Football team
-
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుట్‌బాల్ సందడి (ఫొటోలు)
-
భారత్ 0 మారిషస్ 0
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ వేదికపై ఇంకా ఎంతో ఎదగాల్సిన అవసరం ఉందని మరోసారి రుజువైంది. కొత్త కోచ్ మార్క్వెజ్ నేతృత్వంలో కొత్తగా జట్టు విజయాల బాట పడుతుందని ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 179వ స్థానంలో ఉన్న మారిషస్ జట్టు కూడా భారత్‌ను నిలువరించింది. గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం మొదలైన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో భాగంగా జరిగిన భారత్, మారిషస్ తొలి మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నీని ప్రారంభించారు. -
Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
ప్రతీ ఒక్క అథ్లెట్ అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే అనడంలో సందేహం లేదు. ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధీటుగా నిలబడి కలను పండించుకుని.. మెడల్స్ మెడలో వేసుకునే వారు ‘విజేతలు’గా ప్రశంసలు అందుకుంటారు.అయితే.. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఆఖరి మెట్టుపై బోల్తా పడి నిరాశతో వెనుదిరిగిన వాళ్లు ‘పరాజితులు’గా మిగిలిపోతారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 నేపథ్యంలో.. అలా పతకం గెలిచే దిశగా వచ్చి ఓటమితో ముగించిన భారత క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.ఫుట్‌బాల్ జట్టుమెల్బోర్న్ ఒలింపిక్స్-1956లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో 4-2తో ఓడించిన భారత్ సెమీస్‌కు దూసుకువెళ్లింది.నాడు మన ఆటగాడు నివిల్లే డిసౌజా ఆసీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.సెమీ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తాడని భావించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. యుగోస్లేవియాతో సెమీస్‌లో భారత్ ఆరంభంలో గట్టిపోటీనిచ్చినా ద్వితీయార్థ భాగంలో అనూహ్యంగా పుంజుకుంది ప్రత్యర్థి. ఫలితంగా భారత్ ఓటమిపాలైంది.ఈ క్రమంలో కాంస్యం కోసం బల్గేరియా జట్టుతో పోటీపడ్డ భారత ఫుట్‌బాల్ టీమ్ 0-3తో ఓడి పతకాన్ని చేజార్చుకుంది.‘ఫ్లైయింగ్ సిఖ్’ హృదయం ముక్కలైన వేళ..రోమ్ ఒలింపిక్స్-1960లో భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. 400 మీటర్ల పరుగు పందెంలో.. ప్రత్యర్థుల వేగాన్ని అంచనా వేసే క్రమంలో చూపు తిప్పిన మిల్కాకు అదే శాపమైంది.ప్రత్యర్థిని గమనించే క్రమంలో వేగం తగ్గించిన మిల్కా.. సెకనులో పదో వంతు తేడాతో వెనకబడి నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకంగా ఈ అనుభవం మిగిలిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచినా ఒలింపిక్ పతకం చేజారిన తీరును తాను మరువలేనని దివంగత మిల్కా సింగ్ గతంలో ఓం సందర్భంలో తెలిపారు. భారత మహిళా హాకీ జట్టు చేజారిన మెడల్1980లో తొలిసారిగా భారత మహిళా హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పాల్గొంది. ఆ యేడు మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌కు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లు దూరంగా ఉన్నాయి.నాడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లికన్స్(యూఎస్ఎస్ఆర్) అఫ్గనిస్తాన్‌పై దురాక్రమణకు పాల్పడిన తీరును నిరసిస్తూ.. క్రీడల్లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేశాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టుకు పెద్దగా పోటీ లేకుండా పోవడంతో పతకంతో తిరిగి వస్తుందనే ఆశ చిగురించింది.అయితే, యూఎస్ఎస్ఆర్తో చివరగా తలపడ్డ భారత్ 1-3తో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.పరుగుల రాణికి చేదు అనుభవంలాస్ ఏంజెల్స్-1984 ఒలింపిక్స్‌లో ఉషపైనే భారత్ ఆశలు పెట్టుకుందిపెట్టుకుంది. అయితే, మిల్కా సింగ్ మాదిరే ఆమె కూడా తృటిలో పతకం చేజార్చుకుంది.400 మీటర్ల హార్డిల్స్ పోటీలో సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడ్డ ఈ ‘పయ్యోలీ ఎక్స్‌ప్రెస్’ హృదయం ముక్కలైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కోజోకరో మూడోస్థానంలో నిలవగా.. పీటీ ఉష పతకం లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. టెన్నిస్‌లో చేజారిన కాంస్యంలాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్ కాంస్యానికి చేరువగా వచ్చింది. అయితే, పాత కథే పునరావృతమైంది.ఈసారి టెన్నిస్ మెన్స్ డబుల్స్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. లియాండర్ పేస్- మహేశ్ భూపతి ద్వయం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్- ఇవాన్ జుబిసిక్తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో 6-7 6-4 14-16 తేడాతో ఓడిపోయారు.కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురుకావడంతో నిరాశగా నిష్క్రమించారు. అంతకు ముందు సెమీస్‌లో జర్మనీ జంట నికోలస్ కీఫర్- రైనెర్ షట్లర్ చేతిలో పరాజయం పాలై ఫైనల్స్ చేరే సువర్ణావకాశం చేజార్చుకున్నారు పేస్- భూపతి.ఇక ఇదే ఒలింపిక్స్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవీ సైతం 48 కేజీల విభాగంలో ఫైనల్ అటెంప్ట్‌లో డిస్క్వాలిఫై అయింది.మొత్తంగా 190 కిలోలు ఎత్తిన కుంజరాణి బ్రాంజ్ మెడలిస్ట్ ఆరీ విరాథ్వార్న్(థాయిలాండ్) కంటే పది కేజీలు తక్కుగా లిఫ్ట్ చేసినందుకు పతకానికి దూరమైంది.లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇలాగేఈసారి షూటింగ్లో భారత్ పతకానికి చేరువగా వచ్చింది. జోయ్‌దీప్ కర్మాకర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఫైనల్ చేరాడు. బ్రాండ్ మెడల్ విజేత కంటే 1.9 పాయింట్లు వెనుకబడి కాంస్యం గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు.మరో‘సారీ’ ఇదే ‘కర్మ’ భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో తలపడిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో డి జెనిరో-2016 ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ త్రిపుర అమ్మాయి.. నాలుగో స్థానంలో నిలిచింది.కాంస్యం గెలిచిన అమ్మాయి.. దీపా స్కోరు చేసిన పాయింట్లకు వ్యత్సాసం 0.150 కావడం గమనార్హం.టోక్యోలోనూ కలిసిరాలేదుదాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత మహిళా హాకీ జట్టు మరోసారి పతకం గెలిచే అవకాశం ముంగిట నిలిచింది.క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన రాణీ రాంపాల్ బృందంపై ప్రశంసల జల్లు కురిసింది.అయితే, కీలకమైన సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో స్వర్ణం ఆశ చేజారినా.. కాంస్యం గెలుస్తారనే నమ్మకం మాత్రం చావలేదు.అయితే, గ్రేట్ బ్రిటన్ జట్టు భారత్ ‘కంచు’ ఆశలపై నీళ్లు చల్లింది. 4-3తో ఓడించి కాంస్యాన్ని ఎగురేసుకుపోయింది. ఈ ఓటమితో భారత జట్టుతో పాటు వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలూ ముక్కలయ్యాయి.ఇదే ఒలింపిక్స్‌లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇలాగే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే..విశ్వ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు గెలిచింది. భారత హాకీ పురుషుల జట్టు 1928- 1956 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు పసిడి పతకాలు గెలిచింది.ఆ తర్వాత 1964, 1980లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇక మళ్లీ షూటర్ అభినవ్ బింద్రా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే భారత్‌కు పసిడి అందించారు.చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా స్టార్! -
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
ఇప్పుడవి రాళ్లు విసిరే చేతులు కాదు
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి.ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్.ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు.యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమిప్రోఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ్రపోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలి ప్రోఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మాప్రాంంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మాప్రాంంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. -
భారత ఫుట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
నాలుగు దేశాల మధ్య జరిగే టర్కిష్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ పాల్గొనే భారత సీనియర్ జట్టును ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్ సౌమ్య గుగులోత్‌కు స్థానం దక్కింది. బుధవారం టర్కీలోని అలాన్యా పట్టణంలో ఈ టోర్నీ మొదలవుతుంది. భారత్, హాంకాంగ్, ఎస్టోనియా, కొసోవో దేశాల మధ్య రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుంది. అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు టైటిల్ లభిస్తుంది. భారత్ తమ మ్యాచ్‌లను 21న ఎస్టోనియాతో, 24న హాంకాంగ్‌తో, 27న కొసోవోతో ఆడుతుంది. చదవండి: Aryna Sabalenka Life Story: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’! నిజమే మరి! -
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం.. రూ.183 కోట్లు టోకరా
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటుపడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అమిత్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అమిత్ పటేల్ ఆ టీమ్‌కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో సుమారు రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన టెస్లా కారు, విలువైన వాచ్, క్రిప్టో కరెన్సీ కొన్నాడు. అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ లో ఫ్రెండ్స్‌తో కలసి విహార యాత్రలు చేసేవాడు. ఇక ఈ విషయం బయటకు రావడంతో జాక్సన్విల్లే యాజమాన్యం అమిత్‌ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. -
భారత్‌పై ఖతర్‌దే పైచేయి
భువనేశ్వర్: ఎలాంటి అద్భుతం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. తమకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న ఖతర్ జట్టును నిలువరించడంలో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు విఫలమైంది. ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయర్స్ రెండో రౌండ్లో భాగంగా ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఖతర్ జట్టు తరపున ముస్తఫా మషాల్ (4వ ని.లో), అల్మోజ్ అలీ (47వ ని.లో), యూసుఫ్ అదురిసాగ్ (86వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు కూడా గోల్ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్ లోపంతో మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా ఖతర్ జట్టుతో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ మూడింటిలో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈనెల 16న కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–0తో గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 102వ స్థానంలో ఉన్న భారత్ అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూకు విశ్రాంతి కల్పించి మరో గోల్‌కీపర్ అమరిందర్ సింగ్‌ను ఆడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 61వ స్థానంలో ఉన్న ఖతర్ భారత రక్షణపంక్తిలోని లోపాలను సద్వినియోగం చేసుకొని ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. ఆ తర్వాత భారత జట్టు తేరుకొని ఖతర్‌కు కాస్త పోటీనిచ్చింది. విరామ సమయానికి ఖతర్ 1–0తో ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగం మొదలైన రెండో నిమిషంలోనే ఖతర్ ఖాతాలో రెండో గోల్ చేరింది. ఆ తర్వాత కూడా ఖతర్ తమ జోరు కొనసాగించి మ్యాచ్ ముగియడానికి మరో నాలుగు నిమిషాల ముందు మూడో గోల్‌ను సాధించింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి 83 నిమిషాలు ఆడాక అతని స్థానంలో ఇషాన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో ఖతర్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... మూడు పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను వచ్చే ఏడాది మార్చి 24న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. -
భారత్ ‘పారిస్’ ఆశలు ఆవిరి
తాస్కాంట్: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించే అవకాశాలకు తెరపడింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–7తో ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్ చేతిలో ఓడిపోగా...ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియాకు 1–3 గోల్స్ తేడాతో వియత్నాం జట్టు చేతిలో పరాజయం ఎదురైంది. లీగ్ దశ తర్వాత మూడు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన ఉత్తమ జట్టు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (80వ ని.లో) ఏకైక గోల్ చేయగా... వియత్నాం తరఫున హున్ ఎన్హు (4వ ని.లో), ట్రాన్ థి హై లిన్ (22వ ని.లో), ఫామ్ హై యెన్ (73వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ ఈ మ్యాచ్‌లో 59 నిమిషాలు ఆడింది. ఆ తర్వాత ఆమె స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రేస్‌ను బరిలోకి దించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 1న ఉజ్బెకిస్తాన్‌తో ఆడుతుంది. -
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ నూతన కెప్టెన్‌గా ఎంబాపె
France Foot Ball Team Captain: ఫ్రాన్స్ పుట్‌బాల్ జట్టు నూతన కెప్టెన్‌గా పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ ఫార్వర్డ్ ఆటగాడు కైలియన్ ఎంబాపె ఎంపికయ్యాడు. వ్యక్తిగత కోచ్ డిడియర్ డెష్చాంప్స్తో సంప్రదింపుల తర్వాత ఎంబపే ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించాడు. ఈ విషయాన్ని ప్రముఖ ఫ్రెంచ్ దినపత్రిక ఇవాళ (మార్చి 21) వెల్లడించింది. దశాబ్దానికి పైగా ఫ్రాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన లోరిస్ 2022 వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. లోరిస్ ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండింది. తాజాగా ఎంబపే కెప్టెన్సీ చేపట్టేందుకు అంగీకరించడంతో చాలా రోజుల నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరోవైపు ఫ్రాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్ ఎంపిక కూడా జరిగింది. సెంటర్ బ్యాక్ ప్లేయర్ రాఫేల్ వరేన్ స్థానంలో అటాకర్ ఆంటోనియో గ్రెజిమెన్ ఫ్రాన్స్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలోనే రాఫేల్ వరేన్ కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కాగా, 66 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల ఎంబాపె.. గత వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఫ్రాన్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనే రెచ్చిపోయిన ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ సాధించినప్పటికీ ఫ్రాన్స్ గెలవలేకపోయింది. ఫ్రాన్స్ 2018 వరల్డ్‌కప్ సాధించడంలోనూ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఎంబాపె కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ను యూరో 2024 క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ ప్రత్యర్ధిగా ఆడతాడు. -
పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవమే మిగిల్చింది. మెగాటోర్నీ ఆరంభం కాకముందే పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టను దిగజార్చకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ రొనాల్డో ఆశించినంత మేర రాణించలేదనే చెప్పాలి. కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టిన రొనాల్డో ఆ తర్వాత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లో లేని రొనాల్డో స్థానంలో వేరేవారికి అవకాశం ఇవ్వాలనే అతన్ని బెంచ్‌కు పరిమితం చేసినట్లు పోర్చుగల్ హెడ్‌కోచ్ ఫెర్నాండో శాంటెజ్ వివరించాడు. అయితే రొనాల్డో తుదిజట్లులో లేకపోవడం పోర్చుగల్‌ను దెబ్బకొట్టిందనే చెప్పొచ్చు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో నెగ్గినప్పటికి.. కీలకమైన క్వార్టర్ ఫైనల్లో మొరాకో చేతిలో ఓడి పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్‌లోనూ రొనాల్డో తొలుత బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండో అర్థభాగంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో కన్నీటిపర్యంతం అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా రొనాల్డో అవమానభారంతో ఫిఫా వరల్డ్‌కప్‌ను ముగించాడు. 37 ఏళ్ల రొనాల్డో మరో ఫిఫా వరల్డ్‌కప్ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలోనే రొనాల్డోకు మరోసారి అవమానం జరిగింది. ఫిఫా వరల్డ్‌కఫ్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో సోఫాస్కోర్ అనే వెబ్సైట్ వరస్ట్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో క్రిస్టియానో రొనాల్డో చోటు దక్కించుకున్నాడు. ఒకే ఒక్క గోల్ చేసిన రొనాల్డోకు సోఫాస్కోర్ ఇచ్చిన స్కోర్ రేటింగ్ 6.46. ఇక ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టులో నుంచి కూడా ఒక ఆటగాడికి వరస్ట్ ఎలెవెన్ టీమ్‌లో చోటు దక్కింది. అతనే ఫార్వర్డ్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్. పైనల్ మ్యాచ్‌లో అదనపు సమయంలో జులియన్ అల్వరేజ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్టినేజ్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. ఈ వరల్డ్‌కప్‌లో 148 నిమిషాల పాటు యాక్షన్‌లో ఉన్న మార్టినేజ్ గోల్ కొట్టడంలో.. అసిస్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో కోచ్ లియోనల్ స్కలోని అతన్ని రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితం చేశాడు. మార్టినేజ్కు 6.35 రేటింగ్ ఇచ్చింది. ఇక వీరిద్దరితో పాటు సెనెగల్ స్టార్ గోల్‌కీపర్ ఎడౌర్డ్ మండీ(6.30) రేటింగ్ ఇచ్చింది. రౌండ్ ఆఫ్ 16లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెనెగల్ ఇంటిబాట పట్టింది. ఇంకా ఈ జాబితాలో సెర్జినో డెస్ట్(అమెరికా, 6.50 రేటింగ్), పోలాండ్‌కు చెందిన కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కిలు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీలతో పాటు సౌత్ కొరియాకు చెందిన హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్(స్విట్జర్లాండ్)లను మిడ్ఫీల్డింగ్లో చోటు దక్కింది. సోఫాస్కోర్ ఫిఫా వరల్డ్‌కప్ వరస్ట్ ఎలెవెన్ జట్టు: క్రిస్టియానో రొనాల్డో(కెప్టెన్), లౌటారో మార్టినె, హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్, జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీ, ఎడౌర్డ్ మండీ(గోల్ కీపర్), సెర్జినో డెస్ట్, కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కి, అబ్దు డియల్లో చదవండి: శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
FIFA WC: పిచ్చి వేషాలు వేస్తే జైలుకే.. ఇరాన్ జట్టుకు హెచ్చరిక!
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆ దేశపు ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో ఆడిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఆటగాళ్లు నిరసన అందరిని ఆశ్చర్యపరిచింది. దేశం కోసం ఆడేటప్పుడు జాతీయ గీతం ఆలపించకుండా మౌనం పాటించడం మంచి పద్దతి కాదని ఇరాన్ జట్టు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లవెత్తాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఈ మీటింగ్ లో ఐఆర్సీజీ ప్రతినిధులు.. ఫుట్‌బాల్ ప్లేయర్లను మందలించారని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు గానీ.. ఆట జరిగే సమయంలో గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జైలుకు పంపిస్తామన్నారు. అంతేకాదు ఆటగాళ్ల కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు అన్ని జట్ల మాదిరిగానే నిబంధలను పాటించాలని, నిరసనలు, మౌనం వహించడం వంటి చర్యలకు దిగితే సహించేది లేదని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు సమాచారం.మరోసారి అలా చేస్తే జైలు శిక్ష తప్పదని.. ఆటగాళ్ల కుటుంబాలకు కూడా నరకం చూపిస్తామని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీ బెదిరింపులకు భయపడిన ఇరాన్ జట్టు ఇంగ్లండ్‌తో మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపిన ఇరాన్.. తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో మాత్రం యథావిధిగా జాతీయ గీతాలపన చేసింది. ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా బుధవారం (నవంబర్ 30) ఆ జట్టు యూఎస్ఏతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో సక్రమంగా ఉండాలని, గెలిచినా ఓడినా ఫర్వాలేదు గానీ పిచ్చి వేషాలేస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్జీసీ హెచ్చరించినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' FIFA WC: ఖతర్‌ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్ -
పబ్లిక్‌గా పరువు పోగొట్టుకున్న ఫుట్‌బాల్ టీం
వైరల్: ఓవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమిపాలు అయ్యింది. అదే సమయంలో ఓ ఫుట్‌బాల్ టీం చేసిన పని.. సోషల్ మీడియాలో వాళ్ల పరువును తీసేస్తోంది. అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ టీగ్లోని ఓ జట్టు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం మిన్నెసోటా వైకింగ్స్, డల్లాస్ కౌబాయ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు సాకర్ అభిమానుల్ని ఓ కోరిక కోరింది మిన్నెసోటా వైకింగ్స్. మీ కుటుంబంలోగానీ, స్నేహితుల్లోగానీ ఎవరైనా ఆర్మీలో పని చేస్తే.. ఆ రియల్ హీరోల గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేయాలని కోరింది. అలా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన అభిమానికి రెండు టికెట్లు పంపడంతో పాటు.. అతని పోస్ట్‌ను వీడియో బోర్డుపై ప్రదర్శిస్తామని తెలిపింది. అది చూసి చాలామంది #SkolSalute హ్యాష్‌ట్యాగ్‌తో వైకింగ్స్‌కు పోస్ట్‌లు చేశారు. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు.. కైలే అనే ట్విటర్ హ్యాండిల్ పేరుతో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. తన కజిన్ జోయెల్ ఆర్మీలో పని చేశాడంటూ అతని ఫొటోతో సహా పోస్ట్ ఉంచాడు ఆ యూజర్. అంతేకాదు.. ఇతను నా కజిన్. ఆర్మీలో పని చేసేవాడు. అతని హీరోయిజం నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. అంతేకాదు.. వైకింగ్స్‌కు అతను పెద్ద అభిమాని కూడా అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే.. అందులో ఉంది కట్టుకథే అని కనిపెట్టడానికి అక్కడున్న ప్రేక్షకులకు ఎంతో టైం పట్టలేదు. అందులో ఉంది పో*స్టార్ జానీ సిన్స్. వెంటనే గ్రౌండ్లో విజిల్స్, అరుపులు వినిపించాయి. అది గమనించిన టీం నిర్వాహకులు వెంటనే దానిని తొలగించారు. అసలు ఆ కథను ఆ ఫుట్‌బాల్ ఎలా నమ్మిందో అర్థం కావడం లేదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. జరిగిన ఘటనపై వైకింగ్స్ మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పగా.. సంబంధిత విభాగ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది కూడా. -
ఫిపా వరల్డ్‌కప్.. ఆసియా జట్ల ప్రదర్శన అంతంతే
ఖరీదైన క్రీడ కాకపోవడం... ప్రావీణ్యం ఉంటే ఎక్కడైనా ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉండటం... ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్ లీగ్‌లు జరుగుతుండటం... వెరసి ఫుట్‌బాల్ ఆడేవారి సంఖ్యలో పెరుగుదలే కానీ తరుగుదల కనిపించదు. అన్ని ఖండాలకు చెందిన జట్లు భాగస్వామ్యంగా నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఎనిమిది దేశాలు విశ్వవిజేతగా నిలిచాయి. ఇందులో ఐదు జట్లు (జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్) యూరప్‌నకు చెందినవి కాగా మిగతా మూడు జట్లు (బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే) దక్షిణ అమెరికాకు చెందినవి. అయితే ఆసియా, ఆఫ్రికా దేశాలు మాత్రం ఈ మెగా ఈవెంట్లో అడపాదడపా మెరిపిస్తున్నా నిలకడైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. 1938లో ఆసియా నుంచి ఇండోనేసియా తొలిసారి ప్రపంచకప్‌లో ఆడింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942లో, 1946లో ప్రపంచపక్ జరగలేదు. 1950లో బ్రెజిల్లో ప్రపంచకప్ జరిగినా ఆసియా నుంచి ఒక్క దేశం కూడా పాల్గొనలేదు. 1954లో దక్షిణ కొరియా రూపంలో మళ్లీ ఆసియా నుంచి ప్రాతినిధ్యం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఐదు ప్రపంచకప్‌లలో రెండుసార్లు మాత్రమే ఆసియా నుంచి జట్లు పాల్గొన్నాయి. 1978 నుంచి మాత్రం ప్రతి ప్రపంచకప్‌లో ఆసియా జట్లు బరిలోకి దిగుతున్నాయి. క్రమక్రమంగా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య పెరగడంతో ఆసియా జోన్ నుంచి మరిన్ని జట్లకు అవకాశం లభించింది. ఇప్పటివరకు ఆసియా నుంచి 12 జట్లు ప్రపంచకప్‌లో ఒక్కసారైనా బరిలోకి దిగాయి. దక్షిణ కొరియా అత్యధికంగా 11 సార్లు ప్రపంచకప్‌లో పోటీపడింది. జపాన్ ఏడుసార్లు బరిలోకి దిగగా... ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా ఆరుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్లో పోటీపడ్డాయి. 1966లో ఉత్తర కొరియా క్వార్టర్ ఫైనల్ చేరగా... 2002లో జపాన్‌తో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణ కొరియా సెమీఫైనల్ చేరి ఈ ఘనత సాధించిన ఏకైక ఆసియా జట్టుగా నిలిచింది. అనంతరం నాలుగు ప్రపంచకప్‌లు జరిగినా మరో ఆసియా జట్టు సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. మరో పది రోజుల్లో ఖతర్‌లో ప్రారంభం కాబోతున్న ప్రపంచకప్‌లో ఆసియా నుంచి తొలిసారి అత్యధికంగా ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించగా... క్వాలిఫయింగ్ ద్వారా కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా అర్హత పొందాయి. 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈసారైనా మరో ఆసియా జట్టు సెమీఫైనల్ చేరుకుంటుందో లేదో చూడాలి. -
ప్రమాదంలో భారత ఫుట్ బాల్
-
‘గాడియమ్’తో చేతులు కలిపిన ఐఎస్ఎల్ విన్నర్ హైదరాబాద్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ‘గాడియమ్ స్కూల్’తో హెచ్ఎఫ్సీ ఒప్పందం చేసుకుంది. కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీ’ని హెచ్ఎఫ్సీ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు. హెచ్ఎఫ్సీ టీమ్‌కు చెందిన కోచ్‌లు, ఇతర సాంకేతిక నిపుణులు దీనికి సహకరిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన కుర్రాళ్లకు మున్ముందు హెచ్ఎఫ్సీ తరఫున యూత్, లీగ్ టోర్నమెంట్లలో ఆడే అవకాశం కూడా లభిస్తుంది. శిక్షణతో పాటు హెచ్ఎఫ్సీ ఆధ్వర్యంలో ఆటకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో హెచ్ఎఫ్సీ యజమాని వరుణ్ త్రిపురనేని, ‘గాడియమ్’ డైరెక్టర్ కీర్తి రెడ్డి, సీఈఓ రామకృష్ణారెడ్డి, అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్స్ షబ్బీర్ అలీ, విక్టర్ అమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు సురక్షితంగా పాకిస్తాన్ చేరుకుంది. తాలిబన్ ప్రభుత్వం నుంచి మహిళా ఫుట్‌బాలర్లకు ముప్పు ఉండటంతో 32 మంది తమ కుటుంబసభ్యులతో సహా పొరుగుదేశం పాక్‌లో అడుగుపెట్టారు. నిజానికి ఈ జట్టు ఖతర్‌కు బయల్దేరాలనుకుంది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడికి వెళ్లే అవకాశం లేకపోయింది. దీంతో తాలిబన్ల కళ్లుగప్పి పాక్‌కు చేరుకుంది. తాలిబన్ సర్కారు పురుషుల క్రీడలకు అనుమతించినప్పటికీ మహిళలు షరియా చట్టాల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. దీనిపై మహిళా ఫుట్‌బాలర్లు విమర్శలకు దిగడంతో తాలిబన్లు వారిని నిర్బంధించాలనుంది. బ్రిటన్‌కు చెందిన ఎన్జీవో సహకారంతో ఫుట్‌బాలర్లకు పాక్ అత్యవసర వీసాలు జారీ చేసింది. వీరికి పెషావర్ లేదంటే లాహోర్‌లో బస ఏర్పాటు చేసే అవకాశముంది. -
క్రీడాలోకం దిగ్భ్రాంతి: విమానం నుంచి పడిన క్రీడాకారుడు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి బయల్దేరిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన ప్రపంచం మరువలేదు. తాజాగా విమానం నుంచి కిందపడిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వివరాలు వెల్లడి కాగా మరో యువకుడు మృతి చెందడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎందుకంటే ఆ దేశ జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు విమానం నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. ఈ విషాదకర వార్త వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: విమానం నుంచి పడిపోయిన ఘటన.. అన్నదమ్ముల విషాద గాథ ) తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అఫ్గానిస్తాన్‌లో భయాందోళనలు ఏర్పడిన విషయం తెలిసిందే. తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన ఆక్రమించగా ఆ భయంతో ఆ తెల్లారి 16వ తేదీన ప్రజలు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగుల బాట పెట్టారు. అక్కడ ఉన్న అమెరికా యుద్ధ విమానం ఎక్కి ముగ్గురు కిందపడిన విషయం తెలిసిందే. మిగతా ఇద్దరు సోదరులు కాగా మరో యువకుడు ఆ దేశ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఈ విషయం తెలుసుకున్న క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. ఎంతో ప్రతిభ గల క్రీడాకారుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అత్యంత దారుణ పరిస్థితిలో మరణించడం కలచివేస్తోంది. అతడి పేరు జాకీ అన్వరీ. అఫ్గానిస్తాన్ జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు. అమెరికా యుద్ధ విమానం సీ-17 పై నుంచి కిందపడిన వారిలో జాకీ ఒకడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రీడా శాఖ ధ్రువీకరించింది. జాకీ అన్వరీ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. చదవండి: అథ్లెటిక్స్ దిగ్గజం కన్నుమూత.. విషాదంలో పీటీ ఉష -
సగం జీతం కట్! మరో ఐదేళ్లకు ఒప్పందం?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాలర్‌గా పేరున్న లియోనెల్ మెస్సీ.. రాజీకి సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్ట్ ఇటీవలె ముగిసిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యం ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. అయితే ఊహాగానాలకు తెరదించుతూ మెస్సీ మరోసారి బార్సిలోనా కాంట్రాక్ట్‌కే మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది. మరో ఐదేళ్లపాటు బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం చేసుకోబోతున్న మెస్సీ.. 50 శాతం జీతం కట్టింగ్‌కు సైతం సిద్ధపడినట్లు గోల్.కామ్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. రీ-సైన్ నేపథ్యంలో వార్షికాదాయంలో ఈ కట్టింగ్లు పోతాయని, దీనిపై క్లబ్ త్వరలోనే అధికార ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బార్సిలోనా క్లబ్ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ ప్రభావంతో ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్లు ఇవ్వలేకపోతోంది కూడా. ఈ నేపథ్యంలో క్లబ్‌కు ఊరట ఇచ్చేలా మెస్సీ తన జీతంలో త్యాగానికి సిద్ధపడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో మెస్సీ మాస్టర్ ప్లాన్ అమలుచేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా కంటే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నాయి కొన్ని క్లబ్‌లు. అయితే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మెస్సీ.. వాటి ద్వారా గణనీయమైన ఆదాయం వెనకేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెస్సీ వేరే క్లబ్‌లకు వెళ్తే గనుక.. విశ్వసనీయత దెబ్బతిని ఆ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నాడు. అందుకే బార్సిలోనా ఆఫర్‌కు తలొగ్గడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు 2004 నుంచి బార్సిలోనాతో కొనసాగుతున్నాడు. Messi in call with his fam after he got his champion’s medal  😍🔟📱🥇#Argentina #LeoMessi #LionelMessi #MessiTHEGOAT #ArgentinavsBrazil #CopaAmerica2021 #CopaAmerica #ARGBRA #ArgentinaBrazil #Messi #MessiCampeon pic.twitter.com/ChZeNPbyZZ — Leo Messi (@xlionelmessix) July 11, 2021 గత ఐదేళ్ల కాంట్రాక్ట్ కోసం 550 మిలియన్ల యూరోస్తో మెస్సీ ఒప్పందం చేసుకుని.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. తాజాగా కాంట్రాక్ట్ ముగిశాక ‘పారిస్ సెయింట్ జెర్మాయిన్, మాంచెస్టర్ సిటీ, ఇంటర్ మిలన్లు మెస్సీకు బంపరాఫర్లు ప్రకటించాయి కూడా. ప్రస్తుత కథనాలు నిజమైతే 2026 వరకు మెస్సీ బార్సిలోనాతోనే కొనసాగుతాడు. -
‘యూరో’లో ఇటలీ జైత్రయాత్ర
లండన్: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తమ అజేయ రికార్డును కొనసాగిస్తూ ఇటలీ ఫుట్‌బాల్ జట్టు యూరో కప్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ జట్టుతో ఇక్కడి వెంబ్లీ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్లో 4–2తో మూడుసార్లు చాంపియన్ స్పెయిన్‌ను ఓడించింది. గత 34 మ్యాచ్‌ల్లో ఇటలీకి ఓటమి లేకపోవడం విశేషం. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఇటలీ తరఫున 60వ నిమిషంలో చియేసా గోల్ చేయగా... స్పెయిన్ తరఫున 80వ నిమిషంలో మొరాటా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. -
వైద్య సిబ్బందికి ‘ఫిఫా’ జేజేలు...
న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన ప్రజల్ని బతికించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఫుట్‌బాల్ లోకం జై కొట్టింది. జగద్విఖ్యాత సాకర్ స్టార్లు పీలే, డీగో మారడోనా, భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితర 50 మంది ఆటగాళ్లతో వైద్య, సహాయ సిబ్బందికి జేజేలు పలుకుతూ సంఘీభావ సందేశాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. ఫుట్‌బాల్ ఆడే దేశాల ఆటగాళ్లు ఈ సంఘీభావంలో పాల్గొన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోన్న వైద్యులకు కరతాళధ్వనులతో సాకర్ స్టార్లు మద్దతు తెలిపారు. ‘మహమ్మారిపై పోరాటంలో దినదిన గండాలు ఎదురవుతున్నా... ప్రాణాలను లెక్కచేయకుండా పరుల స్వస్థత కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది విశేష కృషి చేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు వలంటీర్లు, ఫార్మాసిస్టులు... ఇతరులకు సోకకుండా పోలీసులు, సెక్యూరిటీ వర్గాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయి. ఇంతటి భయానక పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు పాటుపడుతున్న వర్గాలు... ఇలా వీరంతా నిజమైన హీరోలు. వీరికి ఫుట్‌బాల్ కృతజ్ఞతలు తెలుపుతోంది. వీరిని ఫుట్‌బాల్ సదా స్మరిస్తుంది. వీరందరికి ఫుట్‌బాల్ మద్దతు తెలుపుతోంది’ అని ‘ఫిఫా’ ఈ సందేశంలో తెలిపింది. -
'ఫుట్‌బాల్ టీంను కొందామనుకుంటున్నా'
న్యూయార్క్ : అమెరికా బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ క్లబ్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.ఇదే విషయమై గతవారం టైన్సైడ్లోని ఓ- 2సిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఫుట్‌బాల్ టీమ్ న్యూ కాజిల్ యునైటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగాన్యూకాజిల్కు ప్రస్తుత యజమానిగా వ్యవహరిస్తున్న మైక్ ఆష్లే నుంచి క్లబ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా.. అని మేవెదర్‌ను విలేకరులు ప్రశ్నించారు. దానికి మేవెదర్ స్పందిస్తూ.. ‘యూఎస్‌లో మేము దీనిని సాకర్ అని పిలుస్తాము. కాని న్యూ కాజిల్ ఫుట్‌బాల్ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదు. నేను న్యూ కాజిల్ జట్టును కొనాలని భావిస్తే ముందు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడూ కొత్త వ్యాపార అవకాశాలకు సిద్ధంగా ఉంటాను. నాకు బాక్సింగ్ ఒక్కటే కాకుండా మిగతా ఆటలంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌ను కొందామనే ఆలోచన చేశా. సాకర్ నా ఆట కాకపోవచ్చు.. కానీ ప్రతి ఆట గురించి నాకు కొంతమేర అవగాహన ఉంది' అని మేవెదర్ వెల్లడించాడు.(షఫాలీని అలా చూడటం కష్టమైంది) అయితే మేవెదర్, బ్రిటిష్ బిలియనీర్ ఆష్లే మధ్య ఇంకా దీని గురించి ఎటువంటి అధికారిక చర్చలు జరగలేదు. కానీ న్యూకాజిల్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఫ్లాయిడ్ కంపెనీ మనీ టీమ్ ఆసక్తి చూపిస్తోందని టిఎమ్‌జెడ్ స్పోర్ట్స్ ఇటీవలే నివేదించింది. కాగా గతేడాదిఫ్లాయిడ్ మేవెదర్ జపాన్‌లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొని 20 ఏళ్ల కిక్-బాక్సర్ టెన్షిన్ నాసుకావాపై సునాయాస విజయం సాధించి ఫ్రొఫెషనల్ బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం రెండే నిమిషాలు జరిగిన ఆ బౌట్లో నాసుకావాను ఓడించి 9 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. కాగా ఫ్లాయిడ్ మేవెదర్ తన ఫ్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో 50 విజయాలతో పాటు 26 ప్రపంచ టైటిళ్లను నెగ్గాడు. కొంతకాలం కిందట ఫ్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మేవెదర్ ప్రస్తుతం అమెరికా బాక్సింగ్ ప్రమోటర్‌గా కొనసాగుతున్నాడు. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ) -
మా దేశానికి రావొద్దు...
న్యూఢిల్లీ: తజికిస్తాన్లో పర్యటించాలనుకున్న భారత కుర్ర ఫుట్‌బాలర్లకు ‘కరోనా’ షాకిచ్చింది. తమ దేశంలో భారత అండర్–16 ఫుట్‌బాల్ జట్టు పర్యటనను తజికిస్తాన్ రద్దు చేసింది. అండర్–15 దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య చాంపియన్ అయిన భారత కుర్రాళ్ల జట్టు రేపు అక్కడికి బయలుదేరాల్సి ఉంది. అక్కడ ఏఎఫ్సీ అండర్–16 చాంపియన్‌షిప్ రన్నరప్ అయిన తజికిస్తాన్‌తో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే భారత్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో తజికిస్తాన్ ప్రభుత్వం భారత్‌ను కరోనా ప్రభావిత దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో 35 దేశాలున్నాయి. ఈ జాబితాలోని దేశాల్లో తమ దేశస్థులు పర్యటించడాన్ని... ఆ దేశస్థులు తమ దేశంలో పర్యటించడాన్ని తజికిస్తాన్ నిషేధం విధించడం వల్లే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేకపోతున్నట్లు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య స్పష్టం చేసింది. ఆడండి కానీ... ఆటోగ్రాఫ్‌లు వద్దే వద్దు! ప్రాణాంతక కరోనా వైరస్ (కోవిడ్–19)తో అమెరికాలో ఆరుగురు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తమ ఆటగాళ్లకు, జట్ల కోచ్‌లు, ఫిజియో, ఇతర సిబ్బందికి తు.చ. తప్పకుండా పాటించే మార్గదర్శకాలు జారీచేసింది. ఆటగాళ్లెవరూ అభిమానులతో కలవరాదని కచ్చితంగా చెప్పేసింది. ఆటోగ్రాఫ్‌లు చేసేందుకు, పెన్నులను ముట్టుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు దూరంగా ఉండాలని ఎన్బీఏ స్పష్టం చేసింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తమ ప్రధాన ఉద్దేశమని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరచాలనం ఇవ్వం: జో రూట్ శ్రీలంకలో క్రికెట్ సిరీస్ ఆడేందుకు మంగళవారం అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సభ్యులు అక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయబోరని కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు. కరోనా ఎఫెక్ట్ వల్లే పరస్పర కరచాలనం చేయొద్దని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఇంగ్లండ్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడ్డారు. అయితే త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడైతే కోవిడ్–19 ప్రపంచాన్నే వణికిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా శుచి–శుభ్రతను పాటిస్తామని, తమ క్రికెట్ బోర్డు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నడుచుకుంటామని రూట్ చెప్పాడు. నిర్‘బంధి’ంచారు... అబుదాబీలో విదేశీ సైక్లిస్ట్‌లకు వింత అనుభవం ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వచ్చిన జట్లలో కొందరికి కరోనా సోకడంతో వాళ్లని వెంటనే వారి స్వదేశాలకు పంపేసిన అబుదాబీ వర్గాలు మిగతా వారిని బస చేసిన హోటల్ గదుల్లోనే నిర్బంధించింది. ఫ్రాన్స్, రష్యా దేశాలకు చెందిన సైక్లిస్ట్‌లకు, సిబ్బందికి నిర్బంధం విధించిన యూఏఈ ప్రభుత్వం వైరస్ బారిన పడిన ఇద్దరు ఇటాలియన్ అధికారుల్ని ఉన్నపళంగా ఇటలీకి ప్రత్యేక విమానాల్లో పంపించింది. -
నిలవాలంటే...గెలవాలి
మస్కట్: ఒమన్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి భారత ఫుట్‌బాల్ జట్టు సిద్ధమైంది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు అర్హత రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ విజయం తప్పనిసరి. ఒకవేళ ఓడిందంటే మాత్రం ప్రపంచ కప్ దారులు మూసుకుపోయినట్లే. 2022 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నేడు గ్రూప్ ‘ఇ’లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక దాంట్లో ఓడి... మూడింటిని ‘డ్రా’ చేసుకున్న భారత్... 3 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు ఒమన్ మాత్రం నాలుగింటిలో మూడు గెలిచి 9 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. క్వాలిఫయర్స్ తొలి అంచె పోటీల్లో ఇరు జట్లు గువాహటి వేదికగా తలపడగా భారత్ 1–2తో ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో 80 నిమిషాల పాటు ఆధిక్యం కనబరిచిన భారత్... చివరి 10 నిమిషాల్లో చేతులెత్తేసి ఏకంగా రెండు గోల్స్ ప్రత్యర్థికి సమర్పించుకొని పరాభవాన్ని మూటగట్టుకుంది. అనంతరం ఆసియా చాంపియన్ ఖతర్‌తో జరిగిన మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించిన భారత్ ఆ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అయితే విజయాలు ఖాయం అనుకున్న బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్ ప్రస్తుతం చావో రేవో పరిస్థితి తెచ్చుకుంది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లోనూ సారథి సునీల్ చెత్రి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ఇరు జట్లు 11 సార్లు తలపడగా... భారత్ ఎనిమిదింట ఓడి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. ఒమన్‌కు పోటీ ఇవ్వాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిఫెన్స్ విషయంలో మెరుగవ్వాలి. అయితే కీలక ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌కు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశం.