device
-
ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. ఇక ప్రతిసారీ కార్డు వివరాలు అక్కర్లేదు
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకుని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ బుకింగ్‌లు, బీమా కొనుగోళ్లతోపాటు పిన్‌కోడ్, ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి చేసే చెల్లింపులు వంటి వివిధ సేవలలో ఉపయోగించవచ్చు.ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు మెరుగైన భద్రత, సౌలభ్యం నుండి ప్రయోజనం పొందుతారు. ఇకపై మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లలో కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రతి లావాదేవీకి సీవీవీని నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్‌పే తెలిపింది. టోకెనైజ్డ్ కార్డులు కార్డ్ వివరాలను ఫోన్లకు సురక్షితంగా లింక్ చేయడం ద్వారా మోసాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకెనైజ్ చేయవచ్చు.ఈ ఫీచర్ నుండి వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారు. టోకెనైజ్డ్ కార్డులు వేగవంతమైన లావాదేవీలను, అధిక మార్పిడి రేట్లను అనుమతిస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఈ పద్ధతిని అవలంబించడంతో, వ్యాపారాలు మెరుగైన కస్టమర్ నిలుపుదల, సున్నితమైన చెక్అవుట్ అనుభవాన్ని పొందుతాయి. ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే ఉపయోగించే వ్యాపారులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపు భద్రత, సౌలభ్యాన్ని పెంచుతుందని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి అన్నారు. ఈ సర్వీస్‌ను మరిన్ని కార్డ్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించాలని, ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే వ్యాపారులందరికీ విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
ఈ డివైజ్‌తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!
ఉయ్యాల్లో ఊపుతూ.. లాలి పాటలు పాడుతూ.. కథలు చెబుతూ.. ఇలా చిన్నారులను నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు ఏవేవో చేస్తుంటారు. ఇప్పుడు, ఆ పనిని సులభతరం చేసింది ఈ ‘జియానా లులుమ్ బేబీ సూథర్’. ఇదొక ఆల్ ఇన్ వన్ స్లీప్ మెషిన్. ప్రత్యేకమైన , ఆహ్లాదకరమైన పాటలు, శబ్దాలను ప్లే చేస్తూ చిన్నారులను త్వరగా నిద్రపుచ్చడానికిఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులోని క్రై డిటెక్షన్ టెక్నాలజీ, చిన్నారులను ఏడుపు విన్న 20 సెంకన్లలోపే తల్లిదండ్రులకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు, ప్రశాంతకరమైన శబ్దాలను ప్లే చేస్తుంది. తర్వాత రెడ్ లైట్ థెరపీలో భాగంగా డివైజ్ లైట్లను అడ్జస్ట్ చేస్తూ, పిల్లలను కామ్ చేయటానికి ప్రయత్నిస్తుంది. దీనిని, మొబైల్‌కు ఓ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇందులోని స్మార్ట్ ఇన్ఫాంట్ మానిటరింగ్ సాయంతో ఎక్కడి నుంచి అయినా ఈ డివైజ్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. టైమర్, నోటిఫికేషన్ , ఇతర సెట్టింగ్స్ అన్ని కూడా యాప్ లోనే సెట్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకొని వాడుకోవచ్చు. (చదవండి: ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!) -
జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!
కేశాలంకరణతోనే ముఖంలో ప్రత్యేక కళ వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక లోపాలు, ఒత్తిడి, జుట్టు విషయంలో సరైన శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో చిన్న వయసులోనే చాలామంది బట్టతల బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ‘హెయిర్ గ్రోత్ హెల్మెట్‘ చక్కగా ఉపయోగపడుతుంది.ఇది ఎల్ఈడీ రెడ్ లైట్ థెరపీని అందిస్తుంది. దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ తలమీద చర్మానికి, వెంట్రుకల కుదుళ్లకు చక్కటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ లైట్ థెరపీ జుట్టు కుదుళ్లలో శక్తిని పెంచుతుంది. దీనిని వాడటం వల్ల ఎలాంటి నొప్పి, మంట ఉండవు. ఇది డైహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయిని తగ్గించి, తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఈ పరికరం జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా, ఉన్న జుట్టు మరింత ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా వాడినట్లయితే, పన్నెండు వారాల్లోనే 128% జుట్టు పెరుగుతుందని ఈ హెల్మెట్ తయారీదారులు చెబుతున్నారు. దీన్ని ప్రతిరోజూ పది నిమిషాలు, తలకు పెట్టుకుని, స్విచాన్ చేసుకుంటే సరిపోతుంది. జుట్టు రాలిపోయిన ప్రదేశంలో తిరిగి వెంట్రుకలను మొలిపించడంలో ఈ హెల్మెట్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ పరీక్షల్లో తేలింది. -
ఈ దువ్వెనతో హెయిర్ డై ఈజీ..!
ఈరోజుల్లో, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే యవ్వనంగా, అందంగా కనిపించడానికి ఆ వెంట్రుకలకు నలుపు లేదా ఇతర గాఢమైన రంగులను వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వారికి చిత్రంలోని ఈ పరికరం చక్కగా పని చేస్తుంది.ఇది బ్యూటీ వరల్డ్‌లో ప్రత్యేకంగా రూపొందిన బాటిల్. జుత్తు ఒత్తుగా పెరగాలన్నా, వేసుకున్న రంగు తలంతటికీ పట్టాలన్నా ఈ బాటిల్ సాయం తీసుకోవాల్సిందే. ఈ బాటిల్లో నూనె లేదా హెయిర్ కలర్ నింపుకుని మూతకు అటాచ్ అయ్యి ఉన్న దువ్వెన పళ్లను తలకు ఆనించి దువ్వుకుంటే సరిపోతుంది. దాని వల్ల చేతులకు జిడ్డు లేదా రంగు అంటుకోదు. ఈ బాటిల్ మూతకు దువ్వెన అటాచ్ అయ్యి ఉంటుంది. అయితే మూత కిందవైపు స్ప్రింగ్ ఉంటుంది. మూతపైన ఉన్న బటన్ని గట్టిగా ఒత్తితే, లోపల నుంచి కలర్ లేదా ఆయిల్ దువ్వెన పళ్లలోకి వచ్చి, వెంట్రుకలకు చక్కగా అప్లై అవుతుంది. ఈ బాటిల్‌ను నలుపు రంగు తోపాటు వివిధ రంగులకు వినియోగించవచ్చు. ఈ బాటిల్‌ను, దానికి అమర్చుకోగల దువ్వెనను శుభ్రంగా కడిగి, ఆరబెట్టుకోవచ్చు. అయితే కలర్‌కి వినియోగించిన బాటిల్‌ను ఆయిల్‌కి వాడకపోవడం ఉత్తమం. దీని ధర సుమారు 24 డాలర్లు వరకు ఉంది. అంటే 2,029 రూపాయలన్నమాట. ఇలాంటి బాటిల్స్ పలు రకాలు, పలు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. (చదవండి: కిడ్స్‌పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు) -
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్‌తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్‌ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్‌కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్‌తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
‘క్లిప్’ ఉంటే మీ సైకిల్ ఇక ఈ-సైకిల్
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్‌లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్‌ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్‌గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్‌లోడెడ్ క్లాంప్ను ముందు చక్రం ఫోర్క్‌కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్‌గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799). -
దొంగలించి పడ్డ మీఫోన్ ఎలా గుర్తించాలి...!
-
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ...ఈజీగా కనిపెట్టేయండిలా..!
-
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్‌ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్‌బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్‌తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్‌కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్‌ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్‌ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్‌లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్‌తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్‌ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్‌లా చుట్టి స్టెతస్కోప్‌లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్‌లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్‌ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్‌తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్‌గా స్టెతస్కోప్‌తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్‌తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!
తరుచు పెద్దవాళ్లు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేధిస్తుంటుంది. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటారు. ముప్పై దాటిన మహిళలు, కొంతమంది పిల్లలు తరుచుగా కాళ్లు పీకేస్తున్నాయని అంటుంటారు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన డివైజ్వచ్చింది. దీంతో దెబ్బకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 8 పిక్స్ లెగ్ మసాజ్ మిషాన్ అలసిన కాళ్లకు చక్కటి రిలీఫ్‌ని ఇస్తుంది. చిటికెలో మీ కాళ్ల నొప్పులు మాయం అవుతాయి. అరికాళ్లు, మోకాళ్లు పీకేస్తున్నట్లు ఉన్నవాళ్లకి ఈ డివైజ్ అద్భుతమైన వరం. కాళ్లకు చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం కాళ్లకు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇది ఒకరకంగా అసౌకర్యాన్ని తెలియని ఒత్తడిని కూడా దూరం చేస్తుంది. కాళ్లు నొప్పులుగా ఇబ్బందిగా ఉంటే ఒక విధమైన అసౌకర్యంగా, ఏమయ్యిందనే టెన్షన్ ఉంటుంది. ఈ మసాజ్ మెషిన్‌తో ఆ సమస్యలు దూరమవ్వడమే గాక మీ కాళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఈ డివైజ్ ఖరీదు రూ. 13 వేలు పైనే ఉంటుందట. (చదవండి: 'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?) -
ఈ డివైజ్‌తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్‌ని ఇష్టపడనిదెవరు.. దానికోసం కష్టపడనిదెవరు! ఆ తలకట్టు కోసం పార్లర్లు, హెయిర్ స్పాల చుట్టూ తిరగడం ఆపి ఈ చిత్రంలోని హెయిర్ ట్రీట్మెంట్ అప్లికేటర్‌ను తెచ్చుకోండి. ఇది జుట్టును క్షణాల్లో మృదువుగా మార్చేస్తుంది.ఈ డివైస్.. అరచేతిలో అమరిపోయే చంద్రవంకలా కనిపిస్తుంది. వెనుకవైపు ఉన్న మినీ ట్యాంకర్లో నీళ్లతో పాటు.. సీరమ్ లేదా లోషన్ వంటివి మిక్స్ చేసి బటన్ నొక్కితే ఆవిరి రూపంలో బయటికి వస్తుంది. ఆ ఆవిరిని జుట్టు మొత్తానికి పట్టించుకుంటే చాలు.. సెట్ చేసిన హెయిర్ స్టైల్ సెట్ చేసినట్లుగా.. కదలకుండా ఆకర్షణీయంగా నిలుస్తుంది.అధునాతన మైక్రోటెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్‌తో.. జుట్టుకే కాదు ముఖానికీ ఆవిరి పట్టుకోవచ్చు. ఈ మినీ ట్యాంకర్‌ను డివైస్ నుంచి సులభంగా వేరు చేసుకోవచ్చు. అలాగే ఆ ట్యాంకర్‌కి ప్రత్యేకమైన లాకర్ లాంటి మూత ఉంటుంది. దాన్ని బాటిల్ మూతలా బిగించుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ చాలా రంగుల్లో లభిస్తోంది. ఇది అన్ని రకాల జుట్టు స్వభావాలకు అనుకూలమైనది! (చదవండి: -
క్యాన్సర్‌ని కనిపెట్టే డివైజ్.. అద్భుతం చేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
చూడటానికి మొబైల్ఫోన్లా కనిపించే ఈ పరికరం క్యాన్సర్‌ను కనిపెడుతుంది. అమెరికాలోని మ్యాకో కార్పొరేషన్ నిపుణులు ఈ పరికరాన్ని ‘డెర్మా సెన్సర్’ పేరుతో రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఈ పరికరం మూడు రకాల స్కిన్ క్యాన్సర్లను కచ్చితంగా గుర్తించగలదు. మెలనోమా, బేసల్ సెల్ కార్సినోమా, స్క్వేమస్ సెల్ కార్సినోమా రకాల క్యాన్సర్లను గుర్తించడంలో ఈ పరికరం గ్రహించిన స్పెక్ట్రోస్కోపిక్ ఇమేజరీని ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్ విశ్లేషించి, చర్మంపై తలెత్తిన మార్పులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. జనరల్ ఫిజీషియన్లకు, డెర్మటాలజిస్టులకు ఉపయోగపడేలా ఈ పరికరాన్ని తీర్చిదిద్దారు. ఇది చర్మ క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. -
దువ్వెనలా ఉండే ఈ డివైజ్ మీ వద్ద ఉంటే..అందం మీ సొంతం!
చిత్రంలోని పరికరం చూసి.. కేవలం దువ్వెన అనుకోవడంలో తప్పు లేదు కానీ ఇది మల్టీ డివైస్. తలకు మాత్రమే కాదు.. ముఖానికి, మొత్తం చర్మానికీ ఉపయోగపడుతుంది. జుట్టును, బాడీని అందంగా తీర్చిదిద్దుతుంది. ఈ మల్టీ–అటాచ్మెంట్ ఫేస్ స్కాల్ప్ కేర్ డివైస్.. ఎల్ఈడీ లైటింగ్‌తో, ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో, వైబ్రేషన్ తో పని చేస్తుంది. అయితే దీనికి ఉన్న మూడు వేరు వేరు హెడ్స్‌ని అవసరాన్ని బట్టి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం చాలా సులభం. ఇది చర్మాన్ని ముడతలు, మచ్చలు లేకుండా మృదువుగా మారుస్తుంది. యవ్వనం తిరిగి వస్తుంది. అలాగే తలకు మసాజ్లానూ.. వెంట్రుకల గ్రోత్‌ని పెంచే విధంగానూ ఇది ట్రీట్మెంట్ని అందిస్తుంది. కండరాలను ఉత్తేజపరచేందుకు.. చిన్న చిన్న నొప్పులు తగ్గించుకునేందుకు మల్టీ హెడ్ (బాల్స్ అటాచై ఉన్న భాగం)ను ఈజీగా డివైస్‌కి అమర్చుకుంటే సరిపోతుంది. ఈ బ్యూటీ టూల్లో.. ‘లో/మీడియం/ హై’ ఆప్షన్స్‌తో పాటు.. స్కాల్ప్, ఫేస్, మల్టీ అనే మూడు హెడ్స్‌ని అవసరానికి మార్చుకునే వీలుండటంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. 3 గంటల పాటు చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ధర 911 డాలర్లు. అంటే రూ. 75,005లు. క్వాలిటీ, రివ్యూస్ ఆధారంగానే ఇలాంటి డివైస్‌లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్!) -
జస్ట్ చెమటతోనే డయాబెటిస్‌ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!
డయబెటిస్ని రోగులకు ఇక నుంచి సూదుల బాధ తప్పుతుందట. రక్త నమునాల కోసం సూదులతో తీయించుకునే సమస్య ఉండదు. జస్ట్ చెమటతోనే ఈజీగా గుర్తించే సాంకేతికతో కూడిన పోర్టబుల్ సిస్టమ్‌ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం ఖర్చు కూడా తక్కువే. టైప్1, టైప్2 డయాబెటిస్ పేషెంట్ల ఇరువురికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లో పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పరిశోధకులు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్సీఓటీ) మద్దతుతో సాంకేతికతో కూడిన పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని త్రీడీ ప్రింటింగ్, CO2 లేజర్ గ్రాఫేన్-ఆధారిత ఎలక్ట్రోడ్లను ఉపయోగించి రూపొందించినట్లు ప్రోఫెసర్ సాకేత్ గోయెల్ వెల్లడించారు. ఈ పరికరం రోగి నుంచి ఇంజెక్షన్లో రక్త నమునాలను సేకరించే సమస్యను పరిష్కారిస్తుందని చెబుతున్నారు. ఈ పరికరం రక్త నమునాల ఆధారంగా కూడా షుగర్ టెస్ట్ చేయగలదని అన్నారు. అయితే తమ లక్ష్యం చెమటలోని లాక్టేట్ సాంద్రత ఆధారంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను కచ్చితంగా గుర్తించగలదా? అనే లక్ష్యంతో ఆవిష్కరించామని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. ఎలెక్ట్రోకెమిలుమినిసెన్స్ (ఈసీఎల్) ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరికరం చెమటను ఇన్‌పుట్‌గా స్వీకరించిన తర్వాత విద్యుత్ సిగ్నల్‌ను ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత కాంతిని అవుట్‌పుట్‌గా ఉత్పత్తి చేసి, రసాయన ప్రతిచర్యను ప్రారంభిస్తుంది. ఈ కాంతి తీవ్రతను ఆధారంగా లాక్టేట్ సాంద్రతను అంచనావేసి, తద్వారా గ్లూకోజ్ స్థాయిలను నిర్థారిస్తారు. ఇది షుగర్ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు పరిశోధకులు. దీన్ని స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసేలా పోర్టబుల్ పరికరాన్ని పరిశోధకులు బృందం విజయవంంతంగా అభివృద్ధి చేసింది. ఈ పరికరం ప్రత్యేకమైన యాప్ ద్వారా మానవ మెటాబోలేట్ డేటాను యాక్సెస్‌చేసేలా వినయోగదారులను అనుమతిస్తుంది. దీన్ని బల్క్‌లో ఈ ప్రోడక్ట్‌ని ఉత్పత్తి చేసేలా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ అత్యాధునిక పరికరం ఖరీదు రూన 300 నుంచి రూ. 400 మధ్యలోనే ఉంటుందని చెప్పారు. ఎలాంటి పెయిన్ ఎదుర్కొవాల్సిన అవసరం లేకుండా మధుమేహ పరీక్షలను చాలా సులభంగా ఈ సాధనంతో చెక్ చేయించుకోగలరని అన్నారు. (చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!) -
ఈ డివైజ్‌తో అందమైన ముఖ ఆకృతి మీ సొంతం!
ముఖాన్ని కాస్టీ కాస్మెటిక్స్‌తో, మేకప్‌తో తీర్చిదిద్దడం కంటే.. ఇలాంటి డివైస్ల సాయంతో తీర్చిదిద్దితే ఆ అందం ఎక్కువ కాలం నిలుస్తుంది. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేషియల్ మసాజర్‌ను ఉపయోగించి.. డబుల్ చిన్ను తగ్గించుకోవచ్చు. ముడతలు, గీతలు లేకుండా మృదువుగా మార్చుకోవచ్చు. ఈ స్కిన్ లిఫ్ట్ పరికరం.. హీటింగ్, వైబ్రేషన్‌తో పనిచేస్తుంది. ఇది కళ్లు, పెదవులు, బుగ్గలు ఇలా ప్రతి భాగంలోనూ ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్‌స్పాట్‌లను పూర్తిగా మాయం చేస్తుంది. అలాగే ముఖ ఆకృతిని మార్చి.. డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన గ్లోను అందిస్తుంది. ఎలక్ట్రిక్ డివైస్ అయిన ఈ మసాజర్.. ఎలాంటి ప్రమాదాలను కలిగించదు. స్కిన్ రిజువనేషన్ స్కిన్ కేర్ టూల్‌గా గుర్తింపు పొందిన ఈ మెషిన్‌కి చిత్రంలో చూపిన విధంగా చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బేస్ లభిస్తుంది. దానిమీద ఈ టూల్‌ని అమర్చుకుని చార్జింగ్ పెట్టుకోవాలి. ఇందులో మొత్తం నాలుగు రంగుల ప్రత్యేకమైన మోడ్స్ ఉంటాయి. రెడ్, పర్పుల్‌తో పాటు బ్లూ కలర్లో రెండు మోడ్స్ ఉంటాయి. ఈ డివైస్‌ని ఎలా వాడాలో తెలుపుతూ ఒక బుక్లెట్ కూడా లభిస్తుంది. దీనికి రెండు హెడ్స్ ఉంటాయి. ఒకటి క్లీనింగ్ బ్రష్ హెడ్, రెండు మసాజింగ్ హెడ్. వాటిని మార్చుకుంటూ చర్మాన్ని మొదట శుభ్రం చేసుకుని.. తర్వాత మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం అందుతుంది. (చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!) -
ఈ డివైజ్ ఉంటే.. ఒత్తయిన ఉంగరాల జుట్టు ఈజీగా మీ సొంతం!
ఒత్తయిన.. ఉంగరాల జుట్టు ఇచ్చే అందం అంతా ఇంతా కాదు. దానికున్న క్రేజే వేరు! కానీ.. మేనేజ్ చేయడమే మహాకష్టం. అయితే చిత్రంలోని డివైస్ కర్లీ హెయిర్ సంరక్షణను మేడ్ ఈజీ చేస్తుంది. ఈ ఆటోమేటిక్ హెయిర్ కర్లర్.. 2 సెకన్ల పాటు పవర్ బటన్‌ను నొక్కిపడితే ఆన్ అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు.. ఫెళుసుబారిన జుట్టునూ మృదువుగా మార్చుతూ, అందమైన గిరజాలను సృష్టిస్తుంది. 8 నుంచి 11 సెకన్స్‌లో స్లైట్ కర్ల్స్ ఏర్పడతాయి.12 సెకన్లు దాటి 15 సెకన్స్ వరకూ ఉంచితే సాఫ్ట్ కర్ల్స్ ఏర్పడతాయి. 16 నుంచి 18 సెకన్ల వరకూ ఉంచితే.. టైట్ కర్ల్స్ (పూర్తిస్థాయిలో ఉంగరాలు) ఏర్పడతాయి. డివైస్‌కి ఒకవైపు సన్నని కర్లర్ చాంబర్ ఉంటుంది. దానిలో పాయలు పాయలుగా జుట్టును పెడితే.. అవి ఉంగరాలుగా చుట్టుకుని అందంగా మారుతాయి. ఇందులో మూడు వందల డిగ్రీల ఫారిన్ హీట్ నుంచి మూడువందల తొంభై డిగ్రీల ఫారిన్ హీట్ వరకు ఆరు స్థాయిల్లో ఉష్ణోగ్రతను పెంచుకునే వీలుంటుంది. డిస్ప్లేలో బ్యాటరీ ఇండికేటర్, టైమ్ అండ్ టెంపరేచర్ వివరాలతో పాటు.. కర్లర్ ఎటువైపు తిరుగుతున్నాయో కూడా వివరంగా చూసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ అనే ఆప్షన్స్‌తో కర్లర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. దీని ధర సుమారుగా 1,249 రూపాయలు. (చదవండి: కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!) -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్‌లు తనకు బాగా ఇష్టం. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్‌కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్‌లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్‌తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం. -
కెమెరాలే మంటను డిటెక్ట్ చేసేలా..సరికొత్త ఆవిష్కరణ!
అగ్ని ప్రమాదాలను ఎంత ముందుగా పసిగట్టగలిగితే నష్టాన్ని అంతగా తగ్గించవచ్చు. స్మోక్ డిటెక్టర్ల వంటి పరికరాలు ఇందుకే వాడుతుంటాం మనం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. ప్రమాదాన్ని గుర్తించి స్పందించేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమస్యను కూడా అధిగమించేలా చాలా వేగంగా మంటలు, అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు ఓ అద్భుత పరికరాన్ని భారత సంతతి విద్యార్థి ఒకరు ఆవిష్కరించారు. ఆ వినూత్న ఆవిష్కరణకు గానూ రూ. 21 లక్షల ఫ్రైజ్ మనీని గెలుపొందింది. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాలో శాన్‌జోస్‌కు చెందని 12 ఏళ్ల షాన్యా గిల్ ఆమె రూపొందించిన ఫైర్ డిటెక్టర్ డివైస్ థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ పోటీల్లో అత్యున్నత అవార్డు థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఆస్కెండ్ అవార్డును గెలుచుకుంది. తాను చూసిన ఆ ప్రమాదం షాన్యాను ఆ డివైజ్‌ను రూపొందించడానికి ప్రేరేపించింది. 2022 వేసవిలో తమ ఇంటి వెనుక ఉన్న రెస్టారెంట్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో తన అమ్మ చాలా జాగ్రత్తగా ఉండేదని. ఇంటి నుంచి బయటకొస్తే చాలు వంటగదిలో స్టవ్ ఆఫ్ అయ్యిందో లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం లేదా ఒక్కోసారి తననే చూడమని పదేపదే అడుగుతుండేదని చెబుతోంది షాన్యా. దీంతో ఈ సమస్యను ఎలా నివారించాలని ఆలోచిస్తుండగా.. థర్మల్ కెమెరాలు శీతకాలంలో ఇళ్లలో వేడి లేకపోవడాన్ని గుర్తించగలవని కనుగొంది. ఈ కెమెరాలే ఇళ్లలోని మంటలను త్వరితగతిన గుర్తించగలవా? అని ఆశ్చర్యపోయింది. ఆ థర్మల్ కెమరానే కాంపాక్ట్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌ను రూపొందించింది. ఆ తర్వాత వ్యక్తుల మధ్య తేడాను గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసింది. ఫలితంగా బర్న్ అయ్యే వస్తువులను ఐడెంటిఫై చేయడం మొదలు పెట్టింది షాన్యా రూపొందించిన డివైజ్. ఈ ముందస్తు హెచ్చరికతో ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలను రక్షించగలుగుతామని చెప్పుకొచ్చింది. ఈ డివైజ్ సుమారు పది నిమిషాలన పాటు మనుషులను గుర్తించడమే కాకుడుండా వేడకి కారణమయ్యే వాటిని గుర్తించి టెక్స్ట్ సందేశాన్ని ఇచ్చేలా ప్రోగ్రామ్ చేసింది. ఈ డివైజ్ నూటికి 97 శాతం మనుషులను, ఉష్ణానికి కారణమయ్యే కారకాలను విజయవంతంగా గుర్తిస్తోంది. ఈ ఫైర్ డిటెక్షన్ ఆవిష్కరణకు గానూ శాన్యా అత్యున్నత అవార్డు తోపాటు సుమారు రూ. 21 లక్షలు ఫ్రైజ్ మనీని గెలుచుకుని అందరిచేత శెభాష్ అని ప్రసంశలందుకుంది. (చదవండి: కూతురి పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలని ఆ మాత్రలు వేసుకుంది..అంతే ఆమె..) -
ఈ డివైజైలో తక్కువ ఆయిల్తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!
డిజిటల్ డివైస్‌లలో.. లేటెస్ట్ మేకర్స్‌ని ఎన్నుకోవడమే నయాట్రెండ్. చిత్రంలోని డివైస్ అలాంటిదే. ఇంతవరకు ఫ్రంట్‌లోడ్ ఎయిర్ ఫ్రైయర్స్‌నే చూశాం. కానీ ఈ చిత్రంలోని డివైస్ టాప్లోడ్ ఫ్రైయర్. దీనిలో బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, డీప్ఫ్రైయింగ్ వంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఆరులీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బాస్కెట్లో.. బూరెలు, గారెలు, బజ్జీలు, చగోడీలు, మురుకులు, వడియాలు వంటివన్నీ తయారు చేసుకోవచ్చు. ఇందులో టైమింగ్, టెంపరేచర్ రెండిటినీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తోనే ఆహారం వేగంగా గ్రిల్ అవుతుంది. దీన్ని మూవ్ చేసుకోవడం చాలా సులభం. ఇందులో గ్రిల్ బాస్కెట్‌తో పాటు.. గ్రిల్ ప్లేట్ కూడా లభిస్తుంది. దానిలో చికెన్, మటన్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవచ్చు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. (చదవండి: ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్!) -
వొడాఫోన్ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్ కోసం ల్యాబ్–యాజ్–ఏ–సరీ్వస్‌లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది. ఇంటర్ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్‌ల టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్‌లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు. -
పార్లర్‌కి వెళ్లక్కర్లేకుండా..ఈ మెషిన్‌తో ఈజీగా వ్యాక్సింగ్, థ్రెడింగ్..
సాంకేతికతతో సకల సౌలభ్యాలను అందుకోవడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదు. అయితే వినియోగదారులు తాము కొనుగోలు చేసే మెషిన్స్.. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆకర్షణీయమైన లుక్‌తో పాటు, లేటెస్ట్ వెర్షన్స్ తో ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ లేటెస్ట్ 3 ఇన్ 1 హెయిర్ రిమూవల్ డివైస్. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీతో రూపొందిన ఈ మెషిన్ .. సూపర్ ఫాస్ట్ డివైస్‌గా పని చేస్తుంది. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్‌ను ఇస్తుంది. ఈ పెయిన్లెస్ లేజర్ హెయిర్ రిమూవర్ సిస్టమ్.. స్త్రీలతో పాటు పురుషులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వినియోగించడం చాలా తేలిక. ఇది బాడీ, ఫేస్, బికినీ అనే మూడు ప్రత్యేకమైన మోడ్స్‌ని కలిగి ఉంటుంది. ప్రతి మోడ్‌లో 5 లెవెల్స్ చొప్పున ఉంటాయి. వాటిని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. 2 నెలల పాటు ఉపయోగించిన తర్వాత, వెంట్రుకల ఎదుగుదల పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. 98% వరకు ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్కి ముందు.. వెంట్రుకలు రిమూవ్ చెయ్యాల్సిన భాగంలో షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ టోన్‌ని బట్టి.. హెయిర్ కలర్‌ని బట్టి ఇది యూజ్ అవుతుంది. ఇక దీన్ని వినియోగించిన చోట చర్మం పొడిబారి, గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తవు. ఈ డివైస్‌ను కళ్లకు సమీపంలో వాడుతున్నప్పుడు దీనితో పాటు లభించే కళ్లజోడును కచ్చితంగా పెట్టుకోవాలి. ధర 118 డాలర్లు. అంటే 9,781 రూపాయలు. ఈ లేటెస్ట్ ట్రెండీ మెషిన్ వెంట ఉంటే.. వ్యాక్సింగ్, థ్రెడింగ్ల కోసం ప్రతినెలా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దీన్ని వినియోగించి.. కేవలం ఎనిమిది లేదా పది నిమిషాల్లో మొత్తం బాడీ మీదున్న వెంట్రుకలను తొలగించుకోవచ్చు. (చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు! -
బిజీగా ఉండే వాళ్లకి ఈ డివైస్‌తో గార్డెనింగ్ ఈజీ!
గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండి, వాటి సంరక్షణ చూసుకునే తీరికలేని వాళ్లకు ఈ డివైస్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ సిస్టమ్.. పాలకూర, టొమాటో, బచ్చలికూర, కొత్తిమీర, గులాబీ, చామంతి వంటి నచ్చిన మొక్కల్ని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇందులో త్రీ లైట్స్ సెట్టింగ్ ఉంటుంది. రెడ్ కలర్ లైట్.. విత్తనాలు వేసినప్పుడు, బ్లూ లైట్ మొక్క ఎదుగుతున్నప్పుడు, సన్ లైక్ లైట్ పువ్వులు విరబూస్తున్నప్పుడు లేదా పండ్లు కాస్తున్నప్పుడు సెట్ చేసుకోవాలి. నీళ్లు ఏ మోతాదులో ఉన్నాయి, ఎంతకాలం వరకు సరిపోతాయో కనిపిస్తుంటాయి. నీళ్లు పోయడానికి ప్రత్యేకమైన హోల్ ఉంటుంది. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి న్యూట్రిన్ టాబ్లెట్స్ వేస్తూ ఉండాలి. ఈ గాడ్జెట్‌తో మొక్క 5 రెట్లు వేగంగా పెరుగుతుంది. ఇందులో సైలెంట్ పంప్‌తో కూడిన వాటర్ ట్యాంక్ ఉంటుంది. న్యూట్రియంట్ సొల్యూషన్స్, 24 సీడ్లింగ్ బ్లాక్స్, 12 ప్లాంటింగ్ బాస్కెట్స్ ఉంటాయి. డివైస్ లోపల నీటి పంపు ప్రతి గంటకు ముప్పై నిమిషాల పాటు ఆటోమెటిక్‌గా ఆన్ అవుతూ ఉంటుంది. ఈ డివైజ్‌ధర 69 డాలర్లు(రూ. 5661/-) (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
అద్భుతమైన ఫీచర్లతో బోట్ ‘స్మార్ట్ రింగ్’ లాంచ్.. ధర ఎంతంటే..
ఇప్పటివరకూ స్మార్ట్ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే 'స్మార్ట్ రింగ్'లు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఇలాంటి స్మార్ట్ రింగ్‌ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బోట్ తాజాగా లాంచ్ చేసింది. ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్సైట్లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్ రింగ్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్‌లలో వస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు స్టైలిష్, ప్రీమియం, మెటాలిక్ లుక్ స్వైప్ నావిగేషన్‌తో ఇతర డివైజ్‌ల కంట్రోల్ ప్లే/పాజ్ మ్యూజిక్, ట్రాక్ చేంజ్, పిక్చర్ క్లిక్, అప్లికేషన్ల నావిగేట్ హార్ట్ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్ మానిటరింగ్, ఋతుక్రమ ట్రాకర్ సొంత బోట్ రింగ్ యాప్‌కు కనెక్ట్ స్టెప్ కౌంట్, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్ అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్‌వోఎస్ ఫీచర్ 5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్ -
గ్యాస్ గ్రిల్‌తో.. పిక్నిక్లో వెరైటీ వంటలు వండేయొచ్చు
లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లినప్పుడు, పిక్నిక్లకు తిరిగినప్పుడు.. మన వెంట ఈ మెగామాస్టర్ పోర్టబుల్ గ్యాస్ గ్రిల్ ఉంటే చాలు, వేళకు రుచికరమైన ఐటమ్స్‌తో కడుపు నింపుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాల వెరైటీలను చకచకా రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ గ్రిల్ డిజైన్ ప్రత్యేకంగా రూపొందింది. దీనిలో ఒకేసారి రెండు వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇది గ్యాస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీని లోపల పాన్ ప్లేట్, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్ వేరువేరుగా ఉంటాయి. మూతకు అటాచ్ అయ్యి ఉన్న ఆ స్టీల్ స్టాండ్ మూతతో పాటు పైకిలేస్తుంది. క్లోజ్ చేస్తే.. దాని మీద ఆహారం లోపల పడిపోకుండా పోర్టబుల్‌గా మెషిన్లో అమరిపోతుంది. దీని బ్లాక్ అండ్ రెడ్ హ్యాండిల్‌కి ఆనుకుని ఉన్న చిన్న బటన్ ప్రెస్ చేస్తే.. పాన్ ప్లేట్ కింద మంట పుడుతుంది. అలాగే ఇది నిలబడటానికి ఉపయోగపడే స్టాండ్స్ కూడా మడిచేందుకు వీలుగానే ఉంటాయి. మూత ఊడకుండా లాక్ చేసుకోవడానికి ప్రత్యేకమైన క్లిప్ ఉంటుంది. ఎక్కడికైనా తీసుకుని వెళ్లడానికి దీని హ్యాండిల్ చక్కగా పనికొస్తుంది. ఇందులో కట్లెట్స్, కబాబ్స్, హోల్ చికెన్ వంటివెన్నీ రెడీ చేసుకోవచ్చు. ఈ డివైస్ ధర 79 డాలర్లు (రూ.6,535). -
ఈ డివైస్‌తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..
సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్.ఈ ఎల్ఈడీ మెడికల్ డివైస్ (యాక్నే లైట్ షాట్).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. అంటే ట్రీట్మెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట. ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్‌తో రూపొందిన ఈ మినీ మెషిన్.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్‌ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ! -
వాటర్‌లోని సూక్ష్మజీవులను క్షణాల్లోనే నాశనం చేసే డివైజ్, ధర ఎంతంటే?
ఇది అధునాతనమైన వాటర్ డిసిన్ఫెక్షన్ సిస్టమ్. అమెరికన్ కంపెనీ ‘అక్విసెన్స్’ ఇటీవల దీనికి రూపకల్పన చేసింది. ‘పెర్ల్ అక్వా డెకా 30సీ’ పేరిట రూపొందించిన ఈ వాటర్ డిసిన్ఫెక్షన్ సిస్టమ్ నీటిలో సాధారణంగా ఉండే ప్రమాదకరమైన సూక్ష్మజీవులను క్షణాల్లోనే నాశనం చేసి, నీటిని పరిశుభ్రంగా, సురక్షితంగా మారుస్తుంది. ఇది యూవీసీ– ఎల్ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ఆన్ చేసుకోగానే దీనిలో వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు, దీని నుంచి సరఫరా అయ్యే నీటిలోని సూక్ష్మజీవులను 99.9 శాతం మేరకు నాశనం చేస్తాయి. ఇళ్లల్లోనే కాకుండా, వాణిజ్య సంస్థల్లోను, కార్యాలయాల్లోను వినియోగించుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుందని ‘అక్విసెన్స్’ సీఈవో ఆలివర్ లావాల్ చెబుతున్నారు. దీని ధర 500 డాలర్లు (రూ.40,957) మాత్రమే! -
నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్ర.. ఈ డివైజ్ గురించి తెలుసుకోవాల్సిందే!
‘కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి చెప్పాడు గాని, కునుకు పట్టడమే గగనమై కుమిలిపోయే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిగా ఉంటారు. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఎన్నో మందులు మాకులు చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా, నిద్రలేమి బాధితుల సంఖ్యలో పెద్దగా తగ్గుదల కనిపించడం లేదు. అయితే, నిద్రలేమి సమస్యకు తాము తయారు చేసిన చిన్న పరికరం ఇట్టే చెక్ పెట్టేస్తుందని ‘బనాలా లైఫ్’ అనే బ్యాంకాక్ కంపెనీ చెబుతోంది. ‘బనాలా సెన్స్’ అనే ఈ పరికరం చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. ఇది పూర్తిగా రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో ఐసోక్రానిక్ సౌండ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఫోకస్ మోడ్, ఫీల్ గుడ్ మోడ్ అనే రెండు మోడ్స్‌కు చెందిన స్విచ్‌లు ఉంటాయి. పక్కమీదకు చేరి నిద్రకు ఉపక్రమించే ముందు, దీనిని తలగడకు కాస్త దగ్గరగా పెట్టుకుని, కావలసిన మోడ్‌ను ఎంపిక చేసుకుని ఆన్ చేసుకుంటే చాలు. నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 53 డాలర్లు (రూ.4331) మాత్రమే! చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
షుగర్ టెస్టు కోసం ఆంధ్రా వర్సిటీ అద్భుత ఆవిష్కరణ.. డివైస్ స్పెషల్ ఇదే!
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆవిష్కరించింది. ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు. ఈ బయోసెన్సార్ పరికరంలో ఒక చుక్క బ్లడ్ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే షుగర్ లెవల్స్ వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు ఈ డివైజ్ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్ మెథడ్ ద్వారా చిప్స్ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి. ఏయూ చరిత్రలో తొలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో.. కోవిడ్ సమయంలో ప్రతి పరీక్షకు ఎక్కువ ఖర్చు చేసేవారు. అందువల్ల పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరం తయారు చేయాలన్న ఆలోచన మొదలైంది. వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సహకారంతో ఏయూ ల్యాబ్‌లోనే పరిశోధనలు ప్రారంభించి సఫలీకృతులయ్యాం. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో అన్ని పరీక్షలను ఈ పరికరం ద్వారా తెలుసుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఒక డివైజ్ మల్టీపుల్ స్ట్రిప్స్ వాడుతున్నాం. భవిష్యత్తులో ఒక పరికరం.. ఒకే చిప్ అనే విధంగా పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ అపరంజి, ఏయూ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ -
మందుమాకులతో పనిలేదు..అలెర్జీలను తరిమికొట్టే పరికరం!
వాతావరణం మారినప్పడు, గాలిలో దుమ్ము ధూళి పుప్పొడి రేణువులు వంటివి రేగినప్పుడు రకరకాల అలెర్జీలు ఇబ్బందిపెడుతుంటాయి. తుమ్ములు, దగ్గులు, హే ఫీవర్‌లాంటి జ్వరాలతో బాధపడాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. అలెర్జీలతో బాధపడేటప్పుడు వైద్యుల వద్దకు వెళితే యాంటీహిస్టామిన్ మందులు ఇస్తుంటారు. కొందరిలో అలెర్జీలు ఉబ్బసానికి కూడా దారితీస్తుంటాయి. అలాంటప్పుడు కార్టికో స్టిరాయిడ్స్‌తో కూడిన మందులు, కార్టికో స్టిరాయిడ్స్‌ను మోతాదుగా విడుదల చేసే ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది. అయితే, ఎలాంటి మందుమాకులతో పనిలేకుండా, అలెర్జీలు పరారయ్యేలా చేసే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చేసింది. చూడటానికి ఇన్హేలర్లా ఫొటోలో కనిపిస్తున్నది అదే! ఇందులో ఎలాంటి ఔషధాలూ ఉండవు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘ఫ్లూవో ల్యాబ్స్’ ఈ పరికరాన్ని రూపొందించింది. గాలిలో తేడా ఉన్నప్పుడు దీనిని ముక్కు వద్ద ఉంచుకుని స్విచాన్ చేయాలి. దీని నుంచి వెలువడే నానో ఇన్ఫ్రారెడ్ కిరణాలు శరీరం నుంచి హిస్టామిన్స్ వెలువడకుండా నిరోధించి, అలెర్జీ ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాయి. -
అదిరిపోయే డివైజ్, పడుకున్న ఐదు నిముషాలకే గురక పెడుతున్నారా?
నిద్రలో గురక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. గురక పెట్టే వారి కంటే, వారితో కలసి ఒకే గదిలో పడుకునేవారికి మరింత సమస్య. చాలామంది గురక నివారణ కోసం ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. వాటి ఫలితం అంతంత మాత్రమే! జీవితాంతం గురకతో బాధపడాల్సిందేనా అని బెంగపడే వారి కోసం తాజా సాధనం అందుబాటులోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నది అదే! చూడటానికి కెటిల్‌లా ఉంది, దీనితో గురక నివారణేమిటా అనుకుంటున్నారా? నిజమే! ఇది ఎలక్ట్రిక్ కెటిలే! అయితే, కాఫీ, టీలు కాచుకునే కెటిల్ కాదిది. గురక బాధితుల శ్వాసవ్యాయామాల కోసం ఫిన్లాండ్లోని టుర్కు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కెటిల్ ఇది. ‘వెల్ ఓ2’ పేరుతో రూపొందించిన ఈ కెటిల్ వెలుపలి వైపు ఉండే గొట్టం ద్వారా ఒక్కో విడతకు 10–15 సెకన్ల సేపు గాలి ఊదుతూ వ్యాయామం చేసినట్లయితే, మెడ, ఛాతీ కండరాలు బలపడి గురక బాధ శాశ్వతంగా తప్పుతుందని చెబుతున్నారు. దీని ధర 244.80 డాలర్లు (రూ.19,250) మాత్రమే! -
Beauty: నిత్య యవ్వనంగా.. కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి!
ముఖంపైన ముడతలు, మొండి మచ్చలు వయసుని రెట్టింపు చేసి చూపిస్తాయి. వాటితో పాటు కంటి చుట్టూ ఉండే వలయాలు.. ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తాయి. కళ్లు, పెదవులు, ముక్కు, నుదురు, బుగ్గల మీది చర్మం మృదువుగా మెరిస్తేనే ఆరోగ్యం.. అందమూనూ! అలాంటి ట్రీట్మెంట్నే అందిస్తుంది ఈ మాస్టర్ పీస్ (మోర్ ఎఫెక్టివ్ యాంటీ ఏజింగ్ డివైజ్). ఇది పాలిపోయిన చర్మాన్ని సరిచేస్తుంది. చర్మంపైనున్న ముడతలు, గీతలు తగ్గించడంతో పాటు.. కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి.. చర్మానికి లైట్ థెరపీని అందిస్తుంది. డివైజ్ ముందున్న బటన్ ఆన్ చేస్తే అది పని మొదలు పెడుతుంది. ప్రతి శరీరభాగంపైన 4 నుంచి 6 నిమిషాల పాటు ట్రీట్మెంట్ అందించొచ్చు. మొదటి నాలుగు వారాలు.. వారానికి మూడు సార్లు దీన్ని ఉపయోగిస్తే.. ఆ తర్వాత వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించాలి. ట్రీట్మెంట్ తర్వాత పొడి టవల్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుబొమ్మల మధ్య, కంటి మూలల్లో, నుదుటిపై ఉండే ముడతల (క్రాస్ లైన్స్)ను తొలగిస్తుంది. రంగు మారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా చేస్తుంది. రంధ్రాలను పూడ్చి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఈ డివైజన్ని ఉపయోగించడం చాలా సులభం. దీనికి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాల్లో, ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ధర కేవలం 2 వేల రూపాయలు మాత్రమే. చదవండి: Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో -
నాజూకు అందం కోసం అదిరిపోయే గాడ్జెట్స్!
ఈ రోజుల్లో నాజూగ్గా ఉండటమే అసలైన అందం. ఎక్కడా ఇంచ్ ఎక్స్ట్రా కొవ్వు లేకుండా శరీరం ఓ ఆకృతిలో ఉంటేనే వేసుకున్న డ్రెస్‌కైనా .. కట్టుకున్న చీరకైనా అందం. ఛాయ తక్కువైనా, మొహం మీద మొటిమలూ.. మచ్చలూ ఉన్నా, ఒంటి మీద నూగు మెరుస్తున్నా కవర్ చేసుకోవడం సులభమే కానీ.. స్థూలకాయాన్ని కవర్ చేసుకోవడం కుదరదు. అందుకే చాలా మంది లావుగా ఉండటమే తమ అందానికి అసలైన సమస్యగా భావిస్తుంటారు. అలాంటివారి కోసమే ఈ డివైజ్ (స్లిమ్మింగ్ బెల్ట్). 360 డబుల్ హెలిక్స్ సెంట్రిఫ్యూగల్ టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్.. బాడీలో కొవ్వును చాలా వేగంగా తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆటో అండ్ మాన్యువల్ డ్యూయల్ మోడ్ కలిగిన ఈ మెషిన్ ను వినియోగించడం చాలా సులభం. వైబ్రేటెడ్ ట్యాపింగ్, బయోనిక్ మసాజ్‌తో నొప్పి లేకుండానే సమస్యను పరిష్కరిస్తుంది. పైగా దీన్ని ధరించడం వల్ల రిలాక్సింగ్‌గానూ ఉంటుంది. పొట్ట, నడుము, తొడలు, కాళ్లు, చేతులు.ఇలా ప్రతిచోటా పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది ఈ మెషిన్. దీనికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. లావుని బట్టి..టైట్‌గా పట్టేందుకు బెల్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌కి ఎడమవైపు మోడ్స్, పవర్ బటన్, ఆన్/ఆఫ్, స్పీడ్ వంటి ఆప్షన్లు ఉంటాయి. దీని ధర 25 డాలర్లు. అంటే 1,899 రూపాయలు. ఇది మీ వెంట ఉంటే.. సన్నజాజి సోకు మీదే మరి. -
దేవుడా.. ఆ డివైజ్ లేకుంటే ప్రాణాలు పోయేవే!
రెడ్‌బుల్-మెర్సెడెస్ టాప్ రేసర్లు మరోసారి దూకుడు చర్యలతో వార్తల్లోకి ఎక్కారు. ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్, రెడ్‌బుల్ రేసర్ వెర్స్టాపెన్ కార్ల ‘ఢీ’యాక్షన్.. పరస్పర విమర్శలతో వేడెక్కిస్తోంది. ‘‘ఇవాళ నా అదృష్టం బాగుండి బతికా. హలోకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకుంటే ఏమైపోయేవాడినో..’’ అంటూ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ లూయిస్ హామిల్టన్ చెబుతున్నాడు. ఆదివారం వారియంట్ డెల్ రెటాయిలియో రేసుకోర్టులో జరిగిన ఇటలీ పార్కో డీ మోంజా(ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1) రేసులో మెక్లారెన్ రేసర్ డానియల్ రిక్కియార్డో(ఆసీస్-ఇటాలియన్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రేసులో ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం 53 ల్యాప్లతో జరిగిన రేసులో.. 26వ ల్యాప్ వద్ద 225 కిలోమీటర్ల వేగంతో దూసుకుకొచ్చిన రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ రేస్ కారు.. మెర్సెడెస్ రేసర్ హామిల్టన్ రేస్కారును ఎక్కేసింది. రెండు వాహనాలు ట్రాక్ తప్పి పక్కకు దూసుకెళ్లాయి. 750 కేజీల వెహికిల్ ముందుభాగం పచ్చడికాగా.. క్రాష్‌లో హామిల్టన్ ప్రాణాలు పోయి ఉంటాయని అంతా కంగారుపడ్డారు!. కానీ, హలొ డివైజ్ వల్ల పెద్దగాయాలేవీ కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు హామిల్టన్. క్రాష్ తర్వాత తనంతట తానే బయటకు నడుచుకుంటూ వచ్చిన హామిల్టన్.. ఆ తర్వాత మెడ నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాడు. Another hugely dramatic moment in the Verstappen/Hamilton title battle 💥😮#ItalianGP 🇮🇹 #F1 pic.twitter.com/P4J4bN6wX2 — Formula 1 (@F1) September 12, 2021 హలో.. వివాదం హలొ అనేది సేఫ్టీ డివైజ్. క్రాష్ ప్రొటెక్షన్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఓపెన్ వీల్ రేసింగ్ సిరీస్‌లలో వీటిని వాడ్తారు. డ్రైవర్ తల భాగంలో కర్వ్ షేప్‌లో ఉంటుంది ఇది. 2016-2017 జులై మధ్యకాలంలో ఈ డివైజ్‌ను టెస్ట్‌లకు ఉపయోగించారు. ఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో 2018 ఎఫ్ఐఏ సీజన్ నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ప్రతీ రేసులో దీన్ని తప్పనిసరి చేశారు. ఇండీకార్ హలొ మాత్రం ఎయిరోస స్క్రీన్ కోసం వేరే ఫ్రేమ్‌లో ఉంటుంది. అయితే దీని వాడకంపై వివాదం నడుస్తున్నా.. ఇలా ప్రాణాలు కాపాడటం ఇది రెండోసారి!. గతంలో ఈ డివైజ్‌ను తీసుకొచ్చిన కొద్దిరోజులకే రేసర్ చార్లెస్ లెక్లెరిక్ పప్రాణాలు కాపాడింది. స్పా ఫ్రాన్కోర్చాంప్స్(2018) రేస్ సందర్భంగా ఫస్ట్ ల్యాప్‌లోనే ఫెర్నాండో అలోన్సో ‘మెక్లారెన్’తో క్రాష్ అయినప్పటికీ.. ఆ ప్రమాదం నుంచి లెక్లెరిక్ చిన్నగాయం కూడా కాకుండా బయటపడగలిగాడు. ఇక వెర్స్టాపెన్-హామిల్టన్ మధ్య జరిగిన క్రాష్ వివాదానికి తెరలేపింది. వెర్‌స్టాపెన్‌కు పెనాల్టీ విధించినప్పటికీ.. మెర్సిడెస్ మేనేజ్మెంట్ మాత్రం ఈ చర్యను తీవ్రంగా భావించాలని కోరుతోంది. చదవండి: డేంజరస్ క్రాష్.. సిగ్గులేకుండా హామిల్టన్ సంబురాలు -
దర్భంగా పేలుడు కేసులో కొత్తకోణం
-
ఈ డివైజ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్లిమ్‌గా మారుస్తుందట!
ఎంత ఆహారనియమాలు మార్చుకున్నా.. ఎన్ని చిట్కాలు పాటించినా శారీరక శ్రమ లేకపోతే.. వయసుతో పాటు బరువు పెరగడం సర్వసాధారణం. తొడలు, నడుము.. ఒక్కటేమిటీ శరీరంలోని ప్రతి భాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరం షేప్ అవుట్ అయిపోయి వేసుకున్న డ్రెస్‌కి, కట్టుకున్న చీరకు అందం రాకుండాపోతుంది. అలా అని ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేంత తీరిక, ఓపిక లేని బిజీ లైఫ్ మనది. మరి దీనికి పరిష్కారం ఏమిటీ? ఇదిగో.. ఈ చిత్రంలోని బాడీ షేపింగ్ మసాజర్ (రెడ్ లైట్ సోనిక్ రీచార్జబుల్ వైబ్రేషన్ బ్యూటీ డివైజ్).. ఫ్యాట్‌ని ఇట్టే మాయం చేస్తుంది. ఇందులోని అల్ట్రాసోనిక్ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ టెక్నాలజీ.. సెకనులో 3 లక్షల సార్లు వైబ్రేట్ అవుతూ బాడీని రిపేర్ చేస్తుంది. చేతులు, కాళ్లు, పొత్తికడుపు భాగాల్లో పేరుకున్న కొవ్వుని కరిగించేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ కలిగిన ఈ డివైజ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే స్లిమ్‌గా మారుస్తుంది. దీని రెడ్ లైట్ వేవ్‌లెంగ్త్ ఫంక్షనల్ ప్రక్రియ.. చర్మ కణాలను ఉత్తేజితంచేసి స్కిన్‌టోన్‌ను మెరుగుపరుస్తుంది. ఈ మల్టీఫంక్షనల్ బ్యూటీ డివైజ్‌లో స్కిన్ మోడ్, ఫ్యాట్ బర్నింగ్ మోడ్ 1, ఫ్యాట్ బర్నింగ్ మోడ్ 2, షేపింగ్ మోడ్ ఇలా నాలుగు రకాల మోడ్స్ ఉంటాయి. వాటితో పాటు ఆన్ / ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. దాంతో దీని వినియోగం చాలా సులభం. పైగా దీన్ని చేత్తో చాలా ఈజీగా పట్టుకుని కొవ్వు ఉన్న భాగంలో మూవ్ చేసుకోవచ్చు. తేలికగా ఉండటంతో ప్రయాణించేటప్పుడు వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 68 డాలర్లు. అంటే సుమారు రూ. 5 వేలు. -
కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్...ఇది అతి సూక్ష్మ జీవి అయినా విశ్వం మొత్తాన్ని గజగజ లాడిస్తోంది. ఎక్కడ ఎలా పొంచి వుందో తెలిదు..ఎటునుంచి దాపురిస్తుందో తెలియదు..ఏ వస్తువుపై దాక్కొని ఎలా పంజా విసురుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ దేశప్రజలను పట్టి పీడిస్తున్న ఆందోళన ఇది. ముఖ్యంగా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితోపాటు, మందులు, కూరగాయలు, కిరాణా లాంటి అత్యవసర వస్తువులను విక్రయిస్తున్న దుకాణదారులను ఈ భయం వెంటాడుతోంది. అయితే కరోనా మహమ్మారి భయాలకు చెక్ పెడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రోపార్ ఒక కొత్త పరికరాన్ని రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో మనం వాడే నిత్యాసర సరుకులను ఈ వైరస్ బారినుంచి కాపాడుకోవచ్చని వెల్లడించింది. అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఆన్ లైన్ ద్వారా డెలివరీ అయిన వస్తువులు, చేతి వాచీలు, పర్సులు, మొబైల్ ఫోన్లు ఇలా దేన్నైనా ట్రంక్ పెట్టెలో ఉంచి, శుభ్రం చేసుకోవచ్చని బృందం సిఫార్సు చేస్తోంది. వాటర్ ప్యూరిఫైయర్లలో ఉపయోగించే అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని గుమ్మం వద్దనే పెట్టుకోవాలని, అపుడు బయట నుంచి తీసుకొచ్చిన సరుకులు, డబ్బులను దాని కింద ఉంచి త్వరగా శుభ్రం చేసుకోవచ్చని తెలిపింది. కేవలం 30 నిమిషాల సమయంలో వైరస్‌ను అంతం చేస్తుందని పేర్కొంది. 30 నిమిషాలు శానిటైజ్ చేసిన తర్వాత ఓ పది నిమిషాలు చల్లబడే వరకు అలాగే వదిలేయాలని చెప్పింది. అంతేకాదు దీని ధర రూ.500 కన్నా తక్కువ ధరకే లభిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళన లేకుండా, సులువుగా కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువచ్చిన అన్ని వస్తువులను శుభ్రం చేసుకోవచ్చని ఐఐటీ రోపర్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నరేష్ రాఖా ప్రకటించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరిపోదు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే మరిన్ని జాగ్రత్తలు తప్పవని నరేష్ రాఖా సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది కూరగాయలను కూడా వేడి నీళ్లలో కడుగుతున్నారు. అయితే, డబ్బులను అలా కడగలేం కదా. అందుకే ఈ పరికరాన్ని తయారు చేశామని చెప్పారు. గుమ్మం దగ్గర. లేదా, ఇంటి లోపలికి రావడానికి ముందు బయట ఎక్కడైనా పెట్టుకుని తెచ్చుకున్న సరుకులను శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు. అయితే ట్రంక్ లోపల కాంతి హానికరం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడకూడదని,ప్రమాదమని హెచ్చరించారు. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం కరోనావైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 199కు పెరిగింది. 6,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి : వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్ -
కరోనా నివారణకు ఐఐటీయన్ పరికరం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నివారించేందుకు ఐఐటీ, ఐఐఎమ్‌లకు చెందిన దెబయన్ సాహా, శశిరంజన్ ఓ పరికరాన్ని రూపొందించారు. నీటి బిందువులలోని వృద్ది చెందే కరోనాను చంపడానికి ఏయిర్ లెన్స్ మైనస్ కరోనా అనే పరికరం ఉపయోగపడుతుందని సాహా తెలిపారు. సాహా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఉపరితల ప్రదేశాలను శుద్ది చేయడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చని.. ఇది ఆస్పత్రులు, ఒస్స్టాప్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఈ పరికరంతో నగరంలోని అన్ని ప్రదేశాలలో శుద్ది చేయవచ్చని అన్నారు. 'కరోనా డిశ్చార్జ్'ను ఉపయోగించి నీటి బిందువులను శుద్ది చేయవచ్చన్నారు. ఈ పరికరం శుద్దిచేయబడిన నీటి బిందువులతో కూడిన హానికర వైరల్ ప్రొటీన్లను నియంత్రిస్తుంది. ఆక్సిడేషన్ చేయడం వల్ల హానికర వైరస్‌ను నిర్మూలించడానికి ఎంతగానో తోడ్పడుతుందని దెబయన్ సాహా పేర్కొన్నారు. -
డౌట్ ఉంటే చెప్పేస్తుంది
బీపీ సొంతంగా చెక్ చేసుకోవచ్చు. సుగర్‌ను కూడా. అలాగే గర్భధారణ జరిగిందీ లేనిదీ తెలిపే ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఎవరికి వారు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను చేసుకునే పరికరం కూడా రాబోతోంది! కొత్తపరికరం దుర్గాపూర్ (కోల్‌కతా)లోని ‘నిట్’ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థులు కనిపెట్టిన ఈ వినూత్న పరికరంలో చెకప్ స్ట్రిప్ ఉంటుంది. స్ట్రిప్ ధర 150 నుంచి 200 రూపాయల వరకు ఉండే అవకాశాలున్నాయి. వేలినుంచి ఒక రక్తపు చుక్కను తీసి పేపర్‌తో తయారై ఉండే ఆ స్ట్రిప్ మీద ఉంచి, దానికి చిన్న చుక్క ‘రీజెంట్’ను (పరీక్షక పదార్థం) కలిపి విశ్లేషించినప్పుడు వచ్చే ఫలితాన్ని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదీ, లేనిదీ, భవిష్యత్తులో రాబోయే అవకాశం ఏమైనా ఉందా అన్నదీ తెలిసిపోతుంది. స్త్రీ దేహంలో క్యాన్సర్ కారకాలను గుర్తించే ‘హర్2’ అనే యాంటిజెన్ పరిమాణాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ దేహంలో ఈ ‘హర్2’ మోతాదు 15 నానో గ్రాములు/ఎం.ఎల్. కన్నా తక్కువగా ఉంటుంది. అది కనుక 15 నానో గ్రాముల్ని మించి ఉంటే తక్షణం వెళ్లి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను చేయించుకోవడం అవసరం. కచ్చితమైన ఫలితాలను ఇస్తున్న ఈ పరికరాన్ని ‘నిట్’లోని బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మోనీదీప ఘోష్ నేతృత్వంలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రూపొందించారు. దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వీళ్లకు సహకారం అందించింది.పరికరం ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయల వరకు ఉండగా, ఎక్కువ సంఖ్యలో మార్కెట్లోకి వస్తే కనుక ఒక్కో స్ట్రిప్‌ను 50 రూపాయలకు కూడా అందించే వీలుంటుందని మోనీదీప చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల యాభై వేల మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ బయపడుతోందని ఆమె తెలిపారు. అన్నట్లు ఆ పరికరానికి ఇంకా పేరు పెట్టలేదు. -
అన్ని రకాల చెల్లింపులకూ ఒకటే పీవోఎస్ పరికరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ‘పేస్విఫ్’ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాన్ని విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ కలిగిన ఈ పరికరాన్ని బుధవారమిక్కడ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. యాప్స్‌తో కూడిన పీవోఎస్ డివైజ్‌ను వర్తకులు స్మార్ట్‌ఫోన్ మాదిరిగా వినియోగించుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్, ఆన్లైన్ పేమెంట్, యూపీఐ, భారత్ క్యూఆర్ వంటి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకునే వీలుంటుందని పేర్కొంది. -
తాగారో...మీ బండి కదలదంతే..!
ఉత్తరాఖండ్ : మన దేశంలో గంటకి సగటున 16 యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలుపుతోంది. వీటి నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. సరైన ఫలితం మాత్రం ఉండటం లేదు. ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు తాగి వాహనాలు నడపడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, నిద్ర మత్తులో వాహనాలు నడపడం. దీంతో యాక్సిడెంట్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక మీద ఇలాంటి ప్రమాదాల నివారణకు ఉత్తరాఖండ్‌కు చెందిన విద్యార్థులు ఒక నూతన పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని వాహనాలలో అమర్చిన తరువాత తాగి వాహనాన్ని నడపాలని ప్రయత్నిస్తే అవి మోరాయించేలా చేస్తుంది ఈ పరికరం. అల్మోరాలోని ఉత్తరాఖండ్ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం, హల్ద్వానికి చెందిన ఆర్ఐ ఇనుస్ట్రుమెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. ఆర్ పీ జోషి, ఆకాష్ పాండే, కుల్దీప్ పటేల్ కలిసి జట్టుగా ఏర్పడి వ్యర్థాలు, అడవి గడ్డి వంటి పదార్థాలను ఉపయోగించి గ్రాఫీన్‌ను తయారు చేశారు. ప్రమాదాల నివారణకు ఈ గ్రాఫీన్ పూత పూసిన ఎలక్ట్రోడ్లను వాహనాలలో అమర్చుతారు. ఈ ఎలక్ట్రోడ్లు ముఖ్యంగా మద్యంలో ఉన్న ఈథైల్ ఆల్కహాల్‌ను ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఎసిటిక్ ఆమ్లంగా మారుస్తుంది. పనిచేయు విధానం... ఈ సెన్సార్‌ను వాహనంలో డ్రైవర్ ముందు భాగంలో బిగిస్తారు. డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ముందు గ్రాఫీన్ సెన్సార్ మీద ఊదాలి. ఇలా ఊదగానే సెన్సార్ ఆక్టివేట్ అయ్యి రక్తంలో ఆల్కహాల్ ఎంత ఉందనే విషయాన్ని విశ్లేషిస్తుంది. ఒకవేళ ఆల్కహాల్ లిమిట్ మోటర్ వాహనాల చట్టం ప్రకారం నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉంటే సెన్సార్‌లో ఎరుపు రంగు గుర్తు వస్తుంది. వాహనం స్టార్ట్ కాదు. ఒకవేళ గ్రాఫీన్ సెన్సార్‌పై ఊదకుండా వాహనాన్ని స్టార్ట్ చేద్దామన్న కూడా కదలదు. తప్పనిసరిగా గ్రాఫీన్ సెన్సార్‌పై ఊదిన తర్వాతే వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. సెన్సార్‌లోని ఇమాజింగ్ మాడ్యుల్, డ్రైవర్ కంటి కదలికలను విశ్లేషించి, అతను నిద్రపోతున్నట్టు అనిపిస్తే పక్కనే ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. అంతేకాక ఈ ఇమాజింగ్ మాడ్యుల్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నట్లయితే, అతని చుట్టుపక్కల వారికి అలర్ట్ ఇస్తుంది. మరిన్ని ప్రత్యేకతలు... ఇవేకాక ఈ పరికరంలో జీపీఆర్ఎస్ - జీఎస్ఎం, బయోమెట్రిక్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా రూపొందించారు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్లయితే 5 - 10 నిమిషాల్లో దానంతట అదే 100కు ఫోన్ చేసి ఎస్ఓఎస్ను కూడా పంపిస్తుంది. విద్యార్థులు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కే. కే. పౌల్ అభినందనలు తెలిపారు. వెంటనే దీనికి పేటెంట్‌కు దరఖాస్తు చేసుకోమని సూచించారు. అంతేకాకుండా వాణిజ్య వాహనాలలో కూడా వాడుకునే విధంగా ఈ పరికరంలో మార్పులు చేయాల్సిందిగా కోరారు. ఈ పరికరాన్ని వాహనాలలో వాడడాని కంటే ముందు మనేసర్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, గురుగ్రాంలోని ఎస్.జీ.ఎస్ ల్యాబ్, పూణేలోని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వద్ద పరీక్షిస్తారు. ఆ తరువాతనే దీన్ని వాహనాలలో అమర్చడానికి అనుమతి ఇవ్వనున్నారు. -
వరద ముప్పును గుర్తించే పరికరం
లాస్ఏంజెలిస్: భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణంతో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు. -
అంధులకు అండగా..
అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సాయం లేకుండా తమ పనులు తామే చేసుకునేందుకు సహకరించే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చేతికి ధరించే ఉంగరంలా ఉండే ఈ అతి చిన్న పరికరం 3.5 మీటర్ల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా ఇట్టే గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరాన్ని చేతికి ధరించి ప్రయాణిస్తే నడిచే మార్గంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని సృష్టికర్తలు చెప్తున్నారు. లైవ్ బ్రెయిలీ అధినేత అభినవ్ వర్మ ఇప్పుడు అంధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే అతి చిన్న పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని చేతికి ధరిస్తే మూడు, నాలుగు మీటర్ల ముందుగానే వారికి వచ్చే అడ్డంకులను గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. సెకనులో 50వ వంతు సమయంలో అడ్డంకులను గుర్తించగలిగే ఈ పరికరంతో పాటు, దీనికి అనుసంధానంగా బ్యాటరీతో నడిచే మరో రెండు పరికరాలను కూడ అభినవ్ తయారు చేశారు. ఈ 'మినీ' పరికరం అంధుల సాధారణ అవసరాలకు ఉపయోగపడటంతోపాటు, దీనిద్వారా విద్యార్థులు తమ పుస్తకాలను ఆడియో రూపంలో రికార్డు చేసుకొని వినే సదుపాయం కూడ ఉంది. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభినవ్ తోపాటు అతడి స్నేహితుల బృందం విభిన్న ఆలోచనతోనే ఈ చిన్న పరికరం రూపం దాల్చింది. అంధులు కర్రసాయం లేకుండా నడవలేరా? వారు సాధారణ ప్రజల్లా నడవాలంటే ఏం చేయాలి అన్న కోణంలో ఆలోచించిన విద్యార్థులు ఈ చిన్న గాడ్జెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. మూడేళ్ళ క్రితం వారు విద్యార్థులుగా ఉన్నపుడు అంధులకోసం సృష్టించిన గ్లౌవ్స్ వంటి పరికరం విజయవంతం కావడంతో మరింత ఉపయోగంగా ఉండే అతి చిన్న పరికరాన్ని తయారు చేసేందుకు అభినవ్ చదువు పూర్తయిన తర్వాత సన్నాహాలు ప్రారంభించాడు. తాను స్వయంగా స్థాపించిన ఎంబ్రోస్ కంపెనీలో విభిన్నంగా వస్తువులను రూపొందించే ప్రయత్నం చేశాడు. అనేక ప్రయోగాలు, ప్రయత్నాల అనంతరం అభినవ్.. కేవలం 29 గ్రాములు బరువుండే అతి చిన్న రింగులాంటి లైవ్ బ్రెయిలీ పరికరాన్ని రూపొందించి విజయం సాధించాడు. చేతికి పెట్టుకునే ఉంగరంలా ఉండే ఈ చిన్న రింగు.. అంధులు వాడే కేన్ కు పది రెట్లు తేలిగ్గా ఉండటంతోపాటు... కేవలం 50 సెకన్ల లోపే అడ్డు వచ్చే వస్తువులను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు వస్తువు దూరం, బరువు వంటి విషయాలను బట్టి పరికరం వైబ్రేట్ అవుతుంది. తాము రూపొందించిన ఈ చిన్న పరికరం సహాయంతో దృష్టిలోపం ఉన్నవారు నడవడమే కాదు ఏకంగా పరుగులు కూడా పెట్టొచ్చని అభినవ్ బృందం చెప్తున్నారు. -
బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సెల్ చార్జింగ్ పెడుతున్నారా?
బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే చార్జర్లతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఉంటే, ఇక ముందు అలా చేయకండి. చార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకు తెలియదంటే నమ్మండి.. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో..! సమాచారం ఎలా దొంగతనానికి గురవుతుంది మామూలు చార్జర్ల మాదిరి కాకుండా ఇలాంటి చార్జర్లలో ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్ ను ఈ చార్జర్ తో చార్జింగ్ పెట్టిన తర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్ యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నా జరుగుతుందంటే ఎంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ వ్యవస్థను రూపొందించారో ఆలోచించండి. ఈ విధంగా పనిచేసే ఈ డివైజ్ పేరు 'మీమ్' దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, చార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ తదితరాలను రూపొందించారు. కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసి ఉపయోగించుకునే వారి సౌకర్యార్ధం వీటిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 16, 32 జీబీల వేరింయట్లలో ఆన్ లైన్ లో లభ్యం అవుతోంది. -
ఇక మొబైల్లకు వైర్లెస్ చార్జింగ్!
ఎంత ఖరీదైన మొబైల్ కొనుగోలు చేసినా చార్జింగ్ విషయం మాత్రం వినియోగదారులకు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోయింది. అయితే దీనిని పరిష్కరించే దిశగా కొత్త చార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఎనర్జీస్క్వేర్ పేరుతో మార్కెట్లోకి రాబోతున్న వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా అన్ని స్మార్ట్ ఫోన్లతో పాటు.. ట్యాబ్‌లను కూడా ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. ఎనర్జీస్క్వేర్లో ఓ వైర్లెస్ చార్జింగ్ మ్యాట్‌తో పాటు ఓ చిన్న స్టిక్కర్ ఉంటుంది. మొబైల్‌కు అంటుకునే లాగా డిజైన్ చేసిన ఈ స్టిక్కర్‌ను చార్జింగ్ సాకెట్లో ఉంచి ఫోన్‌ను.. మ్యాట్‌పై ఉంచితే చాలు చార్జింగ్ అవుతోంది. ఇందులో ఇప్పటివరకు చార్జింగ్ కోసం వాడుతున్న ఇండక్షన్, ఎలక్ట్రో మేగ్నటిక్ టెక్నాటజీని కాకుండా కండక్టీవ్ చార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే చార్జింగ్ ప్యాడ్ సహాయంతో నాలుగైదు ఫోన్లను సైతం ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో తయారుచేసిన ఏ స్మార్ట్‌ఫోన్ అయినా ఈ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. స్టిక్కర్లలో ఉండే రెండు కండక్టీవ్ డాట్స్ సహాయంతో నేరుగా మొబైల్ బ్యాటరీకి లింక్ అయ్యేలా దీనిని రూపొందించారు. చార్జింగ్ మ్యాట్‌తో పాటు నాలుగు స్టిక్కర్లను కస్టమర్లకు ఇవ్వనున్నట్లు ఎనర్జీస్క్వేర్ వెల్లడించింది. అయితే ఇవి వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
ఇక కంప్యూటర్లు ఉండవు..!
గూగుల్ బ్లాగ్‌లో సుందర్ పిచాయ్ లేఖ న్యూయార్క్: భవిష్యత్తులో భౌతిక కంప్యూటర్లకు స్థానం ఉండదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంచనా వేస్తున్నారు. డివైస్ అనే భావనకు కాలం చెల్లుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ భౌతికంగా కాకుండా ఏ రూపంలో ఉన్నప్పటికీ, మన రోజువారీ కార్యకలాపాల్లో ఇంటెలిజెంట్ అసిస్టెంట్‌గా సహాయపడుతుందని వివరించారు. స్మార్ట్‌ఫోన్ టచ్స్క్రీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రూపరహిత ఉత్పత్తులు పెరుగుతాయని తెలిపారు. మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారతామని వివరించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఊహించని విధంగా ఇప్పుడు సర్వం స్మార్ట్ఫోనే అయ్యిందని పేర్కొన్నారు. రోజు వారీ జీవితానికి స్మార్ట్‌ఫోన్ రిమోట్ కంట్రోల్లా పనిచేస్తోందన్నారు. విద్యకు, వినోదానికి, కమ్యూనికేషన్‌కు, వినియోగానికి... అన్నింటికీ ప్రజలు స్మార్ట్‌ఫోన్‌నే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. వాయిస్‌తో సమాచారాన్ని సెర్చ్ చేయడం పెరుగుతుందని వివరించారు. అయితే ఇక ముందు డివైస్ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆక్రమిస్తుందని అన్నారు. అత్యుత్తమ ఏఐ టీమ్: త్వరలో గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నామని పిచాయ్ తెలిపారు. తమ ఫొటోలను, వీడియోలను సులభంగా నిర్వహించుకునేలా, వాటిని సురక్షితంగా ఉంచుకునేలా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాటిని చూసుకునేలా ఈ గూగుల్ ఫొటోస్ ఫీచర్‌ను అందిస్తామన్నారు. ఇదంతా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో సాధ్యమని పేర్కొన్నారు. గూగుల్ ప్లేను ఉపయోగించుకుంటున్న ఆండ్రాయిడ్ యూజర్ల సంఖ్య వంద కోట్లను దాటిందని తెలిపారు. సంప్రదాయానికి బ్రేక్: గూగుల్ ప్రగతి, భవిష్యత్ ప్రాధాన్యతల గురించి సాధారణంగా ప్రతి ఏడాది ఆ కంపెనీ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ వెల్లడిస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం గూగుల్ సీఈఓగా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి పిచాయ్ బ్రేక్ చేశారు. గూగుల్ సాధించిన ఘనతలు, తదితర అంశాల గురించిన ఒక లేఖను గూగుల్ అధికారిక బ్లాగ్‌లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. ప్రపంచ సమాచారాన్ని నిర్వహించడం, దీనిని విశ్వవ్యాప్తంగా అందరూ యాక్సెస్ చేయడం, వినియోగించడం చేయడంపైననే దృష్టి పెడతామని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ లేఖ గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీ పేజ్ స్వల్ప ముందుమాటతో ప్రారంభమవుతుంది. -
ప్రమాదంలో ఆదుకునే అత్యాధునిక డివైస్
త్రివేండ్రమ్: జాతీయ రహదారిపై మన కారు జుయ్న దూసుకెళుతున్నప్పుడు ఊహించని ప్రమాదం జరగొచ్చు. కారులో వెళుతున్న వారంతా తీవ్రంగా గాయపడొచ్చు. సాయం కోసం అరిచే పరిస్థితి లేకపోవచ్చు. అరిచినా వినిపించుకునే నాథుడు లేకపోవచ్చు. ఉన్నా మనకు ఎలా సాయం చేయాలో తెలియక పోవచ్చు. అంబులెన్స్నో, పోలీసులనో పిలిచేందుకు సాయం చేయడం కోసం వచ్చిన వాళ్ల చేతుల్లో సెల్ఫోన్లు లేకపోవచ్చు. ఉన్నా సిగ్నల్స్ అందకపోవచ్చు. క్షతగాత్రులను ఎలాగో తరలించాలనుకున్నా దగ్గర్లో వాహనం అందుబాటులో ఉండకపోవచ్చు. మరి, అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మనం నిమిత్త మాత్రులమైనా మన ప్రమేయం లేకుండానే అన్నీ తానై తాను చేసుకుపోయే అద్భుత ‘సేఫ్ డ్రై వ్ డివైస్’ను కేరళలోని త్రివేండ్రమ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రసాద్ పిళ్లై రూపొందించారు. సెన్సర్ల ద్వారా జరిగిన ప్రమాదాన్ని గుర్తించి ఈ డివైస్ తక్షణమే స్పందిస్తుంది. ఎలక్ట్రానిక్ నెట్వర్క్, జీపీఎస్ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగిన చోటును గుర్తించడమే కాకుండా దానంతట అదే సమీపంలోవున్న ఆస్పత్రికి లేదా అంబులెన్స్ సర్వీసుకు, పోలీసులకు, మనం ఫీడ్ చేసుకున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రమార సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తోంది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 28 శాతం మంది మరణిస్తున్నా, వారిలో ఎక్కువ మంది సకాలంలో సహాయం అందకనే మరణిస్తున్నారని గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ కారణంగా ఈ డివైస్ ఎంతో మేలు. దీన్ని ఆటో, కారు, జీపు, టూ వీలర్లకు అమర్చుకోవచ్చు. అంతేకాకుండా డ్రైవర్ సరిగ్గా వాహనాన్ని నడపకపోయినా గుర్తించి యజమాని లేదా కారులో ప్రయాణికులను ముందస్తుగా హెచ్చరిస్తుంది. కారు వేగం, మలుపులు, కుదుపులను సెన్సర్ల ద్వారా గుర్తించి డ్రై వింగ్ గురించి అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికాలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రసాద్ పిళ్లై రెండు సంవత్సరాల క్రితం స్వగ్రామం త్రివేండ్రమ్‌కు వచ్చినప్పుడు ఎదురైన ఓ అనుభవం నుంచి ఈ డివైస్ పుట్టుకొచ్చింది. ఓ రోజు ప్రసాద్ పిళ్లై తన భార్య పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా బ్రేకులు పనిచేయక కారు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారు. ముందుకు కదలేని పరిస్థితుల్లో ఉన్న కారును వదిలేసి వెళ్లాలన్నా ఎలా వెళ్లాలన్న సంశయం. సిగ్నల్స్ అందక సెల్‌ఫోన్ కూడా పనిచేయలేదు. ఎవరి సాయం ఎలా అర్థించాలో అర్థం కాలేదు. చాలా సేపటి వరకు ఆ రోడ్డున ఎవరూ రాలేదు. చివరకు కారును అక్కడే వదిలేసి దారిన పోయే ఓ వాహనాన్ని పట్టుకొని ఎలాగో ఒకలాగా ఇంటికి చేరుకున్నారు. ఇలాంటి డివైస్‌ను ఒకదాన్ని తయారు చేయాలని ఆ రోజే అనుకున్నారు. అమెరికా జాబ్‌కు గుడ్‌బై చెప్పారు. జయంత్ జగదీష్ అనే మిత్రుడితోపాటు మరో ఐదుగురిని సమీకరించి ‘ఎల్సీస్ ఇంటెలిజెంట్ డివెసైస్ ప్రై వేట్ లిమిటెడ్ ’ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. రెండేళ్లు కష్టపడి ఈ సరికొత్త డివైస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి నెలలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో డివైస్ వెలను పదివేల రూపాయలుగా నిర్ణయించారు. ఏడాదికి వెయ్యి రూపాయల సర్వీసు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డివైస్‌ను భవిష్యత్తులో మరింత అభివద్ధి చేస్తామని, దీనితో అనుసంధానించడానికి ఓ కాల్ సెంటర్‌నే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రసాద్ పిళ్లై తెలిపారు. -
వింగ్‌తో ఉబ్బసానికి చెక్!
వాషింగ్టన్: చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిపై ఉబ్బసం వ్యాధి(ఆస్థమా) ప్రభావాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో మరింత ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవడం జరుగుతోంది. ఉబ్బసం వ్యాధి బారిన పడకుండా ముందుగానే వ్యాధి సంకేతాలను గుర్తించి హెచ్చరించడానికి అమెరికా శాస్త్రవేత్తలు 'వింగ్' అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. జేబులో ఇమిడేంత చిన్నదిగా ఉండే ఈ పరికరాన్ని స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానించి ఉపమోగించవచ్చు. అమెరికాకు చెందిన స్పారో లాబ్స్ దీనిని రూపొందించింది. వాతావరణంలో ఉబ్బసం వ్యాధి కారకాలను ముందుగానే పసిగట్టి ఫోన్‌కు సమాచారాన్ని అందించేలా వింగ్‌ను రూపొందిచారు. హెడ్‌ఫోన్‌ను అనుసంధానించే జాక్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసేలా దీనిని తయారు చేయడంతో వింగ్‌కు ప్రత్యేకంగా చార్జింగ్, బ్యాటరీల అవసంరం లేదు. వింగ్ ఉబ్బసంతో పాటు శ్వాసవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను ముందుగానే పసిగడుతుంది. క్రానిక్ పల్మొనరీ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి ప్రాణాంతక వ్యాధులను సైతం గుర్తించి ఫిజీషియన్కు సమాచారాన్ని చేరవేసేలా దీనిని తయారు చేశారు. ప్రస్తుతం వింగ్ 'అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' పరిశీలనలో ఉందనీ, త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పారో లాబ్స్ తెలిపింది. -
సెర్వికల్ కేన్సర్‌నుగుర్తించే పరికరం విడుదల
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐసీఎంఆర్ న్యూఢిల్లీ: మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెర్వికల్ కేన్సర్‌ను గుర్తించే పరికరాన్ని భారత్ సోమవారం విడుదల చేసింది. దేశంలో ఏటా సుమారు 74 వేల మంది మహిళలు సెర్వికల్ కేన్సర్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో మహిళలకు వరప్రసాదంలా ఉపయోగపడే ఈ పరికరాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. దీనిని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, మహిళల్లో సెర్వికల్ కేన్సర్ లక్షణాలను తొలిదశలోనే గుర్తించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని, తద్వారా పలువురి ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నోయిడాలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైటాలజీ అండ్ ప్రివెంటివ్ ఆంకాలజీ (ఐసీపీవో) రూపొందించిన ఈ పరికరం ఖరీదు రూ.10 వేలు మాత్రమే. ప్రస్తుతం సెర్వికల్ కేన్సర్‌ను గుర్తించే పరీక్షల కోసం దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఆ ఖర్చుతో పోలిస్తే ఇది నామమాత్రమేనని ఆజాద్ అన్నారు. ఈ పరికరం రూపకల్పన లో కృషిచేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. 8 నెల ల్లో మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.