
హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు 2024ను ఒక్క విజయం లేకుండా ముగించింది. ఏడాదిలో చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనే కనబర్చినా చివరకు గెలుపు మాత్రం దక్కలేదు.

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం భారత్, మలేసియా జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక అంతర్జాతీయ మ్యాచ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది.

మలేసియా తరఫున పావ్లో జోస్ 19వ నిమిషంలో గోల్ సాధించగా... భారత్ తరఫున రాహుల్ భేకే 39వ నిమిషంలో హెడర్ ద్వారా గోల్ కొట్టాడు.





















