కేటీఆర్ కు ఊహించని ప్రశ్న! | Not so young anymore I guess, says KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్ కు ఊహించని ప్రశ్న!

Published Thu, Apr 20 2017 12:17 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

కేటీఆర్ కు ఊహించని ప్రశ్న!

కేటీఆర్ కు ఊహించని ప్రశ్న!

హైదరాబాద్: సామాజిక మాధ్యమం ట్విటర్ లో చురుగ్గావుండే తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)కు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. నెరసిన జుట్టుకు రంగు వేసుకోవాలని అభిమాని ఆసక్తికర సూచన చేశాడు. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రెండు రోజుల క్రితం పాతబస్తీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మొగల్ పురాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. కాసేపు సరదాగా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడారు. ఈ ఫొటోలను తన ట్విటర్ పోస్ట్ చేశారు.

కేటీఆర్ క్రికెట్ ఆడుతున్న ఫొటోపై ఎంఎన్ ప్రపుల్లకుమార్ అనే యువకుడు ఆసక్తికర కామెంట్ చేశారు. 'ఈ మధ్యకాలంలో నెరసిన జుట్టుతో కనిపిస్తున్నారు. మీరు యూత్ లీడర్, మంత్రుల్లో మీరే పిన్నవయస్కులు కాబట్టి జుట్టుకు హెయిర్ డై వేసుకోవాల'ని సూచించాడు. దీనికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. తాను మరీ కుర్రాడిని కాదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement