారటంతో టీసీకి ఫిర్యాదు చేశారు. ఇది చాలా రైళ్లలో జరుగుతున్న తంతే.. రిజర్వ్ చేసుకున్న బెర్త్‌లో వేళాపాళా లేకుండా ప్రయాణికులు పడుకుంటుండటంతో లోయర్బెర్త్ను సీటింగ్‌కు వాడుకోవటం ఇబ్బందిగా మారుతోంది. దీనిపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తుండటంతో స్పందించిన రైల్వే బోర్డు.. దాన్ని నియంత్రించేందుకు రిజర్వేషన్ బోగీల్లో పడుకునే వేళలను తాజాగా సవరించింది. ఇకపై రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించేవారు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకే నిద్రపోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మిగతా వేళల్లో మిడిల్ బెర్త్‌ను మడిచి లోయర్‌బెర్త్‌లో కూర్చోవటానికి వీలు కల్పించాలని.. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోనల్ కార్యాలయాలకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేసింది. బోగీల్లోని టీసీలు ఈ బాధ్యతను పర్యవేక్షించాలని.. వీటిపై ఫిర్యాదులొస్తే వెంటనే స్పందించాలని పేర్కొంది. అలాగే వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులను ఈ నిబంధన నుంచి మినహాయించింది. వారి శారీరక సమస్యల దృష్ట్యా సాధారణ వేళల్లోనూ పడుకునేందుకు బెర్తులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. పాత సమయంలో గంట కోత.. నిజానికి పడుకునే సమయాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు బెర్తుల్లో పడుకోవచ్చని, ఆ తర్వాత సీటింగ్‌కు వీలుగా మార్చాలని సమయపాలన ఆదేశాలు బోర్డు జారీ చేసింది. కానీ అది ఎక్కడా అమలు జరగటం లేదు. అలాంటి సమయపాలన ఉందని చాలా మందికి తెలియదు. ఫిర్యాదు చేసినా టీసీలు పట్టించుకునేవారు కాదు. అదో సమస్యగా భావించలేదు. కానీ ఇంతకాలానికి బోర్డు దృష్టిసారించింది. పాత సమయాల్లో గంట కోతపెట్టడమే కాకుండా.. కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 10కి ముందు పడకేసినా.. 6 తర్వాత పడుకునే ఉన్నా.. బెర్త్‌లకు సంబంధించిన ఫిర్యాదులు సగటున 30 వరకు రికార్డవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులు రాకుండా.. కంపార్ట్మెంట్లలో గొడవ పడుతున్న సందర్భాలు కోకొల్లలు. సాధారణంగా లోయర్ బెర్త్‌లో ముగ్గురు కూర్చుంటారు. పడుకునే వేళకు ఇద్దరు మిడిల్, అప్పర్ బెర్తుల్లోకి చేరుకుంటారు. కానీ లోయర్ బెర్త్ ప్రయాణికులు తొందరగా పడకేస్తే మిగతా ఇద్దరు గత్యంతరం లేక పైబెర్తుల్లోకి చేరుకోవాల్సి వస్తోంది. ఇక సైడ్ బెర్తుల విషయానికొస్తే.. దిగువ బెర్త్ వారు మధ్యాహ్నము కూడా పడుకునే కిటీకీల్లోంచి బయటకు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుండటంతో పై బెర్తు వారు పైనే కూర్చోవాల్సి వస్తోంది. కూర్చునే వెసలుబాటులేక టీ కూడా తాగలేకపోతున్నామని, భోజనం చేయలేక ఇబ్బంది పడుతున్నామంటూ వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. తాజాగా అన్ని జోన్లకు ఆదేశాలు అందటంతో వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. లోయర్, మిడిల్, సైడ్ లోయర్ బెర్తుల్లో రాత్రి 10కి ముందు పడకేసినా, ఉదయం 6 తర్వాత పడుకునే ఉన్నా టీసీలకు ఫిర్యాదు చేయొచ్చు. -
నిద్రకు కోటా?!
సాక్షి, న్యూఢిల్లీ : ఇది నా బెర్తు.. నా ఇష్టం.. ఎన్ని గంటలైనా నిద్రపోతా.. అయినా అడిగేందుకు మీరెవరూ? అనే ప్రశ్నలు, మాటలు ఇక కదరదు. ఎందుకంటే.. రిజర్వేషన్‌కు, బెర్తులకు ఉన్నట్లే నిద్రకూడా కోటా విధించింది రైల్వేశాఖ. లోయర్, మిడిల్ బెర్తులు దక్కించుకున్న ప్రయాణికులు జర్నీలో అధిక సమయం నిద్ర పోతుండడం వల్ల పలు ఫిర్యాదులు రైల్వే శాఖకు అందాయి. మరీ ముఖ్యంగా పగటివేళలో కూడా ప్రయాణికులు బెర్తులు కిందకు దించి నిద్రించడం వల్ల ఆర్ఏసీ ప్రయాణికుల సీట్లు లభించడం లేదని కొంతకాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా రైల్వే శాఖ తాజా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యురల్లో ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి.. ఉదయం 6 గంటల వరకూ బెర్తుల మీద నిద్రించేందుకు అవకాశం కల్పించింది. ఇతర ప్రయాణికుల నుంచి వ్యతిరేకత లేకపోతే .. రాత్రి 9 గంటలకే పడుకోవచ్చని అందులో రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే శాఖ తాజాగా జారీ చేసిన సర్క్యులర్ని ఇండియన్ రైల్వేస్ కమర్షియల్ మాన్యువల్ వాల్యుమ్ -1 లో 652వ పేరాలో చేరుస్తున్నట్లు రైల్వే బోర్డు సభ్యుడు, ప్యాసెంజర్ మార్కెటింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ ప్రకటించారు. -
నిద్ర.. ఎక్కువైనా, తక్కువైనా కష్టమే!
న్యూయార్క్: కొందరు ఎప్పుడూ అతిగా నిద్రపోతుంటారు. పైగా అధిక విశ్రాంతి తీసుకుంటున్నాం కదా. అరోగ్యానికి వచ్చే ఇబ్బందిలేదు అని భావిస్తారు. కానీ అది తప్పు అని తేలింది. సరిపడా నిద్ర పోకపోవడం మాత్రమే కాదు అతిగా నిద్రపోవడం కూడా ప్రమాదకరమేనని వైద్యులు అంటున్నారు. ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితుల వల్ల శారీరక అనారోగ్య సమస్యలు మాత్రమే తలెత్తుతాయని భావించారు. కానీ మానసికంగా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. నిద్రలేమి, అతినిద్ర వల్ల రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-6లు పెరిగిపోయి రక్తపోటు, టైప్-2 డయాబెటీస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ రెండు వ్యాపకాల వల్ల చిరాకు, కోపం, అసహనం, తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం, కోరికలు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని రీసెర్చర్స్ చెబుతున్నారు. ఈ సమస్యలను ఎదుర్కొంట్నునవారు తాము నిద్రపోయే గంటలలో మార్పులు అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మనిషికి సగటున 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. దాదాపు 50 వేల మందిపై పరిశోధన చేసిన వైద్య బృందం ఈ విషయాలను వెల్లడించింది. -
ఇంటెలిజెంట్ వ్యక్తులు ఇలా ఉంటారట!
లండన్: మిగతావారితో పోల్చితే ప్రజ్ఞావంతులు అన్ని విషయాల్లో ముందుంటారు. వారికున్నటువంటి ఎక్కువ ఐక్యూ మూలంగా అన్ని వ్యవహారాల్లో దూసుకుపోతుంటారన్నది తెలిసిందే. అయితే ప్రజ్ఞావంతుల్లో కామన్‌గా ఉండే అంశం ఏంటన్నదానిపై జరిగిన పరిశీలనలో ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. అదేంటంటే.. వీరు మిగతావారితో పోల్చితే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారట. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో వెల్లడైన ఈ విషయాన్ని 'స్టడీ మేగజైన్'లో ప్రచురించారు. మనుషుల్లో ఉండే ఐక్యూ యావరేజ్ అనేది వారు రాత్రి పూట ఎంత త్వరగా నిద్రపోతున్నారనే అంశాన్ని ప్రభావితం చేస్తోందని దీనిలో వెల్లడించారు. మరి నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు విధి నిర్వహనలో భాగంగా మెలకువతో ఉంటారు కదా.. అలా అని వారికి ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లా అని అడుగుతున్నారు కొందరు. అయితే.. రాత్రిపూట మొత్తం పార్టీల్లో గడిపేసి పగలు నిద్రపోయే రాత్రిజీవుల్ని సపోర్ట్ చేసేలా ఉన్న ఈ ఫలితాలను అనుకరించాలని ప్రయత్నించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని సలహా ఇస్తున్నారు ఇంకొందరు.