చెమటలో ఆరోగ్య రహస్యం...
రోగుల ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు వైద్యులు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తుంటారు. అయితే చెమటను పరీక్షించడం ద్వారా కూడా పలు ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చంటున్నారు అమెరికా ఎయిర్‌ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ పరిశోధకులు. ఎందుకంటే.. మనిషి చెమటలో కూడా ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంటుందని వారు అంటున్నారు. చెమటను పరీక్షించడం ద్వారా గుండె కొట్టుకునే వేగం, శ్వాస రేటు, రక్తంలో నీరు, లవణాలశాతం వంటి వివరాలూ తెలుస్తాయని చెబుతున్నారు. సైనికుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం వారు వినూత్నంగా చేతికి అతికించే పట్టీలను తయారు చేశారు. స్కిన్ బయోసెన్సర్లు, ఎలక్ట్రానిక్ చిప్స్‌తో ఉండే ఈ పట్టీ చెమటలోని రసాయనాలను విశ్లేషించి, ఆ సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుందట. సంతోషానికి సంబంధించిన డోపమైన్ అనే రసాయనం, ఒత్తిడికి సంబంధించిన కార్టిసోల్ అనే హార్మోన్, ఇతర పదార్థాలనూ ఈ పట్టీ చెమటలో ఉంటే పసిగడుతుందట.