hair dye
-
ఫ్యాషన్ With కాషన్
స్టైల్‌గా కనపడడం కోసం సిటిజన్లు దేనికైనా సై అంటున్నారు. కేశాలకు దట్టించే కలర్స్ నుంచి కాళ్లకు వేసుకునే ఫుట్‌వేర్ వరకూ తమదైన స్టైల్‌ని ప్రదర్శించాలని, అందుకోసం దేనికైనా రెడీ అంటున్నారు..ఈ ట్రెండ్ అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని కొనితెస్తోంది. ఫ్యాషన్ ప్రియుల్ని సిటీలో స్కిన్ స్పెషలిస్టులు, ఫిజియో థెరపిస్ట్‌లు... తదితర వైద్యులు, నిపుణుల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తోంది. ఏం చేస్తావో నాకు తెలీదు...నా లుక్ చూసి మా కంపెనీలో కొలీగ్స్‌కి మెంటలెక్కాలి....తన హెయిర్ స్టయిలిస్ట్ దగ్గర ఓ ఉద్యోగి ఆర్డర్ లాంటి అభ్యర్థన... వెళ్లేది పేజ్ త్రీ పారీ్టకి.. అక్కడ ఫ్యాషన్ షోని మించిన అవుట్‌ఫిట్స్‌తో వస్తారు.. అలాంటి చోట సమ్‌థింగ్ స్పెషల్‌గా కనపడాలి. దానికి నువ్వేం చెప్పినా నేను రెడీ...పర్సనల్ మేకప్ ఆరి్టస్ట్తో ఓ పేజ్ త్రీ సోషలైట్ అగ్రిమెంట్ లాంటి కమిట్ మెంట్... తలపై మండుతున్న సెన్సేషన్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న షీలా అనే గృహిణిని పరీక్షించిన వైద్యులు ఆమె గతంలో చేయించుకున్న హెయిర్ స్ట్రెయిట్నింగ్ ప్రక్రియే దీనికి కారణమని నిర్ధారించారు. ఆ ప్రక్రియలో భాగంగా ఉపయోగించిన క్రీమ్‌లో గ్లైక్సిలిక్ యాసిడ్ ఆమె చర్మంలో చేరుకుని అక్కడ నుంచి మూత్రాశయాన్ని సైతం దెబ్బతీసిందని తేల్చారు. అధికంగా హెయిర్ డై వాడితే అందులో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్, పీపీడీ తదితర హానికారకాల వల్ల జుట్టు ఊడిపోవడంతో మొదలుపెట్టి అస్తమా, బ్రెస్ట్ కేన్సర్ వంటిప్రాణాంతక వ్యాధులు సైతం రావచ్చని డెర్మటాలజిస్ట్ డా.గీతా ఒబెరాయ్ చెబుతున్నారు. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి అవయవాలపైనా, పురుషుల్లో వీర్యోత్పత్తిపైనా దుష్ప్రభావం పడవచ్చని, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి బ్రీతింగ్ సమస్యల వరకూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.ఈ తరహా వస్త్రధారణ వల్ల మెరాల్జియా పెరాస్తటికా అనే నరాల వ్యాధి వస్తుందని కెనడియన్ మెడికల్ ఆసోసియేషన్ జర్నల్ నిర్ధారించింది. అదే విధంగా జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రీలో ప్రచురితమైన అధ్యయనంలో టైట్ జీన్స్ వల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే సరిస్థితి, దీనితో శరీర కదలికల సమస్యలు రావచ్చని స్పష్టం చేసింది.లిప్‌స్టిక్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే డీహైడ్రేషన్ సహా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. లిప్‌స్టిక్‌లో వినియోగించే సర్వసాధారణ రసాయనం ట్రైక్లోజన్ వల్ల హృద్రోగ సమస్యలు రావచ్చని కాలిఫోరి్నయా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనం నిర్ధారించింది.హైహీల్స్ షూస్ వినియోగం.. మహిళల్లో బోన్ హెల్త్‌పై దుష్ప్రభావం చూపుతోందని, శాశ్వత బ్యాక్‌పెయిన్‌కి, ఆస్టియోపొరోసిస్కి కారణమవుతోంది. ముఖ్యంగా 20–45ఏళ్ల మధ్య వయస్కులపై నిర్వహించిన మ్యాక్స్ హెల్త్ కేర్ అధ్యయనం తేలి్చంది.యువి నెయిల్ పాలిష్ డ్రయ్యర్స్ వినియోగం వల్ల కేన్సర్ల ప్రమాదం పొంచి ఉందని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. నెయిల్ పాలిషితో పాటు షాంపూల్లోని కొన్ని రసాయనాలు 63 శాతం మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని ఎండోక్రైన్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం నిర్ధారించింది. హెయిర్ స్ప్రే, ఆఫ్టర్ షేవ్ లోషన్స్‌లో ఉండే హానికారకాలు చర్మం ద్వారా ప్రయాణించి కాలేయాన్ని, కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు చెడు చేస్తాయని స్పష్టం చేసింది.రంగుల టాటూ... రోగాల కాటు.. తప్పనిసరిగా స్పెషలిస్ట్ దగ్గరకు మాత్రమే టాటూస్ కోసం వెళ్లాలి. సరైన ఆరి్టస్ట్ కాకపోతే అతను రిపీటెడ్ నాన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ వాడితే... హెపటైటిస్ నుంచి ఎయిడ్స్ వరకూ అన్నిరకాల వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది. టాటూ వేయించుకునే ముందు మన చర్మ ఆరోగ్యం గురించి డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. టాటూస్ వేసుకున్నాక కనీసం రెండు వారాల పాటు పర్యవేక్షణ అవసరం.రంగు పడుద్దా? లేదా? హెయిర్ డై/కలర్స్, షాంపూలు, కండిషనర్లు... వంటివి ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు అన్నీ కెమికల్స్ మేళవించినవే. వీటి విచ్చలవిడి వినియోగం వల్ల తల ఉపరితల భాగంపై చర్మంతో పాటు విభిన్న రకాల కేన్సర్లకూ ఆస్కారం ఉందని డాక్టర్లు అంటున్నారు. ఈ కలర్స్‌లో అత్యధిక శాతం హానికారకాలేనని స్పష్టం చేస్తున్నారు. వీటిని వినియోగించే సమయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి... అలాగే లక్షల్లో ఖర్చుపెట్టి చేయించుకుంటున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్... వంటివి విజయవంతం కావాలంటే తప్పనిసరిగా పూర్తి స్థాయి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. లేదంటే కొత్త సమస్యలు తప్పవు. బ్యాండ్ బాజా... మెమొరీ లేజా... ఇప్పుడు హెడ్ బ్యాండ్స్ వాడకం భారీగానే పెరిగింది. తల వెంట్రుకలను బాగా టైట్‌గా కట్టేయడం హెయిర్‌ఫాల్‌కి దారి తీస్తుంది. అంతేకాదు మెమొరీ ప్రాబ్లెమ్స్ కూడా రావచ్చని పలువురు నిపుణులు చెబుతున్న మాట. బొట్టు.. జాగ్రత్తగా పెట్టు... నుదుటన బొట్టు.. స్టిక్కర్లలోకి మారిపోయి చాలా కాలమైంది. అయితే వీటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని రకాల స్టిక్కర్స్‌తో పాటు సింధూర్స్ కూడా అలర్జీలను కలిగిస్తాయి. వీలైనంత వరకూ న్యాచురల్, ఆర్గానిక్‌వి వాడడం మంచిది.పియర్సింగ్.. సమ్‌థింగ్ రాంగ్...కాదేదీ కుట్టుకోవడానికి అనర్హం అన్నట్టు ఇటీవలో శరీరంలోని అనేక చోట్ల బాడీ పియర్సింగ్‌ను ఇష్టపడుతున్నారు. చెవిపోగుల నుంచి మొదలై ఇప్పుడు వంటి మీద ఎక్కడ పడితే అక్కడ రకరకాల పరికరాలను అతికించుకుంటున్నారు. ఆఖరికి నాలుక మీద కూడా రింగుల్ని గుచ్చుకుంటున్నారు. అయితే ఈ పిచ్చి ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఒకటికి మించి చెవి చుట్టూ కుట్టించుకోవడం. ముఖ్యంగా నాలుక, పెదవి, నాభి వంటి ప్రాంతాల్లోనూ పియర్సింగ్ చేయించుకోవడం, అవేమో ఇమిటేషన్ జ్యుయలరీ కావడం వల్ల స్కిన్ అలెర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలోని సున్నితమైన భాగాలపై జ్యుయలరీ యాడ్ చేయడం వల్ల వాటి పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి తీవ్రమైన ఫ్యాషన్స్ అనుసరించడం అంటే ఒక సైకలాజికల్ సమస్యగా గుర్తించాలని చెబుతున్నారు. దీన్ని అదుపు చేయకపోతే ఇది ట్రాక్షన్ అలోపేసియాకి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మితిమీరితే అనర్ధాలే... దాదాపు అన్ని హెయిర్ డైలలో ఉండే పీపీడీ చాలా హానికరం.. దీర్ఘకాలం పాటు వినియోగిస్తే జుట్టు రాలడంతో మొదలై కేన్సర్ల వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. కొంత మందికి దీని రియాక్షన్ వెంటనే తెలుస్తుంది. మరికొంత మందికి చాలా కాలం తర్వాతే బయటపడతాయి. దీనికి బదులు గోరింటాకు, హెన్నా వంటివాటితో ప్యూర్ బ్లాక్ కాకపోయినా, బ్రౌన్ కలర్ వచ్చేలా చేయవచ్చు. హెయిర్ స్ట్రయిటనింగ్ ఇప్పుడు బాగా చేయించుకుంటున్నారు. సాఫ్ట్‌నెస్ కోసం నప్పని రసాయనాలు ఉపయోగిస్తారు. కొన్ని క్రీమ్స్... వల్ల తెల్లగా అయ్యాం అనుకుంటారు గానీ... అవి చర్మం తాలూకు పొరల్ని దెబ్బతీస్తాయి. హానికారక బాక్టీరియాను నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తాయి. మేకప్ వల్ల చర్మం పొడిబారిపోయే చాన్స్ ఉంది. క్లెన్సర్‌తో శుభ్రపరచకపోతే ఆయిల్ బయటకు పోక కురుపులు తయారవుతాయి. పియర్సింగ్ సున్నితమైన అవయవాలపైన చేయించుకోకూడదు. అలాగే టాటూ ఆరి్టస్ట్స్తో చేయించుకుంటే ఇన్ఫెక్షన్లకు అవకాశాలు ఉంటాయి. –డా.డబ్లు్య.జాన్, డెర్మటాలజిస్ట్మేకప్... ఆరోగ్యానికి పేకప్...నిమిషాల్లో వర్ఛస్సును మెరిపించేస్తామని ప్రకటించే మేకప్ ఉత్పత్తుల్లో పరిమితికి మించిన రసాయనాలు వాడుతున్నారంటూ ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులను సీజ్ చేయడం దీనికి ఓ ఉదాహరణ.ఫ్యాబ్రిక్... నప్పకపోతే..తిప్పలే...రకరకాల ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన డ్రెస్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఫ్యాషన్‌లో ముందుండాలని పోటీపడుతున్న యువత అదీ.. ఇదీ.. అని తేడా లేకుండా ఏది కొత్తగా వస్తే దాన్ని వాడేస్తోంది.లిప్స్కి లాస్..ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమైంది. లిప్‌స్టిక్ పేరుతో అధరాలను మెరిపించేందుకు ప్రయతి్నంచే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కెమికల్స్ లేకుండా ఏ లిప్‌స్టిక్ తయారయ్యే ప్రసక్తే లేదు కాబట్టి వీటిని తప్పనిసరైతే తప్ప వాడకూడదంటున్నారు. దీని బదులు కొత్తిమీర ఆకులతో, బీట్రూట్ వంటివి ఉపయోగించి పెదాల్ని ఎర్రగా మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.డ్రెస్ టూ డ్రగ్స్.. మానసిక ఒత్తిడి తప్పదు...ప్రత్యేక గుర్తింపు కోరుకోవడం అది కూడా ఫ్యాషన్‌ను ఫాలో అవడం ద్వారా అనేది తొలి దశలో బాగానే ఉన్నా రానురానూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. అలాగే అప్ టు డేట్‌గా కనపడాలనే ఆతృత చదువు, వృత్తి, ఉద్యోగాలు వంటి ఇతర ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరించనివ్వదు. అలాగే ఆరోగ్యకరమైన ఫ్యాషన్లను దాటిపోయి అనారోగ్యకరమైన అలవాట్లకు ఇది దారి తీస్తుంది. ఆర్థిక పరమైన సమస్యలు కూడా తోడవుతాయి.. కాబట్టి ఫ్యాషన్ ప్రియత్వం అనేది నియంత్రణలో ఉండేలా చూసుకోవడం అత్యవసరం. లేకపోతే ఇది డ్రెస్సులతో మొదలై డ్రగ్స్ దాకా చేర్చినా ఆశ్చర్యం లేదు. ఈ ఫ్యాషన్ల పిచ్చిలో ఉన్న యువతను ఇతర ఆరోగ్యకరమైన వ్యాపకాలకు అంటే ఆటల వంటి అభిరుచుల వైపు మళ్లించడం మంచిది. – డా.జె మయూర్‌నాథ్‌రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, సైక్రియాట్రిస్ట్ -
ఇంట్లోనే ఈజీగా నేచురల్ హెయిర్ డై చేసుకోండిలా..!
ప్రస్తుత రోజుల్లో తెల్లజుట్టు అనేది కామన్ అయ్యిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అంతేగాదు ఎవరూ పెద్దవాళ్లో, చిన్నవాళ్లో చెప్పడం కూడా కష్టంగా ఉంది. అలా అయిపోయింది మన జీవనశైలి. దీనికి తోడు బయట ఉండే కాలుష్యం కారణంగా మెరిసిపోవడం తోపాటు ఊడిపోతుంది. అందుకోసం బయట మార్కెట్లో కనిపించే హెయిర్ డైల పై ఆధారపడుతుంటాం. అవేమో నానా రకాల సైడ్ ఎఫ్‌క్ట్ ఇచ్చి మరో సమస్య ఎదురవ్వుతుంది. ఆ సమస్యలన్నింటికి చెక్‌పెట్టి ఇంట్లోనే చక్కగా సహజ పద్ధతిలో డై చేసుకుంటే అంతకుమించి హాయి ఇంకొకటి ఉండదు. అయితే ఇదెలా చేయాలి. అందుకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి అని కంగారు పడొద్దు. అవన్నీ మనఇంట్లో దొరికేవే. మన నిత్యం చూసే వాటితోనే సులభంగా చేయ్యొచ్చు. అవేంటో చూద్ధాం. ! ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గానే ఇంట్లోనే డైని చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా ఉల్లి తొక్క. ఉల్లి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని రానియ్యకుండా చేస్తుంది. ఇందులోని సల్ఫర్ జుట్టు పెరుగుదలకి మంచిది. ఉల్లితొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అలోవెరా జెల్‌లోనూ విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి, జుట్టు, చర్మానికి చాలా మంచిది. తెల్ల జుట్టుని దూరం చేసి జుట్టు మెరిసేలా, సాఫ్ట్‌గా చేస్తుంది. అంతే కాదు, జుట్టు మూలాలకు సహజ తేమని అందించడంలో అలోవెరా జెల్ ముందుంటుంది. ఎలా చేయాలంటే.. ఈ నేచురల్ డైకి ముఖ్యంగా కావాల్సింది ఉల్లితొక్క. ఫంగస్ లేని ఉల్లి తొక్కుని తీసుకుని ఓ పాన్వేసి బాగా వేయించండి. మొత్తం నల్లగా మారాలి. దీనిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇందులోని కలబంద జెల్ వేసి బాగా కలపండి. దీనిని జుట్టుకి రాయండి. ఇది మొత్తం నేచురల్ పద్ధతిలో తయారైన హెయిర్ డై. దీనిని వారానికి ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తలకి మొత్తంగా రాసి గంట తర్వాత క్లీన్ చేయాలి. ఇది జుట్టుని నల్లగా చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి మరీ..! (చదవండి: పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా? అతిగా తింటే సమస్యలు తప్పవు!) -
హెయిర్ డైగా 'ఉజాలా'.. కట్ చేస్తే హెయిర్ ఎలా ఉందంటే..!
యువత వింత వింత వేషధారణలు, విచిత్రమైన స్టయిల్స్‌ని పరిచయం చేస్తున్నారు. అందులో కొన్ని సౌలభ్యంగా ఉన్న మరికొన్ని బాబాయ్! ఏంటిదీ అనేలా ఉంటున్నాయి. అలాంటి వెరైటీ ప్రయోగమే చేశాడు ఓ హెయిర్ స్టైలిస్ట్. రాహుల్ కల్శెట్టి అనే హెయిర్‌స్టైలిస్ట్ తన కస్టమర్‌కి ఉన్న బ్లీచ్డ్ హెయిర్‌కి ఉజాలను హెయిర్ డైగా ఉపయోగించాడు. కొద్దిసేపటి తర్వాత నలుపు తెలుపు మిక్స్ అయ్యి ఓ అందమైన లుక్ వచ్చింది. చూడటానికి బాగుంది కూడా. ఇక హెయిర్ స్టైయిలిస్ట్ ఇలా ఉజాలతో హెయిర్ డై వేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఒక్కసారి ఇలా చేసి చూడమని డిమాండ్ చేశారని, అందువల్ల తాను ఈ ధైర్యం చేశానని చెప్పాడు. అంతేగాదు అందుకు సంబంధించని వీడియోని కూడా సదరు స్టైయిలిస్ట్ నెట్టింట షేర్ చేశాడు కూడా. View this post on Instagram A post shared by Rahul Kalshetty (@haireducation_rahul) అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి.. ఉజాలాకి ఇక డిమాండ్ పెరిపోతుందేమో అని ఒకరూ, తదుపరి హార్పిక్ ట్రై చెయ్యండిని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా తెల్లబట్లలు కాంతివంతంగా కనిపించేందుకు ఉపయోగించే ఉజాల హెయిర్ డైగా వినియోగిస్తే అనే ఆలోచనే వెరైటీ. పైగా ట్రే చేసి ఇది కొత్త ట్రెండ్ అని చూపించడం మరింత విశేషం. View this post on Instagram A post shared by Rahul Kalshetty (@haireducation_rahul) (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..) -
Side Effects Of Hair Dyeing: తెల్లబడిందని జుట్టుకు రంగు వేస్తున్నారా? క్యాన్సర్ రావొచ్చు!
ఇంతకుముందు వృద్దాప్యంలో తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం చూస్తున్నాం. దీంతో దాన్ని కవర్ చేసేందుకు ఎడాపెడా ఎయిర్ డైని వాడేస్తున్నారు. మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. మరి హెయిర్ డై ఎంత వరకు సురక్షితం?హెయిర్ డై తరచుగా వాడితే క్యాన్సర్ వస్తుందా అన్నది ఇప్పుడు చూద్దాం. హెయిర్‌డైలో ఉండే కెమికల్స్ మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దీనివల్ల అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్) వస్తుంటాయి. ఇలా జరిగితే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఆ తర్వాతే వేసుకోవాలి. అందుకోసం ముందుగానే చర్మంపై చిన్న మోతాదులో వేసుకొని పరీక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాల వల్ల కళ్లు మండటం, గొంతులో ఇబ్బంది, వరుసగా తుమ్ములు రావడం వంటి ఇబ్బందులు రావొచ్చు. ఇది కొన్నిసార్లు ఆస్తమాకు దారితీయవచ్చు. రంగు వేసుకునే టైంలో తప్పనిసరిగా గ్లౌవ్స్ ధరించాలి. హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దీనివల్ల వెంట్రుకలు రఫ్‌గా అవుతాయి. కొందరు హెయిర్ డైని తలకు మాత్రమే కాకుండా కనుబొమ్మలకు కూడా వాడుతుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. తరచుగా ఈ హెయిర్ డై వాడే వారికి కాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అందుకే ఇంట్లోనే సహజసిద్దమైన పద్దతిలో డై వేసుకోవడం మంచిది. -
హెయిర్–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!
ఒక వయసు దాటాక తెల్లబడ్డ వెంట్రుకలకు రంగువేయడం చూస్తుంటాం. ఇక యువతులూ, కొందరు మహిళలు కూడా స్ట్రెయిటెన్, బ్లీచింగ్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రక్రియల్లో జుట్టు (హెయిర్ స్ట్రాండ్స్) దెబ్బ తినకుండా సంరక్షించుకోడానికి చేయాల్సిన పనులివి... మాటిమాటికీ దువ్వడం, దువ్వుతున్నప్పుడు చిక్కులున్నచోట మృదువుగా కాకుండా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి. ఇలా దెబ్బతిన్నప్పుడు వెంట్రుక సాఫీగా లేకుండా కొన్నిచోట్ల ఉబ్బుగానూ, మరోచోట పలచగానూ కనిపించవచ్చు. ఇలా కనిపించే వెంట్రుకల్ని ‘బబుల్‌డ్ హెయిర్’ అంటారు. కాబట్టి వెంట్రుకలపై బలం ఉపయోగించకుండా, మృదువుగా దువ్వేలా జాగ్రత్త వహించాలి షాంపూ వాడే సమయంలో దాన్ని నేరుగా వాడకుండా... అరచేతిలో వేసుకుని, కొన్ని నీళ్లు కలిపి, దాని సాంద్రతను కాస్త తగ్గించాలి. దీంతో వెంట్రుకల మీద షాంపూలోని రసాయనాల తాకిడి, ప్రభావం తగ్గుతాయి తలస్నానం తర్వాత డ్రైయర్ వాడేటప్పుడు వెంట్రుకలకు వేడి గాలి మరీ నేరుగా తగలకుండా జాగ్రత్త వహించాలి రంగువేయడం, బ్లీచింగ్‌లతో జుట్టు రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంది. దాంతో వెంట్రుక పైపొర అయిన ‘క్యూటికిల్’ దెబ్బతినే అవకాశముంది. క్యూటికిల్ దెబ్బతినగానే కాస్త లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటపడుతుంది. ఇది క్యూటికిల్లా నునుపుగా కాకుండా కాస్తంత గరుకుగా ఉంటుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది. అందుకే రంగువేసే సమయంలో నాణ్యమైన హెయిర్–డై వాడుకోవాలి. ఒకసారి తమకు సరిపడుతుందా లేదా అన్నదీ చూసుకోవాలి. (చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్! లాభాలేమిటంటే?) -
పెంపుడు కుక్కకు హెయిర్ డై, లక్షలు ఖర్చు చేసిన మోడల్
సోషల్ మీడియాను సెలబ్రెటీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేసుకుంటుంటారు. అందుకే నెటిజన్లు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలకు కెటాయిస్తారు. వారి ప్రతి అడుగును గమనిస్తూ వారిని నిత్యం ఫాలో అవుతుంటారు. అలా వారు పెట్టిన పోస్టులను వైరల్ చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు.. అదే పోస్టులు బెడిసికొట్టితే మాత్రం ట్రోల్స్ చేస్తూ ఆడేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చెదు అనుభవాలను సెలబ్రెటీలు చాలానే ఎందుర్కొంటున్నారు. చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు! తాజాగా రష్యన్ మోడల్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్ మోడల్ అన్నా స్టూపక్. అయితే సెలబ్రెటీలకు ఎక్కువగా పెట్స్‌ని ఇష్టపడతారనేది తెలిసిన విషయమే. వాటికి కాస్తా సమయం ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఖాళీ సమయంలో వాటితో ఆడుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడికి వెళ్లిన పెట్స్‌ని తమ వెంట తీసుకేళ్తారు. వాటిపై ప్రత్యేకంగా శ్రద్ధా పెడుతుంటారు. చెప్పాంటే సొంత మనిషిలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఓ మోడల్ తన పెంపుడు కుక్కపై ఇంకాస్తా ఎక్కువ శ్రద్ద పెట్టింది. చదవండి: ముంబై వెళ్లి సల్మాన్‌ను ప్రత్యేకంగా కలిసిన జక్కన్న, అందుకేనా? అదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పంచుకుంది. అది కాస్తా బెడిసి కొట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మీకు తెలిసిందే. నెటిజన్లకు కోపం వస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును ఎప్పటి లాగే ఆమెను సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. ఇంతకి నెటిజన్లకు కోపం తెప్పించిన విషయకం ఏంటంటే కాస్తా కుక్క హేర్‌కు డై చేయించింది. నియాన్ ఆరెంజ్‌తో పూర్తిగా కుక్కకు కలర్ డై చేయించిందట. దీని కోసం ఆమె ఏకంగా రూ. 5వేల యూరోలు(భారత కరెన్సీలో 5 లక్షల రూపాయలు). ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెపై మండిపుడుతున్నారు. మీ సరద కోసం మూగ జీవిని హింసించడం ఏంటంటూ తమదైన శైలిలో ఆమెను తిట్టిపోస్తున్నారు. దీంతో అన్నా స్టూపక్ వార్తల్లోకి ఎక్కింది. View this post on Instagram A post shared by Anna Stupak (@anna3.0.5) -
డై కానివ్వకండి
తెల్ల వెంట్రుకలను నల్లబరచడానికి వాడే రకరకాల రసాయనాల హెయిర్ డైలతో ఒక ఇబ్బంది ఉంది. అవి మాడుపైన సహజమైన నూనెలను తొలగించి, తెల్లవెంట్రుకల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు, వెంట్రుకల కుదుళ్లునూ బలహీనపరుస్తాయి. దీనివల్ల వెంట్రుకలు రాలడం, బలహీనపడటం జరుగుతుంది. అలా కాకుండా.. డై వాడుతున్నప్పటికీ.. జుట్టుకు పూర్వపుకాంతి పోకుండా ఉండాలన్నా, రసాయనాల రంగుల వల్ల వెంట్రుకలు దెబ్బతినకుండా ఉండాలన్నా తరచు కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. ఆముదం – కొబ్బరి నూనె టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న ఈ నూనెను వేళ్లతో అద్దుకుంటూ జుట్టుకుదుళ్లకు పట్టేలా మృదువుగా మర్దన చేయాలి. ఇలా తలంతా పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేయాలి. రసాయనాలు గాఢత లేని షాంపూల వాడకం మేలు. మందార పువ్వు – ఉసిరి పొడి జుట్టుకు ప్రకృతిసిద్ధమైన మాస్క్. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలమవుతాయి. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడే సమస్య దరిచేరదు. చుండ్రు సమస్య ఉండదు. 2–3 మందార పువ్వులను 2 టేబుల్ స్పూన్ల ఉసిరిపొడి కలిపి మెత్తగా నూరాలి. మిశ్రమం చిక్కగా తయారవ్వడానికి పెరుగు లేదా కొద్దిగా నీళ్లు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన కండిషనర్‌లా పనిచేస్తుంది. హెన్నా లేదా గోరింటాకు పొడి చాలా మంది తెలుపు, నలుపులుగా ఉండే జుట్టుకు హెన్నా (గోరింటాకు పొడి)ను మొట్టమొదటి ఎంపికగా వాడుతుంటారు. ముఖ్యంగా హెయిర్ కలర్స్‌లో రసాయనాలు ఉండి జుట్టు ఊడిపోతుందనే భయం వల్ల కూడా చాలా మంది హెన్నా వాడుతుంటారు. తెల్లవెంట్రుకలకు సరైన చికిత్స ఇవ్వాలంటే.. 5–6 టేబుల్ సూన్ల హెన్నా పౌడర్ని తగినన్ని నీళ్లలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 3–4 గంటల సేపు ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. -
హెయిర్‌డై వేసుకోవద్దన్నందుకు..
చిలకలగూడ : హెయిర్ డై వేసుకోవద్దన్నందుకు మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ ఖాజీపేటకు చెందిన ఎస్కే సమీన (28) ఒమర్ భార్యభర్తలు. వీరికి నలుగురు కుమారులు. ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చి చిలకలగూడ చింతబావిలో ఉంటున్నారు. జుత్తులో తెల్లవెంట్రుకలు కనిపించడంతో సమీర ఈనెల 8న హెయిర్‌డై వేసుకుంది. దీనిని గుర్తించిన ఒమర్ అమెను నిలదీయడంతో పాటు అనుమానం వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన సమీన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో సమీన గాంధీ ఆస్పత్రి బరŠన్స్వార్డులో చికిత్స పొందుతోంది. బాధితురాలలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హెయిర్–డై వాడుతున్నారా?
నా వయసు 34 ఏళ్లు. నా జుట్టు ఇప్పుడిప్పుడే తెల్లబడుతోంది. అయితే ఇప్పటివరకు నేను జుట్టుకు రంగు వేయలేదు. ఇకపై హెయిర్–డై వాడదామని అనుకుంటున్నాను. దాని విషయంలో నా ఎంపిక ఎలా ఉండాలి? హెయిర్–డైతో ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? దయచేసి నాకు హెయిర్–డై వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విపులంగా చెప్పండి. చాలామంది హెయిర్–డై లను చాలారకాల ప్రయోజనాల కోసం వాడుతుంటారు. హెయిర్–డై విషయంలో మీ ఎంపిక అన్నది అసలు మీరు హెయిర్ డైని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అంటే... కొందరు జుట్టు తెల్లబడ్డందున దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటారు. అయితే మరికొందరు జుట్టు నల్లగా ఉన్నప్పటికీ దాన్ని ఫ్యాషనబుల్‌గా గ్రూమ్ చేసుకోవడం కోసం రంగు వేసుకుంటుంటారు. ఉదాహరణకు కొందరు జుట్టు చివర్లు ఎర్రగా మార్చుకునేందుకు, మరికొందరు కొన్ని పాయలు ఎట్రాక్టివ్‌గా కనిపించేందుకు రకరకాల షేడ్స్‌లో హెయిర్–డైని వాడుతుంటారు. మీరు ఏ ప్రయోజనం కోసం హెయిర్–డై వాడుతున్నప్పటికీ మీ బడ్జెట్లోనే కాస్తంత నాణ్యమైనది ఎంచుకోవడం మంచిది. హెయిర్ డైతో వచ్చే సాధారణ ప్రమాదాలివే... ►హెయిర్ డైలో ఉండే రసాయనాలలో కొన్ని కెమికల్స్ మీకు, మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దాని వల్ల కొందరిలో అలర్జీ రావచ్చు. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం మీద వాపు రావడం వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగితే వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్/డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి ►కొన్ని సందర్భాల్లో హెయిర్‌డైలో ఉండే రసాయనాలు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం వంటి ఇబ్బందులు కలగజేస్తాయి. ఇవి కొందరిలో శ్వాస తీసుకోవడంలోనూ తీవ్రమైన అవరోధాలకు దారితీస్తాయి. ఒక్కోసారి ఆస్తమాకూ దారితీయవచ్చు. చాలాసార్లు సురక్షితంగా వాడిన రసాయానాలే, చాలా ఏళ్లు గడిచాక కూడా మీకు ప్రమాదకరంగా, అలర్జిక్‌గా పరిణమించవచ్చు. అందుకే రంగు వేసుకునే ప్రతిసారీ అదే మొదటిసారి అయినట్లుగా జాగ్రత్తగా ఉండాలి ►అయితే మొదటిసారి హెయిర్–డై వాడేవారు అది మనకు సరిపడుతుందా లేదా అన్నది పరీక్షించుకొని, ఒకవేళ నిర్దిష్టంగా ఆ బ్రాండ్ హెయిర్–డైతో మీకు ఏవైనా అలర్జిక్ లక్షణాలు కనిపిస్తుంటే దానికి దూరంగా ఉండటం మేలు. హెయిర్–డై వేసుకునే పద్ధతి ఇలా... ►ఒక గిన్నెలో మీరు వేసుకోబోయే హెయిర్–డైని కలుపుకుని సిద్ధం చేసుకోండి. దాన్ని మీకు అనువైన బ్రష్‌తో హెయిర్ డైలో ముంచుతూ... కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఆ రసాయనాలు ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెయిర్–డై వేసుకునే సమయంలో కంటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ►హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. ఒక రసాయన చర్య జరిపి జుట్టును నల్లబారుస్తాయి. ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా విరిగిపోయేలా (బ్రిటిల్గా) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది ►కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ, కాలీ మెహందీలోనూ పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్– ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. బ్లాక్ హెన్నా కూడా అంత సురక్షితం కాదు. వీటిలో ఉండే రసాయనాల వల్లనే రియాక్షన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఒకింత సురక్షితమైన మెడికేటెడ్ హెయిర్ డైస్ దొరుకుతున్నాయి. మీ డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వాటిని మీరు సురక్షితంగా వాడుకోవచ్చు ►కొంతమంది హెయిర్ డై ప్యాక్‌మీద అమోనియా ఫ్రీ అనే మాట చూసి అది సురక్షితమని వాడుకుంటుంటారు. కానీ అందులో కూడా పీపీడీ అనే రసాయనం లేనిదే వాడాలి. ఎందుకంటే అమోనియా ఫ్రీ అని ఉన్నప్పటికీ ఈ పీపీడీ కూడా అమోనియా నుంచి వచ్చే రసాయనమే కాబట్టి అమోనియా ఫ్రీ అనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ►మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? అయితే మొదటిసారి మీరే ఇంటి దగ్గర వేసుకోకండి. ఒకటి రెండుసార్లు మంచి పార్లర్లో ప్రొఫెషనల్స్ సహాయంతో రంగు వేసుకోండి. వారెలా వేస్తున్నారో గమనించి, ఆ తర్వాత మీరు ఆ టెక్నిక్స్‌ను అనుసరించండి ►తొలిసారి రంగు వేసుకునే వారు నేరుగా దాన్ని తలకు పట్టించుకోవడానికి బదులు ముందుగా చెవి వెనక ఉండే ఒక పాయకు రంగు వేసి, కాసేపు ఉంచి, దాన్ని కడుక్కోవాలి. ఆ తర్వాత 48 గంటల పాటు పరిశీలించి చూసుకోవాలి. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ ఎఫెక్ట్స్) కనిపించపోతే... ఇక ఆ రంగును నిరభ్యంతరంగా వాడవచ్చు. ఒకవేళ ఏదైనా సైడ్ఎఫెక్ట్ కనిపిస్తే ఆ బ్రాండ్‌ను వదిలేసి, మరో బ్రాండ్ ఎంచుకోండి ►మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి. కొత్త బ్రాండ్ వాడదలచుకున్నప్పుడు మళ్లీ చెవి వెనక ఉన్న వెంట్రుకలలో ఒక పాయకు రంగు వేసి మళ్లీ మరో 48 గంటలు వేచిచూసి, సురక్షితమని తేలాకే బ్రాండ్ మార్చండి ►మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాల చర్మంపైన ముందుగా పెట్రోలియం జెల్లీని పూయండి ►రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ►రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒక్కచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ►రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ►వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ►మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి ►రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ►రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ►హెయిర్‌డై కేవలం తలకు మాత్రమే వాడండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ►మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ►ఒకవేళ మహిళలు గర్భం ధరించి ఉంటే... తాము గర్భవతిగా ఉన్న సమయంలో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది ►హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపిస్తాం. అలా కనిపించడం మనందరం కోరుకునేదే. అయితే ఆ చర్య వల్ల మనకు హాని జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. రంగు వేసుకునే సమయంలో మీ గోళ్లు జాగ్రత్త... జుట్టుకు రంగు వేసుకునే సమయంలో మీరు సరైన జాగ్రత్త తీసుకోకపోతే... హెయిర్ డై గోళ్లకు అంటుకునే ప్రమాదం ఉంది. అది ఏ మాత్రం గోరుకు అంటుకున్నా పర్మనెంట్‌గా ఉండిపోతుంది. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గోరు పెరుగుతున్న కొద్దీ, పెరిగిన గోరును మనం కట్ చేసుకున్న కొద్దీ మూడు నెలల్లో గోరు రంగు పూర్తిగా తొలగిపోతుంది. మన గోరూ, జుట్టూ ఈ రెండూ కూడా కెరొటిన్ అనే పదార్థంతో తయారవుతాయి. కాబట్టి జుట్టుకు అంటుకున్న రంగు ఎప్పటికీ ఉన్నట్లే గోరుకూ ఉంటుంది. కింది నుంచి పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్రెష్ గోరుగానీ, జుట్టుగానీ తెల్లగా వస్తుంది. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
‘నా తల బెలూన్లా ఉబ్బిపోయింది’
పారిస్ : బ్యూటి ఉత్పత్తులు వాడే ముందు వాటి మీద ఒక హెచ్చరిక తప్పక కనిపిస్తుంది. ‘ఈ ఉత్పత్తులను వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ (డైరెక్ట్‌గా వాడకుండా.. చేతి మీద లేదా చెవి వెనక వైపున రాసి చూడండి) చేయండి. 24 గంటల్లోపు ఏలాంటి చెడు ప్రభావం లేకపోతే అప్పుడు పూర్తిగా వాడండి’ అని ఉంటుంది. ఎందుకంటే సదరు ఉత్పత్తుల్లో వాడిన రసాయనాలు మన శరీరానికి సరిపోకపోతే దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది కాబట్టి. కానీ ఈ ప్యాచ్ టెస్ట్ ఓ మహిళ పాలిట శాపంగా మారింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా తలకు రంగేద్దామనుకుని హెయిర్ డైని ప్రయత్నిస్తే.. ఏకంగా తల ఆకారమే మారిపోయింది. వివరాలు.. పారిస్‌కు చెందిన ఓ పంతొమ్మిదేల్ల పడుచు తలకు కలర్ చేసుకుందామని సూపర్ మార్కెట్ నుంచి ఓ ప్రముఖ హెయిర్ డైని తీసుకొచ్చింది. ప్యాకెట్ మీద సూచించిన విధంగా ప్యాచ్ టెస్ట్ చేయడం కోసం కొద్దిగా రంగును తల మీద అప్లై చేసింది. కొద్ది సేపటికే తలలో విపరీతమైన దురద రావడంతో డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని మందులు, ఓ క్రీమ్ ఇచ్చారు. వాటిని వాడింది. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి సదరు యువతి తల అనూహ్యమైన రీతిలో ఉబ్బి పోయి కనిపించింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాక నాలుక కూడా ఉబ్బటంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు ఆమెని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె వాడిన హెయిర్ డైలో పారాఫినైలినిడయమినే(పీపీడీ) అనే రసాయనం ఎక్కువగా ఉందని తేల్చారు. ఈ రసాయనం వల్ల 56 సెంటీమీటర్లు ఉన్న యువతి తల ఏకంగా 63 సెంటీమీటర్లకు పెరిగింది. దీని గురించి సదరు యువతి ‘పొద్దున లేచే సరికే నా తల సైజు పెరిగి.. ఒక లైట్ బల్బ్‌గా మారింది’ అని తెలిపింది. యువతిని ఓ రోజంతా అబ్జర్వేన్లలో ఉంచిన డాక్టర్లు చివరకు ఆమె తలను పూర్వ స్థితికి తీసుకువచ్చారు. ముఖ్యండా హెయిర్ డైలో ఉండే ఈ పీపీడి రసాయనం వల్ల మూత్రపిండాలు పని చేయకపోవడం.. కండరాలు దెబ్బతినడం వంటి దుష్పరిణామాలు కల్గుతాయంటున్నారు వైద్యులు. అందంగా తయారు కావడం కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. కాబట్టి మనం వాడే ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. -
కేటీఆర్ కు ఊహించని ప్రశ్న!
హైదరాబాద్: సామాజిక మాధ్యమం ట్విటర్ లో చురుగ్గావుండే తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)కు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. నెరసిన జుట్టుకు రంగు వేసుకోవాలని అభిమాని ఆసక్తికర సూచన చేశాడు. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రెండు రోజుల క్రితం పాతబస్తీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మొగల్ పురాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. కాసేపు సరదాగా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడారు. ఈ ఫొటోలను తన ట్విటర్ పోస్ట్ చేశారు. కేటీఆర్ క్రికెట్ ఆడుతున్న ఫొటోపై ఎంఎన్ ప్రపుల్లకుమార్ అనే యువకుడు ఆసక్తికర కామెంట్ చేశారు. 'ఈ మధ్యకాలంలో నెరసిన జుట్టుతో కనిపిస్తున్నారు. మీరు యూత్ లీడర్, మంత్రుల్లో మీరే పిన్నవయస్కులు కాబట్టి జుట్టుకు హెయిర్ డై వేసుకోవాల'ని సూచించాడు. దీనికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. తాను మరీ కుర్రాడిని కాదని పేర్కొన్నారు. Not so young anymore I guess @KTRTRS Sir, Please use dye to your hair you look old now a days, you are youth leader and youngest among ministers wright😊😊😊 pic.twitter.com/Eizlduoo8i — M N Prapullakumar (@nagaprapulla) April 20, 2017 -
తలరంగు జాగ్రత్తలు : హెయిర్ డై... హౌ అండ్ వై!
యౌవనం చాలాకాలం పాలు అలా నిలిచి ఉండేలా చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి. ఇవన్నీ దీర్ఘకాలం తర్వాత యౌవనాన్ని ఇచ్చి... దాన్ని అలా కొనసాగిస్తాయేమోగానీ... జుట్టుకు రంగేయడం అనే ఒక ప్రక్రియ తర్వాత యౌవనం షార్ట్‌కట్ లో మనకు దక్కేస్తుంది. షార్ట్‌కట్ కాబట్టి కొన్ని ప్రమాదాలూ ఉంటాయి కాబట్టి వాటిని నివారించడం ఎలాగో తెలుసుకుందాం. ఒకప్పుడు జుట్టుకు రంగేసుకోవడం ఏ నలభై ఐదూ, యాభై ఏళ్లు దాటినవారో చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. త్వరగా జుట్టు నెరిసిపోవడంతో చిన్న వయసులోనే రంగు వేసుకోవాల్సిన పరిస్థితి కొందరిది. మరికొందరిదేమో మంచి లుక్స్ కోసం, మాడ్రన్‌గా కనిపించడం కోసమూ జుట్టుకు రంగేసుకోవడంపరిపాటి అయిపోయింది. మీకు అనువైన హెయిర్‌డై ఏదో ఎంపిక చేసుకోవడం ఎలా? ⇒ ఈ ఎంపిక అన్నది మీరు ఎందుకు హెయిర్ డై ఉపయోగిస్తున్నారన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ జుట్టు తెల్లబడినందువల్ల దాన్ని నల్లగా కనిపించేలా చేసుకోవడం కోసం రంగేసుకుంటున్నారా లేక మీ జుట్టు నల్లగానే ఉన్నా... ఫ్యాషన్ కోసం జుట్టు చివర్లు (ఒంబ్రే పాట్రన్) కోసం వేసుకుంటున్నారా లాంటి అంశాలు మీ హెయిర్‌డై ఎంపికను నిర్ణయిస్తాయి. ⇒ సాధారణంగా భారతీయులు స్వాభావికమైన నల్ల రంగు నుంచి కొందరు తమ అభిరుచిని బట్టి బ్రౌన్ లాంటి రంగు వేసుకుంటారు. ⇒ ఏ బ్రాండ్ కొనాలన్న విషయం మీరు దానిపై ఖర్చు పెట్టదలచుకున్న అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర మొదలుకొని చాలా ఎక్కువ ధర వరకు అనేక బ్రాండ్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. హెయిర్ డైతో ప్రమాదాలిలా... ⇒ హెయిర్ డైలో ఉండే అనేక రసాయనాలలో కొన్ని మీ చర్మానికి సరిపడకపోవచ్చు. ఇప్పుడు చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్), డై తగిలిన చోట కొద్దిగా వాపు వంటివి కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో తలకు రంగు పెట్టినా కళ్లు, పెదవులు లేదా మొత్తం శరీరం వాచిపోవడం వంటి దుష్ర్పభావాలు కనిపించవచ్చు. అలాంటప్పుడు వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. ఈ రసాయనాల్లో ఉండే వాయువులు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం, ఒక్కోసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగించి, ఆస్తమాకు దారితీయడం జరగవచ్చు. ఎన్నో ఏళ్లు వాడాక కూడా ఇలాంటి పరిణామాలు ఒక్కోసారి అకస్మాత్తుగా కనిపించవచ్చు. అందుకే మనకు ఏది సరిపడదో ముందే తెలుసుకొని, దానికి దూరంగా ఉండటం మేలు. ⇒ హెయిర్ డై ఒకవేళ గోళ్లకు అంటుకుంటే, గోరు పెరుగుతున్న కొద్దీ, క్రమంగా మనం కట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒకనాటికి పూర్తిగా తొలగిపోతుంది తప్ప చర్మంపైన తొలగిపోయినట్లుగా ఇది పోదు. ఎందుకంటే మన గోరూ, హెయిరూ... ఈ రెండూ ఒకే రకమైన పదార్థంతో (కెరొటిన్)తో తయారవుతాయి. కాబట్టి గోళ్లకు రంగు అంటనివ్వకండి. ⇒ హెయిర్ డైను కొద్ది కొద్ది మోతాదుల్లో తీసుకుంటూ జుట్టుకు రాయండి. బ్రష్ మీద పెద్దమొత్తంలో తీసుకోకండి. ఎందుకంటే పెద్దమొత్తంలో బ్రష్ మీదకు రంగును తీసుకుంటే అది కంటిలోకి కారే ప్రమాదం ఉంది. హెయిర్ డై లోని రసాయనాలు కంటికి హాని చేస్తాయి. హెయిర్‌డై కళ్లలోకి స్రవిస్తే... కళ్లు మండటం, కళ్లకు ఇన్ఫెక్షన్ రావడం కూడా జరగవచ్చు. ఒక్కోసారి అంధత్వానికీ దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంటి విషయంలో మరింత అదనపు జాగ్రత్త అవసరం. ⇒ హెయిర్ డైలో ఉండే రసాయనాలు వెంట్రుకలోకి ఇంకిపోతాయి. దాంతో ఆ రసాయనాలు వెంట్రుకను బిరుసెక్కేలా చేస్తాయి. ఫలితంగా చాలాకాలం రంగువేసుకుంటూ ఉన్నవారిలో వెంట్రుక కాస్త రఫ్‌గానూ, తేలిగ్గా చిట్లిపోయేదిగానూ (బ్రిటిల్గానూ) మారుతుంది. ఇక మహిళల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటూ రంగు వేసుకునేవారిలో ఈ పరిణామం మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. ⇒ కృత్రిమంగా తయారు చేసే ప్రతి హెయిర్ డైలోనూ తారు (కోల్తార్), పీపీడీ (పారాఫినైలీన్ డై అమైన్- ఇదే రంగును కల్పించే ప్రధాన రసాయనం) వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటికి బదులు స్వాభావికమైన కాలీ మెహందీ, అప్పటికప్పుడు కలుపుకున్న హెన్నా వంటివి సురక్షితం (అయితే ఇందులోని చాలా కొద్దిపాళ్లలో పీపీడీ ఉండే అవకాశాలున్నాయి). ⇒ హెయిర్‌డై వల్ల యౌవనంగా కనిపించడమన్నది తక్షణం ఒనగూరే ప్రయోజనమే. అయితే అది ప్రమాదకరం కాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. కాబట్టి పైన పేర్కొన్న సురక్షిత చర్యలు అవలంబిస్తూ... యూత్‌ఫుల్‌గా కనిపించండి. జాయ్‌ఫుల్‌గా జీవించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... ♦ మీరు తొలిసారిగా తలకు రంగు వేసుకుంటున్నారా? మొదటిసారి ఇంటి వద్ద కాకుండా పార్లర్లో ప్రొఫెషనల్స్ దగ్గర ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోండి ♦ రంగు వేసుకునే ముందుగా చెవి వెనక ఒక పాయకు రంగు వేసి, 48 గంటల పాటు పరిశీలించి చూసుకోండి. ఆ సమయంలో ఎలాంటి అనర్థమూ, దుష్ర్పభావమూ (సైడ్ ఎఫెక్ట్) కనిపించపోతే... ఇక రంగేసే ప్రక్రియను కొనసాగించండి. ♦ మీకు సురక్షితమని తేలిన బ్రాండ్‌నే ఎప్పుడూ కొనసాగించండి ♦ మీరు రంగు అంటకూడదని అనుకుంటున్న శరీర భాగాలపై పెట్రోలియం జెల్లీని పూయండి ♦ రంగు అంటకూడదని భావించే మెడ వెనక భాగంపై పాత టవల్‌ను చుట్టండి ♦ రంగును ఒకే తరహాలో (యూనీఫామ్గా) అంటేలా బ్రష్‌ను ఉపయోగించండి. అంతే తప్ప ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువ పూయకండి. దీంతో తెరపలు తెరపలుగా రంగు కనిపించే ఆస్కారం ఉంది ♦ రంగు పూసే సమయంలో చేతులకు గ్లౌవ్స్ తప్పక ధరించండి ♦ వెంట్రుక పెరుగుతున్న కొద్దీ కుదుళ్ల వద్ద తెల్లగా కనిపించే చోట మాత్రమే రంగు పూయదలచినప్పుడు, మిగతా నల్లగా ఉన్న వెంట్రుకల వరకు కండిషనర్ పూసి, తెల్లని చోట టచప్ చేయండి ♦ మీరు ఎంపిక చేసుకున్న షేడ్ ఏదో అదే వేసుకోండి. అంతేగానీ... రెండు షేడ్ల రంగులు తీసుకొని ఈ రెండింటినీ కలపకండి రంగు వేసే సమయంలో దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కళ్ల మీదికి జారనివ్వకండి. ఈ జాగ్రత్తను తప్పక పాటించండి ♦ రంగు వాసన వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవడం లేదా ఆయాసం రావడం జరుగుతుంటే వాసన తగలకుండా ముక్కుపై శుభ్రమైన గుడ్డతో కవర్ చేసుకోండి ♦ హెయిర్‌డై అన్నది కేవలం తలకు మాత్రమే వేసుకోండి. కనుబొమలకూ, కనురెప్పలకూ ఉన్న వెంట్రుకలకు ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌డై వాడకూడదు ♦ మీరు కొన్ని బ్రాండ్‌లోని జాగ్రత్తలను, అందులో ఉపయోగించిన పదార్థాలను ఒకసారి చదవండి. అందులో కోల్తార్, లెడ్ ఎసిటేట్, రెసార్సినాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు రాసి ఉంటే దాన్ని వాడకండి ♦ అమోనియా వంటి రసాయనాలు ఉన్న బ్రాండ్స్ ఉపయోగించడం వల్ల మీకు ఏవైనా దుష్ర్పభావాలు కనిపిస్తే... అమోనియా లేని బ్రాండ్లలో మోనో ఈథేనొలమైన్ (ఎమ్ఈఏ) వంటి సురక్షితమైన ఏజెంట్స్ ఉన్న బ్రాండ్స్ వాడుకోండి ♦ గర్భిణులు... తాము ప్రెగ్నెన్నీతో ఉన్న టైమ్‌లో హెయిర్‌డై ఉపయోగించకపోవడమే మంచిది. డాక్టర్ రాధా షా కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ -
తెలుపకనే తెలుసుకునే ‘తెలుపు’ కథ!
సమస్య మగాడికి ‘తెలుపు’ అంటే భయం! ‘తెలుపు’... ఒక ఆలోచన! ‘తెలుపు’... ఒక పరిశోధన! ‘తెలుపు’.. ఒక స్థిత ప్రజ్ఞత! తెలుపే సమస్య... తెలుపే పరిష్కారం. ఇప్పుడు ఈ విషయాన్ని మరింత వివరంగా ‘తెలుపు’కుందాం. . ఆ క్షణం... మిన్ను విరిగి వెన్నుమీద పడ్డట్టు... కిరీటం జారి కిందపడ్డట్టు... అధికారం ఆవిరైపోయినట్టు... కాళ్లకింద నేలను ఎవడో లాగేసినట్టు... ఒక్క మాటలో చెప్పాలంటే... ఒక మగాడికి అదో అవమానభరిత క్షణం! భవిష్యత్తు అగమ్యంగా గోచరించే క్షణం. అరచేతిలోని అద్దం అబద్ధం చెప్పదని తెలిసినా... ‘ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు’ అనే అత్యాశ అలముకునే క్షణం. ఆ క్షణం ఏదంటే... మగాడి తలలో తొలి తెల్లవెంట్రుక తలెత్తిన క్షణం! తొలి ‘తెలుపు’ దశ: ‘ఏముంది... ఒక్క వెంట్రుకే కదా నెరిసింది. పీకిపారేస్తే సరి’ అని మగాడు సరిపెట్టుకోలేడు. కానీ, తక్షణ కర్తవ్యం మాత్రం అదే! ఆ తరువాత అంతర్మథనం మొదలు. ‘నాకు ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది?’... ఒక్క తెల్ల వెంట్రుక ఇలా మగాడికి మనశ్శాంతిని దూరం చేయడం మొదలుపెడుతుంది. ఈ మనోవేదన నుంచి బయటపడేందుకు... మగాడు బయట ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడతాడు! అంటే... ‘నా ఫ్రెండ్స్‌లో ఎవరికైనా తెల్ల వెంట్రుకలు వచ్చాయా..? నా వయసులో ఉన్న మరెవరికైనా తల నెరిసిందా?’... అంటూ వెతకడం మొదలుపెడతాడు. సినిమాకి వెళ్లినా... షికారుకి వెళ్లినా... తన వయసు మగాడు కనిపించగానే చూపులు చురకత్తుల్లా అతడి తలలోకి దూరిపోతాయి. ఒక్క తెల్లవెంట్రుక కనిపిస్తే చాలు... ‘హమ్మయ్య... ఫర్వాలేదు. నాకు ఒక్కడికే కాదు, వీడికీ తెల్ల వెంట్రుకలు ఉన్నాయి’ - అనే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. తనకున్న సమస్య తనొక్కడికే కాదు, చాలామందికి ఉందనుకుంటే అదో రకమైన ఉపశమనం! ఆరోజుకి హాయిగా నిద్రపోతాడు. మలి ‘తెలుపు’ దశ: రోజురోజుకీ తెల్లబడుతున్న వెంట్రుకల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అద్దం ముందు నిలబడితే అది వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. గాలింపు చర్యలకు దిగుతాడు మగాడు! తల్లోని తెల్లవెంట్రుకల్ని వెతికివెతికి వాటి పనిపట్టేస్తాడు. అవసరమైతే కత్తెర అనే ఆయుధాలని రంగంలోకి దించుతాడు. అయినా, మనశ్శాంతి కరువు అవుతుంది. దినదిన ప్రవర్ధమానమౌతున్న ‘శ్వేత వర్ణ’ కేశ సంపద వెక్కిరిస్తుంటుంది. ‘ఎవరూ నా తలవైపు చూడకూడదు. చూసినా వాళ్లకి నా తెల్ల వెంట్రుకలు కనిపించకూడదు. కనిపించినా వాళ్లు వాటి గురించి మాట్లాడకూడదు’... ఈ తరహా అనుమానంతో కూడిన భయం లాంటి ఒక వేదన వెంట తరుముతూ ఉంటుంది. ముఖ్యంగా.. అందమైన అమ్మాయిలు ఎదురైనా పక్కనుంచి పలకరిస్తూ వెళ్లినా ఇంతకుముందున్న ఆనందం ఉండదు. ఒకరకమైన కంగారు! ఈ దశలో మగాడికి చేతినిండా పనే. అస్సలు ఖాళీ ఉండదు. ఇంట్లో ఉంటే ఒకచేతిలో అద్దం... మరో చేతిలో జుత్తు! కూంబింగ్ జరుగుతూనే ఉంటుంది. తొలి ‘వర్ణ’ దశ: ‘ఇలా పీక్కుంటూ పోతే ఏం మిగలదు. ఏదో చేయాల్సిందే. తలకి ఏదో పుయ్యాల్సిందే’ - పై రెండు దశలూ దాటాక మగాడికి వచ్చే క్లారిటీ ఇది. ఎవరు చూసినా చూడకపోయినా.. చూసి నవ్వుతున్నా... నవ్వుకుని జోకులు వేసుకుంటున్నా... తెల్లవెంట్రుకలు తెగపెరిగిపోతున్నాయన్న సత్యాన్ని మగాడు గుర్తిస్తాడు. ఒకసారి సత్యాన్ని గుర్తించాక అనుమానాలు తొలగిపోతాయి. అపోహలు చెరిగిపోతాయి. రంగేద్దాం అని నిర్ణయించుకుంటాడు. తెల్ల జుత్తును కవర్ చేద్దాం అన్న ఆలోచన రాగానే మగాడు ‘టీ డికాక్షన్ మరిగించడం’లో ఎక్స్పర్ట్ అయిపోతాడు! హెన్నా తయారు చేసుకోవాలంటే ఇది ఉండాలి కదా! కలర్ కాస్త డార్క్‌గా రావాలంటే ఎవరో చెప్పారని నిమ్మకాయ రసం అందులో పిండుతాడు. తొలిసారి హెన్నా పెట్టుకుంటాడు. గంట తరువాత స్నానం చేసి, అద్దం ముందు నిలబడి... రంగుమారిన జుత్తును చూస్తూ మురిసిపోతాడు. ‘హెయిర్ కాస్త రెడిష్గా ఉండటం ఇప్పుడు ఫ్యాషన్’ అని సర్ది చెప్పుకుంటాడు. ఒకటి... రెండు.. మూడు... నాలుగు... మహా అయితే ఐదేళ్లు... అంతే, తరువాత మరో దశకి చేరుకుంటాడు మగాడు! మలి ‘వర్ణ’ దశ: తల తెలుపును హెన్నా కప్పిపుచ్చలేని స్థితికి చేరుకుంటాడు మగాడు. ‘హెయిర్ మరీ రెడ్‌గా ఉంటోంది. నేచురల్ లుక్ ఉండటం లేదు’- ఇలా ఒక కొత్త రూల్‌ని ఫ్రేమ్ చేసుకుంటాడు. హెయిర్ డై మీదికి దృష్టి మళ్లుతుంది. ప్రకాష్‌రాజ్, బొమన్ ఇరానీ, ఐశ్వర్యారాయ్, మలైకా అరోరా, సోనమ్ కపూర్... వీళ్లందరికీ మగాడు అభిమానిగా మారిపోతాడు. ఎందుకంటే, రకరకాల హెయిర్ డైలకి అంబాసిడర్లు వీళ్లే మరి! వీళ్లలో ఎవరిదో ఒకరి మాట తలకెక్కేస్తుంది. ‘హెయిర్ డై వేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయటగా..? ఆ... ఎంతమంది వేయడం లేదు. హెయిర్ డై వేసుకున్నట్టు అందరికీ తెలిసిపోతుందా..? ఆ... మా వెంకిగాడు వేసుకున్నట్టు ఎవరికైనా తెలుస్తోందా’ - ప్రశ్నకి సమాధానం వెంటనే దొరికేస్తుంటుంది. మొత్తానికి రంగు వేసుకోవడం అలవాటైపోతుంది. మగాడి అలమరలోకి ఒక డై ప్యాకెట్, ఒక బ్రష్ వచ్చి చేరిపోతాయి. తెల్లవెంట్రుకలు మటుమాయం. అక్కణ్నుంచీ మగాడి జీవితంలో ఓ కొత్త రంగు! మగాడు... మళ్లీ మగాడిగా మారిపోతాడు. (నోట్: బట్టతలకి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ప్రతీ దశలోనూ ‘తెల్ల వెంట్రుక‘ స్థానంలో ‘బట్టతల’ అనే మాటను పెట్టుకొని ఆలోచిస్తే చాలు. మగాడు స్థితప్రజ్ఞుడైపోతాడు.)