Thunderbolts
-
పిడుగులు, వర్షం పడతాయా?
కరీంనగర్ అర్బన్: పిడుగులు, వర్షాలే ప్రధానంగా రైతులకు తీరని నష్టం కలిగిస్తాయి. ఎప్పుడు ఎక్కడ పిడుగులు పడతాయో.. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. వీటివల్ల మనుషులు, మూగజీవాలు మరణించిన ఘటనలు అనేకం. గతంలో ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బక్కతట్ల రాజయ్య పిడుగుపాటుకు గురై, మృతిచెందాడు. ఏటా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేంద్రం పలు యాప్‌లను భారత వాతావరణ శాఖ ద్వారా తీసుకువచ్చింది. ఇంటర్నెట్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకుంటే పిడుగు, వర్షం ఎప్పుడు పడుతుందో ఇట్టే తెలిసిపోతుంది. తదనుగుణంగా రైతన్న వ్యవహరిస్తే చాలు. యాప్‌లతో మరో ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునే వీలు కల్పించింది.రెయిన్ అలారం..గూగుల్ ప్లే స్టోర్ నుంచి రెయిన్ అలారం అని ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఈ యాప్ కనిపిస్తుంది. కేవలం ఒక నిమిషంలో డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడు అందించిన వివరాల మేరకు అతను ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వర్షం పడే సూచనలున్నాయో సమగ్ర సమాచారం క్షణాల మీద అందిస్తుంది. దీంతో వర్షం ముప్పు తెలుసుకొని, ముందే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.దామినీ యాప్..సాధారణంగా వర్షాకాలంతోపాటు ఏప్రిల్, మే నెలల్లో పిడుగులు పడటం సహజం. వ్యవసాయ పనుల హడావుడిలో ఉండే రైతులు పిడుగు పడే సమయంలో దగ్గరలోని ఎత్తయిన చెట్ల కిందకో, మరోచోటుకో వెళ్తుంటారు. అవి అంత సురక్షితం కావని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రైతులను అప్రమత్తం చేసేదే దామినీ యాప్. దీన్ని కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్కడ పిడుగు పడుతుందో అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల సురక్షిత ప్రాంతాలకు వెళ్లొచ్చు.మేఘదూత్ యాప్..పంట చేలకు ఎరువులు అందించాల్సిన సమయంలో లేదా వరి కోతల సందర్భంలో రైతులకు నష్టం చేసేవి వర్షాలే. దాన్ని తప్పించేందుకు భారత వాతావరణ శాఖ మేఘదూత్ యాప్‌కు రూపకల్పన చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే తాజా సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 5 రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచనలు సహా ఆకాశం మేఘావృతమవుతుందా లేదా గాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ దిఽశగా వీస్తాయో తెలుపుతుంది.విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవాలి..ప్లే స్టోర్ నుంచి మూడు యాప్‌లను విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతీ యాప్‌కు వినియోగదారుడి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సరైన సమాచారాన్ని సకాలంలో అందిస్తాయి. -
పల్లె జీవితాలపై పిడుగు..
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి : ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్ టూ గ్రౌండ్) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి. తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 మంది పిడుగుపాటు కారణంగా చనిపోయారు. ప్రతి ఏటా మే నుంచి అక్టోబర్ వరకు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోనే లక్షకు పైగా పిడుగులు పడుతున్నట్లు భారత లైటనింగ్ రిపోర్ట్ 2022–23 తాజా నివేదిక వెల్లడించింది. అయితే పిడుగుపాటు మరణాలు జాతీయ విపత్తు జాబితాలో లేకపోవటంతో మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం అందడం లేదు. పరిహారం అందించే అంశం అధికారులు, ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటోంది. దీంతో బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఏటా సగటున లక్షకు పైగా పిడుగులు ♦ పొట్టకూటి కోసం మిరపనారు నాటేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా కూలీలను పిడుగు కబళించింది. మిరప నారు నాటుతుండగా ఉన్నట్టుండి పిడుగు పడింది. మరుక్షణంలోనే చిలివేరు సరిత (30), నేర్పాటి మమత (32) మృత్యువాత పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ శివా రులో గత మంగళవారం ఈ పిడుగు పాటు సంభవించింది. ఆ ఇద్దరు మహి ళల కుటుంబాల్లో చీకట్లు నింపింది. ♦ పిడుగుపాటు జీవితాల్ని ఎలా ఛిద్రం చేస్తుందో చెప్పే చిత్రమిది. 2021 సెప్టెంబర్ 3న ఆసిఫాబాద్ మండలం కౌటాల పరి«దిలోని ముత్తంపేటలో పున్నయ్య (52), పద్మ (40), శ్వేత పత్తి చేనులో పనులు ముగించుకుని ఎడ్లబండిపై ఇంటిబాట పట్టారు. ఇంతలో ఉరు ములు, మెరుపులతో వర్షం మొదలైంది. అకస్మాత్తుగా ఓ పిడుగు నిప్పులు కురి పించింది. అంతే బండెద్దులతో పాటు పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడి కక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రకృతి పగబట్టిన ఈ ఘటనలో విపత్తు సాయం నయా పైసా కూడా బాధిత కుటుంబాలకు అందలేదు. సాంకేతికత వినియోగంలో విఫలం.. ♦ పిడుగుపాటు మరణాలు భారీగా పెరుగుతున్నా జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలు కనీస చొరవ తీసుకోవటం లేదని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి పిడుగులు పడే సమాచారాన్ని ముందే పసిగట్టే సాంకేతికతను (లైటనింగ్ డిటెక్షన్ నెట్వర్క్) ఐఐటీ మహారాష్ట్ర ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీంతో 20 నుంచి 40 కి.మీ. పరిధిలో పిడుగుపడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయొచ్చు. ఒడిశా, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలు అందివచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ వివిధ మాధ్యమాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో గతంలో కంటే మరణాల సంఖ్య తగ్గినట్లు లైటనింగ్ రెసిలెంట్ ఇండియా సంస్థ పేర్కొంది. పిడుగుల వాన..పిల్లల చదువుకు బ్రేక్ మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ పరిధిలోని పెద్దవార్వాల్‌కు చెందిన కటిక బాలరాజ్(52) ఈ ఏడాది జూన్ 11న రోజు మాదిరిగానే భార్య జమునతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన పిడుగుల వర్షంతో 30 మేకలు సహా బాలరాజ్ అక్కడికక్కడే చనిపోగా, జమున తీవ్ర అస్వస్థతకు గురైంది. తండ్రి మరణంతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కూతుళ్లు గౌరేశ్వరి (డిగ్రీ), చందన (ఇంటర్) చదువులు ఆకస్మికంగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. 14వ స్థానంలో తెలంగాణ మేఘం నుంచి భూమిపై (క్లౌడ్ టూ గ్రౌండ్) పడే పిడుగుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. 2022–23లో అత్యధి కంగా మధ్యప్రదేశ్ 9,41,663 పిడుగు లతో దేశంలో మొదటి స్థానంలోలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (6,85,893), ఛత్తీస్‌గఢ్ (5,16,504) ఉన్నాయి. తెలంగాణ (2,19,477) ఈ జాబితాలో 14వ స్థానంలో ఉంది. జాతీయ విపత్తులుగా పరిగణించాలి.. పిడుగుపాటుతో అత్యధికంగా మరణిస్తున్నది రైతు కూలీ లే. దేశంలో పిడుగుపాటు మరణాలు పెరిగిపో తున్న తీరు ఆందోళనకరంగా మారింది. పిడుగుపాట్లను జాతీయ విప త్తులుగా పరిగణించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. పిడుగులు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించేందుకు, ఆపై ప్రచారం చేసేందుకు కావాల్సిన సాంకేతికత ఇప్పుడు ఆందుబాటులో ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఏటా వందల మరణాలు చోటుచేసుకుంటుండటం దురదృష్టకరం. – కల్నల్ సంజయ్ శ్రీవాత్సవ, లైటనింగ్ రెసిలియెంట్ ఇండియా, న్యూఢిల్లీ త్వరలో కార్యాచరణ మొదలుపెడతాం తెలంగాణలోనూ పిడుగుపాటు మరణా లు సంభవిస్తున్నాయి. దీనిపై త్వరలో కా ర్యాచరణ మొదలుపెడతాం. సాంకేతికత ను ఎలా ఉపయోగించుకోవాలి, యంత్రాంగాన్ని ఏ మేరకు సిద్ధం చేయాలన్న అంశంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పిడుగు పాటు మరణాలు, నష్టాలను కూడా జాతీయ విపత్తు జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరతాం. – బి.వినోద్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు -
Prime Volleyball League 2023: కోల్‌కతా శుభారంభం
బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 15–11, 15–11, 15–14, 10–15, 14–15తో బెంగళూరు టోర్సెడోస్ జట్టును ఓడించింది. కోల్‌కతా వరుసగా మూడు సెట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ లీగ్ నిబంధనల ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా రెండు జట్లు నిర్ణీత ఐదు సెట్లు ఆడాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో కోల్‌కతా ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. నేడు జరిగే మ్యాచ్‌లో కాలికట్ హీరోస్తో ముంబై మిటియోస్ తలపడతాయి. -
కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది. -
అక్కడ పిడుగులుపడే అవకాశాలు అధికం!
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం ఏజెన్సీలో భారీ వర్షం సోమవారం భారీ వర్షం కురిసింది. అదేక్రమంలో జియమ్మవలస మండలం మరువాడలో పిడుగుపడి రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. పొలం పనులకు వెళ్లిన వారిపై పడిన పిడుడుపడటంతో ముగ్గురు మృతి చెందారు. మరువాడకు చెందిన అన్నదమ్ములు పారయ్య, పండయ్య .. ఉపాధ్యాయుడు చీమల భూషణరావు మృతి చెందారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు,గొర్రెల కాపరులకు హెచ్చరికలు జారీచేశారు. నెల్లూరు జిల్లా.. వరికుంటపాడు, చంద్రశేఖరపాలెం. గుంటూరు జిల్లా అమరావతి, పెదకురుపాడు, తాడికొండ, అచంపేట్, క్రోసూరు, చందర్లపాడు. ప్రకాశం జిల్లా.. హనుమంతునిపాడు, తర్లుపాడు. కడప జిల్లా పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, కలసపాడు, వేంపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందాలని అధికారులు చెప్పారు. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో మెలియపుట్టి, పాతపట్నం టెక్కలి, నందిగం, పలాస, సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం.. విశాఖ జిల్లాలో అనంతగిరి, అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ.. గుంటూరు జిల్లాలో బొల్లపల్లి, వెల్దుర్తి, దుర్గి.. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లె, ఓర్వకల్, హాలహర్వి, చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. -
నెల్లూరు జిల్లాలో విషాదం
-
బడుగుల నెత్తిన పిడుగు
చీమకుర్తి: రెక్కాడితేగాని డొక్కడని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం వ్యవసాయ పనులకు వెళ్లిన విగతజీవులుగా మారారు. జిల్లాలో సోమవారం మధ్యాహ్నం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో పిడుగుపాటుకు ఓ రైతుతో పాటు మరో ముగ్గురు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. మరి కొందరు ఆధాటికి స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన 11 మంది మహిళా కూలీలు సోమవారం ఉదయం పొరుగూరు మంగమూరులోని పొలాల్లో మిరప నాట్లు కోసం వెళ్లారు. అప్పటి దాకా నాట్లు వేసిన వారంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజనం చేసేందుకు పొలంలోనున్న జమ్మిచెట్టు కిందకు చేరారు. అందరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. అప్పటికే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులుతో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా వర్షం వంగకపోవడంతో మళ్లీ నాట్లకు ఉపక్రమించే చెట్టు కింద నుంచి అందరు చేలోకి బయలుదేరారు. అంతలోనే జమ్మి చెట్టు మొదలును చీల్చుకుంటూ పెద్ద శబ్దంతో పిడుగు పడింది. చెట్టు మొదలుకు దగ్గరగా ఉన్న తొండపురెడ్డి కోటేశ్వరమ్మ(33), ఆమెకు పక్కనే ఉన్న మారెళ్ళ శేషమ్మ(65) కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మిగిలిన 9 మంది పిడుగు శబ్దానికి స్ప్రహతప్పి పడిపోయారు. వారు తేరుకొని లేచి చూసేసరికి కోటేశ్వరమ్మ, శేషమ్మ విగత జీవులుగా పడి ఉన్నారు. చెట్టు కింద నుంచి ఒక్క క్షణం ముందు బయటకు వచ్చి ఉంటే వారిద్దరూ కూడా ప్రాణాలతో ఇంటికి వచ్చేవారని తోటి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పేర్నమిట్టలో విషాదం.. పిడుగు పాటుకు మృతి చెందిన కోటేశ్వరమ్మ, శేష మ్మ ఇద్దరివీ పేద కుటుం బాలకు చెందిన వారే. భర్తలతో కలిసి కూలి పనులు చేసుకుంటేనే వారికి జీవనం గడిచేది. కోటేశ్వరమ్మకు భర్త రవిరెడ్డి, 15 ఏళ్ల కుమారుడు సాయిప్రతాప్‌రెడ్డి, 12 ఏళ్ల కుమార్తె శ్రీజ ఉన్నారు. శేషమ్మకు భర్త నారయ్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతిచెందిన ఇద్దరుతో పాటు మిగిలిన 9 మంది కూడా పేర్నమిట్ట గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదాఛాయలు అలముకున్నాయి. పిడుగు పడిన ప్రాంతాన్ని ఒంగోలు తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై భవానీ, తహసీల్దార్ ఎం.రాజ్‌కుమార్, ఎంపీడీఓ వై.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పరిశీలించారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి మృతదేహాలను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఆదుకుంటుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు హామీ ఇచ్చారు. అరక దున్నుతూ.. ఇంకొల్లు : కారంచేడు మండలం దగ్గుబాడుకు చెందిన రావి మనోహర్ (55) కొంత కాలంగా ఇంకొల్లులో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం అరక తోలేందుకు సమీపంలలోని హనుమోజిపాలెం వెళ్లాడు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడటంతో పొలంలోనే మనోహర్ ప్రాణాలు విడిచాడు. పిడుగు ధాటికి ఎడ్లు బెదిరిపారిపోయాయి. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృత దేహాన్ని స్వగ్రామం దగ్గుబాడుకు తరలించారు. గేదెలను మేపుకునేందుకు పొలానికి వెళ్లిన హనుమోజిపాలెం గ్రామానికి చెందిన బండారు కోటేశ్వరమ్మ అదే సమయంలో పిడుగుపాటుకు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె మేపుతున్న ఓ పాడి గేదె మృతి చెందింది. గమనించిన స్థానికులు కోటేశ్వరమ్మను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హనుమోజిపాలెంలో అరక తోలుతూ పిడుగుపాటుకు మృతి చెందిన రైతు మనోహర్ పాపిరెడ్డిపల్లిలో మరో మహిళ.. వెలిగండ్ల: వెలిగండ్ల మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పిడుగుపడి ఒక మహిళ మృతి చెందింది. ఆ గ్రామానికి చెందిన కొందరు మహిళా కూలీలు సజ్జ కోసేందుకు గ్రామం సమీపంలోని పొలానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘావృతం అయింది. ఆ సమయంలో ఒక్కసారిగా పిడుగుపడి పడింది. పొలంలో గడ్డికోస్తున్న సోము రమణమ్మ(50) పిడుగుపాటుకు కుప్ప కూలిపోయింది. పక్కనే ఉన్న ఇద్దరు మహిళలు మేడం పద్మ, డేగా వరమ్మలు అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు వారిద్దరినీ చికిత్స కోసం కనిగిరికి తరలించారు. -
మూడు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని ఏపీ రాష్ట్ర్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి, సోంపేట, మందస, పలాస..కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు..అనంతపురం జిల్లా ఓబుళదేవర చెరువు, నల్లచెరువు, తలుపుల, కదిరి, గాండ్లపెంట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్లు కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. -
జిల్లాలో మృత్యు పిడుగులు
సాక్షి, సిర్పూర్: జిల్లాలో వర్షం కురిసిన ప్రతిసారి ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు భయపెడుతున్నాయి. భారీ శబ్ధాలతో కూడిన ఉరుములు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. రెట్టించిన శబ్ధంతో పడుతున్న పిడుగులు మరింత భయపెడుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలో విపరీతమైన గాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇంట్లో తప్ప.. మరెక్కడా రక్షణలేని పరిస్థితి నెలకొంటోంది. వర్షాకాల సీజన్లో కాకుండా ఇతర సీజన్లలో పిడుగులు పడుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ప్రాణాలు తీస్తున్నాయి ఏటా పిడుగుపాటుకు గురై పలువురు మత్యువాత పడుతున్నారు. ఇంటి వద్ద ప్రమాదాలు తక్కువగా కనిపిస్తున్నా.. ఊరి బయట, అడవిలోనే పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారు. ఎందుకంటే అడవిలో, పొలంలో, మనుషులు చెట్ల కింద ఉంటే గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో అక్కడే పిడుగులు పడుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పిడుగుల వల్ల ఏటా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. బర్రెలు, గొర్రెలు, ఇతర జంతువులు కూడా పిడుగు పాటుకు బలైపోతున్నాయి. పిడుగు పడి చనిపోతున్న వారు కొందరైతే, ఉరుముల శబ్ధానికి భయపడి గుండె ఆగి మరణిస్తున్న వారూ ఉన్నారు. పిడుగుపాటుకు గత నెల ఒకరి మృతి గత నెలలో బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామానికి చెందిన 9 వ తరగతి విద్యార్థి గొర్రెపల్లి రాజేశ్వర్(16) పిడుగుపాటుతో మృతి చెందాడు. కౌటాల మండల కేంద్రానికి చెందిన ఆవుల గంగయ్యకు చెందిన ఆవు పిడుగు పాటుకు గురై మృత్యువాత పడింది. మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నాయిని వెంకటేశ్, కుమ్మరి రమేష్, మేకల భీంరావు, చిన్నయ్య కనికి శివారులోని పత్తి పంటకు పిచికారీ చేయడానికి వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వారంతా సమీపంలోని చెట్టుకిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే భారీ శబ్ధంతో పిడుగు పడడంతో అందరూ స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో వెంకటేశ్ కంటి చూపు మందగించింది. కుమ్మరి రమేష్, భీంరావు, చిన్నయ్యలకు గాయాలయ్యాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఉరుములు, మెరుపుల సమయంలో కిటికీలు, తలుపులు మూసివేయాలి. బహిరంగ ప్రదేశాలలో ఉన్నట్లయితే సత్వరమే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, మోటారు సైకిళ్లు తదితర వాటికి దూరంగా ఉండాలి. వాహనాన్ని నడుపుతున్న సమయంలో మంచి రహదారి కోసం ప్రయత్నించడం, చెట్లులేని, వరదలు రాని ప్రాంతాలకు వెళ్లాలి. వదులుగా, వేలాడుతున్న విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి. చేయకూడని పనులు.. ఎలక్ట్రిక్ అనుసంధానం ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించరాదు. సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి చెట్ల కింద, చెట్ల సమీపంలో ఉండరాదు బహిరంగ ప్రదేశాలలో విడిగా ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల వద్ద ఉండరాదు. జాగ్రత్తలు పాటించాలి ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడే సమయంలో ప్రజలు బయట తిరగకూడదు. చెట్ల కింద ఉండకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పిడుగుల ప్రభావంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ఎం.కవిత, భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు, కౌటాల -
పిడుగుల వర్షం.. గాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్/విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, భూమధ్య రేఖపై హిందూ మహా సముద్రానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో మరో ద్రోణి.. అలాగే కర్ణాటక పరిసరాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. మరికొన్ని చోట్ల పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. అనేకచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగులకు ఐదుగురు మృతిచెందారు. అనేకచోట్ల పశువులూ బలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, చెట్టు కూలి మరొకరు ప్రాణం విడిచారు. వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గుమ్మా చిర్రయ్య (45) గేదల మేత కోసం పొలానికి వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నూజెండ్ల మండలం ముతరాశుపాలెం గ్రామానికి చెందిన చిక్కుడు వెంకటకోటయ్య (30) గేదెలు తోలుకుని పొలం వెళ్లి వస్తుండగా, ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన సంకటి వెంకటేశ్వరరెడ్డి (70) పొలం పనుల కోసం వెళ్లగా పిడుగుపాటుతో మృతిచెందారు. అలాగే, మండల కేంద్రమైన కారంపూడికి చెందిన వ్యవసాయ కూలి షేక్ మస్తాన్‌బీ (45) పొలంలో మిరపకాయలు కోస్తుండగా పిడుగుపడి మృతిచెందింది. నూజెండ్ల మండలం పమిడిపాడు బ్రాంచ్ కెనాల్‌పై లస్కరు కర్రల శ్యాంసన్ (57) పమిడిపాడు బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేసేందుకు సిబ్బందితో ప్రకాశం జిల్లా బయ్యారం హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లగా పెనుగాలులకు చెట్టుకొమ్మ విరిగిపడటంతో శ్యాంసన్ అక్కడిక్కడే మృతిచెందాడు. నూజెండ్ల మండలం పమిడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఒక పాడి గేదె, సింగరుట్ల తండాలో మరో గేదె పిడుగులు పడి మృత్యువాత పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఐనవోలు వద్ద వినుకొండ కురిచేడు ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి సుమారు 100 ఎకరాల్లో వరిపంట నీటమునగగా మిర్చి, బొప్పాయి పంటలు నేలవాలాయి. ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లెలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు ఐదు గొర్రెలు, మూడు మేకలు మృత్యువాతపడ్డాయి. బద్వేలులో బలమైన ఈదురుగాలులు వీచాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ నిలిచిపోయింది. ఓ చోట ఇంటి గోడ కూలడంతో ఒక మహిళ గాయపడింది. ప్రకాశం జిల్లాలోనూ పలుచోట్ల శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దర్శి మండలం ఎర్రఓబయనపల్లిలో ఏడెకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అలాగే, కొనకమిట్ల మండలం పెదారికట్లలో వడగండ్ల వాన పడింది. పొదిలి మండలం మల్లవరం గ్రామంలో పిడుగుపాటుకు కోతి మృతిచెందింది. కనిగిరి, పామూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. రెండుచోట్ల చెట్లు దగ్ధమయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో తన పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడడంతో సత్యాల చిన్నయ్య (46) అనే వ్యక్తి షాక్‌కు గురై మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ముమ్మిడివరం, ప్రత్తిపాడు, తొండంగి మండలాలతోపాటు ఏజెన్సీలోని రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరం చల్లని గాలులతో సేదతీరింది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ.. ఉక్కబోతతో జనం అల్లాడిపోయారు. అంతలోనే దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. భారీగా గాలులు వీచాయి. పెద్దపెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి. చిరు జల్లులు కూడా పడడంతో జనం పులకించిపోయారు. పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో పిడుగుపాటుకు ఈశ్వరరావు (35) అనే కలాసీ మరణించాడు. విజయనగరం జిల్లాలో.. ఇక్కడ కూడా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వేసవితో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఊరట లభించగా.. వర్షానికి వడగండ్లు తోడవడంతో పలుచోట్ల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో అరటి చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా బొబ్బిలి, రామభద్రపురం, శృంగవరపుకోట, లక్కవరపుకోట, సీతానగరం, బలిజిపేట మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొబ్బిలి పట్టణంలో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. దత్తిరాజేరు మండలం టి.బూర్జవలస గ్రామంలో ఈదురుగాలుల తాకిడికి చంద్రమ్మ (53) అనే వృద్ధురాలు అదుపుతప్పి రోడ్డుపై పడి మరణించింది. ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండండి ఆది, సోమవారాల్లో కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆదివారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు.. రాయలసీమలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాపాయం ఏర్పడకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడచిన 24 గంటల్లో మెంటాడలో నాలుగు సెంటీమీటర్లు, శృంగవరపుకోట, తిరుమల, చిలమత్తూరు, వెంకటగిరికోటల్లో 2, లేపాక్షి, పార్వతీపురం, అర్థవీడు, బాలిజనపేట, ఎర్రగొండపాలెంలలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షం కురిసింది. -
పిడుగుల పగ
చోడవరం/కశింకోట/తుమ్మపాల: విశాఖ జిల్లాపై పిడుగులు పగబట్టాయి. తరచూ ఎక్కడో చోట పిడుగులు పడుతూ జనాన్ని పొట్టనబెట్టుకుంటున్నాయి. గడచిన కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో పిడుగుపాట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సోమవారం అనకాపల్లి, చోడవరం మండలాల్లో పిడుగులు పడి ఒక చిన్నారి, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి మండలం టి.వెంకుపాలెంలో ఇంటర్మీడియట్ చదువుతున్న పోలిన హేమంత్‌కుమార్ (19), నిడిశెట్టి పవన్‌కుమార్ (18)లు క్రికెట్ ఆడుకుంటూ వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లి తలదాచుకున్నారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. చోడవరం మండలం గోవాడలో సుంకర శ్రీను (19) అనే మరో యువకుడు పిడుగుపడి మరణించాడు. ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తున్న శ్రీనుకు సోమవారం వారాంతపు సెలవు కావడంతో పొలంలో పశువులు మేపడానికి వెళ్లాడు. అక్కడ వర్షం కురుస్తుందని చెట్టు కింద నిలబడగా పిడుగుపడి చనిపోయాడు. విస్సన్నపేటలో విషాదఛాయలు పిడుగు ఇద్దరు విద్యార్థులను బలిగొంది. దీంతో మండలంలోని విసన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన వీరు ఒకేసారి అనంతలోకాల్లో కలిసిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. విసన్నపేటకు చెందిన నడిశెట్టి పవన్‌కుమార్ (18), పోలిన హేమంత్ (16)లతోపాటు పక్కనున్న రామాపురం, జంగాలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు సోమవారం సాయంత్రం క్రికెట్ ఆడటానికి తమ్మయ్యపేట గ్రామ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొందరు యువకులు ఆట ఆడుతుండగా వర్షం పడుతుండటంతో చెట్టు కింద నీడ కోసం పవన్‌కుమార్, హేమంత్ నిలుచున్నారు. ఇదే సమయంలో ఉరుములతో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో వారు దాని దాటికి అక్కడే కుప్ప కూలిపోయి మృత్యువాత పడ్డారు. దీంతో సహాచర యువకులు చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు. వీరిలో పవన్‌కుమార్ తండ్రి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. తల్లి కోటి లక్ష్మి. వీరికి ఇద్దరు మగ సంతానం. పవన్‌కుమార్ వారికి రెండో కుమారుడు. అనకాపల్లిలోని కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. క్రికెట్ అంటే అభిమానం. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఖాళీ సమయంలో ఆటలాడుతుంటాడు. ఎప్పటిలాగు మిత్రులతోపాటు ఆటకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. అంది వచ్చిన కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. హేమంత్ ఒకడే కుమారుడు... పోలిన జగ్గారావు, పద్మ దంపతులకు హేమంత్ ఒక్కడే మగ సంతానం. అనకాపల్లిలోని కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.తన కుటుంబాన్ని ఆదుకోవలసిన ఒక్కగానొక్క కుమారుడు క్రికెట్ ఆడటానికి వెళ్లి పిడుగుపాటుకు మృతి చెందడం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇక తమకు దిక్కు ఎవరంటూ జగ్గారావు దంపతులు రోధిస్తున్నారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. పొలంలో పశువులు కాస్తుండగా.. చోడవరం: పిడుగు రూపంలో మృత్యువు ఓ యువకుడ్ని బలి తీసుకుంది. దీనితో ఒక్కసారిగా గోవాడలో తీవ్ర విషాదం అలముకుంది. ఒక పక్క ఎండ మండిపోతుండగా అంతలోనే ఆకాశం కారుమబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో జనాన్ని బెంబేలెత్తించింది. క్షణాల్లోనే వర్షం కురవడంతో పొలం పనుల్లో ఉన్న వారంతా సమీపంలో పాకలు వద్దకు పరుగులు తీశారు. ఇదే సమయంలో తమ పొలం పక్కనే ఉన్న కొండ సమీపంలో పశువులను మేపుతున్న సుంకర శ్రీను (19) సమీపంలో ఉన్న చెట్టు వద్దకు పరుగు తీశాడు. ఆ చెట్టు తనను తడవకుండా నీడనిస్తుందనుకుంటే అదే మృత్యువుగా మారి ప్రాణం తీసింది. ఉరుము మెరుపులతో ఒక్కసారిగా శ్రీను నిలుచున్న తాడిచెట్టుపై పిడుగు పడింది. ఆ పిడుగు షాక్‌కి తాడిచెట్టుతోపాటు దిగువ చెట్లు కూడా కాలిపోయాయి. దీనితో ఆ చెట్టుకిందే ఉన్న శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీనుది సొంత ఊరు బుచ్చెయ్యపేట కాగా చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో గోవాడలో ఉంటున్న తన పెద్దమ్మ నక్కా కన్నమ్మ దగ్గరే ఉంటున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న శ్రీను ఇటీవల ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. సెలవు రోజుల్లో పొలంలో పశువులను మేపుతూ పొలం పనులు చూసుకుంటున్నాడు. రోజూలాగే సోమవారం కూడా పశువులను పొలంలో మేపుతుండగా ఆకస్మికంగా పిడుగు పడి మృతి చెందాడు. తన చెల్లెలు కొడుకైనా కన్నకొడుకు కంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచీ పెచ్చుకొచ్చిన పెద్దమ్మ నక్కా కన్నమ్మ గుండెలవెసేలా రోదించింది. పరుగుపరుగున ప్రమాద స్థలానికి చేరింది. అప్పటికే కాలిన గాయాలతో విగత జీవిగా పడిఉన్న కొడుకుని చూసి ఆ పెద్ద తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది. -
తూర్పు, పశ్చిమ జిల్లాలకు పిడుగు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కడియం, రాజానగరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు, నిడదవోలు, పెరవలి, ఆచంట, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచనలు చేసింది. ఇక రాజమండ్రిలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. పిడుగుపాటుకు పలువురు మృత్యువాత కూడా పడ్డారు. -
పిడుగులు పడితే.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
సాక్షి, అమరావతి: కళ్లు బైర్లుకమ్మేంతగా మెరుపులు.. ఆ వెంటనే చెవులకు చిల్లులు పడేలా.. గుండెలు గుభేల్మనేలా.. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఫెళఫెళమంటూ ఉరుములు.. పిడుగులు.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఆ ఒక్క రోజే 41,025 పిడుగులు పడి 14 మంది మృత్యువాతపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఏడాది పిడుగు పోట్లు అధికమయ్యాయి. వేసవి సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ రోజూ ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి మే ఒకటి వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏకంగా 1,40,982 పిడుగులు పడ్డాయి. అధికారిక సమాచారం ప్రకారం వీటి కారణంగా 39 మంది మృత్యువాత పడ్డారు. అధికారుల దృష్టికి రాని మరణాలు దాదాపు ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ గణాంకాల ప్రకారం 2017 మే నుంచి అక్టోబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 2,62,940 పిడుగులు పడగా.. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారుల దృష్టికి రాని మరణాలు ఇంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. వేసవిలోనే అధికం ఉరుములు, మెరుపులు, పిడుగుల ప్రభావం వేసవి కాలంలోనే అధికంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి.. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 48 డిగ్రీల వరకూ నమోదవుతుంటాయి. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. ఈ సమయంలో సముద్రం నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశంలో నల్లని దట్టమైన క్యూములో నింబస్ మేఘాలు అలుముకుంటాయి. ఈ సందర్భంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. వీటిని ఇంగ్లిష్‌లో థండర్ స్ట్రోమ్స్ అని అంటారు. భూతాపం పెరగడమే కారణం మండు వేసవిలో భూతాపం, వడగాడ్పుల నుంచి ఈ థండర్ స్ట్రోమ్స్ ఉపశమనం కలిగిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్ చెప్పారు. ‘వేసవి కాలంలో మధ్యాహ్నం వరకూ తీవ్రమైన వేడి ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత క్యూములో నింబస్ మేఘాలు అలుముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, వడగండ్లు పడుతుంటాయి. వీటినే థండర్ స్ట్రోమ్స్‌అంటారు. వేసవిలో సంభవించే వీటిని భూతాపం తగ్గించేందుకు ప్రకృతి ప్రసాదించిన వరాలుగా చెప్పొచ్చు. మెరుపులన్నింటినీ పిడుగులుగా చాలామంది భ్రమపడుతుంటారు. వాస్తవంగా మెరుపులు రెండు రకాలు.. ఆకాశంలో ఒక మేఘం మరో మేఘాన్ని ఢీకొనడం వల్ల విద్యుదాఘాతం ఏర్పడుతుంది. దీనిని మెరుపు అంటారు. మేఘంలోని అణువులు ఢీకొట్టుకోవడం వల్ల ఆకాశం నుంచి భూమికి చేరే విద్యుదాఘాతాన్ని పిడుగు అంటారు. ఆకాశం నుంచి భూమికి పిడుగు పడుతున్నప్పుడు స్పష్టంగా పైనుంచి కిందకు మెరుపు తీగ కనిపిస్తుంది. గతం కంటే ఇప్పుడు మెరుపులు, పిడుగులు పెరిగాయి. ఇందుకు భూతాపం అధికం కావడమే కారణం’ అని డాక్టర్ కేజీ రమేష్ వివరించారు. గతంలో పిడుగుపాట్లకు సంబంధించిన ముందస్తు సమాచారం కనుక్కునే పరిజ్ఞానం లేదు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందనే విషయాన్ని అరగంట ముందే కనుగొనగల పరిజ్ఞానం అందుబాటులోకొచ్చింది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పిడుగుపాట్ల వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోతున్నాయి. చెట్లు, భవనాలు కూలిపోయిన ఘటనలూ ఉన్నాయి. మే ఆరంభమైనందున ఎండ తీవ్రత పెరగనుంది. వేడి తీవ్రత పెరిగే కొద్దీ ఉరుములతో పాటు పిడుగులు పడే ప్రభావం కూడా అధికమవుతుంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుడు నరసింహారావు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. – మబ్బులు కమ్ముకుని చినుకులు పడే సూచనలు కనిపించినా.. గాలులు వీస్తున్నా.. ఉరుములు ఉరిమినా పిడుగులు పడే ప్రమాదం ఉందని గుర్తించాలి. దగ్గర్లోని పెద్ద భవనాల్లోకి వెళ్లడం ఉత్తమం. – ఉరుములు, మెరుపులు, గాలీవాన సమయంలో బైక్‌లు నడపరాదు. – బహిరంగ ప్రదేశాల్లో సెల్ ఫోన్లు వాడరాదు. – ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండకూడదు. – ఉరుముల సమయంలో ఇళ్లలో ఉన్న వారు తలుపులు, కిటికీలు మూసివేయాలి. -
తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితులు
-
ఉత్తరాంధ్ర తీరంలో అలజడి.. సునామీ హెచ్చరికలు!
సాక్షి, కాకినాడ, విశాఖపట్నం: భారత తూర్పు తీరప్రాంతంలో అల్లకల్లోల పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఉత్తరాంధ్ర తీరంలో తీవ్ర అలజడి నెలకొంది. ఈ నెల 25 నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయని, ఒకటిన్నర మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్కాయిస్) తెలిపింది. ఇన్కాయిస్ జారీచేసిన సునామీ హెచ్చరికలు తూర్పు గోదావరి జిల్లా కేంద్రానికి చేరడంతో సిబ్బంది అప్రమత్తమైంది. సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరిలోని రాజమండ్రిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కుర్తుస్తోంది. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లాకు పిడుగు హెచ్చరిక జిల్లాలో శంఖవరం, ప్రత్తిపాడు, మారేడుమిల్లి, రౌతులపడి, వరరామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని సూచనలు చేసింది. తుఫానుల హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన విశాఖ: తూర్పు గోదావరి జిల్లాకు సునామీ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం స్పందించింది. సముద్రంలో భూకంపాలు వచ్చినప్పుడు మాత్రమే సునామీ హెచ్చరికలు జారీచేస్తారని, ప్రస్తుతం సముద్రంలో భూకంపాలు రాలేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్రంలో గాలుల తీవ్రత వల్లే కెరటాల ఉధృతి 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు మరో 24 గంటలపాటు ఎగిసిపడే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉత్తర కోస్తాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. -
కృష్ణాజిల్లాలో భారీ వర్షం : ముగ్గురు మృతి
విజయవాడ : కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30గంటల వరకు పిడుగులతో కూడిన వర్షం పడింది. దివిసీమలో కురిసిన వర్షానికి అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి రాలిపోయింది. కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపోవడంతో సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 216 నంబరు జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. చెట్లు విరిగిపోవటంతో హనుమాన్ జంక్షన్లో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కలిదిండి మండలంలో పడిన పిడుగుల ధాటికి విద్యుత్ మీటర్లు, పలు పరికరాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 25.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా పిడుగుపాటుకు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం మండలం గుండుపాలెం అడ్డరోడ్డు వద్ద పిడుగుపడి గొరిపర్తి రవితేజ (17) అనే యువకుడు మరణించాడు. తిరువూరు మండలం చిక్కుళ్లగూడెంలో మామిడి తోటల్లో కాయలు కోయటానికి వెళ్ళిన ముచ్చింతాల రాజశేఖర్(22), అతని మేనల్లుడు గిరిశెట్టి గోపీచంద్ (13) పిడుగుపడడంతో షాక్‌కు గురై మరణించారు.