![Girl Sets Guinness World Record for Longest Dance At Maharashtras Latur - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/18/Dance_Maha.jpg.webp?itok=qZT4kpai)
127 గంటల లాంగెస్ట్ డ్యాన్స్ మారథాన్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన సృష్టి జగ్‌తాప్. తన గిన్నిస్ లక్ష్యం కోసం ఎన్నో నెలలపాటు కష్టపడింది సృష్టి. రాత్రి పదికి పడుకొని తెల్లవారుజామున మూడుగంటలకే నిద్ర లేచేది.
నాలుగు గంటలు ధ్యానం, ఆరుగంటల పాటు కథక్ నృత్యం సాధన చేసేది. మూడు గంటల పాటు రకరకాల వ్యాయామాలు చేసేది. నృత్యం ద్వారా ప్రపంచవేదికపై భారతీయతను ప్రతిఫలించాలనేది తన కలగా చెబుతుంది సృష్టి.
(చదవండి: మూడు కొండలెక్కి చేరుకోవాల్సి ఆ ఆలయాన్ని..నిమిషాల్లో..)
Comments
Please login to add a commentAdd a comment