సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎక్కువగా అప్‌డేట్స్ ఇస్తుంటారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సందడి చేస్తుంటారు. అయితే వారి అఫీషియల్ అకౌంట్స్‌కు బ్లూ టిక్ సింబల్ ఉంటుంది. అయితే తాజాగా ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ సెలబ్రీటీలకు షాకిచ్చారు. సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించిని వారి బ్లూ టిక్స్‌ను తొలగించారు. ఇలా బ్లూ టిక్ తొలగించిన వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉండడం విశేషం..
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు తొలగిస్తోంది. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన విధంగా నెలవారీ లేదంటే ఏడాది చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌లు ఎగిరిపోయాయి. అయితే, ఇలా బ్లూ టిక్‌లు కోల్పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండడం విశేషం.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నాయి. అయితే వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ విషయాకొనిస్తే.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా సైతం తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. సౌత్‌లో ముఖ్యంగా తమిళ స్టార్ రజినీకాంత్, విజయ్, శింబు లాంటి పెద్ద హీరోలకు సైతం బ్లూ టిక్ లేకుండా పోయింది.
Bye bye #BlueTick …. It was nice having you….my journey ..my conversations..my sharing…will continue with my people … you take care #justasking
— Prakash Raj (@prakashraaj) April 20, 2023
బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిందే: ఎలన్ మస్క్
ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్లు కావాలనుకుంటే వెబ్ కోసం అయితే నెలకు రూ.650, యాప్ కోసమైతే నెలకు రూ.900 చెల్లించాలి. ఏడాదికైతే రూ.6500 డిస్కౌంట్ ఆఫర్‌ను ట్విట్టర్ అందిస్తోంది. దీనికి ఈ ఏడాది ఏప్రిల్ 20 చివరి తేదీగా ప్రకటించింది. ఈ లోపల బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోనివారు బ్లూటిక్ కోల్పోతారని ప్రకటించారు. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ చెప్పినట్లుగానే సెలబ్రిటీలు తమ ట్విట్టర్ బ్లూ టిక్‌లను కోల్పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment