technicians
-
సాధారణ మెకానిక్‌లు ఇప్పుడు ఈవీ టెక్నీషియన్లు..
వారంతా ఒకప్పుడు సాధారణ మెకానిక్‌లు. ఇప్పుడు ఈవీ టెక్నీషియన్స్‌గా మారారు. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ASDC) ఎలక్ట్రానిక్ వెహికల్ పరిశ్రమలో టెక్నీషియన్లుగా పనిచేయడానికి 300 మంది సాధారణ టూ వీలర్, త్రీ వీలర్ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చింది. లివ్‌గార్డ్ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈవీ పరిశ్రమకు నైపుణ్యత కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అందించడం ఈ చొరవ లక్ష్యం. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని ఆగ్రాలో అభ్యర్థులకు పది రోజులపాటు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ విధానం ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈవీ పరిశ్రమలో అభ్యర్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం, కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించడం, రిపేర్ టెక్నిక్లను మెరుగుపర్చుకోవడంపై ఈ శిక్షణలో తర్ఫీదు ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్ అయిన భారత్‌లో మోటార్‌సైకిల్ పరిశ్రమ నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోందని టోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ సీఈవో అరిందమ్ లహిరి పేర్కొన్నారు. యువతకు మెరుగైన శిక్షణ అందించడం ద్వారా నైపుణ్య కొరతను తగ్గించవచ్చని, పరిశ్రమ డిమాండ్లను తీర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్, వేతన ఆధారిత ప్రోత్సాహకాలు, టూల్ కిట్, ఒక సంవత్సరం ప్రమాద బీమా కవరేజీని అందించారు. ఈ సర్టిఫికెట్, టూల్ కిట్లు, ప్రోత్సాహకాలు అభ్యర్థులకు పరిశ్రమలో ఉపాధిని పొందేందుకు, బ్యాంకు రుణాల సహాయంతో సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తాయని వివరించారు. -
టెక్నాలజీయేతర రంగాల్లో టెకీలకు డిమాండ్
ముంబై: టెక్నాలజీయేతర రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. 2027–28 నాటికి 6 పరిశ్రమలు 10 లక్షల మందికి పైగా టెకీలను నియమించుకోనున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టెక్నాలజీయేతర రంగాలైన బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా).. కన్సల్టింగ్, కమ్యూనికేషన్ మీడియా, రిటైల్, లైఫ్ సైన్సెస్.. హెల్త్‌కేర్ తదితర రంగాల సంస్థలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 11.15 లక్షల మంది టెక్ నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఈ రంగాల్లో 7 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ప్రమేయం ఉంటోంది. 5జీ సేవలు ప్రారంభం కావడం, డిజిటల్ చెల్లింపుల వృద్ధి, కొత్త తరం వ్యాపారాల వస్తుండటం, ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం పెరుగుతుండటం, డిజిటల్ పరివర్తన మొదలైన పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో టెక్నాలజీయేతర రంగాల్లోనూ టెకీలకు డిమాండ్ ఏర్పడుతోంది‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ తెలిపారు. నిపుణుల కొరత.. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నప్పటికీ నిపుణుల లభ్యత ఆ స్థాయిలో లేకపోవడం పరిశ్రమలకు పెద్ద సవాలుగా ఉంటోందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ (స్పెషలైజ్డ్ స్టాఫింగ్ విభాగం) మునీరా లోలివాలా తెలిపారు. టెకీలను నియమించుకోవడంతో పాటు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవడంపైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తద్వారా నిర్వహణ వ్యవస్థను నైపుణ్యాల ఆధారితమైనదిగా తీర్చిదిద్దుకునేందుకు పటిష్టమైన పునాది వేసుకోవచ్చని మునీరా వివరించారు. ‘ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెక్నాలజీయేతర రంగాల్లో ఇప్పటికీ నియామకాలనేవి పర్మనెంట్ ఉద్యోగాల ప్రాతిపదికన ఉండటం లేదు. 54 శాతం సంస్థలు మాత్రమే పర్మనెంట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఏకంగా 30 శాతం సంస్థల్లో నియామకాలు రకరకాల కాంట్రాక్టుల రూపంలో ఉంటున్నాయి‘ అని ఆమె పేర్కొన్నారు. నివేదిక ప్రకారం ప్రాంతం, వేతనాలపరంగా చూస్తే బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్ మెరుగ్గా ఉంటున్నాయి. బెంగళూరులో టెకీల్లో 27 శాతం మందికి, హైదరాబాద్‌లో 16 శాతం, ఢిల్లీ.. పుణెల్లో 13 శాతం మందికి అత్యధిక వేతనాలు లభిస్తున్నాయి. -
50,000 మందికి ఏసీలపై శిక్షణ: జాన్సన్ హిటాచీ
న్యూఢిల్లీ: జాన్సన్ కంట్రోల్స్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా 2025 నాటికి 50 వేల మందిని ప్రపంచస్థాయి ఏసీ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, గుజరాత్‌లోని ఒక కేంద్రంలో యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించింది. భారత్‌లో వచ్చే 20 ఏళ్లలో ఏసీలకు డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని పేర్కొంది. దేశంలో సుమారు రెండు లక్షల మంది ఏసీ టెక్నీషియన్లు ఉన్నారని అంచనా. -
జీతాలివ్వకుండా వేధిస్తున్న ఆర్జీవీ!
వివాదాలు, విమర్శలతోనే చెలగాటం ఆడే రామ్‌గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఆయన తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు కోటి రూపాయల మేర డబ్బులు చెల్లించనేలేదట. దీంతో ఆగ్రహించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ(ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయూస్) ఇకపై ఆర్జీవీతో పని చేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో కూడా వరుస సినిమాలు తీసుకుంటూ పోయిన వర్మ పలువురు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అసలు జీతాలే ఇవ్వలేదట. సుమారు కోటి రూపాయల డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నాడట! దీంతో వీలైనంత త్వరగా వారికి డబ్బులు చెల్లించమని కోరుతూ ఎఫ్ఐసీఈ వర్మకు సెప్టెంబర్ 17 నుంచి లేఖలు పంపుతూనే ఉంది. కానీ అటు వైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో లీగల్ నోటీసులు సైతం పంపించింది. అయినా ఆర్జీవీ నిమ్మకు నీరెత్తనట్లు ఊరుకుండిపోయారు. (చదవండి: స్త్రీల కోసం సాగిన సుమధుర గీతం) అయితే సెప్టెంబర్‌లో వర్మ గోవాలో చిత్రీకరణ జరుపుతున్నారన్న విషయం తెలిసి ఏకంగా అక్కడి ముఖ్యమంత్రికి కూడా లేఖను పంపామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ పేర్కొన్నారు. కరోనా కాలంలో చాలా మంది పేద ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేయించుకుని వారికి చిల్లిగవ్వ ఇవ్వకుండా తిరుగుతున్నాడన్న విషయాన్ని బయటపెట్టారు. వెంటనే వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించమని ఎంత మొర పెట్టుకున్నా ఆయన స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. కాగా ఆర్జీవీ ప్రస్తుతం తను తెరకెక్కించిన 12'O' క్లాక్ సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. (చదవండి: తెలుగింట్లో తమిళ కోడలు) -
బకాయిలు చెల్లించండి
సినీ పరిశ్రమకు చెందిన దినసరి వేతనాలు అందుకునే సాంకేతిక నిపుణులు, నటీనటులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను నిర్మాతలు చెల్లించాలని ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (ఐఎమ్పీపీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘షూటింగ్స్ లేకపోవడం వల్ల చాలామంది ఉపాధిని కోల్పోయారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెండింగ్ వేతనాలు అందక దినసరి కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో నిర్మాతలు కూడా కష్టాల్లోనే ఉన్నారు. అది అర్థం చేసుకోగలం. కానీ మానవీయ కోణంలో నిర్మాతలు ఆలోచించి బకాయిలను వీలైనంత తొందరగా చెల్లించాలని కోరుతున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో వారు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి వీలవుతుంది’’ అని ఐఎమ్పీపీఏ పేర్కొంది. -
బ్యాంకులపై సైబర్ నెట్!
క్లస్టర్లతో ప్రయోజనాలు సైబర్ దాడుల నిరోధానికి నగరంలో సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లు పనిచేస్తున్నాయి. వీటితో ప్రయోజనాలను ఐఎస్‌ఏసీఏ వెల్లడించింది. ఈ నేరగాళ్ల సమాచారం, వారు వినియోగిస్తున్న సాంకేతికతపై సమస్త సమాచారాన్ని తెలుసుకునే హబ్‌ను ఏర్పాటు చేయడం. సైబర్ సెక్యూరిటీ క్లస్టర్లో చేరిన సంస్థలు లేదా దేశాలకు ఈ నేరాల నిరోధానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. ఆయా సంస్థల మధ్య సమన్వయం సాధించడంతోపాటు సైబర్ నేరాలు జరిగిన తీరును సాంకేతిక నిపుణులు ఆమూలాగ్రం విశ్లేషించి భవిష్యత్‌లో ఇలాంటివి చోటుచేసుకోకుండా చర్యలను వివరిస్తారు. విశ్వవ్యాప్తంగా సైబర్ నేరాల నిరోధానికి అవలంబించాల్సిన సాంకేతిక వ్యూహాలను సిద్ధం చేస్తారు. దీనిపై ఆయా సంస్థలకు అవగాహన కల్పిస్తారు. సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ ఆన్ చేయగానే టక్కున ఓ మెయిల్ వస్తుంది. అది ఏమిటా అని తెరిచి చూసేలోపే మన కంప్యూటర్లో ఉన్న డాటా అంతా అవతలి వాళ్లకు చేరిపోతుంది. ఇలాంటి సైబర్ నేరాలు ఏటా పెరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రధానంగా బ్యాంకులు, హెల్త్‌కేర్ రంగాలే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజూ సరాసరిన 3 సైబర్ఎటాక్స్ జరుగుతున్నట్లు తమ వద్ద నమోదవుతున్నాయని నగర కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియేషన్(ఐఎస్‌ఏసీఏ)’ తాజా అధ్యయనంలో తేలింది. ర్యాన్సమ్ వేర్.. వానా క్రై వంటి సైబర్ దాడులతోపాటు ఫిషింగ్ మెయిల్స్‌తో ఆయా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెల్త్‌కేర్ రంగంలో పని చేస్తున్న వివిధ సంస్థలు ఈ దాడులకు గురవుతున్నట్లు ఈ సంస్థ తాజా అధ్యయనంలో తేలింది. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మేనేజ్మెంట్ హోదాలో ఉన్న వారికి అనునిత్యం వివిధ సంస్థలు, వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిమిత్తం వచ్చే మెయిల్స్‌లో సుమారు 26 శాతం ఫిషింగ్ మెయిల్స్ (చౌర్యానికి పాల్పడేవి) ఉన్నాయని.. ఉద్యోగులు ఏమరుపాటుగా వీటిని తెరచిచూస్తే ఆయా సంస్థల డేటాబేస్ చౌర్యంతోపాటు సిస్టం, సాఫ్ట్వేర్ తీవ్రంగా ప్రభావితమౌతున్నాయని తేల్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు విధిగా సైబర్ సెక్యూరిటీ అంశంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించింది. ఇప్పటికే తమ సంస్థకు చెందిన నిపుణులు సైబర్ దాడుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా సంస్థలకు అవగాహన కల్పించడంతోపాటు పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ‘సెక్యూరిటీ ఆపరేషన్స్’... వివిధ ప్రభుత్వ విభాగాల డేటా భద్రంగా దాచేందుకు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను ఐటీ శాఖ నిర్వహిస్తోంది. సైబర్ దాడుల నిరోధానికి సెక్యూరిటీ పాలసీని కూడా తీసుకొచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. హేగ్ సెక్యూరిటీ డెల్టా, సీడాక్ సంస్థల సౌజన్యంతో సైబర్ దాడుల నిరోధానికి ప్రయత్నిస్తోంది. పెరుగుతోన్న నేరాలు... గత ఏడాది నగరంలో నమోదైన కేసుల్లో సాంకేతిక, సాంకేతికేతర అంశాలున్నాయి. పలు బ్యాంకులు, ఆర్థిక, వాణిజ్య సంస్థలకు చెందిన కంప్యూటర్లు, కంప్యూటర్ల నెట్వర్క్, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, డేటా, సైబర్‌స్పేస్‌కు ముప్పు వాటిల్లడం, డేటా తస్కరణ, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాల వంటి నేరాలు చోటుచేసుకున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, ప్రోగ్రామ్‌లు రూపొందించే అంశాలతో సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించారు. సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అవగాహన తప్పనిసరి అని ఐఎస్‌ఏసీఏ తన అధ్యయనంలో వెల్లడించింది. -
‘హెచ్1’ దెబ్బ అమెరికాకే..!
న్యూఢిల్లీ: టెక్నాలజీ నిపుణులకు వీసాలివ్వటంపై మరిన్ని పరిమితులు విధిస్తే అమెరికన్ కంపెనీలకే ప్రతికూలమవుతుందని దేశీ ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. ఈ వీసాలపై విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికన్ కంపెనీలు సరైన వారు దొరక్క బలహీనంగా మారతాయని, ఉద్యోగాలకు ముప్పు తప్పదని పేర్కొంది. వివాదాస్పద హెచ్–1బీ వీసాలు అత్యధికంగా భారతీయులకే దక్కుతుండటం వారి ప్రతిభకు తార్కాణమని, వీటిలో చాలా మటుకు వీసాలను అంతర్జాతీయ, అమెరికన్ బహుళజాతి దిగ్గజాలు స్పాన్సర్ చేస్తున్నాయని నాస్కామ్ తెలియజేసింది. విదేశీ కంపెనీలు డేటాను తమ దేశంలోనే భద్రపర్చాలంటూ ఒత్తిడి చేసే దేశాలకు ఇచ్చే హెచ్–1బీ వీసాలపై 10–15 శాతం మేర పరిమితి విధించే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో నాస్కామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశంపై ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం నుంచి అధికారికంగా ధృవీకరణ ఏదీ రాలేదని, అధికారులిచ్చే స్పష్టమైన వివరణ కోసం ఎదురు చూస్తున్నామని నాస్కామ్ తెలిపింది. ఒకవేళ ఇలాంటిదేమైనా అమలు చేసిన పక్షంలో ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే భారీగా ఆదాయాలు పొందుతున్న 150 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. సాధారణంగా భారతీయ ఐటీ సంస్థలు అత్యధికంగా హెచ్–1బీ వీసాలపైనే తమ ఉద్యోగులను అమెరికాలోని క్లయింట్ లొకేషన్స్‌కు పంపిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో వీసాల పరిశీలన చాలా కఠినతరంగా మారడంతో దేశీ ఐటీ సంస్థలు అమెరికాలోని స్థానికులనే ఎక్కువగా రిక్రూట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ‘ఒకవేళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడాన్ని అమెరికా విధానాలు కఠినతరం చేసిన పక్షంలో దాని వల్ల.. వారిపై ఆధారపడి ఉన్న అమెరికా కంపెనీలే బలహీనపడతాయి. ఆయా సర్వీసులను మళ్లీ విదేశాల నుంచి పొందాల్సి వస్తుంది’ అని నాస్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. పరిమితులపై ఇంకా సమాచారం రాలేదు: కేంద్ర వాణిజ్య శాఖ డేటా లోకలైజేషన్ నిబంధనలు అమలు చేసే దేశాలకిచ్చే హెచ్–1బీ వీసాలపై పరిమితులు విధించే విషయంపై అమెరికా నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చెల్లింపుల సేవలు అందించే పేమెంట్ సర్వీసుల సంస్థలు భారతీయ వినియోగదారుల డేటాను భారత్‌లోనే ఉంచాలంటూ కేంద్రం గతేడాది ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి నిబంధనలనే వ్యతిరేకిస్తూ.. తాజాగా హెచ్–1బీ వీసాల విషయంలో భారత్ లాంటి దేశాలను అమెరికా టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. -
రైల్వే సీబీటీలో 5లక్షల మందికి అర్హత
న్యూఢిల్లీ: అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మొదటి దశలో మొత్తం 5, 88, 605 మంది అర్హత సాధించారని రైల్వే శాఖ తెలిపింది. డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న రెండో దశ పరీక్షకు వీరు అర్హత పొందారని పేర్కొంది. పరీక్షకు 10రోజుల ముందు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందుగా ఈ–కాల్ లెటర్లు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. మొత్తం 64, 371 పోస్టులకు గాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించారు. -
రైల్వేలో ఉద్యోగాల జాతర
న్యూఢిల్లీ: రైల్వేల్లో అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్పీ), టెక్నీషియన్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ ఉన్న 26,502 ఖాళీలను 60 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై రైల్వేశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే తాజా పెంపు చేపట్టినట్లు తెలిపారు. ఏఎల్పీ, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఈ నెల 9న తొలిదశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తారు. ఆగస్టు 9న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయన్నారు. పరీక్ష రాసేందుకు జనరల్ అభ్యర్థులకు గంట, దివ్యాంగులకు మరో 20 నిమిషాలు అదనంగా కేటాయిస్తామన్నారు. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు ట్రావెల్ అథారిటీ కూడా తీసుకోవాలని సూచించారు. -
కమిషనర్‌కు కోపం వచ్చింది
భీమవరం టౌన్: మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్‌నాయక్, ఐఏఎస్‌కు కోపం వచ్చింది. మత్స్యశాఖ నిద్రపోతుందా.. సమయపాలన తెలియదా.. ఇలాగేనా ఏర్పాట్లు చేసే ది.. అధికారులు డ్యాన్స్ చేస్తున్నారా అం టూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర ఫిషరీస్, ఆక్వాకల్చర్ చట్టం రూ పొందించడంలో భాగంగా భీమవరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఉద యం 9 గంటలకు ఆక్వా టెక్నీషియన్లకు అవగాహనా సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథి కమిషనర్ రమాశంకర్‌నా యక్ నిర్ణీత సమయానికి వచ్చారు. ఆయన అధికారులతో కొంతసేపు వివిధ అంశాలపై చర్చించారు. అధికారులు ఉ న్నా పట్టుమని పది కుండా టెక్నీషియన్లు హాజరుకాలేదు. ఉదయం 10.30 గంటల వరకూ కమిషనర్ ఫైల్స్ చూసుకుంటూ గడిపారు. ఆ తర్వాత మరికొంత సమ యం అక్కడే కూర్చున్నారు. అప్పటికీ టెక్నీషియన్లు రాకపోవడంపై ఆగ్రహిం చారు. వెంటనే అక్కడి నుంచి వేగంగా ఆయన బయటకు వెళ్లిపోతుండటంతో మత్స్యశాఖ డీడీ కె.ఫణిప్రకాష్, రిటైర్డ్ డీడీ పి.రామ్మోహన్రావు తదితరులు సదస్సును మొదలుపెడదామని కోరారు. 10 మంది కూడా లేకుండా సదస్సు ఎలా ప్రా రంభిస్తారు.. ఇలాగేనా ఏర్పాట్లు చేసేది అంటూ.. కమిషనర్ కోపంతో మెట్లు దిగి వెళ్లిపోయారు. బయట గేటు వద్ద అధి కారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కమిషనర్ వారికి క్లాస్ తీసుకుంటూ రోడ్డుపైకి వచ్చేశారు. కోపంగా వచ్చి కారు ఎక్కి వెళ్లిపోయారు. తర్వాత ఒక్కరొక్కరుగా టెక్నీషియన్లు రావడం, అ ధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు మ ధ్యాహ్నం 12.25 గంటలకు కమిషనర్ తిరిగి వచ్చి సదస్సును ప్రారంభించారు. రాష్ట్రాభివృద్ధికి ఆక్వా కీలకం ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఆదాయం రూ.లక్ష కోట్లు లక్ష్యంగా ముందుకు సాగాలని మ త్స్యశాఖ కమిషనర్ రమాశంకర్‌నాయక్ సూచించారు. భీమవరంలో ఆక్వా రంగ టెక్నీషియన్లతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కమిషనర్ రమాశంకర్‌నాయక్ మాట్లాడుతూ ఆం ధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతికి ఆక్వా రంగం కీలకంగా మారిందన్నారు. ఏటా దా దాపు రూ.50 వేల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వా రంగంలో ఆదాయ లక్ష్యం మరింత పెరగాలన్నారు. రా ష్ట్రంలో 1.86 లక్షల హెక్టార్లలో చేపలు, రొయ్యల సాగు ఉండగా దీనిలో 85 వేల హెక్టార్లలో రొయ్యల సాగు ఉందన్నారు. ఆక్వాను క్షేత్ర స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో 29 క్లస్టర్స్‌ను 104 సబ్‌క్లస్టర్స్‌గా విభజించామని చెప్పారు. కమిటీల ఏర్పాటు నాణ్యమైన సీడ్ కొరత, జీవ పరిరక్షణ పద్ధతులు పాటించకపోవడం, శాస్త్రీయ పద్ధతిలో యాజమాన్య పద్ధతులు చేపట్టకపోవడం ఆక్వా రంగంలో సమస్యలుగా ఉన్నాయని ఆయన అన్నారు. యాంటీబయోటిక్స్ వాడకాన్ని నిరోధించేందుకు పర్యావరణ స్నేహపూర్వక ఆక్వా ఉత్పత్తుల సాధనకు, సాగును సుస్థిరం చేసి ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధి కోల్పోకుండా జీఓ–2ను విడుదల చేశారన్నారు. ఆక్వాసాగును సుస్థిరం చేయడం, యాంటీబయోటిక్స్ నియంత్రణకు కమి టీలు ఏర్పాటుచేశామన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీలు విస్తృత తనిఖీలు చేస్తామని, యాంటీబయోటిక్స్ అవశేషా లు పరీక్షించే ల్యాబ్‌ల వివరాలు, టెక్నీషి యన్ల వివరాలు సేకరించి సమగ్ర నివేది కను అపెక్స్ కమిటీకి సమర్పిస్తామన్నారు. చతుర్ముఖ వ్యూహం అపెక్స్ కమిటీ నివేదిక సమర్పించిన త ర్వాత దానిని పరిశీలించి ఆక్వా రంగ అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం రూ పొందించడం ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 200 ల్యాబ్‌లకు 140 ల్యాబ్‌లను రిజిస్ట్రేషన్ చేశామని కమిషనర్ చెప్పారు. మరో 60 ల్యాబ్‌లలో నైపుణ్యం గల టెక్నీషియన్లు, సదుపాయాలు లే వని, వాటిని సమకూర్చుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. కాకినాడలో ల్యాబ్ టెక్నీషియన్లకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిచేందుకు, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేందుకు యాప్‌ను ఏర్పాటు చేసుకుందామని కమిషనర్ సూచించారు. మత్స్యశాఖ డీడీ డాక్టర్ కె.ఫణిప్రకాష్ అధ్యక్షత వహించగా ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ డీడీ డా క్టర్ షెర్బీ, మత్స్యశాఖ రిటైర్డ్ డీడీ డాక్టర్ పి.రామ్మోహన్, ఆక్వా ల్యాబ్స్ ప్రతినిధి శ్రీనివాస్, మత్స్యశాఖ, ఎంపెడా అధికా రులు పాల్గొన్నారు. -
అనుమతి ఉన్న హేచరీల్లోనూ నాసిరకం సీడ్
కావలి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసే హేచరీల్లో చాలా వరకు నాణ్యమైన సీడ్ లభించడం లేదు. హేచరీలు సంబంధిత టెక్నీషియన్లను నియమించకోకుండా నాసిరకం సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం తోటల్లో ఉన్న పశువుల పాకల్లో సైతం రొయ్యల పిల్లల హేచరీలు పెడుతున్నారని సీఫుడ్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డీబీ రవిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జేబీ డిగ్రీ కళాశాలలో తీర ప్రాంతంలోని ‘రొయ్యలు, చేపల సాగులో వినియోగించే రసాయనాలు, వ్యాధి నిరోధకాలు, వాటి ప్రభావం’ అనే అంశంపై నాక్ సహకారంతో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తం గా 180 హేచరీలకు గుర్తింపు ఉందన్నారు. ఇందులో 50 హేచరీలే నాణ్యమైన సీడ్ అమ్మకాలు సాగిస్తున్నాయన్నారు. సీఫుడ్స్ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి రూ.11 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం అందుతుందన్నారు. రొయ్యల సాగుపై అవగాహన లేకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారన్నారు. అవగాహన లేకుండా ఇష్టానుసారం యాంటీబయాటిక్స్‌ను వాడడం, మేతను వేయడం రైతుల నష్టాలకు కారణమని వివరించారు. రాష్ట్రంలో మత్స్యశాఖ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, రొయ్యల సాగుపై రైతులకు ఆ శాఖ అధికారులు అవగాహన కల్పించకపోవడం నష్టాలకు ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగం ఎంపెడా నుంచి మాత్రమే కాస్త సహకారం ఉందన్నారు. మత్స్యశాఖలో సిబ్బంది కొరతతో అనధికార హేచరీలు, నాణ్యతను పాటించని హేచరీలపై చర్యలు తీసుకోలేక పోతున్నారన్నారు. హేచరీల నిర్వాహకులు సేకరించిన తల్లి రొయ్యలు పదిసార్లు మాత్రమే నాణ్యమైన రొయ్య పిల్లలను అందిస్తాయన్నారు. ఆ తరువాత అవి నాసిరకమైన సీడ్ ను ఉత్పత్తి చేస్తాయన్నారు. అమెరికా, యూరోపియన్ దేశాలు, జపాన్‌ల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలు రొయ్యలను తిరస్కరిస్తున్నాయన్నా రు. ఏ దేశం నుంచి అయినా యాంటీబయాటిక్స్ ఆవశేషాలు ఉన్న రొయ్యలను క్రమే ణా వస్తుంటే ఆ దేశం నుంచి ఉత్పత్తులను నిషేధిస్తాయన్నారు. నిషేధం విధిస్తే రొయ్యల వ్యాపారంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యల్లో అలాంటి అవశేషాలు ఉన్నాయని తిరస్కరించడంతో పశ్చిమబెంగాల్లోని రైతులు తీరని నష్టాన్ని పొందాల్సి వచ్చిందన్నారు. వైరస్ వ్యాధి వ్యాపిస్తే నియంత్రించడం సాధ్యం కాదు : ప్రొఫెసర్ హరిబాబు రొయ్యలకు వైరస్ వ్యాధి వస్తే నియంత్రించడం సాధ్యం కాదని ముత్తుకూరు మత్స్యకళాశాల ప్రొఫెసర్ పీ హరిబాబు అన్నారు. రొయ్యలకు 22 రకాల వైరస్ల వల్ల వ్యాధులు వస్తాయని, వాటికి మందులు లేవన్నారు. వైరస్ వ్యాధులకు మందులు ఉన్నాయని కొందరు వ్యాపారులు, కంపెనీలు చెబుతూ రొయ్య రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మన దేశంలో 4 రకాల రొయ్యల వ్యాధులు మాత్రమే ఇప్పటి వరకు బయట పడ్డాయన్నారు. రొయ్యల సాగులో నష్టం వస్తే 60 శాతం వైరస్ వల్ల, 20 శాతం బాక్టీరియా వల్ల, 20 శాతం రైతులు అవగాహనా లోపంతో వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎక్కడా రొయ్యలకు వచ్చే వ్యాధులను పరీక్ష చేసేందుకు ల్యాబ్‌లు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లేదన్నారు. బాహ్యంగా పెరిగే జీవుల్లో అనారోగ్యాన్ని గుర్తించ వచ్చునని, నీటిలో పెరిగే జీవుల్లో కనుక్కొవడం కష్టమన్నారు. రొయ్యలు తమ శరీరంపై ఉండే మాలిన్యాన్ని తమంతట తామే శుభ్రం చేసుకుంటాయని, వాటికి ఆ శక్తి ఉందన్నారు. ఏదైనా రొయ్య శుభ్రంగా లేక మట్టి పేరుకుపోయి గుంతలో కనపడితే అవి వ్యాధికి గురవుతాయని, అలాంటి వాటిని గుర్తించి వెంటే పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపాలన్నారు. రొయ్యల వ్యాధుల పరీక్ష కేంద్రాలు ప్రస్తుతం చెన్నైలో మాత్రమే ఉన్నాయన్నారు. రొయ్యలు సైన్స్ పరిజ్ఞానంలో ఇన్ వర్టిబ్రెట్స్ అని, వాటికి వ్యాధి నిరోధక శక్తి ఉండదన్నారు. అందు వల్ల వైరస్ వ్యాధి వ్యాపిస్తే దాన్ని నియంత్రించడం సాధ్యంకాదన్నారు. ఎవరైనా మందులు కంపెనీల నిర్వాహకులు వైరస్‌ను నియంత్రించేందుకు మందులు ఉన్నాయంటే నమ్మరాదన్నారు. 20 శాతం బాక్టీరియా సోకిన రొయ్యలను మందులు వాడడం ద్వారా వ్యాధిని నివారించవచ్చన్నారు. రొయ్యల సాగులో ఎక్కువగా ఫీడ్ వేయడం, యాంటీబయాటిక్స్ వాడడం మంచిది కాదన్నారు. రైతులకు రొయ్యల సాగుపై పరిజ్ఞానం లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నారు. నాణ్యమైన రొయ్యల సీడ్‌ను గుర్తింపు ఉన్న నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న హేచరీల నుంచి మాత్రమే రైతులు సీడ్ కొనుగోలు చేయాలన్నారు. గతంలో వ్యాధుల బారిన పడి టైగర్ రొయ్యల పెంపకం కనమరుగైందన్నారు. ఇప్పుడు వెనామీ రొయ్యల సాగులో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన కోరారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, తర్వాత సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రొజెక్టర్‌తో రొయ్యల సాగుపై అవగాహన కల్పించారు. విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి, జేబీ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డి, సదస్సు చైర్మన్, జేబీ ప్రిన్సిపల్ మేజర్ పాల్‌మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ ఎం.వీ.భాస్కర్, వివిధ యూనివర్సిల నుంచి అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, రైతులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ల్యాబ్‌లున్నా.. టెక్నీషియన్లు లేరు
మోర్తాడ్ : ప్రభుత్వ ఆస్పత్రులలో రక్తం, మూత్రం, తది తర పరీక్షలను నిర్వహించి రోగాన్ని నిర్ధారించడానికి ల్యాబ్‌లను ఏర్పాటు చేసినా.. ల్యాబ్ టెక్నీషియన్లను నియమించకపోవడంతో రోగులకు సరైన సేవ లు అందడం లేదు. కొన్నేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా నే ఉంటున్నాయి. వీరి స్థానంలో ఎంపీహెచ్‌ఏలతో ల్యాబ్‌లను నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌లతోపాటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నా యి. గతంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమితులైనవారు తర్వాత సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే శిక్షణ పొందిన ల్యాబ్టెక్నిషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ల్లో డీఎల్‌ఎంటీ కోర్సు పూర్తి చేసినవారిని నియమించాల్సి ఉంది. ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోవడంతో అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఆస్పత్రుల్లో ఎంపీహెచ్‌ఏలుగా పని చేస్తున్న కాం ట్రాక్టు వైద్య సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చి వారి తోనే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు జ్వరంలాంటి వ్యాధులకే కాకుండా మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు, హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇంకా ఎన్నో రకాల వ్యాధుల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం అవుతా యి. ఎక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో తక్కువ సమయం లో నామమాత్రపు శిక్షణ పొందిన ఎంపీహెచ్‌ఏలతో నే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. డీఎంఎల్టీ కోర్సులో రోగ నిర్ధారణ పరీక్షలను ఎలా చేయాలి, ఎలాంటి వ్యాధిని గుర్తించాలంటే ఎంత సమయం రక్తం, మూత్రం పరీక్షను నిర్వహిం చాలి, తదితర ఆంశాలపై క్షుణ్ణంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారికి పరీక్షలను నిర్వహిస్తారు. డీఎంఎల్టీ కోర్సు పూర్తి చేసినవారు ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకునే వీలుంది. కాగా వా రు ప్రభుత్వ ఉద్యోగంపైనే టెక్నీషియన్లు మక్కువ చూపుతారు. ప్రభుత్వం మాత్రం శిక్షణ కేంద్రాల నిర్వహణకు అనుమతులు ఇస్తున్నా.. ఉపాధిని చూపలేకపోతోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్పందించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
యువత ఆన్లైన్ ప్రపంచంలోకి....
పుస్తక పరిచయం పుస్తకాన్ని రాసే క్రమంలో రిపోర్టర్, సామాజికవేత్త, సాంకేతిక నిపుణురాలు, మానసిక విశ్లేషకురాలు... ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు రచయిత్రి. ‘‘వీళ్లను ఒక పట్టాన అర్థం చేసుకోలేం’’ అని అప్పుడప్పుడూ అంటుంటారు పెద్దలు యువత ధోరణులను పరిశీలిస్తూ. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తరువాత ఈ అర్థం చేసుకోవడమనే వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. సోషల్ మీడియా వల్ల యువతకు మంచి జరగుతుందా? చెడు జరుగుతుందా? అనే చర్చ తీవ్రమైంది. అయితే ఈ చర్చలో ఏకపక్ష వాదనలే ఎక్కువగా వినిపించేవి. సాధికారికమైన సమాచారం ఆధారంగా చేసే వాదన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో డోన బోయ్ రాసిన ‘ఇట్స్ కాంప్లికేటెడ్...ది సోషల్ లివ్స్ ఆఫ్ నెట్ వర్క్డ్ టీన్స్’ పుస్తకం యువత ఆన్లైన్ మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోపడుతుంది. న్యూయార్క్ యూనివర్శిటీ... డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా, కల్చర్ అండ్ కమ్యూనికేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు డోన. మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ రిసెర్చర్‌గా కూడా ఆమెకు అనుభవం ఉంది. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో కోణాలలో అధ్యయనం చేసి డోన రాసిన పుస్తకం ఇది. దీనికోసం వందలాది మంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేశారు. దినచర్య మొదలు మనస్తత్వ పరిశీలన వరకు యువతకు సంబంధించిన రకరకాల ధోరణులను లోతుగా అధ్యయనం చేశారు. టెక్ట్స్ మెసేజ్‌లు, యూ ట్యూబ్ సినిమాలు, ట్విట్టర్, ఫేస్బుక్ అప్డేట్లు, సెల్ఫీలు...ఇలా యువత ఆన్లైన్ జీవితాన్ని లోతుగా విశ్లేషించారు. ‘‘సోషల్ మీడియా వల్ల యువత నష్టపోతుందనే ప్రచారం... అవసరానికి మించి ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా వల్ల లాభమే తప్ప నష్టమేది లేదు’’ అంటున్నాడు డోన ఇంటర్వ్యూ చేసిన స్టాన్ అనే విద్యార్థి. ఒకే కోణంలో కాకుండా సోషల్ మీడియా వల్ల యువతకు జరుగుతున్న నష్టాలతో పాటు ప్రయోజనాలను కూడా డోన చెప్పారు. పుస్తకాన్ని రాసే క్రమంలో రిపోర్టర్, సామాజికవేత్త, సాంకేతికనిపుణురాలు, మానసిక విశ్లేషకురాలు...ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు రచయిత్రి. అందుకే పుస్తకానికి నిండుదనం వచ్చింది. ‘ఇట్స్ కాంప్లికేటెడ్...’ పుస్తకానికి విమర్శకుల నుంచి ‘కనువిప్పు కలిగించే పుస్తకం’ (ఐ-ఓపెనింగ్ బుక్), ‘తల్లిదండ్రులు, యువత మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు చదవాల్సిన పుస్తకం’ అనే ప్రశంసలు లభించాయి. -
స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్!
ఆయన ఏ సినిమా తీసినా అందులో హృదయాన్ని స్ప ృశించే కథనం ఉంటుంది. ఆ సినిమా రీమేక్ గానో, డబ్బింగ్గానో మరో భాష సినీ ప్రేమికులను పలకరిస్తుంటుంది. దాని ద్వారా పరిచయం అయ్యే నటీనటులు లేదా సాంకేతిక నిపుణులు తర్వాత సినీ పరిశ్రమకే వరంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా గుర్తుండి పోతాయి ఆయన సినిమాలు. ఆయనే భారతీ రాజా... మద్రాస్ ప్రెసిడెన్సీలోని తేని ప్రాంతంలో ఉండే అల్లినగరంలో పుట్టిన చిన్నస్వామికి జింకలను వేటాడటం, సాహిత్యం చదవడం చాలా ఇష్టం. ఆ ఊరికి పక్కనే పెద్ద అడవి. అక్కడ అతడి వేట సాగేది. వేట... సరదాను తీరిస్తే, సాహిత్యం... సృజనాత్మకతను వెలికితీసింది. సినీదర్శకుణ్ణి చేసింది. చిన్నస్వామిగా అడవిలో జింకలను వేటాడిన అతడు... భారతీరాజాగా మారి సినీ పరిశ్రమలో అనేకమంది ప్రతిభావంతులను వేటాడి పట్టుకొన్నాడు. వారి ప్రతిభకు మరింత పదును పెట్టాడు. వారిని స్టార్స్‌ని చేసి తాను స్టార్ డెరైక్టర్ అయ్యాడు! నల్లమనుషులను, సముద్రంపై ఆధారపడి బతికే వారి యాస, భాషలను, పచ్చని ప్రకృతిని తెరపై చూపించే ప్రయత్నం చేశారు భారతీరాజా. అసలు సిసలు పల్లెలను తెరమీద ఆవిష్కరించాడు. అందుకే... దక్షిణాది సినిమా స్వరూపాన్ని మార్చేసిన దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారు భారతీరాజా. ‘పదునారు వయదునిలే’తో బాలనటి శ్రీదేవిని హీరోయిన్గా పరిచయం చేయడంతో బోణీ చేశారు భారతీరాజా. అది ఆయనకు కూడా తొలి సినిమానే. రెండో సినిమా ‘కిళక్కే పోగుమ్ రైల్’తో రాధికను తెరమీదికి తెచ్చారు. అదే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తెలుగు నటుడు సుధాకర్. రచయితగా, దర్శకుడిగా, హీరోగా ఒక వెలుగు వెలిగిన భాగ్యరాజా కూడా భారతీరాజా శిష్యుడే. భారతీరాజా దగ్గర అసి స్టెంట్గా పనిచేస్తూ, ఆయన సినిమాల్లో చిన్నచిన్న పాత్రలను చేస్తూ వచ్చిన భాగ్యరాజాను హీరోని చేశారు భారతీరాజా. ఆ సినిమాతోనే రతీ అగ్నిహోత్రి కూడా హీరోయిన్గా పరిచయం అయ్యింది. తమిళనటుడు, దర్శకుడు మణివణ్ణన్కి కూడా భారతీరాజాయే గురువు. ‘సీతాకోక చిలుక’ తమిళ వెర్షన్‌తో కార్తీక్, రాధల్ని హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఆ సినిమా తెలుగు రీమేక్‌తో కార్తీక్ తెలుగు వాళ్లకు పరిచయమైతే... ముచ్చర్ల అరుణ హీరోయిన్ అయ్యింది. ప్రసిద్ధ తమిళ గీత రచయిత వైరముత్తు కూడా భారతీరాజా కనిపెట్టిన కవే. ‘డాన్స్‌మాస్టర్’లో కమల్‌కి జోడీగా నటించిన రేఖ, ‘మంగమ్మగారి మనవడు’ తమిళ వెర్షన్ ‘మన్వాసనై’తో రేవతిలు హీరోయిన్లు అయ్యారు ఆయన చలువ వల్లే. ఆయన ‘నిళల్గల్’ సినిమాతో పరిచయం చేసిన రవి ఆ తరువాత నిళల్గల్ రవిగానే స్థిరపడిపోయారు. ఇంకా భానుప్రియ, సుకన్య, రంజిత, రియాసేన్, ప్రియమణి, కాజల్... వీళ్లందరి తొలి సినిమాల కెప్టెన్ కూడా భారతీరాజానే. ఇంతమంది గొప్ప నటీనటులను వెలికి తీయడం మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను వెలికి తీయడమంటే మాటలూ కాదు. అది భారతీరాజాకు మాత్రమే సాధ్యమేమో! ఏకలవ్యులలా ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నారు వసంత బాలన్, బాల, శివకుమార్ వంటి తమిళ దర్శకులు. ఇంతమంది స్టార్లనూ, డెరైక్టర్లనూ ప్రభావితం చేసిన భారతీరాజాను స్టార్లను ఆవిష్కరించిన స్టార్ డెరైక్టర్ అనొచ్చు. - జీవన్ -
అపార్ట్మెంట్లో భారీ పేలుడు
=నలుగురికి గాయాలు =మెదక్ జిల్లాలో ఘటన =ఉలిక్కిపడ్డ రామచంద్రాపురం =గ్యాసే కారణమంటున్న పోలీసులు! రామచంద్రాపురం, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని బోన్సాయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెక్నీషియన్లు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ కారణంగానే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి నాలుగు ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడో అంతస్తులో జరిగిన ఘటనతో కింది ఫ్లోర్(211)లో నివసిస్తున్న మహిళలిద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. కాగా పేలుడు జరిగిన ఇంట్లో చాలా కాలంగా ఎవరూ ఉండటం లేదు. రహీం, ఖమల్ అనే ఇద్దరు టెక్నిషియన్లు బోన్సాయ్ అపార్ట్మెంట్లో ఇన్‌బిల్ట్ గ్యాస్ వ్యవస్థను మరమ్మతులు చేసేందుకు వచ్చారు. వారు ఇతర ఇళ్లల్లో గ్యాస్ పైపులైన్ పనులను ముగించుకుని మూడో అంతస్తుకు వచ్చి ఇంటి (311) కాలింగ్ బెల్ నొక్కారు. సరిగ్గా అప్పుడే పేలుడు సంభవించింది. ఈ మేరకు గాయపడ్డ టెక్నీషియన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండో అంతస్తులో(312)లో ఉంటున్న వారు అప్పుడే బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ ఫ్లాట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. మొత్తం అపార్ట్మెంట్లోని పలు ఫ్లాట్ల కిటికీ అద్దాలు పగిలాయి. లిఫ్టు ధ్వంసమైంది. పేలుడుతో ఆనుకుని ఉన్న ఇతర అపార్ట్మెంట్ల అద్దాలు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరగిన ఇంటి యజమాని ప్రకాశ్ అమర్లాల్ బజాజ్ డిల్లీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నారు. ఈ గదిలో ఎలాంటి సామగ్రి లేదు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంగారెడ్డి నుంచి క్లూస్‌టీం కూడా ఇక్కడకు చెరుకుని పరిశోధన నిర్వహించింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, భీంరెడ్డి, ఎస్ఐ రవీందర్‌రెడ్డిలు ఉన్నారు. గ్యాస్‌తోనే పేలుడు! అపార్ట్మెంట్లో పెలుడుకు కారణం గ్యాసేనని నిపుణు లు నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఇన్బెల్ట్ గ్యాస్ మెకానిక్ రహీం నుంచి పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. మంగళవారం గ్యాస్ అన్ని ఫ్లాట్లకు సరఫరా అవుతున్నదీ లేనిదీ పరిశీలిస్తున్న మెకానిక్ ఫ్లాట్ నంబర్ 311 వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే పేలుడు సంభవించింది. అయితే ఎవరూ లేని ఆ ఫ్లాట్‌లో గ్యాస్వాల్ ఓపెన్ చేసి ఉండడం వల్ల గ్యాస్ అంతా రూంలో నిండి ఉండవచ్చునని, కాలింగ్ బెల్ కొట్టగానే పేలుడు జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.