బ్రెజిల్‌లో జరిగిన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ రసాభాసగా మారింది. మ్యాచ్ ఓడిపోయామన్న కోపంతో ఆటగాళ్లు, జట్టు ప్రెసిడెంట్ కలిసి రిఫరీపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఫోర్త్ డివిజన్ టోర్నమెంట్‌లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సెర్గిపె, బొటాపొగోల మధ్య మ్యాచ్ జరిగింది.
90 నిమిషాల ఆట ముగిసిన తర్వాత సెర్గిపె ఆధిక్యంలో ఉంది. అయితే అదనంగా తొమ్మిది నిమిషాలు కేటాయించారు. ఈ సమయంలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలం కావడంతో మరో 30 సెకన్లు అదనంగా కేటాయించారు. ఎక్స్‌ట్రా సమయంలో రియో డి జెనెరియో క్లబ్‌కు చెందిన బొటాపొగో గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. అయితే బ్రెజిలియన్ కప్‌లో ఏదైనా మ్యాచ్ డ్రాగా ముగిస్తే ముందు ఆధిక్యంలో ఉన్న టీమ్ ఎలిమినేట్ కావడం జరుగుతుంది.
ఈ లెక్కన సెర్గిపె మ్యాచ్ నుంచి ఎలిమినేట్ అయినట్లు రిఫరీ బ్రాలియో ద సిల్వా ప్రకటించారు. ఇదంతా గమనించిన సెర్గిపె ప్రెసిడెంట్ ఎర్నన్ సేనా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. ఆటగాళ్లతో కలిసి రిఫరీతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో రిఫరీపై ఆటగాళ్లు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆటగాళ్లపై లాఠీచార్జీ చేసి అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Presidente do Sergipe deitou o Bráulio da Silva Machado na porrada pic.twitter.com/QPspml5Q1q
— CENTRAL DA NAÇÃO ᕦ😎ᕤ (@centraldanacao) March 3, 2023
Comments
Please login to add a commentAdd a comment