ఎలాన్‌ మస్క్‌ను సూటిగా ప్రశ్నించిన అనుపమ్ ఖేర్.. అసలేం జరిగిందంటే? | Anupam Kher Questioned Elon Musk after His twitter account locked | Sakshi
Sakshi News home page

Anupam Kher: ఎలాన్‌ మస్క్‌కు అనుపమ్ ఖేర్ ప్రశ్న.. అసలేం జరిగిందంటే?

Published Mon, Feb 24 2025 5:37 PM | Last Updated on Mon, Feb 24 2025 6:32 PM

Anupam Kher Questioned Elon Musk after His twitter account locked

ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇటీవలే ప్రభాస్‌ మూవీలోనూ ఛాన్స్ కొట్టేశాడు.  హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు.  

అయితే తాజాగా అనుపమ్ ఖేర్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్స్ ఖాతా కొంతసేపు లాక్ అయింది. ఈ విషయంపై ఏకంగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రశ్నించారు.  దీనిపై ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన అకౌంట్‌ లాక్‌ అయినట్లు వచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. మీ అకౌంట్‌ లాకైంది. ఈ ప్లాట్‌ఫామ్‌ వేదికగా మీరు పోస్ట్‌ చేసిన కంటెంట్‌ విషయమై డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం కింద ఎక్స్‌కు ఒక ఫిర్యాదు వచ్చిందని అందులో రాసి ఉంది.

దీనిపై అనుపమ్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'నా ఖాతాను పునరుద్దరించినందుకు థ్యాంక్స్. కానీ నా అకౌంట్ లాక్ కావడం చూసి ఆశ్చర్యపోయాను. నేను 2007 సెప్టెంబర్ నుంచి ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్నా. నాకు ‍ట్విటర్‌ నియమాలు, కాపీరైట్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల నాకు అసంతృప్తిగా అనిపించింది. నేను చేసిన ఏ పోస్ట్ మీ నిబంధనలను ఉల్లంఘించిందో తెలుసుకోవచ్చా? అంటూ' పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement