సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ గురువారం హెచ్చరించారు. దీంతో ఆయా ప్రాంతాకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ హెచ్చారించారు. కాగా పిడుగులు పడే ఆయ జిల్లాల్లోని ప్రాంతాల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద కాని, బయట ఉండకూడదని కమిషనర్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే..
విశాఖపట్నం: నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, గోలుగొండ, కోయ్యూరు, రావికమతం, మాడుగుల, జి.మాడుగుల, బుచ్చయ్య పేట, చీడికాడ, కశింకోట
తూర్పుగోదావరి: తుని, రౌతులపూడి, కోటనందూరు, ప్రత్తిపాడు, వరరామచంద్రపురం, శంకవరం, గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి
పశ్చిమగోదావరి: బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిసర ప్రాంతాలు
Comments
Please login to add a commentAdd a comment