
హైదరాబాద్: ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నగరంలో జరిగే ‘అంతర్జాతీయ సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ’లో పాల్గొనే హైదరాబాద్ జట్టులో తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తనయుడు వెంకట్ పవన్ భరద్వాజ్ ఎంపికయ్యాడు. హైదరాబాద్ రీడ్స్ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి మొత్తం 18 మంది క్రీడాకారుల బృందాన్ని ఐర్లాండ్‌లో జరిగే టోర్నీ కోసం ఎంపిక చేశామని రీడ్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
నార్త్ ఐర్లాండ్‌లో ఈనెల 23 నుంచి 27 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్టులో ఉదిత్ సింగ్, అయ్యన్, హరి వెంకట్, ఆదిత్య, సిద్ధార్థ్, వెంకట్ పవన్ భరద్వాజ్, రవికాంత్, సిద్ధార్థ, నాగరాజు, సిద్ధార్థరెడ్డి, భార్గవ రెడ్డి, రుద్ర, ఇస్సాన్, హర్షిత్, సమర్థ్, యశోవత్ చోటు దక్కించుకున్నారు.
, ,
Comments
Please login to add a commentAdd a comment