
ఈరోజుల్లో, చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే యవ్వనంగా, అందంగా కనిపించడానికి ఆ వెంట్రుకలకు నలుపు లేదా ఇతర గాఢమైన రంగులను వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వారికి చిత్రంలోని ఈ పరికరం చక్కగా పని చేస్తుంది.
ఇది బ్యూటీ వరల్డ్‌లో ప్రత్యేకంగా రూపొందిన బాటిల్. జుత్తు ఒత్తుగా పెరగాలన్నా, వేసుకున్న రంగు తలంతటికీ పట్టాలన్నా ఈ బాటిల్ సాయం తీసుకోవాల్సిందే. ఈ బాటిల్‌లో నూనె లేదా హెయిర్ కలర్ నింపుకుని మూతకు అటాచ్ అయ్యి ఉన్న దువ్వెన పళ్లను తలకు ఆనించి దువ్వుకుంటే సరిపోతుంది. దాని వల్ల చేతులకు జిడ్డు లేదా రంగు అంటుకోదు.
ఈ బాటిల్ మూతకు దువ్వెన అటాచ్ అయ్యి ఉంటుంది. అయితే మూత కిందవైపు స్ప్రింగ్ ఉంటుంది. మూతపైన ఉన్న బటన్‌ని గట్టిగా ఒత్తితే, లోపల నుంచి కలర్ లేదా ఆయిల్ దువ్వెన పళ్లలోకి వచ్చి, వెంట్రుకలకు చక్కగా అప్లై అవుతుంది. ఈ బాటిల్‌ను నలుపు రంగు తోపాటు వివిధ రంగులకు వినియోగించవచ్చు.
ఈ బాటిల్‌ను, దానికి అమర్చుకోగల దువ్వెనను శుభ్రంగా కడిగి, ఆరబెట్టుకోవచ్చు. అయితే కలర్‌కి వినియోగించిన బాటిల్‌ను ఆయిల్‌కి వాడకపోవడం ఉత్తమం. దీని ధర సుమారు 24 డాలర్లు వరకు ఉంది. అంటే 2,029 రూపాయలన్నమాట. ఇలాంటి బాటిల్స్ పలు రకాలు, పలు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment