అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం! | Aligarh Couple Makes worlds Largest Lock For Ram Temple | Sakshi
Sakshi News home page

అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!

Published Mon, Jan 10 2022 1:41 PM | Last Updated on Mon, Jan 10 2022 1:43 PM

Aligarh Couple Makes worlds Largest Lock For Ram Temple - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన  సత్యప్రకాశ్‌ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి,   అతని భార్య కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అంతేకాదు ఆ తాళం 30 కిలోల బరువున్న తాళం చెవితో తెరుచుకుంటుంది. పైగా సుమారు రూ. 2 లక్షలు ఖరీదు చేసే ఈ తాళం పై రాముడి చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయనున్నారు.

(చదవండి: 60 మిలియన్లకు కోవిడ్‌ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!)

ఈ మేరకు ఆ వ్యక్తి 10 అడుగుల పొడవు 400 కిలోల బరువు ఉండే ఆ తాళాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందన్నాడు. అంతేకాదు తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు  స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంటుందని తెలిపాడు. అయితే ఈ లాక్‌ని క్షేత్ర స్థాయిలో పూర్తి చేయడానికి ఇంకా కొంత నిధులు అవసరం అవుతాయని, పైగా ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అభ్యర్థించినట్లు కూడా వెల్లడించాడు.

అంతేకాదు ఈ కళను ప్రోత్సహించడానికి  ప్రభుత్వ సహకారం అవసరం అంటున్నాడు. తాను ఈ తాళాన్ని అప్పు చేసి మరీ తయారు చేశానని చెప్పాడు. అంతేకాదు సత్యప్రకాశ్‌ గతేడాది ప్రారంభంలో 300 కిలోల తాళాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు  తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్‌ పరేడ్‌లో చేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తాను తయారు చేసిన తాళానికి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

(చదవండి: అక్కడ ప్రజలు టీతోపాటు టీ కప్పులను కూడా తినేస్తారట!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement