ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం. కోపంతో గొడవలు జరిగిన సమయంలో ఆటగాళ్లు కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తూ తనకు తెలియకుండా జరిగిన పొరపాటు వల్ల ప్రత్యర్థి ఆటగాడికి ఎంత నష్టం జరిగిందనేది ఈ వార్త తెలియజేస్తుంది.
విషయంలోకి వెళితే.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా బ్రెజిల్ ఫ్లుమినెన్స్,అర్జెంటినోస్ జూనియర్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. కాగా ఆట 56వ నిమిషంలో బ్రెజిల్ ఫ్లుమినెన్స్ ఆటగాడు మార్సెలో బంతిని తన్నబోయి అనుకోకుండా ప్రత్యర్థి డిఫెండర్ లుసియానో సాంచెజ్ ఎడమ కాలు గట్టిగా తొక్కాడు. మార్సెలో బంతిని తన్నబోయే సమయంలోనే లుసియానో అతని వైపు దూసుకురావడం.. కాలు అడ్డుపెట్టడం జరిగిపోయాయి.
దీంతో లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం.
బాధ భరించలేక ఏడుస్తునే మైదానం వీడిన లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ''నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్‌బాలర్‌ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా'' అని మార్సెలో ట్విటర్‌లో పేర్కొన్నాడు. మార్సెలో పోస్ట్‌పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ''మనం ప్రత్యర్థులం.. శత్రువులం కాదు'' అని కామెంట్ చేసింది.
Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu
— Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023
చదవండి: 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్
స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు షాక్; డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో భారీ కోత
Comments
Please login to add a commentAdd a comment