commissioner
-
తెలంగాణలో కొనసాగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-
బతుకమ్మ కుంట.. బతికెనంట!
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకుతోంది. కబ్జా చెర వీడటంతో దీని అభివృద్ధిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఇళ్లను కూల్చకుండా, ఉన్న కుంటపైనే దృష్టి పెట్టింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు.. తాజాగా చెరువులో పూడికతీత మొదలెట్టారు. మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా.. లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఇది బతుకమ్మ కుంట కాదు ప్రైవేట్ స్థలం అంటూ వాదించిన వాళ్లు ఇప్పుడేమంటారంటూ ప్రశి్నస్తున్నారు. కబ్జాల చెరలో చిక్కిపోయి, ఆనవాళ్లను కోల్పోయిన బతుకమ్మ కుంటకు ప్రాణం పోయాలని కోరుతూ గతంలో అంబర్‌పేటకు చెందిన స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వాస్తవాలు నిర్ధారించారు. బతుకమ్మకుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయ ని న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లాలని సూ చించింది. దీంతో హైడ్రా తన అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. బతుకమ్మ కుంటలో ఉన్న పైపులైన్ పగిలి నీళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి పైపులైన్లు లేవని జలమండలి అధికారులు స్పష్టం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పదహారు నుంచి ఐదెకరాలకు తగ్గిన కుంట.. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో ఈ మేరకు మాత్రమే కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ⇒ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్ని హైడ్రా చేపట్టింది. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలా ల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.మరో ఐదు చెరువుల్లోనూ.. హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటతో పాటు మరో ఐదు చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి, ఉప్పల్ నల్ల చెరువులు, పాతబస్తీలోని బుమ్రక్ దౌలా చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిలోని నీళ్లు తొలగిస్తామని, ఆపై కాలుష్యాన్ని శుద్ధి చేసి, చెరువుకు పునరుజ్జీవం కలి్పస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల్ని హెచ్ఏండీఏ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా చెరువుల అభివృద్ధిని వచ్చే జూన్ మాసం కల్లా పూర్తి చేయనున్నారు. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం
-
పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మల్లాది విష్ణు. కావటి మనోహర్ ఉన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురి చేసి కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా?.కిడ్నాప్ చేయడానికి దాడులు చేయడానికి వెనకడం లేదు. ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి చర్యలు ఏంటని అడుగుతున్నా. హూకోర్టు ఆదేశాలు కూడా పోలిసులు అమలు చేయడం లేదు. ఏనీలో అక్రమాలకు వంత పాడుతున్న అధికారులు అందరూ చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
AP: వివాదాస్పదమైన దేవాదాయ కమిషనర్ నియామకం
సాక్షి,విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ నియమాకం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్‌గా కూటమి ప్రభుత్వం తాజాగా రామచంద్రమోహన్‌కి బాధ్యతలు అప్పగించింది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్‌కి కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నాన్ ఐఏఎస్ అధికారికి దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ అధికారిని కాదని రామచంద్రమోహన్‌కి బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖలో ఏడీసీ 1 గా ఉన్న అధికారిని పక్కనపెట్టి రామచంద్రమోహన్‌కి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడమేంటని ఇతర అధికారులు చర్చించుకుంటున్నారు.తీవ్రమైన అవినీతి ఆరోపణలు,కేసులు ఉన్న రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.సామాజికవర్గం ఎఫెక్ట్‌తోనే రామచంద్రమోమన్కి కీలక పోస్టు దక్కిందన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. -
గుంటూరు మేయర్, కమిషనర్ మధ్య వివాదం
-
ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో..
హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా.. నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు. -
నోటీసులు ఇవ్వం.. కూల్చివేతలు ఆపం.. హైడ్రా రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన కల్పించామని.. త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్ (Hydra Police Station) ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చెరువులు, కుంటలను కబ్జాల నుంచి కాపాడుతున్నామన్నారు. శాటిలైట్ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. ఇప్పటివరకు 5,023 ఫిర్యాదులు మాకు అందాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని రంగనాథ్ చెప్పారు.‘‘300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న రంగనాథ్.. ఎఫ్టిఎల్ గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కమిషనర్ స్పష్టం చేశారు.‘‘హైడ్రా అనగానే కూల్చడం అనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. త్వరలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ చేయబోతున్నాం. హైడ్రా ఆధ్వర్యంలో త్వరలో ఎఫ్ఎం ఛానెల్ రాబోతుంది. కబ్జాలు చేసి నిర్మాణాలు చేపడితే హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. కొత్తగా కొనుగోలు చేసే వాళ్లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే కొనుగోలు చేయాలి. హైడ్రా ఆధ్వర్యంలో ఎఫ్టిఎల్ లిస్ట్ త్వరలో వెబ్సైట్లో పెడతాం. చెరువుల వద్ద ఉన్న షెడ్స్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి...హైడ్రా 12 వందల చెరువులను గుర్తించింది. హైడ్రాపై కొందరు గిట్టని వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జాకు గురైతే వదిలేద్దామా?. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఎఫ్టీఎల్ గుర్తించిన తరువాత అనధికారిక నిర్మాణాలు అయితే కఠిన చర్యలు తప్పవు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 550 చెరువుల ఎఫ్టీఎల్ వర్క్ నడుస్తోంది. పేదలను ముందు చూపి వెనకాల మాఫియా వేరే ఉంటుంది. మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు, హైడ్రాకు సంబంధం లేదు. మూసీలో కబ్జాలపై హైడ్రా ఫోకస్ పెట్టనుంది. కబ్జా నిర్మాణాలను హైడ్రా కచ్చితంగా కూల్చుతుంది. ఇప్పటికే పలువురు బిల్డర్స్‌కి వార్నింగ్ ఇచ్చాము. మూసీ కబ్జాలపై చర్యలు ఉంటాయి కానీ మూసి రివర్ ప్రాజెక్ట్‌కు హైడ్రాకు సంబంధం లేదు. 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది...హైడ్రా ఛైర్మన్‌గా సీఎం ఉంటారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించాం. హైడ్రాపై సోషల్ మీడియాలో మాత్రమే తప్పుడు ప్రచారం చేశారు. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నా ఇళ్లు బఫర్ ఎఫ్టిఎల్లో లేదు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే చెరువుపైనే వస్తుంది. నా ఇల్లు చెరువుకి కింద కిలో మీటర్ దూరంలో ఉంటుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు చర్యలు ఎదుర్కొంటారు’’ అని రంగనాథ్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు.. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్: బడంగ్పేట్, అల్మాస్ గూడలో హైడ్రా చర్యలు చేపట్టింది. వెంకటేశ్వర కాలనీలో కబ్జాదారులకు హైడ్రా చెక్ పెట్టింది. పిల్లల ఆట పరికరాలు తొలగించి పార్కు స్థలం కబ్జా చేసిన కొందరు వ్యక్తులు.. కంటెనర్ల కోసం షెడ్లు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు పరిశీలించారు. జేసీబీలతో కంటైనర్ల షెడ్లను హైడ్రా తొలగించి.. పార్కు స్థలాన్ని కాలనీ వాసులకు హైడ్రా అధికారులు అప్పగించారు.పార్కు ఆక్రమణ కాకుండా కాపాడారంటూ స్థానికులు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. బాలాపూర్ పరిధిలోని అల్మాస్ గూడ వెంకటేశ్వరకాలనీ వాసులు..ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేశారు."బడంగ్ పెట్ మునిసిపాలిటీలో కబ్జాకు గురైన పార్కును కాపాడినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వెంకటేశ్వర కాలనీలో పాలాభిషేకం చేసిన స్థానికులు" #HYDRAA pic.twitter.com/zFtiLa14IK— The Politician (@ThePolitician__) December 3, 2024VIDEO CREDITS: THE POLITICIANకాగా, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై దృష్టి పెట్టామన్న రంగనాథ్.. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలం.. హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం’’ అని రంగనాథ్ హెచ్చరించారు. -
డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వాకింగ్ కోసం మున్సిపల్ పార్క్‌కు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేశారు. వాకింగ్ పార్క్‌లో బుగ్గనను సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేస్తే కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించలేదు.మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపైనే మాజీ మంత్రి వాకింగ్ చేశారు. నిత్యం వందలాది మంది వాకింగ్ చేసే పార్కుకు తాళం వేయడంతో వాకింగ్‌కి వచ్చిన వారు సైతం వెనుదిరిగారు. వాకింగ్ పార్కు తాళం వేయడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌కు తాళం వేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. -
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్..కట్‌చేస్తే నేడు ఆమె..!
ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయికి ‘ఐఏఎస్’ కలలు ఉంటాయా? ‘సాధ్యం కాదు’ అనుకున్నదాన్ని ‘సాధ్యం’ చేయవచ్చా? ఈ రెండు ప్రశ్నలకు జవాబు చెప్పే పేరు....రుక్మిణి రియర్. ఆరో తరగతి ఫెయిలైన రుక్మిణి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కమిషనర్‌గా ‘ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి’ అనుకునేలా పనిచేస్తోంది... స్కూల్ రోజుల్లో రుక్మిణి బ్రైట్ స్టూడెంట్ కాదు. రుక్మిణి ఆరో తరగతి ఫెయిల్ కావడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఆ ఫెయిల్యూరే తనను సక్సెస్‌కు దగ్గర చేసింది. ‘ఫెయిల్యూర్ అంటే మొదలైన భయం ఎలాగైనా సక్సెస్ కావాలనే పట్టుదలను పెంచింది’ అంటుంది రుక్మిణి. అమృత్‌సర్‌లోని ‘గురునానక్ యూనివర్శిటీ’లో సోషల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన రుక్మిణి ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్’లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.ఆ తరువాత ముంబై, మైసూర్‌లలో కొన్ని స్వచ్ఛందసంస్థలలో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న క్రమంలో అంకితభావం, వృత్తి నిబద్ధత ఉన్న ఎంతోమంది ఐఏఎస్ అధికారుల గురించి విన్నది. వారి గురించి విన్నప్పుడల్లా ‘ఐఏఎస్’ వైపు మనసు మళ్లేది. చివరికది అది తన కలగా మారింది.‘ఒక ప్రయత్నం చేసి చూద్దాం’ అని రంగంలోకి దిగింది.కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించింది. ‘ఆరోతరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్ సాధించింది’... రుక్మిణి గురించి ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది విద్యార్థులు ఆమెను కలుసుకొని మాట్లాడి సలహాలు తీసుకునేవారు.కట్ చేస్తే...ఇప్పుడు రుక్మిణి రియర్ రాజస్థాన్‌లోని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కమిషనర్. యూపీఎస్సీలో సెకండ్ ర్యాంక్‌తో ఎలా వార్తల్లో నిలిచిందో మున్సిపల్ కమిషనర్‌గా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం అక్రమార్కుల పాలిట ఆమె సింహస్వప్నం కావడమే. డిసెంబర్లో జరగబోయే ‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ను దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానాశ్రయం నుంచి 22 గోదాముల వరకు ప్రధాన రోడ్లను పరిశీలిస్తూ వెళ్లింది.నగర పరిశుభ్రత, సుందరీకరణ గురించి స్థానికులతో మాట్లాడింది. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చెయ్యాలని, పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫ్లైవోవర్లు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి పెయింటింగ్, లైటింగ్‌ల కోసం సూచనలు ఇచ్చింది. గోడలకు పెయింటింగ్ వేయడం నుంచి పబ్లిక్ టాయిలెట్లు, చెత్త కుండీలు శుభ్రం చేయడం వరకు ప్రతి పని దగ్గర ఉండి చేయిస్తుంది. నగర సుందరీకరణతో పాటు ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.‘రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ ద్వారా జైపూర్‌ను గ్లోబల్ సిటీగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం జైపూర్ అద్భుతంగా కనిపించకపోయినా... పరిశుభ్రంగా, ఆక్రమణలు లేకుండా కనిపించాలి. ఇది అనుకున్నంత సులువైన పనేమీ కాదు. ఎందుకంటే సమ్మిట్‌కు ఎన్నో నెలలు లేదు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కష్టపడుతూ ప్రజల నుంచి శభాష్ అనిపించుకుంటోంది రుక్మిణి. ‘పని చెయ్యకపోయినా ఫరవాలేదు. చేస్తే మాత్రం శ్రద్ధగా, భక్తిగా చేయాలి’ అని అమ్మ అంటుండేది. ఆ మాటలే రుక్మిణి రియర్కు వేదవాక్కు.(చదవండి: దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!) -
కాసేపట్లో హైకోర్టుకు 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్
-
హైడ్రా పేరుతో దందా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో కొందరు దందాలకు పాల్పడుతున్నారు. జలవనరుల్లోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్న హైడ్రా ప్రభుత్వ స్థలాల్లోని వాటినీ విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేస్తోంది. దీంతో కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు బ్లాక్‌మెయిలర్లు రంగంలోకి దిగారని తమ దృష్టికి వచి్చనట్లు బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇలాంటి దందాలు చేసిన వారికి కటకటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారన్న రంగనాథ్... మరికొందరి వ్యవహారంపై సమాచారం ఉందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానంగా రెండు రకాల దందాలు జరుగుతున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నారు. వివిధ జలవనరుల ఫుల్ ట్యాంక్ లెవల్స్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్న వారినే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ అంశంపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, మీడియాకు ఉప్పందిస్తామని బిల్డర్లను భయపెడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే భారీ మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఆయా అధికారులతో దిగిన ఫొటోలను చూపిస్తున్న కొందరు మరో దందా మొదలెట్టారు. ఆ ఫొటోల ఆధారంగా సదరు అధికారులతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విషయం సెటిల్ చేస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. 👉బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారితో పాటు వ్యక్తిగత గృహాలు కట్టుకుంటున్న వాళ్లూ టార్గెట్‌గా మారుతున్నారు. ఇలా భయపెట్టి డబ్బు డిమాండ్ చేస్తున్న వారిలో ఇతర విభాగాలకు చెందిన వాళ్లూ ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్ల అధికారులను అప్రమత్తం చేశారు. చర్యలు తప్పవు.. 👉‘హైడ్రాను నీరుగార్చే ప్రయత్నాలు చేసినా, తప్పు దోవ పట్టించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విభాగం పేరుతో ఎవరైనా బెదిరింపులు, డబ్బు వసూళ్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకుంటాం. ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రాకు చెందిన అధికారులు, సిబ్బంది సైతం బెదిరింపులకు పాల్పడితే తక్షణం స్థానిక పోలీసుస్టేషన్, ఎస్పీ, పోలీసు కమిషనర్, ఏసీబీ లేదా హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేయండి’ అని రంగనాథ్ అన్నారు. 👉సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్‌ను హైడ్రా పేరుతో బెదిరించి, డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఆ బిల్డర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీని కోరారు. బిల్డర్ నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్పీ.. అమీన్పూర్ ఠాణాలో కేసు నమోదు చేయించారు. బుధవారం విప్లవ్‌ను అరెస్టు చేశారు. -
కబ్జాలపై కొరడా.. ఎవ్వరిని వదిలిపెట్టం
-
ఆమె పేరు, ఫోటోలు వాడొదు మీడియాకు కోర్టు నోటీసులు
-
జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( జీహెచ్ఎంసీ) ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ మూడు రోజుల పాటు లీవ్‌లో వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. -
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్
దొండపర్తి : విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా ఉన్న వి.విద్యాసాగర్‌నాయుడును గ్రేహౌండ్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం అనంతపురం ఎస్పీగా ఉన్న కంచి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈయన గతంలో విశాఖ డీసీపీగా విధులు నిర్వర్తించారు. సమర్ధవంతమైన అధికారిగా రవిశంకర్ ► 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవిశంకర్ అయ్యనార్ పనిచేసిన ప్రతి చోటా సమర్ధవంతమైన అధికారిగా పేరు సంపాదించారు. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ► 1968 అక్టోబర్ 20న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జన్మించిన రవిశంకర్ పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ, సింబయాసిస్ యూనివర్సిటీలో హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లమో చేశారు. కొన్నాళ్లు జిప్మర్లో క్యాజువాలిటీ ఎమర్జన్సీ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ► 1994లో ఐపీఎస్‌గా ఎంపికై న తరువాత 1996 గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా నియమితులయ్యారు. ►1997–98లో బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా సింగరేణి బెల్ట్‌లో గెరిల్లా ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించి మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ►1998–99లో వరంగల్ ఓఎస్డీగా మావోయిస్టు చర్యల నిరోధానికి చట్టపరమైన, సంస్థాగత ప్రణాళికలు రూపొందించారు. ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల మీదుగా మావోయిస్టుల రాకపోకలు, తప్పించుకొనే మార్గాలు, ఆశ్రయ స్థలాలు, శిక్షణా శిబిరాలను సెస్నా ఎయిర్‌క్రాఫ్, జీపీఎస్ ద్వారా మ్యాప్ చేశారు. ►1999–2002 వరకు నిజామాబాద్ ఎస్పీగా పాకిస్తాన్‌కు చెందిన రెసిడెంట్ ఏజెంట్ ఆషిక్ అలీపై జీహాదీ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. అలాగే ఇండియన్ మహ్మద్ ముస్లిమిన్ ముజాహిదీన్ మాడ్యూల్‌ను ఛేదిండంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ►2002లో హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగాను, 2002–2004 మధ్య గుంటూరు ఎస్పీగాను పనిచేశారు. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన ఐఈడీ బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేశారు. ►2004–2005లో కొసావోలో యునైటెడ్ నేషన్స్ మిషన్ సీరియస్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇన్వెస్టిగేటర్‌గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో కొసావో పోలీస్ ఆఫీసర్ హత్యకేసు, అక్రమ ఆయుధాల కేసు, కొసావో అధ్యక్షుడు హరదినాజ్పై హత్యాయత్నం కేసుతో పాటు మరో రాజకీయ నాయకుడిపై హత్యాయత్నం కేసుల దర్యాప్తు చేపట్టారు. ►2005–2006లో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఏఐజీగాను, 2006–2008 మధ్య స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, 2008–2009లో ఏసీబీ అడిషినల్ డైరెక్టర్‌గాను, 2009–2010లో కరీంనగర్/వరంగల్ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తించారు. ►2010–2015 మధ్య నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీఐజీగా ఇండియన్ ముజాహుద్దీన్(ఐఎం) భారీ పేలుళ్ల కేసు, దిల్సుఖ్నగర్, మక్కా మస్జిద్, మాలేగాన్, బెంగుళూరు చర్చి, అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులను దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అలాగే నకిలీ కరెన్సీ కేసులు, టెర్రర్ ఫైనాన్స్ కేసుల్లో జాతీయ, అంతర్జాతీయ లింకులు, మావోయిస్ట్ ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ కేసులు, ఇటాలియన్ మైరెన్ కేసు ఇలా అనేక కీలక కేసులను దర్యాప్తు చేశారు. ►2015–2018 మధ్య డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా, 2015–2018లో ఆరోగ్యశ్రీ సీఈఓగా, 2018–2019లో ప్రావిజన్స్ అండ్ లాజిస్టిక్స్‌లో ఐజీగా, 2019లో లా అండ్ ఆర్డర్ అడిషినల్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. ►ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న రవిశంకర్ విశాఖ సీపీగా నియమితులయ్యారు. కొత్త డీసీపీ స్వస్థలం ఉమ్మడి విశాఖే.. విశాఖ డీసీపీ(లా అండ్ ఆర్డర్)గా రానున్న కంచి శ్రీనివాసరావు విశాఖతో అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. 2009 గ్రూప్–1 ద్వారా డీఎస్పీ పోస్టు సాధించారు. తొలుత వనపర్తి, కొవ్వూరులో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తరువాత సీఐడీ డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందాక విశాఖపట్నం డీసీపీగా, శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మరోసారి ఉద్యోగోన్నతి పొంది విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్నారు. అక్కడి నుంచి విశాఖ డీసీపీగా నియమితులయ్యారు. -
వస్త్ర వ్యాపారిపై దాడికి వ్యాపార లావాదేవీలే కారణం
విజయవాడ స్పోర్ట్స్: ఇటీవల విజయవాడలో వస్త్ర వ్యాపారిపై ఓ దుకాణం యజమాని దాడికి పాల్పడిన ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార లావాదేవీలే ఘటనకు కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ మీడియాలో వెలువడ్డ కథనాల్లో నిజం లేదని, అసత్యాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. చెక్కు చెల్లకపోవడంతో.. ధర్మవరానికి చెందిన హోల్‌సేల్ వస్త్ర వ్యాపారి అన్ని ప్రాంతాలకు వ్రస్తాలను సరఫరా చేస్తుంటారు. విజయవాడ పటమటలోని ఆలయ సిల్‌్క్స షాపు యజమానికి గతేడాది డిసెంబర్లో రూ.2.34 లక్షల విలువ చేసే వ్రస్తాలను సరఫరా చేశారు. దీనికి సంబంధించిన చెక్కు చెల్లకపోవడంతో డబ్బులివ్వాలని ఆలయ సిల్‌్క్స యజ మాని గుడవర్తి అవినాష్ గుప్తాను పలుమార్లు ఫోన్లో కోరారు. ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు తన స్నేహితుడితో కలిసి ఈ నెల రెండో తేదీన విజయవాడ వచ్చారు. దుకాణం వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆలయ సిల్‌్క్స యజమాని అవినాష్ గుప్తా, సూపర్వైజర్ చీవేళ్ల నాగేశ్వరరావు, మరో వ్యక్తి కలసి వస్త్ర వ్యాపారిని, అతడి స్నేహితుడిని చేతులతో కొట్టారు. దుస్తులు విప్పించి నగ్నంగా నాలుగు గంటల పాటు బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు గుడవర్తి అవినాష్గుప్తా, నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. తెనాలిలో అలాంటి నాయకులెవరూ లేరు.. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెనాలి: వస్త్ర వ్యాపారిపై తెనాలికి చెందిన వైఎస్సార్ సీపీ అవినాష్ గుప్తా జులుం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజం లేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కొల్లిపరలో ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వారికి తమ పార్టీలో స్థానం ఉండదని, తప్పు చేస్తే సీఎం జగన్ ఏమాత్రం ఉపేక్షించరని స్పష్టం చేశారు. 2011లో పారీ్టలో చేరిన తాను అవినాష్ గుప్తా అనే వ్యక్తిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లో మీడియా కథనాలు వికృత చేష్టలకు నిదర్శమన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు జుత్తు పట్టుకుని ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన ఉదంతాన్ని ప్రజలు మరచిపోలేదని చెప్పారు. -
ప్రయివేట్ స్కూళ్లలో పేదలకు ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల(బీసీ, మైనారిటీ, ఓసీ)కు చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1,20,000, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ.1,44,000లను ప్రాతిపదికగా తీసుకుని వారి కుటుంబాల పిల్లలను అర్హులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాల కల్పనకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు వెల్లడించారు. ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తు నమోదుకు షెడ్యూల్ కూడా ప్రకటించామన్నారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్(సమగ్ర శిక్ష) దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. విద్యార్థుల ప్రవేశాలకు షెడ్యూల్ ఆన్లైన్ పోర్టల్‌లో అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల నమోదు తేదీలు: 06.03.2023 నుంచి 16.03.2023 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు (ఆన్లైన్ పోర్టల్‌లో) తేదీలు: 18.03.2023 నుంచి 07.04.2023 వరకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ: 09.04.2023 నుంచి 12.04.2023 వరకు మొదటి ఎంపిక జాబితా విడుదల తేదీ: 13.4.2023 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మొదటి జాబితాలో ఎంపిక కాబడిన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 15.04.2023 నుంచి 21.04.2023 వరకు రెండో ఎంపిక జాబితా విడుదల తేదీ: 25.4.2023 రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు (చదవండి: కార్చిచ్చుకు పక్కా స్పాట్) -
ఈసీ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
సీఈసీ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్ నియామకాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ నియామకాలపై కమిటీలో ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. అలాగే, ప్రతిపత నేత లేదా విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు ఉండాలని పేర్కొంది. సీబీఐ చీఫ్ ఎంపిక తరహాలోనే సీఈసీ నియామకం జరగాలని సూచించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేసేంత వరకు కమిటీ పని చేస్తుందని జస్టిస్ కె.ఎం నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది. The Constitution Bench of Supreme Court starts pronouncing the judgement on petitions seeking reform in the process for the appointment of members of the Election Commission of India. Judgment being pronounced by a 5-judge bench headed by Justice K.M. Joseph. pic.twitter.com/Th2plMoESH — ANI (@ANI) March 2, 2023 -
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా కవిత
సాక్షి, హైదరాబాద్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్ కౌశిక్ శుక్రవారం ప్రకటించారు. కవిత నేషనల్ గైడ్స్ కమిషనర్‌గా ఏడాది పాటు సేవలందించనున్నారు. ఆమె 2015 నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా సేవలందించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కవిత తెలిపారు. -
Kudrat Dutta Chaudhary: హక్కుల గొంతుక
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్‌గా శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది... శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్కు ‘ఐఆర్సీ’ సలహాలు ఇస్తుంది. ‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్. చండీగఢ్‌లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది. కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్‌లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్‌పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
Election Commissioner: నచ్చినవాడికి ఇచ్చేద్దామా?
నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరించినట్టు కనిపించడం కూడా అంతే ముఖ్యం. కానీ, ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలు, వాటిని నిర్వహిస్తున్న మన ఎన్నికల వ్యవస్థ అలానే ఉన్నాయా? ఎన్నికల సంఘానికి పెద్ద అయిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామక ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరుగుతోందా? దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో అన్న మాటలు, అడిగిన ఫైళ్ళు చూశాక సహజంగానే ఈ ప్రశ్నలు అడగాల్సినవే అనిపిస్తాయి. సీఈసీ, ఈసీల వ్యవస్థ రాజకీయ, ప్రభుత్వ జోక్యాలకు అతీతంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు ఆలోచన రేపుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల కూడా ఎన్నికల సంఘ నియామకాలు, చట్టాలు పారదర్శకంగా ఉంటే 72 ఏళ్ళ తర్వాతా మన వద్ద ఆ పరిస్థితి లేకపోవడం విషాదమే. ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను ఆ వెంటనే 19వ తేదీన ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించడం సైతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే, ఈ ఏడాది ఆఖరుకు రిటైరవ్వాల్సిన వ్యక్తికి హఠాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి, ఇలా ఎన్నికల సంఘంలో నియుక్తం చేయడంలో అంతా సవ్యంగానే జరిగిందా అన్నది ప్రశ్న. అది తెలుసుకొనేందుకే సుప్రీమ్ కోర్ట్ ఇప్పుడు అరుణ్ గోయెల్ నియామకం సహా నిర్ణీత ఫైళ్ళను పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. అధికార పార్టీలు తమకు నచ్చిన ప్రభుత్వ ఉన్నతాధికారులను సీనియారిటీ ప్రాతిపదికన ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్న విధానం తప్పనేది ప్రాథమికంగా పిటిషనర్ల వాదన. సీఈసీల నియామకంలోనూ కొలీజియమ్ తరహా విధానాన్ని పాటించాలని అభ్యర్థన. ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా పాలకుల ఇష్టారాజ్యమైందన్నది చేదు నిజం. సుప్రీమ్ అన్నట్టు – క్యాబినెట్ నియమించిన సీఈసీ, ఈసీలు ఏ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికో వ్యతిరేకంగా నోరు విప్పగలరా అన్నది అనుమానమే. గణాంకాలు చూస్తే రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి 46 ఏళ్ళలో (1950 –1996) సీఈసీగా వ్యవహరించింది పట్టుమని పది మందే! ఆ తర్వాత గత 26 ఏళ్ళలో ఇప్పటికి 15 మంది వచ్చారు, పోయారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2004 తర్వాత ఏ ఒక్కరూ పూర్తి ఆరేళ్ళ పదవీకాలం లేరు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ సారథ్య యూపీఏ అయినా, బీజేపీ నేతృత్వ ఎన్డీఏ అయినా ఇదే దుఃస్థితి. స్వల్పకాలమే ఉంటున్న ఈ ఎన్నికల పెద్దలు అనుకున్నది చేయగలరా? ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరు? సుప్రీమ్ ప్రశ్న కూడా ఇదే! దేశంలో తొలిసారిగా ఎన్నికల సంఘం గురించి సామాన్యులకు తెలిసింది – ఎన్నికల కమిష నర్గా శేషన్ సంస్కరణలు సాగించిన కాలంలోనే. ఇవాళ్టి ఓటర్ గుర్తింపుకార్డులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టిందీ ఆయనే. శేషన్ తర్వాత లింగ్డో లాంటి కొందరు నిర్భయంగా ఎన్నికల సంఘం అధికారాలను వినియోగించినా, గత దశాబ్దిన్నరలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఎన్నికల వ్యయంపై నియంత్రణ లేకుండా పోయింది. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక సహా అనేకచోట్ల మద్యం ఏరులై పారుతూ, కోట్లకొద్దీ నోట్ల కట్టలు తెగుతూ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నా, ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. శేషన్ నాటికీ, నేటికీ అధికా రాల్లో మార్పు లేకపోయినా అంకితభావంలో మార్పు వచ్చింది. పదవీప్రసాద ప్రభుభక్తి పెరిగింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈసీల నియామక ప్రక్రియను వివరించలేదు. దానిపై పార్లమెంట్ చట్టం చేస్తుందని భావించింది. ఇన్నేళ్ళుగా అది జరగలేదు. తాజా కేసులోనూ సర్కారు 1991 నాటి చట్టాన్నీ, అలాగే రాష్ట్రపతికి ప్రధాని సారథ్యంలోని మంత్రివర్గ సిఫార్సుల పైనే నియా మకాలు జరుగుతున్న పూర్వోదాహరణల్నీ అడ్డుపెట్టుకుంటోంది. లా కమిషన్ సైతం కొలీజియమ్, లేదా ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్ కమిటీయే ఈసీలం దర్నీ నియమించాలని 2015 నివేదికలో పేర్కొంది. కొలీజియమా, కమిటీయా అన్నది పక్కన పెడితే ఈసీల నియామక ప్రక్రియలో తక్షణ సంస్కరణలు అవసరం. అయితే, దీనికి పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు మన పాలకులెంత సిద్ధం ఉంటారో చెప్పలేం. అసలైనా అధికారంలోని వారి అభీష్టమైన ఈసీల నియామకంపై జడ్జీలు జోక్యం చేసుకోవడమే మిటనేది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన. ధర్మాన్ని నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ సైతం దృష్టి సారించరాదంటే తప్పొప్పులు దిద్దేదెవరు? రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి తొలి ఈసీగా నియుక్తులైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లాంటి వారు బాధ్యత మరిచి, పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తాజా ఉదాహరణే. ఇక, ఈసీల నియామకంపై వ్యాఖ్యానించిన సుప్రీమ్ తన సొంత జడ్జీల నియామక ప్రక్రియపై విమర్శలకు స్పందించదేమన్నది కొందరి విమర్శ. కొలీజియమ్ వ్యవస్థ ఆసరాగా ప్రధాన న్యాయమూర్తులు మెచ్చినవారినే జడ్జీలుగా నియమిస్తున్నారనీ, ఈ నియామకాల్లో పారద ర్శకత లేదనీ ఆరోపణ. న్యాయశాఖ మంత్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల సంఘంలోనైనా, న్యాయవ్యవస్థలోనైనా నియామకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాలి. తటస్థ వ్యవస్థలుంటేనే విశ్వాసం బలపడుతుంది. ప్రజాస్వామ్య పరిపుష్టి సాధ్యమవుతుంది. -
రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై నిబంధనలు కఠినతరం
-
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ మురళీధర్ భగవత్ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్ సీపీని ఇన్చార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు గత వారం సైబరాబాద్ కమిషనర్ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్చార్జ్ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్చార్జ్ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు రూపొందించే పెరిస్కోప్ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో (ఐఎస్బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులతో సైబరాబాద్ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. -
కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్‌లోని అబిడ్స్, పంజగుట్ట సహా మరికొన్ని పోలీసుస్టేషన్ల అధికారులకు అనునిత్యం టెన్షనే. తమ పరిధిలో ఉన్న ప్రాంతాలు నిరసనలు, ఆందోళనలు, ముట్టడిలతో అట్టుడికిపోతుంటాయి. ఆయా సమయాల్లో ఆందోళనకారులను అదుపు చేయడానికి, నిర్దేశిత ప్రాంతాల్లో కాపుకాయడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారుల నేపథ్యంలో నగరం మొత్తం ఒకే యూనిట్‌గా పని చేయాలని, ఎక్కడిక్కడ వీరిని కట్టడి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సమాచారంతో సరి... ► రాజధాని నగరంలో అనునిత్యం ఏదో ఒక నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వీటిలో కొన్ని పోలీసుల అనుమతులతో జరుగుతుంటే... మరికొన్ని ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా సాగుతుంటాయి. ఈ రెండో తరహాకు చెందిన వాటిపై ఆయా సంస్థలు ముందుగానే ప్రకటనలు చేస్తుంటాయి. అలా కానప్పుడూ నగర పోలీసు నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ సమాచారం సేకరిస్తుంటుంది. ఈ వివరాలను నగరంలోని అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక విభాగాలకు అందిస్తుంటారు. దీని ఆధారంగా దాదాపు ప్రతి పోలీసుస్టేషన్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే తమ పరిధి నుంచి వెళ్తున్న నిరసనకారులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమే స్థానిక పోలీసులు పరిమితం అవుతున్నారు. ఈ రెండేళ్లూ పెరిగే అవకాశం... ► దీంతో నిరసనకారులంతా తాము నిరసన తెలిపే ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ స్థానిక పోలీసులే అదుపు చేయడం, అదుపులోకి తీసుకోవడం చేయాల్సి వస్తోంది. ఇది ఒక్కోసారి తలకుమించిన భారంగా మారి అపశృతులకు కారణమవుతోంది. సాధారణంగా ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచి ఈ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నిరసనకారుల విషయంలో ప్రతి ఠాణా అధికారులు స్పందించాలని స్పష్టం చేశారు. వీరిని ఎవరికి వారు, ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. మరోపక్క ఏదైనా సంచలనాత్మక నేరం జరిగినప్పుడూ స్థానిక పోలీసులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దాన్ని కొలిక్కితెచ్చే పని ప్రత్యేక విభాగాలదన్నట్లు పట్టించుకోవట్లేదు. ఇకపై ఇలాంటివి కుదరదని, కచ్చితంగా స్థానిక పోసులూ తమ వంతు కృషి చేయాలంటూ కొత్వాల్ ఆనంద్ స్పష్టం చేశారు. వాటి విషయంలో మరింత అప్రమత్తత... ► ప్రభుత్వ నిర్ణయాలతో పాటు అనేక అంశాలపై నిరసన తెలపడానికి సమాయత్తమవుతున్న కొందరు ఆందోళనకారులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్యులకు, ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసు అధికారులు సైతం కొన్ని షరతులు విధిస్తున్నారు. అనుమతి వచ్చిన తరవాత చేపట్టే ఈ నిరసనలు ఒక్కోసారి నిర్వాహకులు చేతులు దాటిపోతున్నాయి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు చేయడం, రహదారులపైకి వచ్చి వాహనాలు, సామాన్యులకు ఇబ్బంది కలిగించడం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విధ్వంసాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కలెక్టరేట్లతో పాటు మరికొన్ని సున్నిత, కీలక ప్రాంతాల్లో ఈ అపశృతులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. -
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
-
వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..
AP Rain Forecast: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. (చదవండి: కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్ 1 ) -
మున్సిపల్ కమిషనర్ నాన్‌వెజ్ ఆర్డర్ .. బిర్యానీలో బొద్దింకలు..
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్):‘చలో.. నడుబై మస్తు బిర్యానీ తిందాం..’ అంట పేరున్న హోటళ్లలో చాలామంది దావత్‌లు చేసుకోవడం సాధారణమైంది. పెద్దపెద్ద బిల్డింగ్‌లలో, హైఫై ఏర్పాట్లతో, ‘గ్రాండ్’గా ఉన్న పేర్లను చూసి పోతుంటారు. ఫైవ్‌స్టార్ రేంజ్లో ఆర్డరు తీసుకోవడం చూసి సంబరపడతారు. ‘ఆ.. రెండు చికెన్, ఒకటి మటన్ బిర్యానీ తీసుకురా.. చికెన్ల లెగ్‌పీస్ ఉండాలె..’అని ఆర్డర్లు ఇస్తుంటారు. ఇక ఆ తర్వాత హోటల్ వాళ్లు పైపై మెరుగులు అద్ది, వేడివేడీగా వడ్డిస్తారు. నచ్చిన తిండి ముందుకు వచ్చింది కదా.. అని ఏమాత్రం చూసుకోకుండా తింటే.. ఇక అంతే సంగతులు. మీ అదృష్టం కొద్ది అందులో ఏ పురుగులో, బొద్దింకలో ఫ్రీగా రావచ్చు. లేదంటే కుళ్లిన చికెన్, మురిగిన మటనే రంగులు అద్దుకుని మీకు అందవచ్చు. ఇదేంటీ.. ఇలా అంటారా..! జిల్లాకేంద్రంలో ఇలాగే జరిగింది. అదికూడా పోయిపోయి సాక్షాత్తు మున్సిపల్ అధికారులకే ఎదురు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అలా వెళ్తే.. ఏదో అలా.. సిబ్బంది కలిసి మధ్యాహ్న భోజనం చేద్దామని నిర్మల్ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, సిబ్బంది స్థానిక మంచిర్యాల రోడ్డులో బయటకు ఆకట్టుకునేలా ఉన్న ఓ ‘గ్రాండ్’ హోటల్ కు వెళ్లారు. నాన్‌వెజ్ తినేందుకు ఆర్డర్ ఇచ్చారు. వారు ఇచ్చిన ఆర్డర్ మేరకు వేడీగా బిర్యానీలు వచ్చేశాయి. వాటిని తింటూ ఉంటే.. ముందుగా ఒకరికి ఓ పురుగు వచ్చింది. సర్లే.. ఏదో వచ్చిందనుకున్నారు. కాసేపటికే మరో ఇద్దరికీ అలాగే జరిగింది. ఇందులో ఏదో తేడా ఉందని మున్సిపల్ కమిషనర్ వెంటనే కిచెన్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. అంతే.. అక్కడి వాతావరణం, ఫ్రిజ్‌లలో ఎప్పుడో నిల్వ చేసిన నాన్‌వెజ్‌లను చూసి అవాక్కయ్యారు. మిగతా అధికారులు, సిబ్బంది కూడా వచ్చి పరిశీలిస్తే.. అందులో కుళ్లిన చికెన్, మటన్, రెండుమూడు రోజుల క్రితం చేసి పెట్టిన లెగ్‌పీసులు నిల్వ చేసి ఉంచారు. పేరుకే పెద్ద హోటళ్లు.. జిల్లాలో చాలా హోటళ్లలో ఇదే తీరు ఉంది. పేరుకేమో పెద్ద హోటళ్లు కానీ.. లోపల కిచెన్లలో ఏమాత్రం పరిశుభ్రత పాటించడం లేదు. మున్సిపల్ అధికారులు పరిశీలింన సదరు ‘గ్రాండ్’లో హోటల్ కిచెన్‌రూం మధ్యలో నుం ఓపెన్ డ్రెయినేజీ ఉంది. వండిన బిర్యానీ పాత్రను దానిపైనే ఉంచారు. పక్కనే చెత్త, మురికిని పట్టించుకోకుండా అలాగే వండిన పదార్థాలను పెట్టేశారు. ఇక ఫ్రిజ్‌లలో కుక్కిన నాన్‌వెజ్‌ను చూస్తే ఎప్పుడో వారం క్రితం పెట్టినట్లు ఉన్నాయి. అందులో చాలా వరకు కుళ్లిపోయి. వాటినే కట్‌చేసి కస్టమర్లకు వండిస్తుండటం గమనా ర్హం. ఇక్కడే కాదు.. చాలా హోటళ్లల్లోన ఇలాంటి పరిస్థితే ఉంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిన్న హోటళ్లలో మరీ దారుణంగా కనీస పరిశుభ్రతను పాటించడం లేదు. కల్తీ నూనెలను, కుళ్లిన పదార్థాలకు రంగులు అద్దుతూ వడ్డిం చేస్తున్నారు. తమ విధుల ప్రకారం తరచూ తనిఖీలు చేస్తే మున్సిపల్ అధికారులకు ఇలా ఎదురయ్యేది కాదని పలువురు సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడం కొసమెరుపు. చర్యలు తప్పవు.. ప్రతి హోటల్లో కచ్చితంగా పరిశుభ్రత పాటించా లి. నిల్వ చేసినవి కాకుండా తాజా పదార్థాలతో వండినవే ప్రజలకు అందించాలి. లేనిపక్షంలో కఠిన చ ర్యలు తప్పవు. మంచిర్యాలరోడ్డులో గల హో టల్లో కిచెన్‌ను సీజ్ చేశాం. ర.50వేల ఫైన్‌కూడా వేశాము. యాజవన్యం సదరు జరిమానాను చెల్లించారు. –బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ -
ముంబై పోలీస్ మాజీ బాస్‌పై అక్రమ వసూళ్ల కేసు
ముంబై: ముంబై పోలీస్ మాజీ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి పరంబీర్‌సింగ్, ఐదుగురు పోలీస్ అధికారులతోపాటు మరో ఇద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ బిల్డర్‌పై ఉన్న కేసులను మాఫీ చేయించేందుకు వీరు రూ.15 కోట్లు డిమాండ్ చేశారని అధికారి ఒకరు గురు వారం వెల్లడించారు. మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీల్ జైన్, సంజయ్ పునామియా అనే ఇద్దరు బిల్డర్లను అరెస్ట్ చేశామ న్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో సచిన్ వాజే అనే పోలీస్ అధికారి అరెస్ట్ అనంతరం మార్చిలో ముంబై పోలీస్ కమిషనర్‌గా ఉన్న పరంబీర్‌సింగ్‌ను హోం గార్డ్ విభాగానికి డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అకోలా పోలీస్ ఇన్స్పెక్టర్ బీఆర్ ఘడే ఫిర్యాదు మేరకు పరంబీర్‌పై ఏప్రిల్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. అనిల్ దేశ్‌ముఖ్‌కు హైకోర్టులో చుక్కెదురు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాక రించింది. ఇదే కేసులో తీర్పుపై స్టే ఇచ్చి, అప్పీల్‌కు అవకాశమి వ్వాలన్న వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. అనిల్ పిటిషన్ ‘కొట్టివేయదగినది’ అని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్‌సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై జయశ్రీ పాటిల్ అనే లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనిల్‌పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు జరి పిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఏప్రిల్ 24వ తేదీన కేసు నమోదు చేసింది. -
ఏపీలో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యవసాయ కమిషనర్ అరుణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల స్థాయిలో జూన్ నెలాఖరుకు యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంఘాల ద్వారా 3,250 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జులై 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రైతులకు సబ్సిడీ అందజేస్తారని తెలిపారు. నాణ్యమైన యంత్ర సామగ్రిని సరైన ధరలకు రైతులకు అందించాలని కంపెనీలను ఆయన ఆదేశించారు. సహకరించక పోతే కంపెనీల డీలర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని ఆయన హెచ్చరించారు. చదవండి: కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో ముగిసిన సీఎం జగన్ భేటీ YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం -
మారువేషం లో పోలీస్ కమీషనర్ దంపతులు
-
సత్పతీ... సలామ్!
వరంగల్ అర్బన్ :కొందరు అధికారులు పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తారు.. మరికొందరు పనిచేస్తూ, చేయిస్తూనే కింది స్థాయి సిబ్బంది శ్రేయస్సు కోసం కృషి చేసి వారిపై చెరగని ముద్ర వేస్తారు. ఆ కోవలోకే వస్తారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ పమేలా సత్పతి! బల్దియా సిబ్బంది కార్మికుల సంక్షేమానికి తన స్నేహితుల ద్వారా రూ.20లక్షలు సేకరించి ప్రత్యేక ని«ధిగా ఏర్పాటుచేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆమె మనసున్న మహారాణిలా నిలుస్తున్నారు. రూ.వెయ్యి ఇస్తేనే ఫొటోలు పేపర్లలో వేయించుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భారీ మొత్తాన్ని సాయమందించేందుకు వెచ్చిస్తున్న ఆమెపై బల్దియా ఉద్యోగులు, సిబ్బంది నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. సిబ్బంది సేవలు వెలకట్టలేనివి వరంగల్‌లోని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ సేవలు అందిస్తున్న వివిధ విభాగాల సిబ్బంది, కార్మికులకు కమిషనర్ పమేలా సత్పతి గురువారం ప్రశంసాపత్రాలు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భయంకర కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు. కార్మికుల ఆరోగ్యం, శ్రమను దృష్టిలో పెట్టుకుని తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో వ్యక్తిగతంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విధినిర్వహణలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందడంలో ఆలస్యమైనా ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.11లక్షలను ఆపదలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు సహాయార్థం ఖర్చు చేయగా మరో రూ.9లక్షలు నిధులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయితే, అకారణంగా విధులను గైర్హాజరు కావొద్దని, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు విధి నిర్వహణ కూడా ముఖ్య మని గుర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ విద్యాసాగర్, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ జీ.వీ. నారాయణరావు, సెక్రటరీ విజయలక్ష్మి, సీహెచ్ఓ సునీత, డిప్యూటీ కమిషనర్ గోధుమల రాజు, టీఓ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రజారోగ్య విభాగానికి చెందిన కార్మికులు మాదాసి కరుణాకర్, సంజీవ్, మల్లికార్జున్, బాబు, విజయ, సారయ్య, జవాన్లు సతీష్, సాంబయ్య, ఫీల్డ్ వర్కర్ ఆనంద్‌తో పాటు డీఆర్ఎఫ్ నుంచి సాయికుమార్, మాలి సురేష్, కంప్యూటర్ ఆపరేటర్ లింగనాథ్, కార్మికులు చందన్, లైన్మెన్ కరుణాకర్, హెల్పర్ సదానందం, బిల్ కలెక్టర్లు మొయిన్ పాషా, అటెండర్ సుజాతకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాన్ని అందశారు. -
ప్రచారంలో ఆరుగురు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ నూతన పోలీసు కమిషనర్ ఎవరనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో నూతన కమిషనర్‌గా ఎవరిని నియమించనున్నారనే విషయం పోలీసులతో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడు జిల్లాల పరిధి.. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌కు పేరు ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలకు విస్తరించిన పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ నియామకం విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే కీలకమన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఆశావహుల పేర్లపై జిల్లాకు చెందిన కొందరు కీలక ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా సీఎం తీసుకున్నట్లు సమాచారం. నూతన కమిషనర్ నియామకంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రచారంలో ఆరుగురు.. అత్యంత కీలకమైన వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎవరు రానున్నారనే అంశంపై పోలీసు శాఖతోపాటు ప్రజల్లో చర్చ జరుగుతుండగా, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న వీబీ.కమలాసన్ రెడ్డి, రామగుండం సీపీ వి.సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు కమలాసన్ రెడ్డి పేరు ఖరారైనట్లేనన్న వాదన కూడా ఉంది. అయితే సుమారు నాలుగేళ్లుగా కరీంనగర్ కమిషనర్‌గా పని చేస్తున్న కమలాసన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రయత్నం ఫలిస్తే సత్యనారాయణకుఅవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. అదే విధంగా గతంలో వరంగల్‌లో డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా ఉన్న బి. సుమతి, నిజామాబాద్ సీపీ కార్తికేయ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ పి.విశ్వప్రసాద్, హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్(స్పెషల్ బ్రాంచ్) డాక్టర్ తరుణ్‌జోషి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే పదోన్నతి పొంది డీఐజీ హోదాలో కరీంనగర్ సీపీగా వీబీ.కమలాసన్ రెడ్డి పని చేస్తుండగా, నిజామాబాద్ సీపీ కార్తికేయ, ఎస్పీ(ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) బి.సుమతి, రామగుండం సీపీ వి.సత్యనారాయణకు ఈ ఏడాది ఫిబ్రవరి 6న డీఐజీలుగా పదోన్నతి లభించింది. -
అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో పాటు మున్సిపల్ సిబ్బందిని అయ్యన్న దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. -
ఏపీ: ఈ ప్రాంతాలకు పిడుగు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ గురువారం హెచ్చరించారు. దీంతో ఆయా ప్రాంతాకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ హెచ్చారించారు. కాగా పిడుగులు పడే ఆయ జిల్లాల్లోని ప్రాంతాల పేర్లను కూడా ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. చెట్ల కింద కాని, బయట ఉండకూడదని కమిషనర్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే.. విశాఖపట్నం: నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల, గోలుగొండ, కోయ్యూరు, రావికమతం, మాడుగుల, జి.మాడుగుల, బుచ్చయ్య పేట, చీడికాడ, కశింకోట తూర్పుగోదావరి: తుని, రౌతులపూడి, కోటనందూరు, ప్రత్తిపాడు, వరరామచంద్రపురం, శంకవరం, గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి పశ్చిమగోదావరి: బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల పరిసర ప్రాంతాలు రానున్న 24 గంటల్లో అల్ప పీడనం -
ఇంజినీర్లూ.. మీ పనితీరు బాలేదు
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, కనీస నిబంధనలు అమలు కావడం లేదు... ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతోనే ఇలా జరుగుతోంది.. అని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు సీకేఎం కాలేజీ మైదానంలో నిర్మించిన వాకింగ్ ట్రాక్ పనులను ఆమె మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యత లోపించినట్లు గుర్తించిన ఆమె ఇకనైనా ఇంజనీర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుకథలతో కాలం వెళ్లదీయకుండా పనిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, వరంగల్‌లోని అంధుల లూయిస్ పాఠశాల భవన పునఃనిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తయి, అగ్రిమెంట్ జరిగినా పనులు చేపట్టని కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని తెలిపా రు. ఇక వరంగల్ 28వ డివిజన్లో మహిళా కమ్యూనిటీ భవన పనులు,వరంగల్ ఆటోనగర్‌లో స్మృతి వనానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టాలని, ఏ నుమాముల మార్కెట్‌రోడ్డు విస్తరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈతనిఖీల్లో డీఈ రవీందర్,ఏఈలు కృష్ణమూర్తి,కార్తీక్ పాల్గొన్నారు. సుందరంగా ‘వావ్ వరంగల్’ కాజీపేట ఫాతిమా నగర్ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసి న ‘వావ్ వరంగల్’ లోగోను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఫాతి మానగర్ వద్ద పనులను పరిశీలించిన కమిషనర్... అందమైన చిత్రాలు వేయించడంతో పాటు వాటర్ ఫాల్స్ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో సీహెచ్ఓ సునీత, డీఈ రవీకిరణ్, ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
కమిషనర్, మాజీ కార్పొరేటర్ మధ్య వివాదం
కాకినాడ: నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి మధ్య చోటు చేసుకున్న సంవాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తన ఇంటి సమీపంలో గబ్బిలాలు తిరుగుతున్నాయంటూ ఫోన్ చేసిన మాజీ కార్పొరేటర్.. తనను దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించారని కమిషనర్ కె.రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ తనపై దాడి చేశారంటూ మాజీ కార్పొరేటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్‌కు చంద్రమౌళి ఫోన్ చేశారు. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గబ్బిలాలు తిరుగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్ అసహనంతో తనను, తన కుటుంబ సభ్యులను కించపరిచేలా దుర్భాషలాడరని కమిషనర్ చెబుతున్నారు. ఆ తరువాత కూడా రాత్రి పదేపదే చంద్రమౌళి తనకు ఫోన్లు చేశారని కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో మాజీ కార్పొరేటర్ ఇంటి వద్దకు కమిషనర్ రమేష్ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. తన ఇంటికి వచ్చిన కమిషనర్, దాడి చేసి కొట్టారంటూ చంద్రమౌళి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర ఎన్జీఓ సంఘ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కమిషనర్ రమేష్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైతే మున్సిపల్ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్నారని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాజీ కార్పొరేటర్ వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రమౌళి మాట్లాడుతూ తన ఇంటికి వచ్చి దాడి చేసి గాయపర్చిన కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జీజీహెచ్‌లో మాజీ కార్పొరేటర్‌ను ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ పరామర్శించారు. -
ఎక్కడికక్కడే అరెస్టులు!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచే నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు గురువారం పాఠశాలలకు వెళ్లి మరీ ఉపాధ్యాయ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను పెద్ద సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేశారు. టీచర్లకు సెలవులు ఇవ్వవద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇచ్చిన సెలవులను రద్దు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్మెంట్ – ఎస్ఏ 2) పరీక్షలు, ఈనెల 19వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తీవ్ర అనారోగ్యం వంటి అత్యవసర సమయాల్లో తప్ప టీచర్లకు సెలవులు ఇవ్వొద్దని విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తమ చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని ఐక్యవేదిక స్పష్టం చేసింది. వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలను మహిళలతో సహా అరెస్టు చేయడాన్ని ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. -
పెండింగ్ అంటే గిట్టదు!
వరంగల్ అర్బన్ : పెండింగ్ అంటే తనకు ఏ మాత్రం గిట్టదని.. నిబంధనల మేరకు పైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందేనని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో శనివారం ఆమె టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన భవన నిర్మాణాలు, ఫైళ్లు, అపార్టుమెంట్లు, ల్యాండ్ యూసేజ్, మార్టిగేజ్, అడ్వర్టజ్మెంట్ ఫీజుల తదితర అంశాలపై ఇన్చార్జ్ సీపీ నర్సింహ రా ములు, ఏసీపీలు గణపతి, ప్రకాశ్‌రెడ్డితో ఆరా తీశారు. పైళ్ల పరిష్కారానికి ఆన్లైన్ ఉపయోగిస్తున్నందున జాప్యం ఉండకూడదన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని, అనధికార భవనాల వివరాలను డివిజ న్ల వారీగా అందచేయాలన్నారు. ఏసీపీ సాంబయ్య, టీపీఎస్ బషీర్, టీపీబీఓలు పాల్గొన్నారు. తనిఖీలతో హల్చల్! కమిషనర్ పమేల సత్పతి తనిఖీలతో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శనివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుధ్ధ్యం పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని 40, 43 డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే, డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, నరేందర్‌ను కమిషనర్ మందలించారు. ఆర్అండ్బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ మిర్యాలాకర్ దేవేందర్ కమిషనర్ తనిఖీ చోటకు చేరుకొని పలుసమస్యలను వివరించారు. దీంతో శిథిలావస్థకు చేరిన చోట నూతన డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ సారంగంను కమిషనర్‌ను ఆదేశించారు. ఇక వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్‌ను కమిషనర్ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్లో పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్ సీహెచ్ఓ సునీతను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. డీఈలు సంతోష్‌కుమార్, రవికిరణ్ పాల్గొన్నారు. -
కమిషనర్‌కు పురుగుల అన్నం
కర్ణాటక, మైసూరు: పర్యాటక రాజధానిగా ప్రసిద్ధి చెందిన రాచనగరిలో కొందరి నిర్వాకం వల్ల చెడ్డపేరు వస్తోంది. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్ళిన మహా నగర పాలికే (కార్పొరేషన్) కమిషనర్‌కు హోటల్ సిబ్బంది పురుగుల అన్నం వడ్డించడంతో కంగుతిన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పరిశీలన జరిపి హోటల్ యజమానికి రూ.30 వేల జరిమానా విధించిన సంఘటన మైసూరు నగరంలో చోటు చెసుకుంది. కమిషనర్‌గీతా గురువారం మధ్యాహ్నం భోజనం చేయడానికి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆనందభవన హోటల్‌కు వెళ్లారు. ఆమె ఆర్డర్ ప్రకారం సిబ్బంది భోజనం తీసుకొచ్చారు. తినబోతుంటే.. ఆమె తినబోతూ చూస్తే భోజనంలో పురుగులు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన వచ్చి భోజనాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు తేల్చారు. హోటల్లో ఉన్న అపరిశుభ్రత, కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. -
మరో విడత రైతు భరోసా చెల్లింపులు: అరుణ కుమార్
సాక్షి, అమరావతి: ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా పధకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. వచ్చే రెండు బుధవారాల్లో లబ్ధిదారులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అరుణ కుమార్ స్పష్టం చేశారు. -
కర్నూలు కమిషనర్‌గా అభిషిక్తు కిషోర్
సాక్షి, కర్నూలు : నగర పాలక సంస్థ కమిషనర్‌గా మళ్లీ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. ముట్టింబాకు అభిషిక్తు కిషోర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం సాయంత్రం జీవో 1760 జారీ చేశారు. ప్రస్తుతం ఈయన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కాగా.. గత నెల 14న కర్నూలు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎస్. రవీంద్రబాబు 20 రోజుల వ్యవధిలోనే బదిలీ కావడం గమనార్హం. నగర పాలక సంస్థలకు కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే అభిషిక్తు కిషోర్‌ను ఇక్కడ నియమించింది. రవీంద్ర బాబు కన్నా ముందు ఐఏఎస్ అధికారి ప్రశాంతి ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన విషయం విదితమే. -
ఎస్సైపై గృహహింస కేసు నమోదు
సాక్షి, కృష్ణా : గుడివాడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తు ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వీఆర్‌లోకి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్పై అతని కోడలు గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమటలో నివాసం ఉండే శిరీషా, భాస్కర్‌కు 2013లో వివాహం అయింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద ఐదున్నర లక్షలు, 15 సవర్ల బంగారం, అర ఎకరం పొలంతో పాటు, అడపడుచు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చారు. తన బాబును చూడనివ్వటం లేదని, పైగా తన బ్యాంకు అకౌంట్నుంచి లోన్లు తీసుకుని, తనను వేధిస్తున్నారని శిరిషా విజయవాడలో ‘స్పందన’ కార్యక్రమంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ సూచన మేరకు గురువారం పటమట పోలీసులకు అమె ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్‌లో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు. సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
కార్పొరేటర్ల వినతులు పట్టించుకోని కమిషనర్
సాక్షి, అమరావతి బ్యూరో : నిన్న మొన్నటి వరకు కమీషన్ల పితలాటకంలో వీధిన పడ్డ పాలకపక్ష కార్పొరేటర్లతో పాటు నగర మేయర్‌కు వీఎంసీలో చుక్కెదురవుతోంది. అవినీతిపరులైన పాలకపక్ష కార్పొరేటర్ల వినతులను కమిషనర్ జె.నివాస్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం వారికి రుచించడం లేదు. దీంతో కమిషనర్ తీరుపై నిత్యం మంత్రులు, నగర అధికార పార్టీ నేతలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి పాత్రలో సూత్రధారులు పాలకపక్ష నేతలే కాదని, అధికారులూ ఉన్నారంటూ వారు పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. గతంలో అధికారుల అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చినా కమిషనర్ చర్యలు తీసుకోవడం లేదని, వారిని వెనకేసుకొస్తూ మమ్మల్ని మాత్రం పురుగుల్లా చూస్తున్నారంటూ భగ్గుమంటున్నారు. మావారిది సరే..మీవారి అవినీతిపై చర్యలేవీ?.. వీఎంసీలో ప్రజాధనం దోచుకుతింటున్న అధికారులపై కమిషనర్ కొరడా ఝుళిపించకపోవడంపై నగర మేయర్ భగ్గుమంటున్నారు. తమ కార్పొరేటర్లపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారి వినతులను పట్టించుకోని కమిషనర్, అధికారుల దందాలపై ఎందుకు స్పందించడం లేదంటూ పలుచోట్ల బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కుతున్నారు. వీఎంసీ ఇంటి దొంగల బండారం వెలుగులోకి తెచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా గత పుష్కరాల సందర్భంగా కొనుగోలు చేసిన పారిశుద్ధ్య పరికరాలు మాయం చేసిన విషయం నగర మేయర్ వెలుగులోకి తెచ్చారు. గత పుష్కరాల సమయంలో మొత్తం రూ.3.75 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేస్తే అందులో రూ.1.75 కోట్ల విలువైన పరికరాలను ఓ ఉన్నత స్థాయి అధికారి ఆధ్వర్యంలో మాయం చేసి సొమ్ము చేసుకున్న వైనంపై ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు కమిషనర్ త్రిసభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. అయితే అక్రమాలు జరిగి చాలా రోజులయినా కమిషనర్ దృష్టికి రాకపోవడం ఏమిటంటూ పాలకపక్షం మండిపడుతోంది. గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ, శాఖాపరమైన విచారణలు జరిగి నిగ్గుతేల్చినా కమిషనర్ వారిపై చర్యలకు సిఫార్సు చేయకపోవడం, గతంలో హౌసింగ్ విభాగంలో సీడీఓలు, ఏఈ స్థాయి అధికారి కుమ్మక్కై లబ్ధిదారుల వాటా నగదు రూ.35 లక్షలు స్వాహా చేసిన వ్యవహారంలో కూడా సరైన చర్యలు చేపట్టకపోవడం, పుష్కరాల సందర్భంగా వేసిన రోడ్లలో అవినీతి చోటుచేసుకుందని ఏసీబీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినా.. అనేక విషయాల్లో ఉద్యోగుల చేతివాటాపై కమిషనర్ స్పందించిన తీరు బాగాలేదని నగర మేయర్ శ్రీధర్ బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా హౌసింగ్‌లో జరిగిన అవినీతి వ్యవహారంపై మేయర్ బహిరంగ లేఖ రాయడం పెద్ద చర్చగా మారింది. గతంలో నగరంలో ఏర్పాటు చేసిన గ్రీనరీ ప్లాంటేషన్‌లో నిధులు గోల్మాల్ జరిగినా చర్యలు శూన్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో జరిగిన మంత్రి కార్యక్రమంలో కమిషనర్ వ్యవహార శైలిపై తనకున్న అక్కసునంతా వెళ్లగక్కడం కలకలం రేపింది. నలిగిపోతున్న అధికారులు.. వీఎంసీలో కమిషనర్ వర్సెస్ పాలకపక్షంగా మారడంతో అధికారలు, కింది స్థాయి ఉద్యోగులు నలిగిపోతున్నారు. వీఎంసీ బిగ్‌బాస్ కమిషనర్ చెప్పిందే అధికారులు చేస్తుండడంతో నగర మేయర్ వారిపై తరచూ మండిపడి బహిరంగంగానే తిట్ల దండకం అందుకుంటుండడంతో వారికి ఇబ్బందిగా మారుతోంది. ఇటీవల కేరళ వరద బాధితుల కోసం వీఎంసీ నుంచి పారిశుద్ధ్య పరికరాలు పంపించడం వివాదాస్పదంగా మారింది. తనకు తెలియకుండానే పరికరాలు ఎలా పంపిస్తారంటూ మేయర్ పబ్లిక్ హెల్త్ అధికారిపై మండిపడ్డారు. తనకేం తెలియదని.. కమిషనర్ ఆదేశాల మేరకే పంపించామని చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన సంఘటన కలకలం రేపింది. మేయర్ తరచూ కమిషనర్ అనుమతి లేకుండా శాఖాపరమైన సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం ఆయనకు నచ్చటం లేదు. ఇటీవల మేయర్ అధికారులతో సమీక్ష చేస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న కమిషనర్ తానే అధికారులతో సమీక్ష నిర్వహించడంపై మేయర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన కమిషనర్‌పై బహిరంగంగానే తిట్ల దండకం అందుకోవడం గమనార్హం. మంత్రి నారాయణ అండతో కమిషనర్ తమను పట్టించుకోవడం లేదని మేయర్ మండిపడుతున్నారు. మొత్తం మీద వీఎంసీలో ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానలా మారి అభివృద్ధికి ఆటంకంలా మారిందన్న విమర్శలున్నాయి. -
కొండూర్ శశాంక బదిలీ
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కొండూర్ శశాంక బదిలీ అయ్యారు. బుధవారం ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఇరవై నెలల పాటు ఇక్కడ సేవలందించిన శశాంక తన సహ జ స్వభావంతో ఐఏఎస్ మార్కు చూపారు. 2016 డిసెంబర్ 8న నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరపాలక సంస్థను అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేశారు. ముఖ్యంగా స్మార్ట్‌సిటీ సాధనలో కీలక పాత్ర పోషించారు. స్మార్ట్‌సిటీ రేసులో ఉన్నప్పుడు అధికారులను, పాలకులను, ప్రజలను పరుగులు పెట్టించారు. ఢిల్లీ స్థాయిలో స్మార్ట్‌సిటీ హోదా కోసం నిరంతరం శ్రమించారు. స్మార్ట్‌సిటీ పొందిన నగరాలను సందర్శిస్తూ ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించడంలో సఫలీకృతులయ్యారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ నేతృత్వంలో 2017 జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాను సాధించడంలో కీలక భూమిక పోషించారు. స్మార్ట్‌సిటీ హోదాను దక్కించుకోవడంలో ప్రణాళికాబద్ధంగా సమయస్ఫూర్తితో ముందుకెళ్లడంలో శశాంక చేసిన కృషిని ప్రజాప్రతినిధులు సైతం ప్రశంసించారు. ఐఏఎస్ అధికారిగా ఎవరూ పనిచేయనంత కాలం ఇక్కడి పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో.. దేశవాప్తంగా 4 వేల పైచిలుకు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనగా, కరీంనగర్ మెరుగైన ర్యాంకు సాధించడంలో శశాంక కీలక పాత్ర పోషించారు. కరీంనగర్లో శానిటేషన్ వ్యవస ్థను మెరుగపరచడంలోనూ, ఇంటింటి చెత్త సేకరణ, డంప్‌యార్డుకు చెత్తను తరలించడం, వీ ధుల్లో చెత్త కనిపించకుండా చేయడం, ఓడీఎఫ్ సాధించడంలో, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, వాటి నిర్వహణలో మెరుగైన సేవలందించడంతో దేశంలో 73వ ర్యాంకు సాధించాం. అప్పటికే స్మార్ట్‌సిటీ సాధించుకున్న నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ ర్యాంకు రావడంతో దేశం చూపు ఒక్కసారిగా కరీంనగర్‌పై పడింది. జీవన ప్రమాణాల్లో 11వ ర్యాంకు.. జీవన ప్రమాణాల అంశంపై దేశవ్యాప్తంగా 111 నగరాల్లో జరిగిన సర్వేలో కరీంనగర్‌కు 11వ ర్యాంకు రావడంలో కమిషనర్ పాత్ర ఎంతో ఉంది. ఈ అంశంపై పోటీ జరుగుతుందనే విషయం కూడా తెలియని నగరాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా పనులు చేస్తూ ప్రజల మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడంతోపాటు నివేదికను సిద్ధం చేసి సమర్పించడంలో విజయం సాధించారు. తెలంగాణలోనే మొదటి స్థానంలో కరీంనగర్ నిలువగా, ఇక్కడి నుంచి పోటీ పడ్డ హైదరాబాద్‌కు 23, వరంగల్‌కు 61వ ర్యాంకు రావడం గమనార్హం. హరిత అవార్డు.. కరీంనగర్లో హరితహారంలో నాటిన మొక్కలను కాపాడడంలో సక్సెస్ సాధించారు. గతేడాది నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలను కాపాడి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో హరిత నగరం అవార్డు కరీంనగర్‌కు దక్కేలా కృషి చేశారు. విద్యార్థులకు సమ్మర్‌క్యాంపులు.. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల కోసం రెండు దఫాలుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపుల్లో వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. వివిధ క్రీడాంశాల్లో నిర్వహించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017లో 1,300 మందికి, 2018లో 2,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో మెరుగైన పాత్ర పోషించారు. కలెక్టర్లుగా కమిషనర్లు.. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ముగ్గురు ఐఏఎస్‌లు పనిచేశారు. వీరంతా జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ చేసి తర్వాత కమిషనర్లుగా కరీంనగర్ వచ్చారు. మొదటి శ్రీకేష్‌లఠ్కర్ కమిషనర్‌గా రాగా.. ఆయన 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణభాస్కర్ జిల్లాల విభజనతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం పనిచేసిన శశాంక జోగులాంభగద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. మొత్తం మీద ఇద్దరు ఐఏఎస్‌లకు కరీంనగర్ కలిసివచ్చిందనే చెప్పవచ్చు. జేసీలుగా పనిచేయకుండానే డైరెక్ట్ కలెక్టర్లు కావడం గమనార్హం. -
దేవాదాయశాఖ కమిషనర్‌పై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : దేవాదాయశాఖ కమిషనర్ వైవీ అనురాధ, సహాయ కమిషనర్ పుష్పవర్ధన్‌తో సహా, మరొకరిపై విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దుర్గగుడిలో పనిచేసే వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కార్మికుడు పట్ల దురుద్దేశ పూర్వకంగా, నష్టం కలిగించే విధంగా వ్యవహరించటం మీద కోర్టు ఆదేశాల మేరకు అనురాధపై సెక్షన్ 166, 384, 425, 506, 120బీ, 34ఐపీసీ, 156(3), సీఆర్పీసీల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో వైవీ అనురాధ దుర్గగుడి ఈవోగా పనిచేశారు. -
కమిషనర్ కూతురినంటూ బెదిరింపులు
అల్లిపురం(విశాఖ దక్షిణ): కమిషనర్ కూతురిని అంటూ బ్యూటీ పార్లర్ నిర్వాహకులను బెదిరించి రూ.12వేలు ఖరీదు చేసే మేకప్ చేయించుకుని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన యువతికి నోటీసులు జారీ చేసిన మహారాణిపేట పోలీసులు, అందుకు ప్రోత్సహించిన యువకుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ ఎం.వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటకు చెందిన గంగులి కిరణ్‌కుమార్ బుధవారం నగరానికి చేరుకుని జగదాంబ కూడలిలో గల గ్రేస్ బ్యూటీ పార్లర్‌కు ఫోన్ చేశాడు. కమిషనర్ కుమార్తె ఒకరు మీ బ్యూటీపార్లర్‌కు వస్తున్నారని, ఆమెకు మేకప్ చేసి పంపించండి అని చెప్పాడు. అనంత రం ఆ యువకుడే ఓ యువతిని బ్యూటీ పార్లర్‌కు తీసుకొచ్చాడు. కమిషనర్ కుమార్తె అని భావించిన బ్యూటీ పార్లర్ సిబ్బంది మేకప్ చేసి రూ.12వేలు బిల్లు అయిందని చెప్పారు. దీంతో సదరు యువతి యువకుడి సాయంతో నిర్వాహకులను బెదిరించింది. తాను కమిషనర్ కుమార్తెను అని చెప్పి విజయనగరం ఎస్పీ ఫొటో చూపించి బిల్లు ఎగ్గొట్టేందుకు యత్నించింది. దీంతో బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు జీవీఆర్ రమాదేవి డయల్ 100కు ఫోన్ చేయటంతో మహారాణిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిం చారు. మోసానికి ప్రోత్సహించిన యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతికి నోటీసులు జారీ చేశామని సీఐ తెలిపారు. -
ఎన్నిసార్లు చెప్పాలి..?
విశాఖసిటీ: ప్రజలు ఇబ్బంది పడే చోట చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎన్నిసార్లు చెప్పాలి.? వర్షాకాలం వచ్చేస్తున్నా డ్రైనేజీ నిర్మాణం పూర్తికాకపోతే ఎలా? నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలంటూ జీవీఎంసీ కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’లో ఈనెల 31న ‘మురుగు కాల్వలో కాసుల వేట’ పేరుతో ప్రచురితమైన కథనంపై కమిషనర్ స్పందించారు. గురువారం ఉదయం కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి చేపట్టిన యూజీడీ కల్వర్టు పనుల్ని జూన్ నెలాఖరునాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తరచూ చెబుతున్నప్పటికీ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీచ్ సందర్శకులకు అసౌకర్యం కలగకుండా నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈలు వినయ్‌కుమార్, పల్లంరాజు, ఈఈలు గణేష్‌కుమార్, మహేష్, కేశవరెడ్డి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక టార్గెట్ కమిషనరే?
సాక్షి,అమరావతిబ్యూరో: ‘ఇక ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయి.. ఇంతవరకు నానా తిప్పలు పడి ఎంతో కొంత పోగేసుకున్నాం.. మళ్లీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టాలంటే మరికొంత పోగేయ్యాలి.. కమిషనర్ మాత్రం చెప్పిన పనులు చేయటం లేదు.. మంత్రి నారాయణ మాటకే ఆయన విలువనిస్తున్నాడు..ఎవరు చెప్పినా లైట్‌గా తీసుకుంటున్నాడు. ఆయన్ను మార్చకుంటే నగరపాలక సంస్థ మన గుప్పిట్లోకి రాదు.. సంపాదన ఉండదు.. పార్లమెంట్ ఇన్చార్జిగా చినబాబు ఉన్నాడు..ఆయన హవా ఉండాలంటే మనం చెప్పిన పనులకు చేవులూపాల్సిన వారైతేనే కరక్టు వెంటనే కమిషనర్‌ను మార్చేయండి.’ ఇదీ విజయవాడ నగరంలో పాలకపక్షంలోని ఓ వర్గం ప్రభుత్వ పెద్దల వద్ద తెస్తున్న ఒత్తిడి. ఇప్పటికే నగర పాలకసంస్థలో జరుగుతున్న పరిణామాలు, మేయర్ వ్యవహారంతోపాటు కమిషనర్ బదిలీ విషయంపై పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న వద్ద పలువురు కార్పొరేటర్లతోపాటు పార్టీ కీలక నేతలు అంతర్గత చర్చలు జరిపారు. మేయర్ వ్యవహారం సమసిపోయిన తరువాత కమిషనర్ బదిలీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా నిర్ణయించారు. ఇప్పటికే నారా లోకేష్ వద్ద కమిషనర్ వ్యవహారంపై పంచాయితీ పెట్టడంతో ఆయన కమిషనర్ బదిలీపై హామీ ఇచ్చినట్లు సమాచారం. అసలేం జరుగుతుందంటే.. నగర పాలక సంస్థ కమిషనర్‌గా జె.నివాస్ బాధ్యతలు చేపట్టిన నుంచి పాలకపక్ష కార్పొరేటర్ల అక్రమ దందా గురించి లోతుగా అధ్యయ నం చేశాడు. పేదల సొమ్ము పిండుకోవటమే కాకుండా బినామీల ద్వారా నగర పాలక సంస్థ ఆరగించడం, ప్రతి పనికి రేటు బట్టి వసూళ్లు చేయడం, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం.. అభివృద్ధి పనులను అడ్డుకోవడం లాంటి పనులు చేస్తున్న వైనం గుర్తించారు. వీరిని ప్రోత్సహిస్తే అవినీతి మరకలు అంటే అవకాశం ఉందని భావించిన కమిషనర్ పాలకపక్ష సభ్యులను లైట్‌గా తీసుకున్నాడు. వారు సూచించిన పనులను పక్కన పెడుతున్నాడు. డివిజన్లలో స్వ యంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆదాయం తగ్గిపోవడంతో పాలకపక్ష కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పిం చింది. కమిషనర్ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ మంత్రి నారాయణ అండదండలు కమిషనర్‌కు ఉండడంతో పాలకపక్ష సభ్యుల ఫిర్యాదును కూడా లైట్‌గా తీసుకున్నారు. తెరపైకి రంజిత్‌బాషా నగర పాలక సంస్థ కమిషనర్‌గా మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా పనిచేసే పి.రంజిత్ బాషాను పేరు తెరపైకి తెచ్చారు. డిప్యూటీ కలెక్టర్‌గా హోదాలో ఉన్న ఆయన రెండు రోజుల కిందటే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో ఆయన్ను నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నా యి. చినబాబు ఓఎస్డీగా పనిచేసే రంజీత్బాషాకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన్ను పంపించి తమ పనులు చక్కదిద్దుకోవా లనే ఆలోచనలో ఉన్నారు. మంత్రి నారాయణ హవా విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరపాలక సంస్థపై పెద్దగా దృష్టి సారించలేదు. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే కమిషనర్ల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత కార్పొరేటర్ల అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్న కమిషనర్‌కు పంపించి వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. మంత్రి నారాయణ హవా పెరిగితే నగరంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పరపతి తగ్గే అవకాశం ఉందని ఆయన అనుచరవర్గం భావిస్తుంది. నగర పాలక సంస్థలో జరిగే పరిణామాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయని వెంటనే చక్కదిద్దాలంటూ చినబాబు వద్ద పంచాయితీ పెట్టారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా విజయవాడ నగర పాలక సంస్థ కీలకమవుతుందని వెంటనే రంగంలోకి దింపి కార్పొరేటర్లుకు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకోవాలని ఆయన దృష్టిలో పెట్టారు. వారి వాదనకు ఏకీభవించిన చినబాబు త్వరలోనే మీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
పాలన గాడిన పడేనా..?
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్‌సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్‌గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్ నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్మెంట్లు, మోటేషన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్‌గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన సీట్లు కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్లో 15ఏళ్లుగా, మరో సెక్షన్లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే.. అధికారులపై చర్యలు లేవా..? నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. -
జీఎస్టీ కమిషనర్‌తో సహా, 8 మంది అరెస్ట్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్(జీఎస్టీ)కి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న వారే అవినీతి కోరల్లో కూరుకుపోతున్నారు. తాజాగా కాన్పూర్ జీఎస్టీ కమిషనర్ సన్సార్ సింగ్‌ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు సూపరిటెండెంట్లు, ఒక వ్యక్తిగత స్టాఫ్, ఐదుగురు ప్రైవేట్ అధికారులను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120(బీ), పీసీ యాక్ట్ సెక్షన్ 7, 11, 12 కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. 1986 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసు ఆఫీసర్ అయిన సన్సార్ సింగ్‌ను కాన్పూర్‌లోని జీఎస్టీ కమిషనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, కాన్పూర్‌లో అర్థరాత్రి చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా వీరిని అరెస్ట్‌చేశారు. సింగ్ భార్యపైన కూడా అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు. హవాలా ఛానల్స్ ద్వారా వ్యాపారస్తుల నుంచి సింగ్ నెలవారీ, వారం ఆధారంగా లంచాలు తీసుకుంటున్నారని సీబీఐ అధికారులు తెలిపారు. గత రాత్రి రూ.1.5 లక్షలను తీసుకుంటూ పట్టుబడినట్టు పేర్కొన్నారు. లంచం ఇస్తున్న వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. -
చుక్కేస్తేనే డ్రైవింగా? డిసెంబర్లోనే అధికం!
ఐటీ సిటీ డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో దూసుకుపోతోంది. సాయంత్రం కాగానే బార్లు, పబ్బులు కిటకిటలాడిపోతుండగా, చీకటిపడేకొద్దీ మందుబాబులు మత్తులో డ్రైవింగ్ చేస్తూ వారితో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీ రోడ్లపై మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి వాహనాలను నడుపుతూ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఇలా ఏకంగా గతేడాది 73,741 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసు విభాగం చరిత్రలో ఇదొక రికార్డు. 2016తో పోలిస్తే 25 శాతం అధికంగా కేసులు పెరిగాయి. పోలీసు శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా మందుబాబులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం, జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మందు తాగాక క్యాబ్‌లలో ఇంటికెళ్లాలని, డ్రైవర్ సహాయం తీసుకోవాలని పోలీసు శాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఆశ్చర్యకరంగా అధిక సంఖ్యలో స్కూల్ బస్సులు, అంబులెన్సుల డ్రైవర్లు సైతం మద్యం సేవించి పోలీసులకు దొరికిపోతున్నారు. డిసెంబర్లోనే అత్యధిక కేసులు... మూడేళ్లుగా డిసెంబర్ నెలలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్త సంవత్సరం ఊపుతో మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. 2017లో నమోదైన కేసుల్లో 10,517 ఒక్క డిసెంబర్ నెలలో నమోదైనవే. 2016, డిసెంబర్లో 6,666 మంది, 2015 డిసెంబర్లో 9,461 మంది పట్టుబడ్డారు. ఇక డిసెంబర్ 30వ తేదీన నమోదయ్యే కేసుల సంఖ్య మరొక ఎత్తు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఆ రోజు మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2016 డిసెంబర్ 30న 1,090 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2017 డిసెంబర్ 1,187 కేసులు రికార్డు చేశారు. కేసులు 2015 : 62,576 2016 : 59,028 2017 : 73,741 కఠిన శిక్షలు ఉంటేనే మార్పు బెంగళూరు అదనపు ట్రాఫిక్ కమిషనర్ ఆర్.హితేంద్ర మాట్లాడుతూ.. 2017లో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ‘ఇప్పటివరకు ఇదే అత్యధికం. తనిఖీలను విస్తృతంగా చేపట్టడం వల్ల ఇంత భారీ మొత్తంలో కేసులు వెలుగుచూశాయి. నిందితుల డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ రద్దు చేస్తేనే వారిలో పరివర్తన వచ్చే అవకాశముంది. పట్టుబడితే రూ. 2 వేల జరిమానా కట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మూడు నెలల తర్వాత తిరిగి లైసెన్స్ తెచ్చుకుంటున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తేనే మార్పు వస్తుంది’. -
ఏసీబీకి వలలో తంజావూరు కమిషనర్
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తంజావూరు కార్పొరేషన్ కమిషనర్ వరదరాజన్ ఏసీబీ వలలో చిక్కారు. తంజావూరుకు చెందిన సంబంధం అనే వ్యక్తి తనకున్న ఖాళీ స్థలానికి పన్ను విషయమై కార్పొరేషన్ వర్గాలను ఆశ్రయించాడు. అయితే పన్ను మరీ ఎక్కువగా ఉండటంతో వ్యవహారం కమిషనర్ వద్దకు చేరింది. కమిషనర్ సన్నిహితుడు నాగరాజన్ రంగంలోకి దిగి రూ.75 వేలు ఇస్తే అన్నీ సక్రమంగా సాగేలా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం ఉదయం ఏసీబీ వర్గాలు ఇచ్చిన నోట్లను తీసుకుని కమిషనర్‌ను కలిశాడు. నాగరాజన్‌తో కలిసి ఆయనకు రూ.75 వేలు అందించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కమిషనర్, అతడి సన్నిహితుడిని అరెస్టు చేశారు. -
కమిషనర్‌కు కోపం వచ్చింది
భీమవరం టౌన్: మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్‌నాయక్, ఐఏఎస్‌కు కోపం వచ్చింది. మత్స్యశాఖ నిద్రపోతుందా.. సమయపాలన తెలియదా.. ఇలాగేనా ఏర్పాట్లు చేసే ది.. అధికారులు డ్యాన్స్ చేస్తున్నారా అం టూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర ఫిషరీస్, ఆక్వాకల్చర్ చట్టం రూ పొందించడంలో భాగంగా భీమవరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉద యం 9 గంటలకు ఆక్వా టెక్నీషియన్లకు అవగాహనా సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథి కమిషనర్ రమాశంకర్‌నా యక్ నిర్ణీత సమయానికి వచ్చారు. ఆయన అధికారులతో కొంతసేపు వివిధ అంశాలపై చర్చించారు. అధికారులు ఉ న్నా పట్టుమని పది కుండా టెక్నీషియన్లు హాజరుకాలేదు. ఉదయం 10.30 గంటల వరకూ కమిషనర్ ఫైల్స్ చూసుకుంటూ గడిపారు. ఆ తర్వాత మరికొంత సమ యం అక్కడే కూర్చున్నారు. అప్పటికీ టెక్నీషియన్లు రాకపోవడంపై ఆగ్రహిం చారు. వెంటనే అక్కడి నుంచి వేగంగా ఆయన బయటకు వెళ్లిపోతుండటంతో మత్స్యశాఖ డీడీ కె.ఫణిప్రకాష్, రిటైర్డ్ డీడీ పి.రామ్మోహన్రావు తదితరులు సదస్సును మొదలుపెడదామని కోరారు. 10 మంది కూడా లేకుండా సదస్సు ఎలా ప్రా రంభిస్తారు.. ఇలాగేనా ఏర్పాట్లు చేసేది అంటూ.. కమిషనర్ కోపంతో మెట్లు దిగి వెళ్లిపోయారు. బయట గేటు వద్ద అధి కారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కమిషనర్ వారికి క్లాస్ తీసుకుంటూ రోడ్డుపైకి వచ్చేశారు. కోపంగా వచ్చి కారు ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత ఒక్కరొక్కరుగా టెక్నీషియన్లు రావడం, అ ధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు మ ధ్యాహ్నం 12.25 గంటలకు కమిషనర్ తిరిగి వచ్చి సదస్సును ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధికి ఆక్వా కీలకం ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఆదాయం రూ.లక్ష కోట్లు లక్ష్యంగా ముందుకు సాగాలని మ త్స్యశాఖ కమిషనర్ రమాశంకర్‌నాయక్ సూచించారు. భీమవరంలో ఆక్వా రంగ టెక్నీషియన్లతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కమిషనర్ రమాశంకర్‌నాయక్ మాట్లాడుతూ ఆం ధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతికి ఆక్వా రంగం కీలకంగా మారిందన్నారు. ఏటా దా దాపు రూ.50 వేల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వా రంగంలో ఆదాయ లక్ష్యం మరింత పెరగాలన్నారు. రా ష్ట్రంలో 1.86 లక్షల హెక్టార్లలో చేపలు, రొయ్యల సాగు ఉండగా దీనిలో 85 వేల హెక్టార్లలో రొయ్యల సాగు ఉందన్నారు. ఆక్వాను క్షేత్ర స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో 29 క్లస్టర్స్‌ను 104 సబ్‌క్లస్టర్స్‌గా విభజించామని చెప్పారు. కమిటీల ఏర్పాటు నాణ్యమైన సీడ్ కొరత, జీవ పరిరక్షణ పద్ధతులు పాటించకపోవడం, శాస్త్రీయ పద్ధతిలో యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం ఆక్వా రంగంలో సమస్యలుగా ఉన్నాయని ఆయన అన్నారు. యాంటీబయోటిక్స్ వాడకాన్ని నిరోధించేందుకు పర్యావరణ స్నేహపూర్వక ఆక్వా ఉత్పత్తుల సాధనకు, సాగును సుస్థిరం చేసి ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి కోల్పోకుండా జీఓ–2ను విడుదల చేశారన్నారు. ఆక్వాసాగును సుస్థిరం చేయడం, యాంటీబయోటిక్స్ నియంత్రణకు కమి టీలు ఏర్పాటుచేశామన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీలు విస్తృత తనిఖీలు చేస్తామని, యాంటీబయోటిక్స్ అవశేషా లు పరీక్షించే ల్యాబ్‌ల వివరాలు, టెక్నీషి యన్ల వివరాలు సేకరించి సమగ్ర నివేది కను అపెక్స్ కమిటీకి సమర్పిస్తామన్నారు. చతుర్ముఖ వ్యూహం అపెక్స్ కమిటీ నివేదిక సమర్పించిన త ర్వాత దానిని పరిశీలించి ఆక్వా రంగ అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం రూ పొందించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 200 ల్యాబ్‌లకు 140 ల్యాబ్‌లను రిజిస్ట్రేషన్ చేశామని కమిషనర్ చెప్పారు. మరో 60 ల్యాబ్‌లలో నైపుణ్యం గల టెక్నీషియన్లు, సదుపాయాలు లే వని, వాటిని సమకూర్చుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. కాకినాడలో ల్యాబ్ టెక్నీషియన్లకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిచేందుకు, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు యాప్‌ను ఏర్పాటు చేసుకుందామని కమిషనర్ సూచించారు. మత్స్యశాఖ డీడీ డాక్టర్ కె.ఫణిప్రకాష్ అధ్యక్షత వహించగా ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ డీడీ డా క్టర్ షెర్బీ, మత్స్యశాఖ రిటైర్డ్ డీడీ డాక్టర్ పి.రామ్మోహన్, ఆక్వా ల్యాబ్స్ ప్రతినిధి శ్రీనివాస్, మత్స్యశాఖ, ఎంపెడా అధికా రులు పాల్గొన్నారు. -
మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి
-
‘నాకు నీతులు చెప్పకు’
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్, కమిషనర్ మధ్య జరిగిన మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఇద్దరూ మహిళలు కావడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సాత్నా మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ మమతా పాండే, కమిషనర్ ప్రతిభా పాల్ పాల్గొన్నారు. ఈ సమయంలో మేయర్ మమతా పాండే ఇతరులతో మాట్లాడుతున్నారు. దీనిపై ఆగ్రహించిన కమిషనర్ ప్రతిభా పాల్.. ‘మేయర్ గారూ.. కాస్త క్రమశిక్షణ పాటించండి’ అంటూ చురకలు అంటించారు. కమిషనర్ తనను మందలించడంతో కోపం తెచ్చుకున్న మేయర్ మమతా పండే.. అంతే ఘాటుగా బదులిచ్చారు. నేను పోస్ట్ గ్యాడ్యుయేట్‌ని, ఎల్ఎల్బీ చదువుకున్నా.. నాకు నువ్వు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మమతా పాండే స్పష్టం చేశారు. అంతేకాక.. నీ హద్దుల్లో నువ్వు ఉండు.. అంటూ కమిషనర్ ప్రతిభకు చెప్పారు. వారిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలను అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
ఇల్లెందు కమిషనర్‌పై దాడి
ఖమ్మం ,ఇల్లెందు : అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్మికుల చేత తొలగింపజేసినందుకు ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. ఏకంగా భౌతిక దాడికి దిగారని కమిషనర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన ఉదయం 8 గంటల మధ్యలో జరగ్గా..సాయంత్రం దాకా..స్థానికంగా రాజకీయ దుమారం నెలకొంది. అసలేం జరిగిందంటే.. జిల్లా గ్రాంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఈ నెల 24వ తేదీన (ఆదివారం) టీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి తీసుకోలేదని కమిషనర్ తొలగించారు. ఈ ఘటనపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశ్నించగా..నిబంధనల ప్రకారం నడుచుకున్నానని వివరణ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. సింగరేణి ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ స్పీకర్ మహమూద్ అలీ ఇల్లెందు పర్యటనకు వస్తుండగా..ఆదివారం అర్ధరాత్రి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సోమవారం ఉదయం మున్సిపల్ కార్మికులు తొలగించడంతో గొడవ మొదలైంది. ఎవరు దాడి చేశారంటే.. కమిషనర్ రవిబాబు డీఎస్పీ కార్యాలయం వద్ద, పోలీస్ స్టేషన్లో, మున్సిపల్ చైర్పర్సన్ మడత రమా గృహంలో విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. తాను నివాసముండే సింగరేణి క్వార్టర్ ఎదుట కుమారుడిని ఎత్తుకుని ఉండగా సోమవారం ఉదయం 7 తర్వాత టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సిలివేరు సత్యనారాయణ, కౌన్సిలర్ జానీపాష, గ్రంథా లయ సంస్థ డైరెక్టర్ అక్కిరాజు గణేష్, ఎంపీటీసీ మండల రాము, మాజీ కౌన్సిలర్ మధారమ్మ ఒక్కసారిగా అక్కడికి వచ్చి తనపై దాడి చేశారని తెలిపారు. ఇంట్లోకి పరిగెత్తగా అక్కడకూ వచ్చి భార్య ముందు కొట్టారని చెప్పారు. దళితుడిననే ఇలా చేశారని, పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు డబ్బులు కూడా చెల్లించామని, అయినా ఎందుకు తొలగించారని అడిగే క్రమంలో వాగ్వాదం జరిగిందని, తాము దాడి చేయలేదని టీఆర్ఎస్ నేతలు జానీపాష, సిలివేరు సత్యనారాయణ తెలిపారు. బీజేపీ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. దాడిని ఖండించిన చైర్పర్సన్, కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై దాడి ఘట నను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మడత రమా, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యు లు మడత వెంకట్‌గౌడ్ ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు తర్వాత నేరుగా చైర్పర్సన్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలను కమిషనర్ ఆమెకు వివరించారు. మడత వెంకట్‌గౌడ్ జోక్యం చేసుకొని..ఈ సంఘటనలో ఎమ్మెల్యే జోక్యం లేదని, ఆయనను ఇందులోకి లాగొద్దని కమిషనర్‌కు సూచించారు. మద్దతుగా నిలిచిన విపక్ష నాయకులు.. మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై దాడిని నిరశిస్తూ వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కమిషనర్‌ను కలిసిన అఖిలపక్ష పార్టీల నేతలు పరుచూరి వెంకటేశ్వర్లు, ముద్రగఢ వంశీ, బానోతు హరిసింగ్‌నాయక్(టీడీపీ), జానీపాష, సుదర్శన్‌కోరీ(కాంగ్రెస్), కిరణ్(సీపీఎం), బంధం నాగయ్య(సీపీఐ), సంజయ్‌కుమార్(వైఎస్సార్సీపీ), తుపాకుల నాగేశ్వరరావు(ఎన్డీ) ఎల్.రవి(ఎన్డీ–2), మంతెన వసంతరావు(ఎమ్మార్పీఎస్) మద్దతు ప్రకటించారు. -
కావాలనే మేయర్‌ను పక్కన పెట్టారా..?
♦ శిలాఫలకాలపై పేర్లలో లేని ప్రొటోకాల్ ♦ ఆహ్వాన ప్రతంలో మాత్రం పాటించిన వైనం ♦ కమిషనర్‌పై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆగ్రహం ♦ ఆహ్వానం ఆలస్యంపై రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపాటు సాక్షి, రాజమహేంద్రవరం : నగరపాలక సంస్థలో పాలకమండలిని పక్కనపెట్టారా? ప్రొటోకాల్ పాటించడంలో మేయర్‌ను కావాలనే విస్మరించారా? అంటే అధికారుల చర్యలు అవుననే చెబుతున్నాయి. నగరపాలక సంస్థ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు ఆహ్వాన పత్రికలు, శిలాఫలకాలు వేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నూతన భవనం, అదే ప్రాంగణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం సందర్భంగా వేసిన శిలాఫలకాల్లో నగర ప్రథమ మహిళ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు తర్వాత కాక ఆరో పేరుగా పెట్టారు. సాధారణంగా ముఖ్యమంత్రి తర్వాత నగర ప్రథమ పౌరుడు/పౌరురాలి పేరు రాస్తారు. కానీ సీఎం పేరు తర్వాత ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండలి ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్చార్జి మంత్రి కిమిడి కళా వెంకటరావు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ పేరు ప్రస్తావించిన అనంతరం ఏడో పేరుగా మేయర్ పంతం రజనీ శేషసాయి పేరును ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో మాత్రం సీఎం చంద్రబాబు పేరు తర్వాత సభాధ్యక్షురాలిగా మేయర్ పేరును పెట్టారు. తాత్కాలికంగా వేసిన ఆహ్వాన పత్రికలో ప్రొటోకాల్ పాటించిన యంత్రాంగం శాశ్వతంగా ఉంటే శిలాఫలకాలపై మా త్రం పాటించకపోవడం కావాలనే మేయర్‌ను పక్కనపె ట్టారా? అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పాలనా వ్యవహారాల్లో మేయర్‌కు, కమిషనర్ కు మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఈ అనుమానా లకు బలం చేకూరుస్తున్నాయి. ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమిషనర్‌కు ఫోన్‌చేసి మండిపడినట్లు సమాచారం. మండలి ఇన్చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తనకు ఆహ్వానం ఆలస్యంగా కార్యక్రమం రోజున పంపారని ఎస్పీ కార్యాల యం వద్ద కమిషనర్ వి.విజయరామరాజును నిలదీశా రు. దీనిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని విలేకర్లకు తెలిపా రు. ఫ్లెక్సీలలో కూడా తన ఫొటో వేయకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. -
నమ్మకద్రోహం
► కమిషనరుపై బాధిత గ్రామాల ప్రజల మండిపాటు ► డంపింగ్ యార్డు సమస్య జఠిలం ► రోడ్డుపై బైఠాయించి నిరసన ► మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి రామాపురం(తిరుపతి రూరల్): ‘తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు...సమస్యను పరిష్కారించాల్సింది పోయి బాధిత గ్రామ ప్రజలను రెచ్చగొడుతున్నారు...అధికారులు, ఎంపీ వచ్చి సమస్య పరిష్కరిస్తామని 22 వరకు సమయం తీసుకుని వెళ్లారు...కానీ కమిషనర్, ఎంపీ నమ్మించి మోసం చేశారు... గ్రామస్తుల ప్రమేయం లేకుండా తిరుపతిలో మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్లకు బొమ్మలు చూపించి సమస్య పరిష్కారమైందని ప్రకటిం చడం 14 బాధిత గ్రామాలను మోసగించడమే’నని డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు దుయ్యబట్టారు. తిరుపతి కమిషనర్ హరికిరణ్, ఎంపీ శివప్రసాద్ తీరుపై మండిపడ్డారు. బాధితులను విస్మరించి అఖిలపక్షం మీటింగంటూ మోసగించారని విమర్శలు గుప్పించారు. కమిషనర్ తీరుకు నిరసనగా చెత్త లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్న డంపింగ్‌యార్డు బాధిత గ్రామస్తులకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. గ్రామస్తులతో పాటు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. సాయంత్రం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆందోళన చేస్తున్న ప్రజల వద్దకు వచ్చారు. వారికి మద్దతు ప్రకటించారు. డంపింగ్ యార్డును పరిశీ లించారు. ఎంపీని నమ్మి మోసపోయాం.. గ్రామస్తులు, ఎమ్మెల్యే ఆందోళనతో ఎంపీ డాక్టర్ శివప్రసాద్ రెండు రోజుల క్రితం రామాపురం వచ్చారు. ప్రత్యామ్నాయ స్థలం చూసుకునేందుకు 22 వరకు సమయం ఇవ్వాలని, ఈ నెల 22వ తేదీన వస్తున్న ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని చెవిరెడ్డిని, గ్రామస్తులను ఎంపీ కోరారు. యార్డు తరలించేవరకు ఆందోళన విరమించేది లేదని ఎంపీకి గ్రామస్తులు తేల్చి చెప్పారు. చెవిరెడ్డి చొరవ తీసుకుని, ఎంపీపై నమ్మకం ఉంచుదామని.. గడువు ఇద్దామని గ్రామస్తులను ఒప్పించారు. చెత్త తరలింపునకు అంగీకరించారు. రెండు రోజులకే ఎంపీ మాట మార్చడంపై వారు మండిపడుతున్నారు. కమిషనర్ ప్రకటనను ఎంపీ ఖండించకపోవడంతో ఇద్దరు కలిసి మోసగించారని వారు ఆరోపిస్తున్నారు. కాగా చెత్త తరలిస్తే అంగీరించేది లేదని బాధిత గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. కమిషనర్ తీరుతో జఠిలం.. డంపింగ్ యార్డు సమస్యపై తిరుపతి కమిషనర్ హరికిరణ్ మండలంలోని ఇద్దరు కాంట్రాక్టర్లను పిలిచి సోమవారం తుడా కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే చెవిరెడ్డి, బాధిత గ్రామలవారిని పిలవలేదు. సమావేశానంతరం ‘చెత్త సమస్య పరిష్క రం అయిందని, చెత్తను తరలించేం దుకు గ్రామస్తులు అంగీకరించారని కమిషనర్ ప్రకటించారు. మీడియాలో కమిషనర్ ప్రకటన చూసిన బాధిత 14 గ్రామాల ప్రజలు మండిపడ్డారు. ఎంపీ అనుమతి లేకుండ కమీషనర్ ఈ ప్రకటనను చేయరని, ఇద్దరు కలిసి బాధిత గ్రామ ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీని కమిషనర్ పావుగా వాడుకుని చెత్తను మా నెత్తిన వేస్తున్నారని వాపోయారు. కావాలనే రెచ్చగొడుతున్నారని, సమస్య పరిష్కారం కావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. బాధిత ప్రజలు ఏకమై మంగళవారం రామాపురం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ధర్నా చేపట్టారు. చెత్త లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఓ చెత్త ట్రాక్టర్‌లోని చెత్తను రోడ్డుపైనే డంప్ చేయించి పరిశీలించారు. అండగావుంటా.. 14 గ్రామాల ప్రజలకు ఆందోళనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు. రాస్తారోకో, ధర్నాలో ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారితోనే రోడ్డుపైనే బైఠాయించి వారికి భరోసా కల్పిం చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. -
గుత్తిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు
– ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జెండా కాలనీవాసులు – కమిషనర్, చైర్ పర్సన్లపై ఎమ్మెల్యే ఆగ్రహం గుత్తి : రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేందర్ గౌడ్‌కు కాలనీవాసుల నుంచి చుక్కెదురైంది. పట్టణంలోని జెండావీధిలో నాగరాజు స్టోర్ వద్ద మంగళవారం చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రంజాన్ తోఫాను ముస్లింలకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమం ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా జెండా వీధి కాలనీవాసులు స్టేజి వద్దకు దూసుకెళ్లారు. రంజాన్ తోఫా సంగతి పక్కన బెట్టండి ముందు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వినలేదు. గత 15 రోజులుగా కాలనీకి నీళ్లు వదలలేదన్నారు. ఈ రోజు మీరు వస్తున్నారనే కారణంతో హడావుడిగా నీళ్లు వదిలారన్నారని ఆగ్రహించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్, చైర్ పర్సన్ తులశమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మీకు చేత కాకపోతే నాకు చెప్పండి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ జనాలు శాంతించకపోయే సరికి చేసేది లేక కోపంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నగరపాలక పంచాయతీ
ముదిరిపాకాన పడిన కమిషనర్, మేయర్ విభేదాలు గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్లు కార్యదర్శి కార్యాలయంలో రికార్డుల పరిశీలన నకళ్లు వెంటబెట్టుకు వెళ్లిన వైనం వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం పాలన గాడితప్పడంతోనే ప్రభుత్వం దృష్టికి.. సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మేయర్ పంతం రజనీశేషసా యి, కమిషనర్ వి.విజయరామరాజుల మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు పరచడంలో ఒకరి కొకరు పంతాలకు పోవడంతో కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ తీర్మానాలు కొన్ని పెండిం గ్లో పడిపోతున్నాయి. నగరపాలన కుంటుపడుతుండడంతో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్యమంత్రికి, మున్సి పల్ పరిపాలన సంచాలకులకు ఫిర్యా దు చేశారు. దీంతో సోమవారం మున్సిపల్ సంచాలకులు కన్నబాబు ఆదేశాల మేరకు గుంటూరు నుంచి సహాయ సంచాలకులు టీఎస్ఎస్ఎ¯ŒSజీ శ్రీనివాస్, పి.రాఘునాథ్రెడ్డిలు రాజమహేంద్రవరం వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థ కార్యదర్శి శైలజావల్లి కార్యాలయంలో కౌన్సిల్, స్థాయీ సంఘం తీర్మానాలు, ఇతర రికార్డులు పరిశీలించారు. వాటి నకళ్లను తమ వెంటబెట్టుకు వెళ్లారు. తాము గమనించిన విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సహాయ సంచాలకులు శ్రీనివాస్, రాఘునాథ్‌రెడ్డి తెలిపారు. అంత్య పుష్కరాల నుంచి విభేదాలు మొదలు తనకు తెలియకుండానే స్టాండింగ్ కమిటీ , కౌన్సిల్ సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతున్నారంటూ గతంలో మేయర్ పంతం రజనీశేషసాయి విలేకర్ల సమావేశంలో కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. నగరపాలక సంస్థలో తనకు తెలియకుండానే పాలన జరిగిపోతోందని, ఇలా అయితే ఇక పాలక మండలి, మేయర్ ఎందుకని ఘాటుగా స్పందించారు. అధికార యంత్రాంగమే పాలన చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. అదే సమయంలో తన పరిధి మేరకే తాను పని చేస్తున్నానని, తనకు ఉన్న అధికారం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నానని కమిషనర్ వి.విజయ రామరాజు పేర్కొన్నారు. మేయర్, కమిషనర్ల మధ్య గోదావరి అంత్య పుష్కరాల నుంచి పాలన, నిర్ణయాలలో ప్రారంభమైన మనస్పర్థలు ‘హ్యాపీ సండే’ కార్యక్రమంతో మరింత ముదిరాయి. ‘తనకు తెలియకుండానే కౌన్సిల్, స్థాయీ సంఘం సమావేశం అజెండాలోకి అంశాలు చేర్చుతుండడంతో వాటిని తోసిపుచ్చుతున్నారు. వాటిని తరువాత సమావేశంలో అనుమతి కోసం యంత్రాంగం చేర్చుతోంది. నగరపాలక సంస్థలో ఇతర కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికిలాగే వాచ్మెన్ల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని మేయర్ రజనీశేష సాయి కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే ఆ విషయం బుట్టదాఖలైంది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాలక మండలి నిర్ణయం లేకుండానే మున్సిపల్ పాఠశాలలోని స్వీపర్లకు జీతాలు పెంచి ఇస్తున్నారని, అలాంటప్పుడు ఇక కౌన్సిల్ ఆమోదం ఎందుకని డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలతో మరోసారి... ఇక తన వ్యక్తిగత కంప్యూటర్ ఆపరేటర్ విషయంలో మేయర్‌కు కమిషనర్‌కు మధ్య ఉన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించకపోవడంతో మేయర్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఆపరేటర్ల జీతాలు విడుదల తీర్మానాన్ని పక్కనబెట్టారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన జరిగిన బడ్జెట్ సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. జీతాలు ఆపవద్దని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో వారు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం... గత కొన్ని నెలలుగా నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు విలేకర్ల సమావేశం నిర్వహిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పాలక మండలి తీరును ఎండగట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నేత మేడపాటి షర్మిలారెడ్డి నగరపాలక సంస్థలో జరుగుతున్న విషయాలను ముఖ్య మంత్రి చంద్రబాబుకు, మున్సిపల్ పరిపాలన సంచా లకులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నుంచి వచ్చిన మున్సిపల్ పరిపాలన సహాయ సంచాలకులు సోమవారం నగరపాలక సంస్థలో రికార్డులు పరిశీలించి, నకళ్లు తమవెంటబెట్టుకు వెళ్లారు. -
ఆ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని కోరారు
-
సీఎం పంచాయితీ చేయడం ఏంటి...చట్టం లేదా ?
-
హోలీ వేడుకల్లో కలెక్టర్, కమిషనర్
కరీంనగర్: హోలీ వేడుకలు కరీంనగర్లో కన్నుల పండుగలా జరిగాయి. స్త్రీ పురుష వయోభేదం లేకుండా రంగుల్లో మునిగితేలారు. పరస్పరం రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో సీపీ కమలాసన్ రెడ్డి పోలీస్ లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొని రంగుల్లో మునిగి తేలారు. -
మొగుడు, పెళ్లాం కొట్లాట లాంటిది
– గుంతకల్లు మునిసిపల్ చైర్పర్సన్, కమిషనర్ వివాదంపై ఎంపీ జేసీ వ్యాఖ్య గుంతకల్లు టౌన్ : ‘మొగుడు, పెళ్లాం కొట్లాటలో ఎవరైనా పంచాయితీ చేస్తారేమయ్యా?! ఇది కూడా అలాంటిదే. కొట్లాట వచ్చిన దానికి కారణం లేదు. పోయేదానికీ మన ప్రమేయం అవసరం లేద’ని గుంతకల్లు మునిసిపల్ చైర్పర్సన్, కమిషనర్ల మధ్య వివాదంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన మునిసిపల్ చైర్పర్సన్ చాంబర్లో చైర్పర్సన్ అపర్ణ, కమిషనర్ సత్యనారాయణ మధ్య తలెత్తిన వివాదంపై పంచాయితీ చేశారు. సర్దుకుపోవాలని ఇద్దరికీ సూచించారు.స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా హాజరయ్యారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. -
28న ఐటీ ప్రిన్సిపల్ కమిషనర్ కర్నూలు రాక
కర్నూలు(రాజ్‌విహార్) : ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.జగదీష్ బాబు ఈనెల 28వ తేదీన కర్నూలుకు రానున్నట్లు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ పి.సత్యప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్య, వ్యాపారవేత్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్, ట్యాక్స్ బార్, పరిశ్రమల పారిశ్రామికవేత్తలతో అశోక్‌నగర్‌లో నిర్వహించే సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొంటారన్నారు. -
గుంతకల్లు కమిషనర్ పై దాడి కేసు
-
అత్యున్నత పదవి చేపట్టిన తొలి మహిళ
లండన్: బ్రిటన్ హొం సెక్రటరీ అంబర్ రుడ్ స్కాట్లాండ్ యార్డ్‌కు మహిళ పోలీస్ ఆఫీసర్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టునుందన్నారని మీడియా రిపోర్టర్స్ చెప్పారు. క్రిసీడ డిక్ అత్యున్నతమైన పదవికి ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ పదవి చెపట్టడం 187 సంవత్సరాల లండన్ చరిత్రలోనే మొదటిసారి. బ్రిటన్‌లోనే అతిపెద్ద పోలీస్ పోర్స్‌ను ఒక మహిళ కంట్రోల్ చేయనుంది. 43,000 మంది ఉద్యోగులు, ఏడాదికి బడ్జెట్ 3 బిలియన్ పౌండ్స్ కేటాయించే పోలీస్ ఫోర్స్‌ను మహిళ నడపనుందని రుడ్ తెలిపారు. బ్రిటన్ రాణి ఏలిజబెత్ 2 డిక్‌ను ఈ పదవికి ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా రుడ్ మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న మోసాలను, సైబర్ క్రైంను కంట్రోల్ చేయడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మాట్లాడుతూ 187 సంవత్సరాల లండన్ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళ డిక్ అని పేర్కొన్నారు. ఈ భూమి మీదనే అత్యంత శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ అని కొనియాడారు. ఆమె అనుభవాన్ని,సామర్థ్యాన్ని ముందు ప్రదర్శిస్తారని మేయర్ అన్నారు. -
నేడు స్టాడింగ్ కమిటీ సమావేశం
అనంతపురం న్యూసిటీ : నగర పాలక సంస్థలో స్టాడింగ్ కమిటీ సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు కమిషనర్ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టాడింగ్ కమిటీ సమావేశంలో ఈ ఏడాది బడ్జెట్‌ను ఆమోదిస్తునట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బడ్జెట్ అజెండా అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) అనుమతి కోరామన్నారు. ఆయన సమావేశాన్ని చిత్రీకరించాలని ఆదేశించడంతో సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నామన్నారు. -
పనితీరు మెరుగుపరుచుకోండి
సాక్షి, హైదరాబాద్: పనితీరు మెరుగుపరు చుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణ, నేరస్థులపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ అనురాగ్‌శర్మ సూచించారు. బడ్జెట్ సమీక్ష సందర్భంగా మంగళవారం రాష్ట్ర పోలీ స్ ముఖ్యకార్యాలయంలో సుదీర్ఘ భేటీ జరిగిం ది. బడ్జెట్‌పై అధికారులతో 3 గంటల పాటు చర్చించారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎస్పీలు, కమిషనర్లపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఇద్దరు ఎస్పీల బదిలీ వేటు నేపథ్యంలో పని తీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల్లో చేప ట్టాల్సిన పలు నిర్మాణాలపై ఎస్పీలు ప్రతిపా దనలు సమర్పించారు. సీసీ కెమెరాల, కమాం డ్ కంట్రోల్ సెంటర్లు, టెక్నాలజీ వినియోగం తదితరాలకు రూ.5,038 కోట్లు అవసరమని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. ప్రతిపాదనలను 2 రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. -
27న ఎండోమెంట్ ట్రిబ్యునల్
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టును ఈనెల 27 ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహిస్తామని ఆ శాఖ సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్యతిథిగా విచ్చేస్తారన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములు, అర్చకులు, అధికారుల సమస్యలపై విచారణ జరుగుతుందన్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలోని కక్షిదారులు హాజరై సమస్యలు కోర్టు దృష్టికి తేవాలని కోరారు. -
సమస్య మొదటికి ..
స్పష్టతలేని కమిషనర్ ఉత్తర్వులు ఎటూ తేలని డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీ కమిషనర్‌కు డీఈఓ లేఖ అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖలో డిప్యూటీ డీఈఓ పోస్టుల (ఎఫ్ఏసీ) భర్తీ చేసే అంశంపై ఏర్పడిన వివాదం మళ్లీ మొదటకొచ్చింది. ఇప్పటికే డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీలో తమకే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు ఓవైపు, జిల్లా పరిషత్ పాఠశాలల హెచ్ఎంల మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో సీనియర్ హెచ్ఎం, ఎంఈఓలతో పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో డీఈఓ ఇరకాటంలో పడ్డారు. ఆరు డీప్యూటీ డీఈఓ పోస్టులు జిల్లాలో ఆరు డెప్యూటీ డీఈఓ పోస్టులు ఉన్నాయి. అనంతపురం, ధర్మవరం, గుత్తి, పెనుకొండ డివిజన్లతో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ, జిల్లా పరిషత్‌లో పీఈఓ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురం డివిజన్ డీఈఓ, గుత్తి డివిజన్ ఏడీ–1 ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక పెనుకొండ డివిజన్‌కు డైట్ అధ్యాపకులు సుబ్బారావు ఉన్నారు. ధర్మవరం, ఆర్‌ఎంఎస్‌ఏ, జిల్లా పరిషత్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత ఉత్తర్వులతో అన్నిచోట్ల హెచ్ఎంలను నియమించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం తమకే అవకాశం ఇప్పటిదాకా డీప్యూటీ డీఈఓ పోస్టులను ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతోనే భర్తీ చేశారు. ఉమ్మడి సర్వీస్ (ప్రభుత్వ, జిల్లా పరిషత్)ను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన లేదంటున్నారు ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు. కొన్ని జిల్లాల్లో పరిషత్ పాఠశాలల హెచ్ఎంలకు అవకాశం ఇచ్చారని, అదే తరహా ఇక్కడ కూడా వారితో పాటు తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. తమకు అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయిస్తామంని రెండు వర్గాలూ చెబుతున్నాయి. దీంతో భర్తీ ప్రక్రియను డీఈఓ తాత్కాలికంగా నిలిపివేశారు. సుబ్బారావు ఇక డైట్ కళాశాలకు..! పెనుకొండ డిప్యూటీ డీఈగా పని చేస్తున్న డైట్ అధ్యాపకులు çసుబ్బారావు ఇక డైట్ కళాశాల అధ్యాపకుడిగానే కొనసాగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్చార్జ్ డెప్యూటీ డీఈఓలుగా కొనసాగుతున్న డైట్ అధ్యాపకులను ఆ బాధ్యతల నుంచి వెంటనే తప్పించాలంటూ కమిషర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇందుకు సబంధించిన ఫైలు కూడా సిద్ధం చేశారు. కమిషనర్ నుంచి స్పష్టత రాగానే అమలు చేస్తారు. ఉత్తర్వుల్లో స్పష్టత లేదు.. : శామ్యూల్, డీఈఓ డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే సీనియర్ హెచ్ఎంలు, ఎంఈఓలతో నియమించాలంటూ కమిషనర్ నుంచి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. ఉత్తర్వులో స్పష్టత లేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు తమను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల హెచ్ఎంలు ఉమ్మడి సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.దీనిపై కమిషనర్‌కు లేఖ రాశాం. సమాధానం రాగానే పోస్టులు భర్తీ చేస్తాం. -
రామహనుమాన్ ఆలయం దేవాదాయశాఖ స్వాధీనం
కర్నూలు(న్యూసిటీ): బళ్లారి చౌరస్తాలోని రామాంజనేయ స్వామి ఆలయాన్ని శనివారం దేవాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. ఆ శాఖ ఉపకమిషనర్ బి.గాయత్రీదేవి ఆదేశాలనుసారం కర్నూలు గ్రూపు1 దేవాలయాల కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో ఉన్న మూడు హుండీలను సీజ్ చేశారు. కార్యక్రమంలో అర్చకులు మారుతీ శర్మ, దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారులు అనుమంతరావు, దినేష్, చంద్రశేఖరరెడ్డి, సుబ్రమణ్యంనాయుడు, కల్లూరు ప్రసాద్, వరదరాజులు పాల్గొన్నారు. -
జీవో 279ని రద్దు చేయండి
– కమిషనర్‌కు విన్నవించిన ఐఎన్టియుసి నాయకులు కర్నూలు (టౌన్): జీవో 279ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వై.వి. రమణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికుల సమ్మెకాలపు వేతనాన్ని మంజూరు చేయాలన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇఎస్ఐ చెల్లించాలన్నారు. కార్మికులకు యూనిఫామ్స్, చెప్పులు, నూనె, ఆఫ్రాన్స్ ఇవ్వాలన్నారు. టైమ్ స్కేల్ వర్కర్స్ అందరికీ పీఆర్సీ వెంటనే ఇవ్వాలన్నారు. -
మనస్పర్థలు...అభివృద్ధిపై నీలినీడలు
నగరపాలక సంస్థలో అంతర్యుద్ధం మేయర్, కమిషనర్ మధ్య సమన్వయలోపం మేయర్ అనుమతికి విరుద్ధంగా ఎజెండాలోకి అంశాలు స్థాయీ సంఘం సమావేశంలో మరోసారి బయటపడిన విభేదాలు సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కమిషనర్ వి.విజయ రామరాజు, మేయర్ పంతం రజనీ శేషసాయిల మధ్య సమన్వయ లోపం నగర అభివృద్ధికి శాపంగా మారింది. కలిసి పని చేయాల్సిన మేయర్, కమిషనర్ ఎవరి దారి వారిదన్నట్లుగా కొద్ది నెలలుగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిల్లో ఆమోదం పాందిన పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారంటే నగర అభివృద్ధిపై ఏ మేరకు నీలినీడలు కమ్ముకుంటున్నాయో బయటపడుతోంది. మూడు నెలలకోసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకుంటారు. మిగిలిన రోజుల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రతి వారం మేయర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో స్థాయీ సంఘం సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాల్లో తీసుకున్న పలు ప్రతిపాదనలు, తీర్మానాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించి సభ్యుల ఆమోద ముద్రతో పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి భిన్నంగా నిప్పూ, ఉప్పుగా కమిషనర్, మేయర్ ఉండడంతో వారం వారం జరగాల్సిన స్థాయీ సంఘం సమావేశం కూడా జరగడం లేదు. దీంతో ప్రగతి పడకేస్తోంది. మరోసారి విభేదాలుబట్టబయలు... తాజాగా సోమవారం జరిగిన స్థాయీ సంఘం సమావేశం వాయిదా పడడం మరోసారి మేయర్, కమిషనర్ మధ్య జరుగుతున్న వర్గపోరును బహిర్గతం చేసింది. గత నెల 25న 16 అంశాలతో రూపొందించిన ఎజెండాను నగరపాలక సంస్థ సెక్రటరీ మేయర్ అనుమతి కోసం పంపారు. అదే నెల 28న సమావేశం నిర్వహించాలని మేయర్ నిర్ణయించారు. అనంతరం సెక్రటరీ సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి కమిషనర్ ఆదేశాలతో మరో తొమ్మిది అంశాలు ఉన్నాయంటూ 28న మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటికే నిర్ణయించిన ప్రకారం 16 అంశాలతో నవంబర్ 7న స్థాయీ సంఘం సమావేశం నిర్వíßంచాలని మేయర్ ఇన్ చార్జ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అధికారికి సూచించారు. అయితే సోమవారం 25 అంశాలతో కూడిన ఎజెండా స్థాయీ సంఘం సమావేశం ముందుకు వచ్చింది. తన నిర్ణయానికి వ్యతిరేకంగా 25 అంశాలతో ఎజెండా పెట్టడడంతో మేయర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే సమావేశాన్ని మేయర్ వాయిదా వేయడాన్ని అధికార పార్టీకి చెందిన సంఘ సభ్యులు వ్యతిరేకిస్తూ ఇన్ చార్జి సెక్రటరీకి లేఖ రాశారు. చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోయినప్పటికీ సభ్యులు లేఖ రాయడం గమనార్హం. ఈ ఘటనతో మేయర్, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉన్న లుకలుకలు మరింత ముదిరి పాకానపడ్డట్టయింది. -
మహానందిలో అంతే !
- నిబంధనలు, ఆచారాలు పట్టవు - నిత్యం ఉత్తర ద్వారా దర్శనం - ధ్వజస్తంభ దర్శనం కరువు - ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం - ఆదాయం కోసం ప్రైవేటు టెండర్లపై ఆసక్తి - నేడు క్షేత్రానికి దేవాదాయ కమిషనర్ రాక మహానంది: మహానంది క్షేత్రంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మహానందీశ్వరుడు దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి వారిని దోపిడీకి గురి చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ కలిగిన ఈ క్షేత్రానికి ప్రస్తుతం ప్రతి ఏడాది రూ. 15కోట్ల ఆదాయం వస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ ఆదాయం చాలదన్నట్లు మహానందిలో ఉన్న వివిధ విభాగాలను ప్రైవేటు పరం చేస్తూ భక్తులకు తీవ్ర అసౌకర్యాలు కలిగిస్తున్నారు.అంతేకాకుండా నియమ నిబంధనలు, సంప్రదాయాలను విస్మరిస్తున్నారు. దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ ఆదివారం సాయంత్రం మహానందికి వస్తున్న నేపథ్యంలో క్షేత్రంలోని సమస్యలు పరిష్కరిస్తారని పలువురు ఆశిస్తున్నారు. సమస్యలు ఇవి మహానంది క్షేత్రంలో ఉచిత దర్శనం కల్పించాలని ఇటీవల ఆర్జేసీ భ్రమరాంబ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. కానీ నామమాత్రంగా అమలవుతుంది. ఆలయ రాజగోపురం దాటి వెళ్లిన తర్వాత ముఖద్వారం వద్ద కేవలం ఒక్కబోర్డు మాత్రమే ఉచితదర్శనం అని ఉంచారు. మహానందికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలసంఖ్యలో వస్తుంటారు. వారి భాషలను అనుగుణంగా ఎక్కడా ఒక్కబోర్డు కూడా లేదు. ఆలయానికి ధ్వజం ఆత్మసమానమైనది అంటారు. అయితే మహానందీశ్వరుడి భక్తులకు «ధ్వజ స్తంభ దర్శనం కరువైంది. అలాగే ఏడాదికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఎక్కడైనా ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. కానీ ఇక్కడ నిరంతరంగా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం ఆశ్చర్యం. మహానందీశ్వరుడికి నిత్యం జరగాల్సిన శాస్త్రోక్తమైన పూజలు సక్రమంగా జరగడం లేదు. భగవంతుడికి వేకువజామున, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమర్పించే నివేదన ఎంతో పవిత్రమైన కార్యం. సధ్బ్రాహ్మణుడు మాత్రమే మడికట్టుకుని స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించాలి. కానీ మహానందిలో మాత్రం సాధారణ పరిచారకులతో నివేదన సమర్పిస్తున్నారు. వీఐపీలు వచ్చినప్పుడు భాజాభజంత్రీలు పూర్తి స్థాయిలో ఉంటారు. నివేదన, మిగతా సమయాల్లో ఒకరిద్దరు మాత్రమే అందుబాటులో ఉంటారు. క్షేత్రంలో రెగ్యులర్ సిబ్బందికి మినహా మిగిలిన వారికి డ్రెస్‌కోడ్ లేదు. దీంతో భక్తులు సిబ్బందిని గుర్తించడం కష్టమవుతుంది. పలు పర్యాయాలు ఘర్షణలు సైతం జరిగాయి. ఏజెన్సీ, పారిశుధ్య విభాగం, ఔట్సోర్సింగ్ సిబ్బందికి డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పడితరం దిట్టానికి అనుగుణంగా లడ్డూలు, పులిహోర తయారు చేయాల్సి ఉండగా నాణ్యతలోపంతో తయారు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వీరికి ప్రతినెలా మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లడ్డూ ఉండాల్సిన పరిమాణం కంటే తక్కువగా ఉంటోంది. ప్రసాదాల తయారీని ఏళ్లతరబడి ఒకరికే అప్పగిస్తున్నారు. -
నెలాఖరులోగా సర్వే పూర్తి చేయండి
– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీసీఎల్ఎ ఆదేశం – 1, 2 తేదీల్లో సాధికార సర్వే మేళా నిర్వహించాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వేను నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్రపునీత్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సర్వేలో కొన్ని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయని పేర్కొన్న ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించి నెలాఖరు నాటినికి పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో సాధికార సర్వే మేళా నిర్వహించాలని, సర్వేలోకి రాని కుటుంబాలు ఈ తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యలయం దగ్గరకు వచ్చి సర్వే చేయించుకునే విధంగా చూడాలన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. సర్వే పరిధిలోని వారికి డిసెంబరు నుంచి ప్రభుత్వ లబ్ధి ఆగుతుందని తెలిపారు. ఈ–పాసు పుస్తకాల కోసం వచ్చిన దరఖాస్తుల సత్వరం పరిష్కరించాలన్నారు. క్లియర్ చేసిన వాటిలో కూడా రిజెక్టు ఎక్కువగా ఉంటోందని చెప్పిన ఆయన ఎందుకు తిరస్కరించారనే విషయంపై విచారణాధికారులుగా నియమితులైన ఆర్డీఓలు దృష్టి సారించాలన్నారు. చుక్కల భూములపై నెలాఖరులోగా మంత్రివర్గం తీసుకుంటుందన్నారు. జిల్లా నుంచి జేసీ మాట్లాడుతూ... ప్రజాసాధికార సర్వేను ఈ నెల చివరిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ–పాసు పుస్తకాల దరఖాస్తుల పెండింగ్‌ను తగ్గిస్తామని వివరించారు. వీడియోకాన్పరెన్స్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు ఈరన్న, రామాంజనమ్మ, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఓఎస్డీగా చల్లా ఓబులేసు
అనంతపురం న్యూసిటీ: అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేసిన చల్లా ఓబులేసు పురపాలకశాఖ మంత్రి నారాయణ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీఓ 620 విడుదల చేసింది. చల్లా ఓబులేసు ఈ నెల 6వతేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో ఉన్న విషయం విదితమే. మరో నాలుగు రోజుల్లో ఓఎస్డీ బాధ్యతలు చేప ట్టనున్నట్లు చల్లా ఓబులేసు ‘సాక్షి’కి తెలిపారు. -
నిర్వహణ ఇంత అధ్వానమా?
- అదోని మార్కెట్‌యార్డ్ అధికారులపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ ఆగ్రహం ఆదోని: స్థానిక మార్కెట్ యార్డు నిర్వహణ తీరుపై రాష్ట్ర మార్కెటింగ్ కమిషనరు మల్లికార్జున రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు రెండు గంటల పాటు యార్డులో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. యార్డులో స్టేట్ బ్యాంకు భవనం అభివృద్ది కోసం అధికారులు దాదాపు రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ మేరకు అభివృద్ధి కనిపించలేదని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనశాలలో కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేయకుండా నారరాతి బండలు ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు. రైతు విశ్రాంతి భవనం తాళాలు తన వద్ద లేవని చెప్పిన ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రామారావుపై కమిషనర్‌మండిపడ్డారు. రైతు విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను పరిశీలించి..పనివేళలు, క్లినిక్ బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. యార్డులో పత్తి దొంగతనాలపై తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.8 లక్షలతో నిర్మించిన మురుగు కాలువ నాణ్యతపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఇలాగేనా చేసేది? అని యార్డు డీఈఈ రఘురామరెడ్డిపై ఆగ్రహం వ్యక్త చేశారు. రైతుల తాగు నీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంటును పరిశీలించారు.తుప్పు పట్టిన కుళాయిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యార్డులో పారిశుద్ద్యంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట యార్డు చైర్మన్ భాస్కర రెడ్డి, వైస్ చైర్మన్ కొలిమి రామన్న, ఎస్సీ శ్రీనివాసులు, ఈఈ రాజశేఖర్, డైరెక్టర్లు ఉన్నారు. -
సామర్లకోటలో ఎక్సైజ్ అకాడమీ
స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ సామర్లకోట : పట్టణ పరిధిలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ ముకేష్ కుమార్‌మీనా తెలిపారు. గురువారం స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల భూమిని ఆయన తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన విస్తరణ శిక్షణ కేంద్రంలో అకాడమీ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించామని, దానిపై ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదక అందజేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అకాడమీలో ఎక్సైజ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తామని చెప్పారు. తమ శాఖలో పని చేసి తీవ్రవాదుల చేతిలో మృతి చెÆ దిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. కుటుంబాలను ఆదుకొనే అవకాశం తమ శాఖలో తక్కువగా ఉంటుందని తెలిపారు. గతంలో ఉన్న బార్ పాలసీని కొనసాగిస్తామని, బార్ల సంఖ్యను పెంచే యోచన లేదని తెలిపారు. గంజాయిని నివారించడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టరు కర్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో ఉన్న జీఆర్పీ సిబ్బంది కొరత కారణంగా ఆయా లోకల్ పోలీసులకు కేసులు బదిలీ చేస్తురన్నట్టు తెలిపారు. శిక్షణ కేంద్రం ఎంపీడీఓ రామ్‌గోపాల్, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ దేవకుమార్, డీఎస్పీలు పాల్గొన్నారు. 06పీటీపీ46: ఎక్సైజ్ అకాడమీకి స్థలాన్ని పరిశీలిస్తున్న కమిషనర్, డైరెక్టరు, ఇతర అధికారులు -
10 నెలలుగా బిల్లుల కోసం ఎదురుచూపులు
– ఆపదలో ఆదుకుంటే అన్యాయం చేస్తారా..? – మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన జేసీబీ నిర్వాహకుడు మదనపల్లె: ‘గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు, చెరువులు నిండిపోయాయి. ఆ సమయంలో వరద నీరు ఇళ్లలోకిరాకుండా దారి మళ్లించేందుకు జేసీబీతో పనులు చేశాను. రూ.2.75 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా అదిగో ఇదిగో అంటున్నారు’ అని జేసీబీ నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి వాపోయారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆత్మీయతా కార్యక్రమంలో కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు కమిషనర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఆలోచించకుండా రేయింబవళ్లు జేసీబీతో పనులు చేయించుకుని బిల్లుల మంజూరులో జాప్యం చేయడమేమిటని ప్రశ్నించారు. 10 నెలలుగా వందలసార్లు మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదని వాపోయారు. అప్పటి కమిషనర్ మారిపోయారని, ఆ బిల్లులతో తనకు సంబంధం లేదని ప్రస్తుత కమిషనర్ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. తనకు బిల్లులు చెల్లించకపోతే న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ విషయంపై సబ్‌కలెక్టర్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అనంతరం కమిషనర్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, మేనేజర్ రాంబాబు, డీఈ మహేష్, ఏఈ గోపీనాథ్, టీపీఎస్ కుముదిని తదితరులు పాల్గొన్నారు. -
విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలి
చౌటుప్పల్ : ఇంజనీరింగ్ విద్యార్థులు మోక్షగుండం విశ్వేశరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. మండలంలోని తుఫ్రాన్‌పేట శివారులోని ధృవ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, నైపుణ్యం లేని కారణంగా ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు రావడం లేదన్నారు. దీంతో ఎంతో మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ చదివింది కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కాదని.. విషయ పరిజ్ఞానం పెంచుకొని ఆ రంగంలో రాణించాలని కోరారు. ఇంగ్లిష్‌పై ప్రావీణ్యం ఉండాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పరిధిలో సివిల్స్, గ్రూప్–1,2 పరీక్షలకు వారంలో ఒక రోజు శనివారం శిక్షణ ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఘట్కేసర్లోని శ్రీనిధి కళాశాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. విద్యార్థులు తాగి డ్రైవింగ్ చేయవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు డీ–అడిక్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎగ్జిబిట్ల ప్రదర్శన ఇంజనీరింగ్, డిప్లమా ఫైనలియర్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కమిషనర్ పరిశీలించారు. వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.పర్వత్‌రెడ్డి, సెక్రెటరీ కె.శశిరేఖ, ప్రిన్సిపాల్ బి.శ్రీధర్‌రెడ్డి, వై.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
విజయవాడ (లబ్బీపేట) : కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) కార్మికుల సంక్షేమానికి అనేక ప్రయోజనాలు కల్పిస్తుందని ఈఎస్ఐసీ(న్యూఢిల్లీ) ఫైనాన్షియల్ కమిషనర్ యు.వెంకటేశ్వర్లు చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పిలుపు మేరకు ఈఎస్ఐసీ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం విశ్వకర్మ దినోత్సవం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ తాజ్ గేట్‌వేలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈఎస్ఐసీకి పది మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో 253 సీట్లు ఉండగా, అవి భర్తీ కావడమే కష్టమవుతోందన్నారు. అందుకు కార్మికుల్లో అవగాహనా లోపమే కారణమన్నారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌గా విభజించి గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపడుతోందన్నారు. ఈ చట్టాలతో కార్మిక, ఉద్యోగులకు సామాజిక భద్రత, వైద్య ఆరోగ్య సహకారం లభిస్తుందన్నారు. విజయవాడలో త్వరలో స్టోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈఎస్ఐసీ రీజినల్ డైరెక్టర్ పీఆర్ దాస్, రీజినల్ పీఎఫ్ కమిషనర్ పి.వీరభద్రస్వామి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ హెచ్.రామానుజం పాల్గొన్నారు. -
భారీ వర్ష సూచనతో హై అలర్ట్
హైదరాబాద్: వాతావరణ శాఖ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. జనజీవనానికి అవరోధం కలుగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కమిషనర్ జనార్థన్ రెడ్డి కోరారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు ఆయన సూచించారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం నేపథ్యంలో వచ్చినటువంటి వర్ష హచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. -
నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్‌గా సందీప్ శాండిల్య గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శనివారం రాత్రి 7 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సందీప్ శాండిల్య మాట్లాడుతూ... శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువవుతామని తెలి పారు. నేరగాళ్లను వదలబోమని హెచ్చరించారు. శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లలో కేసులు, పాలనాపరమైన అంశాలపై పూర్తి దృష్టి సారిస్తానని తెలిపారు. -
ఏడీ కార్యాలయం తనిఖీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: భూ కొలతలు, రికార్డుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర సర్వే సెటిల్మెంటు, భూ రికార్డుల శాఖ కమిషనర్ శశిధర్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఏడి శ్యాంసుందర్‌రెడ్డి కృష్ణా పుష్కరాల విధులు నిర్వహిస్తున్నారని సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కమిషనర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా పలు శాఖా పరమైన విషయాలపై చర్చించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలుగు, ఉర్దూ, మరాఠీలలో ఉన్న పాత రికార్డులను పరిశీలించారు. బౌండ్రీ వివాదాలు, సబ్‌డివిజన్ సమస్యల పరిష్కారంలో అవలంబిస్తున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పాత రికార్డులు పరిశీలించి మరాఠీ బాషలో అంకెలు ఉండటానికి కారణాలు తెలుసుకున్నారు. సేత్వార్, టీపన్లు పరిశీలించారు. టీపన్లు అందుబాటులో లేని పక్షంలో సర్వే ఎలా నిర్వహిస్తారని సర్వేయర్లను ఆరా తీశారు. పక్కా బుక్, గ్రామ నక్షా ఆధారంగా సర్వే చేస్తామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఏడీ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. -
హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు
యాకుత్‌పురా: హైకోర్టు పరిసర ప్రాంతాల్లో విధించిన నిషేధాజ్ఞలను పొడిగించారు. ఈనెల 17 ఉదయం 6 నుంచి అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటలకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. హైకోర్టు నుంచి సిటీ కళాశాల జంక్షన్, నయాపూల్ రోడ్డు, మదీనా సర్కిల్ నుంచి సిటీ కాలేజీ రోడ్డు, ఘాన్సీబజార్ నుంచి పటేల్ మార్కెట్, రికాబ్‌గంజ్, నయాపూల్ మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, ముస్లింజంగ్‌పూల్, మూసాబౌలి, మెహందీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నంత కాలం హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన, బహిరంగ సభలు, బైఠాయింపులు చేయకూడదని హెచ్చరించారు. -
చెత్త తరలింపునకు ఈ– ఆటోలు
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల సందర్భంగా నగరంలో చెత్త వేగంగా ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు తరలించేందుకు ఈ– ఆటో వెహికిల్, ట్రైసైకిళ్లను అందుబాటులోకి తెచ్చారు. మంగళవారం బంగ్లాలో కమిషనర్ వీటిని స్వయంగా నడిపి చూశారు. ఆయన మాట్లాడుతూ సాధారణ ఆటోల కంటే వేగంగా, కాలుష్యరహితంగా ఈ– ఆటోల్లో చెత్తను తరలించవచ్చని చెప్పారు. వాహనాలు బ్యాటరీలో నడవడం వల్ల కాలుష్యం తగ్గుతోందన్నారు. హైడ్రాలిక్ సిస్టంలో రివర్స్‌గేర్ కలిగి ఉన్న వాహనాలు చెత్త తరలింపునకు ఉపయోగంగా ఉంటాయన్నారు. ఒక్కో ఆటోలో 350 కిలోల చెత్తను తరలించవచ్చని చెప్పారు. -
కమిషనర్ సుడిగాలి పర్యటన
సాగర్‌నగర్ : మహా విశాఖనగర కమిషనర్ హరినారాయణన్ మంగళవారం ఆరోవార్డులో క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ కాలనీలోకి నేరుగా వెళ్లి అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సాగర్‌నగర్ వుడా కాలనీలోనుంచి ఇటీవ నిర్మించిన గుడ్లవానిపాలెం గెడ్డను పరిశీలించారు. స్థానికంగా పాడైన నుయ్యిను ఆధునీకరించి వాడకలోకి తీసుకు రావాలని దానికి ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. తర్వాత సాగర్‌నగర్ ఎండాడ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న దసప్పల్లా లేఅవుట్ డ్రై యిన్ పరిశీలించి డ్రై యిన్ వెడల్పు చేయాలని అందుకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. తర్వాత ఎండాడ రాజీవ్‌నగర్ కొండవాలు ప్రాంతానికి ప్రధాన రహదారి దుస్థితిని పరిశీలించారు. తక్షణమే దీని ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈ బడే శ్రీరామమూర్తిని ఆదేశించారు. తెలగా ఎండాడ, గొల్లలెండాడల్లో భూగర్భ డ్రై యినేజీలు ఏర్పాటు చేయాలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. కాలినడకన తిరిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. అక్కడ నుంచి ఎండాడ చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. చెరువు గర్భంలో పూడికలను ఇరిగేషన్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సలహాలు తీసుకుని ఆ శాఖ ద్వారా పనులు చేయించాలని ఈఈని ఆదేశించారు. అక్కడ నుంచి విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు జోడుగుళ్లపాలెం మధ్యన బీచ్ రోడ్డును ఆనుకొని ఉన్న ఖాలీస్థలంతా చిట్టిడవిని తలపిస్తూ భయంకరంగా కన్పిస్తోంది. ఈ ఖాళీస్థలాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. తక్షణమే పేరుకుపోయిన తుప్పలను తొలగించాలని ఆదేశిచడంతో వెంటనే ఏఈఈ శ్రీధర్ ప్రొక్లెయిన్ తెప్పించి పనులు ప్రారంభించారు. జోడుగుళ్లపాలెంలో సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ స్థానికడు ఉమ్మిడి భాస్కర్ వివరించారు. మొత్తం రెండున్న గంటల పాటు వార్డులోని పలు కాలనీల్లో కలియ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గెడ్డలు, డ్రై యిన్లు, రహదారులను మెరుగు పరచాలని, ఎక్కడైనా పెండింగ్ ఉంటే తక్షణమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట మధురవాడ జోన ల్ ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీ, ప్రజావైద్యారోగ్యవిభాగం సూపర్వైజర్ పి. లక్ష్మి, ఇంజినీరింగ్ ఈఈ బడే శ్రీరామమూర్తి, ఏఈఈ -
కమిషనర్ సుడిగాలి పర్యాటన
సాగర్‌నగర్ : మహా విశాఖనగర కమిషనర్ హరినారాయణన్ మంగళవారం ఆరోవార్డులో క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ కాలనీలోకి నేరుగా వెళ్లి అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సాగర్‌నగర్ వుడా కాలనీలోనుంచి ఇటీవ నిర్మించిన గుడ్లవానిపాలెం గెడ్డను పరిశీలించారు. స్థానికంగా పాడైన నుయ్యిను ఆధునీకరించి వాడకలోకి తీసుకు రావాలని దానికి ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. తర్వాత సాగర్‌నగర్ ఎండాడ మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న దసప్పల్లా లేఅవుట్ డ్రై యిన్ పరిశీలించి డ్రై యిన్ వెడల్పు చేయాలని అందుకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. తర్వాత ఎండాడ రాజీవ్‌నగర్ కొండవాలు ప్రాంతానికి ప్రధాన రహదారి దుస్థితిని పరిశీలించారు. తక్షణమే దీని ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈ బడే శ్రీరామమూర్తిని ఆదేశించారు. తెలగా ఎండాడ, గొల్లలెండాడల్లో భూగర్భ డ్రై యినేజీలు ఏర్పాటు చేయాలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. కాలినడకన తిరిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. అక్కడ నుంచి ఎండాడ చెరువు ఆధునీకరణ పనులను పరిశీలించారు. చెరువు గర్భంలో పూడికలను ఇరిగేషన్‌శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సలహాలు తీసుకుని ఆ శాఖ ద్వారా పనులు చేయించాలని ఈఈని ఆదేశించారు. అక్కడ నుంచి విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు జోడుగుళ్లపాలెం మధ్యన బీచ్ రోడ్డును ఆనుకొని ఉన్న ఖాలీస్థలంతా చిట్టిడవిని తలపిస్తూ భయంకరంగా కన్పిస్తోంది. ఈ ఖాళీస్థలాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. తక్షణమే పేరుకుపోయిన తుప్పలను తొలగించాలని ఆదేశిచడంతో వెంటనే ఏఈఈ శ్రీధర్ ప్రొక్లెయిన్ తెప్పించి పనులు ప్రారంభించారు. జోడుగుళ్లపాలెంలో సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ స్థానికడు ఉమ్మిడి భాస్కర్ వివరించారు. మొత్తం రెండున్న గంటల పాటు వార్డులోని పలు కాలనీల్లో కలియ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గెడ్డలు, డ్రై యిన్లు, రహదారులను మెరుగు పరచాలని, ఎక్కడైనా పెండింగ్ ఉంటే తక్షణమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట మధురవాడ జోన ల్ ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీ, ప్రజావైద్యారోగ్యవిభాగం సూపర్వైజర్ పి. లక్ష్మి, ఇంజినీరింగ్ ఈఈ బడే శ్రీరామమూర్తి, ఏఈఈ పి. భరణికుమార్, శ్రీధర్,మంచినీటి సరఫరా ఏఈఈ మణికుమార్, చెట్టుపల్లి గోపి, ఎండాడ గ్రామాభివద్ధి కమిటీ అధ్యక్షుడు ఉప్పులూరి చినగోపి, వైఎస్సార్సీపీ నాయకుడు మాదు చంటి తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు సహకరించాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కాకినాడ సిటీ: అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని, తద్వారా ప్రజలకు వాటి ఫలితాలు అందుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. గురువారం అంబేడ్కర్ భవన్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర శాఖల నిధుల అనుసంధానంతో చేపట్టే పనులపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మొదటి విడతగా అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రెండో విడతగా పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలకు సర్పంచ్ల ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన ఉండాలని, నిధుల కేటాయింపు, చేసిన ఖర్చుపై అవగాహన ఉంటేనే అభివృద్ధి సాధించగలమన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తామన్నారు. ఈ పథకంలో గత సంవత్సరం రూ.280 కోట్లు ఖర్చు చేయగా, ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ నిధులు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డీపీఓ శర్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.రాజేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ ప్రసంగించారు. సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భక్తుల భద్రతకు జాయింట్ యాక్షన్ కమిటీ
విజయవాడ : పుష్కర యాత్రికులకు భద్రత, ఇతర అంశాల నిమిత్తం ఉన్నతాధికారులు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ రోజూ ఆయా అంశాలపై సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ బాబు.ఏ, సీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు నగరంలో ఘాట్లలో జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పాలన, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో సమష్టి నిర్ణయం తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. అధికారుల బృందం సమన్వయంతో పనిచేసి రోజూ రాత్రి 8 గంటల సమయంలో పుష్కర ఏర్పాట్లు, అవసరమైన మార్పులు చేర్పులపై సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పోలీస్, రెవెన్యూ ఇరిగేషన్, ఇతర శాఖల్లో ఎంపిక చేసిన అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక అధికారి రాజశేఖర్ సూచించారు. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తూ పోలీసు శాఖ తరఫున ఐపీఎస్ అధికారి విశాల్‌గున్ని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం కలిగి ఉంటారని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ అధికారే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. అనంతరం అధికారుల బృందం దుర్గా, పద్మావతి ఘాట్‌లో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసింది. అప్రాన్ పనుల పరిశీలన ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న అఫ్రాన్ వద్ద చేపడుతున్న పనులను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ అప్రాన్‌పై ప్రత్యేకంగా 30 స్టాళ్లు, ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 4న ప్రారంభం పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణపై సీఎం స్థాయిలో ప్రత్యక్ష పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఆగస్టు 4 నుంచి పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డీఐజీ సూర్యప్రకాశరావు, జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్, డెప్యూటీ కమిషనర్ అశోక్‌కుమార్, సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృ జన ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కమిషనర్‌గా హరినారాయణన్ బాధ్యతల స్వీకరణ
∙ద్వారకానగర్: నగర ప్రజల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జీవీఎంసీ నూతన కమిషనర్ ఎం.హరినారాయణన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించి టీం వర్క్‌తో స్మార్ట్‌సిటీ లక్ష్యాలను కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర అవసరాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా విశాఖ అభివృద్ధికి కషి చేయనున్నట్టు వివరించారు. అంకితభావంతో పారదర్శకంగా పరిపాలన సాగిస్తానని స్పష్టం చేశారు. నగరం అభివద్ధి పథంలో నడుస్తోందని.. మరింత వేగంగా పరుగులు తీయిద్దామన్నారు. ఏడీసీ (జనరల్) జి.వి.వి.ఎస్.మూర్తి కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు యూనియన్ల నాయకులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. -
వింగ్ అధికారులతో కమిషనర్ సమీక్ష
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం తిరిగి విధుల్లో చేరారు. మూడు వారాలపాటు వ్యక్తిగత కారణాలతో సెలవుల్లో ఉన్న కమిషనర్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో వింగ్ అధికారులతో వేర్వేరుగా వివిధ కార్యకలాపాలపై సమీక్షించారు. అడిషనల్ కమిషనర్ షాహిద్‌మసూద్, ఎస్ఈ అబ్దుల్రహ్మాన్, సీపీ కోదండరామిరెడ్డిని అడిగి వివిధ పనులపై ఆరా తీశారు. హరితహారం, అభివృద్ధి పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య తీరు తెన్నులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు కమిషనర్ బిజీబిజీగా గడిపారు. -
వింగ్ అధికారులతో కమిషనర్ సమీక్ష
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం తిరిగి విధుల్లో చేరారు. మూడు వారాలపాటు వ్యక్తిగత కారణాలతో సెలవుల్లో ఉన్న కమిషనర్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో వింగ్ అధికారులతో వేర్వేరుగా వివిధ కార్యకలాపాలపై సమీక్షించారు. అడిషనల్ కమిషనర్ షాహిద్‌మసూద్, ఎస్ఈ అబ్దుల్రహ్మాన్, సీపీ కోదండరామిరెడ్డిని అడిగి వివిధ పనులపై ఆరా తీశారు. హరితహారం, అభివృద్ధి పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య తీరు తెన్నులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు కమిషనర్ బిజీబిజీగా గడిపారు. -
డీసీ దృష్టికి వ్యాపారుల సమస్యలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వ్యాపారాలు సన్నగిల్లాయని, దీంతో వ్యాపారులు చాలా ఇబ్బందులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారని శ్రీకాకుళం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విజయనగరం వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ ఎల్.శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఆయన ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘాల తరఫున డీసీని సత్కరించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాణిజ్యపన్నుల విభాగం వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తమకు సహకరించాలని డీసీకి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ అధికారులతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. డీసీని కలిసిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అందవరపు వరహానరసింహం (వరం), ప్రధాన కార్యదర్శి పీవీ రమణ, ఉపాధ్యక్షులు కె.వాసు, పేర్ల సాంబమూర్తి, గుమ్మా నాగరాజు, కోశాధికారి గుమ్మా నగేష్, ఇతర ప్రతినిధులు ఏఎన్ఆర్ రాజు, కోణార్క్ శ్రీను, తంగుడు బాబు, ఎస్వీడీ మురళి, అమరావతి శ్రీను, కి ల్లంశెట్టి నరసింహమూర్తి, నవతా బాబ్జి, కోరాడ రమేష్, గుడ్ల చక్రధరరాజు, పేర్ల మహేష్, సుప్రీమ్ దివాకర్, దీర్ఘాశి సూర్యనారాయణ, గెంబలి శ్రీను, వీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
సంతకం చేయవద్దని సతాయిస్తున్నారు..!
కోదాడ మున్సిపాలిటీలో కొత్త వివాదం పాత కమిషనర్ చేర్చుకున్నారు.. కొత్తాయన వద్దంటున్నారు సంతకం చేయకుండానే విధుల నిర్వహణ ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ కోదాడ: ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కమిషనర్ల తమ ఆధిపత్య పోరులో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజనీర్‌తో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. పాత కమిషనర్ ఉద్యోగంలో చేర్చుకోగా కొత్త కమిషనర్ మాత్రం రిజిస్టర్లో సంతకం పెట్టనీయడంలేదు. దీంతో 15 రోజులుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్న మున్సిపల్ ఉద్యోగుల హాజరు పట్టికలో మాత్రం సదరు ఇంజనీరు సంతకం చేయనీడం లేదు. అసలు విషయం ఏమిటంటే... కోదాడ మున్సిపాలిటీకి ఇటీవల ఇద్దరు ఏఈలను, ఒక టెక్నికల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 29న వీరు మున్సిపల్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజు ఈ ముగ్గురిని పాత కమిషనర్ విధుల్లో చేర్చుకున్నారు. అదే సమయంలో కోదాడలో ఏఈగా పని చేస్తున్న సత్యారావును బోడుప్పల్‌కు బదిలీ చేసింది. కాని చైర్పర్సన్ సదరు ఏఈ సత్యారావుని ఇక్కడే ఉండనీయ్యాలని పాత కమిషనర్‌ను కోరింది. చైర్‌పర్సన్‌తో ఉన్న వివాదంతో పాత కమిషనర్ సదరు ఏఈని వెంటనే విధులనుంచి రిలీవ్ చేశారు. కాని పాత ఏఈ సత్యారావుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న పెద్దలు ఒక పోస్టును ఖాళీగా చూపాలని బావించి కొత్త ఏఈ పి.గుణాకర్ను రిజిష్టర్‌లో సంతకం పెట్టనియ్యడం లేదని సమాచారం. కాని మరోపక్క అతడికి మాత్రం మున్సిపల్ విధులను కేటాయిస్తున్నారు. ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ ఇదీలా ఉండగా కోదాడ మున్సిపాలిటీలో కొత్తగా చేరిన ఏఈ గుణాకర్ స్థానిక అధికారుల, పాలకుల వైఖరితో బెంబేలెత్తి శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆశ్రయించాడు. తనను విధుల్లో చేర్చుకొని రిజిస్టర్లో మాత్రం సంతకం చేయనియ్యడం లేదని, తనకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. నా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తాను: అనురాధ, మున్సిపల్ ఏడీ కోదాడలో కొత్త ఏఈని విధుల్లో చేర్చుకొని సంతకం చేయనీయకం పోవడంపై నాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తాము. -
సంతకం చేయవద్దని సతాయిస్తున్నారు..!
కోదాడ మున్సిపాలిటీలో కొత్త వివాదం పాత కమిషనర్ చేర్చుకున్నారు.. కొత్తాయన వద్దంటున్నారు సంతకం చేయకుండానే విధుల నిర్వహణ ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ కోదాడ: ఇప్పటికే పీకలలోతు వివాదాలలో కూరుకుపోయిన కోదాడ మున్సిపల్ కార్యాలయం తాజాగా మరో వివాదానికి తెరలేపింది. కమిషనర్ల తమ ఆధిపత్య పోరులో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ యువ ఇంజనీర్‌తో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. పాత కమిషనర్ ఉద్యోగంలో చేర్చుకోగా కొత్త కమిషనర్ మాత్రం రిజిస్టర్లో సంతకం పెట్టనీయడంలేదు. దీంతో 15 రోజులుగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఉన్న మున్సిపల్ ఉద్యోగుల హాజరు పట్టికలో మాత్రం సదరు ఇంజనీరు సంతకం చేయనీడం లేదు. అసలు విషయం ఏమిటంటే... కోదాడ మున్సిపాలిటీకి ఇటీవల ఇద్దరు ఏఈలను, ఒక టెక్నికల్ ఆఫీసర్‌ను ప్రభుత్వం కేటాయించింది. జూన్ 29న వీరు మున్సిపల్ కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఆ రోజు ఈ ముగ్గురిని పాత కమిషనర్ విధుల్లో చేర్చుకున్నారు. అదే సమయంలో కోదాడలో ఏఈగా పని చేస్తున్న సత్యారావును బోడుప్పల్‌కు బదిలీ చేసింది. కాని చైర్పర్సన్ సదరు ఏఈ సత్యారావుని ఇక్కడే ఉండనీయ్యాలని పాత కమిషనర్‌ను కోరింది. చైర్‌పర్సన్‌తో ఉన్న వివాదంతో పాత కమిషనర్ సదరు ఏఈని వెంటనే విధులనుంచి రిలీవ్ చేశారు. కాని పాత ఏఈ సత్యారావుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి తీసుకురావాలని పట్టుదలతో ఉన్న పెద్దలు ఒక పోస్టును ఖాళీగా చూపాలని బావించి కొత్త ఏఈ పి.గుణాకర్ను రిజిష్టర్‌లో సంతకం పెట్టనియ్యడం లేదని సమాచారం. కాని మరోపక్క అతడికి మాత్రం మున్సిపల్ విధులను కేటాయిస్తున్నారు. ఈఎన్సీని ఆశ్రయించిన నూతన ఏఈ ఇదీలా ఉండగా కోదాడ మున్సిపాలిటీలో కొత్తగా చేరిన ఏఈ గుణాకర్ స్థానిక అధికారుల, పాలకుల వైఖరితో బెంబేలెత్తి శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆశ్రయించాడు. తనను విధుల్లో చేర్చుకొని రిజిస్టర్లో మాత్రం సంతకం చేయనియ్యడం లేదని, తనకు వేరే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. నా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తాను: అనురాధ, మున్సిపల్ ఏడీ కోదాడలో కొత్త ఏఈని విధుల్లో చేర్చుకొని సంతకం చేయనీయకం పోవడంపై నాకు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని ము -
మేమే డొనేషన్ ఇస్తాం.. సమన్లు తీసుకోండి
♦ లంచం ఇవ్వబోయిననిందితురాలితో సీసీఎస్ పోలీసులు ♦ విషయం తెలిసి సిబ్బందిని ప్రశంసించిన కమిషనర్ సాక్షి, హైదరాబాద్: ‘న్యాయస్థానం జారీ చేసిన సమన్లు ఇవ్వొద్దు. నేను అందుబాటులో లేనంటూ నమోదు చేసుకోండి. అందుకు ప్రతిగా రూ.500 ఇస్తా’ - సీసీఎస్ పోలీసులతో ఓ నిందితురాలి వ్యాఖ్య ‘అలా కుదరదు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్లు అందుకోవాల్సిందే. అందుకు ప్రతిగా అవసరమైతే మేమే రూ.1000 డొనేషన్ ఇస్తాం’ - స్పష్టం చేసిన సీసీఎస్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ అంశం మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి వచ్చింది. జరిగిన విషయం ఆరా తీసిన ఆయన లంచం తిరస్కరించిన కానిస్టేబుళ్లను ప్రశంసించారు. ఇదీ కేసు నేపథ్యం... నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ డెరైక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలకు సంబంధించి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు 2013లో కేసు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో కుమార్తెల ఫిర్యాదు మేరకు తల్లిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆ సంస్థకు సీఎండీ వ్యవహరించిన యజమాని మరణానంతరం ఆయన కుమార్తెల్లో ఒకరు ఆ బాధ్యతలు స్వీకరించారు. మరో ఇద్దరు కుమార్తెలు బోర్డులో డెరైక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరు ఈ కుటుంబానికే చెందిన మరో సంస్థకూ డెరైక్టర్. యజమాని భార్య సైతం అప్పటికే ఆ బోర్డులో డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. 2013లో ‘మరో సంస్థ’కు చెందిన కీలక డాక్యుమెంట్లు దాని కార్యాలయం నుంచి పోయాయని, అందులో తమ తల్లి ప్రమే యం ఉందని ఆరోపిస్తూ కుమార్తెలు సీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఏం జరిగిందంటే... సీసీఎస్ పోలీసులు నమోదుచేసిన కేసులో నిందితురాలి గా ఉన్న మహిళకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వీటిని అందించడానికి సీసీఎస్ సిబ్బంది వెళ్లారు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించిన నిందితురాలు... పోలీసులకు రూ.500 లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. సదరు చిరునామాలో తాను అందుబాటులో లేనంటూ సమన్లు జారీ చేయవద్దని కోరారు. దీంతో సీసీఎస్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ... సమన్లు స్వీకరించాలని, వాటితో పాటు తామే రూ.1000 డొనేషన్‌గా ఇస్తామంటూ ఆమెకు స్పష్టం చేశారు. అప్పటికీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ సమన్లను ఆమె ఇంటి గేటు వద్ద అతికించి, ఆ ఫొటోలు తీసుకుని వచ్చా రు. ఈ కేసులో ఫిర్యాదుదారులు రెండు రోజుల క్రితం నగర కొత్వాల్‌ను కలిసి ‘రూ.500’ విషయంపై ఆయన కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ ఆరా తీయగా... జరిగిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. లంచం తిరస్కరించడంతో పాటు సమన్ల జారీ విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన సీసీఎస్ సిబ్బందిని ప్రశంసించారు. -
ఈ-ఆఫీస్‌లో జీహెచ్ఎంసీ భేష్
సాక్షి, సిటీబ్యూరో: పారదర్శకతతో పాటు ఫైళ్లు త్వరితగతిన పరిష్కరించేందుకు ఉద్దేశించిన ఈ-ఆఫీస్ అమలులో జీహెచ్ఎంసీ చేస్తున్న కృషిని కేంద్రంలోని పలువురు అధికారులు ప్రశంసించారు. సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం ఆధ్వర్యంలో కోల్‌కత్తాలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తాము అమలు చేస్తున్న ఈ - ఆఫీస్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- ఆఫీస్ ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,69,754 ఫైళ్లు రూపొందించగా, అందులో ఒక్క జీహెచ్‌ఎంసీవే 80వేల ఫైళ్లున్నాయన్నాయని తెలిపారు. అలాగే 45 లక్షల ఫైళ్లు ఈ ఆఫీస్ ద్వారా సర్క్యులేట్ కాగా, వాటిల్లో 6 లక్షలు జీహెచ్ఎంసీవేనన్నారు. జీహెచ్ఎంసీలో 2014 నవంబర్ 5న ఈ-ఆఫీస్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఎలా వినియోగిస్తున్నదీ వివరించారు. జీహెచ్ఎంసీలోని ఉద్యోగులందరికీ శిక్షణనిచ్చి, ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ- ఆఫీస్ వినియోగంతో జీహెచ్ఎంసీ జాతీయ ఈ-గవర్నెన్స్ కార్యక్రమంలో కీలక భాగస్వామిగా ఎదిగిందన్నారు. ఈ-ఆఫీస్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్న ఏకైక కార్పొరేషన్ దేశంలో జీహెచ్‌ఎంసీయేనని చెప్పారు. అవసరమైనన్ని స్కానర్లు, సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ వినియోగిస్తున్నామన్నారు. -
'భర్తలూ.. జోక్యం చేసుకోకండి'
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న మహిళా కార్పొరేటర్ల భర్తలు ఇక నుంచి అధికారుల విధి నిర్వహణలో జోక్యం చేసుకోరాదంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యూలర్‌తో పాతబస్తీలోని మహిళా కార్పొరేటర్ల బంధుగణం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నెల 6వ (నంబర్-236/ ఎంఎస్/జీహెచ్ఎంసీ/ 2016/ 64) తేదీన గ్రేటర్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు. దీనిని అన్ని జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లకు పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో మహిళా కార్పొరేటర్లు మాత్రమే అధికారులతో సంప్రదిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని వారి తరపున ఎట్టి పరిస్థితుల్లో వారి భర్తలు జోక్యం చేసుకోరాదంటూ ఈ సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ దక్షిణ మండలం పరిధిలో ఘాన్సీబజార్, గౌలిపురా, సైదాబాద్, ఐ.ఎస్. సదన్, కుర్మగూడ, ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, ముసారంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్, ఆజంపురా, మొఘల్‌పురా, తలాబ్‌చంచలం, కంచన్‌బాగ్, బార్కాస్, సులేమాన్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర మున్సిపల్ డివిజన్ల నుంచి మహిళా కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇలా సర్క్యులర్ జారీ చేయడం సరి కాదని.. మహిళా కార్పొరేటర్లు హాజరు కాలేని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే తాము సంబంధిత అధికారులతో సంప్రదించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాం తప్ప... వారి విధి నిర్వహణలో ఎలాంటి జోక్యం కలిగించుకోమంటూ పాతబస్తీకి చెందిన పలువురు మహిళా కార్పొరేటర్ల భర్తలు అంటున్నారు. -
మేయర్ వర్సెస్ కమిషనర్
కౌన్సిల్ సాక్షిగా విభేదాలు బహిర్గతం కార్పొరేషన్ మేయర్, కమిషనర్ మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ కౌన్సిల్ సాక్షిగా బహిర్గతమైంది. మున్నెన్నడూ లేని విధంగా మేయర్ కోనేరు శ్రీధర్.. ‘కమిషనర్’ అంటూ పలుమార్లు ఏకవచనంతో సంబోధించడం సభలో చర్చకు దారితీసింది. అనధికారిక కట్టడాలకు సంబంధించి పది శాతం ఫైన్ వసూలు విషయాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి జీవో 168 ప్రకారం ప్రభుత్వం నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫైన్‌ను నిలుపుదల చేయాల్సిందిగా టీడీపీ ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు కోరారు. మార్కెట్ విలువ ప్రకారం కాకుండా భవన నిర్మాణ ఫీజుల ఆధారంగా ఫైన్ వసూలు చేయాల్సిందిగా సూచించారు. మేయర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలకు సంబంధించి జరిమానాలు విధించేందుకు నగరపాలక సంస్థలో జడ్జిని ఏర్పాటు చేసినప్పటికీ ఆయన్ను క్షేత్రస్థాయి పర్యటనలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. జడ్జికి రూ.5 వేలకు మించి ఫైన్ వేసే అధికారం లేదన్నారు. తనకున్న అధికారాల ప్రకారం మార్కెట్ విలువలో పది శాతం వరకు వసూలు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఫైన్ల రూపంలో కోటి రూపాయలు వసూలైందన్నారు. మీరు (కమిషనర్) ఫైన్ వేయండి. అయినంత మాత్రాన జడ్జిని తిప్పననడం సరికాదని మేయర్ పేర్కొన్నారు. పది శాతం ఫైన్‌ను తగ్గించాల్సిందిగా హరిబాబు సూచించగా కమిషనర్ కుదరదని తేల్చేశారు. సెకండ్ ఫ్లోర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో మేయర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పది శాతం ఫీజు వసూలు చేయమని జీవో ఎప్పుడు వచ్చిందో చెప్పాలని సిటీప్లానర్‌ను నిలదీశారు. ప్రభుత్వం జీవోలను అమలు చేసే సందర్భాల్లో కౌన్సిల్‌కు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. కమిషనర్ నిర్ణయం భేష్ వైఎస్సార్సీపీ సభ్యుడు చందన సురేష్ మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలు పేట్రేగుతున్నాయన్నారు. కమిషనర్ నిర్ణయం వల్ల కార్పొరేషన్‌కు దండిగా ఆదాయం వస్తోందన్నారు. పేదలు నివసించే ప్రాంతంలో ఐదు శాతం, పెద్దలు నివసించే ప్రాంతంలో పది శాతం చొప్పున ఫైన్ వసూలు చేయాల్సిందిగా సూచించారు. పది శాతం ఫైన్ మినహాయించాలని టీడీపీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సవరణ తీర్మానం ఇచ్చింది. ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోనే ఫస్ట్... విజయవాడ కార్పొరేషన్ 105 శాతం ఆస్తిపన్ను వసూళ్లుచేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మేయర్ చెప్పారు. అయితే కొందరు సిబ్బంది పని దొంగల్లా మారారని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి జీతాలు కట్ చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్ జూన్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతో పాటు తొలిసారిగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు. -
కోట్లు దోచిపెడుతున్నారు
♦ అధికార పార్టీకి తొత్తులుగా అధికారులు ♦ నాలుగున్నర కోట్ల పనులకు సింగిల్ టెండర్ ♦ ప్రేక్షకపాత్రలో ప్రత్యేక అధికారి జిల్లా కేంద్రం... ఒంగోలు నగరపాలక సంస్థ... దీని పర్యవేక్షణకు ఓ కమిషనర్... ఇది చాలదన్నట్టు ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగమవుతుందేమోనని పరిరక్షణకు ఐఏఎస్ హోదాలో ఉన్న జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. వీరికితోడు పలు విభాగాలు. ఒక్కో విభాగానికి ఓ అధికారి. వీరికింద వందలాది మంది సిబ్బంది. వీరంతా పన్నుల రూపంలో వచ్చిన ప్రతి పైసాకు పహారా కాస్తున్నారంటే పొరపాటే. ఆశపోతులంతా చేరి మోసుకుపోతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అది ఎలా అంటే... సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కోట్ల రూపాయల పనులు బహిరంగంగా పంచేసుకుంటున్నారు. నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ ప్రైవేటు లిమిటెడ్‌గా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంజినీరింగ్ టెండర్లలో ఫైవ్‌మెన్ కమిటీ పేరుతో అధికార పార్టీ చేస్తున్న దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కాంట్రాక్టర్లను నయానో భయానో బెదిరించి తమ మనుషులచే పనులు చేజిక్కించుకుంటున్నారు. కోట్లాది రూపాయలతో పిలుస్తున్న టెండ‘రింగ్‌ల’ విషయంలో జరుగుతున్న అవకతవకలపై నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులే పచ్చచొక్కాలు వేసుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఫోన్లు చేసి ‘ఈ టెండర్లు మీరు వేయద్దు, వేస్తే ఇబ్బంది పడతారని’ బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గురువారం 11 కోట్ల రూపాయలకు పిలిచిన టెండర్లలో సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల పనులను ఫైవ్‌మెన్ కమిటీవారు సూచించినవారు దక్కించుకోవడం దాదాపు ఖరారైంది. మొత్తం 170 పనులకుగాను సుమారు 80 పనులకు సింగిల్ టెండర్లు పడ్డాయి. ఇవన్నీ ఎస్టిమేట్ ధరలకే వేసినట్లు సమాచారం. సీసీ డ్రైన్ పనులకు సంబంధించినవి కావడం గమనార్హం. వీటి వల్ల కార్పొరేషన్‌కు రూ.30 లక్షల వరకూ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మిగిలిన పనులకు కాంట్రాక్టర్లు ఫైవ్‌మెన్ కమిటీ వత్తిళ్లను దాటి టెండర్లు వేయడంతో వీటి విషయంలో ఏం చేయాలనేదానిపై తర్జన భర్జన పడుతున్నారు. సొసైటీ కాంట్రాక్టర్లు ఎదురు తిరగడంతో వారికి బిల్లులు ఎలా వస్తాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మిగిలిన పనులకు పోటీ ఉండటంతో 15 నుంచి 20 శాతం వరకూ లెస్ టెండర్లు పడినట్లు తెలిసింది. అసలు ఈ టెండర్లు పిలవడం, రద్దు చేయడం, మళ్లీ విడివిడిగా పిలవడం, సిండికేట్ అవ్వడం, పర్సంటేజీల కోసం డిమాండ్ చేయడం తదితర అంశాలపై స్పెషలాఫీసర్ దృష్టి సారిస్తే జరుగుతున్న అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకాధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం తప్ప మిగిలిన వాటిని పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టెండర్లు ఎవరు వేయాలనే విషయం కూడా వారే కాంట్రాక్టర్లకు ఫోన్లు చేస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
45 రోజులు.. టార్గెట్ రూ.455 కోట్లు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తిపన్ను వసూలు ప్రక్రియలో జిహెచ్ఎంసి వేగం పెంచింది. ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న గడువు మరో 45 రోజులు మాత్రమే మిగిలిఉండగా ఈ రోజుల్లోనే దాదాపు రూ.455కోట్ల ఆస్తిపన్ను రాబట్టేందుకు కసరత్తు వేగం పెంచింది. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులకు జిహెచ్ఎంసి కమిషనర్ బి జనార్ధన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా నగర పరిధిలో దాదాపు రూ.1100కోట్లు ఆస్తిపన్నుగా రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.545కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన కొద్ది రోజుల్లో మొత్తం పన్ను వసూలుకు లక్ష్యం పెట్టుకున్నారు. సర్కిళ్ల వారిగా 24మంది ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి రోజు రూ.10కోట్లు రాబట్టేందుకు నిర్ణయించారు. అధికమొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవడం, ఫోన్, ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిళ్ల ద్వారా గుర్తుచేయడంలాంటి చర్యలు ఇందుకు అనుసరిస్తారు. బకాయిదారులకు అవసరమైతే రెడ్ నోటీసులు జారీచేయనున్నారు. దీంతోపాటు ఇప్పటివరకు ఆస్తిపన్ను మదింపు కాని భవనాలను గుర్తించడం, తక్కువ పన్ను ఉన్న భవనాలను గుర్తించి వాటి పన్ను విధింపును నియమ నిబంధనలను అనుసరించి సరిచేయాలని అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు పొందేందుకు ముందుగానే పన్ను చెల్లించాలనే విషయాలను ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాలని కూడా కోరారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం, నగరంలో ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికై ఈ నెల 21న అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆస్తిపన్ను విషయంలో వ్యత్యాసాలు, పన్నుదారుల సమస్యలు, ఇతర లీగల్ అంశాలను సామరస్యంగా అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా 21న ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సర్కిళ్ల డిప్యూటి కమిషనర్లతో సహా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది పాల్గొని సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరిస్తారని వివరించారు. గ్రేటర్లో ఉన్న 14 లక్షల ప్రాపర్టీల్లో దాదాపు 5లక్షల ప్రాపర్టీలకు ప్రభుత్వం ప్రకటించిన ఆస్తిపన్ను మినహాయింపు లభించిందని, మిగిలిన 8లక్షల ఆస్తులకు సంబంధించి పన్నును వసూలు చేయడంలో శ్రద్ధ చూపించాలన్నారు. -
నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన
చౌటుప్పల్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
రాస్కెల్.. యూజ్లెస్ ఫెలో
ఏకేటీపీ ఉపాధ్యాయులపై కమిషనర్ దూకుడు ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు సామూహిక సెలవుకు రంగం సిద్ధం విజయవాడ సెంట్రల్ : యూజ్లెస్ ఫెలో, రాస్కెల్.. ముప్పై మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నావ్. వీడు కాలేజీలో ఉండగా చదివి ఉండడు. చదివితే పిల్లలకు చెప్పేవాడు. నువ్వు నేటివ్ తెలుగేనా? నార్త్ ఇండియానా? నీకు తెలుగు వచ్చా. 155 మందికి 12 మంది తప్పారు. సిగ్గుపడాలి. ఈవిడ యూజ్లెస్ ఫెలో. సస్పెండ్ చేయండి. మానిటరింగ్ చేయడమే రాదు. వీళ్లను నమ్ముకుంటే మీరు పాస్ కారు. మీ అంతట మీరే చదువుకోవాలి. ..అంటూ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ ఏకేటీపీ స్కూల్ ఉపాధ్యాయుల్ని అవమానపరిచారంటూ నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి సర్కిల్ 2 కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసిన కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం ప్రతి నిధులు డిమాండ్ చేశారు. గురువారం నుంచి సామూహిక సెలవు పెట్టడం ద్వారా ఆందోళనను ఉధృతం చేయాలనే యోచనలో ఉన్నారు. ఏం జరిగిందంటే.. నగరపాలక సంస్థ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పర్యవేక్షించేందుకుగాను బుధవారం కమిషనర్ సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం హెచ్ఎం రూంలో ఉపాధ్యాయులతో సమావేశం జరిపారు. త్రైమాసిక పరీక్షల్లో 30 మంది విద్యార్థులు ఫెయిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూరుశాతం ఫలి తాలు లక్ష్యంగా ఎందుకు పనిచేయడం లేదని నిలదీ శారు. సరైన పద్ధతిలో బోధన చేయలేనివారు సర్వీసు వదిలి వెళ్లిపోవాల్సిందిగా క్లాస్ తీశారు. పర్యవేక్షణ లోపించిన కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ప్రధానోపాధ్యాయురాలు కె.నీలిమాదేవి, పీఎస్ ఉపాధ్యాయుడు కె.ఇ. పాల్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా డీవైఈవో దుర్గాప్రసాద్‌ను ఆదేశించారు. హెచ్ఎం రూంలో కమిషనర్ అనుచిత వ్యాఖ్యలతో తమను అవమానించారన్నది ఉపాధ్యాయుల ఆరోపణ. కొనసాగుతున్న ఆందోళన కమిషర్ వచ్చి క్షమాపణ చెప్పే వరకు ధర్నాను విరమించేది లేదని ఉపాధ్యాయులు పట్టబట్టారు. సర్కిల్-2 కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయిం చారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, ఫ్లోర్ లీడర్ బండినాగేంద్ర పుణ్యశీల, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ సంఘీభావం తెలి పారు. ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు పెరగడంతో కమిషనర్ కంగుతిన్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి చర్చలకు రావాలని డీవైఈవోకు ఫోన్ చేశారు. ఈ ప్రతిపాదనను ఉపాధ్యాయవర్గాలు తిరస్కరించాయి. తమ వద్దకు వచ్చి క్షమాపణ కోరితేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. మహిళా ఉపాధ్యాయులు సౌలభ్యం కోసం రాత్రి పది గంట లకు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గురువారం ఉదయం 8 గంటలకు తిరిగి ఆందోళన చేపడతామని ఉపాధ్యాయులు ప్రకటించారు. వారికి మద్దతుగా పదిమంది ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. దురదృష్టకరం ఉపాధ్యాయులపై కమిషనర్ వీరపాండియన్ అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్సీ ఏఎస్. రామకృష్ణ అన్నారు. ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాలే కానీ, నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు కమిషనర్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. -
అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో
‘ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్’గా హెచ్‌పీసీఎల్ సీఎండీ వాసుదేవ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సీఎండీ నిషి వాసుదేవకు ఏషియా సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన ‘ప్లాట్స్’ అనే వ్యాపారసంస్థ ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డు ఏషియా పసిఫిక్ రీజియన్‌లో భారతీయ మహిళకు దక్కడం ఇదే మొదటిసారి. నిషి వాసుదేవ 1974 నుంచి హెచ్పీసీఎల్లో పనిచేస్తున్నారు. 2014 నుంచి సీఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌లో హైకమిషనర్‌గా నవతేజ్‌సింగ్ బ్రిటన్‌లో భారత కొత్త హైకమిషనర్‌గా దౌత్యవేత్త నవతేజ్ సింగ్ సర్న అక్టోబరు 31న నియమితులయ్యారు. ఆయన 1980వ బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాష్ట్రీయం దేశంలో అత్యంత పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న గట్టయ్య(40) హైదరాబాద్‌లో అక్టోబరు 31న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయన ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. కాగా గట్టయ్య ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లో జాతీయ విత్తన సదస్సు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్టోబరు 27న హైదరాబాద్‌లోని హెచ్ఐఐసీలో 8వ జాతీయ విత్తన సదస్సును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ‘దేశానికే విత్తన భాండాగారంగా తెలంగాణ’ పేరిట ఓ దర్శన పత్రాన్ని విడుదల చేశారు. విత్తన పంటలకు ప్రత్యేక బీమా, కనీసమద్దతు ధర, 15 నెలల పాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీ వంటి అంశాలను ఈ సదస్సులో తీర్మానించారు. సైన్స అండ్ టెక్నాలజీ జలాంతర్గామి కల్వరి నీటి ప్రవేశం జలాంతర్గామి కల్వరిని ముంబయిలో అక్టోబరు 29న విజయవంతంగా నీటిలో ప్రవేశపెట్టారు. ఇది మొట్టమొదటి స్కార్పీన్ శ్రేణి జలాంతర్గామి. ఈ శ్రేణిలో ఆరు జలాంతర్గాములు తయారుచేయనున్నారు. 2020 నాటికి మొత్తం తయారుకానున్నాయి. ఈ జలాంతర్గామిని త్వరలో సముద్రంలో పరీక్షించనున్నారు. ఇందులో నౌకా విధ్వంసక క్షిపణులు, టార్పెడోలను మోహరిస్తారు. యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ పరీక్ష యుద్ధనౌక ఐఎన్ఎస్ కోచి నుంచి జరిపిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమయింది. నవంబరు 1న దేశ పశ్చిమ తీరం నుంచి 290 కి.మీ.ల దూరంలో అరేబియా సముద్రంలో గల లక్ష్యనౌక అలెప్పిని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించింది. బ్రహ్మోస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించడం ఇది 49వ సారి. అంతర్జాతీయం ఒకే బిడ్డ విధానం రద్దుచేసిన చైనా చైనాలో ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికార కమ్యూనిస్టు పార్టీ అక్టోబరు 29న ప్రకటించింది. ఇకపై ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతినిచ్చింది. దేశంలో వృద్దుల సంఖ్య పెరగడం, కార్మిక శక్తి తగ్గడంతో రెండింటి మధ్య సమతుల్యం పాటించేందుకు ఒకే బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం 1970 చివర్లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పట్టణప్రాంతాల్లోని జంటలు ఒకే బిడ్డను కనాలి. గ్రామీణ ప్రాంతాల్లో తొలికాన్పు ఆడపిల్ల పుడితేనే రెండో కాన్పునకు అనుమతి ఉంటుంది. 2013 లెక్కల ప్రకారం చైనా జనాభా 135 కోట్లకు పైగా ఉంది. టాంజానియా అధ్యక్షుడిగా పాంబే మగుఫులి విజయం టాంజానియా అధ్యక్ష ఎన్నికల్లో అధికార చమా చమ పిండుజి(సీసీఎం) పార్టీకి చెందిన జాన్ పాంబే మగుఫులి విజయం సాధించారు. అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో ముగుఫులికి 58.46 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి, మాజీ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ లొవస్సాకు 39.97 శాతం ఓట్లు వచ్చాయి. టాంజానియాలో 1977 నుంచి సీసీఎం పార్టీ అధికారంలో కొనసాగుతోంది. వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్‌కు 130వ స్థానం ప్రపంచబ్యాంకు ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట రూపొందించిన జాబితాలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. 189 దేశాల జాబితాను ప్రపంచబ్యాంకు అక్టోబరు 28న విడుదల చేసింది. కొత్త కంపెనీల చట్టం, మెరుగైన విద్యుత్ సరఫరా వంటి అంశాలు భారత్‌ను 130వ స్థానంలో నిలిపాయి. మొత్తం జాబితాలో సింగపూర్‌కు మొదటి ర్యాంక్ వచ్చింది. న్యూజిలాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. గ్వాటెమాలా అధ్యక్షుడిగా జిమ్మీ మోరల్స్ గ్వాటెమాల కొత్త అధ్యక్షుడిగా టీవీ హాస్య నటుడు జిమ్మీ మోరల్స్ ఎన్నికయ్యారు. నేషనల్ కన్వర్జన్‌స ఫ్రంట్‌కు చెందిన ఆయనకు 69 శాతం ఓట్లు లభించాయి. ప్రత్యర్థి,మాజీ అధ్యక్షురాలు శాండ్రాటోర్స్కు 31 శాతం ఓట్లు దక్కాయి. సెప్టెంబరు 3న అప్పటి అధ్యక్షుడు ఒట్టోపెరెజ్ అవినీతి ఆరోపణలతో అరెస్టవడంతో ఈ ఎన్నికలు జరిగాయి. రష్యా విమానం కూలిన దుర్ఘటనలో 224 మంది మృతి రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలో అక్టోబరు 31న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 224 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ విమానం ఎర్రసముద్రంలోని పర్యాటక ప్రాంతం షర్‌మఎల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్కు వెళ్తుంది. ప్రయాణికుల్లో రష్యాకు చెందిన 214 మంది, ఉక్రెయిన్‌కు చెందిన ముగ్గురితో పాటు ఏడుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కాగా ఈ విమానాన్ని తామే కూల్చినట్లు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనుబంధ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. రష్యాలో తమసంస్థపై దాడులకు ప్రతీకారంగా విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల కూలిపోయి ఉంటుందని రష్యా వెల్లడించింది. అత్యంత విలువైన జాతీయ బ్రాండ్ల జాబితాలో భారత్‌కు 7వస్థానం ప్రపంచంలో అత్యంత విలువైన జాతీయబ్రాండ్ల జాబితాలో భారత్‌కు ఈ ఏడాది 7వ స్థానం దక్కింది. భారత బ్రాండ్ ఫైనాన్స్ నవంబరు 1న విడుదల చేసిన 100 దేశాల జాబితాలో భారత్ ఒకస్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానానికి చేరుకుంది. భారత్ బ్రాండ్ విలువ 210 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్‌లు వరసగా టాప్ స్థానాల్లో ఉన్నాయి. అమెరికా బ్రాండ్ విలువ 1970 కోట్ల డాలర్లుగా ఉంది. ఒకదేశంలోని అన్ని బ్రాండ్ల ఐదేళ్ల విక్రయాల ఆధారంగా జాతీయ బ్రాండు విలువను లెక్కిస్తారు. 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మృతి ప్రపంచవ్యాప్తంగా 2014లో క్షయవ్యాధితో 15 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అక్టోబరు 29న తన నివేదికలో ప్రకటించింది. 2014లో ప్రపంచవ్యాప్తంగా 96 లక్షల మందికి కొత్తగా క్షయ వ్యాధి సోకింది. భారత్‌లో అత్యధికంగా 23 శాతం కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, చైనాలో 10 శాతం చొప్పున నమోదయ్యాయి. 2014లో మరణించిన 15 లక్షల మందిలో మూడింట రెండొంతుల మంది భారత్, నైజీరియాలోనే ఉన్నారు. క్షయవ్యాప్తి 1990లో కన్నా 2015లో 42 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది. నేపాల్ అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారీ నేపాల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విద్యాదేవి భండారీ అక్టోబరు 28న ఎన్నికయ్యారు. నేపాల్ పార్లమెంట్లో విద్యాదేవికి 327 ఓట్లు లభించగా ప్రత్యర్థి నేపాలీ కాంగ్రెస్ నేత కుల్ బహదూర్ గురుంగ్‌కు 214 ఓట్లు దక్కాయి. సీపీఎన్-యూఎంఎల్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న విద్యాదేవి (54) గతంలో నేపాల్ తొలి రక్షణ మంత్రిగా 2009 మే నుంచి 2011 ఫిబ్రవరి వరకు పనిచేశారు. క్రీడలు సానియా-హింగిస్‌లకు డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ సానియా మీర్జా(భారత్), మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లు డబ్ల్యూటీఏ ఫైనల్స్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. నవంబరు 1న సింగపూర్‌లో జరిగిన ఫైనల్లో ముగురుజ-సురెజ్ నవారో(స్పెయిన్) జోడిని సానియా-హింగిస్ ఓడించారు. ఈ సీజన్లో వీరు పది టోర్నమెంట్లలో ఫైనల్స్‌కు చేరుకోగా తొమ్మిదింట్లో గెలిచారు. ఇందులో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సానియాకు ఇది రెండో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్. ఈ గెలుపుతో హింగిస్ కెరీర్లో 50 డబ్ల్యూటీఏ టైటిళ్లు సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. వార్తల్లో వ్యక్తులు హీరో సంస్థ వ్యవస్థాపకుడు ముంజాల్ మృతి ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు మోహన్‌లాల్ ముంజాల్ (92) ఢిల్లీలో నవంబరు 1న మృతి చెందారు. లూథియానాలో సైకిల్ విడిభాగాల తయారీని ఆయన తొలుత ప్రారంభించారు. 1956లో హీరో సంస్థను ఏర్పాటు చేశారు. అవార్డులు రైఫ్ బదావీకి ఐరోపా మానవహక్కుల అవార్డు సౌదీ బ్లాగర్ రైఫ్ బదావీకి ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవహక్కుల పురస్కారం లభించింది. అక్టోబరు 29న ఐరోపా పార్లమెంట్ బదావీకి ఈ అవార్డును ప్రకటించింది. వాక్ స్వాతంత్య్రం కోసం బదావీ పోరాడారు. సౌదీ లిబరల్ నెట్వర్క్ అనే చర్చావేదికను ఏర్పాటు చేసి ప్రజా జీవితంపై మత ప్రభావాన్ని అరికట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. 2012లో ఆయనను అరెస్ట్ చేసి వెబ్‌సైట్‌ను మూసివేశారు. అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో మండేలాకు మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన అత్యంత గౌరవనీయ వ్యక్తుల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటిస్థానంలో నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఈ జాబితాను అక్టోబరు 28న విడుదల చేసింది. 2015 సంవత్సరానికి నిర్వహించిన సర్వేలో పోప్ ఫ్రాన్సిన్ రెండో స్థానంలో, టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ ముస్క్ మూడోస్థానంలో ఉన్నారు. మహాత్మాగాంధీకి నాలుగోస్థానం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ పదోస్థానంలో నిలిచారు. సంక్షిప్తంగా దేశంలో 93 శాతం పెద్దలు ఆధార్ కార్డును పొందారని ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్ నమోదులో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 190 దేశాలు ఖండించాయి. ఈ మేరకు ఐరాసలో క్యూబాకు మద్దతుగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయెల్ మినహా అన్ని సభ్యదేశాలు సమర్థించాయి. ప్రపంచంలో అత్యధికంగా పసిడి వినియోగిస్తున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ ఏడాది భారత్ తొమ్మిది నెలల్లో 642 టన్నుల బంగారాన్ని వినియోగించిందని జీఎఫ్ఎంఎస్ గోల్డ్ సర్వే 2015 మూడో త్రైమాసిక రిపోర్టులో థామ్సన్ రాయిటర్స్ పేర్కొంది. రెండో స్థానంలో చైనా నిలిచింది. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతిని పురస్కరించుకుని ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. -
ఫలించని చివరి ప్రయత్నం...
-
మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
నల్లగొండ : జిల్లాలో మద్యం అమ్మకాలు పడిపోవడానికి గల కారణం ఏమిటి..? పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అవుతుందా..? ఏ కారణం చేత జూలై మాసంలో మద్యం అమ్మకాలు పడిపోయాయి..? అని ఎక్సైజ్ శాఖ క మిషనర్ ఆర్. చంద్రవదన్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల పై ప్రశ్నల వర్షం కురిపించారు. శ నివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో ప్రధానంగా రెండు అంశాల మీద చర్చ జరిగింది. దాంట్లో మొదటిది తగ్గిన మద్యం అమ్మకాల పై కాగా...రెండోది క్రైం రేటుకు సంబంధించి. మద్యం అమ్మకాలు తగ్గడానికి గల కారణం పోలీసుల దాడులనేనని ఇన్స్పెక్టర్లు స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్టుదుకాణాల పై పోలీసు శాఖ దాడులు చే స్తున్నందునే మద్యం అమ్మకాలు పడిపోయాయని తేల్చిచెప్పారు. సారా అమ్మకాల జోలికి వెళ్లిన పోలీస్ శాఖ కేవలం బెల్టుదుకాణాల పైనే కేసులు నమోదు చేయడం ఎక్సైజ్ శాఖ పై తీవ్ర ప్రభావం చూపుతోందని కమిషనర్‌కు బదులిచ్చారు. బెల్టుదుకాణాలు, సారా అమ్మకాలను రెండింటి పైనే దాడులు చేసి కేసులు నమోదు చేసే అధికారులు రెండు శాఖలకు ఉన్నప్పుడు కేవలం బెల్టుదుకాణాల పైనే పోలీస్ శాఖ దృష్టి సారించిందని అధికా రులు వివరించినట్లు తెలిసింది. దీని పై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ...నాటుసారా , బెల్లం అమ్మకాల పై సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారని...ఎట్టి పరిస్థితుల్లో గ్రా మాల్లో నాటుసారా అమ్మకాలు జరగడానికి వీల్లేదని ఇన్‌స్పెక్టర్లుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త మద్యం పాలసీ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాల్లో సారా అమ్మకాలు లేకుండా కేసులు నమోదు పెంచాలని కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. కేసులు నమోదు పట్ల ఎవరైన సీఐలు, ఎస్ఐలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో డీసీ అనుసూయ దేవీ, ఈఎస్‌లు దత్తురాజుగౌడ్, శ్రీనివాస్‌రావు, ఎస్టీఎఫ్ ఏసీ నాగేశ్వరరావు, ఎస్టీఎఫ్ ఏఎస్పీ పాల్గొన్నారు. -
‘నీలగిరి’ కమిషనర్ కినుక !
నల్లగొండ టూ టౌన్ :ఒక చిన్న విషయంపైనే తనను సరెండర్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘ చర్చ పెట్టడంతో నీలగిరి మున్సిపల్ కమిషనర్ కె.అలివేలు మంగతాయారు కినుక వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘటనతో ఆమె ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. కౌన్సిల్ సమావేశం అనంతరం గురువారం హైదరాబాద్ వెళ్లిన ఆమె తనకు 10 రోజులు సెలవు కావాలని మున్సిపల్ పరిపాలన శాఖకు విజ్ఞప్తి చేశారని, కానీ ఉన్నతాధికారులు ఆమె సెలవుపై వెళ్లేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. సరెండర్ వెనుక ఆంతర్యం ఏమిటీ..? మున్సిపల్ కమిషనర్‌గా అలివేలు మంగతాయారును తీసుకుచ్చిన అధికార పార్టీ నేతలే ఇప్పుడు ఆమెను సరెండర్ చేయాలని పట్టు పట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో బహిరంగ రహస్యమే. ప్రకాశం బజార్‌లోని మున్సిపల్ మడిగెల వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రకాశం బజార్‌లోని 234 మున్సిపల్ షాపులను లీజుకు ఇచ్చి 25 సంవత్సరాలు దాటింది. దీనిపై పలుసార్లు కోర్టులో కేసు నడిచింది. హైకోర్టు కూడా బహిరంగ వేలం పెట్టి లీజుకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. దాదాపు ఏడాది అవుతున్నా వేలం నిర్వహించడానికి అనేక అడ్డంకులు తగిలాయి. రెండు సార్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వేలం పెట్టాలని తీర్మానం కూడా చేశారు. కానీ ఆ తరువాత బహిరంగ వేలం వేయకుండా అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను కమిషనర్ ఖాత రు చేయకపోవడంతోనే ఇరువురి మధ్య సఖ్య త దెబ్బతిన్నట్లు తెలిసింది. లీజులో ఉన్న వ్యా పారులు చేసిన లాబీయింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా చివరి నిమిషంలో నెల రోజులు వాయిదా వేయాలని వేలం నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షాపుల లీజు బహిరంగ వేలం ఉద్యోగుల మెడపై కత్తిలా మారుతోంది. ఈ విషయంలో ముఖ్యంగా కమిషనర్‌పై అధికార పార్టీ నేతల ఒత్తిడి ఎక్కువ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు వివిధ పనుల కోసం వచ్చే కొంత మంది కౌన్సిలర్లు సైతం ఉద్యోగుల పట్ల అగౌరవంగా మాట్లాతున్నారనే విషయం బహిరంగ రహస్యమే. మున్సిపల్ కమిషనర్ అని కూడా చూడకుండా కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతున్న తీరుపై మంగతాయారు గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌కు కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేశారు. సరెండరే పరిష్కారమా? కొంత కాలం నుంచి నీలగిరి మున్సిపాలిటీలో ఉద్యోగం చేయాలంటేనే ఉద్యోగులు హడలెత్తే పరిస్థితులు వచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కమిషనర్, ఇతర ఉద్యోగులు తప్పు చేసినప్పుడు ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలే తప్ప ఏకంగా కౌన్సిల్ సమావేశంలో ఒక ఉద్యోగిని ని సరెండర్ చేయాలని పట్టుపట్టడం ఇక్కడ చర్చానీయంశంగా మారింది. అసలు చేసిన తప్పు ఏంటో తేల్చకుండా సరెండర్ చేయాలని కౌన్సిలర్లు మాట్లాడడం వెనుక అంతర్యమేమిటనేది అంతు పట్టడం లేదు. వీళ్లు ఎస్ అంటే.. వాళ్లు నో వాస్తవానికి కమిషనర్‌ను సరెండర్ చేయాలనే డిమాండ్ విషయంలో మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష టీఆర్ఎస్ల మధ్య ఆధిపత్య పోరు కారణమనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు అందరికీ తెలిసినవే. అవి ప్రకాశం బజార్ మడిగెల విషయంలో మరింత ముదిరాయి. రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఇరు పార్టీలు ఎత్తు మీద ఎత్తు వేస్తున్నాయి. ఇటీవలే ప్రకాశం బజార్ మడిగెల విషయంలో మున్సిపల్ ఛాంబర్ ఎదుట కాంగ్రెస్ కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏకంగా కమిషనర్‌ను సరెం డర్ చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని రాజకీయ వర్గాలంటున్నాయి. అయితే, టీఆర్ఎస్ వాళ్లు సరెండర్ చేయాలనడంతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు నో అనడం గమనార్హం. నేను సెలవు పెట్టడం లేదు: కమిషనర్ ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మంగతాయారును ‘సాక్షి’ వివరణ కోరగా తాను సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నానన్న విషయంలో వాస్తవం లేదని చెప్పారు. శాఖాపరమైన సమీక్ష కోసం తాను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి వెళ్లానని, సెలవు పెట్టి వెళ్లే పరిస్థితుల్లో తాను లేనని తెలిపారు. -
ఎక్సయిజ్‌కు చుక్కెదురు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :మద్యం విక్రయాల ద్వారా లాభపడదామని భావించిన ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. కోట్లాది రూపాయల లెసైన్సు ఫీజును వదులుకుని ప్రభుత్వ సిబ్బందే మద్యం విక్రయించేలా తీసుకున్న నిర్ణయం స్థానికంగా విమర్శలపాలవుతోంది. జిల్లాలో 2015-17మధ్య కాలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 23చోట్ల ప్రభుత్వమే మద్యం విక్రయించేలా దుకాణాల ఏర్పాటు ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ కూడా గత నెల 30వ తేదీనాటికే పూర్తికావాల్సి ఉండగా ప్రైవేట్ మద్యం దుకాణాల లాటరీ కార్యక్రమంలో అధికారులు తలమునకలైపోవడంతో ఈ నెల 3వ తేదీ నాటికి కచ్చితంగా అన్ని చోట్లా పూర్తిచేస్తామని కమిషనర్‌కు భరోసా ఇచ్చారు. ఇవీ ఇబ్బందులు శ్రీకాకుళం జిల్లాలో మునిసిపాలిటీలో ఒకటి, గార, కళ్లేపల్లి, చిలకపాలెం, ఆమదాలవలస, పైడిభీమవరం, పొందూరు, నరసన్నపేట, పోలాకి, పాలకొండ, వీరఘట్టం, రాజాం, ఉంగరాడ మెట్ట, పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట, బారువ, ఇచ్చాపురం పరిధిలో ఒక్కో దుకాణం ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. అయితే శ్రీకాకుళం పట్టణంలో దుకాణం ఏర్పాటుకు స్థలం దొరకడం లేదు. సోంపేటలో పంచాయతీ కార్యాల యం పరిధిలో ఉన్న ఓ భవనంలో దుకాణం ఏర్పాటుకు కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ మంగళవారమే ప్రారంభిం చేశారు. ఇక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశౠలు లేకపోలేదు. పోలాకిలో కూడా నేడో, రేపో దుకాణం ఏర్పాటు ఖాయమని అధికారులు చెబుతున్నారు. శ్రీకూర్మం పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుకు స్థానికులు అంగీకరించడం లేదు. దైవ సన్నిధి సమీపంలో ప్రభుత్వమే మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎలా అంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే 500మీటర్ల దూరంలో దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన చట్టంలో ఉండడంతో అధికారులు రేపోమాపో దుకాణం ఏర్పాటుకు సిద్ధమైపోయారు. అదే విధంగా ఆమదాలవలస సహా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలేర్పాటుపై స్థానికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని జెడ్పీ సమీపంలో గతంలో ఓ దుకాణం ఉండేది. స్థానికులు ఆ దుకాణంపై ఫిర్యాదివ్వడంతో కలెక్టర్ చొరవతో ఆ దుకాణం పలాసకు మారింది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ దుకాణం ఎక్కడ ఏర్పాటు కానుందో స్పష్టత రావడం లేదు. ప్రొసీడింగ్స్ కరువు దుకాణాలేర్పాటు విషయంలో ఉన్నతాధికారుల నుంచీ సమాచారం కరువైంది. దుకాణాలేర్పాటుకు గడువు, గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న వివరాలకు అధికారులు జారీ చేసిన సమాచారానికీ తేడా వంటి విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. దుకాణాల్లో ఎక్సైజ్‌శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం విక్రయాలు చేపడుతుండగా స్థానిక సీఐ వ్యాపార లావాదేవీలు చూస్తున్నారు. అయితే కానిస్టేబుళ్లు ప్రభుత్వ మద్యం దుకాణాలకే పరిమితమైపోతే మిగతా పనులకు ఆటంకం కలుగుతుందనేది తెలిసిందే. కొన్ని చోట్ల స్థానికుల వ్యతిరేకత కారణంగా ఈ దుకాణాలు ఎన్నాళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి. స్వచ్చమైన మద్యంతో పాటు ఎమ్మార్పీ పక్కాగా అమలు చేసేందుకు ఏర్పాటవుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో..స్థానిక వ్యాపారులతో పోటీ తప్పదు. ధర తగ్గించి అమ్మడం, డిస్కౌంట్లు ప్రకటించడం వంటివి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కుదరవు. అదే విధంగా పర్మిట్ రూం ఏర్పాటు, ప్రైవేట్ సిబ్బంది నియామకం విషయంలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇవన్నీ ఎలారా బాబూ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
కాసుల కోసం కానిస్టేబుల్ వీరంగం
- ట్రాక్టర్ డ్రైవర్‌పై కానిస్టేబుల్ దాష్టికం - రూ.10 వేల కోసం నడిరోడ్డుపై దాడి - కొత్త కమిషనర్‌ను ఆశ్రయించనున్న బాధితులు వరంగల్ క్రైం : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ పనితీరు వివాదాస్పదంగా మారింది. చేసేది ఖాకీ ఉద్యోగమే అయినా.. గుడుంబా డాన్‌గా అతడికి పేరుంది. అక్రమ కార్యకలాపాలను అరికట్టాల్సిందిపోయి.. ఇవి జరిగిన చోటుకు వెళ్లి డబ్బుల కోసం డిమాండ్ చే స్తుండడం ఆయనకు రివాజుగా మారింది. గురువారం ఓ ట్రాక్టర్ ్రైడె వర్ను ఇలాగే డబ్బుల కోసం బెదిరించి దాడి చేసిన ఘటన ఆ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రతిరోజు మాదిరిగానే మిల్స్‌కాలనీ కానిస్టేబుల్ అలియాస్ గుడుంబా డాన్ గురువారం గుడుంబా తీసుకుని ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. గవిచర్ల, తీగరాజుపల్లిలో గుడుంబా తీసుకుని కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేట జంక్షన్ ప్రాంతాలకు చేరుకున్నాడు. మధ్యాహ్నం ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని శ్రీసాయినగర్ కాలనీ మీదుగా వెళుతుండగా అత డికి ఒక ఇసుక ట్రాక్టర్ తారాసపడింది. తన దగ్గర ఉన్న సరుకును గమ్యానికి చేరవేశాడు. వెంటనే ట్రాక్టర్ వద్ద ప్రత్యక్షమయ్యాడు. కానిస్టేబుల్ తన కోసమే వస్తున్నాడని గ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్ కొండేటి భాస్కర్ ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి వేగంగా కదిలించేందుకు యత్నించాడు. ఇంతలోనే కానిస్టేబుల్ ట్రాక్టర్‌పైకి ఎక్కి డ్రైవర్ భాస్కర్‌ను గల్లా పట్టుకుని కిందకు దించాడు. తప్పించుకుపోదామనుకుంటున్నావురా.. అని బూతులు తిట్టాడు. డ్రైవర్ భయానికి లోను కావడంతో రూ.10 వేలు ఇస్తేనే ట్రాక్టర్‌ను వదిలిపెడతానని, లేదంటే తాటా తీస్తానని బెదిరించాడు. తన వద్ద డబ్బులు లేవని తాను కేవలం డ్రైవర్‌ను మాత్రమేనని భాస్కర్ చెప్పాడు. దీంతో నాకు ఎదురుచెబుతావురా అంటూ భాస్కర్‌ను ట్రాక్టర్ పైనుంచి కిందకు దించాడు. నడి రోడ్డుపై విచక్షణరహితంగా చితకబాదాడు. కానిస్టేబుల్ ముష్టిఘాతాలకు తాళలేక అతడు రోడ్డుపై పరుగులు తీశాడు. కానిస్టేబుల్ ఊరుకోకుండా డ్రైవర్ వెంటపడిమరీ తీవ్రంగా కొట్టాడు. రోడ్డుపై వెళ్తున్నవారు చూస్తున్నప్పటికీ కానిస్టేబుల్‌ను గుర్తుపట్టి తమకెందులే అని పక్కకు తప్పుకున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ యజమాని అక్కడికి చేరుకున్నాడు. డ్రైవర్‌ను వదిలేయాలని కానిస్టేబుల్‌ను బతిమాలాడాడు. కానిస్టేబుల్ ఇదేమీ వినకుండా ట్రాక్టర్ యజమానిపైనా దాడికి దిగాడు. కానిస్టేబుల్ అలిసిపోయి వదిలేసిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్, యజమాని వెళ్లి జరిగిన విషయాన్ని తమ వర్ధన్నపేట గ్రామస్తులకు తెలిపారు. వారి సలహాతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వరంగల్‌లో జరిగిన ఈ సంఘటనపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సలహా ఇచ్చారు. దాడి ఘటనపై శుక్రవారం ఉదయం పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబును కలుస్తామని బాధితులు తెలిపారు. -
కేసీఆర్‌ను కలిసిన డీజీపీ, కమిషనర్
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం డీజీపీ అనురాగ్ శర్మ, కమిషనర్ మహేందర్ రెడ్డి కలిశారు. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన నివేదికను వారు ఈ సందర్భంగా కేసీఆర్‌కు సమర్పించారు. మరోవైపు ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. -
వేటు పడింది
విశాఖపట్నం: అనకాపల్లి రవాణాశాఖ కార్యలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారులపై వేటు పడింది. విద్యార్హతలను పరిశీలించకుండా డైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీలు అందించారని ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై పైఅధికారులకు రికార్డులు దొరకకుండా కింది స్థాయి ఉద్యోగులు మాయం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆర్డీవో మహ్మద్ సలీం,ఏఓ నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణి లపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం అర్ధరాత్రి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ రవాణాశాఖ కమిషననర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
చీకటి ఒప్పందం
- ఎల్ఈడీ కాంట్రాక్ట్‌లో ‘నారాయణ’ తంత్రం - కౌన్సిల్‌ను డమ్మీ చేసిన వైనం - గప్‌చుప్‌గా కమిషనర్‌తో సంతకం - నేడు స్టాండింగ్ కమిటీ ముందుకు.. విజయవాడ సెంట్రల్ : వీధి దీపాల్లో చీకటి ఒప్పందం కుదిరింది. ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టులో ప్రభుత్వం జరిపిన మంత్రాంగం వివాదాస్పదమైంది. నగరంలో 30వేల ఎల్ఈడీ లైట్లు వేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ అక్రమంగా కట్టబెట్టారు. రూ.25కోట్ల పెట్టుబడితో వారు స్ట్రీట్‌లైట్లు ఏర్పాటుచేస్తే ఏడేళ్లలో రూ.48.14 కోట్లు తిరిగి చెల్లించాలన్నది ఒప్పందం. ఈ మేరకు ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 74ను జారీ చేసింది. నెలరోజుల కిందట కమిషనర్ జి.వీరపాండియన్‌ను మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హడావుడిగా తుళ్లూరు పిలిచి ఒప్పంద పత్రంపై సంతకం చేయించారు. శనివారం జరగనున్న స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని ఆమోదానికి పెట్టారు. కాగా, కౌన్సిల్ దృష్టికి రాకుండా రూ.48.14 కోట్ల డీల్ ఓకే చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్థానిక సంస్థల (కౌన్సిల్)పై సర్కార్ కర్రపెత్తనం ఏవిధంగా చేస్తోందో ఈ అంశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. కౌన్సిల్లో రికార్డు చేయలేదేం? కౌన్సిల్‌కు తెలియకుండా కమిషనర్‌తో మంత్రి సంతకం చేయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేస్తే రూ.48.14 కాంట్రాక్ట్ ఢిల్లీ కంపెనీ వశమవుతుంది. నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే జీవోలను కౌన్సిల్లో రికార్డు చేయాలి. ఇందుకు విరుద్ధంగా స్టాండింగ్ కమిటీ చర్చతో సరిపెట్టేద్దామని పాలకులు భావిస్తున్నారు. మంత్రి నారాయణ నుంచి వ చ్చిన ఒత్తిడి కారణంగానే ఈవిధంగా వ్యవహారం నడిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టాండింగ్ కమిటీదే ప్రధాన పాత్ర వీధి దీపాల నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ 2008లో రియల్ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. దీనికి సంబంధించి నెలకు రూ.26 లక్షలు చెల్లిస్తున్నారు. గత ఏడాదితో కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయింది. మంత్రి సి‘ఫార్సు’తో మరో ఆరు నెలలు పొడిగించారు. జూన్‌తో కాంట్రాక్ట్ పూర్తి కావొస్తోంది. ఒప్పందం ప్రకారం రియల్ ఎనర్జీ సంస్థ వీధిదీపాలు, మెటీరియల్‌ను నగరపాలక సంస్థకు అప్పగించి వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేసే బాధ్యతను ఎనర్జీ ఎఫెషియెన్సీ సర్వీస్‌కు అప్పగిస్తూ కమిషనర్ ఒప్పంద పత్రంపై సంతకం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేక అకౌంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ రూ.24.50 కోట్ల పెట్టుబడితో నగరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నెలకు రూ.57.31 లక్షల చొప్పున ఏడేళ్ల వ్యవధిలో రూ.48కోట్ల14 లక్షల 14వేల 500 నగరపాలక సంస్థ చెల్లించాలి. ఇందుకోసం ఎస్కరో ప్రత్యేక అకౌంట్‌ను తెరుస్తున్నారు. దీని ప్రకారం పన్నుల ద్వారా వసూలయ్యే సొమ్ములో రూ.57.31 లక్షలు ప్రతినెలా ఈ అకౌంట్లో జమ అవుతాయి. ఇంత తతంగాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కౌన్సిల్‌ను డమ్మీ చేసిన సర్కార్ తీరుపై స్టాండింగ్ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. -
‘గూడెం’ కౌన్సిల్లో రగడ
గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం - పలు అంశాలను లేవనెత్తిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సస్పెన్షన్ - టెండర్ల రద్దుపై కొనసాగిన వాదనలు - మీడియాను అనుమతించని కమిషనర్ కొత్తగూడెం: పాలకవర్గం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో..సభలో గందరగోళం నెలకొంది. 37 అంశాలతో చేపట్టిన మున్సిపల్ సమావేశంలో కనీసం ప్రతిపక్షానికి సమాధానం చెప్పకుండానే ఏకపక్షంగా కొనసాగింది. సింగిల్ టెండర్ల రద్దు విషయంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 94 ప్రకారం లెస్‌కు వేసిన సింగిల్ టెండర్లు ఆమోదించాల్సి ఉండగా..రద్దు చేయాలంటూ పాలకపక్షం తీర్మానించడం సబబు కాదన్నారు. 10 నెలల కాలంలో ఐదు సింగిల్ టెండర్లను ఆమోదించిన కౌన్సిల్, కేవలం తమ వర్గానికి చెందినవారికి టెండర్ దక్కలేదనే దురుద్దేశంతోనే వాటిని రద్దు చేయాలని తీర్మానించిందన్నారు. ఎజెండాలో అంశాలను ఆమోదం కొరకు చేర్చే పాలకపక్షం వారే దానిని వ్యతిరేకించడం తగదన్నారు. ఈ విషయంపై గంటపాటు వాదోపవాదాలు జరిగాయి. మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్‌గా పనిచేసిన కె.స్వామిని గతేడాది సెప్టెంబర్‌లో సరెండర్ చేస్తున్నట్లు తీర్మానించి, దళితుడు కావడంతో ఏడు నెలలుగా లెటర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు కారు ఏర్పాటు విషయంలో టెండర్లు పిలవకుండా కొటేషన్లను ఆమోదం కోసం కౌన్సిల్ అంశంలో చేర్చడమేంటని ప్రశ్నించారు. పీఎఫ్, ఈఎస్ఐ లేకుండానే టౌన్‌లెవెల్ ఫెడరేషన్‌కు కాంట్రాక్టును అప్పగించడంపై అభ్యంతరం తెలిపారు. ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ సస్పెన్షన్.. ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఎజెండాలో చేర్చిన అంశాలపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్‌ను రెండు నెలలు సస్పెండ్ చేయాలంటూ చైర్పర్సన్ పులి గీత తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కౌన్సిలర్లను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మున్సిపల్ కార్యాలయం ముందు తిష్టవేసి ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అంశాలు చర్చించకుండానే ఆమోదం.. మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎజెండాలో 38 సాధారణ అంశాలతోపాటు మరో రెండు అంశాలపై చర్చించి కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే రెండుమూడు అంశాలపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్, భీమా శ్రీవల్లి చర్చను లేవనెత్తారు. దీంతో దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం 38 అంశాలను కౌన్సిల్లో చర్చించకుండానే ఆమోదిస్తున్నట్లుగా చైర్పర్సన్ ప్రకటించారు. ప్రజల సమస్యలపై చర్చించకుండానే ఏకపక్షంగా కౌన్సిల్ ఆమోదించడంపట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోమారు మీడియాపై ఆంక్షలు.. మున్సిపల్ చట్టం షెడ్యూల్-3, రూల్-1 ప్రకారం మున్సిపాల్టీలో జరిగే అన్ని సమావేశాలకు మీడియాను అనుమతించాల్సి ఉంది. అయితే గతనెల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మీడియాను నిషేధిస్తూ బయటకు పంపించి వేశారు. ఈ అంశంపై అదేరోజు మీడియా ప్రతినిధులు ఆందోళన సైతం చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో కూడా మీడియా ప్రతినిధులను అనుమతించకుండా ఆంక్షలు విధించారు. కేవలం పాలకపక్షం స్వలాభం కోసం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకే మీడియూను అనుమతించలేదని పాలకపక్ష కౌన్సిలర్లే పేర్కొనడం గమనార్హం. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పులిగీత, కమిషనర్ సైఫుల్లా అహ్మద్, డీఈ సలీం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నకిలీ రసీదులు.. రెట్టింపు వసూళ్లు!
- ఆశీలు వసూలులో కాంట్రాక్టర్ నిర్వాకం - రాజాం నగర పంచాయతీలో దందా - నిత్య దోపిడీకి గురవుతున్న వ్యాపారులు, వాహనదారులు - కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం - దాంతో కలెక్టర్‌ను ఆశ్రయించిన స్థానికులు రాజాం : కాంట్రాక్టర్ అత్యాశకు పోతున్నాడు. కమిషనర్ స్పందించడం లేదు. ఇంకేముంది.. వ్యాపారులు, వాహనాల యజమానులు నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఇదంతా రాజాం నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లలో జరుగుతున్న తంతు. ఆశీలు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు ముద్రించి వాహనాలు, షాపుల నుంచి నిర్ణీత రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ మార్కెట్లలో షాపులు, వాహనాలు, వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. నగర పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి రూ.6 లక్షల వరకు పాట వెళ్లేది. అయితే ఆదాయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు పార్కింగ్, షాపుల ఫీజులను 100 నుంచి 150 శాతం వరకు పెంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన ముతికి వెంకట్రావు అనే వ్యక్తి రూ.15 లక్షలకు ఆశీలు కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తక, వ్యాపార సముదాయాలు, వాహనదారుల నుంచి ఆశీలు వసూలు ప్రారంభించారు. అయితే నగర పంచాయతీ గెజిట్‌లో పేర్కొన్న రేట్ల ప్రకారమే వసూలు చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ రసీదులు ముద్రించారు. రసీదులపై నగర పంచాయతీ సీలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈయన ఇస్తున్న రసీదులపై దొంగ ముద్రలు కనిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక లారీకి గెజిట్ ప్రకారం రూ.83 ఆశీలు వసూలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు రసీదులు కూడా చూపించారు. అదేవిధంగా షాపులు, ఇతర తోపుడు బళ్లు, చిరువ్యాపారుల నుంచి నిర్ణీత ఫీజు కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ సంపాదనే తక్కువని.. అందులోనూ దోపిడీకి పాల్పడితే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తీరుకు నిరసనగా పారంకోటి సుధ, ఆశపు సూర్యం, పల్ల అప్పలనాయుడు, వంజరాపు రాము తదితరులు ఇటీవల నగర పంచాయతీ కమిషనర్ సింహాచలాన్ని కలిసి పిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని కమిషనర్ వారికి చెప్పారు. అయినా వసూళ్లు ఆగకపోవడంతో బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
'సాక్షి' కథనానికి స్పందన
-
కమిషనర్‌పై బదిలీ వేటు ?
సాక్షి, బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారి డి.కె.రవి గత సోమవారం కోరమంగళలోని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో డి.కె.రవి నివాసానికి చేరుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి ఆ వెంటనే అక్కడి విలేకరులతో మాట్లాడుతూ...‘ఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాలను బట్టి డి.కె.రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది’ అని ప్రకటించేశారు. దీంతో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ కేసులో అసలేమీ దర్యాప్తు జరగకుండానే డి.కె.రవి ఆత్మహత్యకు పాల్పడ్డారని నగర పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి ప్రకటన చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు డి.కె.రవి తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును పక్కదారి పట్టించేందుకే సంఘటన జరిగిన కాసేపటికే డి.కె.రవి మృతిని ఆత్మహత్యగా చిత్రిస్తూ కమిషనర్‌తో ప్రకటన చేయించారని విపక్షాలు సైతం విమర్శించాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. కమిషనర్ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఓ కేసులో ఇలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్యలను ఎలా చేశారంటూ విపక్షాలు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిని సమర్థించేందుకు స్వయానా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రయత్నించినా విపక్షాలను ఒప్పించ లేకపోయారు. ఇక గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో సైతం అనేక మంది మంత్రులు సైతం ఎం.ఎన్.రెడ్డిని బదిలీ చేయాల్సిందేనని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఇక హోం శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమవుతుండడంతో పాటు డి.కె.రవి మృతి కేసులో ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్న కె.జె.జార్జ్‌ను సైతం హోం శాఖ బాధ్యతల నుంచి తప్పించి వేరే ఏదైనా అప్రాధాన్య శాఖను కట్టబెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్‌ను ఇప్పుడే ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పిస్తే విపక్షాలకు విమర్శలు చేసేందుకు మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్న సిద్ధరామయ్య జార్జ్ శాఖ మార్పునకు సంబంధించి మరికొంత కాలం వేచి చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రొయ్యల హేచరీలలో కమిషనర్ తనిఖీలు
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని రొయ్యల హేచరీలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తనిఖీలు చేశారు. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం చుట్టుపక్కల ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనుమతి లేని హేచరీలపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. -
ఏప్రిల్ నుంచి ఈ-పట్టాదార్ పాస్ పుస్తకాలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాలను ఏప్రిల్ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తిరిగి ఈ-పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీచేయాలని..భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో మీ సేవ అధికారులు, రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్య కమిషనర్ అధర్ సిన్హా సోమవారం నిర్ణయించారు. పాస్ పుస్తకాల ముద్రణకు వెంటనే టెండర్లను పిలవాలని రెవెన్యూ అధికారులను అదేశించారు. కొత్తగా సిద్ధం చేయనున్న పాస్‌పుస్తకాల్లో పొందుపర్చాల్సిన నూతన అంశాలపై చర్చించారు. ఈ-పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని మీసేవ కేంద్రాల అదనపు డెరైక్టర్ హరితకు సూచించారు. -
నీళ్లు లేకుండా..ఎలా బతికేది?
‘మదనపల్లెలో తాగేందుకూ నీళ్లు దొరకడంలేదు.గొంతు తడవాలంటే మూడు రూపాయలు ఖర్చుచేయాల్సిందే.మున్సిపాలిటీ వాళ్లు వదిలే నీళ్లు ఏ మాత్రం సరిపోవు.కొళాయిల్లో సన్నగా నీరొస్తోంది. అదీ గంట మాత్రమే. బిందెనిండేసరికి అరగంటపైనే పడుతోంది. అసలే కరువు నేల.భార్యాభర్త పనికెళితేనే పట్టెడన్నం దొరుకుతుంది. నీళ్లకోసమేఒకరు ఇంటి వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. పస్తులు తప్పడంలేదు. ప్రయివేటు ట్యాంకర్ల వద్ద మూడు రూపాయలు వెచ్చించిబిందె నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. బిడ్డా..గొడ్డూ ఉండేవాళ్లునీళ్లులేకుండా ఎలా బతికేది?. బతుకుబండిని ఎలా నెట్టుకొచ్చేది’ఇదీ మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల ఆక్రందన.ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకుమున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ ‘సాక్షి’ తరపున శుక్రవారం విలేకరిగా మారారు. 13వ వార్డుకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కమిషనర్ హామీలు మీ వార్డుకు విలేకరిగా వచ్చాను. ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నా. అందరూ నీటి సమస్యపైనే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. బోర్లులేని చోట అదనంగా బోర్లు వేయిస్తా. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తా. ఇక కొందరు రోడ్లు బాగాలేవని, దోమల బెడద ఎక్కువగా ఉందని.. వీధిలైట్లు వెలగడంలేదని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా. దేవ్‌సింగ్: నమస్తే అమ్మా.. నా పేరు దేవ్‌సింగ్. మదనపల్లె మున్సిపల్ కమిషనర్‌ను. మీ వార్డులో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఏయే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు?. సరళ: వారానికి ఒక రోజు మంచినీరు వస్తుంది. అది కూడా సన్నగా కారడంతో బిందె నిండేందుకు అరగంటపైనే పడుతోంది. నీళ్లు ఏమాత్రం చాలడంలేదు. డబ్బు ఖర్చుచేయందే గుక్కతడవడంలేదు. ట్యాంకర్ నీటికి ఐదొందల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. రెండు, మూడు రోజులకోసారి నీళ్లు వచ్చేలా చూడండి. చేతి బోరు ఉంటే బాగుంటుంది. కొళాయిల్లో నీళ్లు రానప్పుడు నీళ్లు బోరునీటినైనా వాడుకోవచ్చు. దేవ్‌సింగ్: మున్సిపల్ బోర్లులో కూడా నీళ్లు లేవు. దాదాపు 70 బోర్లు ఎండిపోయాయి. వర్షాలు వస్తే తప్ప మంచినీరు మెరుగుపరచలేం. కొంతకాలంగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. తాగునీరు మూడు రోజులకోసారి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. బోరు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. చంద్రలీల: నా భర్త చనిపోయి ఎనిమిది నెలలు అవుతోంది. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు అందలేదు. కుటంబ పోషణ కష్టంగా ఉంది. దయచేసి పింఛన్ వచ్చేలా చూడండి సామీ. దేవ్‌సింగ్: మీరు పెట్టుకున్న దరఖాస్తు ఒకసారి మున్సిపల్ కార్యాలయంలో చూపించండి. పరిశీలించి న్యాయం చేస్తాం. జీఆర్ రమాదేవి: వివేకానందనగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ మార్గంలో ట్రాక్టర్లు, స్కూల్ వ్యాన్లు అధికంగా తిరడం వల్ల పాడైపోయాయి. వీధిలోకి తాగునీటి ట్యాంకరు వచ్చినా నీళ్లు పట్టుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. పలు సార్లు ప్రమాదాలు జరిగాయి. రోడ్లు బాగుచేసి ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి. దేవ్‌సింగ్: రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశాం. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులతో మాట్లాడతా. సమస్య పరిష్కారమయ్యేవిధంగా చర్యలు తీసుకుంటా. అలివేలమ్మ: ఆటోనగర్ రోడ్డులో నీళ్లు సరిగా రావడం లేదు. ఎగువ భాగం కావడంతో నీళ్లు వదిలినా చుక్కనీరు రాదు. ఇబ్బందిగా ఉంది. నీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీనిగురించి అనేకసార్లు మున్సిపల్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదు. దేవ్‌సింగ్: మీ వీధిలో నీళ్లు సక్రమంగా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. వాటర్మన్ను అడిగి సమస్య తెలుసుకుని అందరికీ నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతాం. కరీముల్లా: మా వీధిలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. సాయంత్రం 7 గంటలైనా వీధి దీపాలు వెలగవు. ఉదయం 5 గంటలకు లైట్లు ఆరిపోతాయి. వీధి దీపాలు సరిగా వెలగక చోరీలు జరుగుతున్నాయి. మహిళలు పొద్దుగూకితే రోడ్లపై రావాలంటే ఇబ్బందిగా ఉంది. దేవ్‌సింగ్: వీధిలైట్లు వేసే లైట్మెన్లు వీధుల్లో వేసుకుంటూ వస్తారు. దీంతో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తాం. పట్టణం లో ఒకేసారి వీధిలైట్లు వెలిగేలా.. ఒకేసారి ఆరిపోయేలా చర్యలు తీసుకుంటాం. లైట్లు వెలగడం లేదని ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. రమేష్‌బాబు: శేష్‌మహల్ ఏరియా వద్ద డ్రైనేజీ పాడైపోయింది. దుర్వాసన వెదజల్లుతోంది. లెట్రిన్లోని మలం కూడా కాలువలోకి వస్తోంది. దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం. దేవ్‌సింగ్: పాత డ్రైనేజీ వ్యవస్థ కారణంగా సమస్యగా ఉంది. కొత్త కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. జగన్నాథరెడ్డి: వీధుల్లో దోమల బెడద ఎక్కువ. దోమ కాటుతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఫాగింగ్ చేయలేదు. కాలువల్లో మలాథియాన్ చల్లడం లేదు. చిన్న పిల్లలకు జ్వరాలు సోకుతున్నాయి. దేవ్‌సింగ్: వీధుల్లో ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. దోమల బెడద నివారణకు కాలువల్లో మలాథియాన్ స్ప్రే చేయిస్తాం. దోమల బెడద నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపడుతాం. రమణమ్మ: నా భర్త చనిపోయాడు. వితంతు పెన్షన్ రాలేదు. జన్మభూమిలో అర్జీ ఇచ్చాను. నాకు పెన్షన్ వచ్చేలా చూడండి. దేవ్‌సింగ్: మీరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మీ సమస్యను తెలియజేస్తూ దరఖాస్తు ఇవ్వండి. ఇందులో అన్ని ధ్రువపత్రాలు జత చేసిఇవ్వాలి. అర్హత ఉంటే కచ్చితంగా పింఛన్వచ్చేలా చూస్తాం. విజయ: ఎన్వీఆర్ వీధిలో వర్షం వస్తే చాలు రోడ్లుపై నడవలేం. రోడ్లపైనే వర్షపునీరు మడుగులా నిలిచిపోతోంది. దీనికారణంగా దోమలు వస్తున్నాయి. సాయంత్రమైతే దోమల బెడద ఎక్కువ. దేవ్‌సింగ్: కొత్త రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటాం. వర్షపు నీళ్లు నిలిచినచోట్ల మట్టిని తోలిస్తాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం. -
..అలా వద్దంటున్నారు !
నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కమిషనర్...అధికారం మాది మేము చెప్పినట్లు జరగాలని మేయర్...దాదాపు వంద రోజుల పాలనలో ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గలేదు. తెగేదాకా లాగారు. ఇంకేముంది తమ మాట వినని కమిషనర్ వద్దనికలెక్టర్కు మేయర్ లేఖాస్త్రం సంధించారు. బదిలీ వచ్చినా సరే నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేది లేదని కమిషనర్ భీష్మించుకున్నారు. సాక్షి, చిత్తూరు: ‘చిత్తూరు నగరపాలక కమిషనర్ రాజేంద్రప్రసాద్‌తో మేము వేగలేకపోతున్నాం.. తక్షణమే ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయండి’ అంటూ చిత్తూరు మేయర్ కఠారి అనురాధ కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు విన్నవించారు. మంగళవారం కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు. విభేదాలకు బీజం పడిందిలా.. చిత్తూరు కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించినప్పటి నుంచి కమిషనర్, మేయర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. కార్పొరేషన్లో పనిచేసే కూలీలకు వేతనాలు ఇవ్వాలనే అంశాన్ని అజెండాలో కమిషనర్ చేర్చారు. దీన్ని మేయర్ తిరస్కరించారు. ప్రస్తుతం మూడు నెలలుగా కూలీ లంతా వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాన్ని కమిషనర్ జీర్ణించుకోలేకపోయారు. పాత కాంట్రాక్టర్ పేరుతో వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, ప్రస్తుతం శేఖర్‌బాబుకు కొత్త కాంట్రాక్టు ఇచ్చామని, కాబట్టి పాత వేతనాలు ఇప్పట్లో ఇచ్చేది లేదనే తీరుగా వారు వ్యవహరించారు. కాంట్రాక్టర్ పేరుతో కూలీల వేతనాలను రాజకీయం చేయడం తగదని మేయర్‌కు సూచించారు. అలాగే తొలి పాలకమండలి సమావేశం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది బహిరంగ రహస్యం. ఎజెండాలోని అంశాలపై చర్చ జరిపి సభ్యుల ఆమోదం మేరకే అజెండాలోని అంశాలను పాస్ చేయాలి. అయితే సభ్యులు మధ్య చర్చ లేకుండా,వారు చేతులెత్తి అజెండాలోని అంశాలను ఆమోదించకుండానే ఏకపక్షంగా సమావేశాన్ని నిర్వహించారు. ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ సమావేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపించారు. దీన్ని కమిషనర్ సహించలేదు. అక్కడ మొదలైన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య విభేదాలకు ఆజ్యంపోసిన కారణాలు ఇవే! కార్పొరేషన్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. ఈ అంశాన్ని అజెండాలో పాస్ చేశారు. విగ్రహం ఏర్పాటుకు కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. వర్క్ ఆర్డర్ ఇవ్వకుండానే పనులు ప్రారంభించారు. దీనికి బిల్లులు ఇవ్వాలని మేయర్ సిఫార్సుచేస్తేఅనుమతి రానిదే బిల్లులు ఇవ్వలేమన్నారు. కార్పొరేషన్ మీటింగ్‌హాలులో కమిషనర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ చాంబర్‌ను కుదించారు. ఇదేంటని కమిషనర్ ప్రశ్నిస్తే ‘వాస్తుదోషమని’ చెప్పారు. పాలకవర్గం మారినప్పుడల్లా వాస్తుదోషం పేరుతో ఇలా వ్యవహరించడం సరికాదని కమిషనర్ చెప్పారు. నీటిసరఫరాకు 80 ట్యాంకర్లకు పాలకవర్గం ఆమోదించింది. కానీ 120 ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. దీనికి కమిషనర్ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడ్డాయని, కొన్నిచోట్ల బోర్లలో నీటిమట్టం కూడా పెరిగిందని, ఈ క్రమంలో ట్యాంకర్లను తగ్గించాలనుకుంటే ఇంకా పెంచడమేంటని కమిషనర్ ప్రశ్నిస్తున్నారు. మేయర్ పుదుచ్చేరి రిజిస్ట్రేషన్‌తో పార్చూనర్ కారు తెప్పించుకున్నారు. దీనికి మూన్నెళ్లుగా బాడుగ బిల్లు ఇవ్వడంలేదు. టెండర్ పిలవకుండా బిల్లు ఇచ్చే ప్రసక్తే లేదని కమిషనర్ చెబుతున్నారు. ఎమ్మెల్యేతో తమకు విభేదాలు తలెత్తేలా కమిషనర్ వ్యవహరిస్తున్నారని కూడా మేయర్ పేర్కొన్నారు. చిత్తూరు ఆడిటోరియానికి చిత్తూరు నాగయ్యపేరు, పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే సత్యప్రభ సిఫార్సుచేస్తే దాన్ని పాలకవర్గం నిరాకరించింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. తిరిగి చిత్తూరు నాగయ్యపేరు మహతి కళాక్షేత్రానికి పెట్టడంతోపాటు పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనిచేసిన అన్నిచోట్లా మంచిపేరు తెచ్చుకున్న కమిషనర్ ప్రతి అంశంలోనూ కమిషనర్ నిబంధనల మేరకే కార్పొరేషన్ నడవాలని, అందుకు భిన్నంగా ఎలాం టి నిర్ణయం తాను తీసుకోలేనని తెగేసి చెబుతున్నా రు. ఈ అంశంలో రాజేంద్రప్రసాద్ పనిచేసిన చోట ఎక్కడా? ఎప్పుడూ రాజీపడలేదనే మంచిపేరు ఉం ది. పైగా రాష్ట్రంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు, నియమావళి తెలిసిన ఒకరిద్దరిలో ఈయన ఒకరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరికి ఏ సందేహం వచ్చినా రాజేంద్రప్రసాద్‌కు ఫోన్‌చేసి చర్చిస్తా రు. అందుకే ఈయనను రాష్ట్ర మునిసిపల్ కమిషనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. ప్రస్తుతం ఈయనే కొనసాగుతున్నారు. తనకున్న మంచిపేరు పోకూడదానే కారణంతో కమిషనర్ ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల్లో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా కమిషనర్‌కు మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటా నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటాను. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? నేనేంటి అనే విషయం అందరికీ తెలుసు. మేయర్ ఇచ్చిన లేఖపై నేను మాట్లాడదలచుకోలేదు. -రాజేంద్రప్రసాద్, కమిషనర్, చిత్తూరు నియంతలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధి అండతో రాజేంద్రప్రసాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు. నేను, డెప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సూచిస్తున్న ప్రజా సమస్యలపై ఏమాత్రం స్పందించడంలేదు. నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. నియంతలా వ్యవహరిస్తున్నారు. నాకు,ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు వచ్చే విధంగా చిచ్చు పెడుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. -కఠారి అనురాధ, చిత్తూరు మేయర్ -
మాకు తెలియకుండా డబ్బెలా ఇస్తారు?
జోగిపేట : ‘మాకు తెలియకుండా ఆలయాలకు, మసీదులకు రూ.93 వేలు ఎలా పంపిణీ చేస్తారు?, మీ ఇష్టానుసారంగా ఇచ్చిన డబ్బులకు మేము ఆమోదం తెలుపం, ఇలా చేస్తే మిమ్మల్ని సరెండర్ చేయాల్సి వస్తుంది’ అని కమిషనర్ విజయలక్ష్మిపై పలువురు కౌన్సెలర్లు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఆ నిధులు మంజూరు చేసినట్లు కమిషనర్ సభ్యులకు తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశానికి చైర్పర్సన్ కవిత అధ్యక్షత వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, శరత్‌బాబులు నగరపంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్ల పనులను సీడీఆర్ ప్రాజెక్టుకుఅప్పగించాలని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే టీడీపీకి చెందిన కౌన్సిలర్ శ్రీకాంత్, టీఆర్ఎస్కు చెందిన లక్ష్మణ్‌లు ఇందుకు వ్యతిరేకించారు. అయితే 18 మంది కౌన్సిలర్లు చేతులెత్తి తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదిక ఇవ్వకపోవడంతో సభ్యులు కమిషనర్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు నివేదికను కమిషనర్ విజయలక్ష్మి తయారు చేసి చదివి వినిపించినా సభ్యులు సంతృప్తి చెందలేదు. ఒక్కోక్క వార్డులో సుమారుగా రూ.8 లక్షల పనులకు సంబంధించి ప్రతిపాదనలను తయారు చేయించాలని కౌన్సిలర్లు కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు. అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్లు, బీఆర్ జీఎఫ్ కింద రూ.19.64 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని, 13 ఫైనాన్స్ కింద రూ.53 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తైబజారు వేలం పాటను ఈనెల 23న నిర్వహించాలని, బకాయిలున్న వారిని వేలం పాటలో అనుమతించకూడదని కౌన్సిలర్ గోపి, సునీల్‌కుమార్‌లు సూచించారు. కూరగాయల మార్కెట్‌ను నెల రోజుల్లోగా నగర పంచాయతీకి అప్పగించాలని కలెక్టర్, పంచాయతీరాజ్ ఈఈలకు లేఖ రాయాలని కౌన్సిలర్ ప్రదీప్‌గౌడ్ కమిషనర్‌కు తెలిపారు. గాంధీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలను పెంచాలని వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు నవీన్, లక్ష్మణ్‌లు కోరారు. కౌన్సిలర్లుకు తెలియకుండా అనుమతులివ్వొద్దు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఆయా వార్డుల కౌన్సిలర్లకు చెప్పకుండా అనుమతులు ఇవ్వరాదని కౌన్సిలర్లు లక్ష్మణ్, మోహన్‌లాల్ జాదవ్ సభ దృష్టికి తెచ్చారు. అయితే సమావేశంలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహరాజు సమాధానమిస్తూ నగర పంచాయతీ యాక్టులో అలాంటి నిబంధన ఏదీలేదని తెలిపారు. మాకూ మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నీ అంశాలను మీరే మాట్లాడితే ఎలా? తమకు కూడా అవకాశం ఇవ్వాలని మహిళా కౌన్సిలర్ తోట్ల మమత కోరారు. ఒక్క సమస్యపైనే సభను సాగదీస్తే ఎలా ముందుకు వెళతామని ఆమె ప్రశ్నించారు. 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి మాట్లాడుతూ తమ వార్డులో తాగునీటి పైపు ఏర్పాటుపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
గంగమ్మా చూడమ్మా..!
కమిషనర్ అనుమతి లేకనే కాంట్రాక్ట్ గడువు పెంపు చేతులు మారిన రూ.లక్షలు! బోయకొండ ఆలయానికి భారీ నష్టం బోయకొండ(చౌడేపల్లె): ఆలయాధికారులు, పాలకవర్గం మాయాజాలంతో బోయకొండ గంగమ్మ ఆలయానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. వివిధ హక్కులకు సంబంధించి అనుమతులను రెండు నెలలు పొడిగించారు. ఈ తతంగంలో లక్షలు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బోయకొండ గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల నుంచి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. ఆలయంలో వివిధ హక్కుల కోసం ప్రతి ఏటా వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది హక్కుల కోసం గతేడాది మార్చి 22న వేలంపాట నిర్వహించారు. హక్కులు పొందిన వారి గడువు ఈ ఏడాది మే 31న ముగిసింది. ఇక్కడే ఆలయ పాలకులు, అధికారులు మాయాజాలం ప్రదర్శించారు. తలనీలాల హక్కులు మినహాయించి మిగిలిన ఎనిమిదింటి గడువును రెండు నెలలు పెంచేశారు. ఇలా చేయాలంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి పొందాల్సి ఉంది. అయితే బోయకొండలో ఇందుకు భిన్నంగా అనుమతులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కొత్త ఏడాది హక్కుల కోసం గత నెల 17న వేలం పాటలు నిర్వహించారు. అక్రమాల విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆలయ పాలకవర్గం, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఆలయ ఆదాయానికి లక్షల రూపాయల్లో గండి పడిందని అంటున్నారు. ఈ అక్రమాలపై దేవాదాయశాఖ కమిషనర్ విచారణ చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమతి లేని విషయం నిజమే కాంట్రాక్ట్ గడువు పెంపుదలలో దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి లేని విషయం నిజమే. గతంలో పనిచేసిన ఈవో, పాలకవర్గం తీర్మానం చేసి కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఉత్తర్వులు రాకుండానే గడువు పెంపు, తిరిగి వేలం నిర్వహించిన సంగతి వాస్తవమే. - ఏకాంబరం, ఇన్చార్జి ఈవో, బోయకొండ -
'ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు'
-
కమిషనర్ల ‘సెల్’ పంచాయతీ!
సిమ్ కార్డు ఇవ్వని పాత కమిషనర్ పాత తేదీలతో ఫైళ్లపై సంతకాలు! చెక్కులను, క్యాష్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్న నూతన కమిషనర్ మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : మచిలీపట్నం మున్సిపాలిటీ పాత, కొత్త కమిషనర్ల మధ్య ‘సెల్ పంచాయతీ’ హల్చల్ చేస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారగణంలో ఇది తీవ్ర చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెళితే ై ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణకు హెదరాబాద్లోని డీఎంఏ కార్యాలయానికి బదిలీ అయింది. గత జనవరి 27వ తేదీన మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా ఏ మారుతిదివాకర్ బాధ్యతల్ని స్వీకరించారు. ఈయన బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 రోజులవుతున్నా పాత కమిషనర్ శివరామకృష్ణ ప్రభుత్వం కేటాయించిన సెల్ సిమ్‌ను నూతన కమిషనర్‌కు అప్పగించలేదు. సహజంగా ఏ అధికారి బదిలీ అయినా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి ఈ సిమ్‌ను ఇచ్చేస్తారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మారుతిదివాకర్ వద్ద ఈ సిమ్ లేకపోవటంతో పలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ ప్రజలు ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తుంటే స్విచ్ఆఫ్ డైలర్ టోన్ వస్తోంది. దీంతో నూతన కమిషనర్ ఫోన్ నంబర్ తెలియక సమస్యలపై ఫిర్యాదు చేయాలని భావించే పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారువారు చూసుకోవాలే కానీ తమను ఇబ్బందులకు గురి చేయకూడదు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాత కమిషనర్ తీరుపై చర్చ : బదిలీపై వెళ్లిన పాత కమిషనర్ శివరామకృష్ణ తీరుపై పలువురు మున్సిపల్ ఉద్యోగులతో పాటు పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు నూతన కమిషనర్‌గా వేరే వ్యక్తి వస్తున్నాడని తెలిసిన ఆయన వచ్చే కమిషనర్‌కు కనీసం ఒక్క అటెండర్‌ను లేకుండా చేశాడని చర్చించుకుంటున్నారు. ఆయనకు అటెండర్లుగా పని చేసిన గణేష్, సాంబశివరావుకు పదోన్నతులు కల్పించి రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. తమకు పదోన్నతులు ఇచ్చారనే కారణంతో వీరిద్దరూ కమిషనర్ ఛాంబర్లో ఉన్న పలు పుస్తకాలను, వస్తువులను, చివరికి కమిషనర్ సీటుపై ఉండే టర్కీ టవల్‌ను సైతం లేకుండా తీసేశారు. నూతన కమిషనర్‌గా మారుతీదివాకర్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆయన ఛాంబర్ బోసిపోయేలా చేశారనే విమర్శలున్నాయి. నూతన కమిషనర్‌కు కనీసం అంటెండర్లు లేకుండా చేయటంతో వేరే విభాగాల్లో పని చేసే వారిని ఈయన అటెండర్లుగా నియమించుకున్నారు. అలాగే మునిసిపాలిటీకి సంబంధించిన పలు ఫైళ్లపై పాత కమిషనర్ ఇప్పటికీ పాత తేదీలను వేస్తూ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల ఆయన పలువురికి పాత తేదీలతో చెక్కులను ఇచ్చారనే వాదనలున్నాయి. ఈ నేపధ్యంలోనే అకౌంటెంట్ వద్ద ఉన్న చెక్, క్యాష్ పుస్తకాలను నూతన కమిషనర్ మారుతీదివాకర్ స్వాధీనపర్చుకున్నారు. అలాగే కార్యాలయంలో ఉన్న సీసీ కెమేరాలకు అను సంధానం చేసిన ఆన్లైన్ లింక్‌ను పొందుపర్చిన ల్యాప్‌టాప్ పాత కమిషనర్ శివరామకృష్ణ వద్దే ఉందని చెబుతున్నారు. సెల్‌సిమ్ ఇంకా ఇవ్వలేదు, మారుతీదివాకర్, కమిషనర్ : కమిషనర్‌గా పనిచేసి బదిలీ అయిన శివరామకృష్ణ ఇంకా సెల్ఫోన్సిమ్ ఇవ్వలేదు. దీంతో పర్సనల్ ఫోన్ నంబర్‌నే ఉపయోగిస్తున్నా. ఉన్నతాధికారులు, ప్రజలు తనకు ఫోన్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. చెక్కులు పాత తేదీలతో బ్యాంక్‌లకు వెళుతున్నాయనే వాదనలు రావటంతో చెక్‌బుక్‌లను అకౌంటెంట్ నుంచి తీసుకుని నా వద్దే ఉంచాను. -
గజిని
జీహెచ్ఎంసీకి మతిమరుపు చమత్కరించిన కమిషనర్ ఖాళీ ప్రదేశాల రక్షణకు ‘గ్రేటర్’ చర్యలు ఇప్పటికి 385 స్థలాల గుర్తింపు సాక్షి, సిటీబ్యూరో: ‘జీహెచ్ఎంసీకి మతిమరుపు’... ఈ విషయం అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ‘గ్రేటర్’ కమిషనర్ సోమేశ్‌కుమారే. నగరంలో అధిక డిమాండ్ ఉన్న భూములను ఇప్పటివరకూ గాలికొదిలేసిన జీహెచ్ఎంసీ.. అవి కబ్జాల పాలవుతుండటంతో వాటిని కాపాడుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఈ విషయాన్ని చెబుతూ జీహెచ్ఎంసీకి ఎన్ని ఖాళీ స్థలాలున్నాయో లెక్కలేదని అన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీకి మతిమరుపు అని చమత్కరించారు. సర్కిళ్ల వారీగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్న జీహెచ్ఎంసీ భూముల్ని గుర్తించే చర్యలు చేపట్టామని తెలిపారు. గత నెలాఖరు వరకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేని 320 జీహెచ్ఎంసీ భూముల్ని గుర్తించామని.. ప్రస్తుతం వీటి సంఖ్య 385కి చేరిందని వివరించారు. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదని.. గుర్తించిన ఈ 385 బహిరంగ ప్రదేశాలకు రూ. 49 కోట్లతో 70 కి.మీ.ల మేర ప్రహరీలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రహరీలున్న వెయ్యి బహిరంగ ప్రదేశాలతోపాటు ఈ 385 ప్రదేశాల్లోనూ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. వేసవి ముగిసేలోగా వీటన్నింటికీ ప్రహరీలు నిర్మించి, వచ్చే వర్షాకాలంలోగా మొక్కలు నాటే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఖాళీ ప్రదేశాలు కనిపిస్తే ప్రజలు వాటిని జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు తెలియజేయాల్సిందిగా సూచించారు. గత నెలాఖరు వరకు గుర్తించిన ఖాళీస్థలాలు (సర్కిళ్ల వారీగా).. కాప్రా- 27, ఉప్పల్- 13, ఎల్బీనగర్-18, చార్మినార్-6, సర్కిల్ 5 - 3, రాజేంద్రనగర్-45, సర్కిల్ 7- 2, సర్కిల్8- లేవు, సర్కిల్9- 6, సర్కిల్ 10-31, సర్కిల్ 11- 15, సర్కిల్ 12-20, సర్కిల్ 13-7, కూకట్పల్లి-27, కుత్బుల్లాపూర్-22 అల్వాల్-45, మల్కాజిగిరి-27, సికింద్రాబాద్-6. వెరసి మొత్తం 320. అన్ని సర్కిళ్లలో మరో 65 పెరగడతో ఇప్పుడవి 385కు చేరాయి. -
కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఉన్న ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ విజయలక్ష్మికి, సిబ్బందికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కమిషనర్ వ్యవహారశైలి నచ్చని సిబ్బంది మొత్తం ఏకమయ్యారు. కమిషనర్ విజయలక్ష్మి ఒకవైపు, కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది మరోవైపు గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారిపోయారు. వీరిమధ్య కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కమిషనర్‌కు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలనే విషయంపై చర్చించుకునేందుకు సిబ్బంది మొత్తం సమావేశం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ విభేదాలు చేరుకున్నాయి. కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది కలిసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అదే సమయంలో కమిషనర్ విజయలక్ష్మి కూడా ఇక్కడ కాకపోతే బదిలీపై ఇంకోచోటకు వెళ్లి పనిచేసుకుంటానంటూ తెగేసి చెప్పా రు. తన కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఏమాత్రం నమ్మడం లేదని, తాము తీసుకెళ్లిన ఏ ఫైల్‌పైనా సంతకం చేయకపోగా తమను దూషిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే, గతంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై అప్రమత్తంగా ఉన్న కమిషనర్.. నిబంధనలకు అనుగుణంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటంతో సిబ్బందికి నచ్చక ఆమెకు వ్యతిరేకంగా ఏకమయ్యారన్న వాదన కూడా ప్రస్తుతం కార్యాలయంలో వినిపిస్తోంది. అసలేం జరుగుతోంది... ప్రస్తుతం నగర కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు కావస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో రెండు నెలలు సమైక్యాంధ్ర ఉద్యమ సమ్మెలో గడిచిపోగా, ఆమె గట్టిగా పనిచేసింది మూడు నెలలు మాత్రమే. ఈ మూడు నెలల కాలంలోనే సిబ్బందికి, ఆమెకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇంతకాలం అంతర్గతంగా నలుగుతున్న విభేదాలు మంగళవారం కమిషనర్‌కు వ్యతిరేకంగా సిబ్బంది ఒక్కటై ఏకంగా సమావేశం నిర్వహించడంతో బహిర్గతమయ్యాయి. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కిందిస్థాయి సిబ్బంది ఎవరినీ ఆమె నమ్మడం లేదు. ఇంజినీరింగ్ విభాగం, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, పారిశుధ్యం, హెల్త్.. ఇలా ప్రతి విభాగానికి చెందిన హెడ్లతో పాటు, కిందిస్థాయి సిబ్బందిని కూడా నమ్మడంలేదనే ది కమిషనర్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. అలాగే కిందిస్థాయి సిబ్బందిని దూషిస్తూ మాట్లాడుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. కార్యాలయంలో నిజాయితీగా వ్యవహ రించే కొందరు అధికారులను కూడా కమిషనర్ నమ్మడం లేదు. పైగా, ప్రతిఫైల్‌ను క్షుణ్ణంగా అనుమానంగా పరిశీలించడంతో పాటు, అన్నీ కచ్చితంగా ఉంటేనే సంతకాలు చేస్తున్నార నే వాదన ఉంది. దీంతో కమిషనర్‌కు వ్యతిరేకంగా అన్ని విభాగాల అధిపతులతో పాటు, కిందిస్థాయి సిబ్బంది కూడా ఒక్కటయ్యారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది మొత్తం కమిషనర్‌కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై చర్చించారు. అయితే, అవినీతి వ్యవహారాలకు సహకరించకపోవడం వల్లే కమిషనర్‌పై సిబ్బంది తిరుగుబాటు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టౌన్‌ప్లానింగ్, శానిటరీ విభాగాల్లో గతంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై ఇటీవల విజిలెన్స్ విచారణ చేపట్టడంతో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న కమిషనర్.. తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకునేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అన్ని వివరాలతో కచ్చితంగాలేనిదే ఏ ఫైల్‌పై సంతకం చేయడం లేదు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. తాము తీసుకెళ్లిన ఏ ఫైల్‌పై ఆమె సంతకం చేయకపోతుండటంతో సిబ్బందిలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే సమయంలో కొందరు సిబ్బంది కొన్ని పనులు చేయిస్తామంటూ పలువురి నుంచి భారీగా డబ్బు వసూలు చేసి ఉన్నారు. వాటికి సంబంధించిన ఫైళ్లపై కమిషనర్ సంతకం చేయకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయాయి. గత కమిషనర్ హయాంలో స్థానిక మంగమూరురోడ్డులో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తానని కార్యాలయంలోని ఓ ఆర్ఐ 10 వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కమిషనర్ బదిలీ అయి కొత్త కమిషనర్‌గా వచ్చిన విజయలక్ష్మి ఆ ఫైల్‌పై సంతకం చేయడం లేదు. దీంతో ఆప్పటి నుంచి సదరు ఫైల్ పెండింగ్‌లో ఉండిపోయింది. డబ్బు ఇచ్చిన వారు ఆరు నెలల నుంచి ఆర్ఐ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటివి వందల ఫైళ్లు ప్రస్తుతం కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బు ఇచ్చిన వారి నుంచి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుండటంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అదే సమయంలో కమిషనర్ ఎవర్నీనమ్మి సంతకాలు చేయకపోతుండటంతో ఆమెపై సిబ్బంది మొత్తం తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వాదనలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. గతంలో కమిషనర్ రవీంద్రబాబు కార్యాలయంలోని సిబ్బంది పట్ల స్పష్టమైన అవగాహనతో వ్యవహరించేవారని, కానీ, ప్రస్తుత కమిషనర్‌కు, సిబ్బందికి మధ్య అటువంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనప్పటికీ వీరి విభేదాల కారణంగా కార్యాలయంలో ఫైళ్లన్నీ పెండింగ్ లో ఉండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. -
నేడు, రేపు పంట నష్టంపై టీఆర్ఎస్ అధ్యయనం
కరీంనగర్, న్యూస్‌లైన్ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై అంచనా వేసేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధ్యయనం చేయాలని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. పంట నష్టం వివారలను సేకరించి జిల్లాల్లో వ్యవసాయశాఖ అధికారికి, కలెక్టర్‌కు, రాష్ర్ట పార్టీకి అధ్యయన బృందం నివేదిక సమర్పిస్తుంది. రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టం అంచనా నివేదికలను వ్యవసాయశాఖ కమిషనర్‌కు సమర్పించడంతోపాటు రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ కృషిచేస్తుంది. శనివారం సిరిసిల్ల, వేములవాడతోపాటు మరో రెండు నియోజకవర్గాలు, ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో బృందం పర్యటిస్తుంది. ఈ బృందంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదెలు, గడ్డం అరవిందరెడ్డి ఉన్నారు. -
GHMC కమిషనర్‌గా సోమేష్ కుమార్ బాధ్యతలు
-
కమిషనర్‌ను కలిసిన ట్రాఫిక్ హోంగార్డులు
సాక్షి,సిటీబ్యూరో: దూరప్రాంతాల బదిలీలను నిలిపివేయాలంటూ ట్రా ఫిక్ హోంగార్డులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలి శారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సుమారు 200మంది హోంగార్డులను ఇటీవలే కమిషనర్ బదిలీచేశారు. అయితే సైబరాబాద్ పరిధి వందకిలోమీటర్ల వరకు విస్తరించి ఉండడంతో హోంగార్డులు ఈ బదిలీలపై ఆవేదన చెందుతున్నారు. వచ్చే జీతం(రూ.6000)లో సుదూరప్రాంతంలో డ్యూటీకెళ్లి రావ డం ఇబ్బందికరమని కమిషనర్‌కు వివరించారు. సమస్యలు ఉన్న ఆయ న అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీఇచ్చారు. -
తండ్రి దానం చేసిన భూమిని కబ్జా చేసేందుకు తనయుడి యత్నం!
వనపర్తిటౌన్, న్యూస్‌లైన్: కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాసుల కు కక్కుర్తి పడి రాబందుల పాలుచేసేందుకు సా క్షా త్తు సంస్థానాధీశుల వారసుడే ప్రయత్నించడం ప్ర జలను విస్మయానికి గురిచేస్తోంది. తండ్రి రాజారామేశ్వర్‌రావు ప్రభుత్వానికి ఉదారంగా దానం చేసిన భూ మికి ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఆయన వారసుడు రాజా కృష్ణదేవరావు ఆ భూమిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళి తే... దివంగత వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు నిర్మించిన రాజభవనం వెనక 40 అడుగు వెడల్పు, 1158 అడుగుల పొడవైన స్థలాన్ని 50 ఏళ్ల క్రితం పార్క్ (లాన్)కోసం నక్ష గీసి ప్రభుత్వానికి అ ప్పగించారు. అప్పటి నుంచి ఆ భూమి వనపర్తి మున్సిపల్ పరిధిలోనే కొనసాగుతోంది. అయి తే అధికారులెవరూ ఆ స్థలాన్ని పట్టించుకోకపోవడం తో ప్రాంతం ముళ్ల పొదలతో నిండిపోయింది. 2008 లోనే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలా న్ని అమ్మేందుకు శతవిధాల ప్రయత్నించినా ప్రజలు ఆందోళనలు చేయడంతో వెనకడుగు వేశారు. ప్రస్తుతం పట్టణంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కోట్లకు పడగెత్తిన రాజావారి వారుసుడు కూడా కాసులకు కక్కుర్తిపడ్డారు. తన తండ్రి ఉదారంగా ఇచ్చిన భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఐదు రోజులుగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో అధికారులను లోబర్చుకుని ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా స్థలంలో ఉన్న ప్రభుత్వ బోర్డును సైతం తీసేసి * 6 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే సదరు భూమి మున్సిపల్ ఆధీనంలో ఉందని పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆయన పట్టించుకోకుంగా రిజిస్ట్రేషన్‌కు అంగీకరించడం గమనార్హం. సోమవారం సాయంత్రం ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాజావారి కారును అడ్డుకుని ఘెరావ్ చేయడంతో ఆయన రిజిస్ట్రేషన్ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. వనపర్తి చరిత్రలో సంస్థానాధీశుల వారసులను అడ్డుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లాన్ ప్రభుత్వ స్థలమే: కమిషనర్ రాజా రామేశ్వర్రావు స్వ హస్తాలతో నక్ష రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చారని, అది ప్రభుత్వ స్థలమే అవుతుందని వనపర్తి కమిషనర్ గౌస్ మోహిద్దీన్ పేర్కొన్నారు. లాన్ ప్రభుత్వ స్థలమని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారికి రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యను వనపర్తి తహశీల్దార్, ఆర్డీవో, డీఎస్పీల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. -
ఛీ ఛీ ఇలాంటి రోడ్లా..?
సాక్షి,సిటీబ్యూరో: :రహదారుల మరమ్మతులు, నిర్వహణపనుల్లో ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై జీహెచ్ఎంసీలోని ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పనుల మంజూరు తప్ప,అమలుపై శ్రద్ధ చూపడం లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర రహదారుల్ని ఇంత అధ్వానంగా గతంలో మున్నెన్నడూ చూడలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై నుంచి వరుస వర్షాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు కమిషనర్ బదులిచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. జీహెచ్ఎంసీలోని వివిధ పనులకు సంబంధించి గురువారం మేయర్ మాజిద్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, కమిషనర్ కృష్ణబాబు,ఫ్లోర్‌లీడర్లు, స్టాండింగ్కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలువురు సభ్యులు అధికారుల పనితీరుపై పెదవివిరిచారు. ఒక ఫైలు ఈఈ నుంచి ఎస్ఈకి వెళ్లేందుకు 25రోజులు పడుతోందని, ఇదేనా పనితీరని ప్రశ్నించారు. జాప్యానికి కారకులయ్యే ఈఈలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకమండలి నిర్ణయాలు, కమిషనర్ ఆదేశాలన్నా ఇంజినీరింగ్ విభాగానికి లెక్కలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పనుల్లో అశ్రద్ధ వహిస్తున్నప్పటికీ గత రెండున్నరేళ్లుగా ఏ ఒక్క ఇంజినీర్‌కు కూడా మెమో, చార్జిమెమోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తాత్కాలిక మరమ్మతులు కాకుండా, దీర్ఘకాలం మన్నేలా శాశ్వతరోడ్లు వేయాల్సిందిగా కోరారు. ఇంజినీర్లలో క్రమశిక్షణ పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ కృష్ణబాబు హామీఇచ్చారు. డెబ్రిస్ తొలగింపునకు తాత్కాలిక వాహనాలు కాకుండా శాశ్వతచర్యలు తీసుకోవాలని, చెత్త తరలింపు పనులకు అదనపు బిన్లు,మూడుచక్రాల సైకిళ్లు తదితరమైనవి కావాలని కోరగా..తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అడిషనల్ కమిషనర్ వందన్కుమార్కు సూచించారు. -
ఫిర్యాదులు ఇక నేరుగా కమిషనర్ చెంతకే..
భివండీ, న్యూస్‌లైన్: ప్రజల సమస్యలను నేరుగా భివండీ -నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) కమిషనర్ వద్దకు చేరేవిధంగా ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలో ఐదు ప్రభాగ్ సమితులు ఉన్నాయి. ప్రతి ప్రభాగ్లో ప్రత్యేక ఫిర్యాదు నమోదు పుస్తకం (కంప్లైంట్ రిజిస్టర్ బుక్)ను ఏర్పాటు చేశారు. గతంలో నివేదికల ద్వారా సమస్య గురించి కార్పొరేషన్‌కు తెలిపేవారు. అయితే కొత్త పద్ధతి వల్ల కమిషనర్ జీవన్ సోనావణేకి నేరుగా ఫిర్యాదు అందుతుంది. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ జీవన్ స్పష్టం చేశారు. వీధి దీపాలు, మంచి నీరు, మురుగు కాలువలు, చెత్త, దుర్గంధం తదితర సమస్యలపై ఫిర్యాదులను పుస్తకంలో నమోదు చేసి, చిరునామా, మొబైల్ నంబర్ రాయాలి. ఆ తర్వాత సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విధులు నిర్వహించే ఉద్యోగుల హాజరు కోసం బయోమెట్రిక్ పద్ధతిని ఉపయోగించాలని 2011 మార్చి 31న ఆదేశాలు జారీచేసింది. కానీ ఇంతవరకు పట్టణంలోని ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ పద్ధతిని పాటించడంలేదనే ఆరోపణలున్నాయి. దీని వల్ల తమ పనులు సకాలంలో పూర్తికావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తగు చర్యలు తీసుకో వాలని విన్నవిస్తున్నారు. -
అనకాపల్లి కమిషనర్ సరెండర్
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్ : పురపాలక సంఘం అభివృద్ధిలో తీవ్ర జాప్యం కారణంగా ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.మురళీధరరావును ప్రభుత్వం సరెండర్ చేసింది. ఆయన స్థానంలో గాజువాక జోనల్ కమిషనర్ శ్రీనివాసరావును నియమించింది. రెవెన్యూ పరిపాలనా విభాగానికి చెందిన మురళీధరరావును ఏడాది పాటు ఇన్చార్జి కమిషనర్‌గా అనకాపల్లి మున్సిపాల్టీకి ప్రభుత్వం నియమించింది. ఈ కాలంలో వివిధ రాజకీయ పక్షాల నాయకులతో వివాదాలు, పట్టణ అభివృద్ధిలో తీవ్ర జాప్యం వంటి కారణాల రీత్యా ఇటీవల ప్రభుత్వం కమిషనర్ బాధ్యతల నుంచి మురళీధరరావును తొలగిస్తూ సరెండర్ చేసింది. ఇదే మున్సిపాల్టీలో గతంలో పనిచేసిన వెంకటేశ్వరరావు, అప్పలనాయుడులను కూడా ప్రభుత్వం సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అనకాపల్లి మున్సిపాల్టీని ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడంతో చిట్టచివరి కమిషనర్‌గా పనిచేస్తూ సరెండర్ అయిన వ్యక్తిగా మురళీధరరావు నిలిచిపోయారు. అయితే రెవె న్యూ విభాగానికి చెందిన మురళీధరరావు తిరిగి తన మాతృసంస్థకు వెళ్లిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.