lock
-
ఎలాన్ మస్క్‌ను సూటిగా ప్రశ్నించిన అనుపమ్ ఖేర్.. అసలేం జరిగిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న నటుడు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారాయన. ఇటీవలే ప్రభాస్ మూవీలోనూ ఛాన్స్ కొట్టేశాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా అనుపమ్ ఖేర్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్స్ ఖాతా కొంతసేపు లాక్ అయింది. ఈ విషయంపై ఏకంగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రశ్నించారు. దీనిపై ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారు. తన అకౌంట్ లాక్ అయినట్లు వచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. మీ అకౌంట్ లాకైంది. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ విషయమై డిజిటల్ మిలీనియం కాపీరైట్ చట్టం కింద ఎక్స్‌కు ఒక ఫిర్యాదు వచ్చిందని అందులో రాసి ఉంది.దీనిపై అనుపమ్ తన ట్వీట్లో రాస్తూ.. 'నా ఖాతాను పునరుద్దరించినందుకు థ్యాంక్స్. కానీ నా అకౌంట్ లాక్ కావడం చూసి ఆశ్చర్యపోయాను. నేను 2007 సెప్టెంబర్ నుంచి ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఉపయోగిస్తున్నా. నాకు ట్విటర్ నియమాలు, కాపీరైట్స్ గురించి బాగా తెలుసు. అందువల్ల నాకు అసంతృప్తిగా అనిపించింది. నేను చేసిన ఏ పోస్ట్ మీ నిబంధనలను ఉల్లంఘించిందో తెలుసుకోవచ్చా? అంటూ' పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Dear X! Even though my account has been restored I was surprised to see it locked. I have been on this platform since September 2007. Have always been mindful of rules of #X (formerly twitter). Or for that matter any social media copyright rules. So found it a little absurd.… pic.twitter.com/tNmhc30vtP— Anupam Kher (@AnupamPKher) February 24, 2025 -
ఆధార్ లాక్/అన్‌లాక్ గురించి తెలుసా?
ఆధార్ కార్డు జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ప్రభుత్వ పథకాలను అప్లై చేయడానికి ఇలా.. అన్నింటికీ ఆధార్ అవసరమవుతోంది. ఆధార్ నమోదు సమయంలోనే వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీష్ అన్నింటినీ రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి వేలి ముద్ర వేయగానే మన డీటైల్స్ అన్నీ తెలిసిపోతాయి.వేలి ముద్ర వేయగానే అన్ని వివరాలు తెలిసిపోతుండటం వల్ల, సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ లాక్ & అన్‌లాక్➤యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేసిన 'ఎంఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌లో ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం ఒక వ్యక్తి ఆధార్ వివరాలను మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.➤యూఐడీఏఐ ఎంఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఉపయోగించి లాగిన్ అయిన తరువాత మీకు 'ఎంఆధార్'ను యాక్సెస్ చేసుకోవడానికి ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.➤ఎంఆధార్ యాప్‌ను యాక్సెస్ చేసిన తరువాత ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.➤అయితే ఇప్పుడు బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ కోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్ కనిపిస్తుంది. ఆధార్ లాక్ చేయడానికి 'బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆధార్ లాక్ అవుతుంది.➤అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.ఆధార్ లాక్ వల్ల ఉపయోగాలువ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పడకుండా ఉండటానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఉపయోగపడుతుంది. దీంతో మీరు మోసాలకు బలికాకుండా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. -
వాట్సాప్‌లో కీలక మార్పు.. ఇక ఆ పని చేయడానికి నో ఛాన్స్
వినియోగదారుల వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేమస్ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) ఓ కీలకమైన మార్పుకు సిద్ధమైంది. వినియోగదారు అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడాన్ని నిరోధించడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల కాల్ బ్లాకింగ్, చాట్‌లాక్ వంటి ఫీచర్స్ మాదిరిగానే డిస్ప్లే పిక్చర్ లాక్ అనే ఫీచర్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఇది మనకు తెలియని వ్యక్తులు మన వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలు వెల్లడి కాలేదు. ఇదీ చదవండి: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? రాబోయే రోజుల్లో మనకు నచ్చిన వాళ్లకు మాత్రమే ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల మనకు నచ్చని వారికి ఫోటో కూడా కనిపించకుండా చేయొచ్చని తెలుస్తోంది. కాబట్టి మనకు నచ్చని వారు మన ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోలేరు. డీప్ ఫేక్‌లు చెలరేగుతున్న సమయంలో కంపెనీ తీసుకువస్తున్న ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం
అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు రుక్మిణిదేవి అప్పగించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అర్పించనున్నట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు. ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు అప్పగించారు. -
క్లోనింగ్ ముప్పు : తక్షణమే ఆధార్ బయోమెట్రిక్ డేటా లాక్ చేయండి ఇలా..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్టం పడటం లేదు.సైబర్ క్రైం నేరాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ మోసానికి పాల్పడుతున్న కొత్త తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేలిముద్రతో తస్కరించి బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు కాజేసిన ఘటన ఆందోళన రేపుతోంది. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా దాదాపు లక్షల మేర టోకరా వేస్తున్నారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా, చివరికి మొబైల్ సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్‌తోపాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. ఇలా అవసరం ఉన్న ప్రతి చోటా ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తాం. దీన్ని అదునుగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు పౌరుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, నగదు స్వాహా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఈ క్రమంలో UIDAI పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ డేటా లాక్ లేదా అన్ లాక్ ప్రక్రియ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. బయోమెట్రిక్ లాకింగ్ ఎలా? ♦ ముందుగా మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ♦ మైఆధార్ పోర్టల్‌లోకి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. ♦ స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ అందులో లాక్, అన్‌లాక్ మీకు ఎలా ఉపయోగపడుతుందనేది వివరణ ఉంటుంది. ఆ పేజీలో కనిపించే నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ వెంటనే ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. తరువాత టర్మ్స్ బ్యాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. ♦ Your Biometric Have Been Locked Successfully (బయో మెట్రిక్ విజయవంతంగా లాక్ చేయబడింది’) అనే సందేశం డిస్ప్లే అవుతుంది. ♦ లాక్ కాగానే లాక్ లేదా అన్ లాక్ బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది. బయోమెట్రిక్ అన్‌లాక్ ఎలా? ♦పోర్టల్‌లో లాగిన్ అవ్వగానే లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. ఇలా ఉంటే బయోమెట్రిక్ లాక్ అయినట్టే. ♦అన్‌లాక్ ప్రక్రియ కోసం Please Select To Lock టిక్ చేసిన తరువాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ♦బయోమెట్రిక్ అన్‌లాక్ తాత్కాలికమా లేదా శాశ్వతంగానా అని మెసేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని, నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి ♦Your Biometrics Have Been Unlocked Successfully అని స్క్రీన్‌పై కనిపిస్తుంది. ♦ తాత్కాలికంగా అన్‌లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే బయోమెట్రిక్ అన్‌లాక్ అవుతుంది అనేది గమనించాలి -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్‌తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి. -
అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం
అలీగఢ్ (యూపీ): అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు. ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమరి్పస్తారు. -
ఖమ్మం: ఈ భూమి నాది.. సబ్ స్టేషన్‌కు తాళం వేసేశాడు
-
ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టి.గణేష్ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్‌కుమార్, నగరంలో తాడితోట వీరభద్రనగర్కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్ మెకానిక్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు. ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది. ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, వీరబాబు, బీఎస్కే నాయక్, ఎస్‌వీవీఎస్‌ఎన్ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌లను డీఎస్పీ అభినందించారు. వేసవి చోరీలపై జాగ్రత్త ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు. -
మీ ఫోన్ పోయిందా?.. వెంటనే ఇలా బ్లాక్ చేసుకోండి.. అన్నీ సేఫ్..!
సాక్షి, హైదరాబాద్: మీ ఫోన్ ఈమధ్యే చోరీకి గురైందా? లేక ఎక్కడైనా పోగొట్టుకున్నారా? అందులోని డేటా దుర్వినియోగం కావొచ్చని ఆందోళన చెందుతున్నారా? ఇకపై మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ముప్పు నుంచి మనల్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను అందుబాటులోకి తెచి్చంది. దీని సాయంతో పోయిన లేదా చోరీకి గురైన ఫోన్‌ను ఇతరులు వాడకుండా మీరు బ్లాక్ చేయొచ్చు. ఎలా ఉపయోగించాలంటే.. మనం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఐఆర్ పోర్టల్‌లోకి వెళ్లి దాన్ని బ్లాక్ చేయవచ్చు. అంటే మన ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లినా అది పనిచేయకుండా మనం నియంత్రించవచ్చన్నమాట. దీంతోపాటు పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించి పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫోన్ దొరికాక అన్‌బ్లాక్ సైతం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు పొందాలంటే ముందుగా కొన్ని వివరాలు తెలియజేయాలి. మీ మొబైల్ నంబర్, ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్‌తోపాటు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని సీఈఐఆర్ పోర్టల్‌లో జత చేయాలి. వివరాలన్నీ అప్లోడ్ చేస్తే సీఈఐఆర్ సెంట్రల్ డేటాబేస్‌లో అప్పటికే నమోదై ఉన్న సదరు ఫోన్ పనిచేయకుండా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. మన ఫిర్యాదు స్థితిని తెలుసుకొనే ఆప్షన్ సైతం ఈ పోర్టల్‌లో ఉంది. మార్చి 15 నుంచి అమల్లోకి.. వాస్తవానికి సీఈఐఆర్ సేవలను కేంద్ర ప్రభుత్వం 2019 చివర్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచి్చంది. తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అక్కడ విజయవంతం అయ్యాక దశలవారీగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ వస్తోంది. మార్చి 15 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ సీఈఐఆర్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది. మార్చి 15 తర్వాత పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. పోలీసు సిబ్బంది ఈ సేవలు వాడాలి: డీజీపీ మొబైల్‌ఫోన్ చోరీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుల దర్యాప్తులో పోలీసులు చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించేందుకు సీఈఐఆర్ సేవలను వినియోగించుకోవాలని డీజీపీ అంజనీకుమార్ తాజాగా ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని... మరో 10 రోజుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ.75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
పోలీసుల మాస్టర్‌ప్లాన్: మొబైల్ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో మొబైల్ దొంగల హవా తీవ్రతరమైంది. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు సిటీ పోలీసులు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఇకపై చోరీకి గురైన మొబైల్‌ను చోరీకి పాల్పడిన దొంగలు వినియోగించకుండా లాక్ చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను ఢిల్లీ, ముంబై పోలీసులు అమలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు నగర పోలీసులు ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చి వీటి సాదక బాదకాలపై అధ్యయనం చేస్తున్నారు. నిత్యం 30 మొబైల్స్ చోరీ సిలికాన్ సిటీలో నిత్యం 25 నుంచి 30 మొబైల్స్ చోరీకి గురవుతున్నాయి. రోడ్డుపై నిలబడి మాట్లాడుతున్నవారి నుంచి లాక్కుపోవడం, సిటీ బస్సులు, రద్దీ ప్రదేశాల్లో కొట్టేయడం, లేదా సొంతదారే పోగొట్టుకోవడం జరుగుతోంది. ఐఫోన్, చాలా ఖరీదైన ఫోన్లయితే కంపెనీ సహాయంతో ఆ మొబైల్‌ని లాక్ చేయవచ్చు. కానీ చాలా మొబైల్స్‌ను ఏమీ చేయడానికి సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) సహాయంతో మొబైల్ లాక్ చేసే విధానాన్ని పోలీస్‌శాఖ తీసుకొచ్చింది. మొబైల్‌ను లాక్ చేస్తే దొంగలు ఉపయోగించలేరు దొంగ మొబైల్స్ కొనొద్దు చోరీకి గురైన మొబైల్స్‌ను తక్కువ ధరకు వస్తుందని ఎవరైనా కొని ఉపయోగిస్తే అది పోలీసులకు తెలిసిపోతోంది. ఆ మొబైల్లోని సిమ్ నంబరు, ఏ ఊరిలో వాడుతున్నారు అనేది పూర్తిగా పోలీసులకు చేరుతుంది. కాబట్టి చోరీ చేసిన ఫోన్లను కొనడం, ఉపయోగించడం ఎంతమాత్రం తగదని రమణ్‌గుప్తా తెలిపారు. ఇలా ఫిర్యాదు చేయాలి ►మొబైల్ చోరీలు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగర పోలీస్ విభాగంలో సీఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ రూపొందించారు. ►మొబైల్ చోరీకి గురైన బాధితులు పీఎస్‌లో కానీ, 112 నంబరుకు లేదా నగర పోలీస్ వెబ్‌సైట్‌లోని ఇ– లాస్ట్‌లో కానీ ఫిర్యాదు చేయాలి. ఐఎంఈఐ నంబరును చెబితే వెంటనే మొబైల్‌ను బ్లాక్ చేస్తారు. ఆ మొబైల్ ను ఎవరూ ఉపయోగించలేరు. ►తద్వారా మొబైల్ విక్రయించడానికీ వీలు కాకపోవడంతో చోరీలు తగ్గుతాయని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమణ్‌గుప్తా తెలిపారు. ►ఇందుకుగాను బాధితులు అదే నంబరుతో మరో సిమ్ తీసుకుని ఉండాలి. అప్పుడు ఆ ఫోన్‌కు ఓటీపీ రాగానే ఎంటర్ చేయాలి. తరువాత బ్లాక్ ప్రక్రియ పూర్తవుతుంది. ►ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి భయ సందేహాలు వద్దని పోలీసులు తెలిపారు. ఫోన్ మళ్లీ దొరికితే పోలీసుల అనుమతి తీసుకుని యథావిధిగా ఉపయోగించవచ్చని చెప్పారు. -
ఎస్బీఐ ఉద్యోగుల నిర్లక్ష్యం.. బ్యాంక్‌కు తలుపులు వేయకుండానే!
సాక్షి, ఖమ్మం: ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు ఎస్బీఐ ఉద్యోగులు బ్యాంకుకు తలుపులు వేయకుండానే వెళ్లిపోయిన ఘటన ఇది. ఈనెల 15వ తేదీ బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతిరోజూ బ్యాంకు సమయం పూర్తయ్యాక స్ట్రాంగ్‌రూమ్‌తో పాటు అన్ని తలుపులకు షట్టర్లు, తాళాలు వేసి వెళ్తారు. అయితే, ఈనెల 15వ తేదీన సాయంత్రం మాత్రం ఉద్యోగులు విధులు ముగించుకుని ప్రధాన ద్వారం తలుపులు వేయకుండానే ఎవరికి వారు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు అలాగే ఉండగా అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించి సర్పంచ్ జంగా పుల్లారెడ్డితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఏఎస్సై వి.వెంకటాచార్యులు, బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రకాష్ చేరుకుని వెంటనే బ్యాంకుకు మేనేజర్ రవికుమార్, ఉద్యోగులను పిలిపించారని సమాచారం. అధికారులు వచ్చాక పోలీసులతో కలిసి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ఎవరూ బ్యాంకులోకి ప్రవేశించలేదని నిర్ధారించుకున్న వారు. ఆతర్వాత తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారని తెలిసింది. కాగా, ఈ విషయం శుక్రవారం వెలుగులోకి రాగా.. వివరణ కోసం బ్యాంకు మేనేజర్ రవికుమార్‌కు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడుతానని బదులిచ్చారు. చదవండి: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్ -
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన సత్యప్రకాశ్ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి, అతని భార్య కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అంతేకాదు ఆ తాళం 30 కిలోల బరువున్న తాళం చెవితో తెరుచుకుంటుంది. పైగా సుమారు రూ. 2 లక్షలు ఖరీదు చేసే ఈ తాళం పై రాముడి చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయనున్నారు. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) ఈ మేరకు ఆ వ్యక్తి 10 అడుగుల పొడవు 400 కిలోల బరువు ఉండే ఆ తాళాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందన్నాడు. అంతేకాదు తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంటుందని తెలిపాడు. అయితే ఈ లాక్‌ని క్షేత్ర స్థాయిలో పూర్తి చేయడానికి ఇంకా కొంత నిధులు అవసరం అవుతాయని, పైగా ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అభ్యర్థించినట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదు ఈ కళను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సహకారం అవసరం అంటున్నాడు. తాను ఈ తాళాన్ని అప్పు చేసి మరీ తయారు చేశానని చెప్పాడు. అంతేకాదు సత్యప్రకాశ్ గతేడాది ప్రారంభంలో 300 కిలోల తాళాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్ పరేడ్‌లో చేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తాను తయారు చేసిన తాళానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి: అక్కడ ప్రజలు టీతోపాటు టీ కప్పులను కూడా తినేస్తారట!) -
సిబ్బంది నిర్వాకం: ఏటీఎంలో డబ్బులు పెట్టి ... తాళం మరిచారు..
సాక్షి, రెబ్బెన(ఆదిలాబాద్): ఇంటికి తాళం వేస్తేనే.. పడిందో లేదో అని ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటారు. కానీ రూ.లక్షలు నిల్వ ఉంచే ఏటీఎంకు సిబ్బంది తాళంచెవులు అలాగే వదిలేశారు. రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో గల నంబర్ వన్ ఏటీఎంలో డబ్బులు పెట్టిన సిబ్బంది తాళంచెవులు తీసుకువెళ్లటం మాత్రం మర్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎంకు తాళంచెవులు ఉండటం చూసి వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించాడు. తాపీగా వచ్చిన సిబ్బంది తాళంచెవులు పట్టుకుని వెళ్లిపోయారు. ఏటీఎంకే తాళం వదిలి వెళ్లిన వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: నాలుగు రోజులుగా ఠాణాలో పందెం కోళ్లు! -
బాబోయ్ ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. తల్లి మెడకు సైకిల్ లాక్ వేసి..
బీజింగ్: ఓ అల్లరి పిల్లాడు ఆడుకుంటూ తన తల్లి మెడకు సైకిల్ లాక్ వేశాడు. అయితే ఆ లాక్‌ను తెరిచే కోడ్‌ను మరిచిపోయాడు. దీంతో భయాందోళన చెందిన ఆ తల్లి అధికారుల సహాయం కోరింది. చివరకు కట్టర్‌తో కట్ చేసి దానిని తొలగించారు. ఈ వింత ఘటన చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని హువాన్‌లో చోటు చేసుకుంది. ఓ చిచ్చర పిడుగు సైకిల్ లాక్‌తో ఆడుకుంటూ దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. ఇంకేముంది పిల్లల సంగతి తెలిసిందే కదా. పిల్లలు చిచ్చర పిడుగులు అనేలా ఆ లాక్‌ని తన తల్లి మెడకి వేశాడు. పాపం జరగబోయేది తెలియక ఆ మహిళ కూడా మొదట్లో ఇదంతా ఫన్నీగానే తీసుకుంది. అయితే, అయితే ఆట సమయంలో అన్ లాక్ కోడ్‌ను అతడు పలు మార్లు మార్చేయడంతో సరైన లాక్కోడ్ మర్చిపోయాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన ఆ తల్లి, లాక్ తెరిచే కాంబినేషన్ తెలియక కంగారు పడింది. చేసేదేమి లేక ఆ తల్లి సహాయం కోసం పోలీస్ స్టేషన్‌ను వెళ్లింది, కానీ వారు ఆమెకు ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆ లాక్ ఓపన్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది బృందాన్ని పిలిచారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి అల్లరి పనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా తీసుకోగా కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. చదవండి: Viral: కరెంట్ వైర్ల మధ్య పావురం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ -
చైనాలో కరోనా ఆంక్షలు ... ఇంటి బయటి నుంచి తాళాలు
-
వ్యాపారం అచ్చిరావట్లేదని.. ఇంటర్నెట్లో చూసి బైక్‌లను..
సాక్షి, కరీంనగర్: వృత్తి, వ్యాపారం అచ్చిరాక పోవడంతో అప్పులు పెరిగి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్న ఓ వ్యక్తి ఇంటర్నెట్ చూశాడు.. ఒక ఛానల్లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఎలా తీయాలో నేర్చుకున్నాడు. కరీంనగర్ కమిషనరేట్‌లో పలు ప్రాంతాల్లో 12 బైక్‌లను దొంగతనం చేసి, చివరికి పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ టౌన్ డివిజన్ డాక్టర్ పి.అశోక్ తన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్(33) అలియాస్ జల్సా ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు. 2010లో మోతెకు చెందిన అమ్మాయిని కర్నూల్లో వివాహం చేసుకొని, 2012 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత గుండి ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్, కారు, వివిధ వాహనాలు నడిపాడు. 2020 జనవరిలో గోపాల్రావుపేటలో ఆటోస్టోర్ పెట్టుకున్నాడు. లాక్డౌన్ వల్ల నష్టం రావడంతో షాపు తీసేసి, కూలీ పనికి వెళ్లాడు. 2021 మార్చి నుంచి కరీంనగర్ మంకమ్మతోటలో భార్య, కుమారుడు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు పెరగడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటర్నెట్లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఏ విధంగా తీయాలో నేర్చుకొని, కరీంనగర్ టూటౌన్ పరిధిలో 9, కొడిమ్యాల, రామడుగు, పెగడపల్లి నామాపూర్‌లలో 3 బైక్‌లు దొంగిలించాడు. నంబర్ ప్లేట్లు తీసేసి, తన స్నేహితుల వద్ద ఉంచాడు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు శ్రీనివాస్‌ను మంగళవారం పద్మనగర్ బైపాస్‌రోడ్డులో అరెస్టు చేశారు. అతడు, అతని స్నేహితుల వద్ద ఉన్న 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకున్న టూటౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై టి.మహేష్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీలు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్‌రెడ్డి, పవన్‌లను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి, రివార్డులు ప్రకటించారు. -
చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి
ప్రస్తుతం మన దేశంలో 5 ఏళ్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. ఇది ఒక ఐడీ ప్రూఫ్ లాగా మాత్రమే కాకుండా, చిరునామా గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల కోసం ఈ కార్డు తీసుకోవడం తప్పనిసరి. అందుకే మన దేశంలో ఈ కార్డుకు ఉన్న మరే ఇతర కార్డుకు లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు అసాంఘిక శక్తుల కోసం మీ నెంబర్ కోసం ఉపయోగిస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి ఫీచర్స్‌ని అందిస్తోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరైనా మీ ఆధార్ నెంబర్‌ను ఎవరు ఉపయోగించలేరు. అలాగే లాక్ చేసిన ఆధార్‌ను ఆన్-లాక్ కూడా చేయవచ్చు. వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ సహయంతో సులభంగా లాక్ చేయవచ్చు. మొదట మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి GETOTPAadhaar NUMBER-last-4-digits టైపు చేసి 1947కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని LOCKUIDAadhaar NUMBER-last 4-digitsOTP-6-digits అని టైపు చేసి మళ్లీ 1947కి మెసేజ్ చేస్తే మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఉదాహరణకు ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు 9123 అనుకుంటే GETOTP 9123 అని టైప్ చేయాల్సి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ 012345 అనుకుంటే LOCKUID 9123 012345 ఈ ఫార్మాట్లో ఎస్ఎంఎస్ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు. అలాగే, ఆన్-లాక్ చేయాలంటే వర్చువల్ ఐడీ సహాయంతో చేయవచ్చు. చదవండి: కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే -
ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం
అఫ్జల్‌గంజ్: సుమారు వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం పడింది. ఇన్నాళ్లూ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పాత భవనంలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎప్పుడేం జరుగుతుందోననే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీశారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు పాత భవనంలోకి నీరు చేరడంతో రోగులు,సహాయకులతో పాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం పాతభవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి పరిపాలనా విభాగం అధికారులు భవనాన్ని ఖాళీ చేసి సోమవారం తాళం వేశారు. పాత భవనంలోని పలు వార్డులను కులీకుతుబ్‌షా భవనంలోకి సర్దుబాటు చేశారు. పాతభవనంలోనే ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సింగ్ కళాశాలలోనికి మార్చారు. వెంటనే నూతన భవనం నిర్మించాలి.. ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం వేయడంతో ఇక్కడి రోగులను ఇతర భవనాల్లోని వార్డుల్లోకి సర్దుబాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంచాల కొరత ఏర్పడుతుండడంతో అవస్థలు పడుతుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని కోరారు. -
ఒకే నగరంలో ఉన్నా...
బెంగళూరు: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అనుకోని విరామ సమయంలో సాధారణ ప్రజలే ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటే.. నిరంతరం ప్రయాణాలు, రోజంతా ప్రాక్టీస్, మ్యాచ్‌లు అంటూ బిజీగా గడిపే క్రీడాకారుల సంగతి చెప్పక్కర్లేదు. కుటుంబంతో సరదాగా గడిపే సమయం దొరికితే ఆటగాళ్లు ప్రపంచాన్ని, వారి ప్రాణమైన ఆటనే మర్చిపోతారు. కానీ భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన భార్య, గారాల కూతురు తనకు సమీపంలోనే నివసిస్తున్నా కుటుంబానికి దూరంగా జట్టుతో ఉంటున్నాడు. ప్రస్తుతం సునీల్ బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తుండగా... అతని భార్య నిషా, ఏడాదిన్నర వయస్సున్న కూతురు శాన్విత ‘సాయ్’ సెంటర్‌కు కేవలం 20 కి.మీ దూరంలోనే ఉంటున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం క్షేమం కోసమే తాను దూరంగా ఉంటున్నానని సునీల్ పేర్కొన్నాడు. తన భార్య నిషా కూడా అతని నిర్ణయంతో ఏకీభవించిందని చెప్పాడు. ‘నేను నా భార్య, బిడ్డను చాలా మిస్ అవుతున్నా. కానీ మనం ఈ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇందులోని సానుకూల కోణాన్నే మనం చూడాలి’ అని సునీల్ పేర్కొన్నాడు. -
కరోనా లాక్డౌన్
-
పారిపోతాడని సంకెళ్లతో కట్టి తాళం వేస్తే..
రాంచీ : మతిస్థిమితం లేని వ్యక్తిని బంధించటానికి వేసిన సంకెళ్ల తాళం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. రాంచీ పట్టణానికి చెందిన జితేంద్ర కుమార్ అనే యువకుడికి మతిస్థిమితం సరిగాలేదు. తరచుగా ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు. దీంతో అతడి తల్లిదండ్రులు అతడ్ని సంకెళ్లతో బంధించి తాళం వేశారు. అప్పుడప్పుడు తాళం తీస్తూ ఉండేవారు. కొద్దిరోజుల కిత్రం తాళం తీసిఉన్న సమయంలో అతడు ఆ తాళాన్ని మింగేశాడు. అది కాస్తా గొంతులో అడ్డుపడటంతో ఊపిరి అందక అల్లాడసాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన డాక్టర్లు తాళాన్ని ఎండోస్కోపీ ద్వారా తీయటానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. తాళాన్ని బయటకు తీయటానికి గొంతుకు ఆపరేషన్ చేయటం ఒక్కటే మార్గమని డాక్టర్లు భావించారు. ఫిబ్రవరి 14న జితేంద్రకు ఆపరేషన్ నిర్వహించారు. విజయవంతంగా అతడి గొంతులోని తాళాని బయటకు తీశారు. 12రోజులు ఆసుపత్రిలో ఉన్న అతడు డిశ్చార్జ్ అయ్యాడు. -
పగలే పగలకొట్టేస్తారు..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పట్టపగలే ఇళ్లకు వేసిన తాళాలు పగలకొట్టి విలువైన బంగారు, వెండి వస్తువులను చోరీ చేసే నలుగురు యువకులను ధవళేశ్వరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4.80లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు స్కూటీపెప్, సీబీజెడ్ బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైం) వైవీ రమణకుమార్ వెల్లడించారు. ఈనెల 17న రాజవోలు రమాదేవిగార్డెన్స్‌కు చెందిన నండూరి పద్మావతి మధ్యాహ్నం తన ¿భర్తతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలుగొట్టి ఉండి, గదిలో బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో ఈనెల ఐదో తేదీన అడిషనల్ ఎస్పీ(క్రైం), రాజమహేంద్రవరం సౌత్‌జోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలశౌరి, ఎస్సై కేశవరావు, వారి సిబ్బంది, సీసీఎస్ ఎస్సై ఎండీ జుబేర్, వారి సిబ్బందితో కాటన్ విగ్రహం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యానాం ప్రాంతానికి చెందిన టేకుముడి దుర్గాప్రసాద్, లాలాచెరువు ప్రాంతానికి చెందిన తోణంగి సతీష్, రాజమహేంద్రవరం తుమ్మలావకు చెందిన గొర్రెల చినబాబు, కలవచర్ల గ్రామానికి చెందిన ఆదాము సతీష్‌లను అరెస్టు చేసి విచారించారు. పోలీసుల విచారణలో వారు ఈ ఏడాది చేసిన చోరీల వివరాలను వెల్లడించారు. 15ఏళ్ల ప్రాయం నుంచే... యానాంకు చెందిన టేకుమూడి దుర్గాప్రసాద్ 15ఏళ్ల వయస్సు నుంచే చిన్నచిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2016లో సైదాబాద్ జువైనెల్‌హోమ్, 2017లో చిలకలగూడ చోరీకేసులో మరోసారి సైదాబాద్ జువైనెల్‌హోమ్, అదే ఏడాది, 2018లో రాజమహేంద్రవరం జువైనెల్‌హోమ్, 2018లో సైదాబాద్ జువైనెల్‌హోమ్, 2019లో రాజమహేంద్రవరం జువైనెల్ హోమ్‌కు రెండుచోరీ కేసుల్లో వెళ్లివచ్చాడన్నారు. తోణంగి సతీష్, గొర్రెల చినబాబు చోరీ కేసుల్లో రాజమహేంద్రవరం వెళ్లారన్నారు. సమావేశంలో సౌత్‌జోన్ డీఎస్పీ విజయకుమార్, క్రైం డీఎస్పీ కుమార్, ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ బాలశౌరి, ఎస్సైలు కేశవరావు, ఎండి.జుబేర్, నిందితులను అరెస్టు చేయడంలో చొరవచూపిన పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. చేసిన చోరీలివే.. ♦ ఏప్రిల్ నెలలో విశాఖజిల్లా గాజువాక కూర్మన్నపాలెంలో ఓ ఇంటి తలుపులు పగలు కొట్టి, ఆ ఇంటిలో దొరికిన తాళంతో సీబీజెడ్ బైక్‌ను దొంగిలించారు. ♦ ఏప్రిల్ 17న రాజవోలు రమాదేవిగార్డెన్స్‌లోని ఒక ఇంటిలో బంగారపు, వెండి వస్తువుల చోరీ. ♦ మే 9వ తేదీన హైదరాబాద్‌లోని చిలకలగూడ పీఎస్ పరిధిలో ఒక తాళం వేసిన ఇంటిలో మంగళసూత్రపు తాడు చోరీ. ♦ కొత్తపేట మండలం అవిడిగ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో తాళాలు పగలుగొట్టి బంగారు, వెండివస్తువుల చోరీ. ♦ ఏప్రిల్ రెండోవారంలో రాజమహేంద్రవరం గోదావరిగట్టు వద్ద తాళంవేసిన ఇంటిలో, తాళాలు పగలు గొట్టి బంగారు వస్తువుల చోరీ ♦ ఏప్రిల్ నాలుగోవారంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు తాళం వేసి ఉన్న ఇంటిలో, తాళాలు పగలుగొట్టి బంగారు, వెండివస్తువులు చోరీ. ♦ మే మొదటి వారంలో బొమ్మూరు బిజాపురి ఏరియాలో ఒక తాళం వేసిన ఇంటిలో, తాళాలు పగలు గొట్టి నగదు, సెల్‌ఫోన్ చోరీ ♦ మే మొదటి వారంలో బొమ్మూరులో తాళం వేసి ఉన్న స్కూటీ పెప్‌ను దొంగిలించారు. చోరీ సొత్తు స్వాధీనం నిందితులు చోరీ చేసిన 148 గ్రాముల బంగారపు వస్తువులు( రూ.నాలుగులక్షలు విలువ), 2.7కిలలో వెండివస్తువులు (రూ.80వేలు)లతో పాటు, స్కూటీపెప్, ఒక సీబీజడ్ బైక్, ఒక మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఎస్పీ రమణకుమార్ తెలిపారు. వీరితో పాటు మోరంపూడి ప్రాంతానికి చెందిన పల్లపాటి దుర్గాప్రసాద్(పెట్రోలు) పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. వీళ్లందరూ పట్టపగలే చోరీ చేస్తారని, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి పగలుగొట్టి బీరువాల్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, బయట పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లిపోతుంటారన్నారు. వేసవికాలం ఇంకా ముగియనందున ప్రజలు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్) డౌన్లోడు చేసుకుని పోలీసులతో సమన్వయం చేసుకుంటేనేరాలు జరుగకుండా తాము జాగ్రత్తలు చేపడతామని అడిషనల్ ఎస్పీ రమణకుమార్ తెలిపారు. -
దొంగలూ.. 60 దాటొద్దు ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి పరిధిలో ఓ స్నాచింగ్‌కు పాల్పడిన చోరుడు పారిపోయేందుకు సిటీ బయటకు దారి తీసే రోడ్డు ఎక్కాడు. ‘డయల్–100’ ద్వారా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేవలం మూడు నిమిషాల్లోనే అతడిని గుర్తించి వెంటపడ్డారు. పారిపోవడమే పరమావధిగా పెట్టుకున్న ఆ దొంగకు రూల్స్, స్పీడ్ లిమిట్ ఉండవు కదా..! అయితే మన పోలీసు వాహనం మాత్రం అధికారులు విధించిన ‘పరిమితి’ నేపథ్యంలో గంటకు 60 కిమీ వేగాన్ని దాటలేదు. ఫలితంగా అతను చూస్తుండగానే కనుమరుగయ్యాడు. ♦ సైబరాబాద్ ఉన్నతాధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయం కారణంగా భవిష్యత్తులో తరచూ ఇలాంటి సీన్లు ఎదురుకావచ్చు. ‘రోగమొక చోట.. మందొక చోట’ అన్న చందంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఇటీవల చోటు చేసుకున్న పోలీసు వాహనాల ప్రమాదాల నేపథ్యంలో ‘కీలక నిర్ణయం’ తీసుకున్నారు. ఏసీపీ స్థాయి అధికారులు వినియోగించే వాటి సహా ఏ వాహనమూ గంటకు 60 కిమీ మించకుండా లాక్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, డ్రైవింగ్‌లో లోపాలను సరి చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని వారు వాపోతున్నారు. ప్రమాదం పై యాక్షన్... గత నెల మూడో వారంలో రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున విధుల్లో ఉన్న వాహనానికి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పి ఫల్టీకొట్టింది. ఫలితంగా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు ముందూ ఇలాంటివి సైబరాబాద్‌లో చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మాత్రం డ్రైవర్‌తో పాటు ముగ్గురిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన హోంగార్డు డ్రైవర్, పక్కనే ఉన్నందుకు కానిస్టేబుల్, వెనుక కూర్చున్న సబ్–ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నారు. చోటు చేసుకున్నది ప్రమాదం అయినప్పుడు అసలు డ్రైవర్ పైనే చర్యలు తీసుకోకూడదు. అలాంటిది అతడితో పాటు పక్కన, వెనుక కూర్చున్న వారి పైనా వేయడం విమర్శలకు తావిస్తోంది. కొత్తవి ఇచ్చినా ప్రయోజనం శూన్యం... కమిషనరేట్ పరిధిలో తరచూ పోలీసు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు భావించారు. దీంతో గస్తీ వాహనాలు, ఇన్స్పెక్టర్లు వినియోగించే వాటితో పాటు ఏసీపీలు వాడే వాహనాలకు స్పీడ్ లాకింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణం దానిని అమలులోకి తీసుకువస్తూ ఆయా వాహనాలు గరిష్టంగా గంటకు 60 కిమీ వేగం మించి ప్రయాణించకుండా ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నగరంలో ఇలాంటి నిర్ణయం సమంజసమే అయినా.. దూరంగా విసిరేసినట్లు ఉండే కాలనీలు, సువిశాలమైన రోడ్డు, ఎటు చూసినా హైవేలతో కనెక్టివిటీ కలిగి ఉండే సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇలాంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పోలీసు అధికారులకు కొత్తగా హైఎండ్ వాహనాలు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశమే వారి కదలికల్లో వేగం పెంచాలని, మరింత సమర్థంగా పెట్రోలింగ్ జరగాలని. అలాంటప్పుడు ఈ లాకింగ్ చేస్తే ఫలితం ఏముంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోపాలు యథాతథం.. ప్రమాదాలు తదితర ఉదంతాలు చోటు చేసుకోవడానికి కారణమవుతున్నా వ్యవస్థాగత లోపాలకు విడిచిపెట్టి పైపై చర్యలతో ఫలితాలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పోలీసు విభాగంలో వాహనాల సంఖ్య పెరిగినంత వేగంగా, ఆ స్థాయిలో డ్రైవర్ పోస్టుల సంఖ్య పెరగట్లేదు. ఫలితంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ తెలిసిన హోంగార్డు, ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగానికి చెందిన వారే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ, నైపుణ్యం ఉండట్లేదు. దీనికి తోడు గస్తీ వాహనాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సమయాలను బట్టి ఒక్కోసారి నిర్విరామంగా 12 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తుంది. అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా ఉండే వారికి కాస్తా విశ్రాంతి దొరికే అవకాశం ఉన్నా గస్తీ వాహనాలను డ్రైవ్ చేసే వారికి ఆ అవకాశమూ ఉండదు. దీనికి తోడు ప్రధానంగా వేళగాని వేళల్లో డ్రైవింగ్ చేస్తున్న వారికి ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటోంది. డ్రైవర్లు సం ఖ్య పెంచడం, డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం తదితర అసలు లోపాలను సరిచేయడం మానేసి వాహనాలు స్పీడు తగ్గిస్తే మొదటికే మోసం వస్తుందనే వాదన వినిపిస్తోంది. -
ఏటీఎంకు తాళం వేసి కీ మరిచారు..
హైదరాబాద్: బ్యాంకు ఆవరణలోని ఏటీఎంలో డబ్బులు భద్రపరిచిన బ్యాంకు అధికారులు మిషన్‌కు తాళం వేసి.. కీని మాత్రం మరిచిపోయారు. తార్నాక విజయపురిలోని ఎస్బీఐ లాలాగూడ బ్రాంచ్‌లో 2 ఏటీఎం మిషన్లతో పాటు ఒక మనీ డిపాజిట్ మిషన్‌ను గతంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి బ్యాంకు అధికారులు ఏటీఎం మిషన్లలో డబ్బులు భద్రపరిచేందుకు తాళాలు తీశారు. డబ్బులు మిషన్లలో పెట్టిన తర్వాత మిషన్‌కు తాళం వేసి.. కీని మాత్రం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. డబ్బు లు డ్రా చేసేందుకు వెళ్లిన స్థానికులు ఏటీఎంకు తాళం కీ అలాగే ఉండటాన్ని గమనించి పోలీసు లకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీçసులు తాళం కీని స్వాధీనం చేసుకున్నారు. శనివారం సెలవు కావడం, బ్యాంకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అధికారులను రప్పించేందుకు పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత బ్యాంకు అధికారులు వచ్చి కీని స్వాధీనం చేసుకున్నారు. -
పాఠశాలకు తాళం!
జలదంకి: మండలంలోని జమ్మలపాళెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల భవనానికి గురువారం తాళం పడింది. పాఠశాలకు నూతన భవనం మంజూరై నిర్మాణ పనులు పూర్తి కావడంతో నూతన భవనాన్ని బుధవారం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కొండారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ సుజాత ప్రారంభించారు. ఇది జమ్మలపాళెం సర్పంచ్ నక్కా మాధవరావుకు కోపం తెప్పించింది. ప్రొటోకాల్ ప్రకారం సర్పంచ్‌ను పిలవకుండా ప్రారంభించడంతో పాఠశాల భవనానికి సర్పంచ్ తాళం వేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరండాలోనే చదువులు కొనసాగించాల్సి వచ్చింది. శుక్రవారం కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు వరండాలోనే చదువులు కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. టీడీపీ సర్పంచ్ కావడంతో అధికారం ఉపయోగించి తిరిగి పాఠశాల భవనాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం వల్ల విద్యార్థులు వరండాలో చదువులు కొసాగించాల్సి వచ్చింది. -
విఠూ తాళంచెవి పోయింది
బండోడ్కర్ అన్నగారు గోవా ముఖ్యమంత్రి అయ్యారు చూడు, అప్పుడు విఠూ అన్నాడు, ‘ఇది మాత్రం మంచికి అవలేదు కదా!’. విఠూ తన తాళాల గురించి అన్నాడు. ముఖ్యమంత్రి సంగతి కాదు. అదే సమయంలో అతని తాళం చెవి పోయింది. విఠూ దగ్గర ముందు తలుపుది, బయట గదిది, లోపలి గదులవి, కబోర్డు సొరుగువి, మేజాబల్ల సొరుగువి, పెట్టెది, అల్మారాది, ట్రంకు పెట్టెలవి, భోషాణంది.. ఇలా అన్నీ కలిపి పద్నాలుగు తాళాలు ఉండేవి. వాటిలో అల్మారా తాళం తరచూ పోతుండేది. బయట గదిది, మేజాబల్ల సొరుగువి, ట్రంకుపెట్టెలవి వారం, పక్షం రోజులకొకసారి, కబోర్డు సొరుగు తాళాలు మూడు నెలలకి రెండుసార్లు (కనీసం) పోతూ ఉండేవి. ఎప్పుడూ పోనిది భోషాణంది. ఈసారి అదే పోయింది.నిజానికి విఠూని వెర్రిబాగుల వాడంటారు. కొద్దిగా మందమతి, చాదస్తం కూడా ఉంది. ఏ వస్తువైనా ఎక్కడ పెట్టాడో ఎప్పుడూ జ్ఞాపకం ఉండదు. అందులో ఈ తాళంచెవి ఎంతదని? చిటికిన వేలంత. అదిపోతే ఎలా దొరుకుతుంది? తాళంచెవి పోయిందని తెలిశాక విఠూ ఇల్లంతా వెతికాడు. ముందు బయట గదిలో వెతికాడు. గదిలో మేజాబల్ల, మేజా సొరుగు వెతికాడు. కుర్చీల మీద వెతికాడు. గోడమీద మేకులు, గోడమూలల్లో ఉన్న చిన్న షెల్ఫ్‌లు వెతికాడు. వసారా వెతికాడు. మూలమూలల్లోని అల్మారాల సొరుగులు వెతికాడు. అల్మరాలో బట్టలు వెతికాడు. ప్యాంటు, లాగు చొక్కాల జేబులు వెతికాడు. వంటగది వెతికాడు. గిన్నెలు, తపేలాలు, ఇత్తడి సామాను, కంచాలు, చెంచాలు, గరిటలూ, గంగాళాలూ అన్నీ క్షుణ్ణంగా వెతికాడు. వంటగదిలోని షెల్ఫ్ కూడా వెతికాడు. మేడమెట్లు వెతికాడు. పడకగది వెతికాడు. గదిలో దిండ్లు, దిండు కవర్లూ, గలీబులూ, దుప్పట్లు అన్నీ వెతికాడు. అన్నీ వెతికిన తర్వాత భార్యకు చెప్పాడు, తాళంచెవి పోయిందని. భార్యకు బాధగా అనిపించింది. విఠూ వెతికిన ప్రతిచోటా తను మళ్లీ వెతికింది. విఠూ ఆ తర్వాత తల్లితో చెప్పాడు, తాళంచెవి పోయిందని. ఆవిడ కూడా విఠూ, విఠూ భార్య వెతికిన ప్రతిచోటులోనూ మళ్లీ వెతికింది. విఠూకి తల్లి మీద జాలేసింది. తల్లికి విఠూ మీద జాలేసింది. విఠూ భార్యకి విఠూ మీద, విఠూ తల్లి మీద జాలేసింది. విఠూకి ఇద్దరు పిల్లలు. పాటూ, తీటూ. తాళంచెవి పోయిన సమయంలో పాటూ పాటలు పాడుతున్నాడు. తీటూ గెంతులేస్తున్నాడు. విఠూ పాటూతో అన్నాడు, ‘‘ఏం దరిద్రపు జాతిరా మీది’’. పాటూ అడిగాడు – ‘‘ఏం జరిగింది?’’‘‘తాళం చెవి పోయింది.’’‘‘నేనేం చేయను?’’‘‘ఏడువ్.’’‘‘ఏడిస్తే దొరుకుతుందా?’’‘‘అవును.’’ఇది తీటూ విన్నాడు. ఇద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. విఠూ హఠాత్తుగా లేచాడు. ‘‘అరే! పాట పాడుతున్నార్రా’’ అని అడిగాడు. పాటూ, తీటూ ఏడుస్తుంటే పాట పాడుతున్నారా అనిపిస్తుంది. విఠూ కోపంతో లేవడంతో వాళ్లు పాపం నోరు మూసుకున్నారు. తాళంచెవి పోయిన విషయం విఠూగాడి భార్య పక్కింటావిడకి చెప్పింది. ఆవిడ మరొకరికి చెప్పింది. ఆవిడ మూడో మనిషికి చెప్పింది. ఆవిడ నాల్గవ మనిషికి, ఆవిడ ఐదవ వ్యక్తికి చెప్పింది. పాటూ, తీటూ ఈ కబురు తబ్లు, గిబ్లూలకి చెప్పారు. ఆ తర్వాత వీళ్లు వాళ్లకి, వాళ్లు వీళ్లకి, వాళ్లు మరొకరికి, మరొకరు మరొకరికి చెప్పారు. క్రమేణా ఈ కబురు అందరికీ తెలిసింది.కొందరు విఠూని విచారించడానికి వచ్చారు. విఠూగాడి భార్యను పరామర్శించడానికి కూడా చాలామంది వచ్చారు. ఆమె ఈ మధ్యనే నెల తప్పింది. గర్భవతి. ఎవరు తాళంచెవి విషయం కూపీ తీయడానికి వచ్చారో వాళ్లు తాళంచెవి ఎలా పోయిందిరా అని విఠూని అడిగారు. అప్పుడు విఠూ అది ఈ విధంగా పోయిందని వాళ్లకి చిలవలు పలవలుగా కథలల్లి చెప్పాడు. అందరికీ చెప్పేవాడు. ‘‘నిన్న నేను పొద్దున్న లేచాను సరే, టీ తాగాను సరే, భోజనం చేశాను సరే, స్నాన పానాలు పూర్తి చేశాను సరే, బయటికి వెళ్లాను సరే, ఇంటికి తిరిగొచ్చాను సరే, భోంచేసి నిద్రపోయాను సరే, ఈవేళ పగలు నిద్రలేచాను సరే, టీ తాగాను సరే, స్నానం చేశాను సరే, రేడియోలో బండోడ్కర్ ముఖ్యమంత్రి అయినట్లు విన్నాను సరేనా... అప్పుడు అకస్మాత్తుగా చూసినప్పుడు...’’విఠూగాడి బావ తన భార్యతో... అంటే విఠూ చెల్లెలితో విఠూ ఇంటికి వచ్చాడు చూడు, అప్పుడు విఠూ భార్య ఏడుస్తోంది, కడుపులో మండుతోందని. విఠూ తల్లి చెబుతోంది – ‘‘నేను విఠూకి చెప్పాను. దాని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని. కానీ ఈ పాపిష్టివాడు నా మాట వినలేదు. ఊరికే పనికిరాని హడావుడి చేయడం వీడికి అలవాటు’’.‘‘కానీ ఈవిడకి ఇలా బాధ కలగడం ఎప్పట్నుంచి ప్రారంభమైంది?’’ విఠూగాడి చెల్లెలు తల్లిని అడిగింది.‘‘అయ్యో! ఏమని చెప్పను నీకు. ఈవేళ పగలు లేచాం సరేనా, రేడియో వేశాం సరేనా, బండోడ్కర్ ముఖ్యమంత్రి అయ్యాడనే వార్త విన్నాం సరేనా, అప్పుడే విఠూ బయటికి వచ్చి నాతో అన్నాడు, ‘అమ్మా ఘోరం జరిగింది’ అని. నా గుండెల్లో రాయి పడింది. దీనికి ఇప్పుడిప్పుడే నెల తప్పింది కదూ? అరే పాపాత్ముడా ఏం జరిగిందిరా? అనడిగా. విఠూ చెప్పాడు తాళంచెవి పోయిందని. సరిగ్గా అప్పుడే దీని ఈ....’’బావగారూ, ఆయన భార్య ఈ విషయం అలాగే వదిలేసి తిరిగెళ్లిపోయారు. రోజంతా జనం వస్తున్నారు. మొగాళ్లు వచ్చినప్పుడు అదే విషయం, అదే పద్ధతిలో విఠూ వాళ్లకి చెప్పాడు. ఆడవాళ్లు వచ్చినప్పుడు అదే విషయం, అలాగే అతని తల్లి చెప్పింది. వచ్చిన వాళ్లందరికీ విఠూ భార్య తన కడుపునొప్పి గురించి చెప్పి ఏడుస్తూ కూర్చునేది. మూడురోజులు గడిచాయి. విఠూ దేవుడి గుడికి వెళ్లాడు. అక్కడ కీర్తన జరుగుతోంది. హరిదాసు వచ్చీరాని మరాఠీ భాషలో చెబుతున్నాడు – ‘‘ఏం చెప్పను దేవుడా! ఈ ప్రపంచమంతా పెద్ద పద్మవ్యూహం. క్లిష్ట సమస్య. ఏ రోజు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ రోజు ఎవరిదో తాళంచెవి పోతుంది. రేపు వాడి పెళ్లాం పోతుంది. ఎల్లుండి వాడి పిల్ల పోతుంది. ఆ తర్వాత వాడే పోతాడు... అందుకనే ‘నేనెక్కడికి వెడితే అక్కడికి నువ్వు నీడలా వస్తావు’ అని భక్తతుకారాం అన్నాడు’’. విఠూకి బెంగ పట్టుకుంది. ఈవేళ కేవలం తాళంచెవి పోయింది. రేపు నేనే పోతే? నా భార్య పోతే? విఠూ లేచి దేవుడికి నమస్కారం చేశాడు. పూజారి తన సమస్య ఏమిటని అడిగాడు. ఆ తర్వాత పూజారి దేవుణ్ణి ఉద్దేశించి అన్నాడు, ‘‘భగవంతుడా! ఈవేళ ఈ విఠూ ప్రత్యేకంగా నీ దర్శనానికి నీ శరణుకోరుతూ వచ్చాడు. వాడికి ఆ పోయిన తాళంచెవి త్వరగా దొరికేలా చూడు. ఆ తర్వాత అతను నీకు పంచదారతో తులాభారం చేస్తాడు’’. విఠూ మనఃపూర్వకంగా మొక్కుబడి ఇస్తానని ప్రార్థించాడు. పూజారవిఠూకి చెప్పాడు, ‘‘దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు చేయకపోతే ఆ పని నా సోదరుడు చేస్తాడు’’.పూజారి తమ్ముడు జ్యోతిష్యుడు. విఠూ అతడితో చెప్పాడు. అన్నీ విన్నాక అతడు విఠూని అడిగాడు ‘‘నక్షత్రం ఏమిటో తెచ్చావా?’’‘‘ఎవరిది?’’‘‘తాళం చెవిది’’‘‘లేదు. దాని నక్షత్రం నేను చేయించలేదు.’’‘‘అయితే అది ఎక్కడికి చేరిందో ఎలా చెప్పను?’’విఠూ నోరెత్తలేదు.‘‘తాళం ఎప్పుడు చేయించావు?’’‘‘అయిదేళ్లు గడిచాయి’’‘‘నెల?’’‘‘మార్గశిర మాసంలో!’’‘‘తిథి?’’‘‘ఏకాదశి’’‘‘రోజు?’’‘‘సోమవారం’’‘‘సమయం?’’‘‘తాళాలు చేసేవాడు ఆ తాళం నాకు పగలు పది గంటలకి ఇచ్చాడు.’’తాళం సమగ్ర ఆకారం, రంగు రూపాలూ వగైరా వివరాలు విఠూ దగ్గర వివరంగా అతను అడిగాడు. ఆ తర్వాత ఆ తాళంచెవి నక్షత్రం ప్రకారం లెక్కలు వేశాడు. కళ్లు చిన్నవి చేసి, తదేక దృష్టితో సూక్ష్మంగాఆలోచించాడు. వేళ్లతో ఏవో లెక్కలు వేశాడు. ఆ తర్వాత అంతరాళంలోకి దృష్టి కేంద్రీకరించాడు, ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నట్టు. అప్పుడన్నాడు, ‘‘నీ తాళం చెవి దక్షిణ దిక్కుగా పోతోంది’’.‘‘కానీ దానికి కాళ్లు లేవు. అది ఎలా నడుస్తుంది?’’ విఠూ ఆత్రుతగా అతణ్ని అడిగాడు.‘‘చొప్పదంటు ప్రశ్నలు అడగవద్దు’’‘‘అడగనులే. కానీ నాకొక సంగతి చెప్పు. నా ఈ తాళం చెవి దొడ్డిదారిలోని తోటలో ఉందా? ఊరి ఏటి ఒడ్డున ఉందా? కణ్కోణాలోని మూడుదార్ల కూడలి దగ్గర ఉందా? లేక కన్యాకుమారిలో వివేకానందుకి స్మారక స్థలంలో ఉందా?’’‘‘నాకు నీ ప్రశ్నలకి అర్థం తెలియడంలేదు’’‘‘నువ్వు నా తాళం చెవి దక్షిణ దిక్కులో పోతోందన్నావు. ఆ దక్షిణం ఎక్కడిది? ఇంటిదా? ఊరుదా? గోవాదా? లేక భారతదేశందా?’’‘‘ఈ వివరాలన్నీ నేను నీకు చెబితే నా జ్యోతిష్యంలో మిగిలేదేముంది?’’అప్పుడే గుడిలోంచి పూజారి అక్కడికి వచ్చాడు. అతను విఠూతో అన్నాడు, ‘‘మా తమ్ముడు పది రూపాయలకి ఇంతకంటే ఎక్కువ జ్యోతిష్యం చెప్పడు’’.విఠూ తిట్టుకుంటూ అతనికి పదిరూపాయలిచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భోజనానికి కూర్చుంటుండగా, బయట తలుపు చప్పుడయింది. ఒక పోలీసువాడు లోపలికి ప్రవేశించాడు. ‘‘నీ తాళం చెవి పోయిందంటగా?’’ విఠూని అతనడిగాడు.‘‘అవును, నీకెవరు చెప్పారు?’’‘‘నీ పక్కింటి వాళ్లు’’‘‘అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావా?’’‘‘ఈ పని మేం చేయకపోతే, మరెవ్వరు చేస్తారు? పోలీసులంటే లోకులసేవ చేసేవాళ్లు..’’విఠూ రెండు నిమిషాలు ఆ పోలీసుని చూస్తూ నిలబడ్డాడు. అలనాటి రామరాజ్యంలోని భటుడు పోలీసు రూపంలో పొరబాటున ఇక్కడికి వచ్చాడా అనుకున్నాడు. ‘‘సరే ఆ తాళంచెవి ఇప్పుడు నాకెలా లభిస్తుంది?’’ విఠూ అడిగాడు.‘‘కంప్లెయింట్ రాసివ్వు.’’‘‘ఏమని?’’‘‘తాళంచెవి ఎవరో దొంగిలించారని. నీకెవ్వరి మీదైనా అనుమానం ఉంటే వాళ్ల పేరు రాయి.’’‘‘కానీ నా తాళం పోయింది. దాన్ని ఎవరో దొంగిలించారని నాకు అనిపించడంలేదు.’’‘‘ఆ తాళం ఎక్కడోపోతే దాన్ని వెతకడం మా పనికాదు. ఎవరైనా దొంగిలిస్తే పట్టుకోవడం మా విధి.’’‘‘సరే, ఫిర్యాదు రాసిస్తే అది దొరుకుతుందా?’’‘‘ప్రయత్నించడం మా కర్తవ్యం. దొరుకుతుందో, లేదో మేమెలా చెప్పగలం? రేపు ఎవరైనా వచ్చి మంత్రిగారిని ఎత్తుకుపోయినా, ఆయన మాకు తప్పక దొరుకుతాడని చెప్పలేం’’ ఆ పోలీసువాడు నిక్కచ్చిగా చెప్పాడు. విఠూ అతను చెప్పిన ప్రకారం ఫిర్యాదు రాసిచ్చాడు. మళ్లీ అతణ్ని అడిగాడు – ‘‘నీకెవరు చెప్పారు? నా తాళం చెవి పోయిందని?’’‘‘ఆ విషయం అంత ముఖ్యం కాదు. పోయిన తాళం వెతకడం ముఖ్యమైన విషయం.’’ అంటూ వాడు బయటికి వెళ్లిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత విఠూ విసిగెత్తిపోయాడు. వెళ్లి పక్కమీద విశ్రాంతి తీసుకున్నాడు.ప్రపంచమంతా నరకం. కానీ, నాకేం పట్టిందని గాఢ నిద్రలో మునిగిపోయాడు. పొద్దున్న లేచి బయట వసారాలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడతనికి రోడ్డుమీద ఎవరో కనిపించారు. అతను శుక్రనక్షత్రంలాగా కనబడ్డాడు. బ్రహ్మదేవుడిలా మాట్లాడుతున్నాడు. అతను విఠూని చూసిన వెంటనే అడిగాడు, ‘‘నీ తాళం చెవి పోయింది కదూ?’’‘‘అవును.’’‘‘అది దొరుకుతుంది.’’‘ఎలా దొరుకుతుంది?’’‘‘సరిగ్గా వెతికితే దొరుకుతుంది.’’‘ఎలా?’’‘‘తాళం చెవి పోవడం అన్నది ఒక క్రియ. అంటే ఒక సంఘటన. ఏదైనా సంఘటనకి, అది జరగడానికి ముందు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఆ సంఘటన జరగదు. ఒక సంఘటనకి ఒకే కారణం ఉంటుందని చెప్పలేం. ఎన్నో కారణాలు ఉండొచ్చు.’’‘‘అంటే అర్థం?’’‘‘ఈ కారణాలు వెదకాలి’’‘‘ఆ తర్వాత తాళం చెవి దొరుకుతుందా?’’‘‘ఎలా పోయిందో తెలుస్తుంది.’’‘‘తెలిసి ఉపయోగం ఏమిటి?’’‘‘తెలియడంతో వెతకడం సులువవుతుంది.’’‘‘కానీ ఈ రెట్టింపు పని ఎందుకు? కారణాలు వెతికే బదులు నేను తాళం చెవినే వెతుకుతాను.’’‘‘దొరకదు.’’‘‘ఎందుకు దొరకదు?’’‘‘దొరికితే నువ్వు నన్ను ఇబ్బందిలో పెడ్తావు.’’‘‘ఎలా?’’‘‘కారణాలు వెతక్కుండానే నీకు తాళం చెవి లభ్యమైతే, అదెలా జరిగిందా అని నేను కారణాలు వెతకాల్సి వస్తుంది.’’‘‘సరే. కారణాలు ఎలా వెతకాలో మీరే నాకు కాస్త చెప్పి చూడండి బాబూ.’’‘‘తాళం చెవి పోయింది అంటే ఏమయింది అన్నమాట ముందు నాకు చెప్పు చూద్దాం.’’‘‘నాకు తెలియదు. మీరే చెప్పండి’’‘‘తాళం పోయింది అంటే ఉన్న తాళం అదృశ్యం అయిపోయింది. అది దొరక్కపోవడానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు. ఊదాహరణకి: నువ్వు తాళం ఎక్కడ పెట్టావో నీకు జ్ఞాపకం లేదు గనుక అది నీకు దొరకలేదు. నువ్వు తాళం ఎక్కడ పెట్టానని అనుకుంటున్నావో అక్కడ నిజానికి పెట్టలేదు. అందుకని అది నీకు దొరకలేదు.నువ్వు తాళం పెట్టినచోటు నీకు జ్ఙాపకం ఉంది. కానీ అది అక్కడలేదు అందువల్ల దొరకలేదు.నువ్వు తాళం ఎక్కడ పెట్టావో, అక్కడే ఉంది. అయితే ఆ చోటు నీకు జ్ఞాపకం రావడంలేదు. అందువల్ల అది దొరకడంలేదు....’’విఠూకి అనిపించింది, మంత్రిగారు తన ప్రసంగంలో ప్రతి విషయాన్నిఎలా తిమ్మిని బమ్మిని చేసి విశ్లేషించి జనపనారలా అల్లుతాడో అలా వీడెవడో జ్ఞాని.విఠూ అతనితో నిష్టూరంగా అన్నాడు, ‘‘మిగిలిన కారణాలు నేను వెతికి తీస్తాను. మీరిక్కడ మరికొంతసేపు ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత ఆ తలనొప్పి ఎందుకొచ్చిందా అని కారణాలు వెతకాల్సి వస్తుంది.’’అతను వెళ్లిపోయిన తర్వాత విఠూ స్నానం చేశాడు. ఆ తర్వాత పది, పదిన్నర ప్రాంతాలకి గోవా సచివాలయానికి వెళ్లాడు. ముఖ్యమంత్రి పీఏని కలిసి విషయం పూర్తిగా చెప్పి, తను ముఖ్యమంత్రిగారిని కలవాలని కోరాడు. మరో నెలన్నర వరకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, అన్ని అపాయింట్మెంట్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తెలియగానే పూర్తయ్యాయని చెప్పాడు పీఏ.‘‘ఇప్పుడు నేనేం చెయ్యను?’’ విఠూ అతణ్ని అడిగాడు.‘‘అన్నగారింటికి వెళ్లు’’ అతనన్నాడు.మర్నాడు పొద్దున్న విఠూ, బండోడ్కర్ అన్నగారింటికి వెళ్లాడు. అక్కడ ఎంతోమంది జనం ఉన్నారు. అయినా విఠూని అంతమందిలోనూ గుర్తుపట్టి అన్నగారు అందరికంటే ముందు ఇంట్లోకి పిలిచి ఏంపనిమీదవచ్చాడో విచారించారు. విఠూ ఆయనకి పోయిన తాళం చెవి గురించి చెప్పాడు. తాళం చెవి పోయినట్లు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు, వాళ్లు ఈ విషయం లక్ష్యపెట్టనట్టు కూడా చెప్పాడు.‘‘అంటే నీ పోయిన తాళం చెవి వెతకమని పోలీసులకి నేను చెప్పనా? వాళ్లకి వేరే పనేం లేదా?’’ బండోడ్కర్ అన్నగారు మండిపడ్డాడు.‘‘అలా కాదు.. నా ఆ.. తాళం... చాలా...’’ విఠూ భయంతో తడబడుతూ ఏదో అంటున్నాడు.‘‘సరేగానీ దాని వెల ఎంత ఉంటుంది?’’‘‘నాకు తెలియదు.’’అన్నగారు లేచి లోపలికి వెళ్లారు. ‘ఆయనకి కోపం రాలేదు కదా!’ అనుకున్నాడు విఠూ. కొంతసేపటికి ఆయన బయటకొచ్చి, ‘‘ఇదిగో తీసుకో డబ్బు’’ అంటూవిఠూ చేతిలో కరెన్సీ నోట్లదొంతర్లు ఉంచి, ‘‘కొత్త తాళం చెవి చేయించుకో’’ అంటూ సాగనంపాడు.విఠూ ఇంటికి వచ్చి అన్నగారిచ్చిన నోట్లు లెక్కపెడుతూ కూర్చున్నాడు.చూస్తే, అన్నగారిచ్చిన ఆ డబ్బు ఎంత ఉందంటే దానితో బంగారపు తాళం చెవి కూడా చేయించుకోవచ్చు. కొంకణీ మూలం : ఆనా మహాంబ్రె అనువాదం: శిష్టా జగన్నాథరావు -
విధుల్లో చేరేందుకు వచ్చిన ఎంపీడీఓకు షాక్
చీమకుర్తి రూరల్: సంతనూతలపాడు ఎంపీడీఓగా విధుల్లో చేరేందుకు వచ్చిన సీహెచ్ కృష్ణకు స్థానిక ఒక వర్గం నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన విధుల్లో చేరాల్సిన ఎంపీడీఓ గదికి కావాలనే తాళం వేసి ఉండటంతో చేసేది లేక సూపరింటెండెంట్ గదిలోనే బాధ్యతలు స్వీకరించారు. మద్దిపాడు ఎంపీడీఓగా పనిచేస్తున్న సీహెచ్ కృష్ణ మద్దిపాడు మండలంలో రెగ్యులర్ ఎంపీడీఓగా పనిచేస్తూనే సంతనూతలపాడు మండలానికి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జెడ్పీ సీఈఓ నియమించారు. అప్పటి వరకు ఇన్చార్జి ఎంపీడీఓగా పనిచేస్తున్న తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ తాను విధులు నిర్వర్తించలేనంటూ సెలవు పెట్టి వెళ్లిపోవడంతో మద్దిపాడు నుంచి నియమించారు. ఎంపీడీఓ విధుల్లో చేరేందుకు వచ్చే సమయానికి ఒక్క సీనియర్ అసిస్టెంట్ తప్ప మిగిలిన స్టాఫ్ ఎవరూ లేకుండా ముందుగానే వెళ్లిపోయారు. అంతే కాకుండా కొత్తగా ఎంపీడీఓ వస్తున్నట్లు ఎంపీపీకి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. మండలంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో ఎంపీడీఓలు తరుచూ బదిలీలపై వెళ్లాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలల్లో ఇప్పటి వరకు నలుగురు ఎంపీడీఓలు మారటమే ఆధిపత్యపోరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిన్నమొన్నటి వరకు తర్లుబాడు ఎంపీడీఓ శ్రీకృష్ణ ఇన్చార్జి ఎంపీడీఓగా విధులు నిర్వహించారు. ఆయనకు ముందు బాలచెన్నయ్య నిర్వహించారు. ఆయనకు ముందు మాలకొండయ్య స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు మరుగుదొడ్లలో అవినీతి జరిగిందని కోర్టుకు వెళ్లి మరీ సస్పెండ్ చేయించారు. ఇలా వరుసగా నలుగురు ఎంపీడీఓలు మారడంతో స్థానిక నాయకులు జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. పింఛన్ల సమస్య పరిష్కారం కొత్తగా విధు ్చyజ్చి చేరిన ఎంపీడీఓ సీహెచ్ కృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 543 పింఛన్లను త్వరలో పరిష్కరించి పంపిణీ చేస్తానని చెప్పారు. మద్దులూరు గ్రామానికి చెందిన ఒక సీనియర్ మేట్‌ను విధుల్లో చేర్చుకున్నారు. వేసవి కాలంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటానని ఎంపీడీఓ తెలిపారు. -
36 కార్పొరేట్ కాలేజీలకు తాళం
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులను నిర్వహిస్తున్న 36 కార్పొరేట్ కాలేజీలకు శుక్రవారం ఇంటర్ విద్యా అధికారులు తాళాలు వేశారు. తనిఖీల్లో ఆయా కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి కావడంతో నోటీసులు జారీ చేసి బంద్ చేయించారు. మేడ్చెల్ జిల్లాలో 13, హైదరా బాద్‌లో 15, రంగారెడ్డి జిల్లాలో 8 కాలేజీలకు తాళాలు వేశారు. -
47 ఏళ్ల పాటు ఐఫోన్‌కు లాక్
షాంఘై : పిల్లలు స్మార్ట్ఫోన్లకు ఇటీవల ఎంతగా అతుకుపోతున్నారంటే... సెల్ఫీలు తీసుకోవడం దగ్గర్నుంచి గేమ్స్ ఆడుకోవడం వరకు అన్ని కూడా పిల్లలు స్మార్ట్ఫోన్లలోనే చేస్తున్నారు. ఇలా తీవ్రస్థాయిలో ఆకర్షితులవుతున్న పిల్లల అమాయకపు చర్యలతో వారి పేరెంట్స్ కూడా భారీ మొత్తంలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చైనాలో ఓ రెండేళ్ల పాప తమ తల్లి ఐఫోన్‌ను ఏకంగా 47 ఏళ్ల పాటు ఎందుకు పనికి రాకుండా లాక్ చేసేసింది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదేంటి 47 ఏళ్ల పాటు ఎలా లాక్ చేస్తారు అనుకుంటున్నారా? తప్పుడు పాస్వర్డ్ కొట్టిన ప్రతీసారి లాకింగ్ సమయం పెరుగుతూ వెళ్తోంది. ఇలా ఆ పాప చేసిన పనికి 25 మిలియన్ నిమిషాల పాటు ఫోన్ లాక్ అయిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం... ఎడ్యుకేషన్ వీడియోలను చూడటానికి లూ అనే మహిళ తన పాపకు ఐఫోన్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆ మహిళకు పనికిరాకుండా పోయిన ఐఫోన్ కనిపించింది. లాక్ విప్పేందుకు రెండు నెలల పాటు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో చివరకు ఐఫోన్ స్టోర్‌ను ఆశ్రయించింది. ఏకధాటిగా తప్పుడు పాస్‌వర్డ్‌ను పదే పదే టైప్ చేయడం వల్ల ఫోన్ లాక్ అయిందని స్టోర్ కీపర్ అసలు విషయం చెప్పేశాడు. ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి మొత్తం డేటా తీసేస్తే తప్ప ఐఫోన్ పనిచేయదని తెలిపాడు. తన రెండేళ్ల కూతురు పదే పదే తప్పుడు పాస్వర్డ్ టైప్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగిందని లూ గుర్తించింది. చైనాలో ఇలాంటి ఘటనే అంతకముందు కూడా చోటు చేసుకుంది. ఇదే కారణంతో మరో ఐఫోన్ ఏకంగా 80 ఏళ్ల పాటు పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
ముదినేపల్లిరూరల్(కైకలూరు) : మండలం లోని పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంలో గురవారం మధ్యాహ్నం తాళం వేసివున్న ఇంట్లో చొరబడిన దొంగలు రూ.2.5 లక్షల వివులైన సొత్తును చోరీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పెదగొన్నూరు గ్రామానికి చెందిన గునుపూడి నాగరాజు, జయలక్ష్మి దంపతులు. వారి కుమారుడు గుడ్లవల్లేరు కాలేజీలో చదువుతున్నాడు. గురువారం జయలక్ష్మి పొలానికి, కుమారుడు కళాశాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో నాగరాజు కూడా ఇంటికి తాళం వేసి గుడివాడ వెళ్లారు. జయలక్ష్మి పొలం నుంచి ఇంటికి వచ్చే సరికి తలుపు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. అనుమానంతో లోనికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 6 కాసుల బంగారు నగలు, రూ.50 వేల నగదు కనిపించలేదు. నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలాన్ని పరిశీలిచాయి. ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖజానాకు తాళం
►లావాదేవీలన్నీ ఫ్రీజ్ ►నిధులన్నీ ఉప ఎన్నిక ప్రాంతాల్లోనే ఖర్చు ►ట్రెజరీల్లో పేరుకు పోయిన రూ.కోట్ల బిల్లులు ►నిలిచిన రోజువారీ పనులు ►ఆర్థిక శాఖ అనుమతుల కోసం అధికారుల ఎదురుచూపులు ►సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ‘‘మీ చెక్కు చెల్లలేదు...డబ్బులిస్తేనే డీజిల్ వేస్తాం’’ - టోకెన్ తీసుకుని డీజిల్ కోసం వెళ్లిన ధర్మవరం మున్సిపాలిటీ కార్మికులకు పెట్రోలు బంకు యజమాని చెప్పిన మాటలివి. ‘‘వారం రోజులు టైమివ్వండి ...తొందర్లోనే బిల్లులు చెల్లిస్తాం...’’ - ట్రాన్స్‌కో అధికారితో ఓ మున్సిపాలిటీ ఉన్నతాధికారి విన్నపం ‘‘ట్రాక్టర్ రిపేరీ వచ్చి వారం రోజులైంది...అడిగితే డబ్బుల్లేవంటున్నారు...నేనేం చేసేది..మీ ఇంటిముందు చెత్తఉంటే తీసుకుపోయి...మున్సిపాలిటీ ముందు వేయండి’’ - ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఓ కార్మికుడి విసుగు ప్రస్తుతం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితి ఇది. చిన్నా చితకా పనులకు కూడా ట్రెజరీల్లో బిల్లులు పాస్ చేయకపోవడంతో మున్సిపాలిటీ అధికారులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోట్లాది రూపాయల బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉండిపోగా...పనులు జరగక ఇటు అధికారులు, సమస్యలు పరిష్కారం కాక అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం: ఆవులను కొట్టి చెప్పులు దానం చేసిన చందంగా ఉంది టీడీపీ సర్కార్ తీరు. చిన్నా చితకా కార్మికుల పొట్టకొట్టి తమకు అవసరమైన చోట నిధుల వరద పారించడం తెలుగుదేశం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. నంద్యాల, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసేందుకుగాను ఇతర ప్రాంతాల్లో అత్యవసర వాటికి కూడా నిధులు విడుదల చేయకుండా లావాదేవీలను ఫ్రీజ్ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బిల్లులు ట్రెజరీల్లోనే పెండింగ్‌లో ఉండిపోయాయి. కనీసం చెత్త తరలించే ట్రాక్టర్లకు కూడా డీజిల్ పోయించడం ఇబ్బందిగా మారడంతో పట్టణాల్లో చెత్త తరలింపులో జాప్యం జరుగుతోంది. మరోవైపు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోవడంతో పనులు సాగడం లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో కనీసం ఫాగింగ్ చేసేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక మున్సిపాలిటీల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నుంచి ఆగిన చెల్లింపులు జిల్లాలోని 18 ట్రెజరీలుండగా... వీటి పరిధిలో 135 మంది డ్రాయింగ్ ఆఫీసర్లు (ఆయా శాఖలు/ విభాగాల పరిధిలో నగదు లావాదేవీలు నిర్వహించే) ఉంటారు. మున్సిపాలిటీ, పంచాయతీ, తదితర సంస్థల్లో వివిధ రకాల వేతనాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వీరు చెల్లిస్తుంటారు. అయితే వీరు పంపిన దాదాపు రూ.50 నుంచి రూ.70 కోట్ల దాకా బిల్లులను ఆర్థిక శాఖ ఫ్రీజ్ చేసింది. ఆగస్టు–09 నుంచి నేటి వరకు వారికి అందాల్సిన అన్ని చెల్లింపులు మొత్తం ఆగిపోయాయి. నంద్యాల, కాకినాడ ఎన్నికల నేపథ్యంలో అక్కడ విచ్చలవిడిగా నిధులు ఖర్చుపెట్టిన సర్కార్ ... రాష్ర్టంలోని మిగతా ఎక్కడా చెల్లింపులు చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. చిల్లిగవ్వలేక చిక్కులు బిల్లుల చెల్లింపులు ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు, 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. బిల్లులు ఫ్రీజ్ చేయడంతో చిన్న అవసరానికీ చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా డీజిల్ ఖర్చులు, కార్మికుల వేతనాలు చెల్లించేందుకు కూడా డబ్బు లేకపోవడంతో సమాధానం చెప్పుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. చెత్త ట్రాక్టర్లు, ఆటోలు, ఇతరత్రా వాహనాలకు సంబంధించిన డీజిల్ బిల్లులు వారానికో.. పదిరోజులకో ఆయా పెట్రోల్ బంకుల యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే నెలరోజులుగా చెల్లింపులు లేక పోవడంతో సేవలు సక్రమంగా అందడంలేదు. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు అందిచాల్సిన వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లింపులు, పలు అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులు అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ. 20 నుంచి 30 కోట్ల రూపాయల బిల్లులు ట్రెజరీలో ఫ్రీజ్ అయ్యాయి. ఆర్థిక శాఖ అనుమతులు ఎప్పుడు ఇస్తుందో.. ఎప్పుడు బిల్లులు వస్తాయో అని స్థానిక సంస్థలు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. -
కొత్త ఆలోచన:తాటిచెట్టుకు తాళం!
-
తాటికి తాళం !!
-
సిండికేట్ బ్యాంక్ వద్ద మహిళ హల్చల్
బ్యాంక్ ప్రవేశ ద్వారానికి తాళం వేసిన వైనం పోలీసుల రంగ ప్రవేశంతో కథ సుఖాంతం పగిడ్యాల: స్థానిక సిండికేట్ బ్యాంక్ ప్రవేశ ద్వారానికి ఓ మహిళ తాళం వేసి అరగంటకుపైగా లావాదేవీలు నిలిచిపోయేలా చేసిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెస్త శేషమ్మకు స్థానిక సిండికేట్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. తన ఖాతాకు పాస్టర్లు రూ.2 లక్షలు జమ చేశారని వాటిని విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అయితే చివరకు తాళం వేసి అక్కడి నుంచి ఉడాయించింది. ఘటనపై బ్యాంకు సిబ్బంది ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ బ్యాంక్ వద్దకు చేరుకుని ఖాతాదారులతో తాళం పగులగొట్టించాడు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులను బ్యాంక్ అధికారులు ఎందుకు తీస్తున్నారని తమ అనుమతి తీసుకోకుండా ఫొటోలు తీయడం సరికాదని వారించే ప్రయత్నం చేశారు. శేషమ్మకు మానసిక స్థిమితం లేదని, అందుకే తాళం వేసిందన్నారు. ఆమె ఖాతాకు సంబంధించిన స్టేట్మెంట్లు ఇస్తామని, ఆమె ఖాతాలో ఎవనై డబ్బు జమ చేయలేదని, పత్రికల్లో రాయొద్దని బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నరసింహులు, మేనేజర్ వెంకటరాముడులు కోరడం గమనార్హం. తర్వాత బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించకుండా ఏఎస్ఐ అబ్దుల్అజీజ్ బందోబస్తుకు కానిస్టేబుల్‌ను నియమించారు. -
లాక్ చేసి వదిలేస్తే చాలు రోబో ఎత్తుకెళ్లిపోతుంది
-
లాక్ చేసి వదిలేస్తే చాలు రోబో ఎత్తుకెళ్లిపోతుంది
పార్కింగ్ ఇబ్బందులు ఎలా ఉంటాయో నగరవాసికి తెలియంది కాదు. మాల్స్లోనైనా, వీధుల్లోనైనా వాహనాన్ని నిలిపేందుకు తగిన స్థలం ఉండటం ఒక సమస్య. ఒకవేళ ఉంటే.. ఆ ప్లేస్‌కు మన కారును సురక్షితంగా తీసుకెళ్లడం ఇంకో ఇబ్బంది. ఈ మధ్యకాలంలో అక్కడక్కడా కొన్ని ఆటోమేటిక్ పార్కింగ్ గ్యారేజీలు అందుబాటులోకి వచ్చినా... వాటిల్లో కూడా మనుషులే ఎక్కువగా పనిచేస్తూంటారు. ఇక విషయానికొద్దాం. ఈ ఫొటోలు చూశారుగా... కాలిఫోర్నియాలోని వెస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఈ మధ్యే ఏర్పాటు చేసిన అత్యాధునిక పబ్లిక్ కార్ పార్కింగ్ స్థలమిది. చూసేందుకు అలా కనిపించదులెండి. ఈ ఐదంతస్తుల భవనంలో ఏకంగా 200 కార్ల వరకూ పడతాయి. వాహనాన్ని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఎంట్రెన్స ద్వారా లోపలికి తీసుకెళ్లి, లాక్ చేసి వదిలేస్తే సరి... మిగిలిన పనంతా అడ్డంగాను, నిలువుగానూ వెళ్లగల లిఫ్ట్‌లు, రోబోలు చూసుకుంటారుు. మీరు కారు పార్క్ చేసిన వెంటనే ఒక సాఫ్ట్వేర్ అసలు పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉందో గుర్తిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న అతి దగ్గరి దారేమిటో నిర్ణయమవుతుంది. ఇక ఆ అంతస్తుకు, ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా కారు అడుగున ఉన్న లిఫ్ట్ తన దిశను మార్చుకుంటుంది. నిర్ణీత పార్కింగ్ ప్లేస్‌కు రాగానే.. ఓ రోబో చక్రాల కిందకు దూరిపోతుంది. నాలుగు చక్రాలు నిలువుగా ఉన్నాయా? లేదా? కిటికీ అద్దాలు మూసి ఉన్నాయా? ఇంజిన్ ఆఫ్ అరుు ఉందా? వంటి అన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఆ తరువాత చక్రాలకు రెండు వైపుల నుంచి చేతుల్లాంటి పరికరాలు ముందుకొస్తాయి. ఇదిగో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఈ ఎంట్రెన్స్లోంచే మీ కారు.. భవంతిలోకి వెళుతుంది కారును పైకి ఎత్తి పట్టుకుంటాయి. ఇప్పుడు ఆ రోబో వాహనాన్ని నిర్ణీత పార్కింగ్ స్థానంలోకి చేరుస్తుంది. వాహనాన్ని మనం మళ్లీ తెప్పించుకోవాలంటే ఇదే ప్రాసెస్ రివర్స్‌లో జరుగుతుందన్నమాట. అతితక్కువ స్థలంలో మనిషి అవసరం లేకుండా ఎక్కువ సంఖ్యలో కార్లను పార్క్ చేసేందుకు ఈ టెక్నాలజీ భలే ఉపయోగపడుతుందని అంచనా. రెండేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుకాగా... ఈ మధ్యనే ఓపెన్ చేశారు. పార్కింగ్‌కు ఎంత చార్జ్ చేస్తారో తెలియలేదుగానీ, నిర్మాణానికి మాత్రం కోటీ అరవై లక్షల డాలర్లు ఖర్చయిందట! రూపాయల్లో చెప్పాలంటే... దాదాపు వందకోట్లు! ఏ అంతస్తులో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి ఆటోమేటిక్‌గా కారు వెళ్లిపోతుంది! -
బురద నీటిలో తాళం పడిపోవడంతో..
చింతల్: అతను బురద నీటిలో చేపలు పడుతున్నాడనుకుంటే మీరు బురద నీటిలో కాలేసినట్లే..ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగర రహదారులు గుంతలమయంగా మారాయి..కుత్బుల్లాపూర్ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్ల పై వర్షపు నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు..ఓ వాహనాదారుడి తాళం చేవి ఆ బురద నీటిలో పడిపోవడంతో దాని కోసం గాలిస్తుండగా, ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. ఎట్టకేలకు తాళం చెవి దొరకడంతో అతను అక్కడి నుంచి నిష్క్రమించాడు -
‘అనంత’లో అమానుషం
-
‘అనంత’లో అమానుషం
♦ పంచాయతీ కార్యదర్శి భవానీపట్ల కులవివక్ష ♦ నల్లలమ్మ ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ వర్గీయుల తాళం బ్రహ్మసముద్రం : రాష్ట్రంలో దళితుల పట్ల కొనసాగుతున్న కుల వివక్షకు మరో నిదర్శనమిది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ దళితురాలు కావడంతో తమ గ్రామంలోని ఆలయంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ టీడీపీ సానుభూతిపరుడొకరు అవమానించడమేగాక.. తనవారితో కలసి ఆమె లోపలకి వెళ్లకుండా ఆలయానికి తాళం వేసిన అమానుష ఘటన ఇది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి... భైరసముద్రం గ్రామపంచాయతీ రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తున్న భవానీకి ముప్పులకుంట కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో భాగంగా ఆమె జూలై ఆరు నుంచి ముప్పులకుంటలో స్మార్ట్ పల్స్‌సర్వే నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా అదే గ్రామంలోని నల్లలమ్మ ఆలయంలో కూర్చుని సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. నెట్వర్క్ సిగ్నల్ అక్కడ బాగా ఉండడంతో ఆలయంలో కూర్చుంటున్నారు. రెండురోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు చంద్ర.. పంచాయతీ కార్యదర్శి భవానీని ‘మీదే కులం? ఎస్సీలైతే గుడిలోకి వెళ్లకూడదంటూ’ అవమానించడం మొదలుపెట్టాడు. మనోవేదనకు గురైన ఆమె ‘ఎందుకిలా మాట్లాడుతున్నారు. ప్రతిరోజూ కులం గురించి అడుగుతున్నారు. ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారు?’ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో అతను గ్రామంలోని తన వర్గీయులకు సమాచారమివ్వగా.. వారంతా కలసి పంచాయతీ కార్యదర్శిని ఆలయంలోకి అడుగుపెట్టకుండా తాళం వేయాలని, ఆలయాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సర్వేకోసం శుక్రవారం గ్రామానికెళ్లిన పంచాయతీ కార్యదర్శి భవానీ ఆలయానికి తాళం వేసుండడాన్ని గమనించి ఆరాతీశారు. విషయం తెలియడంతో కంటితడి పెడుతూ పైఅధికారులకు ఫోన్లో సమాచారమిచ్చారు. అలాగే కళ్యాణదుర్గం సీఐ మన్సూరుద్దీన్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన హెడ్ కానిస్టేబుల్ రఘురాములును గ్రామానికి పంపి బాధితురాలినుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ తెలిపారు. -
వీధి దీపాల కార్యాలయానికి తాళం
కోదాడ: ఆరు నెలలుగా తమ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు అటుంచి కనీసం వీధి ధీపాలు కూడ వేయలేని దుర్భర పరిస్ధితిలో కోదాడ మున్సిపల్ కార్యాలయం ఉందన్నారు. అలాంటప్పుడు వీధి ధీపాల విభాగం ఎందుకని ప్రశ్నిస్తూ మంగళవారం పలువురు కౌన్సిలర్లు మున్సిపాలిటీలో ఉన్న వీధి ధీపాల విభాగానికి తాళం వేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీధుల్లో లైట్లు వేయించలేని కౌన్సిలర్ పదవి తమకు ఎందుకని, వార్డుల్లో ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చేప్పలేక పోతున్నామన్నారు. తమకు అనుకూలమైన కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రం లైట్లు వేస్తూ ప్రతిపక్షాల వారిని వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గడిచిన ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడ దోమల మందు పిచికారి చెయ్యలేదన్నారు. దాని వల్ల పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. మురుగుకాలువలను కూడ శుభ్రం చెయ్యని దుస్ధితి నెలకొందన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ సత్యారావు వచ్చి కౌన్సిలర్లతో మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాలుగా కొనుగోలు చేసిన లైట్ల వివరాలను తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తుమ్మలపల్లి భాస్కర్, దండాల వీరభద్రం, ఎస్కె. షఫి, కుడుముల లక్ష్మీనారాయణ, నాయకులు ముడెం సైదిబాబు, ఉప్పగండ్ల శ్రీనివాస్, కమదం చందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆసుపత్రికి తాళం వేసిన సర్పంచ్
డాక్టర్ కుర్చీలో శునకం దర్జా అపరిశుభ్రంగా ఆసుపత్రి డీఎంహెచ్ఓకు ఫిర్యాదు నంగునూరు: చికిత్స కోసం వస్తే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో గ్రామ సర్పంచ్ ఆసుపత్రికి తాళం వేసిన సంఘటన ఆదివారం నంగునూరులో చోటు చేసుకుంది. డాక్టర్ కూర్చోవాల్సిన కుర్చీలో దర్జాగా శునకం కూర్చోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు జిల్లా వైద్యాధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటే వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంగునూరుకు చెందిన వార్డు సభ్యుడు దానం కిషన్ పనులు చేస్తున్న క్రమంలో చేతి వేలికి తీవ్ర గాయమైంది. గ్రామ సర్పంచ్ యాదగిరి, మరి కొందరు గ్రామస్తులు కిషన్‌ను నంగునూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో డాక్టర్ గదిలోకి వెళ్లారు. డాక్టర్ కూర్చోవాల్సిన కుర్చీలో శుకనం ఉండడంతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు పక్కనే ఉన్న మందుల గదిలోకి వెళ్లగా ఫార్మసిస్ట్ సైతం లేదు. దీంతో వారు ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి వైద్యాధికారి సదానందంతోపాటు జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి, గ్రామస్తులు మాట్లాడుతూ నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. వారం రోజుల క్రితం కొండంరాజ్పల్లికి చెందిన నారదాసు కనకయ్యకు గాయమైతే ఆసుపత్రిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడన్నారు. అలాగే మూడు రోజుల క్రితం సిద్దన్నపేటకు చెందిన మహిళ కడుపునొప్పితో ఆసుపత్రికి వస్తే సిబ్బంది లేకపోవడంతో తాను వైద్యాధికారికి ఫోన్ చేశానని, తన డ్యూటీ కాదని అతడు సమాధానం ఇచ్చాడన్నారు. ఆసుపత్రిలో ఏడుగురు డాక్టర్లతో కలపి 72 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా ఒక్కరైనా డ్యూటీలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు వాంతులు, వీరేచనాలు, జ్వరంతో ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రికి తాళం వేశారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యాధికారి సదానందం మాట్లాడుతూ విధుల్లో ఉండాల్సిన ఏఎన్ఎం సామ్రాజ్యంకు వీరేచనాలు కావడంతో ఇంటికి వెళ్లిందని సమాధానం ఇచ్చారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నగరం గ్రామంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మయ్య కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దుండగులు పలు విలువైన వస్తువులు చోరీ చేశారు. తాళం పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు చోరీ జరిగిందన్న విషయం నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎంతమొత్తంలో చోరీ జరిగిందనే విషయం యజమాని వస్తే గానీ తెలియదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీలకం!
పట్టుకోండి చూద్దాం ఆ ఇల్లు ఎప్పుడూ పిల్లాపాపలతో సందడిగా ఉంటుంది. అలాంటిది రెండు మూడురోజులుగా ఒంటరిదీవిలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నది రవి ఒక్కడే. ఒక పెళ్లికి హాజరు కావడానికి రవి అమ్మానాన్నలు, ముగ్గురు అన్నయ్యలు, వదినలు, పిల్లలు రాజమండ్రి వెళ్లారు. పరీక్షలు ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయాడు రవి. కొన్ని గంటల పాటు ఏకధాటిగా చదువుకున్న తరువాత రిలాక్స్ కావడం కోసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం రవి అలవాటు. ఆ రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న రవి దృష్టి అక్కడ ఉన్న పాత సామాను మీద పడింది. వాటన్నిటినీ ఇంటి వెనకాల ఉన్న స్టోర్‌రూమ్‌లో పెట్టడానికి కీ కోసం వెదికాడు. స్టోర్‌రూమ్‌కు సంబంధించి ఇంట్లో ఒకటే ‘కీ’ ఉంది. అది పోతే తాళం పగలగొట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు స్టోర్‌రూమ్‌లో కొన్ని వస్తువులను ఒక మూలకు పెట్టాడు. ఎంతో కాలం నుంచి ఆ రూమ్‌లో ఉన్న కొన్ని వస్తువులను చూసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాడు. పాత క్రికెట్ బ్యాట్‌ను చేతిలోకి తీసుకున్నాడు. ఈ బ్యాట్ కొనడానికి తాను అమ్మానాన్నలను ఎంత బతిమిలాడింది గుర్తు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ఆ బ్యాట్‌తో ఎన్ని మ్యాచ్‌లు ఆడింది, ఎక్కడ ఆడింది, ఎవరెవరితో ఆడింది గుర్తు తెచ్చుకున్నాడు. గదిలో ఒక్కొక్క వస్తువు ఒక్కో జ్ఞాపకాన్ని గుర్తుతెస్తుంది. ఈ జ్ఞాపకాల్లో ఉండగానే బయట అలికిడి వినబడడంతో- ‘ఎవరూ?’ అంటూ స్టోర్‌రూమ్ నుంచి బయటికి వచ్చాడు రవి. ఎవరూ కనిపించలేదు. మళ్లీ స్టోర్‌రూమ్‌లోకి వెళ్లి పాత వస్తువులు, పుస్తకాలను చూస్తూ చాలాసేపు గడిపాడు. ఆ తరువాత స్టోర్‌రూమ్‌కు తాళం వేసి చదువుకోవడానికి స్టడీరూమ్‌కు వెళ్లాడు. ‘ఇంకా సగం వస్తువులు బయటే ఉండిపోయాయి. రేపు ఉదయం వాటి పని చూడాలి’ అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే... బయట మిగిలిన కొన్ని వస్తువులను సర్దడానికి స్టోర్‌రూమ్ తాళం తీశాడు. లోపలికి వెళ్లాడో లేదో... భయంతో గట్టిగా అరిచాడు. స్టోర్‌రూమ్‌లో ఒక మూల శవం! ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలిసులకు సమాచారం అందించాడు. ‘‘ఇతడిని ఎప్పుడైనా చూశావా?’’ శవాన్ని చూపిస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పుడూ చూడలేదు’’ జవాబు ఇచ్చాడు రవి. ‘‘స్టోర్‌రూమ్ ఎన్ని రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారు? ఈ గది తాళం చెవులు ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయి?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘అరుదుగా మాత్రమే స్టోర్‌రూమ్‌లోకి వెళతాం. గదికి సంబంధించి ఒక్క కీ మాత్రమే ఉంది’’ చెప్పాడు రవి. ‘‘ఉన్నది ఒక్కటే కీ. అది కూడా మీ ఇంట్లోనే ఉంది. ఇది నీ పనే అని మాకు అనిపిస్తుంది’’ అని రవిని అనుమానించాడు ఇన్స్పెక్టర్. ‘‘నాకు ఎలాంటి పాపం తెలియదు’’ అని నెత్తినోరు బాదుకున్నాడు రవి. కొద్దిసేపటి తరువాత... ఏ ఇన్స్పెక్టర్ అయితే రవిని అనుమానించాడో అదే ఇన్స్పెక్టర్... ‘‘సారీ...నిన్ను అనవసరంగా అనుమానించాను. ఈ హత్య బయటివాళ్ల పనే’’ అని చెప్పాడు. వేసిన తాళం వేసినట్లుగానే ఉంది. మరి రాత్రికి రాత్రే ఆ గదిలోకి శవం ఎలా చేరింది? ఈ కోణంలో చూసినప్పుడు రవిని బలంగా అనుమానించడం తప్ప వేరే దారి లేదు. అయినప్పటికీ ఇన్స్పెక్టర్ నరసింహ ‘ఇది నీ పని కాదు...బయటి వాళ్ల పని’ అని బలంగా ఎలా చెప్పగలిగాడు? అద్దంలో ఆన్సర్ స్టోర్‌రూమ్‌లో ఏదైనా క్లూ దొరుతుందేమోనని కొద్దిసేపు వెదికాడు ఇన్స్పెక్టర్. చిన్న ఆధారం కూడా దొరకలేదు. గది నుంచి బయటికి వస్తున్నప్పుడు అతని దృష్టి తాళంపై పడింది. దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించడం ప్రారంభించాడు. ఒక చోట చిన్నగా మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ కోడ్ కనిపించింది. అది రెండు సంవత్సరాల క్రితం నాటి తాళం అనే విషయం తెలిసిపోయింది. రవి ఇంటి తాళం అయిదు సంవత్సరాల క్రితం నాటిది... చూడడానికి రెండూ ఒకేలా కనిపిస్తాయి. జరిగింది ఏమిటంటే, రాత్రి రవి స్టోర్‌రూమ్‌లో ఉన్నప్పుడు...డోర్‌కు ఉన్న తాళం చెవి స్థానంలో తాను తీసుకువచ్చిన తాళం చెవిని తగిలించాడు హంతకుడు. తన దగ్గర ఉన్న రెండో కీతో ఆ గది తలుపులు తెరిచి అందులో శవాన్ని పెట్టి తిరిగి తాళం వేశాడు. కుడివైపు నుంచి అద్దం పెట్టుకుని చదవండి -
రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
కంగ్టి: కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడంలో అన్యాయం చేశారంటూ ఓ వ్యక్తి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలి పారు. బోర్గి గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ కార్పొరేషన్ రుణం కోసం బ్యాంకు అధికారులు కాన్సెంట్ ఇచ్చినా తమకు రుణం మంజూరు చేయకుండా ఎంపీడీఓ మధుసూదన్ అడ్డుకోవడంతోపాటు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాంత్ తన బావ, బోర్గి సర్పంచ్ శశికళ భర్త సంజీవ్‌తో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తాళం వేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. -
తాళాలు, చెవులు
హ్యూమర్‌ప్లస్ తాళం పుట్టినపుడే దొంగతనం పుట్టింది. దొంగలతో పాటు పోలీసులూ పుట్టారు. వాళ్లకు జీతాలివ్వడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఓటర్లు పుట్టారు. తాళం వల్ల ఏర్పడిన అనవసర మేళమిది. ప్రపంచంలో అన్నింటికీ తాళమేసేవాళ్లు ఉంటారు. ఏ తాళాన్నయినా తీసిపడేసే వాళ్లూ ఉంటారు. తాళమంటూ ఉన్న తరువాత చెవి కూడా ఉంటుంది. చెవులతో పనిలేకుండా చేతులతో పని చేసేవాళ్లని దొంగలు అంటారు. తాళం చెవులు అనేకరకాలుగా ఉన్నట్టే దొంగలు కూడా డిఫరెంట్‌గా ఉంటారు. వెనుకటికి కన్నం దొంగలుండేవాళ్లు. ఇప్పుడు కన్నం వేసేంత పటిష్టంగా గోడలు లేవు. అపార్ట్మెంట్ గోడకి కన్నం వేయడానికి ప్రయత్నిస్తే మొత్తం బిల్డింగే కూలిపోయే ప్రమాదముంది. బిల్డర్లు గట్టివాళ్లే కానీ బిల్డింగ్లు కాదు కదా! పూర్వం కృష్ణ సినిమాల్లో పనీపాటా లేని వాళ్లు నిధిని తీసుకెళ్లి చచ్చీచెడి కొండగుహల్లో పెట్టేవాళ్లు. అంతటితో ఆగకుండా ఐదారు లావాటి తాళాలు వేసి, ఆ చెవుల్ని తలా ఒకటి పంచుకుని గుర్రాలేసుకుని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లేవాళ్లు. ఇందులో ఒకాయన చేయి తిరిగిన చిత్రకళా నైపుణ్యంతో మ్యాప్ గీసేవాడు. ఇది విలన్ సత్యనారాయణకి తెలిసి చిత్రహింసలు పెట్టి మ్యాప్‌ని స్వాధీనం చేసుకునేవాడు. అప్పుడొస్తాడు కృష్ణ. గిటార్ వినిపిస్తుంటే, రివాల్వర్ పొగని ఊదుతూ, మంచివాళ్లకి మంచివాణ్ణి, మోసగాళ్లకి మోసగాణ్ణి అంటూ చెయ్యంత పొడవున్న ఒక్క తాళాన్ని స్వాధీనం చేసుకుంటూ చివరికి ఆ నిధిని పేదవాళ్లకి పంచేస్తాడు. కృష్ణ సినిమాలు చూసిన తరువాత నిధి తాళాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని మేము ఎంతో ప్రయత్నించాం. సైకిల్ తాళాలు కూడా దొరకలేదు. గోడలకి చెవులుంటాయో లేదో తెలియదు కానీ, కొన్ని ఇళ్ల గోడలకి తాళం చెవులు తప్పకుండా ఉంటాయి. మా మిత్రుడు ఒకాయన ఎండాకాలంలో తలుపులు తెరిచి నిద్రపోయాడు. నిద్రపట్టని ఒక దొంగ ఇంట్లోకి వచ్చి గోడకి ఉన్న బీరువా తాళాలు తీసుకుని బీరువా తెరిచాడు. అది పాతకాలం గాడ్రేజ్ బీరువా. తలుపు తీస్తే ‘కుయ్యోకిక్కిక్’మని రెండు వీధులకి వినిపించేలా సౌండొస్తుంది. అయినా మనవాడు లేవలేదు. దొంగ తన విధి ధర్మాన్ని వీడలేదు. దొంగ చేతికి తాళాలివ్వడం అని ఒక సామెతుంది. ప్రజాస్వామ్య పారిభాషిక పదమిది. ఎవరు మనకు చెవులు మూసి చావగొడతారో వాళ్లకే మనం తాళం చెవులు అప్పగిస్తాం. ఒక చిన్న రంపంతో తాళం చెవి పళ్లుతోమి, ఏ తాళమైనా తెరిచేవాళ్లుంటారు. వాళ్లు రోడ్డు మీద పేదరికంతో ఉంటారు. తాళం తీయడం తెలిసిన ప్రతివాడు దొంగకాదు. మా ఊళ్లో చిన్న ఏడుకొండలు అని ఒకాయన ఉండేవాడు. ఆయన మొలతాడుకి ఒక పొడుగాటి తాళముండేది. బీరువాలో బంగారు నాణాలు దాచాడని అందరూ అనుకునేవారు. కొడుకులు కోడళ్లు కూడా మర్యాదగా చూసేవాళ్లు. బీరువాలో ఏముందో ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఒకరోజు పోయాడు. కొడుకులు కోడళ్లు ఆదరాబాదరాగా బీరువా తెరిచారు. నాలుగు గణేష్ బీడీల కట్టలు, రెండు అగ్గిపెట్టెలు కనిపించాయి. మన ఆత్మ తృప్తి కోసం ఇళ్లకి తాళాలు వేసుకుంటాం గానీ దొంగలనుకుంటే అవొకలెక్కా? తాళం హృదయం దొంగలకి అర్థమైపోతుంది. దాని పొట్టలో ఎన్ని లీవర్లున్నాయో కనిపెడతారు. తాళాల జాతకం దొంగలకి తెలిసినట్టే, దొంగల జాతకం పోలీసులకి తెలిసిపోతుంది. ఒక్కో దొంగకి ఒక్కో స్టయిలుంటుంది. అన్ని స్టయిల్స్ తెలిసిన స్టయిల్ కింగ్స్ పోలీసులు. దేవుడు మనల్ని సంకెళ్లతో పుట్టిస్తాడు. కీ ఎక్కడుందో తెలుసుకోడానికి జీవితమంతా ప్రయత్నిస్తాం. దొరికేసరికి మనం సంకెళ్లకి అలవాటు పడివుంటాం. అవి లేకుండా జీవించలేం.మృచ్ఛకటికం నాటకంలో ఒక దొంగ కళాత్మకంగా కన్నం వేస్తాడు. దొంగ నేర్పుని చారుదత్తుడు ప్రశంసిస్తాడు. దొంగల్ని ప్రశంసించే చారుదత్రులతో రాబోయే రోజుల్లో లోకం నిండిపోతుందని బహుశా శూద్రక మహాకవి ఊహించి ఉండడు. మనం ప్రశాంతంగా జీవించాలంటే తలుపుల కంటే నోటికే ఎక్కువ తాళం అవసరం. - జి.ఆర్. మహర్షి -
సహారా ఆంబీ వ్యాలీకి కొద్దిసేపుతాళాలు
పూనే: పన్ను చెల్లింపుల్లో వైఫల్యం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సహారా గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఆంబీ వ్యాలీ రిసార్ట్‌కు తాళం వేసింది. అయితే కొద్ది గంటల తరువాత బకాయి పన్నులు చెల్లించడంతో టౌన్‌షిప్‌కు వేసిన సీల్‌ను తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు రూ.4.50 కోట్ల వ్యవసాయేతర పన్నుల చెల్లింపులకు గాను ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంబే వ్యాలీ ధనికులు, ప్రముఖులకు సంబంధించి ‘హిల్ సిటీ ప్యారడైజ్’గా ప్రసిద్ధి. -
అసెంబ్లీకి నాలుగు రోజులు తాళం వేయాలి
హైదరాబాద్: ‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్.. ప్రతి ఏడాది అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి. ముఖ్యంగా పాఠశాల విద్యపై ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే అసెంబ్లీకి నాలుగు రోజులు తాళం వేసి పాఠశాల విద్యపై అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి’’ అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బాగోగులకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని, అప్పుడే సర్కారీ బడులు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 29వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను మంత్రి ఈటల రాజేందర్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌లతో కలిసి గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాకవి సుద్దాల హనుమంతు వేదికపై ప్రసంగిస్తూ.. నగరం సంస్కృతి, గొప్పతనం ఆ నగరంలోని పుస్తకాల షాపుల సంఖ్యను బట్టి చెప్పవచ్చన్నారు. విద్యార్థులకు పాఠశాల విద్య నుంచే పుస్తక పఠనంపై అవగాహన పెంచాలని సూచించారు. మన చదువుల్లో ఐఐటీ, ఐఐఎంలకు ఎలా ప్రిపేర్ కావాలో చెబుతున్నారుగానీ మన చ రిత్ర గురించి చెప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలలో కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, ఉపాధ్యాయులు, మంచినీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. -
షట్టర్ మూసితిరి.. తాళం మరిచితిరి!
బ్యాంక్ సిబ్బంది నిర్వాకం స్థానికుల చొరవతో వెలుగులోకి... నాచారం: బ్యాంక్ ఆఫ్ ఇండియా నాచారం శాఖ కార్యాలయంలోని ఓ షట్టర్‌కు తాళం వేయకుండా సిబ్బంది వెళ్లిపోయిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న టెకీ మోటార్స్ నిర్వాహకుడు రాజశేఖర్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇది గమనించి... స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ మేనేజర్ సుందరికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అయితే తాను సెలవులో ఉన్నానని... పొరపాటున సిబ్బంది తాళం వేయడం మరిచిపోయి ఉంటారని ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఇన్చార్జి మేనేజర్ తేజస్విని, సెక్యూరిటీ గార్డు మూర్తితో కలసి రాత్రి 10.30 గంటల సమయంలో అక్కడికి వచ్చి తాళం వేశారు. బ్యాంక్ కార్యాలయానికి మూడు షట్టర్లు ఉంటే... రెండింటికి వేసిన సిబ్బంది... మరొక షట్టర్‌కు తాళం వేయడం మరిచిపోయారు. అక్కడే ఉన్న బీవోఐ ఏటీఎంకు సెక్యూరిటీ కూడా లేకపోవడం గమనార్హం. -
పీహెచ్సీ ముందు రోగుల ఆందోళన
విజయనగరం: ఆసుపత్రిలో ఉన్న ఒక్క డాక్టరూ సెలవు పెట్టడంతో రోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం గ్రామస్థులు, రోగులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనికి విజయనగరం జిల్లా జామి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేదికైంది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న ఒక్క వైద్యుడు గత మూడురోజులుగా సెలవులో ఉన్నాడు. అతని స్థానంలో ఇంఛార్జ్ వైద్యుడిని నియమించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బుధవారం ఉదయం పీహెచ్సీ గేటుకు తాళం వేసి స్థానికులు, రోగులు ఆందోళన చేశారు. -
మూఢ నమ్మకంతో ఊరికి తాళం
-
ప్రేమ వంతెనకు పారిస్
విహంగం అది ఫ్యాషన్‌కు పరాకాష్ట అయిన పారిస్ నగరం. ఆ పారిస్ నగరంలో సీయెన్ నది. ఆ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన జనాన్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తరలించడంతో ఊరుకోదు. ప్రేమికుల మధ్య ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుంది. వంతెన మీద పాదచారులు నడవడానికి ఆసరాగా ఉండే రెయిలింగ్‌కు రకరకాల తాళాలు కనిపిస్తాయి. అవన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని వంతెన కమ్మీలకు దూర్చి తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం. అలా తాళం వేస్తే ప్రేమికులు దూరం అవుతారేమోననే భయం అక్కర్లేదని వారి విశ్వాసం. ఇది సరదాగా ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ ఈ విషయం విపరీతంగా ప్రాచుర్యంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వాటిని తొలగించే పని కూడా జరుగుతోంది. ఎంత చెప్పినా ఒక నమ్మకం బలపడిందంటే దానిని వదిలించడం అంత సులభం కాదు. ఆ నవలే రాకపోతే... ఇది నిజానికి ఫ్రెంచి వాళ్ల నమ్మకం కానే కాదు. 2006లో ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యు’ బుక్ ప్రచురితమైంది. అందులో ఇద్దరు రోమన్ ప్రేమికులు ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించారు. అప్పటి నుంచి ఈ వేలంవెర్రి వెర్రితలలు వేసింది. తాళాల బరువుకు వంతెన వంగిపోసాగింది. అయినా తాళాలు పడడం ఆగలేదు. ఇక జూన్ నెలలో వంతెన ప్యానెల్స్ కూలిపోయాయి. దాంతో ప్రేమతాళాలను విప్పక తప్పలేదు. ఇంతకీ వంతెనకు వేసిన తాళాలెన్ని ఉంటాయనుకుంటున్నారు? 2014 చివరికి ఏడు లక్షల తాళాలు పడి ఉంటాయని అంచనా. వంతెనను కాపాడుకోవడానికి ‘తాళాలు వేయడానికి బదులు ప్రేమికులు ఈ వంతెన మీదకు వచ్చి ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు. ప్రేమ నిలుస్తుంద’ని ప్రచారం మొదలుపెట్టారు. ‘లవ్ వితవుట్ లాక్స్’ ప్రచారం కూడా ఊపందుకుంటోంది. పారిస్‌లోనే కాదు! ఒక్క పారిస్‌లోనే కాదు. ఇలాంటి నమ్మకాలు చాలా దేశాల్లో ఉన్నాయి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం ఇష్టంలేక ప్రేమబంధాన్ని గట్టి చేసుకోమని ప్రోత్సహిస్తున్న నిర్మాణాలు కూడా ఉన్నాయి. సౌత్ కొరియాలో... సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసియాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు. స్కాట్లాండ్లో... యు.కెలోని ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఫోర్త్ రోడ్ బ్రిడ్జి మీద ఏటా ప్రేమ వేడుకలు జరుగుతాయి. గత సెప్టెంబరులో 50వ సంవత్సరం వేడుకలు జరిగాయి కూడా. కొన్ని చోట్ల వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. ఈ నిషేధం తాళాలకే కానీ ప్రేమకు కాదు. -
‘మాయాబజార్’ దుకాణాలకు తాళం
దేవరకొండ : దేవరకొండలోని మాయాబజార్లో గల 35 నగర పంచాయతీ దుకాణాలకు తాళం పడింది. ఈ వ్యవహారంపై ఆదివారం ‘సాక్షి ’లో మాయాబజార్ పేరిట ప్రత్యేక కథనాన్ని స్పందించింది. దీనికి స్పందించిన నగర పంచాయతీ అధికారులు దుకాణాలను మూసివేశారు. దీనిపై దుకాణాదారుల నుంచి నిరసన వ్యక్తమవుతుండగా ఈ వ్యవహారం జెడ్పీ చైర్మన్ వరకు వెళ్లింది. దేవరకొండ నగర పంచాయతీలోని 35 దుకాణాలను క్రమబద్ధీకరణ పేరుతో కొందరు వ్యాపారులు సొంతం చేసేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ వైనాన్ని ‘సాక్షి’ సవివరంగా ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పాలకవర్గం సోమవారం దుకాణాలకు తాళాలు వేసింది. నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ చైర్మన్ జాన్‌యాదవ్, మేనేజర్ రవిందర్‌రావు తదితర సిబ్బందితో దుకాణాలను మూసివేయించి తాళాలు వేశారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన కొనసాగింది. దుకాణాదారులు మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించడం ఏంటంటూ మొండికేశారు. అధికారులు ఇవేం లెక్కచేయకపోవడంతో కొంత రసాభాస చోటు చేసుకుంది. మేనేజర్‌కు, దుకాణాదారులకు మధ్య జరిగిన స్వల్ప వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది. దీంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఎస్ఐ మోహన్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 20 షాపులకు పంచాయతీ సిబ్బంది తాళాలు వేశారు. కాగా పంచాయతీలోని కామాటీలు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో సంఘటన స్థలం వద్ద ఉండటంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దుకాణాదారులు ఏమంటున్నారంటే.... లీజు గడువు ముగిసినప్పటికీ తాము 2015 వరకు మార్చి వరకు అద్దె చెల్లించామని, కనీసం మార్చి వరకు కూడా గడువు ఇవ్వలేదని దుకాణాదారులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు ఏమంటున్నారంటే... ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చామని, ఫైనల్ నోటీసులు ఇచ్చినా దుకాణాదారులు స్పందించలేదని కాబట్టి నిబంధనల ప్రకారమే దుకాణాదారులను ఖాళీ చేయించడానికి తాళాలు వేశామని అంటున్నారు. ఇదే సమయంలో మార్చి వరకు గడువు ఉండగా ముందుగానే ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయని ప్రశ్నించగా నెలకు అద్దె రూ. 1200 అని పేర్కొనగా, అది సంవత్సరానికి ఒకసారి కడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించొద్దు : జెడ్పీ చైర్మన్ బాలునాయక్ దుకాణాలకు తాళాలు వేయడంతో దుకాణాదారులంతా మూకుమ్మడిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌ను ఆశ్రయించారు. దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారని ఏకరువు పెట్టడంతో అధికారులకు ఫోన్ చేసి ఏం చేసినా నిబంధనల ప్రకారమే చేయాలి తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని హితువు పలికారు. దుకాణాదారులందరినీ కూర్చోబెట్టి లీజు, అద్దె వంటి అంశాలను మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు. -
ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు
హైదరాబాద్ : హైదరాబాద్ గన్పౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు గురువారం తాళం వేశారు. తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామంటే... అశోక్ బాబు వినటం లేదంటూ తెలంగాణ ఉద్యోగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఏపీఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు గతంలో వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. -
స్త్రీ గొప్పతనం తెలిపే కథ
నేటి సమాజంలో పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. ప్రేమ, త్యాగం, ధైర్యం, సహనం, సాహసం ఇవన్నీ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘లాక్’. సంతోష్, సారిక జంటగా నటిస్తున్నారు. పార్గవన్ దర్శకత్వంలో కె.లక్ష్మణమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి తమిళ నిర్మాత శ్రీమతి సెల్వి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ క్లాప్ ఇచ్చారు. వినోదంతో కూడిన చక్కని లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదని నిర్మాత అన్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తామనీ, వైజాగ్, అరకు, హైదరాబాద్‌ల్లో చిత్రీకరణ జరుపుతామనీ, తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాను విడుదల చేస్తామనీ దర్శకుడు తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కథ: రాజ్దొరై, మాటలు: కేశవ్ పప్పుల, సంగీతం: విజయ్ కూరాకుల, కెమెరా: శ్రవణ్‌కుమార్. -
మద్యం డిపోలకు 24 నుంచి తాళం
-
మద్యం డిపోలకు 24 నుంచి తాళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు డిపోల నుంచి మద్యం స్టాక్ పంపిణీ నిలిపివేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటవుతున్న రెండు రాష్ట్రాలు అధికారికంగా జూన్ 2 నుంచి కార్యకలాపాలు సాగించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖలో ఆదాయం, అప్పులు, స్థిర చరాస్తుల పంపకాలు పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా పంపకాల్లో సమస్య లేకపోయినా, హైదరాబాద్ కేంద్రంగా 23 జిల్లాల నుంచి వచ్చిన ఎక్సైజ్ ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉంది. హైదరాబాద్ పరిధిలో శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల పంపిణీ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్థిర చరాస్తుల పంపిణీ ప్రక్రియను 58 ః 42 నిష్పత్తిలో ఇప్పటికే దాదాపుగా పూర్తిచేశారు. ఇరు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల కార్యకలాపాలన్నీ అపాయింటెడ్ డే నుంచే కొనసాగేందుకు డిపోల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. అన్ని జిల్లాల్లోని మద్యం వ్యాపారులకు సమాచారమిచ్చారు. ఈనెల 24 లోగా పది రోజులకు సరిపడా స్టాక్ కొనుగోలు చేయాలని సూచించారు. 24 తరువాత చెల్లించే చలానాలు చెల్లుబాటు కావని స్పష్టంచేశారు. 24 వరకు చలానాలు చెల్లించినవారికి 27వ తేదీ వరకు స్టాక్ అందిస్తామని, ఆ తర్వాత 6వ తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు ఉండవని పేర్కొన్నారు. ఆ తర్వాత పంపిణీ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నిర్ణయాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ముందు జాగ్రత్తగానే మౌఖిక సమాచారమిచ్చినట్లు ఏపీబీసీఎల్ సీజీఎం శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. నేటి నుంచి డిపోల వద్ద క్యూలే! పది రోజులకు పైగా మద్యం పంపిణీ జరగదన్న సమాచారంతో మద్యం వ్యాపారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కనీసం 15 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొనుగోలు చేయబోయే మద్యానికి చలానాలతో మద్యం దుకాణాలు, బార్ల ప్రతినిధులు ఏపీబీసీఎల్ డిపోల వద్ద క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా (తెలంగాణ, సీమాంధ్ర) ఉన్న 39 డిపోల్లో రోజుకు రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు మద్యం అమ్మకాలు సాగుతాయి. వచ్చే నెల 6 వరకు లావాదేవీలు నిలిచిపోతుండటంతో 24వ తేదీలోగా ఈ నాలుగు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్లకు పైగా మద్యం విక్రయించాలని ఏపీబీసీఎల్ నిర్ణయించినట్లు సమాచారం. సర్వర్ల సమస్యపై వ్యాపారుల ఆందోళన ఒకేసారి చలాన్లతో డిపోల ముందు క్యూ క డితే సర్వర్ల సమస్య తలెత్తుతుందన్న ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి సమస్య తలెత్తిందని అంబర్‌పేటకు చెందిన ఓ బార్ యజమాని ‘సాక్షి’కి తెలిపారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ కొనుగోళ్లపై ఒత్తిడి పెరిగితే సర్వర్లు పనిచేయవని చెప్పారు. ఈ సమస్యను నివారించేందుకే 24 వరకు చలానాలు చెల్లిస్తే, 27 వరకు స్టాక్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఏపీబీసీఎల్ అధికారి ఒకరు చెప్పారు. -
ఆవిష్కరణం : తాళం ఎప్పుడు వేశారు?
బహుశా ప్రపంచంలో అతి ప్రాచీనకాలం నుంచి ప్రాథమిక అవసరాల్లో ఏ మాత్రం ప్రాధాన్యం కోల్పోనిది తాళమే. ఇంటిని మనం ఉన్నంత సేపు మనం కాపాడుతాం, మనం లేనపుడు తాళం కాపాడుతుంది. మనిషి బుద్ధి తప్పు దారి పట్టడమే దీని ఆవిష్కరణకు పునాది కావచ్చు. లేకపోతే అది కనిపెట్టాల్సిన అవసరం ఏముంది? జంతుజాలం కోసమే అనుకుంటే గొళ్లెం చాలు తాళం అవసరం లేదు. అంటే ఇతర ఉత్పత్తులు అన్నీ నాగరికతలో భాగంగా అభివృద్ధి సృష్టించినవి అయితే తాళం మాత్రం దాని సైడ్ ఎఫెక్ట్! సుమారు నాలుగువేల సంవత్సరాల క్రితం తాళాన్ని కనిపెట్టారు. మెసపటోమియా నాగరికతలో మొట్టమొదట దీన్ని వాడినట్టు చరిత్రలో నమోదైవుంది. మొదట్లో చెక్క తాళాలు ఉండేవి. వాటికేమీ తాళం చెవి ఉండదు. కొన్ని రంధ్రాలు, వాటిలో అమర్చతగ్గ కొన్ని చిన్న చెక్క ముక్కలు ఓ పద్ధతిలో వాడే వారట. ఆ తర్వాత మధ్య యుగాల నాటికి తాళాలు ఇనుముతో తయారయ్యాయి. ఇవి చెక్క తాళాలకు భిన్నంగా చోరులు చేధించడానికి అనువుగా లేకుండా ఉండేవి. 870-900 సంవత్సరాల మధ్య మొదటి లోహపు తాళం రూపొందించారు. ఆ తర్వాత అది అత్యంత ప్రాథమిక అవసరం కావడంతో అతి వేగంగా అందులో అనేక రకాల ఆవిష్కరణలు వచ్చాయి. 1778లో రాబర్ట్ బేరన్ సులువుగా వేసి, సులువుగా తీయగల మొదటి తాళం కనిపెట్టారు. దాంతో ఆధునిక తాళాలు తయారవడం మొదలైంది. ఇపుడు మనం వాడుతున్నది ఇదే ఇంజినీరింగ్. అయితే, దీన్ని 1818లో జెరెమియా చబ్ మరింత సున్నితంగా తయారుచేశారు. ఆ తర్వాత డోర్‌లాక్‌లు వచ్చినా టెక్నాలజీ అదే. కాకపోతే తాళం డోర్లో ఇమిడి ఉంటుంది. ఇపుడు ఎలక్ట్రానిక్ తాళాలు, సెన్సార్లతో ఓపెన్ అయ్యే తాళాలు వచ్చాయి.