జీరో గ్రావిటీలో ఉన్నామంటే గాలిలో తేలియాడడం తప్ప ఇంకేం పని చేయలేం. కానీ అదే జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి చూపించి గిన్నిస్ రికార్డులకెక్కారు ఏడుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌లో పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ ఫిగోతో పాటు మిడిల్‌ఈస్ట్, యూరోప్, లాటిన్ అమెరికాలకు చెందిన మహిళా, పురుషుల ఫుట్‌బాలర్స్ పాల్గొన్నారు. రెడ్ టీమ్‌కు ఫిగో నాయకత్వం వహించగా.. టీమ్ ఎల్లోకు మరొకరు కెప్టెన్సీ వహించారు.
కాగా వీరిని ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు పంపించారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాకా విమానం లోపల ఏర్పాటు చేసిన 75 స్క్వేర్ మీటర్ల పిచ్‌పై మ్యాచ్ ఆడారు. కాగా మ్యాచ్‌లో పోర్చుగీస్ దిగ్గజం లూయిస్ ఫిగో కొట్టిన గోల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నిసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా ఫిగో గోల్ కొట్టేలేకపోయాడు. అయితే జీరో గ్రావిటీ కావడంతో సైకిల్ తొక్కుతున్నట్లుగా గాల్లో తిరిగిన ఫిగో బంతిని ఎట్టకేలకు గోల్‌పోస్ట్‌కు తరలించాడు. కాగా ఔట్ ఆఫ్ వరల్డ్ పేరిట నిర్వహించిన మ్యాచ్‌లో రెడ్ టీమ్ 2-1 తేడాతో టీమ్ ఎల్లోపై విజయం సాధించింది. కాగా జీరో గ్రావిటీలో తొలిసారి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment