Fans not happy as Lionel Messi gets substituted after incredible performance for Inter Miami - Sakshi
Sakshi News home page

మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!

Published Wed, Jul 26 2023 11:22 AM | Last Updated on Wed, Jul 26 2023 11:33 AM

Fans Not-Happy-Messi-Gets-Substituted Incredible Performance-Inter Miami - Sakshi

అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఇంటర్‌ మియామి క్లబ్‌ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెస్సీ అదనపు సమయంలో వచ్చిన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి థ్రిల్లింగ్‌ విజయాన్ని అందించాడు.

ఇది మరువకముందే మరోసారి ఇంటర్‌ మియామి క్లబ్‌ తరపున అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) అట్లాంటా యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్‌ మియామి క్లబ్‌ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో సింగిల్‌ గోల్‌తో మెరిసిన మెస్సీ ఈసారి మాత్రం డబుల్‌ గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఆట ఎనిమిదో నిమిషంలో సెర్జియో బస్‌క్వెట్స్‌ నుంచి పాస్‌ అందుకున్న మెస్సీ బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించి ఇంటర్‌ మియామి క్లబ్‌ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 22వ నిమిషంలో మరో గోల్‌తో మెరిసిన మెస్సీ మ్యాచ్‌లో రెండో గోల్ నమోదు చేశాడు. ఇక ఆట 53వ నిమిషంలో రాబర్ట్‌ టేలర్‌కు మెస్సీ అసిస్ట్‌ అందించగా.. అది గోల్‌గా వెళ్లడంతో ఇంటర్‌ మియామి 3-0తో భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో క్రిస్టోఫర్‌ మెక్‌వే గోల్‌ కొట్టడంతో 4-0తో ఇంటర్‌ మియామి స్పష్టమైన విజయాన్ని అందుకుంది. 

ఇక మ్యాచ్‌ చివర్లో 12 నిమిషాలు ఉందనగా ఇంటర్‌ మియామి క్లబ్‌ మెస్సీని వెనక్కి పిలిచింది. మొత్తం గేమ్‌ ఆడించడానికి రిస్క్‌ తీసుకోలేమని తెలిపింది. దీంతో మెస్సీ మైదానం నుంచి వెళ్లిపోయే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. అయితే కేవలం మెస్సీ ఆటను చూడడానికే తాము వచ్చామని.. అతను ఆడకపోతే మేం ఇక్కడ ఉండడం వ్యర్థమంటూ.. మెస్సీ మైదానం వీడగానే చాలా మంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన మెస్సీ మ్యాచ్‌ అనంతరం ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. ''నాకోసం మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.. కానీ ఇలా మ్యాచ్‌ మధ్యలో మీరు వెళ్లిపోవడం నాకు నచ్చలేదు.. ఇలాంటివి వద్దు.. మీ అభిమానానికి థాంక్స్‌'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..

Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement