Lionel Messi's wife Antonela Roccuzzo Pleads Husband - Sakshi
Sakshi News home page

Lionel Messi: 'మెస్సీ.. పిల్లలపై కనికరం చూపించలేవా'

Published Tue, Apr 5 2022 6:09 PM | Last Updated on Tue, Apr 5 2022 8:59 PM

Lionel Messi Wife Pleads Husband Let-Match Win-By Our Kids Viral - Sakshi

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ ఇప్పటికే ఫుట్‌బాల్‌లో చెరగని ముద్ర వేసుకున్నాడు. మైదానంలో పాదరసంలా కదిలే మెస్సీకి అభిమాన గణం ఎక్కువే. అతని హెడర్‌ గోల్స్‌ చాలా మందిని వీరాభిమానులుగా మార్చేశాయి. మారడోనా తర్వాత అంతటి క్రేజ్‌ సంపాదించిన మెస్సీ తన కెరీర్‌లో బార్సిలోనా తరపున 470 గోల్స్‌.. అర్జెంటీనా తరపున 81 గోల్స్‌ సాధించాడు. ప్రస్తుతం మెస్సీ పీఎస్‌జీ(పారిస్‌ సెయింట్స్‌ జర్మన్‌ లీగ్‌) తరపున ఆడుతున్నాడు.

కాగా మైదానంలో ప్రత్యర్థులకు అవకాశమివ్వకుండా గోల్‌పోస్ట్‌ వైపు దూసుకెళ్లే మెస్సీ.. ఇప్పడు ఇంట్లోనూ అదే తరహాలో ప్రవర్తిస్తున్నాడట. ఈ విషయాన్ని మెస్సీ భార్య ఆంటోనిలా రోకుజో స్వయంగా వెల్లడించింది. మెస్సీ అంతలా ఏం చేశాడని ఆశ్చర్యపోకండి. విషయంలోకి వెళితే.. ఇటీవలే మెస్సీ తన ఇంట్లో పిల్లలతో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియోను మెస్సీ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోలో పిల్లలకు అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఇది చూసిన మెస్సీ భార్య వీడియోను జత చేస్తూ..'' బయట ఎలాగో పాపులర్‌.. కనీసం ఇంట్లోనైనా ఓడిపోవచ్చుగా.. పిల్లలనే కనికరం కూడా లేదా.. మీరు ఓడిపోండి.. మన పిల్లల్ని గెలవనివ్వండి'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్‌ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు

FIFA World Cup: ప్రపంచ కప్‌ టోర్నీకి అమెరికా అర్హత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement