
‘కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి చెప్పాడు గాని, కునుకు పట్టడమే గగనమై కుమిలిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉంటారు. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఎన్నో మందులు మాకులు చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా, నిద్రలేమి బాధితుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యకు తాము తయారు చేసిన చిన్న పరికరం ఇట్టే చెక్ పెట్టేస్తుందని ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ చెబుతోంది.
‘బనాలా సెన్స్’ అనే ఈ పరికరం చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్‌కు చెందిన స్విచ్‌లు ఉంటాయి. పక్కమీదకు చేరి నిద్రకు ఉపక్రమించే ముందు, దీనిని తలగడకు కాస్త దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్‌ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331) మాత్రమే!
చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’
Comments
Please login to add a commentAdd a comment