Side Effects Of Hair Dyeing: తెల్లబడిందని జుట్టుకు రంగు వేస్తున్నారా? క్యాన్సర్‌ రావొచ్చు! | Is Coloring Hair Safe What Will Be Side Effects | Sakshi
Sakshi News home page

Side Effects Of Hair Dyeing: తెల్లబడిందని జుట్టుకు రంగు వేస్తున్నారా? క్యాన్సర్‌ రావొచ్చు!

Published Thu, Dec 7 2023 5:16 PM | Last Updated on Tue, Dec 12 2023 10:57 AM

Is Coloring Hair Safe What Will Be Side Effects - Sakshi

ఇంతకుముందు వృద్దాప్యంలో తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చూస్తున్నాం. దీంతో దాన్ని కవర్‌ చేసేందుకు ఎడాపెడా ఎయిర్‌ డైని వాడేస్తున్నారు. మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్‌ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. మరి హెయిర్‌ డై ఎంత వరకు సురక్షితం?హెయిర్‌ డై తరచుగా వాడితే క్యాన్సర్‌ వస్తుందా అన్నది ఇప్పుడు చూద్దాం.

  • హెయిర్‌డైలో ఉండే కెమికల్స్‌ మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దీనివల్ల అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్‌) వస్తుంటాయి. ఇలా జరిగితే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
  • కొంతమంది హెయిర్‌ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం
  • లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

  • హెయిర్‌–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఆ తర్వాతే వేసుకోవాలి. అందుకోసం ముందుగానే చర్మంపై చిన్న మోతాదులో వేసుకొని పరీక్షించుకోవాలి.
  • కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే  రసాయనాల వల్ల కళ్లు మండటం, గొంతులో ఇబ్బంది, వరుసగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు రావొచ్చు. ఇది కొన్నిసార్లు ఆస్తమాకు దారితీయవచ్చు. 
  •  రంగు వేసుకునే టైంలో తప్పనిసరిగా గ్లౌవ్స్‌ ధరించాలి. హెయిర్‌ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దీనివల్ల వెంట్రుకలు రఫ్‌గా అవుతాయి. 

  • కొందరు హెయిర్‌ డైని తలకు మాత్రమే కాకుండా కనుబొమ్మలకు కూడా వాడుతుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. 
  • తరచుగా ఈ హెయిర్ డై వాడే వారికి కాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అందుకే ఇంట్లోనే సహజసిద్దమైన పద్దతిలో డై వేసుకోవడం మంచిది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement