ఫుట్‌బాల్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడి ఓ ఫుట్‌బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. రిఫరీ, మరో నలుగురు ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో గత ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పెరూలోని హ్యూయాన్‌కాయోలో నవంబర్ 3వ తేదీన దేశీయ ఫుట్‌బాల్ క్లబ్‌లు అయిన జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్లుండి వర్షం మొదలుకావండతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశాడు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ బాట పడుతుండగా.. 39 ఏళ్ల జోస్ హ్యూగో లా క్రూజ్ మెసాపై పిడుగు పడింది.
In Peru, a soccer player died after being struck by lightning during a match
The tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.
During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ— NEXTA (@nexta_tv) November 4, 2024
పిడుగు నేరుగా హ్యూగోపై పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పిడుగు ప్రభావం సమీపంలో గల రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లపై పడటంతో వారు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఐదుగురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
గతంలో కూడా పిడుగుపాటు కారణంగా ఫుట్‌బాల్ మైదానంలో ఆటగాళ్లు మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో ఇలాగే ఓ స్థానిక ఆటగాడిపై పిడుగు పడటంతో అతను కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment