బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 15–11, 15–11, 15–14, 10–15, 14–15తో బెంగళూరు టోర్సెడోస్ జట్టును ఓడించింది.
కోల్‌కతా వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ లీగ్ నిబంధనల ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా రెండు జట్లు నిర్ణీత ఐదు సెట్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో కోల్‌కతా ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. నేడు జరిగే మ్యాచ్‌లో కాలికట్ హీరోస్‌తో ముంబై మిటియోస్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment