ఉయ్యాల్లో ఊపుతూ.. లాలి పాటలు పాడుతూ.. కథలు చెబుతూ.. ఇలా చిన్నారులను నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు ఏవేవో చేస్తుంటారు. ఇప్పుడు, ఆ పనిని సులభతరం చేసింది ఈ ‘జియానా లులుమ్ బేబీ సూథర్’. ఇదొక ఆల్ ఇన్ వన్ స్లీప్ మెషిన్. ప్రత్యేకమైన , ఆహ్లాదకరమైన పాటలు, శబ్దాలను ప్లే చేస్తూ చిన్నారులను త్వరగా నిద్రపుచ్చడానికి
ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులోని క్రై డిటెక్షన్ టెక్నాలజీ, చిన్నారులను ఏడుపు విన్న 20 సెంకన్లలోపే తల్లిదండ్రులకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు, ప్రశాంతకరమైన శబ్దాలను ప్లే చేస్తుంది. తర్వాత రెడ్ లైట్ థెరపీలో భాగంగా డివైజ్ లైట్లను అడ్జస్ట్ చేస్తూ, పిల్లలను కామ్ చేయటానికి ప్రయత్నిస్తుంది.
దీనిని, మొబైల్‌కు ఓ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇందులోని స్మార్ట్ ఇన్‌ఫాంట్ మానిటరింగ్ సాయంతో ఎక్కడి నుంచి అయినా ఈ డివైజ్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. టైమర్, నోటిఫికేషన్ , ఇతర సెట్టింగ్స్ అన్ని కూడా యాప్ లోనే సెట్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు.
(చదవండి: ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!)
Comments
Please login to add a commentAdd a comment