Indian Super League
-
గోవా ఘన విజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 4–2 గోల్స్ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెస్ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... ఉదాంత సింగ్ (45+2వ నిమిషంలో), అమెయ్ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్ చేశారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై గోవా 7 షాట్స్ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది. తాజా సీజన్లో 13 మ్యాచ్‌లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. జంషెడ్పూర్ తరఫున జోర్డన్ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్ ఉవైస్ (90వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్పూర్ వెంటవెంటనే రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్పూర్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
గోవా ఘనవిజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో మోహన్ బగాన్‌పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెజ్ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... మోహన్ బగాన్ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్ బగాన్ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసి ఒక గోల్ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది. లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్ బగాన్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్ బెంగాల్ జట్టుతో జంషెడ్పూర్ ఎఫ్‌సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
మోహన్ బగాన్ ‘టాప్’ షో
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (33వ నిమిషంలో), జాసన్ కమింగ్స్ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్ (90+5వ ని.లో) తలా ఒక గోల్ సాధించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జెసెస్ జిమెనెజ్ (51వ ని.లో), మిలోస్ డ్రింకిక్ (77వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన మోహన్ బగాన్ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు తరఫున ర్యాన్ విలియమ్స్ (71వ నిమిషంలో), జార్జ్ డియాజ్ (83వ ని.లో) చెరో గోల్ చేయగా... గోవా తరఫున సందేశ్ జింగాన్ (7వ ని.లో), సాహిల్ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది. తాజా సీజన్లో 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
మోహన్ బగాన్ గెలుపు
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 3–0తో జంషెడ్పూర్ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టామ్ అల్డ్రెడ్ (15వ ని.), లిస్టన్ కొలాకొ (45+2వ ని.), జేమి మెక్లారెన్ (75వ ని.) తలా ఒక గోల్ చేశారు. తాజా విజయంతో మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 8 మ్యాచ్‌లాడిన ఈ జట్టు ఐదింట గెలుపొంది ఒక మ్యాచ్‌లో ఓడింది. 2 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో పంజాబ్ ఎఫ్‌సీపై గెలుపొందింది. నార్త్ ఈస్ట్ జట్టులో గులెర్మో ఫెర్నాండెజ్ (15వ ని.), నెస్టర్ అల్బియక్ (18వ ని.) చెరో గోల్ చేశారు. పంజాబ్ తరఫున ఇవాన్ నొవొసెలెక్ (88వ ని.) గోల్ సాధించాడు. -
జంషెడ్‌పూర్‌కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్‌బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్‌పూర్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడనుంది. -
పంజాబ్ ఎఫ్‌సీ బోణీ
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు శుభారంభం చేసింది. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చివరి పది నిమిషాల్లో మూడు గోల్స్ కావడం విశేషం. పంజాబ్ తరఫున 86వ నిమిషంలో లుకా మాజ్సెన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు.ఇంజ్యూరీ సమయంలోని 90+2వ నిమిషంలో జిమెనెజ్ గోల్‌తో కేరళ జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. 90+5వ నిమిషంలో ఫిలిప్ మిర్జాక్ గోల్‌తో పంజాబ్ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. -
చెన్నైయిన్ ఎఫ్‌సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా భువనేశ్వర్‌లో ఒడిశా ఎఫ్‌సీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. చెన్నైయిన్ తరఫున ఫారుఖ్ (48వ, 51వ ని.లో) రెండు గోల్స్... డేనియల్ (69వ ని.లో) ఒక గోల్ చేశారు. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 1–0 గోల్‌తో ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్టును ఓడించింది. -
కష్టాలన్నీ తీరినట్టే.. బెంగళూరుతో తొలి మ్యాచ్.. ఈసారైనా!
జట్టులోని ఆటగాళ్లకు ఫీజులు కూడా చెల్లించలేని నిస్సహాయత... కాంట్రాక్ట్‌ల రద్దు... ఆటగాళ్ల బదిలీలపై నిషేధం... టీమ్‌పై నిషేధం... కొద్ది రోజుల క్రితం వరకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) పరిస్థితి ఇది. వరుణ్ త్రిపురనేని తదితరులు యజమానులుగా ఉన్న ఈ టీమ్‌కు ఐఎస్ఎల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినా స్పందించలేని వైనం... చివరకు ఐఎస్ఎల్ నుంచి హైదరాబాద్ టీమ్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం!ఇలాంటి సమయంలో బీసీ జిందాల్ గ్రూప్ బరిలోకి దిగింది. అన్ని రకాల బాకీలను తీరుస్తూ జట్టును తీసుకునేందుకు సిద్ధమైంది. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు యాజమాన్య మార్పు ఖాయమైంది. ఇప్పుడు అధికారిక అనుమతి తర్వాత హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఐఎస్ఎల్లో ఆరో సీజన్‌కు ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఎల్లో హైదరాబాద్ టీమ్ అడుగు పెట్టడమే అనూహ్యంగా జరిగింది. 2018–19 సీజన్ తర్వాత ఆర్థిక సమస్యలతో పుణే సిటీ టీమ్ సతమతమైంది. దాంతో తర్వాతి సీజన్లో పుణే స్థానాన్ని మరో జట్టుతో భర్తీ చేసేందుకు ఐఎస్ఎల్ నిర్వాహకులు సిద్ధం కాగా... అప్పటికే కేరళ బ్లాస్టర్స్ టీమ్‌తో కలిసి పని చేసిన వరుణ్ ఎక్కువ వాటాతో పుణే స్థానాన్ని హైదరాబాద్ టీమ్‌తో భర్తీ చేశాడు.తొలి సీజన్ (2019–20)లో పేలవమైన ఆటతో జట్టు చివరి స్థానానికే పరిమితమైంది. తర్వాతి ఏడాది కాస్త మెరుగైన ప్రదర్శనతో జట్టు ఐదో స్థానంతో ముగించింది. అయితే 2021–22లో ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ నేతృత్వంలో చాంపియన్‌గా నిలిచింది.తర్వాతి ఏడాదీ రన్నరప్‌గా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే గత సీజన్లో జట్టు గతి తప్పింది. మైదానంలో ప్రదర్శన ఘోరంగా ఉండగా... మైదానం బయట సమస్యలు టీమ్ పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. 22 మ్యాచ్‌లు ఆడితే 1 మ్యాచ్‌లో నెగ్గి, 16 మ్యాచ్‌లలో ఓడి, 5 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని అట్టడుగున నిలిచింది. అన్నీ సమస్యలే... బయటకు కనిపించని ఎన్నో కారణాలతో హైదరాబాద్ ఎఫ్‌సీ టీమ్ పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల పాటు తమకు ఒప్పందం ప్రకారం ఫీజులు చెల్లించలేదంటూ ఎనిమిది మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆటగాళ్ల బదిలీపై కూడా ‘ఫిఫా’ నిషేధం విధించింది. టీమ్ అప్పులు పెరిగిపోయాయి. మ్యాచ్‌ల కోసం ప్రయాణాలను కూడా సరిగా ప్లాన్ చేయలేక వేదిక అయిన మరో నగరానికి మ్యాచ్ రోజు ఉదయం చేరిన ఘటనలు కూడా జరిగాయి.ఐఎస్ఎల్ నుంచి నోటీసు వచ్చినా టీమ్ యాజమాన్యం స్పందించలేదు. ఒకదశలో మాకు జీతాలు చెల్లించండి ప్రభూ అంటూ టీమ్‌తో కలిసి పని చేసిన పలువురు సహాయక సిబ్బంది మ్యాచ్‌ల సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని వరుణ్ ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరలేదు.గచ్చిబౌలి స్టేడియంలో కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఎవరూ మ్యాచ్ నిర్వహణకు సహకరించలేదు. చివరకు యాజమాన్య హక్కులను వదులుకోవాల్సి వచ్చింది. కొత్త యాజమాన్యంతో... సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా విధించగా... టీమ్ యాజమాన్యం మరో రెండు వారాలు అదనపు గడువు అడిగింది. దాంతో హైదరాబాద్ మ్యాచ్‌లను మినహాయించి ఇతర మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐఎస్ఎల్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యాపారాల్లో ఉన్న సంస్థ బీసీ జిందాల్ గ్రూప్ క్రీడల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమై ముందుకు వచ్చింది.1952 నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఈ సంస్థ ‘జిందాల్ ఫుట్‌బాల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో తొలిసారి లీగ్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేసింది. గత యాజమాన్యం చేసిన అప్పులు, లాభాలు, ఇతర లెక్కలు అన్నీ తేలిన తర్వాత ఈ నెల 2న హైదరాబాద్ టీమ్‌ను జిందాల్ గ్రూప్ తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త మేనేజ్మెంట్ అండతో హెచ్ఎఫ్సీ 2024–25 సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు వివరాలు అర్ష్‌దీప్ సింగ్ సైనీ, లాల్బియాక్లువా జాంగ్తే, అలెక్స్ షాజీ, లియాండర్ కన్హా, మనోజ్ మొహమ్మద్, మొహమ్మద్ రఫీ, పరాగ్ సతీశ్ శ్రీవాస్, సోయల్ జోషి, విజయ్ మరాండి, రామ్లన్చుంగా, అబ్దుల్ రబీ అంజుకందన్, అభిజిత్ పా, ఆయుశ్ అధికారి, ఐజాక్ వన్మల్సవ్మా చాక్చువాక్, లాల్చన్హిమా చైలో, లెనీ రోడ్రిగ్స్, రషీద్ మదమ్బిల్లత్, అమోన్ లెప్చా, ఆరోన్ వన్లాల్రించనా, స్టీఫెన్ గొడార్డ్, దేవేంద్ర ఢాకూ ముర్గాంవ్కర్, జోసెఫ్ సన్నీ. కోచ్: తంగ్బోయ్ సింగ్‌తో. నేటి నుంచి ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 11వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీలో మొత్తం 13 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్‌సీతో గత ఏడాది రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. ఈ రెండు టీమ్‌లతో పాటు డ్యురాండ్ కప్ విజేత నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ కూడా చక్కటి ఫామ్‌తో సవాల్ విసురుతోంది.నేడు జరిగే మొదటి మ్యాచ్‌లో రెండు జట్లలో కలిపి భారత సీనియర్ జట్టు ఆటగాళ్లంతా పెద్ద సంఖ్యలో ఉండటం ఆసక్తిని పెంచింది. టోర్నీలో ప్రాథమిక లీగ్ దశ పోటీలు డిసెంబర్ 30 వరకు సాగుతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్ గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం హోం టీమ్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడే ఆరు మ్యాచ్‌లకు (అక్టోబర్ 1, 30...నవంబర్ 25...డిసెంబర్ 4, 23, 28) ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
విజయంతో ముగించిన హైదరాబాద్ ఎఫ్‌సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లీగ్ దశను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) విజయంతో ముగించింది. ఆదివారం కొచ్ఛిలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0 గోల్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. 29వ నిమిషంలో చేసిన ఏకైక గోల్‌తో బొర్జా హెరెరా హైదరాబాద్‌ను గెలిపించాడు. లీగ్ దశలో ఆడిన 20 మ్యాచ్‌లలో 13 గెలిచి 4 మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్ మరో 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. మొత్తం 42 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన టీమ్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. లీగ్ దశలో 46 పాయింట్లతో ముంబై సిటీ ఎఫ్‌సీ అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 4న కోల్‌కతాలో మోహన్‌బగాన్, ఒడిషా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో హైదరాబాద్ రెండో సెమీఫైనల్ (తొలి అంచె)లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మార్చి 13న రెండో సెమీఫైనల్ (రెండో అంచె) మ్యాచ్ ప్రత్యర్థి వేదికపై జరుగుతుంది. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలు... ప్రపంచ చాంపియన్‌షిప్... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్ జట్టులో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్... మహిళల కాంపౌండ్ జట్టులో ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు. సోనీపత్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది. రెండు ప్రపంచకప్ టోర్నీలు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్ ఇస్తారు. మూడు ప్రపంచకప్ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్ 13–18) జరుగుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్‌లో విఫలమైన ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి మహిళల రికర్వ్ జట్టులో చోటు సంపాదించలేకపోయింది. మార్చి 18న ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ నేరుగా సెమీఫైనల్ చేరాయి. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్‌సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టుకు మూడో పరాజయం
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు మూడో పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీ 3–1 గోల్స్‌తో హైదరాబాద్‌ను బోల్తా కొట్టించింది. ఒడిశా తరఫున ఇసాక్ (33వ ని.లో), డీగో మౌరిసియో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ ప్లేయర్ నిమ్ డోర్జీ తమాంగ్ 72వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. హైదరాబాద్ నుంచి ఏకైక గోల్‌ను నిమ్ డోర్జీ (45వ ని.లో) సాధించాడు. 17 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 11 విజయాలు, 3 ‘డ్రా’లు, 3 ఓటములతో 36 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. చదవండి: Hyderabad E-Prix 2023 : రేసింగ్ @ హైదరాబాద్ Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్ -
ISL 2022: హైదరాబాద్‌ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఐఎస్ఎల్లో హైదరాబాద్ ఎఫ్సీకి తొలి విజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 3–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జోరు ముందు నార్త్ఈస్ట్ జట్టు తేలిపోయింది. మ్యాచ్ ఆరంభమైన 13వ నిమిషంలోనే బార్తొలొమి ఒబెచ్ గోల్ చేయడంతో 1–0తో హైదరాబాద్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై క్రమం తప్పకుండా దాడులకు పదునుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్ చేసింది. హలిచరన్ నర్జరీ (69వ ని.), బొర్జ హెరెరా (73వ ని.) నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేయడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌ను 3–3తో డ్రా చేసుకున్న హైదరాబాద్ జట్టు ప్రదర్శన ఈ మ్యాచ్‌లో మరింత మెరుగైంది. -
‘గాడియమ్’తో చేతులు కలిపిన ఐఎస్ఎల్ విన్నర్ హైదరాబాద్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నగరంలో ప్రాథమిక స్థాయిలో ఫుట్‌బాల్ అభివృద్ధికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ‘గాడియమ్ స్కూల్’తో హెచ్ఎఫ్సీ ఒప్పందం చేసుకుంది. కొల్లూరులో ఉన్న ఈ పాఠశాలలో ‘ఎలైట్ ఫుట్‌బాల్ అకాడమీ’ని హెచ్ఎఫ్సీ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి అకాడమీలో శిక్షణ ఇస్తారు. హెచ్ఎఫ్సీ టీమ్‌కు చెందిన కోచ్‌లు, ఇతర సాంకేతిక నిపుణులు దీనికి సహకరిస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన కుర్రాళ్లకు మున్ముందు హెచ్ఎఫ్సీ తరఫున యూత్, లీగ్ టోర్నమెంట్లలో ఆడే అవకాశం కూడా లభిస్తుంది. శిక్షణతో పాటు హెచ్ఎఫ్సీ ఆధ్వర్యంలో ఆటకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇందులో హెచ్ఎఫ్సీ యజమాని వరుణ్ త్రిపురనేని, ‘గాడియమ్’ డైరెక్టర్ కీర్తి రెడ్డి, సీఈఓ రామకృష్ణారెడ్డి, అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్స్ షబ్బీర్ అలీ, విక్టర్ అమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
IPL 2022: ఇంటికి వస్తోంది.. ట్రోఫీ.. కంగ్రాట్స్: సన్‌రైజర్స్
ISL -IPL- Hyderabad: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) విజేతగా నిలిచింది. ఎనిమిదో సీజన్ చాంపియన్‌గా నిలిచింది. గోవాలో మార్చి 20న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ‘షూటౌట్’ నిర్వహించగా కేరళను నిలువరించి విజయం సాధించింది. కాగా ఐఎస్ఎల్ ట్రోఫీని హైదరాబాద్ గెలవడం ఇదే తొలిసారి. ఈ విజయంపై స్పందించిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐఎస్ఎల్ విజేతకు తమదైన శైలిలో విషెస్ తెలిపింది. మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఇంటికి వస్తోంది ట్రోఫీ.. కంగ్రాట్స్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందించింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు కేన్ మామ కూడా కప్ తీసుకువస్తాడు చూడండి అంటూ ఎస్ఆర్హెచ్కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత సీజన్లో మాత్రం ఘోర ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈసారైనా సత్తా చాటి తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది. చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్ పంత్.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు Intiki vastondi. 🏆🧡💛 Congratulations, @HydFCOfficial 👏#ISLFinal pic.twitter.com/NyuH6z5z0t — SunRisers Hyderabad (@SunRisers) March 20, 2022 Thag Life, #Pushpa style. 😎🔥#TATAIPL #OrangeArmy #ReadyToRise@alluarjun @PushpaMovie @ThisIsDSP pic.twitter.com/x8lAXZPrzB — SunRisers Hyderabad (@SunRisers) March 21, 2022 -
ISL: నరాలు తెగే ఉత్కంఠ.. ఎట్టకేలకు తొలి టైటిల్ గెలిచిన హైదరాబాద్
Indian Super League- Hyderabad FC Won Maiden Trophy- ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఎనిమిదో సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ‘షూటౌట్’లో 3–1తో కేరళ బ్లాస్టర్స్ జట్టును ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. హైదరాబాద్ గోల్‌కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్లు కొట్టిన మూడు షాట్స్‌ను నిలువరించి తమ జట్టును విజేతగా నిలిపాడు. చాంపియన్ హైదరాబాద్ జట్టుకు రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు ఆట 68వ నిమిషంలో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు రాహుల్ గోల్ అందించి 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే 88వ నిమిషంలో సాహిల్ గోల్‌తో హైదరాబాద్ 1–1తో సమం చేసింది. కేరళ జట్టు మూడోసారీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. 2014, 2016లోనూ కేరళ జట్టు ఫైనల్లో ఓడింది. మరోవైపు హైదరాబాద్ జట్టు మూడో ప్రయత్నం లో చాంపియన్‌గా నిలువడం విశేషం. 2019లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలువగా.. 2020– 2021 సీజన్లో ఐదో స్థానాన్ని పొందింది. ‘షూటౌట్’ సాగిందిలా... కేరళ బ్లాస్టర్స్- స్కోరు - హైదరాబాద్ లెస్కోవిచ్ - 01 -జావో విక్టర్ నిషూ కుమార్- 01 - సివెరియో ఆయుష్- 12 - కమారా జీక్సన్ సింగ్ - 13 - హాలీచరణ్ నోట్: ఫలితం తేలిపోవడంతో ఐదో షాట్‌ను తీసుకోలేదు చదవండి: IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు First Appearance in the Final ✅ First #HeroISL trophy ✅ A memorable night for @2014_manel & @HydFCOfficial as they end their campaign in style! 🏆🤩#HFCKBFC #HeroISLFinal #FinalForTheFans #HeroISL #LetsFootball pic.twitter.com/zauxXrqGga — Indian Super League (@IndSuperLeague) March 20, 2022 -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్‌గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్‌గా మారిందని విశ్లేషించారు. లీగ్‌లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్‌సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్‌కే వాస్తే’గా టీమ్‌లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్‌కీపర్‌గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్‌కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ డ్రా
ISL 2021-2022: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రా అయింది. మ్యాచ్ ఆరంభమైన 13 నిమిషాలకే చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్ మొహమ్మద్ సాజిద్ ధోత్ గోల్ చేయడంతో 1–0తో పైచేయి సాధించింది. హైదరాబాద్ ఫార్వర్డ్ ఆటగాడు జేవియర్ సివేరియో (45వ ని.) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు -
హైదరాబాద్ ఎఫ్‌సీ భారీ విజయం; చెస్‌లో అదరగొట్టిన ఇమ్రోజ్, సరయు!
Indian Super League: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గోవాలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) 5–1తో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుపై నెగ్గింది. హైదరాబాద్ తరఫున సానా (12వ ని.లో), అనికేత్ (90వ ని.లో), సివెరియో (90వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఒగ్బెచె (27వ, 78వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చాంప్స్ ఇమ్రోజ్, సరయు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్ –19 జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో బాలుర విభాగంలో మొహమ్మద్ బాషిఖ్ ఇమ్రోజ్ (నల్లగొండ–6.5 పాయింట్లు), బాలికల విభాగంలో వేల్పుల సరయు (వరంగల్–5.5 పాయింట్లు) చాంపియన్స్‌గా నిలిచారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్ రెడ్డి (బద్రుకా కాలేజీ) 6 పాయింట్లతో తొలి రన్నరప్‌గా, సూరపనేని చిద్విలాస్ సాయి (హైదరాబాద్) రెండో రన్నరప్‌గా నిలిచారు. కర్రి శరత్చంద్ర (రంగారెడ్డి) నాలుగో స్థానాన్ని పొందాడు. టాప్–4లో నిలిచిన ఈ నలుగురూ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. బాలికల విభాగంలో సరయు, గంటా కీర్తి (మేడ్చల్), లేళ్లపల్లి దుర్గా కార్తీక, ఎ.సాయి మహతి (రంగారెడ్డి) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ నలుగురు కూడా జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తరఫున బరిలోకి దిగుతారు. విజేతలకు టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ బహుమతులు అందజేశారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్‌ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. -
హైదరాబాద్ ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’
వాస్కో: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో ఎనిమిదో ‘డ్రా’ చేరింది. నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. 16 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ 23 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ క్లబ్ 2–1తో జంషెడ్పూర్ క్లబ్‌ను ఓడించి ఈ టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఈస్ట్ బెంగాల్ తరఫున స్టీన్మన్ (6వ ని.లో), పిలింగ్టన్ (68వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జంషెడ్పూర్ జట్టుకు హార్ట్లే (83వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీతో గోవా క్లబ్ ఆడుతుంది. -
ఒడిశా గెలిచిందోచ్...
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఇప్పటిదాకా బోణీ చేయని ఏకైక జట్టుగా ఉన్న ఒడిశా ఎఫ్‌సీ ఆ ముద్రను తాజా విజయంతో తొలగించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒడిశా జట్టు 4–2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. ఒడిశా స్ట్రయికర్ డీగో మౌరిసియో చెలరేగాడు. పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒడిశా జట్టులో స్టీవెన్ టేలర్ (42వ ని.) మౌరిసియో (50వ, 60వ ని.) గోల్స్ సాధించారు. కాగా అంతకుముందే ప్రత్యర్థి ఆటగాడు జీక్సన్ సింగ్ (22వ ని.) సెల్ఫ్‌గోల్ చేయడంతో ఒడిశా స్కోరు 4కు చేరింది. కేరళ జట్టులో జోర్డాన్ ముర్రే (7వ ని.), గ్యారీ హూపర్ (79వ ని.) చెరో గోల్ చేశారు. 9 మ్యాచ్‌లాడిన ఒడిశా ఆరు పోటీల్లో ఓడిపోగా రెండు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. శుక్రవారం జరిగే పోరులో హైదరాబాద్ ఎఫ్‌సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
హైదరాబాద్ ఎఫ్‌సీ మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జావో విక్టర్ గోల్‌గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఎఫ్‌సీ ఒక మ్యాచ్‌లో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో డ్రా నమోదు చేసింది. -
నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజయం
వాస్కో (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు రెండో విజయం సాధించింది. ఈస్ట్ బెంగాల్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. 33వ నిమిషంలో ఈస్ట్ బెంగాల్ ప్లేయర్ సుర్చంద్ర సింగ్ సెల్ఫ్ గోల్ చేయడంతో నార్త్ ఈస్ట్ జట్టు ఖాతా తెరిచింది. 90వ నిమిషంలో రోచర్జెలా చేసిన గోల్‌తో నార్త్ ఈస్ట్ విజయం ఖాయమైంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబైతో ఒడిశా... గోవాతో కేరళ బ్లాస్టర్స్ తలపడతాయి.