Football Fans
-
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుట్‌బాల్ సందడి (ఫొటోలు)
-
మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెస్సీ అదనపు సమయంలో వచ్చిన ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఇది మరువకముందే మరోసారి ఇంటర్ మియామి క్లబ్ తరపున అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) అట్లాంటా యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి క్లబ్ 4-0తో ఘన విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో సింగిల్ గోల్‌తో మెరిసిన మెస్సీ ఈసారి మాత్రం డబుల్ గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆట ఎనిమిదో నిమిషంలో సెర్జియో బస్క్వెట్స్ నుంచి పాస్ అందుకున్న మెస్సీ బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించి ఇంటర్ మియామి క్లబ్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 22వ నిమిషంలో మరో గోల్‌తో మెరిసిన మెస్సీ మ్యాచ్‌లో రెండో గోల్ నమోదు చేశాడు. ఇక ఆట 53వ నిమిషంలో రాబర్ట్ టేలర్‌కు మెస్సీ అసిస్ట్ అందించగా.. అది గోల్‌గా వెళ్లడంతో ఇంటర్ మియామి 3-0తో భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో క్రిస్టోఫర్ మెక్వే గోల్ కొట్టడంతో 4-0తో ఇంటర్ మియామి స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ చివర్లో 12 నిమిషాలు ఉందనగా ఇంటర్ మియామి క్లబ్ మెస్సీని వెనక్కి పిలిచింది. మొత్తం గేమ్ ఆడించడానికి రిస్క్ తీసుకోలేమని తెలిపింది. దీంతో మెస్సీ మైదానం నుంచి వెళ్లిపోయే సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. అయితే కేవలం మెస్సీ ఆటను చూడడానికే తాము వచ్చామని.. అతను ఆడకపోతే మేం ఇక్కడ ఉండడం వ్యర్థమంటూ.. మెస్సీ మైదానం వీడగానే చాలా మంది అభిమానులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన మెస్సీ మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. ''నాకోసం మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.. కానీ ఇలా మ్యాచ్ మధ్యలో మీరు వెళ్లిపోవడం నాకు నచ్చలేదు.. ఇలాంటివి వద్దు.. మీ అభిమానానికి థాంక్స్'' అంటూ పేర్కొన్నాడు. من مغادرة الجماهير بعد خروج الأسطورة ميسي🏟️ pic.twitter.com/RdW11m84Iu — Messi Xtra (@M30Xtra) July 26, 2023 That Busquets > Messi link up play 😍 Lionel Messi makes it two goals in two gamespic.twitter.com/MYRNwukH0N — 101 Great Goals (@101greatgoals) July 25, 2023 LIONEL MESSI WITH HIS SECOND GOAL OF THE MATCH FOR INTER MIAMI! Via MLS.pic.twitter.com/itYUdcED4h — Roy Nemer (@RoyNemer) July 26, 2023 చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు? -
నిలబడడమే ఆమెకు శాపం.. సంబంధం లేని గొడవ ప్రాణం తీసింది
ఫుట్‌బాల్ మ్యాచ్ విషాదాన్ని నింపింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక మహిళా అభిమాని అక్కడ జరిగే గొడవతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికి ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ విషాదకర ఘటన బ్రెజిల్‌లోని సావో పాలోలో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శనివారం బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్స్ అయిన పాల్మీరాస్, రైవల్స్ ఫ్లెమింగోల మధ్య అలియాంజ్ పార్క్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు పాల్మీరాస్కు మద్దతుగా గాబ్రిలా అనెల్లి హాజరైంది. కాగా అలియాంజ్ పార్క్ స్టేడియం బయట ఉన్న పాల్మీరాస్ ఫ్యాన్ జోన్‌కు దగ్గర్లో నిలబడడమే గాబ్రిలా చేసిన పాపం. ఏదో విషయమై ఇరుజట్ల మధ్య అభిమానుల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి రైవల్స్ ఫ్లెమింగో ఫ్యాన్స్ రాళ్లు, గ్లాస్ బాటిల్స్‌తో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక గ్లాస్ బాటిల్ గాబ్రిలా దిశవైపుగా దూసుకొచ్చింది. ఆ గ్లాస్ బాటిల్ నేరుగా గాబ్రిలా మెడ నరాన్ని కట్ చేసుకుంటూ వెళ్లింది. దీంతో అపస్మారక స్థితిలో అక్కడికక్కడే కుప్పకూలింది గాబ్రిలా. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించారు. కాగా రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం ఆసుపత్రిలో మరణించిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక గాబ్రిలా మరణాన్ని ఆమె సోదరుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించడం అందరిని కలచివేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాబ్రిలా మృతికి కారణమైన రైవల్స్ ఫ్లెమింగో అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చర్య ఒకరి ప్రాణం తీస్తుందని ఊహించలేదని.. బాధితురాలి కుటుంబసభ్యులను క్షమాపణ కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాల్మీరాస్ క్లబ్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అభిమాని మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరింది. ఇక గొడవ పడిన అభిమానులను వేరు చేయడానికి పెప్పర్ స్ప్రే ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ మాత్రం 1-1తో డ్రాగా ముగిసింది. చదవండి: WI Vs IND: జైశ్వాల్ ఆడడం ఖాయమా? రోహిత్ ప్రశ్నకు రహానే స్పందన #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు
ఖతర్ వేదికగా ఫిపా వరల్డ్‌కప్ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్ టాప్ బస్సులో రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు. అయితే పది రోజులయినా అతనిపై మోజు తగ్గలేదునుకుంటా అభిమానులకు. తాజాగా మెస్సీ తన కోడలు 15వ పుట్టినరోజు వేడుకలకని తన హోమ్టౌన్ నుంచి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెస్సీని చుట్టుముట్టారు. దాదాపు అరగంట పాటు మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు అతనితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే మెస్సీ కూడా వారితో దురుసుగా ప్రవర్తించకుండా కూల్‌గా సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మెస్సీ పారిస్ సెయింట్ జెర్మెన్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం పీఎస్జీ క్లబ్లో మెస్సీ జాయిన్ అయ్యే అవకాశం ఉందని పీఎస్జీ హెడ్‌కోచ్ క్రిస్టోప్ గాల్టియర్ పేర్కొన్నాడు. ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ సందర్భంగా అర్జెంటీనాకు వణికించిన ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె సహా బ్రెజిల్ స్టార్ నెయ్మర్ కూడా పీఎస్జీలో ఉన్నారు. El que anda tranquilo por Rosario es Lionel Messi 😅 NUESTRO CAMPEÓN DEL MUNDO 😍🇦🇷🏆 pic.twitter.com/jJuC2ToeZ1 — TNT Sports Argentina (@TNTSportsAR) December 28, 2022 చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక -
మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే?
ఫిఫా వరల్డ్ కప్ ముగిసి వారం కావొస్తున్నా.. ఆ కిక్ నుంచి మాత్రం ఫుట్‌బాల్ అభిమానులు బయటపడలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ. జట్టును అన్నీ తానై నడిపించడమే గాక కీలకమైన ఫైనల్లో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలబెట్టాడు. పనిలో పనిగా ఫిఫా టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ఆ క్షణం నుంచి మెస్సీ మాయలో పడిపోయిన అభిమానులు అతని జపమే చేస్తున్నారు. ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘనస్వాగతం లభించింది. ఇసుక వేస్తే రాలనంతో జనంతో రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వీధులు నిండిపోయాయి. ముందుకు కదల్లేని పరిస్థితిలో మెస్సీ బృంధాన్ని హెలికాప్టర్ సాయంతో వారి స్వస్థలాలకు తరలించాల్సి వచ్చింది. అలా మెస్సీకి తన స్వస్థలంలోనూ జనం నీరాజనం పట్టారు. ఇక ఫైనల్లో విజయం తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ నల్లకోటు ధరించి ఫిఫా టైటిల్ అందుకున్న సంగతి తెలిసిందే. మెస్సీ ధరించిన నల్లకోటు సెలబ్రేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ కోటు ధర తెలిస్తే షాక్ తినడం గ్యారంటీ. అంతలా ఆ కోటులో ఏముందనుకుంటున్నారా. బంగారు వర్ణంతో తయారు చేయడమే ఆ కోటు స్పెషాలిటీ. ట్రోఫీ అందుకునే ముందు ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీకి ఎవరు బహూకరించారో తెలుసా.. ఒమన్‌కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అందుకు నీకు 10 లక్షల డాలర్లు ఇస్తున్నాను'' అంటూ అహ్మద్ ట్వీట్ చేశాడు. అరబ్ దేశాల్లో మగవాళ్లు పెళ్లిళ్లు, మతపరమైన పండుగల వేళ అలాంటి కోటు వేసుకుంటారు. ఇక హోరాహోరీగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. దాంతో, 32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 2014 ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా జర్మనీపై ఓడిపోవడంతో కప్ చేజారింది. కానీ ఈ సారి మాత్రం ఆ చాన్స్‌ను మిస్ చేసుకోని మెస్సీ ఫిఫా టైటిల్‌ను ఒడిసిపట్టాడు. చదవండి: 'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌ను లైవ్‌లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్‌ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్‌లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్‌ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్‌లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్‌కు, డూప్లికేట్‌కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్‌ను కాస్త రియల్ గేమ్‌లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్‌లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్‌లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్‌ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం పోలాండ్, సౌదీ అరేబియా మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అంతదాకా తన సొంతజట్టైన సౌదీ అరేబియాకు సపోర్ట్ చేసిన ఒక అభిమాని.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్ కొట్టగానే దెబ్బకు ప్లేట్ ఫిరాయించాడు. అప్పటిదాకా సౌదీ.. సౌదీ అని అరిచిన నోటి నుంచి లెండోవాస్కీ పేరు బయటకు వచ్చింది. అంతేకాదు తాను వేసుకున్న సౌదీ అరేబియా జెర్సీని తీసేసి లోపల వేసుకున్న లెండోవాస్కీ జెర్సీని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ''నువ్వయ్యా అసలైన అభిమానివి.. దెబ్బకు ప్లేట్ ఫిరాయించావు.. నీలాంటోడు ఉండాల్సిందే'' అంటూ పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పోలాండ్ సౌదీ అరేబియాను 2-0తో ఓడించింది. మ్యాచ్‌లో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెండోవాస్కీ గోల్ నమోదు చేశాడు. కాగా తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న లెండోవాస్కీకి ఇదే తొలి గోల్ కావడం విశేషం. అంతకముందు తొలి అర్థభాగంలో ఆట 39వ నిమిషంలో జిలిన్ స్కీ పోలాండ్‌కు తొలి గోల్ అందించాడు. మొదటి హాఫ్ అదనపు సమయంలో సౌదీ అరేబియాకు పెనాల్టీ లభించింది. దీంతో కచ్చితంగా గోల్ చేస్తుంది అన్న తరుణంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్ జెన్సీ రెండుసార్లు అద్బుతంగా అడ్డుకొని సౌదీకి గోల్ రాకుండా చేశాడు. ఇది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక అర్జెంటీనాకు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ఆటలు పోలాండ్ ముందు సాగలేదు. pic.twitter.com/3Ug8Sl4gaX — Out Of Context Football (@nocontextfooty) November 26, 2022 చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ? 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
మెస్సీపై అభిమానం దేశాలను దాటించింది
అభిమానానికి ఒక రేంజ్ ఉంటుంది. అది క్రికెట్ లేదా ఫుట్‌బాల్ కావొచ్చు. తనకు ఇష్టమైన ఆటగాడు బరిలోకి దిగాడంటే అతని ఆటను ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది అభిమానులు అనుకుంటారు. అందుకోసం ఎంత రిస్క్ అయినా భరిస్తారు. తాజాగా మెస్సీపై ఉన్న వీరాభిమానం ఒక భారతీయ మహిళను ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ దాకా తీసుకొచ్చింది. ఆమె ఒక్కతే రాలేదు.. కూడా తన ఐదుగురు పిల్లలను వెంటబెట్టుకొని మహీంద్రా ఎస్యూవీ కారులో ఖతర్‌కు చేరుకుంది. విషయంలోకి వెళితే.. కేరళకు చెందిన 35 ఏళ్ల నాజీ నౌషీకి మెస్సీకి వీరాభిమాని. మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ అని అందరూ ఊహించుకుంటున్న వేళ నాజీ ఎలాగైనా మెస్సీ ఆటను దగ్గరి నుంచి చూడాలనుకుంది. అయితే ఆమె ఐదుగురు పిల్లలకు తల్లి. వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. దీంతో తన పిల్లలను వెంటబెట్టుకొని ఎస్యూవీ కారులో తన ప్రయాణం ప్రారంభించింది. ముంబై చేరుకొని అక్కడి నుంచి విమానంలో యూఏఈకి చేరుకుంది. తన ఎస్యూవీ కారును యూఏఈకి షిప్పింగ్ చేసింది. అలా అక్టోబర్ 15న కేరళ నుంచి బయలుదేరిన నౌషీ మొత్తానికి ఖతర్‌కు చేరుకుంది. అయితే మధ్యలో దుబాయ్‌లోని ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా చూడడానికి ఎస్యూవీ కారులో వెళ్లిన నౌషీకి ఖలీజ్ టైమ్స్ విలేకరి ఒకరు ఎదురుపడ్డాడు. ఐదుగురు పిల్లలతో కలిసి ఒంటరిగా ప్రయాణం చేయడం గమనించిన సదరు విలేకరి నౌషీ గురించి ఆరా తీశాడు. ఆ ప్రయత్నంలోనే నౌషీ మెస్సీపై ఉన్న అభిమానమే నన్ను ఖతర్ దాకా తీసుకొచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టుకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఊహించని షాక్ ఇచ్చింది. 2-1 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది. ఈ ఓటమిపై స్పందించిన నౌషీ.. ఈసారి కచ్చితంగా కప్ అర్జెంటీనాదే.. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాం. కానీ మెక్సికోతో మ్యాచ్‌లో మెస్సీ సేనదే విజయం. కేవలం మెస్సీ ఆట కోసమే పిల్లలతో కలిసి ఇంతదూరం వచ్చా. తినడానికి సరిపడా సరుకులు బండిలో ఉన్నాయి. ఖతర్ ఫుడ్‌కు దూరంగా ఉండాలనేది నా ఆలోచన. వీలైనంత వరకు మా వెంట తెచ్చుకున్న ఆహారాన్ని వండుకొని తినడానికి ప్రయత్నిస్తాం అంటూ ముగించింది. ఇది చూసిన కొందరు ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. నీ ఓపికకు సలాం తల్లి.. ఒక ఆటగాడిపై అభిమానంతో అతని ఆటను చూసేందుకు దేశాలను దాటి వెళ్లడం నిజంగా గొప్ప విషయం. నీకోసమైనా మెస్సీ సేన టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాము అంటూ కామెంట్ చేశారు. Naaji noushi pic.twitter.com/KXieon2wum — Noufaltirur (@NoufalKunnath4) November 21, 2022 -
ఖతర్‌లో వరల్డ్‌కప్.. కేరళలో తన్నుకున్న అభిమానులు
భారత్‌లో ఫుట్‌బాల్‌కు పెద్దగా అభిమానులు ఉండరు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. తాజాగా ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన రోజున కేరళలో పెద్ద సందడి నెలకొంది. సందడి మాట పక్కనబెడితే కేరళలోని కొల్లాం జిల్లాలోని సక్తిఉలంగర గ్రామంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ర్యాలీలు తీశారు. ఈ గ్రామంలో పలువురు బ్రెజిల్ అభిమానులుండగా.. కొందరు అర్జెంటీనాకు మద్దతుగా ఉన్నారు. ఈ ప్రపంచకప్ బ్రెజిలే గెలుస్తుందని కొందరంటే.. లేదు అర్జెంటీనాదే కప్ అని అరుచుకోవడం వివాదానికి దారి తీసింది. ఆ వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ర్యాలీకి వచ్చిన వారంతా తమకు అందుబాటులో ఉన్న కర్రలు, పైపులు, ఇనుప రాడ్లు అందుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలాఉండగా ఫ్యాన్స్ కొట్టుకున్న ఈ ఘటనలో ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. A fight between fans of Brazil and Argentina in Kerala! Begaane ke shaadi me...! 🤦🤦🤦 #QatarWorldCup2022 #Brazil #Argentina #Kerala pic.twitter.com/0mUnxO2ajs — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2022 చదవండి: గాయాలు కొత్త కాదు.. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయి -
ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం
జకర్తా: ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి 174 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చారు అరెమా జట్టు అభిమానులు. వారిని నిలువరించేందురు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. అదే తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వైపు పరుగులు పెట్టిన క్రమంలో కిందపడిపోయిన కొందరు ఊపిరాడక మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇండోనేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘోర దుర్ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 22 మంది మృతి -
కొంపముంచిన అభిమానం.. 2 వేల మందికి కరోనా!
కరోనా టైంలో జన సమూహారం ప్రమాదకరమనే వైద్య నిపుణులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. అయినా కూడా జనాలు గుమిగూడడం ఆపట్లేదు. ఈ తరుణంలో యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు.. స్కాట్లాండ్లో భారీగా కరోనా కేసులకు కారణమయ్యాయి. వెర్రి అభిమానంతో వందల మైళ్ల దూరం ప్రయాణించి మరీ.. వైరస్‌ను అంటించుకున్నారు స్కాట్లాండ్ సాకర్ అభిమానులు. ఎడిన్బర్గ్: ఫుట్‌బాల్ మీద అభిమానం స్కాట్లాండ్లో భారీగా కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యింది. యూరప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. యూరో ఛాంపియన్షిప్ నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ సాకర్ అభిమానులు వెనక్కి తగ్గట్లేదు. ఇక తమ టీం మ్యాచ్ కోసమని స్కాట్లాండ్ అభిమానులు లండన్‌కు పెద్ద ఎత్తున్న క్యూ కట్టారు. వందల మైళ్లు రైళ్లలో, విమానాల్లో ప్రయాణించి.. మరీ ఇంగ్లండ్ మ్యాచ్‌ను చూసి వచ్చారు. ఈ తరుణంలో సుమారు 2 వేల మంది సాకర్ అభిమానులు కరోనా బారిన పడ్డట్లు.. స్కాట్లాండ్ ప్రజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 1,991 మంది కరోనా బారిన పడగా.. అందులో 1,294 మంది కేవలం ఇంగ్లండ్-స్కాట్లాండ్ ఒక్కమ్యాచ్ కోసం వెంబ్లేకి వెళ్లి వచ్చిన వాళ్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక మ్యాచ్‌ల టైంలో స్కాట్లాండ్ గ్లాస్గోలోని హంప్డెన్ స్టేడియం వద్ద జనాలు భారీగా గుమిగూడారు. ఇదే కాదు.. మ్యాచ్ కోసం బార్లు, పబ్‌ల దగ్గర కూడా జనాలు గుంపులుగా కలియతిరిగారు. పైగా మాస్క్‌లు లేకుండా తప్పతాగి సంబురాలు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా భారీగా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ సందర్భంగా స్కాట్లాండ్ మిడ్‌ఫీల్డర్ బిల్లీ గిల్మౌర్ సైతం వైరస్ బారిన పడగా.. అతనితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న మరో ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్లు సైతం సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లిపోయారు. చదవండి: చుక్క మత్తులో పోలీసులకు చుక్కలు -
ప్రేక్షకులొచ్చారు...
హో చి మిన్ సిటీ (వియత్నాం): కరోనాతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆటగాళ్లు కనీసం ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ చిన్నా చితకా ఈవెంట్లు జరుగుతున్నప్పటికీ ప్రేక్షకుల్ని అనుమతించేంత ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి. అయితే దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌కు అభిమానులను ఆహ్వానించి వియత్నాం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వి–లీగ్‌లో భాగంగా అక్కడ శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లను దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. మైదానానికి తరలి వచ్చిన అభిమానులకు ముందు జాగ్రత్తగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అయితే వారు మాస్కులు ధరించకపోవడం విశేషం. ప్రేక్షకుల సమక్షంలో ఆడటం సంతోషంగా ఉందని, వారే ఆటకు ప్రత్యేకమని ‘హో చి మిన్’ జట్టు కోచ్ జంగ్ హు– సంగ్ అన్నారు. చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నప్పటికీ వియత్నాం కరోనాను సమర్థంగా నియంత్రించింది. 10 కోట్ల జనాభా కలిగిన వియత్నాంలో కేవలం 328 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా ఒక్క మరణం కూడా సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం మొత్తం మూడు మ్యాచ్‌లు జరగ్గా... రెండు ‘డ్రా’గా ముగిశాయి. మరో మ్యాచ్‌లో ఫలితం వచ్చింది. -
భారత జట్టుకు జై కొట్టినందుకు..
యూఏఈలో జరుగుతున్న ఏషియన్ ఫుట్‌బాల్ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులను ఓ దుబాయ్ షేక్ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్ ప్రశ్నించాడు. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు సదరు షేక్‌కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. విచారణ నిమిత్తం అటెండ్ కావాలని ఆదేశించారు. కాగా, ఈ విషయం అరెస్టు దాకా వెళ్లడంతో సదరు షేక్ మాటమార్చాడు. ‘వీడియోలో చేసిందంతా సరదా కోసమే. పంజరంలో వేసిన వారంతో నా దగ్గర పనిచేసేవారే. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు బాగా తెలుసు. మేమేంతా కలిసిమెలిసి ఉంటాం. ఒకే కంచంలో కలిసి భోజనం కూడా చేస్తాం. అదంతా ఉత్తిదే. నేను వారిని కొట్టలేదు. అసలు నిజంగా వారిని బంధించనేలేదు’ అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు. టీమిండియా అభిమానులు పలు ఆసియా దేశాలకు చెందినవారుగా తెలిసింది. -
మెస్సీ కూడా సచిన్ దారిలోనే..!
కోల్‌కతా : నగరంలోని సగటు పుట్‌బాల్ అభిమాని ప్రార్థించే ప్రార్థన ‘మెస్సీ విల్ డూ ఏ టెండూల్కర్’. గతవారం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఈ సారీ ప్రపంచకప్‌ను ముద్దాడాలనే కోరిక బయటపెట్టడంతో ఈ లెజండరీ ప్లెయర్కు మరింత మద్దతు పెరుగుతోంది. ఇక కోల్‌కతాలోని అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ వ్యవస్థాపకుడు, సెక్రటరీ ఉత్తమ్ సాహా ఆధ్వర్యంలో మెస్సీకి మద్దతుగా ఈ నినాదాన్ని నినదించారు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాదిరిగానే లియోనల్ మెస్సీ కూడా తన దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కానీ ఈ లెజండరీ ఆటగాళ్లకు ప్రపంచ కప్ అందని ద్రాక్షలాగే ఉండేది. కాగా, సచిన్ తాను ఆడిన చివరి వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచి ఆటకు ఘనంగా వీడ్కోలు పలికాడు. అలాగే మెస్సీ కూడా తాను ఆడే చివరి ప్రపంచకప్ గెలిచి సచిన్ దారిలో నడుస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సచిన్, మెస్సీల జెర్సీ నంబర్ ఒకటే కావడం, సహచర ఆటగాళ్లలో స్పూర్తి నింపడం, జట్టు కఠిన సమయంలో ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు భుజాలపై వేసుకోవడం ఈ ఇద్దరి ఆటగాళ్లకున్న కామన్ పాయింటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 2014 ఫిఫా ప్రపంచకప్‌లో అద్భుత ఆట తీరుతో ఫైనల్‌కి చేరిన అర్జెంటీనా.. అనూహ్యంగా 0-1 తేడాతో జర్మనీ చేతిలో ఓడిపోయింది. రేపు(జూన్ 14న) రష్యా, సౌదీ అరేబియా మధ్య తొలి సమరంతో ఫిఫా ప్రపంచకప్ 2018 టోర్నీ ఆరంభంకానుంది. -
మ్యాచ్ అయ్యాక వీళ్లంతా ఏం చేశారో తెలుసా?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ కాని, ఫుట్ బాల్ మ్యాచ్ కానీ చూశామా? ఎంజాయ్ చేశామా? వెళ్లామా? అన్నట్టే ఉంటారు ప్రేక్షకులు. స్టేడియంను డస్టు బిన్ లా మార్చేసే తాము వేసే వ్యర్థాల గురించి ఎవరూ పట్టించుకోరు. కానీ శనివారం షిల్లాంగ్ లో జరిగిన దేశంలోనే అతిపెద్ద పురుషుల ఫుట్ బాల్ టోర్నమెంట్ కు వచ్చిన ప్రేక్షకులు చేసిన స్వచ్ఛమైన పని సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది. మిజోరాం ఐజ్వాల్ ఎఫ్‌సీ తన తొలి మ్యాచ్ ను గెలువగానే, ఆ టీమ్ ఫ్యాన్స్ దాదాపు 23వేల మంది వెంటనే స్టేడియంను క్లీన్ చేయడం ప్రారంభించారు. తమ టీమ్ గెలుపును స్వచ్ఛ్ భారత్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. ''మ్యాచ్ అయిపోగానే డస్ట్ నంతా క్లీన్ చేసినందుకు ఐజ్వాల్ ఫుట్ బాల్ ప్యాన్స్ కు ధన్యవాదాలు. మాతో పాటు మిగతవారందరూ మీ దగ్గరనుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది'' అని ఓ ఫ్యాన్ వారి క్లీనింగ్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతను ఈ మెసేజ్ ను రాస్తున్నంత సేపట్లోనే ఆ ఫోటోగ్రాఫ్ కు 840 షేర్లు, 1800 లైక్స్ వచ్చాయి. అంతేకాక ఈ మెసేజ్, ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇటు ఫేస్ బుక్ మాత్రమే కాక, మరో సామాజిక మాధ్యమం ట్విట్టర్ సైతం ఫుట్ బాల్ ప్యాన్స్ ను పొగడ్తలో ముంచెత్తుతోంది. దీనిపై యువజన వ్యవహారాల, క్రీడా సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా స్పందించారు. '' ఐ-లీగ్ గెలుపు, ఐజ్వాల్ ఎఫ్‌సీ ప్యాన్స్ షిల్లాంగ్ స్టేడియమంతటిన్నీ క్లీన్ చేయడం నిజంగా మా హృదయాలను గెలుచుకుంది. ఇదే నిజమైన స్వచ్ఛ్ భారత్ కు ఉదాహరణ. అందరూ వీరిని చూసి నుంచి నేర్చుకోవాల్సి ఉంది'' అని ట్వీట్ చేశారు. ఒకే సమయంలో ఒకే స్థలంలో జరిగే మ్యాచ్ లతో స్టేడియంలలో ఎక్కువ ఘన వ్యర్థ్యాలను ఉత్పత్తి అవుతాయి. మ్యాచ్ అయిన తర్వాత స్టేడియమంతా ఓ డస్టు బిన్ లా మారిపోతుంది. 2016 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగే సమయంలో మొత్తం 40వేల మంది ప్రేక్షకులు దీనిలో పాలుపంచుకుంటున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంచనావేసింది. దీంతో ఒక్కో మ్యాచ్ జరినే సమయంలో 10మెట్రిక్ టన్నుల వ్యర్థ్యాలు జనరేట్ అవుతాయని ఆందోళన కూడా వ్యక్తంచేసింది. -
ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడులు...
-
ఫుట్‌బాల్ అభిమానులకు గైడ్ ‘కిక్-ఆఫ్’
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచమంతా ఇప్పుడు బ్రెజిల్వైపే చూస్తోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మ్యాచ్‌లు ఫుట్‌బాల్ అభిమానులను గోల్స్ వర్షంలో తడిపేస్తున్నాయి. రోజుకో రసవత్తర పోరుతో ప్రేక్షకులు ఆనందలోకాల్లో విహరిస్తున్నారు. ఫుట్‌బాల్ వీరాభిమానుల్లో కొందరికి ఆట ఆడడం అంటే ఇష్టమైతే మరికొందరికి ఆ ఆటలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉంటుంది. ఇలా ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రతోపాటు ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు మాత్రం ‘ది ఫుట్‌బాల్ ఫెంటాస్టిక్ ఎసెన్షియల్ గైడ్’ పుస్తకం చదవాల్సిందే. ‘కిక్-ఆఫ్’ పేరిట ప్రముఖ ఫుట్‌బాల్ నిఫుణుడు, ప్రముఖ వ్యాఖ్యాత నవీ కపాడియా ఈ పుస్తకాన్ని రచించారు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా తన పుస్తకానికి సంబంధించి రచయిత కపాడియా ‘సాక్షి’తో ఎన్నో అంశాలు పంచుకున్నారు. 1930 నుంచి 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచ ఫుట్బాల్కప్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని పొందుపర్చినట్టు తెలిపారు. మొత్తం 19 భాగాల్లో ఆయా కాలాల్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు, ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే మధుర ఘట్టాలు, వివాదాలు సహా పలు అంశాలను కూలంక షంగా వివరించారు. అదేవిధంగా భారత్ ఫుట్‌బాల్‌కి సంబంధించిన చరిత్రను సైత ం పొందుపరిచారు. నవతరం ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం ఆటకు సంబంధించి పలు సూచనలు సైతం ఉన్నాయి. ఫుట్‌బాల్ అభిమానులతోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధం అయ్యేవారి కోసం ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి వంద క్విజ్ ప్రశ్నలను సైతం స్థానం కల్పించినట్టు పుస్తక రచయిత నవీ కపాడియా తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.