సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ‘గాడియమ్ స్కూల్’తో హెచ్‌ఎఫ్‌సీ ఒప్పందం చేసుకుంది. కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీ’ని హెచ్‌ఎఫ్‌సీ ఏర్పాటు చేసింది.
ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు. హెచ్‌ఎఫ్‌సీ టీమ్‌కు చెందిన కోచ్‌లు, ఇతర సాంకేతిక నిపుణులు దీనికి సహకరిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన కుర్రాళ్లకు మున్ముందు హెచ్‌ఎఫ్‌సీ తరఫున యూత్, లీగ్ టోర్నమెంట్‌లలో ఆడే అవకాశం కూడా లభిస్తుంది. శిక్షణతో పాటు హెచ్‌ఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఆటకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో హెచ్‌ఎఫ్‌సీ యజమాని వరుణ్ త్రిపురనేని, ‘గాడియమ్’ డైరెక్టర్ కీర్తి రెడ్డి, సీఈఓ రామకృష్ణారెడ్డి, అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్స్ షబ్బీర్ అలీ, విక్టర్ అమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment