gunnis record
-
వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్‌గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.చైనాలోని గుయ్లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారట!. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్షెంగ్ రైస్‌తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది. గిన్నిస్‌లోనూ చోటు!ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్‌గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. View this post on Instagram A post shared by SheThePeople (@shethepeopletv) (చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..) -
వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్ రికార్డ్!
లావుగా ఉన్నవాళ్లు సన్నగా రివటలా మారాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్లు కాస్తంత బొద్దుగా ఉంటే బావుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇక రింగు, రింగులు జుట్టు ఉన్నవాళ్లలో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకూ అలా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే కానీ అసహజమైన, వింత సిండ్రోమ్‌తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడ లేదు..ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు? అతనికున్న సిండ్రోమ్ ఏంటి? తెలుసుకుందాం.మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు. అవమానపడేవాడు. కానీ దైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇపుడు అతని జుట్టే అతడికి రికార్డు తెచ్చి పెట్టింది. చదరపు సెంటీమీటర్‌కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95 శాతానికి పైగా వెంట్రులున్నాయి.మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటిదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.అయితే మొదట్లో తాను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తరువాత అందరూ తనను అర్తం చేసుకున్నారని అన్నాడు. ఇపుడు చాలా మంది దయతో ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే..దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటం నాకిష్టం...నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని’ చెప్పాడు."నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ పుట్టినప్పటి నుండి అరుదైన ''వేర్వోల్ఫ్ సిండ్రోమ్'తో బాధపడుతున్నాడు. 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్' లేదా హైపర్ట్రికోసిస్ తల నుండి కాలి వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండటం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్ పాటిదార్‌ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ బాయ్ అంటూ మరికొంతమంది ఏడిపించేవారు. "కొరుకుతాడేమో" అని భయపడేవారు. రాళ్ళు విసిరేవారు. మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. లలిత్ తండ్రి రైతు , అతని తల్లి గృహిణి. ప్రస్తుతం, ముఖం 95 శాతానికి పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్‌కు తల్లితండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు.లలిత్‌కు ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానెల్లో ఫాలోయింగ్‌కు కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాలో 2 లక్షల 65 వేలు, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోయర్లున్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్ టెలివిజన్ షో లో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహతో ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు. విభిన్న సంస్కృతులను అన్వేషించాలనే కల సాకారం దిశగా సాగుతున్నాడు లలిత్. -
ఎనిమిది శాస్త్రీయ నృత్య రూపాలు ఒకేసారి..!
ఎవరైనా ఒకటో రెండో శాస్త్రీయ నృత్య కళలను ప్రదర్శించడం చూస్తుంటాం. వారి కళకు అభివాదం తెలియజేస్తుంటాం. కేరళలోని ఇరింజలకుడకు చెందిన అనఘశ్రీ సజీవనాథ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాలైన కథాకళి, కూచిపూడి, సత్రియా, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కథక్లను ఒక గంటా 30 నిమిషాల్లో ప్రదర్శించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. అన్ని భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అత్యధిక కాలం పాటు ప్రదర్శించి, రికార్డు సాధించిన ఘనత అనఘశ్రీ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల అనఘ చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్య సాధనలో తనైదన మార్క్ చూపిస్తూ ఉండేది. తమ స్థానిక కళ మోహినియాట్టం నేర్చుకోవడంలో చూపే ఆసక్తి, ఆ తర్వాత తర్వాత ఇతర నృత్య సాధనలవైపు మల్లేలా చేసిందని చెబుతుంది అనఘ. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చా..?) -
ఏజ్‌లో సెంచరీ దాటి రికార్డు సృష్టించిన బామ్మ..ఆమె ఒకప్పుడూ..!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో సుదీర్థకాలం బతకం బహుకష్టంగా ఉంది. ఏవో ఒక రోగాలతో 60 లేదా డెభైకే టపా కట్టేస్తున్నారు. సెంచరీ కొట్టడం గగనంగా ఉంది. అలాంటి జపాన్‌కి చెందిన టోమికో ఇటూకా అనే బామ్మ ఏకంగా 116 ఏళ్ల జీవించి రికార్డు సృష్టించి. ప్రపంచంలో సుదీర్ఘకాలం బతికిన మహిళగా గిన్సిస్ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. ఇటూకా పుట్టిన తేదీ సంవత్సరం ఆధారంగా వరల్డ్ సూపర్సెంటెనేరియన్ ర్యాంకింగ్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ రీసెర్చ్ గ్రూప్ 110 లేదా అంతకంటే ఎక్కువ వయసుగల వ్యక్తుల వివరాలను ధృవీకరిస్తుంది. ఇటీవల 117 ఏళ్ల మరియా బ్రాన్యాస్ మరణం తరువాత జపాన్‌కి చెందిన 116 ఏళ్ల టోమికో ఇటూకా ఎక్కువ కాలం జీవించిన మహిళగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఆమె ఆషియా నగరంలోని ఒక నర్సింగ్ హోమ్‌లో ఉంటుంది. ఆమె తాను పుట్టిన తేదీని కూడా ధృవీకరించింది. ఆ బామ్మ సాధించిన రికార్డు గురించి ఆమెకు చెప్పగానే.. వెంటనే థాంక్యూ అని చలాకీగా చెప్పిందంట. అంటే ఆమె స్పందంచిన తీరు చూస్తే..ఆమె ఈ వయసులో కూడా ఎంతో ఉషారుగా, స్పష్టంగా వినగలుగుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ బామ్మ ఇటూకా మూడు నెలల క్రితమే తన పుట్టిన రోజుని జరుపుకుందట. ఒసాకాలో జన్మించిన ఈ బామ్మ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడాకరిణి. 20వ ఏటన వివాహం చేసుకుందంట. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త నడుపుతున్న టెక్స్టైల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనుల్లో సహాయం చేసేవారట. ఆమె వృద్ధ ఆశ్రమంలో చేరడానికి ముందు 1979లో భర్త మరణానంతరం నారాలో ఒంటరిగా నివసించింది. అంతేకాదండోయ్ ఏకంగా 3,067-మీటర్లు (10,062-అడుగులు) మౌంట్ ఆన్టేక్ను ఏకంగా రెండుసార్లు అధిరోహించిందట. వందేళ్లు నిండిన తర్వాత కూడా సుదీర్ఘ పాదయాత్రలు చేసిందట. ఆమె లైఫ్‌స్టైల్..ఆమె క్యాల్పిస్ అనే ప్రసిద్ధ పెరుగు రుచిగల పానీయాన్ని తీసుకుంటుంది. ఆమెకు ఇష్టమైన ఆహారం అరటిపండ్లు అని ఆమె సంరక్షకురాలు చెబుతోంది. (చదవండి: బరువు తగ్గడంలో 'పంచకర్మ' ది బెస్ట్!..అనుభవాన్ని షేర్ చేసుకున్న రోహిత్ రాయ్!) -
మనోళ్లు ముక్కుతో కూడా రికార్డులు కొట్టేస్తారు; వరుసగా మూడోసారి
ముక్కుతో టైప్ చేయడమే విశేషం. అందులో కూడా రికార్డ్. మళ్లీ తన రికార్డును తానే అధిగమించాడో వ్యక్తి. ఆయన పేరే ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ వినోద్ కుమార్ చౌదరి. స్పెషల్ కీబోర్డుపైన ముక్కుతో వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్‌ని మరోసారి రికార్డు స్థాయిలో సాధించాడు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. వరుసగా మూడోసారి కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి రికార్డులకెక్కారు వినోద్. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇపుడుముచ్చటగా మూడోసారి కూడా కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు.How quickly could you type the alphabet with your nose (with spaces)? India's Vinod Kumar Chaudhary did it in 26.73 seconds ⌨️👃 pic.twitter.com/IBt7vghVai— Guinness World Records (@GWR) May 30, 2024ఈ విజయం పై వినోద్ సంతోషం ప్రకటించారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్‌లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్పడం విశేషం. -
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
ఒక మహిళ గర్భం ధరించడం పిల్లలను కనడం అనేది అత్యంత కఠిన నియమాతో కూడిన పని. అయిన మాతృత్వపు మమకారంతో ప్రతి స్త్రీ సునాయాసంగా ఆ బాధ్యతను మోస్తుంది. అయితే ఎవరైనా మహా అయితే ఐదుగురు లేదా పది మంది వరకు కనడం గురించి విని ఉంటాం. ఏకంగా 69 మంది పిల్లలను కనడం గురించి విన్నారు. ఈ విషయాన్ని గుర్తించి గిన్నిస్ రికార్డుల్లో సైతం ఆ మహిళ పేరుని నమోదు చేశారు అధికారులు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎక్కడ జరిగిందంటే..ఈ అరుదైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. ఒకరు కాదు, నలుగురు కాదు, ఒక మహిళ ఏకంగా 27 సార్లు గర్భం దాల్చింది. ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. రష్యా నివాసి అయిన వాలెంటినా వాసిలీవ్ అనే మహిళ 1725 మరియు 1765 మధ్య 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మాస్కోలోని స్థానిక ప్రభుత్వ నివేదిక ప్రకారం, రష్యన్ రైతు ఫియోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసిలీవ్ సుమారు 27 ప్రసవాలతో 69 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. అందులో 16 మంది కవలలే ఉండటం విశేషం. అంటే ఏడు ప ఏడు ప్రసవాల్లో ట్రిపులెట్స్ని, నాలుగు ప్రసవాల్లో నలుగురు చొప్పున పిల్లలను ప్రసవించింది. చరిత్రలో జరిగిన ఈ వింతను వెలికితీసి గుర్తించడమే కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ తల్లి పేరును అత్యంత ఫలవంతమైన తల్లిగా నమోదు చేసింది. రష్యాలోని కొన్ని చారిత్రక పుస్తకాల్లో దీని గురించి ఉంది. పైగా ప్రజలు కూడా ఈ విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ రైతు ఫియోడర్ వాసిలీవ్ మరొక స్త్రీని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఎనిమిది సార్లు గర్భవతి అయ్యి 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాసిలీవ్ మొత్తం 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. వారిలో 84 మంది మాత్రమే జీవించి ఉన్నారు. మిగిలిన ఏడుగురు పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే చనిపోయినట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా..ఒక మహిళ అన్ని సార్లు గర్భం ధరించడం సాధ్యమేనా అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సంతాన సాఫల్య వైద్యుడు జేమ్స్ సెగర్స్ పరిశోధన చేశారు. ఆయన తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇక్కడ వాలెంటినా 40 సంవత్సరాల వ్యవధిలో 27 గర్భాలకు తగినంత సమయం కలిగి ఉంటేనే ఇంతమంది పిల్లలను కనగలదని అన్నారు. అంతేగాదు ఒక స్త్రీ సైన్సు పరంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ మందిని కనగలదని చెప్పారు. మహిళలు సాధారణంగా 15 సంవత్సరాల వయస్సులో రుతుక్రమంలోకి వస్తారు. వారి అండాశయాలు ప్రతి 28 రోజులకు ఒక గుడ్డును విడుదల చేయడం ప్రారంభిస్తాయి. మెనోపాజ్‌లో గుడ్డు సరఫరా అయిపోయే వరకు ఈ అండోత్సర్గము కొనసాగుతుంది. ఈ అండోత్సర్గం తగ్గిపోయే మహిళ వయసు 51 ఏళ్లు అని తెలిపారు. ఇక్కడ ప్రసవాల సంఖ్య పెరిగే కొద్ది సంతానోత్పత్తి స్థాయి పడిపోతుంటుందని, ముఖ్యంగా 40 ఏళ్లు సమీపించేటప్పటికీ ప్రతి చక్రానికి బిడ్డ పుట్టే అవకాశం ఒక్క శాతంగానే ఉంటుందని అన్నారు. ఇక్కడ ఈ మహిళ వాలెంటినా 18 ఏళ్ల వరకు ప్రసవిస్తూనే ఉండి ఉండాలి. అలా ఆలోచిస్తే.. అన్ని సార్లు మహిళ గర్భం ధరించడం అనేది ఆమెకు బిడ్డకు చాలా ప్రమాదకమరమైనది, పైగా సాధ్యం కాదని అన్నారు జేమ్స్ సెగర్స్. (చదవండి: ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్‌గా అవ్వుతారు!) -
వావ్..మనవళ్ల ముందే...రికార్డులు బద్దలు కొట్టింది!
ఒక బామ్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల స్టమక్ ప్లాంక్స్లో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. కెనడాలోని అల్బెర్టాకు చెందిన ఒక బామ్మ డోనాజీన్ వైల్డ్ ఏకంగా 4.5 గంటల పాటు పొత్తికడుపు ప్లాంక్స్ చేసింది. 2019లో కెనడియన్ డానా గ్లోవాకాతో గతంలో నెలకొల్పిన రికార్డు కంటే కేవలం 10 నిమిషాలు ఎక్కువ ప్లాంక్స్ చేసిన ఈ రికార్డును అధిగమించింది. గతంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డోనాజీన్ ఈ ఘనతను సాధించడం విశేషం. దీంతో స్కూలు విద్యార్థులు, తన 12 మంది మనవళ్ల కేరింతల మధ్య ఈ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ టీనా షి రికార్డును పరిశీలించారు. మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయని, కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టంగా గడిచాయని, ఇక చివరి గంటలోచుక్కలు కనిపించాయంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు డోనాజీన్. పదేళ్ల కఠిన ప్రాక్టీస్ తరువాత వరల్డ్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి, తిమ్మిరితో బాధపడేవారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రతీరోజూ ఇచేయడం మొదలు పెట్టారట. డోనాజీన్ ప్రతిరోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేదని, ఈ రికార్డులో భాగంగా దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు ఆమె భర్త రాండీ. -
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మిస్టర్ మిరపకాయ్! అత్యంత ఘాటైన మిరపకాయల సాగుతో రికార్డు..
మిరపకాయల మీద ఉండే విపరీతమైన ఇష్టం అతణ్ణి మిరప సాగువైపు నడిపించింది. మిరప సాగు మొదలుపెట్టాక రకరకాల ప్రయోగాలతో ఘాటులో ఒకదానితో ఒకటి పోటీపడే మిరపకాయలను సృష్టించాడు. చివరకు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను తన తోటలో విజయవంతంగా పండించి, గిన్నిస్ రికార్డుకెక్కాడు. మిరపకాయలంటే ఇంత వెర్రి వ్యామోహమున్న ఈ మిస్టర్ మిరపకాయ్ అసలు పేరు ఎడ్ కర్రీ. కొన్నాళ్లు మిరపకాయలను రుచిచూసి, వాటి ఘాటుకు మార్కులు వేసే టేస్టర్ ఉద్యోగం చేశాడు. తర్వాత 2003లో పకెర్బట్ పెప్పర్ కంపెనీ పేరుతో సౌత్ కరోలినాలో సొంత కంపెనీని ప్రారంభించి, మిరపసాగులో ప్రయోగాలు మొదలుపెట్టాడు. రకరకాల ప్రయోగాల తర్వాత ఎట్టకేలకు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలను పండించగలిగాడు. ఈ మిరపకాయలకు ‘పెప్పర్ ఎక్స్’గా పేరుపెట్టాడు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలుగా గిన్నిస్‌బుక్ అధికారులు గుర్తించారు. తాను పండించిన అత్యంత ఘాటైన మిరపకాయను పూర్తిగా నమిలి తిన్న తర్వాత ఘాటు నసాళానికెక్కిందని, ఒకరకమైన మైకానికి లోనయ్యానని ఎడ్ మీడియాకు చెప్పాడు. ఆ ఘాటు పుట్టించిన మంట నుంచి తేరుకోవడానికి కొన్ని గంటలు పట్టిందని అన్నాడు. (చదవండి: ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా శరీరాన్ని 20కి పైగా మార్పులు..) -
అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!
ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పెప్పర్ ఎక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇంతవరకు అత్యంత ఘాటైన మిరపగా ఉన్న కరోలినా రీపర్ చిల్లి పెప్పర్‌ని వెనక్కి నెట్టి మరీ ఈ పెప్పర్ ఎక్స్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘాటైన మిరపకాయను మిచిగాన్‌కి చెందిన స్మోకిన్ ఎడ్ క్యూరీ రూపొందించారు. ఈ మిరపకాయను ఒక్కటి తిన్నా ఇక అంతే సంగతులు. తిన్న తర్వాత ఏకంగా మూడు గంటల పాటు గొంతు నాలుక మంటగా ఉంటాయట. మిరపకాయలలో క్రియాశీలకమైన భాగం అయిన క్యాప్సైసిన్ అనే విత్తనాలతో కూడిన భాగం తిన్న వెంటనే ఘాటుగా ఫీలయ్యే అనుభూతి కలుగుతుంది. మిరపకాయ ఘాటును స్కోవిల్లే హీట్ యూనిట్లో కొలుస్తారు. ఆ యూనిట్లో ఈ పెప్పర్ ఎక్స్ మిరకాయ ఘాటు ఏకంగా 2.69 మిలియన్లుగా నమోదైంది. జనాన్ని చెదరగొట్టడానికి వినియోగించే పెప్పర్ స్ప్రెని సైతం ఓడించింది. దీని ఘాటు 1.6 మిలియన్లు స్కోవిల్లే హీట్. ఈ స్ప్రే వల్ల ఒక్కోసారి కళ్లు పోతాయి. అంతకు మించి పవర్ఫుల్ అయిన ఈ పెప్పర్ ఎక్స్ మిరపని సరదాకి కూడా తినేందుకు ఎవ్వరూ యత్నించే సాహసానికి దిగలేరని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ఈ మేరకు ఈ మిరపకాయను సృష్టించిన క్యూరీ మాట్లాడుతూ..తాను జన్యు శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని కవర్ చేసి మరీ ఈ ఘాటైన మిరపకాయని సృష్టించినట్లు తెలిపారు. తాము కరోలినా రీపర్ చిల్లీని క్రాస్ బ్రీడింగ్ చేసి మరీ ఈ పెప్పర్ ఎక్స్ మిరపను సృష్టించినట్లు క్యూరీ తెలిపారు. క్యూరీ పదేళ్ల పాటు సాగు చేసి మరీ ఈ ఘాటైన మిరపను రూపొందించాడు. ఈమేరకు క్యూరీ యూట్యూబ్ సిరీస్, "హాట్ వన్స్" ఎపిసోడ్లో తాను సాగు చేసిన ఈ పెప్పర్ఎక్స్(x) గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ప్రస్తుతానికి మాత్రం పెప్పర్ ఎక్స్‌తో తయారు చేసిన హాట్ సాస్‌లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పెప్పర్ ఎక్స్ రుచి గురించి ఇన్స్టాగ్రాం వేదికగా ఐదుగురు సెలబ్రెటి వ్యక్తులను పిలిపించి మరీ వివరించాడు. వారంతా ఈ మిరపను తిన్నా ఆయా సెలబ్రిటీలు అబ్బా...అంటూ దీని ఘాటు గురించి వేర్వేరు విధాలుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Hot Ones (@hotones) (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్‌చైర్‌కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే.. జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా రికార్డు నెలకొల్పోడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్‌గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్పై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి) -
ఆమె పేరిట ఒకటి, రెండు కాదు!..ఏకంగా ఆరు ప్రపంచ రికార్డులు
ప్రముఖ రెజ్లర్ పేరిటి ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ప్రపంచ రికార్డుల ఉన్నాయి. 2007 నుంచి రెజ్లర్‌గా కెరియర్ ప్రారంభించిన ఆమె వరుస గిన్నిస్ రికార్డులతో తన సత్తా చాటుతోంది. ఆమె పేరే నటాల్య. ప్రోఫెషన్ రెజ్లర్ అయిన ఆమె ఇటీవలే మూడు గిన్నిస్ రికార్డులను సాధించి. అంతకు మునుపు మూడు గిన్నిస్ రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు ఆ సంఖ్య కాస్త ఆరుకి చేరుకుంది. మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్టింగ్ మ్యాచ్‌లు) మ్యాచ్‌లు 1,514 ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెజ్లర్‌గా ఓక గిన్నిస్ రికార్డును సైతం దక్కించుకుంది. వాటిలో మొత్తం 663 మ్యాచ్‌లను గెలుచుకుంది. దీంతో ఆమె కెరీర్లో అత్యధిక డబ్ల్యూడబ్ల్యూఈ విజయాలు సాధించిన మహిళగా మరో గిన్నిస్ రికార్డు కైవసం చేసుకునేలా చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..నేను ఒక వ్యక్తిపై గెలిచినట్లుగా కాకుండా నా ప్రతిభను సానబెట్టుకునేలా ఎఫెర్ట్ పెట్టడమే చేశానని, తన కుటుంబం తనకు నేర్పింది అదేనని చెబుతోంది. అదే తనకు ఈ రికార్డులను తెచ్చిపట్టిందని నటాల్య ఆనందంగా చెబుతోంది. ఆమె 2021లో తొలిసారి గిన్నిస్ రికార్డు టైటిల్‌ని గెలిచింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా రాకెట్ మాదిరిగా దూసుకుపోతూ వరుస విజయాలను నమోదు చేసింది. కాగా, నటాల్య తాను గెలుచుకున్న ఆరు గిన్నిస్ రికార్డు టైటిళ్లతో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ..వీటన్నింటినీ తీసుకువెళ్లడానికి పెద్ద లగేజ్ కావలంటూ చమత్కరించింది. These kinds of stats paint the picture that I want for my legacy, long after I’m done. Each one of these records was attained while trying my hardest to build a division, not a person. That’s what my family has taught me. Wrestling is a singles sport you can’t do on your own. https://t.co/S9MYC4FDLC pic.twitter.com/LFFrRvvL85 — Nattie (@NatbyNature) July 2, 2023 (చదవండి: అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!) -
127 గంటలు.. డ్యాన్స్!
127 గంటల లాంగెస్ట్ డ్యాన్స్ మారథాన్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన సృష్టి జగ్తాప్. తన గిన్నిస్ లక్ష్యం కోసం ఎన్నో నెలలపాటు కష్టపడింది సృష్టి. రాత్రి పదికి పడుకొని తెల్లవారుజామున మూడుగంటలకే నిద్ర లేచేది. నాలుగు గంటలు ధ్యానం, ఆరుగంటల పాటు కథక్ నృత్యం సాధన చేసేది. మూడు గంటల పాటు రకరకాల వ్యాయామాలు చేసేది. నృత్యం ద్వారా ప్రపంచవేదికపై భారతీయతను ప్రతిఫలించాలనేది తన కలగా చెబుతుంది సృష్టి. (చదవండి: మూడు కొండలెక్కి చేరుకోవాల్సి ఆ ఆలయాన్ని..నిమిషాల్లో..) -
గిన్నిస్ రికార్డుకెక్కిన కిడ్నీ స్టోన్
కొలంబో: ఈ నెల ఒకటో తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో సైనిక ఆసుపత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని డాక్టర్లు విజయవంతంగా బయటకుతీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా బయటపడ్డ కిడ్నీ స్టోన్స్లో ఇదే పెద్ద రాయిగా రికార్డుకెక్కింది. ఈ రాయి బరువు 801 గ్రాములు, పొడవు 13.37 సెంటీమీటరు. ఇది రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడం గమనార్హం. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న కిడ్నీ స్టోన్‌ను, 2008లో పాకిస్తాన్లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. శ్రీలంకలో వెలికితీసిన రాయి ఆ రెండింటినీ అధిగమించింది. -
వంటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ..ఏకంగా వంద గంటల పాటు..
ఇంతవరకు ఎన్నో రకాలు వరల్డ్ రికార్డులను చూశాం. విభిన్నంగా ఉండటం లేదా ఎవరూ చేయలేని సాహసానికి యత్నించడం వంటివి చూశాం. వాటన్నింటికంటే ఇంకాస్త విభిన్నంగా ఓ మహిళ వంటలతో కూడా రికార్డు సృష్టించొచ్చని నిరూపించింది. పైగా ఇంతకమునుపు అదే ఫీట్‌ని చేసిన మహిళ వరల్ఢ్ రికార్డుని సైతం బ్రేక్ చేసి ఔరా! అనినిపించుకుంది. వివరాల్లోకెళ్తే..నైజీరియాకి చెందిన చెఫ్ హిల్డా బాసి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆమె గత గురువారం నుంచి నాన్‌స్టాప్‌గా వంటలు చేస్తూ గతంలో భారతీయ చెఫ్ లతా టాండన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. గతంలో లతా సుమారు 87 గంటల 45 నిమిషాల పాటు వంట చేసి రికార్డు సృష్టిస్తే..హిల్డా సుమారు 100 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వంటలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉండగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు సదరు చెఫ్ హిల్డా బేక్ చేసిన రికార్డు గురించి తెలిసిందని, ఐతే ఆ రికార్డును అధికారికంగా ధృవీకరించే ముందు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని ట్వీట్ చేసింది. ఈ క్రమంలో సదరు నైజీరియన్ చెఫ్ హిల్డా మాట్లాడుతూ..నైజీరియన్ యువత ఎంతలా కష్టపడి పనిచేస్తారో ప్రపంచానికి తెలియజేప్పేందుకు ఇలా చేశానని చెప్పుకొచ్చింది. సమాజానికి దూరంగా ఉంటున్న ఆఫ్రికన్ యువతులు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె.. మీరు ఏ పనిచేయాలనుకుంటున్నా.. దాన్ని సీరియస్‌గా తీసుకుని అందరికంటే మెరుగ్గా చేయలన్నారు. అందుకోసం అదనపు మైళ్లు దాటి రావల్సిందేననిఝ(కష్టాలను అధిగమించి) నైజీరియన్ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు. అంతేగాదు నైజీరియన్ వంటకాలు గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా హిల్డా తన వంటకాల్లో సూప్ దగ్గర నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ప్రసిద్ధ వంటకాలన్ని హిల్డా తయారు చేసింది. అంతేగాదు ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున విరామం తీసుకుంటూ..తన వ్యక్తిగత విషయాల కోసం 12 గంటల కొకసారి ఒక గంట చొప్పున తీసుకుని ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ నైజీరియాకు ఈ రోజు చాలా గొప్ప రోజు అంటూ హిల్డాను ప్రశంసించాడు. ఆమె ఆశయం చాలా గొప్పదని అభినందించాడు. నైజీరియన్ వంటకాలు తోపాటు ఇక్కడి వ్యక్తులు గురించి తెలుసుకునేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా వంద గంటల పాటు చేయడమనేది అసామాన్య విషయమని అన్నాడు. ఆ మహిళ ఇక్కడ శక్తి చాలా ఎక్కువ ఉందని అనుమానించాల్సిన పని లేదని బల్లగుద్దినట్లు చెప్పింది అంటూ ట్విట్టర్లో హిల్డాని ప్రశంసలతో ముంచెత్తారు అధ్యక్షుడు బుహారీ. View this post on Instagram A post shared by Hilda Baci (@hildabaci) (చదవండి: ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం) -
ఆ మెట్రోకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. గడ్కరీ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మెట్రో రైలు అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్ గల మెట్రోగా గిన్నిస్ రికార్డు సాధించింది. వార్ధా రోడ్లో నిర్మించిన ఈ డబుల్ డక్కర్ వయడక్ట్ సుమారు 3.14 కిలోమీటర్ల మేర ఉంటుంది. నాగ్‌పూర్‌లోని మెట్రో భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేశ్ దీక్షిత్. గిన్నిస్ రికార్డ్స్ జడ్జి రిషి నాత్ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీక్షిత.. వార్దా రోడ్లో ఈ నిర్మాణాన్ని చేపట్టటం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. ఇది థ్రీటైర్ నిర్మాణం. గడ్కరీ ప్రశంసలు.. నాగ్‌పూర్ మెట్రో రైలు గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన క్రమంలో మహారాష్ట్ర మెట్రో విభాగానికి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అత్యంత పొడవైన డబుల్ డక్కర్ వయడక్ట్గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పైన మెట్రో వెళ్తుండగా.. మధ్యలో హైవే, కింద సాధారణ రవాణా మార్గం ఉంటుంది. Another feather in the cap ! Heartiest Congratulations to Team NHAI and Maha Metro on achieving the Guinness Book of World Record in Nagpur by constructing longest Double Decker Viaduct (3.14 KM) with Highway Flyover & Metro Rail Supported on single column. #GatiShakti @GWR pic.twitter.com/G2D26c7EKn — Nitin Gadkari (@nitin_gadkari) December 4, 2022 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో ఇంత పొడవు మేర రెండంతస్తుల ఫ్లైఓవర్ ఎక్కడా నిర్మించలేదు. దీని పొడవు 3.14 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో డబుల్ డక్కర్ వయడక్ట్ పద్ధతిలో అత్యధిక మెట్రో స్టేషన్లు నిర్మించిన విభాగంలోనూ ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది మహారాష్ట్ర మెట్రో. ఇదీ చదవండి: ‘ఎయిమ్స్’ తరహాలో ‘ఐసీఎంఆర్’పై సైబర్ దాడి.. 6వేల సార్లు విఫలయత్నం -
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్‌బుక్‌లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్‌లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్‌సీఎల్‌లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్‌తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్‌గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్‌లు, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్‌లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్‌లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్‌తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్‌కల్యాణ్ జోకర్) -
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు
ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్ అంటారెస్ పవర్స్ అనే హైబ్రిడ్ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్ విలియం జాన్ పవర్స్ తెలిపారు. ఈ సవన్నా జాతి పిల్లులు పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్ పిల్లికి పుట్టిన సంకర జాతి. ఇది సాధారణ పిల్లుల కంటే సుమారు 18.83 అంగుళాల పొడువు ఉంటుందని తెలిపారు. 2016లలో పెన్నిర్‌కి సంబంధించిన మరో జాతి సుమారు 19.05 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఐతే దురదృష్టవశాత్తు ఆ జాతి మొత్తం ఒక అగ్ని ప్రమాదం మరణించాయని తెలిపారు. అవి ఇప్పటికి చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. అంతేగాదు ఈ సవన్నా జాతి పిల్లి తన సంతతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంతని కూడా అన్నారు. అంతేగాదు అంతర్జాతీయ క్యాట్ అసోసియేషన్ ఈ జాతిని దేశీయ జాతిగా గుర్తించిందని చెప్పారు. (చదవండి: టీచర్ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..) -
జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం
జీరో గ్రావిటీలో ఉన్నామంటే గాలిలో తేలియాడడం తప్ప ఇంకేం పని చేయలేం. కానీ అదే జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి చూపించి గిన్నిస్ రికార్డులకెక్కారు ఏడుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌లో పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ ఫిగోతో పాటు మిడిల్ఈస్ట్, యూరోప్, లాటిన్ అమెరికాలకు చెందిన మహిళా, పురుషుల ఫుట్‌బాలర్స్ పాల్గొన్నారు. రెడ్ టీమ్‌కు ఫిగో నాయకత్వం వహించగా.. టీమ్ ఎల్లోకు మరొకరు కెప్టెన్సీ వహించారు. కాగా వీరిని ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు పంపించారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాకా విమానం లోపల ఏర్పాటు చేసిన 75 స్క్వేర్ మీటర్ల పిచ్‌పై మ్యాచ్ ఆడారు. కాగా మ్యాచ్‌లో పోర్చుగీస్ దిగ్గజం లూయిస్ ఫిగో కొట్టిన గోల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నిసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా ఫిగో గోల్ కొట్టేలేకపోయాడు. అయితే జీరో గ్రావిటీ కావడంతో సైకిల్ తొక్కుతున్నట్లుగా గాల్లో తిరిగిన ఫిగో బంతిని ఎట్టకేలకు గోల్‌పోస్ట్‌కు తరలించాడు. కాగా ఔట్ ఆఫ్ వరల్డ్ పేరిట నిర్వహించిన మ్యాచ్‌లో రెడ్ టీమ్ 2-1 తేడాతో టీమ్ ఎల్లోపై విజయం సాధించింది. కాగా జీరో గ్రావిటీలో తొలిసారి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించారు. -
అల్లు అర్జున్ హాజరైన ‘ఇండియా డే పరేడ్’కు 2 గిన్నిస్ రికార్డులు
వాషింగ్టన్: భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరిక, న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్’ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్షల్‌గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టినట్లు అక్కడి ప్రవస భారతీయుల సంఘం ఎఫ్ఐఏ తాజాగా వెల్లడించింది. ఒకటి.. అత్యధికంగా వివిధ రకాల జెండాలను ప్రదర్శించటం, రెండోది.. పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించటంపై రికార్డులు సాధించినట్లు పేర్కొంది. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐఏ వెబ్సైట్లో 1500 మందికిపైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది. గిన్నిస్ రికార్డులు సాధించటంపై గత ఆదివారం ఓ ప్రకటన చేసింది ఎఫ్ఐఏ. భారత స్వాతంత్య్రం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రికార్డ్‌లకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆగస్టు 15, 21 తేదీల్లో నిర్వహించి వివిధ కార్యక్రమాల కోసం 180 మంది వాలంటీర్ల బృందం అహర్నిశలు కృషి చేసిందని తెలిపింది. న్యూయార్క్‌లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్లు తెలిపింది ఎఫ్ఐఏ. మాడిసన్ అవెన్యూలో పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది. భారత్ వెలుపలు దేశ స్వాతంత్య్రంపై చేపట్టిన అతిపెద్ద పరేడ్‌గా గుర్తింపు లభించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: Allu Arjun: 'భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ'.. పుష్ప డైలాగ్‌తో అదరగొట్టిన బన్నీ -
గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు
బనశంకరి: మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మార్గదర్శనంలో అమెరికాలోని డల్లాస్‌లో 2,200 మందితో ఈనెల 13న సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. 30కిపైగా దేశాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. 2,200 మందితో ఒకేసారి సామూహిక భగవద్గీత పారాయణం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. సనాతన ధర్మం, విశిష్ట సందేహాలు, విలువలను జీవితంలో అలవరచుకునే దృష్టితో సామూహిక భగవద్గీత పారాయణ పఠనం చేపట్టగా గిన్నిస్ రికార్డును సృష్టించింది. (చదవండి: ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన) -
హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ.... క్రేజీ గిన్నిస్ రికార్డు
ఇంతవరకు పలు గిన్నిస్ రికార్డులు చూశాం. విచిత్రంగా గోళ్లు లేదా జుట్టు పెంచడం వంటివి చేసి రికార్డు సృష్టిస్తారు. మరికొందరూ తమ ప్రతిభా పాటవాలతో అందర్నీ అబ్బురపరుస్తూ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. కానీ ఇక్కడోక వ్యక్తి అందరిలా కాకుండా అన్నింటికంటే భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా చేసి గిన్నిస్ రికార్డులో కెక్కాడు . వివరాల్లోకెళ్తే....డచ్ ఫిట్నెస్ జౌత్సాహికుడు స్టాన్ బ్రౌనీ, తన సహచర అథ్లెట్ అర్జెన్ ఆల్బర్స్తో కలిసి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు గాల్లో హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ ఫుల్ అప్ ఎక్సర్సైజులు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం వారాల తరబడి ప్రాక్టీస్ చేశారు చూడా. అదీగాక బ్రౌనీ కాలిస్టెనిక్స్కి సంబంధించిన జెమ్నాస్టిక్స్లో నిపుణుడు. ఈ మేరకు బ్రౌనీ జూలై 6, 2022న బెల్జియంలోని ఆంట్వెర్ప్లో హోవెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ క్రేజీ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. అతను గాల్లో హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ ఒక నిమిషం వ్యవధిలో దాదాపు 25 పుల్ అప్ ఎక్సర్సైజులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని సహచర అథ్లెట్ ఆల్బర్స్ గత అమెరికన్ రోమన్ సహ్రద్యన్ రికార్డుని బ్రేక్ చేస్తూ ఒక నిమిషంలో 24 పుల్ అప్ ఎక్సర్సైజులు చేశాడు. కానీ బ్రౌనీ ఈ రికార్డును కూడా బద్దలు కొడుతూ ఏకంగా ఒక నిమిషంలో 25 చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
అలాంటి ఇలాంటి రికార్డు కాదు....కారు వెళ్తుండగానే టైరు మార్చడం
ఇంతవరకు ఎన్నో గిన్నిస్ రికార్డులు చూశాం. మీసాలతో కారుని లాగడం, ఒక్కవేలుతో పెద్దపెద్ద బరువులను ఎత్తడం వంటి ఎన్నో భయంకరమైన ఫీట్లతో చేసిన రికార్డులను చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా ఏకంగా కారు వెళ్తుండగానే కారులో ఉండే టైరు మార్చడం అంటే ఊహకందని విషయం. ఇలాంటి ఫీట్ చేయాలనే ఆలోచన రావడమే గ్రేట్ అనుకుంటే అసాధ్య కాదంటూ చేసి చూపించి మరీ గిన్నిస్ రికార్డు సృష్టించారు ఇద్దరు ఇటాలియన్లు. వివారాల్లోకెళ్తే....ఇటలీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు షోలో ఇద్దరు ఇటాలియన్ వ్యక్తులు కదులుతున్న వాహనంలో ఉండే టైరు మార్చి రికార్డు సృష్టించారు. అదీ కూడా చాలా వేగంగా ఒక నిమిషం 17 సెకన్ల వ్యవధిలో మార్చేశారు. ఈ మేరకు మాన్యయోల్ జోల్డాన్ అనే వ్యక్తి కారుని డ్రైవ్ చేస్తుండగా... జియాన్లుకా ఫోల్కో కారు వేగంగా కదులుతుంటే కారు కిటికిలోంచి వేలాడుతూ... టైరు మార్చేశాడు. మునపటి రికార్డును బ్రేక్ చేసి మరీ అత్యంత వేగవంతంగా కారు టైరుని మార్చేశాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ...ఏకంగా 500 మందికి భోజనాలు) -
ఒక్క ఉంగరంలోనే ఏకంగా 20 వేల వజ్రాలు... రికార్డు సృష్టించింది
తిరువనంతపురం: భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీలలో ఒకటైన ఎస్‌డబ్ల్యూఏ ఒక్క ఉంగరంలో ఒకటి రెండూ కాదు దాదాపు 24 వేల వజ్రాలతో ఒక ఉంగరాన్ని రూపొందించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో తయారైన ఈ ఉంగరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తోపాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్సు వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఈ ఉంగరానికి ది టచ్ ఆఫ్ అమీ' అని పేరు పెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీమతి రిజిషా దీన్ని రూపొందించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,679 వజ్రాలతో కేరళలో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డు సాధించింది. అత్యధిక వజ్రాలు సెట్ ఇన్ వన్ రింగ్ విభాగం పేరిట ఈ రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించే బెల్జియం వంటి దేశాలను వెనక్కి నెట్టి మరీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయం అని ఎస్‌డబ్ల్యూఏ కంపెనీ యజమాన్యం చెబుతోంది. (చదవండి: అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు) -
ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు... బనానా రికార్డు!
Banana Bonanza: అరటి పండ్లను ఇలా వరుసగా పేర్చారేమిటని ఆశ్చర్యపోతున్నారా? అమెరికాలోని షికాగోకు చెందిన జ్యువెల్ ఓస్కో అనే సూపర్ మార్కెట్ స్టోర్ నిర్వాహకులు ఇలా పండ్లను పేర్చడం ద్వారా సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇందులో పెద్ద గొప్పేం ఉంది.. ఎవరైనా ఈ రికార్డు సృష్టించొచ్చు అనుకుంటున్నారా? కానీ ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు మరి.. ఇందుకోసం వాడిన అరటిపండ్లు ఎన్నో తెలిస్తే మీరు అవాక్కవుతారు.. ఎందుకంటే ఏకంగా 31,751 కిలోల అరటిపండ్లను ఇలా వరుసగా పేర్చారు. అంటే ఒక్కో అరటిపండు సుమారు 100 గ్రాముల బరువు ఉంటుందనుకుంటే ఈ రికార్డు కోసం వాడిన అరటిపండ్ల సంఖ్య సుమారు 3 లక్షలన్నమాట! ఇలా అరటిపండ్లను వరుసగా పేర్చడానికి స్టోర్ నిర్వాహకులకు 3 రోజుల సమయం పట్టిందట. ఈ రికార్డుతో బ్రెజిల్లో 2016లో 18,805.83 కిలోల అరటిపండ్లను పేర్చడం ద్వారా నమోదైన గిన్నిస్ రికార్డు తెరమరుగైంది. గిన్నిస్ ప్రతినిధులు ఈ రికార్డును ధ్రువీకరించాక ఆ అరటిపండ్లలో కొన్నింటిని సూపర్ మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులకు నిర్వాహకులు పంచిపెట్టారు. మిగిలిన వాటిని ఉత్తర ఇల్లినాయీ ఆహార బ్యాంకుకు పంపారు. The folks from @GWR have surveyed the display and it's official! We have a new WORLD RECORD! Our roving banana reporter Leslie Harris is LIVE at the @jewelosco in Westmont (@westmontilgov) with the latest fruit-related news!#Westmont #Bananas #LotsofBanans #WorldRecord pic.twitter.com/n5Qobn13YA — 95.9 The River (@959TheRiver) June 8, 2022 (చదవండి: దురదృష్టకరమైన ఘటన... గాయపడిన పక్షిని రక్షించడమే శాపమైంది) -
ప్రపంచంలోనే పొట్టి టీనేజర్‌గా బహదూర్.. రికార్డు బలాదూర్
World's shortest teen: ప్రపంచంలోనే పొట్టి టీనేజర్ (మగవాళ్లలో)గా నేపాల్‌కు చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్ల పొడవే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉంది. ఈయన ఎత్తు 70 సెంటీమీటర్లు. ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు కేవలం 62 సెంటీమీటర్లు. (చదవండి: ఇల్లంతా దోచేసి...ప్రేమలేఖ పెట్టి పారిపోయిన దొంగలు) -
ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా..
Golden Quadrilateral Run: ఇంతవరకు మనం ఎంతో మంది సాధించిన ప్రపంచ రికార్డుల గురించి విన్నాం. తమదైన నైపుణ్యం, ప్రతిభను కనబర్చి సాధించినవారు కొందరూ. మరికొంతమంది వినూత్న ఆవిష్కరణలతో రికార్డులు సృష్టించారు. అచ్చం అలాంటి కోవకు చెందిందే ఢిల్లీకి చెందిన ఈ మహిళ. వివరాల్లోకెళ్తే...ఢిల్లీకి చెందిన సుఫియా అనే అల్ట్రా రన్నర్ డిసెంబర్ 16, 2020న దేశ రాజధాని నుంచి తన పరుగును ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలను కలిపే జాతీయ రహదారుల నెట్వర్క్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (బంగారు చతుర్భుజం)ని చుట్టి వచ్చింది ఈ 35 ఏళ్ల అథ్లెట్. ఆమె 6 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సుమారు 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేసింది. నిజం చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయాణం. ఆమె ఒక దశలో ప్రయాణాన్ని విరమించుకోవాలనుకుంది. అంతేకాదు ఆమెకు ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలయ్యాయని అయినప్పటికీ తన లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించానని చెబుతోంది. తాను ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పరుగును తన భర్త మద్దతుతోనే పూర్తి చేయగలిగానని చెప్పింది. అంతేకాదు ఈ ప్రయాణంలో తనతో దాదాపు అన్ని నగరాల్లోని రన్నర్లు, సైక్లిస్టులు చేరారని తెలిపింది. ఈ ప్రయాణంలో తనకి కొంతమంది ప్రజలు ఆతిధ్యం ఇచ్చారని, ఒక్కోసారి రోడ్డు పక్కన షెల్టర్‌లోనే పడుకోవలసి వచ్చిందని చెపింది. ఈ మేరకు ఆదివారం ఆమె గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న తర్వాత ఈ రికార్డును ధృవీకరించారు. అంతేకాదు ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా (87 రోజులు, 2 గంటలు, 17 నిమిషాలు; ఏప్రిల్ 25-జూలై 21, 2019) - తన పేరుతో మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం సుఫియా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తి సమయం అల్ట్రా రన్నింగ్‌లో మునిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. It a Guinness World Records and It's Officially Amazing!!🏆🏆🏆 SUFIYA KHAN is Fastest female to run along The Indian Golden Quadrilateral Road (6002km in 110 days 23 hours) Congratulations Sufiya Khan!!💪💪💪🥇🥇🥇 🇮🇳🇮🇳🇮🇳#guinessworldrecord#girlpower #womenpowerment pic.twitter.com/w88kJIOBpP — Mohammad Mohsin I.A.S (@mmiask) March 28, 2022 (చదవండి: విచిత్రమైన ఫిర్యాదు...మోదీ ఫోటో తీసేయమని బెదిరింపులు) -
ప్రపంచంలోనే అతి పొడవైన కారుగా...వరల్డ్ రికార్డు
Worlds Longest Car Break Its Own Record Over 100 Feet Long: ఎవరు చేయని వాటిని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నవాళ్లు కోకొల్లలు. కానీ అవి ఉపయోగపడేవే అయితే సమస్య లేదు. నిరూపయోగంగా మారితేనే బాధ అనిపిస్తుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తొలుత 60 అడుగుల పెద్ద కారు రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఇంకాస్త ముందడుగు వేసి ఏకంగా 100 అడుగుల కారుని రూపొందించి తన రికార్డుని తానే తిరగరాశాడు. కానీ ఈ తర్వాత నుంచే ఆ కారు నిర్వహణకు సంబంధించిన సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆ కారు ఏమైందో తెలుసా! వివరాల్లోకెళ్తే...ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గతంలో ఉన్న ఆ కారు రికార్డును అదే బ్రేక్ చేసింది. ఈ కారు సుమారు 100 అడుగుల పొడవు. అమెరికన్ డ్రీమ్‌గా పిలిచే లియోసిన్ అనే ఈ కారుని జే ఓర్బెర్గ్ రూపొందించాడు. అతను 1986లో 60 అడగులు పొడవు గల కారుని రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మళ్లీ ఆ రికార్డుని బ్రేక్ చేసేలా దాదాపు 100 అడుగుల కారుని రూపొందించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ కారుని ప్రంపచంలోనే అత్యంత పొడవైన కారుగా గుర్తించింది కూడా. అంతేకాదు ఈ కారు సుమారు 10 టాటా నానోల వెనుక వరుసల ఉంచితే ఉండేంత పొడవు. అయితే ఆ తర్వాత ఆ కారు నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో ఆ కారుని న్యూజెర్సీ వేర్‌హౌస్‌లో ఉంచారు. పైగా ఈ కారున అద్దెకు తీసుకోవడం ఆర్థికపరంగా పెద్ద సమస్యగా మారింది. అయితే న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలో ఆటోసియం టెక్నికల్ టీచింగ్ మ్యూజియం యజమాని మైఖేల్ మానింగ్ ఈ కారుని లీజు తీసుకుని నిర్వహించేవాడు. అయితే అతను లీజు ముగిసేనాటికి కారులో ఉన్న పలు భాగాలు తిరిగి బాగు చేసేందుకు వీలు లేనంతగా పాడవటంతో మానింగ్ కారుని eBay జాబితా చేసింది. కానీ మానింగ్ అనూహ్యంగా ఓర్బర్గ్తో మళ్లీ ఒప్పందం చేసుకుని ఆ కారుని తీసుకున్నాడు. ఈ క్రమంలో ప్లోరిడాలోని పర్యాటక ఆకర్షణ కలిగి ఉన్న ఓర్లాండోలో డెజర్‌ల్యాండ్ పార్క్ కార్ మ్యూజియం యజమాని మైఖేల్ డెజర్ 2019లో ఈ కారుని కొనగోలు చేశాడు. ఆ తర్వాత అతను మానింగ్తో కలసి ఈ కారుని అత్యాధునికంగా పునరుద్ధరించాడు. దీంతో ఇప్పుడూ ఈ అతిపెద్ద కారులో 75 మందికి సరిపడ హెలిప్యాడ్, డైవింగ్ బోర్డ్‌తో సహా స్విమ్మింగ్ పూల్, వంటి అత్యాధునిక వసతులు అన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు ఆ పార్క్‌లో అత్యధిక సంఖ్యలో పర్యాటకుల కొలువుదీరేలా ప్రధాన ఆక్షర్షణ ఉంది ( చదవండి: ఆ విమానంలో ఆమె మాత్రమే ప్రయాణికురాలు) -
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన సత్యప్రకాశ్ అనే తాళాలు తయారు చేసే వ్యక్తి, అతని భార్య కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అంతేకాదు ఆ తాళం 30 కిలోల బరువున్న తాళం చెవితో తెరుచుకుంటుంది. పైగా సుమారు రూ. 2 లక్షలు ఖరీదు చేసే ఈ తాళం పై రాముడి చిత్రం ఉంటుందని అంటున్నారు. అయితే దీన్ని వాళ్లు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి అంకితం చేయనున్నారు. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) ఈ మేరకు ఆ వ్యక్తి 10 అడుగుల పొడవు 400 కిలోల బరువు ఉండే ఆ తాళాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందన్నాడు. అంతేకాదు తాళం తుప్పు పట్టకుండా ఉండేందుకు స్టీల్ స్క్రాప్ సీటు కూడా ఉంటుందని తెలిపాడు. అయితే ఈ లాక్‌ని క్షేత్ర స్థాయిలో పూర్తి చేయడానికి ఇంకా కొంత నిధులు అవసరం అవుతాయని, పైగా ఆర్థిక సాయం నిమిత్తం ప్రజలను అభ్యర్థించినట్లు కూడా వెల్లడించాడు. అంతేకాదు ఈ కళను ప్రోత్సహించడానికి ప్రభుత్వ సహకారం అవసరం అంటున్నాడు. తాను ఈ తాళాన్ని అప్పు చేసి మరీ తయారు చేశానని చెప్పాడు. అంతేకాదు సత్యప్రకాశ్ గతేడాది ప్రారంభంలో 300 కిలోల తాళాన్ని తయారు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను తయారు చేసిన తాళాలను రిపబ్లిక్ పరేడ్‌లో చేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు తాను తయారు చేసిన తాళానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి: అక్కడ ప్రజలు టీతోపాటు టీ కప్పులను కూడా తినేస్తారట!) -
ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్
న్యూయార్క్: నిజానికి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు బ్రతికి ఉండడం అత్యంత అరుదు. ఒకవేళ బతికినా జీవితాంతం ఏవో అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. కానీ ఇప్పటి వరకు నెలలు తక్కువగా పుట్టడం అంటే మహా అయితే డెలివరీ తేదికి కాస్త ఒక నెల ముందుగా లేదా ఒక నెల రెండు వారాలు అటు ఇటుగా పట్టడం జరుగుతుంది. కానీ అలా ఇలా కాకుండా కేవలం 21 వారాలు 1 రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్‌కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. (చదవండి: ఇదో కొత్తరకం కేఫ్... ఇంత వరకు ఎవ్వరూ చూసుండరు!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21 వారాలు 1 రోజుతో జన్మించి ప్రపంచలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఆ చిన్నారి తల్లి మిచెల్ చెల్లీ బట్లర్‌కి మొదట గర్భం బాగానే ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె ఆరోగ్యంలో చిన సమస్య తలెత్తడంతో అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం గతేడాది జూలై 4న ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రి నుండి బర్మింగ్‌హామ్ (యూఏబీ)లోని అలబామా విశ్వవిద్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఆమెకు అబార్షన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆమె పట్టబట్టడంతో డెలివీరీ తేదికి 19 వారాలు ముందుగా అంటే 21 వారాల 1 రోజు (148 రోజులు) గర్భధారణతో జూలై 5న మధ్యాహ్నాం 1 గంటకు కర్టిస్ జన్మించాడు. అయితే వైద్య సిబ్బంది ఆ వయసు పిల్లలు బతకడం కష్టం అని తేల్చి చెప్పేశారు. కానీ ఆశ్చర్యంగా కర్టిస్ చికత్సకు స్పందించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ వైద్యులు ఇలా బతకట కష్టం ఈ విధంగా చికిత్స అందించటం చాలా ఒత్తిడితో కూడిని పని అని చెప్పారు. ఈ మేరకు యూఏబీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్ మాట్లాడుతూ, "ఈ వయస్సులో ఉన్న పిల్లలు బతకలేరనే చాలా కేసులు చెబుతున్నాయి. కానీ ఈ తల్లి ఆశ నెరవేరుతుందో లేదో అనుకున్నాను. పైగా ఇంత నెలల తక్కువ బిడ్డను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌కి తరలించడం కష్టమని గ్రహించాం. దీంతో ఆ బిడ్డ ఉన్న ప్రదేశం నుంచే చికిత్స అందించాం. అయితే ఆ చిన్నారి ఆక్సిజన్‌కి స్పందించడం హృదయస్పందన రేటు పెరగడం జరిగింది. అంతేకాతు ఆ చిన్నారికి మూడు నెలల వయసు వచ్చే వరకు వెంటిలేటర్ మీద చికిత్స అందించాం" అని అన్నారు. ఆ తర్వాత ప్రాంతీయ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఆర్ఎన్ఐసీయూ)లో 275 రోజులు గడిపిన తదనంతర చిన్నారి కర్టిస్ ఈ ఏడాది ఏప్రిల్ 6న ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ మేరకు నియోనాటాలజీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కోల్మ్ ట్రావర్స్ చిన్నారి కర్టిస్ 21 వారాల 1-రోజు గర్భధారణ వయస్సులో జన్మించివాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పి ఉండవచ్చన్న అనుమానంతో చిన్నారి తల్లి మిచెల్‌తో గిన్నిస్ రికార్డుకి దరఖాస్తు చేయించారు. అంతేకాదు గిన్నిస్ రికార్డు కూడా ప్రపంచంలోనే అత్యంత నెలలు నిండకుండా జన్మించిన అరుదైన చిన్నారిగా ప్రకటించటం విశేషం. (చదవండి: ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు! -
సెంచరీ వయసులో పవర్ లిఫ్టర్‌గా రికార్డు సాధించిన బామ్మ
న్యూయార్క్: ఈ ఫోటోలో కనిపిస్తున్న బామ్మగారు తన వయసులోని మిగిలిన మహిళల్లా మూలన కూర్చునే రకం కాదు. సెంచరీ వయసులోనూ సవాళ్లకు సై అనే సాహసి. బరువులెత్తడంలో గొప్ప బలశాలి. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన పవర్ లిఫ్టర్‌గా ఇటీవలే గిన్నిస్ రికార్డును సైతం బద్దలుకొట్టిన ఈ అమెరికన్ బామ్మ పేరు ఎడిత్ ముర్వే ట్రయిన్. ఇటీవల ఆగస్టు 8న నూరవ పుట్టినరోజు జరుపుకొన్న ఈ బామ్మ తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే.. ఆగస్టు 5న గిన్నిస్ రికార్డు సాధించింది. (చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని) వృద్ధుల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రికార్డు బద్దలుకొట్టిన ఎడిత్, చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేమీ కాదు. ఇదివరకు ఆమె ఒక స్థానిక రిక్రియేషన్ క్లబ్లో డాన్ ట్రైనర్‌గా పనిచేసేది. రోజూ డాన్స్ చేయడం వల్లనే తన శారీరకమైన కదలికల్లో చురుకుదనం ఇప్పటికీ తగ్గలేదని చెబుతుందీమె. పోటీల కోసం ప్రత్యేక ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలేవీ పాటించలేదని, రోజూ రాత్రిపూట జిన్‌తో తయారు చేసే ‘మార్టిని’ కాక్టెయిల్ తీసుకోవడం తనకు అలవాటని, బహుశ ఆ అలవాటే తన చురుకుదనానికి కారణం కావచ్చని ఈ బామ్మ చిరునవ్వులు చిందిస్తూ చెబుతుండటం విశేషం. (చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!) -
అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!
టర్కీ: టర్కీకి చెందిన 24 ఏళ్ల రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళగా అవతరించారు. అంతే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమెను సజీవంగా ఉన్న పొడవైన మహిళగా పేర్కొంది. రుమేసా 7.07 ఫీట్ల (215.16 సెం.మీ) పొడవుంది. ఆమె అసాధారణమైన పెరుగుదలకు కారణం వీవర్స్ సిండ్రోమ్ అని వైద్య నిపుణలు వెల్లడించారు. ఇది ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మతగా పేర్కొన్నారు. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) దీంతో ఆమె అసాధారణంగా పెరగడమే కాక చేతులు 24.5 సెంటిమీటర్లు, పాదాలు 30.5 సెం.మీ. పొడవు ఉన్నట్లు వివరించారు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడటమే కాక అనేక శారీరక సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈ మేరకు ఆమె ఎక్కువగా వీల్ చైర్ లేదా వాకింగ్ ఫ్రేమ్ సాయంతో నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. 'ప్రతి ప్రతికూలత మనకు ప్రయోజనకారే మీరు, మీ సామర్థ్యాన్ని గుర్తించండి' అంటూ ఒకరూ.. మరొకరేమో గుంపులో ఒకరుగా కాక మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన వ్యక్తిగా ఉంటారంటూ’ నెటిజన్లు రకరకాలుగా ఆమెకి ధైర్యం నూరిపోస్తు ప్రోత్సహిస్తున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) -
‘గీతం’ విద్యార్థిని ఆరో గిన్నిస్ రికార్డు
పటాన్చెరు: ఆరు గిన్నిస్ రికార్డులు సాధించి గీతం డీమ్డ్ యూనివర్సిటీ (హైదరాబాద్) విద్యార్థిని చరిత్ర సృష్టించింది. బీటెక్(సీఎస్ఈ) మూడో సంవత్సరం చదువుతున్న శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మంగళవారం ఈ రికార్డును నెలకొల్పింది. ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవా స్తవ, అనిల్‌శ్రీవాస్తవలతో కలసి పసుపు రంగులో ఉన్న 6132 ‘ఆరెగామీ సిట్రస్ ఫ్రూట్స్ ఇన్ఫ్లేటెడ్ లెమన్స్’(ఆరెగామీ పేపర్‌తో రూపొందించిన నిమ్మ తొనలను గాలితో నింపి ప్రదర్శనగా పెట్టడం)ను ఒకే చోట ఉంచి, ప్రపంచంలోని అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పింది. ఆరెగామీ కాగితంతో ఆరు వేల నిమ్మ తొనలను తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటిన్నింటిలో గాలి నింపి ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు. ఈ ప్రదర్శనను ధ్రువీకరిస్తూ గిన్నిస్ నిర్వాహకులు ఆరో రికార్డును అందజేశారు. త్వరలో మరో ప్రదర్శనను గీతంలో ఏర్పాటు చేయనున్నట్లు శివాలి కుటుంబం తెలిపింది. గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులను గీతం వైస్ చాన్సలర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ అభినందించారు. అంతకుముందు శివాలి క్విల్లింగ్ పేపర్‌తో చేతితో రూపొందించిన 1,251 బొమ్మలు, 7,011 పుష్పాలు, 2,111 విభిన్న బొమ్మలను తయారు చేసి గిన్నిస్ రికార్డు అందుకుంది. ఒకే రంగుతో 3,501 వేల్స్, 2,100 పెంగ్విన్లను కూడా శివాలి కుటుంబం రూపొందించి రికార్డు సైతం నమోదు చేసింది. -
రికార్డు తిరగరాసిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే సోషల్ మీడియాలో రికార్డు మోత మోగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచిన నిమిషాల వ్యవధిలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని ఛేదించారు.దీంతో అతివేగంగా గరిష్ట ఫాలోవర్స్‌ను సాధించిన ఇన్స్టాగ్రామ్ యూజర్‌గా వీరి ఖాతా గిన్నిస్ రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 2వ తేదీన ససెక్స్ రాయల్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా మిలియన్లకొద్దీ ఫాలోవర్లు, లైక్‌లతో దూసుకుపోతోంది. మొదటి 5గంటల్లో పది లక్షమంది ఫాలోవర్స్‌ను నమోదు చేసింది. అనంతరం ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఇప్పటికే 9లక్షలకు పైగా లైక్స్‌ను పొందింది. ప్రస్తుతం 2. 6 మిలియన్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అతి తక్కువ సంయంలో మిలియన్ల ఫోలోవర్స్ సాధించిన రికార్డు పోప్ ఫాన్సిస్ పేరుతో వుంది. అనంతరం దక్షిణ కొరియా పాప్ సింగర్ కాంగ్ డేనియల్ (11గంటలు) ఈ ఘనతను సాధించారు. ప్రిన్సెస్ యుజెనీ మొదలుకొని డేవిడ్ బెక్హాం, బ్లేక్ లైవ్లీ, గ్వినేత్ పాల్ట్రో, మిండీ కాలింగ్ లాంటి సెలబ్రిటీలు వీరి ఫాలోవర్స్‌గా ఉన్నారు. ఇంకా మేఘన్ క్లోజ్ ఫ్రెండ్, నటి ప్రియాంకా చోప్రా, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, జెస్సికా ముల్రనీ ఈ ఖాతాలోని మొదటి అనుచరుల జాబితాలో ఉన్నారు. కాగా కేవలం 23మంది ఫాలోవర్స్ మాత్రమే ససెక్స్రాయల్ అకౌంట్లో ఉన్నారు. కాగా మరో నెలరోజుల్లోనే మేఘన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక పుట్టిన బిడ్డ ఫోటో పోస్ట్ చేస్తే ఇంకెన్ని రికార్డు ల మోత మోగనుందోనని భావిస్తున్నారు. -
రికార్డు సృష్టించిన నాట్యాంజలి
సాక్షి,చెన్నై : చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో జరిగిన నాట్యాంజలి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు ఏటా నటరాజ స్వామి ముందు తమ నాట్యంతో అంజలి ఘటించటం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. నాట్యం అభ్యసించిన ప్రతి కళాకారుడు నటరాజ స్వామికి తమ నాట్యాన్ని అంకితం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నటరాజ స్వామి ఆలయంలో నాట్యాంజలి పేరుతో నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగానే 2017లో 4525 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై చేసిన నాట్యాంజలి రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది కూడా నాట్యంజలిలో గిన్నిస్ రికార్డు సృష్టించాలని నిర్ణయించారు. దీక్షితుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఆలయంలో ఈ ఏడాది నాట్యాంజలిని రికార్డు చేసేందుకు గిన్నిస్ బుక్ వారిని ఆహ్వానించారు. దీంతో ప్రఖ్యాత నాట్య కళాకారిణి గురు పద్మభూషణ్ పద్మసుబ్రమణ్యం నేతృత్వంలో 19 వేల నాట్య కళాకారులతో నాట్యంజలి నిర్వహించారు. ఇందులో తమిళనాడు నలుమూలల నుంచి 7195 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై నటరాజస్వామికి తమ నాట్యంతో అంజలి ఘటించారు. తద్వారా గతంలో ఉన్న 4 వేల మంది నాట్యాంజలి రికార్డు తిరగరాశారు. గిన్నిస్ ప్రతినిధి రిషినాధ్ ఆలయ దీక్షితులకు రికార్డు పత్రాన్ని అందచేశారు. ఒకే వేదికపై 7 వేల మంది నాట్యకళాకారులు తమ అభినయంతో నటరాజ స్వామికి నాట్యాంజలి అందించటం చిదంబరం ఆలయంలో వేడుకను తలపించింది. -
రికార్డు సృష్టించిన నాట్యాంజలి
-
గిన్నిస్ రికార్డు దిశగా బైక్ యాత్ర
హైదరాబాద్(బంజారాహిల్స్): రోడ్డు భద్రత, మహిళా సాధికారత, శుభ్రత, చైల్డ్ గర్ల్ లక్ష్యంగా ఢిల్లీకి చెందిన అభయ్‌సింగ్(33) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకునేందుకు చేపట్టిన బైక్ యాత్ర మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఢిల్లీకి చెందిన అభయ్‌సింగ్ జనవరి 18వ తేదీన గుజరాత్ గాంథీనగర్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరు వేల కిలోమీటర్ల యాత్రను పూర్తిచేశారు. హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా నిబంధనల ప్రకారం ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉండగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రత, శుభ్రత, బాలికా రక్షణ, మహిళా సాధికారత కోసం ఈ యాత్రను చేపట్టానని, ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ముందుకుసాగుతున్నానన్నారు. ఇప్పటివరకు బైక్ యాత్ర చైనాకు చెందిన జాంగ్ ఇంగ్‌పా పేరు మీద ఉందని, ఆయన చైనాలో 35,511 కిలోమీటర్లు పర్యటించి గిన్నీస్‌బుక్‌లో చోటు సంపాదించారని వెల్లడించారు. తాను 45 వేల కిలోమీటర్లు తిరిగే లక్ష్యంతో యాత్రను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ 11 గంటల పాటు తాను రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్‌పై సోలోయాత్ర దిగ్విజయంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా 35 నగరాలను చుట్టివచ్చినట్లు పేర్కొన్నారు. అభయ్‌సింగ్ పుట్టింది సికింద్రాబాద్‌లో. తండ్రి దల్బీర్‌సింగ్ ఆర్మీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లో నివసించేవాడని తెలిపాడు. అయితే తాను పుట్టిన ఆరు నెలల తరువాత ఇక్కడి నుంచి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చిందని పేర్కొన్నారు.