పేరుకే.. పెద్దాసుపత్రా..?
పేరుగొప్ప .. ఊరుదిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లా కేంద్ర ఆస్పత్రి తీరు. ఈ ఆస్పత్రికి నిత్యం జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు.కానీ వారికి మెరుగైన సేవలు అందడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నా చిన్న చిన్న పరీక్షలు కూడా నిర్వహించడం లేదని రోగులు వాపోతున్నారు.
- న్యూస్‌లైన్, నల్లగొండ టౌన్
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాల ఉంది. కానీ ఇ క్కడ చిన్న చిన్న పరీక్షలు కూడా నిర్వహిం చకుండా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ పరీక్షకైనా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపి తమ జేబు ను గుల్లా చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ కేసులతో పాటు ఇతర కేసులకు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో పరీ క్షలు చేయించుకోవాలని పంపించడం బా ధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్త గ్రూపును కనుగొనే పరీక్షలకు కూడా ప్రైవేటుకు పంపిస్తున్నారంటే ప్ర యోగశాల దుస్థితి అర్థమవుతోంది.
రసాయనాలు లేకపోవడమేనా..?
ఆస్పత్రి ప్రయోగశాలలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు చొప్పున ల్యాబ్ టెక్నీషియన్లు, అటెండంర్లు పనిచేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించే టెక్నీషియన్లు పని చేస్తున్నా అవసరమైన రసాయనాలు లేకపోవడంతోనే వివిధ పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్పట్లు సమాచారం.