కమిషనర్‌కు కోపం వచ్చింది | Sakshi
Sakshi News home page

కమిషనర్‌కు కోపం వచ్చింది

Published Sun, Dec 17 2017 8:56 AM

Fisheries Commissioner Rama Shankar Nayak fire on Technicians - Sakshi

భీమవరం టౌన్‌: మత్స్యశాఖ కమిషనర్‌ రమాశంకర్‌నాయక్, ఐఏఎస్‌కు కోపం వచ్చింది. మత్స్యశాఖ నిద్రపోతుందా.. సమయపాలన తెలియదా.. ఇలాగేనా ఏర్పాట్లు చేసే ది.. అధికారులు డ్యాన్స్‌ చేస్తున్నారా అం టూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర ఫిషరీస్, ఆక్వాకల్చర్‌ చట్టం రూ పొందించడంలో భాగంగా భీమవరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉద యం 9 గంటలకు ఆక్వా టెక్నీషియన్లకు అవగాహనా సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథి కమిషనర్‌ రమాశంకర్‌నా యక్‌ నిర్ణీత సమయానికి వచ్చారు. ఆయన అధికారులతో కొంతసేపు వివిధ అంశాలపై చర్చించారు. అధికారులు ఉ న్నా పట్టుమని పది కుండా టెక్నీషియన్లు హాజరుకాలేదు. ఉదయం 10.30 గంటల వరకూ కమిషనర్‌ ఫైల్స్‌ చూసుకుంటూ గడిపారు. ఆ తర్వాత మరికొంత సమ యం అక్కడే కూర్చున్నారు.

అప్పటికీ టెక్నీషియన్లు రాకపోవడంపై ఆగ్రహిం చారు. వెంటనే అక్కడి నుంచి వేగంగా ఆయన బయటకు వెళ్లిపోతుండటంతో మత్స్యశాఖ డీడీ కె.ఫణిప్రకాష్, రిటైర్డ్‌ డీడీ పి.రామ్మోహన్‌రావు తదితరులు సదస్సును మొదలుపెడదామని కోరారు. 10 మంది కూడా లేకుండా సదస్సు ఎలా ప్రా రంభిస్తారు.. ఇలాగేనా ఏర్పాట్లు చేసేది అంటూ.. కమిషనర్‌ కోపంతో మెట్లు దిగి వెళ్లిపోయారు. బయట గేటు వద్ద అధి కారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కమిషనర్‌ వారికి క్లాస్‌ తీసుకుంటూ రోడ్డుపైకి వచ్చేశారు. కోపంగా వచ్చి కారు ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత ఒక్కరొక్కరుగా టెక్నీషియన్లు రావడం, అ ధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు మ ధ్యాహ్నం 12.25 గంటలకు కమిషనర్‌  తిరిగి వచ్చి సదస్సును ప్రారంభించారు.

రాష్ట్రాభివృద్ధికి ఆక్వా కీలకం
ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా ఆదాయం రూ.లక్ష కోట్లు లక్ష్యంగా ముందుకు సాగాలని మ త్స్యశాఖ కమిషనర్‌ రమాశంకర్‌నాయక్‌ సూచించారు. భీమవరంలో ఆక్వా రంగ టెక్నీషియన్లతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కమిషనర్‌ రమాశంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ఆం ధ్రప్రదేశ్‌ ఆర్థిక పురోగతికి ఆక్వా రంగం కీలకంగా మారిందన్నారు. ఏటా దా దాపు రూ.50 వేల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వా రంగంలో ఆదాయ లక్ష్యం మరింత పెరగాలన్నారు. రా ష్ట్రంలో 1.86 లక్షల హెక్టార్లలో  చేపలు, రొయ్యల సాగు ఉండగా దీనిలో 85 వేల హెక్టార్లలో రొయ్యల సాగు ఉందన్నారు. ఆక్వాను క్షేత్ర స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో 29 క్లస్టర్స్‌ను 104 సబ్‌క్లస్టర్స్‌గా విభజించామని చెప్పారు. 

కమిటీల ఏర్పాటు
నాణ్యమైన సీడ్‌ కొరత, జీవ పరిరక్షణ పద్ధతులు పాటించకపోవడం, శాస్త్రీయ పద్ధతిలో యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం ఆక్వా రంగంలో సమస్యలుగా ఉన్నాయని ఆయన అన్నారు. యాంటీబయోటిక్స్‌ వాడకాన్ని నిరోధించేందుకు పర్యావరణ స్నేహపూర్వక ఆక్వా ఉత్పత్తుల సాధనకు, సాగును సుస్థిరం చేసి ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి కోల్పోకుండా జీఓ–2ను విడుదల చేశారన్నారు. ఆక్వాసాగును సుస్థిరం చేయడం, యాంటీబయోటిక్స్‌ నియంత్రణకు కమి టీలు ఏర్పాటుచేశామన్నారు. టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు విస్తృత తనిఖీలు చేస్తామని, యాంటీబయోటిక్స్‌ అవశేషా లు పరీక్షించే ల్యాబ్‌ల వివరాలు, టెక్నీషి యన్ల వివరాలు సేకరించి సమగ్ర నివేది కను అపెక్స్‌ కమిటీకి సమర్పిస్తామన్నారు. 

చతుర్ముఖ వ్యూహం
అపెక్స్‌ కమిటీ నివేదిక సమర్పించిన త ర్వాత దానిని పరిశీలించి ఆక్వా రంగ అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం రూ పొందించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 200 ల్యాబ్‌లకు 140 ల్యాబ్‌లను రిజిస్ట్రేషన్‌ చేశామని కమిషనర్‌ చెప్పారు. మరో 60 ల్యాబ్‌లలో నైపుణ్యం గల టెక్నీషియన్లు, సదుపాయాలు లే వని, వాటిని సమకూర్చుకుంటే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు. కాకినాడలో ల్యాబ్‌ టెక్నీషియన్లకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిచేందుకు, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు యాప్‌ను ఏర్పాటు చేసుకుందామని కమిషనర్‌ సూచించారు. మత్స్యశాఖ డీడీ డాక్టర్‌ కె.ఫణిప్రకాష్‌ అధ్యక్షత వహించగా ఎక్స్‌పోర్ట్‌ ఇన్‌స్పెక్షన్‌ ఏజెన్సీ డీడీ డా క్టర్‌ షెర్బీ, మత్స్యశాఖ రిటైర్డ్‌ డీడీ డాక్టర్‌ పి.రామ్మోహన్, ఆక్వా ల్యాబ్స్‌ ప్రతినిధి శ్రీనివాస్, మత్స్యశాఖ, ఎంపెడా అధికా రులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement