బెంగళూరుపై కోల్‌కతా గెలుపు | Kolkata Win Against Bengaluru In Football Tournament | Sakshi
Sakshi News home page

బెంగళూరుపై కోల్‌కతా గెలుపు

Dec 26 2019 1:51 AM | Updated on Dec 26 2019 1:51 AM

Kolkata Win Against Bengaluru In Football Tournament - Sakshi

కోల్‌కతా: క్రిస్మస్‌ పర్వదినాన అట్లెటికో డి కోల్‌కతా జట్టు సంబరాల్లో మునిగి తేలింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో అట్లెటికో తొలిసారి బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. ఐఎస్‌ఎలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు మాజీ చాంపియన్‌ అయిన అట్లెటికో జట్టు 1–0తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు ఎఫ్‌సీపై గెలుపొందింది. మ్యాచ్‌ మొత్తం మీద అన్ని విభాగాల్లో సునీల్‌ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు జట్టే ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ విజయం మాత్రం అందుకోలేకపోయింది. మ్యాచ్‌ 47వ నిమిషంలో డేవిడ్‌ విలియమ్స్‌ చేసిన గోల్‌తో అట్లెటికో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్లెటికో (18 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement