Fans Mobs Lionel Messi While Exiting Restaurants Buenos Aires Argentina - Sakshi
Sakshi News home page

Lionel Messi: మెస్సీకి చేదు అనుభవం..

Published Tue, Mar 21 2023 6:42 PM | Last Updated on Tue, Mar 21 2023 7:12 PM

Fans Mobs Lionel Messi While Exiting Restaurant Buenos Aires Argentina  - Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఒకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యాడు. అయితే ఆ తర్వాత బౌన్సర్స్‌ వారిని చెదరగొట్టడంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

విషయంలోకి వెళితే.. సోమవారం రాత్రి మెస్సీ భార్య, పిల్లలతో కలిసి అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లోని డాన్‌ జూలియో రెస్టారెంట్‌కు వచ్చాడు. తనకిష్టమైన ఫుడ్‌ను తిని అక్కడి నుంచి బయలుదేరాలనుకున్నాడు. అయితే అప్పటికే మెస్సీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రెస్టారెంట్‌ బయట గూమిగూడారు. రెస్టారెంట్‌ నుంచి కారిడార్‌లోకి వచ్చిన మెస్సీ వారికి అభివాదం చేశాడు.

ఈలోగా బయటకు వచ్చిన మెస్సీని అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురైన మెస్సీ భయపడి రెస్టారెంట్‌ లోపలికి వచ్చేశాడు. ఆ తర్వాత లోకల్‌ పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను చెదరగొట్టారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌(పీఎస్‌జీ) వరుస ఓటములు చవిచూస్తుంది. తాజాగా పార్క్‌ డెస్‌-ప్రిన్సెస్‌ టోర్నీలో రెనెస్‌తో మ్యాచ్‌లో 2-0తో ఓటమి పాలయ్యింది. దీనికి తోడు పీఎస్‌జీ మేనేజర్‌తో మెస్సీకి గొడవలు ఉన్నాయంటూ.. త్వరలోనే మెస్సీ పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌ క్లబ్‌ను వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

చదవండి: కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే!

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ నూతన కెప్టెన్‌గా ఎంబాపె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement