మోర్తాడ్ : ప్రభుత్వ ఆస్పత్రులలో రక్తం, మూత్రం, తది తర పరీక్షలను నిర్వహించి రోగాన్ని నిర్ధారించడానికి ల్యాబ్‌లను ఏర్పాటు చేసినా.. ల్యాబ్ టెక్నీషియన్లను నియమించకపోవడంతో రోగులకు సరైన సేవ లు అందడం లేదు. కొన్నేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా నే ఉంటున్నాయి. వీరి స్థానంలో ఎంపీహెచ్‌ఏలతో ల్యాబ్‌లను నెట్టుకొస్తున్నారు.
జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌లతోపాటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నా యి. గతంలో ల్యాబ్ టెక్నీషియన్‌లుగా నియమితులైనవారు తర్వాత సూపర్‌వైజర్‌లుగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే శిక్షణ పొందిన ల్యాబ్‌టెక్నిషియన్‌లు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ల్లో డీఎల్‌ఎంటీ కోర్సు పూర్తి చేసినవారిని నియమించాల్సి ఉంది. ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోవడంతో అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఆస్పత్రుల్లో ఎంపీహెచ్‌ఏలుగా పని చేస్తున్న కాం ట్రాక్టు వైద్య సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చి వారి తోనే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్‌లు జ్వరంలాంటి వ్యాధులకే కాకుండా మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు, హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇంకా ఎన్నో రకాల వ్యాధుల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం అవుతా యి. ఎక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్‌లు లేకపోవడంతో తక్కువ సమయం లో నామమాత్రపు శిక్షణ పొందిన ఎంపీహెచ్‌ఏలతో నే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు.
డీఎంఎల్‌టీ కోర్సులో రోగ నిర్ధారణ పరీక్షలను ఎలా చేయాలి, ఎలాంటి వ్యాధిని గుర్తించాలంటే ఎంత సమయం రక్తం, మూత్రం పరీక్షను నిర్వహిం చాలి, తదితర ఆంశాలపై క్షుణ్ణంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారికి పరీక్షలను నిర్వహిస్తారు.
డీఎంఎల్‌టీ కోర్సు పూర్తి చేసినవారు ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకునే వీలుంది. కాగా వా రు ప్రభుత్వ ఉద్యోగంపైనే టెక్నీషియన్‌లు మక్కువ చూపుతారు. ప్రభుత్వం మాత్రం శిక్షణ కేంద్రాల నిర్వహణకు అనుమతులు ఇస్తున్నా.. ఉపాధిని చూపలేకపోతోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్పందించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ల్యాబ్‌లున్నా.. టెక్నీషియన్లు లేరు
Published Thu, Nov 20 2014 3:29 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement