Disaster Management Department
-
గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు
సాక్షి, అమరావతి: తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అంతా సిద్ధం తాడేపల్లి: గోదావరి వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్ధ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ‘‘ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 13.63 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. గోదావరి వరద ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎఎస్ఆర్ , కోనసీమ, ఏలూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది. అల్లూరి జిల్లాలో ఐదు మండలాలలో 155 గ్రామాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలలో 49 గ్రామాలు, కోనసీమలో 20 మండలాలలో 141 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలలో 47 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, 17 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం ఉంది. వరద ప్రభావిత సహాయ చర్యలకోసం సీఎం జగన్ రూ. 12 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరద ప్రభావిత మండలాలలో, జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలంలో గోదావర వరద పెరిగే అవకాశాలున్నాయి. ఈనెల 30 నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాం. వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద సహాయక చర్యల కోసం మూడు NDRF, నాలుగు SDRF బృందాలు పనిచేస్తున్నాయి అని వెల్లడించారాయన. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 48 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురువారం ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని 14 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 7, కాకినాడ జిల్లాలో 7, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 4, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్క మండలం చొప్పున తీవ్ర వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు. గురువారం అనకాపల్లి జిల్లాలో 8, విజయనగరంలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 51 మండలాల్లో వడగాడ్పులు నమోదైనట్లు చెప్పారు. గురువారం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో 44.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం 44.6, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 44.5, చిత్తూరు జిల్లాలోని నింద్రలో 44.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేపినాపి, అక్కమాంబపురంలలో 44.3 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
ఏపీ వాసులకు అలర్ట్: ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 29 మండలాల్లో మంగళవారం తీవ్రమైన వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 17 మండలాల్లో వడగాడ్పులు వీచాయని చెప్పారు. కాకినాడ జిల్లాలో 2, కృష్ణా 1, నంద్యాల 2, విశాఖ 2, విజయనగరం 2, వైఎస్సార్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచినట్లు పేర్కొన్నారు. మరో 110 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలో 44.7, నంద్యాల జిల్లా ఆత్మకూరు, గోస్పాడులో 44.5, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం, కర్నూలు జిల్లా మంత్రాలయం, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అంబేద్కర్ తెలిపారు. చదవండి: ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ.. గౌరవ వేతనం ఎంతంటే? -
AP: విపత్తుల శాఖ వార్నింగ్.. రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ పేర్కొంది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కాగా, రేపు ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు.. ఎల్లుండి 106 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(168).. అల్లూరిసీతారామరాజు జిల్లా- 7, అనకాపల్లి -13, తూర్పుగోదావరి- 14, ఏలూరు- 11, గుంటూరు- 11, కాకినాడ -14, కోనసీమ- 6, కృష్ణా - 11, నంద్యాల -4, ఎన్టీఆర్ -16, పల్నాడు -8, పార్వతీపురంమన్యం -12, శ్రీకాకుళం -13, విశాఖపట్నం -4, విజయనగరం -22, వైఎస్సార్ -2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, గురువారం అనకాపల్లి -8, కాకినాడ -1, నంద్యాల-1, విజయనగరం-1 మండలంలో తీవ్రవడగాల్పులు, 60 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. -
ఏపీలో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రధానంగా 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతోపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతాయని, వడగాలుల ప్రభావం ఉంటుందన్నారు. కాగా, మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, అనకాపల్లి మండల కేంద్రం, కోటవురట్లలో 42.4 డిగ్రీలు, మాకవరపాలెంలో 42.5, కాకినాడ జిల్లా తొండంగిలో 41.8, తునిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
విపత్తుల నుంచి రక్షణకు ఆర్థికసాయం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: విపత్తుల నుంచి రక్షించుకోవడానికి తీరప్రాంత రాష్ట్రాలకు ఆర్థికసాయం చేయాలని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైన అన్ని జిల్లాల్లోనూ మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్) సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఏటా ఒకటి, అంతకన్నా ఎక్కువ విపత్తులు ఎదుర్కొంటోందని చెప్పారు. తమ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడంతో విపత్తు నిర్వహణ శాఖ విపత్తులు ఎదుర్కోవడంలో విజయం సాధిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కరవు లేదని చెప్పారు. ప్రతి సంవత్సరం తీర ప్రాంతాలను తుపానులు అతలాకుతం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2020వ సంవత్సరం నవంబర్ నెలలో నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. తుపానుల ప్రభావం నుంచి కోలుకోవడానికి సహాయం కోరుతున్నట్లు చెప్పారు. ప్రపంచబ్యాంకు నిధులతో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎన్సీఆర్ఎంపీ) సహాయంతో తొమ్మిది తీరప్రాంత జిల్లాల్లో 219 మల్టీ పర్పస్ సైక్లోన్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని జిల్లాల్లో కూడా వాటి ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తానేటి వనిత విజ్ఞప్తి చేశారు. తమ సీఎం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతో విపత్తులు వచ్చినప్పుడు తగిన సేవలు అందిస్తున్నారని తెలిపారు. తీరప్రాంతాల్లో మడ తోటలు, షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్, ఇతర నిర్మాణాత్మక చర్యలు ఎంతో అవసరమన్నారు. ఎన్సీఆర్ఎంపీ మౌలిక సదుపాయాల కింద వంతెనల ఏర్పాటు, తుపాను షెల్టర్లకు అనుసంధానించే రహదారుల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆమె కోరారు. -
పేద బతుకులు.. పిడుగుకు సమిధలు! ప్రమాదకర జోన్లో ఆ 13 జిల్లాలు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలుగు.. చీకటిని చీల్చి బతుకుపై భరోసానిచ్చే ఓ ఊపిరి! కానీ అదే మిరుమిట్లు గొలుపే వెలుగు నిరుపేదల బతుకును చీకటిలోకి నెడుతోంది. తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఆకాశంలో మేఘాల మధ్య జరిగే ఘర్షణ.. పిడుగుల గర్జనగా కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో నిరుపేద రైతుకూలీల ప్రాణాలు తీస్తోంది. ప్రమాదాన్ని నివారించలేని విపత్తు నిర్వహణ సంస్థల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే అరవై రెండు మంది పిడుగుపాటుతో పంట పొల్లాల్లోనే ప్రాణాలు వదలగా.. గత ఆరేళ్లలో ఏకంగా 398 మంది కన్నుమూశారు. తెలంగాణలో ఏటా సగటున లక్షా యాభైవేల నుండి రెండు లక్షల వరకు పిడుగులు పడుతున్నట్టు అంచనా. రైతులు, కూలీలు పంట పొలాల్లో ఎక్కువ సమయం గడిపే అక్టోబర్‌లోనే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి. అందులో 90శాతం గ్రామాల్లోనే పడుతుండగా.. మరణిస్తున్న వారిలో నూటికి 96 మంది రైతులు, కూలీలే ఉంటున్నారు. ఊహించని విపత్తుతో మరణించిన మెజారిటీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కనీస ఆర్థిక సహాయం అందడం లేదు. భూమి ఉన్న రైతులు మరణిస్తే రైతు బీమా వర్తిస్తుండగా.. భూమి లేని నిరుపేదలు ఏళ్ల తరబడి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రమాదకర జోన్లో 13 జిల్లాలు దేశంలో అత్యధికంగా పిడుగులు పడుతున్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. గత ఏడాది అక్కడ 6,55,788 పిడుగులు పడితే.. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 5,76,498, మహారాష్ట్రలో 5,28,591 పిడుగులు పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మన పొరుగున ఉన్న కర్నాటక ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పదకొండో స్థానంలో, తెలంగాణ 1,49,336 పిడుగులతో పద్నాలుగో స్థానంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో చూస్తే.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి, కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట జిల్లాలు అత్యధిక పిడుగు పీడిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. గత ఆరేళ్లలో అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 90 మంది పిడుగుపాటుతో చనిపోయారు. వరంగల్ జిల్లాలో 59, ఆదిలాబాద్‌లో 52, మెదక్‌లో 27 మంది చనిపోయారు. పిడుగులు 96 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే పడుతుండగా.. మృతుల్లో 98శాతం రైతులు, కూలీలే. మొత్తంగా గత ఆరేళ్లలో తెలంగాణలో 398 మంది నిరుపేదలు మరణించగా.. మరో 1,220 మంది గాయాలపాలయ్యారు. (చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ) నివారించే అవకాశమున్నా.. పిడుగుపాటు మరణాలను నివారించే అవకాశమున్నా.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పిడుగుపాటు నష్టాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన అరెస్టర్లు, కండక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. పుణె ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అది 20 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే అప్రమత్తం చేస్తుంది. దీనికితోడు ఎర్త్ నెట్వర్క్ అనే అమెరికా సంస్థ సైతం అధునాతన పరికరాలను మార్కెట్లోకి తెచ్చింది. పలు రాష్ట్రాల్లో గ్రామ, మండల యంత్రాంగాలు వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం భారీ నష్టానికి కారణం అవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మెరుగైన పద్ధతులతో పేదల ప్రాణాలు కాపాడుతున్నారు. కోట్ల వోల్టుల శక్తితో పిడుగులు మేఘాల నుంచి ఒక్కసారిగా విడుదలయ్యే ఎలక్ట్రాన్లు 15–30 కోట్ల వోల్టుల విద్యుత్ ప్రవాహంతో భూమ్మీదకు దూసుకువచ్చే శక్తినే ‘పిడుగు’ అంటారు. ఒక మేఘం నుంచి మరో మేఘానికి ప్రసారమయ్యే పిడుగుల వల్ల ఆకాశంలో ఎగిరే విమానాలకు ముప్పు ఉంటుంది. మేఘం నుంచి భూమిని తాకే (క్లౌడ్ టు గ్రౌండ్) పిడుగులు మనుషులు, ఇతర జీవజాలానికి ముప్పు కలిగిస్తున్నాయి. పూరి గుడిసెలో బంగారమ్మ.. వనపర్తి జిల్లా బాలకిష్టాపూర్‌లో జూన్ 6, 2017న పడిన పిడుగులు ఒకే ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములను పొట్టనపెట్టుకున్నాయి. ముళ్ల పొదలు తొలగించే క్రమంలో ఆకాశమంతా ముప్పై సెకన్లపాటు వెలుగును చిమ్ముతూ పడిన పిడుగుతో తెలుగు లక్ష్మన్న (40), ఈదన్న (52), పరమేశ్ (27) ప్రాణాలు వదిలారు. ఊరంతా కన్నీరు పెట్టింది. ఆదుకుంటామంటూ ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ఆపద్బంధు కింద సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. ఆ ముగ్గురిలో ఈదన్న, లక్ష్మన్న కుటుంబాలకు పాత ఇళ్లయినా ఉండగా.. చివరివాడైన పరమేష్‌కు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన భార్య బంగారమ్మ(24) రోజు కూలీకి వెళ్తూ.. సగం కూలిన గుడిసెలోనే కాలం వెళ్లదీస్తోంది. ఇలాంటి విషాద గాధలు ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్నాయి. (చదవండి: రైలుకు ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కున్న మహిళ.. వీడియో వైరల్) కాలం కాటేసినా.. కదలని యంత్రాంగం అక్టోబర్ 9, 2021లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ పరిధిలోని బుర్కపల్లిలో సోయా చేనులో పనిస్తుండగా పిడుగుపాటుతో గరణ్ సింగ్ (45), ఆయన తమ్ముడి భార్య ఆశాబాయి (30) మరణించారు. విపత్తు పరిహారం కోసం బాధిత కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణ పూర్తయినా ఇంకా పరిహారం అందలేదు. తక్షణ కార్యాచరణ అవసరం జాతీయ స్థాయిలో ప్రధాని చైర్మన్‌గా, నిపుణులు వైస్ చైర్మన్‌గా ఉండే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) తరహాలోనే రాష్ట్రస్థాయిలో సీఎం చైర్మన్‌గా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పనిచేయాలి. మన రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను మర్చిపోయారు. వరద వచ్చాక సహాయక చర్యలు చేస్తున్నారు. అలాంటిది ముందే పిడుగుపాటు నివారణ చర్యలు ఎజెండాలోనే లేకపోవడం దారుణం – మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్ నివారించదగిన ప్రమాదాలు.. పిడుగు అనేది వంద శాతం నివారించదగ్గ విపత్తు. కానీ తెలంగాణలో పిడుగులతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుబాటులోకి వచ్చిన అరెస్టర్లు, కండక్టర్లతో పిడుగుపాటు మరణాలను అరికట్టవచ్చు. పిడుగుపాటు సమయాలను ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ఇలాంటి చర్యల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణలో ఆ ప్రయత్నాలేవీ మొదలుకాలేదు. తగిన సలహాలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. – కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ, క్లైమైట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, న్యూఢిల్లీ -
రెండు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు
సాక్షి, అమరావతి: రానున్న రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న గంటలో విజయవాడ, విశాఖలో భారీవర్షం పడనున్నట్లు తెలిపింది. మూడు గంటలపాటు ఏకధాటిగా వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దసరా రోజున కురిసిన వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒంగోలులో భారీ వర్షాల నేపథ్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఒంగోలు హెల్ప్‌లైన్ నంబర్లు: 9949796033, 8555931920. చదవండి: మాపై బీఆర్ఎస్ ప్రభావం ఏం ఉండదు: బొత్స సత్యనారాయణ -
AP: భారీ వర్షాల ఎఫెక్ట్.. విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ
సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరికి ఉధృతి పెరిగింది కాగా, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరిస్థితిని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద ప్రభావితం చేసే మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల్లో మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. కాగా, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇది కూడా చదవండి: బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు -
‘ఏపీఎస్డీఎం’కి విర్కో గ్రూప్ కంపెనీ భారీ విరాళం
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహా విష్ణు అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే.. -
ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్, క్రిస్మస్ వేడుకలు బ్యాన్
Christmas And New Year Gatherings Banned In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలను నిషేధించింది. అయితే ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర సమావేశాలను నిషేధించింది. ఢిల్లీలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పైగా గత ఆరు నెలల్లో నమోదైన కేసుల కంటే ఇదే అత్యధికం. డీడీఎంఏ సూచించిన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే సమావేశాలు, వివాహాలు, ఎగ్జిబిషన్లు జరుపుకోవాలని ఆదేశించింది. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) డీడీఎంఏ విధించిన నిబంధనలు: డీడీఎంఏ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలు పనిచేసేందకు అనుమతిస్తాం అని ప్రకటించింది. పైగా రెస్టారెంట్లు, బార్లు గరిష్టంగా 50% సీటింగ్ సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మెట్రో 100% సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించింది. పైగాఒక్కో కోచ్‌లో 30 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి. అంత్యక్రియలు, వాటికి సంబంధించిన సమావేశాలు గరిష్టంగా 200 మందికి మాత్రమే అనుమతి. ప్రజలు మాస్క్‌లు ధరించడమే కాకుండా కచ్చితంగా సామాజిక దూరం పాటించేలా అమలు చేసే యంత్రాంగాన్ని కఠినతరం చేయాలని జిల్లా పరిపాలన అధికారుల్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని కోరింది. మాస్కులు లేని వినియోగదారులకు ప్రవేశాన్ని నిరాకరించాలని మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్లను కూడా ఆదేశించింది. రానున్న రెండు వేడుకలకు ముందు కోవిడ్ ఏయే ప్రాంతాల్లో ఎంతగా వ్యాప్తి చెందిందో గుర్తించాలని జిల్లా మేజిస్ట్రేట్లను (డీఎం) ఆదేశించింది. జిల్లా మేజిస్ట్రేట్‌లందరూ తమ పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్నిసర్వే చేసి రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి అప్రమత్తం చేయాలని ఆదేశించింది. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) -
‘నదిలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది. సహాయక చర్యలకు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. -
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ శాఖ
కృష్ణా: కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్నందున.. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 2.57 లక్షలు, ఔట్ ఫ్లో 2.57 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపు(మంగళవారం) సాయంత్రానికి వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇక శ్రీశైలం ఇన్ ఫ్లో 4.35 లక్షలు, ఔట్ ఫ్లో 4.68 లక్షల క్యూసెక్కులు. అలాగే సాగర్ ఇన్ ఫ్లో 3.72 లక్షలు, ఔట్ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులు. కాగా పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
Thunderstorm: పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!
సాక్షి, అమరావతి: వచ్చే వారం రోజులు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పదిరోజులుగా పిడుగుల ప్రభావం చాలాచోట్ల కనిపిస్తోంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. నిట్టనిలువుగా ఉండే ఈ మేఘాల వల్ల పిడుగులు పడుతున్నాయి. ప్రధానంగా విశాఖ మన్యం, నల్లమల అటవీ ప్రాంతాలు, ఈ సమీప గ్రామాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నట్లు గుర్తించారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. సాధారణంగా ఏటా ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఈ వాతావరణం ఉండి ఇలా జరుగుతోంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒకచోట వేడిగాలులు, మరోచోట చల్లటి గాలులు వీచి వర్షాలతో పిడుగులు పడుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఇప్పటివరకు 10 మందికిపైగా పిడుగుపాటుకు గురయ్యారు. చెట్ల కిందకు వెళ్లొద్దు పిడుగుల ప్రభావం 90 శాతం రైతులు, కూలీలు, పశువుల కాపరులపై ఉంటోంది. పొలాలు, ఆరుబయట పచ్చిక బయళ్లలో ఉండే వీళ్లు ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకు వెళుతున్నారు. అలా వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లపై పిడుగులు పడి వాటి కింద ఉన్న వారు మృత్యువాతపడుతున్నారు. మూడురోజుల కిందట శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు చనిపోయిన ముగ్గురు వ్యక్తులు చెట్లకింద ఉన్నవారేనని గుర్తించారు. పిడుగు ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చెట్ల కిందకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది. ఉన్నచోటే కింద కూర్చుని చెవులు మూసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే దగ్గర్లో ఉన్న భవనాలు, రేకుల షెడ్లు వంటి వాటిల్లోకి వెళితే పిడుగుల ప్రభావం ఉండదని చెబుతోంది. విపత్తుల నిర్వహణశాఖ పిడుగుల సమాచారాన్ని నాలుగు నిమిషాల ముందే ఆయా ప్రాంతాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు, తహశీల్దార్లు, వీఆర్వోలకు పంపుతోంది. ఇందుకోసం అమెరికాలోని ఎర్త్‌నెట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అక్కడినుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి పిడుగుల హెచ్చరికలు జారీచేస్తోంది. అయినా దీనిపై రైతులు, కూలీలు, గొర్రెల కాపరులకు అవగాహన లేకపోవడం వల్ల మృత్యువాతపడుతున్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచిస్తోంది. -
నిర్లక్ష్యం నిప్పు.. కలగాలి కనువిప్పు
పంచభూతాల్లో ఒకటి.. మానవ పరిణామ క్రమంలో కీలకపాత్ర పోషించింది.. ప్రపంచ మనుగడకు అవసరమైంది.. అగ్ని. ఇంత కీలకమైన అగ్ని.. మానవ నిర్లక్ష్యం, పొరపాట్ల వల్ల ఒక్కోసారి తీవ్ర నష్టాన్ని, తీరని ఆవేదనను కలిగిస్తుంది. చిన్న నిప్పురవ్వ కూడా పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది. సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: సాధారణంగా వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. రాష్ట్రంలో ఎక్కడ నిప్పు రాజుకున్నా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేస్తారు. నష్టాన్ని చాలావరకు తగ్గిస్తారు. బాధితులకు ఆపన్నహస్తం అందిస్తారు. ఎలాంటి ప్రమాదం జరిగినా 101కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే సిబ్బంది వాహనంతో వచ్చి సేవలు అందిస్తారు. 2014–15 నుంచి 2020–21 ఫిబ్రవరి నెల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 99,522 ప్రమాద ఘటనలు జరగ్గా.. ఇందులో 94,369 అగ్నిప్రమాదాలు. మిగిలిన 5,153 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బావులు, చెరువులు, డ్రైనేజీల్లో జంతువులు, మనుషులు అనుకోకుండా ప్రమాదాలకు గురికావడం, వరదల్లో చిక్కుకుపోవడం వంటివి. అగ్నిమాపకశాఖ అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడమేగాక తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా వివరిస్తూ ఏటా వారోత్సవాలు నిర్వహిస్తుంది. దహిస్తున్న నిర్లక్ష్యం రాష్ట్రంలో అగ్నిప్రమాదాల వెనుక మానవ నిర్లక్ష్యమే ఎక్కువ కనిపిస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అగ్నిప్రమాదాల గణాంకాల్లో ఈ విషయం తెలుస్తోంది. అగ్ని ప్రమాదాల్లో 50 నుంచి 60 శాతం వరకు కేర్లెస్ స్మోకింగ్ (కాల్చి పారేసిన సిగరెట్ పీక) వల్ల జరుగుతున్నాయనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. 25 నుంచి 30 శాతం ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. ఇళ్లల్లో కాలం చెల్లిన వైరింగ్, నాసిరకం వైరింగ్, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ సక్రమంగా లేకవపోవడం వంటి అనేక కారణాలు మన కొంపను కాల్చేస్తున్నాయి. మన నిర్లక్ష్యం వల్ల పంట పొలాలు, గడ్డివాములు, అటవీ ప్రాంతాలు, ఇళ్లు కాలిపోతున్నాయి. రాష్ట్రంలో ఒక్క విశాఖపట్నంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో 118 అగ్ని ప్రమాదాలు జరిగాయి. వీటిలో 67 ప్రమాదాలు కేర్లెస్ స్మోకింగ్ వల్ల, 35 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయంటే ఆందోళన కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 143 అగ్నిప్రమాదాల్లో.. 94 కేర్లెస్ స్మోకింగ్ వల్ల, 25 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగాయి. అప్రమత్తతే మంటలకు మందు అప్రమత్తతే మంటలకు సరైన మందు. చాలా అగ్నిప్రమాదాల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాల్చిన సిగరెట్ పీక అర్పకుండా విసిరేయడం. విద్యుత్ వైరింగ్, ఉపకరణాల నిర్వహణలో అవగాహణ లేకపోవడం, గ్యాస్ ఆఫ్ చేయకుండా వదిలేయండం వంటి చిన్న లోపాలు పెద్ద అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీనివల్ల ఎంతో విలువైన ఆస్తి, ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుకోని విధంగా అగ్నిప్రమాదం జరిగితే డయల్ 101కు సమాచారం ఇవ్వాలి. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలి. –జి.శ్రీనివాసులు, రీజినల్ ఫైర్ ఆఫీసర్, ఈస్ట్రన్ రీజియన్ అందరూ జగ్రత్తగా ఉండాలి వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగితే వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అపార్ట్మెంటు వాసులు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు టియర్ గ్యాస్ సిలిండర్లు ఏమేరకు వినియోగంలో ఉన్నాయో సరిచేసుకోవాలి. – కె.జయరాంనాయక్, డైరెక్టర్, రాష్ట్ర అగ్నిమాపకశాఖ అవగాహన అవసరం ప్రమాదాల నివారణపై కనీస అవగాహన ఉంటే చాలావరకు ఆస్తి, ప్రాణ నష్టాలు నివారించవచ్చు. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రమాదం జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే స్పందిస్తున్నాం. అయినా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. – ఎం.శ్రీనివాసరెడ్డి, అగ్నిమాపక అధికారి, కృష్ణాజిల్లా వారోత్సవాల్లో ఇలా.. రాష్ట్రంలో అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. 1946 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్యార్డులోని ఓడలో అగ్నిప్రమాదం జరిగి 66 మంది అగ్నిమాపకదళ సిబ్బంది సజీవదహనం అయ్యారు. వారి స్మారకార్థం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు బుధవారం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించే కార్యక్రమంతో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం పార్కులు, రైల్వేస్టేషన్లు, మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్ యార్డుల్లో అవగాహన కల్పించారు. 16న అపార్ట్మెంట్లు, కాలనీలలో ఎల్పీజీ గ్యాస్, విద్యుత్తు ఉపరకరణాల వినియోగంపై ప్రదర్శనలు ఉంటాయి. 17న పెట్రోల్ బంకులు, ఎల్పీజీ స్టోర్స్, గోదాములు, వ్యాపార సముదాయాలు, ఫంక్షన్ హాళ్లలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తారు. 18న ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయి. 19న విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. 20వ తేదీన ముగింపు సభలు జరుగుతాయి. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. -
కరోనా విజృంభణ: ఏప్రిల్ 30వరకు ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో దేశరాజధానిలో ఆంక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతంలో పెళ్లిళ్లు, వేడుకలు, అంత్యక్రియలకు హాజరయ్యే సంఖ్యను కుదిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ తాజాగా ఆదేశాలిచ్చింది. పెళ్లిళ్లు, వేడుకలకు అతిథులు 200 మంది దాటకూడదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. పెళ్లిళ్లకు 200 మంది అతిథులు, ఓపెన్ ఎయిర్ వెన్యూల్లో జరిగే కార్యక్రమలకు 100 మందికి, అంత్యక్రియల కార్యక్రమాలకు 50 మంది మించరాదని స్పష్టం చేసింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించడంతోపాటు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. శనివారం 1,558 కేసులు రావడం మొత్తం కేసులు 6,55,834కు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
‘విపత్తు’ పనులకు రూ.290 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఏపీడీఆర్పీ) కింద ఇప్పటివరకు జరిగిన పనులకు పెండింగు బిల్లుల చెల్లింపుతోపాటు మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ రూ.290.10 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో విశాఖ బీచ్ అభివృద్ధికి జీవీఎంసీ, వుడాలకు రూ.45.09 కోట్లు, రహదారులు, తుపాను పునరావాస కేంద్రాల నిర్మాణం కోసం రహదారులు–భవనాల శాఖకు రూ.30.65 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.25 కోట్లు, విశాఖ నగరంలో జరుగుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనులకు రూ.128 కోట్లు, మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలుకు రూ.55.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. -
నివర్ బాధితులకు రూ.500 ప్రత్యేక సాయం
సాక్షి, అమరావతి: నివర్ తుపాను వల్ల పునరావాస శిబిరాల్లో గడిపిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) సహాయ ప్యాకేజీలకు అదనంగా రూ.500 ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. తుపాను వల్ల భారీ వర్షాలు, వరదలు సంభవించిన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఈ సాయం వర్తిస్తుంది. ట్రెజరీ రూల్ (టీఆర్)– 27 కింద వెంటనే వీరికి రూ.500 చొప్పున ప్రత్యేక సహాయం అందించాలని ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో తుపాను సమయంలో భారీ వర్షాలతో సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారందరికీ నగదు ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఈ జిల్లాల్లో 49,123 మందికి రూ.500 ప్రత్యేక సాయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదించింది. వరదల్లో చనిపోయిన వారి వారసులకు ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు పంపిన కలెక్టర్లు.. బాధితుల బ్యాంకు అకౌంట్, ఆధార్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు పంపించాలని వారికి సూచించారు. ఇళ్లు కూలిపోయినవారికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, వీధి, ఇంటి నంబర్ వివరాలను పంపించాలన్నారు. -
మరో హెచ్చరిక : అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. (హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ) తెలంగాణలోనూ వర్షాలు.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది. ఇంకా దాని ప్రభావం నుంచి కోలుకోక ముందే తూర్పు మధ్య అరేబియా, ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో రాగల 48 గంటల్లో పశ్చిమ దిశగా ప్రయాణించి వాయుగుండం బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. -
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దాని అనుసంధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఆ తదుపరి 24గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలుల వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కోస్తాకు వాయు గుండం.. శుక్రవారం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, కోస్తా ఆంధ్రాకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం త్వరితగతిన తన దిశను మార్చుకుంటూ వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ దశలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే కోస్తా ఆంధ్రాలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. -
మోరంచ వాగులో చిక్కుకున్న కార్మికులు
జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లికి సమీపంలో ఉన్న మోరంచ వాగులో బ్రిడ్జ్ నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. గుడాడుపల్లి(ఎస్ యం), కొత్తపల్లి గ్రామాల మధ్య నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు, ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మోరంచ వాగులో ఇరుక్కుపోయారు. (వరదల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి) వరద ఉధృతి పెరుగుతుండటంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. కూలీలను రక్షించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, సహాయం కోసం రెస్క్యూ టీమ్‌ను పంపించాలని కోరారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. -
దయచేసి వరద నీటిలోకి రావొద్దు..
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం విధించిన కరోనా నియమాలను పాటిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు సహకరించాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను విడుదల చేశారు. వరదల సమయంలో.. వరదనీటిలోకి ప్రవేశించవద్దు. మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి. విద్యుదాఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి. ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్‌ను గుర్తించి ఆ ప్రదేశం లొ కనిపించే విదంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి. వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి. తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి. వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి. (చదవండి: 19న మరో అల్ప పీడనం: వాతావరణ శాఖ) వరదల తరువాత.. మీ పిల్లలను నీటిలోకి గాని మరియు వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి. దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి. అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు. విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు తీగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాల ను నిశితంగా పరిశీలించండి . వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు. మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి. వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి. నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి. నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు. మీరు ఖాళీ చేయవలసి వస్తే.. మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి. టాయిలెట్ గిన్నెపై ఇసుక సంచులను ఉంచండి మరియు మురుగునీటి తిరిగిరాకుండా నివారించడానికి అన్ని కాలువ రంధ్రాలను మూసివేయండి మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి. మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలు లను తీసుకొని వెళ్ళండి. లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి. అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి. -
ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు!
సాక్షి, విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నాలుగు రోజులు తీరం ప్రాంతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాగల నాలుగు రోజుల వాతావరణ వివరాలు: ఆగష్టు 13 వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 14వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగష్టు 15వ తేది: విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచన. ఆగష్టు 16వ తేది: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. -
ఉస్మానియాలో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి రోగులను మురుగు ముప్పు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆస్పత్రిలోని డ్రైనేజీ వ్యవస్థ శిథిలమవడంతో వర్షపునీరు వెళ్లే మార్గంలేక అంతర్గత రోడ్లపైనే పొంగిపొర్లుతోంది. సెక్యూరిటీ ఆఫీసు సమీపం నుంచి పాతభవనంలోకి నీరు చేరుతోంది. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం గురువారం ఆస్పత్రికి చేరుకుని తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది. వార్డులోకి చేరిన నీటిని పాతభవనం డోమ్ గేట్ ద్వారా బయటికి ఎత్తిపోసింది. తడిసిన పడకలు, పీపీఈ కిట్బాక్స్లను ఆరబెట్టింది. అయితే, డ్రైనేజీ లైన్లను ఇంకా పునరుద్ధరించలేదు. దీంతో మళ్లీ వర్షం వస్తే వార్డుల్లోకి వరదనీరు చేరే ప్రమాదముందని పాతభవనంలోని రోగులు, వైద్యసిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్లో చికిత్స పొందుతున్నవారందరినీ గురువారం ఫస్ట్‌ఫ్లోర్‌కు తరలించారు. కానీ, ఆయావార్డులను శుభ్రం చేయకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఇదే ప్రాంగణంలో ఉన్న మరో భవనం(కులీకుతుబ్ షా) ఐదో అంతస్తులోకి కూడా వర్షపునీరు లీక్ అవుతోంది. దీంతో ఆ వార్డులో ఉన్న డయాలసిస్ యంత్రాలపై నీరుపడి పాడైపోయాయి. ఈ భవనంపై అదనపు అంతస్థు నిర్మిస్తుండటం, నిర్మాణ సమయంలో స్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడటంవల్ల వర్షపునీరు కిందికి ఇంకుతున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. -
వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం
అసోం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రం అసోంను ముంచెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా అసోంలోని 4 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 99 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ మేరకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం పేర్కొంది. దీహాజీ, జోర్హాట్, శివసాగర్, దిబ్రూఘడ్ జిల్లాల్లో 4,329 హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు నివేదకలు వెల్లడిస్తున్నాయి. ఈ జిల్లాల్లో 30 సహాయక శిబిరాలను శిబిరాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల నుంచి దాదాపు 37 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా నీమాటిఘాట్ (జోర్హాట్) వద్ద బ్రహ్మపుత్ర, ధుబ్రీ.. శివసాగర్ వద్ద డిఖో.. నంగ్లమురాఘాట్ వద్ద డిసాంగ్.. నుమాలిగ వద్ద ధన్సిరి.. ఎన్టీరోడ్ క్రాసింగ్ వద్ద జియా భరాలీ నదులు పొంగిపొర్లుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. చదవండి: చెరువులో పడి ఐదుగురు బాలికలు మృతి