
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం ఏజెన్సీలో భారీ వర్షం సోమవారం భారీ వర్షం కురిసింది. అదేక్రమంలో జియమ్మవలస మండలం మరువాడలో పిడుగుపడి రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. పొలం పనులకు వెళ్లిన వారిపై పడిన పిడుడుపడటంతో ముగ్గురు మృతి చెందారు. మరువాడకు చెందిన అన్నదమ్ములు పారయ్య, పండయ్య .. ఉపాధ్యాయుడు చీమల భూషణరావు మృతి చెందారు.
విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక
నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు,గొర్రెల కాపరులకు హెచ్చరికలు జారీచేశారు. నెల్లూరు జిల్లా.. వరికుంటపాడు, చంద్రశేఖరపాలెం. గుంటూరు జిల్లా అమరావతి, పెదకురుపాడు, తాడికొండ, అచంపేట్, క్రోసూరు, చందర్లపాడు. ప్రకాశం జిల్లా.. హనుమంతునిపాడు, తర్లుపాడు. కడప జిల్లా పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, కలసపాడు, వేంపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందాలని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment