labs
-
ల్యాబ్‌లో తయారైన డైమండ్ అచ్చమైన వజ్రమేనా?!
ఆభరణాల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ హవా మొదలైంది. ఆభరణాల్లో పొదగడం మొదలైన తర్వాత వీటి గురించి తెలుస్తోంది. కానీ నిజానికి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ 1950లలోనే మొదలైంది. అప్పట్లో పారిశ్రామిక అవసరాలకు, డెంటల్ ట్రీట్మెంట్, ఎయిర్΄ోర్ట్ రన్వేలలో ఉపయోగించేవారు. వజ్రానికి ఉన్న గట్టిదనం దృష్ట్యా వీటిని ఉపయోగించేవారు. అప్పటి వరకు డైమండ్ అంటే మనకు తెలిసింది ఆభరణాల్లో వాడే మైన్డ్ డైమండ్స్ గురించి మాత్రమే. ఇవి భూమిలోపలి పొరల్లో కార్బన్, వాయువుల ఒత్తిడితో వేల సంవత్సరాలకు వజ్రం రూపం సంతరించుకున్నాయి. అదే కంపోజిషన్‌లో అదే వాతావరణ పరిస్థితులను లాబొరేటరీలో కల్పించినప్పుడు డైమండ్ ఓర్ పూర్తిస్థాయి వజ్రంగా రూపొందుతుంది. అంటే భూమి పొరల్లో వందల ఏళ్లకు జరిగే ప్రక్రియ లాబొరేటరీలో కొద్ది వారాల్లో పూర్తవుతుంది. వజ్రాల రాశిలో నుంచి ల్యాబ్ డైమండ్‌ని, మైన్డ్ డైమండ్‌ని వేరు చేయడం సాధ్యం కాని పని. థర్మల్ కండక్టివిటీ పెన్ టెస్ట్ ద్వారా కూడా వర్గీకరించలేం. అడ్వాన్స్డ్ యూవీ కార్బన్ డాటింగ్ టెస్ట్ ద్వారా వజ్రం వయసును కనుక్కోవడం మాత్రం సాధ్యమవుతుంది. క్లారిటీ వర్గీకరణ, కలర్ గ్రేడింగ్, సర్టిఫికేషన్‌లో రెండింటికీ ఒకే ప్రమాణాలు పాటిస్తారు. ఇప్పుడు ల్యాబ్ డైమండ్స్‌లో పోల్కీలు కూడా వస్తున్నాయి. సాధారణంగా అయోమయానికి గురి చేసేవి అమెరికన్ డైమండ్స్ మాత్రమే. ఆ పేరుతో దొరికేవి సీజెడ్స్. అంటే క్యూబిక్ జెరకాన్స్. సాంకేతిక నామం సీజెడ్స్ అయితే వాటిని మార్కెట్లోకి తెచ్చిన బ్రాండ్ పేరు అమెరికన్ డైమండ్స్. ఇప్పుడు లభిస్తున్న మోజనైట్స్ కూడా దాదాపు అలాంటివే. వాటిని సిమిలెంట్స్, సింథటిక్స్ పేర్లతో వ్యవహరిస్తారు. ధరించడం, భద్రపరచడం విషయంలో ల్యాబ్ డైమండ్స్ పొదిగిన ఆభరణాలకు కూడా మైన్డ్ డైమండ్స్ ఆభరణాలకు పాటించిన నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వచ్చే ప్రధానమైన సందేహం రీసేల్ వాల్యూ గురించి. ల్యాబ్ డైమండ్స్‌కి కూడా నూటికి నూరుశాతం ఎక్సేంజ్ వాల్యూ, 80 శాతం రీసేల్ వాల్యూ ఉంటుంది.– విశేషిణి రెడ్డి, జీఐఏ జెమ్మాలజిస్ట్ -
చిరుద్యోగులపై సర్కార్ పగ
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ల్లో పనిచేసే చిరుద్యోగులపై పలు జిల్లాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జులుం చూపిస్తున్నారు. 15–20 ఏళ్లగా పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానంలో తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ లాగిన్స్ కలిగి ఉండటంతో పాటు ల్యాబ్ ట్రైనింగ్ పొంది ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పనిచేస్తున్న తమను తొలగించడానికి వీలు లేదని ఆ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈమేరకు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఉన్నతాధికారులు జిల్లాల అధికారులకు మెమో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక కొంత మంది అధికారులు కొన్ని జిల్లాల్లో సిబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో 111 వాటర్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉండగా.. వాటిలో ఔట్సోర్సింగ్ విధానంలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వారికి ఉండే కనీస ప్రభుత్వ సౌకర్యాలు కూడా మొదట్లో ఆయా ల్యాబొరేటరీస్‌లో పనిచేసే వారికి వర్తించేవి కావు. అయితే గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి వారికి పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించారు. ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఆయా ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మారి్పడి చేసే ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వంలో మొదలవగా, ఆ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆరి్థక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 15–20 ఏళ్లుగా ఉన్న తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడడంపై రాష్ట్రవ్యాప్తంగా వారు ఆందోళన బాట పట్టారు. పవన్ ఇంటి ముందు ప్రదర్శన.. ఉద్యోగుల తొలగింపునకు అధికార కూటమి పార్టీ ల ఎమ్మెల్యేల రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ ఉద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ నివాసం వద్ద ప్రదర్శన నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి వచి్చన ఉద్యోగులు ఆ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యా»ొరేటరీస్ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కలి్పంచాలి, మినిమం టైం స్కేలు వర్తింపజేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పవన్‌కళ్యాణ్ తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.. సమస్యను పవన్, అధికారుల దృష్టికి తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు అక్కడ నుంచి వెనుతిరిగారు. గత ఐదేళ్లూ నీటి శుద్ధి పరీక్షల్లో ఏపీనే టాప్..గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, ఆ పరీక్షల్లో కలుíÙతాలు గుర్తిస్తే తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మన రాష్ట్రం గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే టాప్‌గా నిలిచింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలం ముందు, తర్వాత స్థానిక పంచాయతీ సిబ్బంది లేదంటే శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో నీటి నమూనాలు సేకరించి వాటిని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ల్యాబొరేటరీల్లో పరీక్షించారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలో ఉండే తాగునీటి వనరులకు సైతం 97 శాతం పైబడి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్టు కేంద్రం పేర్కొంది. నీటి నాణ్యత పరీక్షల్లో గత ఆరి్థక ఏడాదిలో మన రాష్ట్రంలో 25,546 చోట్ల కలుíÙత నీటిని గుర్తించగా, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. -
MR Jyothy: తండ్రి మెచ్చిన తనయ
ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్‌కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది. ‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది... తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు. ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్మెంట్ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు. కట్ చేస్తే... 2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది. నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. పర్సనల్ కేర్‌కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్లో ఛాలెంజర్ బ్రాండ్‌గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి. గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లు, రిటైలర్లు, స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించి ఎన్నో మీటింగ్‌లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది. -
పాల్ ల్యాబ్స్ తో ఆధునిక విద్యాబోధన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాల్ ల్యాబ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు పాల్ ల్యాబ్స్ రాష్ట్ర నోడల్ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గుంటూరులోని ఏసీ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియెంటేషన్ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా నోడల్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్ ల్యాబ్స్ మంజూరు చేసిన 60 పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో పాటు గణిత, సైన్స్ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయకర్త కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ పాల్ కార్యక్రమ ఉద్దేశం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను వివరించారు. -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
నాడు - నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ భారీ విరాళం
-
గాలి నుంచి నీరు.. బెంగళూరు కుర్రాళ్ల సక్సెస్ స్టోరీ
ఆరుబయట అలా నిలబడినప్పుడు గాలి వచ్చి పలకరిస్తుంది. ఎంత చల్లని గాలి! ఈ చల్లని గాలికి చల్లని మనసు కూడా ఉంది. తన నుంచి నీటిని మనకు అందిస్తుంది. అదే ఎయిర్ వాటర్! గాలి నుంచి నీరు తయారుచేసే కంపెనీలు మన దేశంలో కొత్త కాదు. అయితే బెంగళూరు కేంద్రంగా ఈ కుర్రాళ్లు మొదలుపెట్టిన వాటర్‌టెక్ స్టార్టప్ ఉరవు ‘పవర్’ విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది... భవిష్యత్‌లో నీటికరువు అనేది ఎంత పెద్ద సమస్య కానుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ, నీతి ఆయోగ్ ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ చెబుతున్న లెక్కలు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం, జలాశయాలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో నీటిని సృష్టించే సాంకేతికప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. అందులో ఒకటి గాలిలోని తేమ నుంచి నీటిని తయారుచేసే విధానం. ‘ఫలానా దేశంలో అక్కడెక్కడో గాలి నుంచి నీరు తయారుచేస్తున్నారట’ అని ఆశ్చర్యపడి తేరుకునేలోపే అలాంటి కంపెనీలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఉదా: వాటర్ మేకర్స్ ఇండియా,వాయుజల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆక్వో...మొదలైన కంపెనీలు. అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్ (ఏడబ్ల్యూజీ)లతో గాలి నుంచి నీరు సృష్టిస్తూ ఈ కంపెనీలు అబ్బురపరుస్తున్నాయి. వీటికి దేశ, విదేశాల్లో మంచి ఆదరణ దక్కుతుంది. ఎయిర్–కండిషనింగ్ ఎఫెక్ట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే కంపెనీలు ఇవి. ఇక బెంగళూరు కుర్రాళ్ల ‘ఉరవు ల్యాబ్స్’ విషయానికి వస్తే.... గాలి నుంచి నీరు తయారుచేసే ఎన్నో కంపెనీలు మన దేశంలో ఉండగా ‘ఉరవు’ యూఎస్పీ ఏమిటి? అనేది తెలుసుకునేముందు కాస్త వెనక్కి వెళదాం... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), కాలికట్లో చదువుకునే రోజుల్లో స్వప్నిల్, వెంకటేష్‌లకు ‘నీటి కరువు’ అనేమాట తరచుగా వినబడేది. నిజానికి ఆ తీరప్రాంతంలో అధిక వర్షాలు అనేవి సాధారణం. తాగడానికి మాత్రం సురక్షితమైన నీరు దొరికేది కాదు. ఈ విషయంపై తరచుగా మాట్లాడుకునేవారు. 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ‘గాలి నుంచి నీరు’ అనే కాన్సెప్ట్ గురించి సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఒక సంవత్సరం తరువాత... విద్యుత్ ఆధారిత సంప్రదాయ అట్మాస్ఫెరిక్ వాటర్ జనరేటర్(ఏడబ్ల్యూజీ) తయారు చేశారు. బాగానే పనిచేసింది. అయితే దీనికి అధిక విద్యుత్ కావాలి. పైగా విద్యుత్ ఆధారిత కంపెనీలు మార్కెట్లో ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమదైన ప్రత్యేకత గురించి ఆలోచించారు. అదే...‘వందశాతం పునరుత్పాదకమైన శక్తి’ తమ ఆలోచనను సాకారం చేసుకోవడానికి ఇంధన సంబంధిత విషయాలలో మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ప్రదీప్ గార్గ్‌ను బెంగళూరులో కలుసుకున్నారు. స్వప్నిల్, వెంకటేష్‌లు ప్రదీప్‌తో కలిసి ‘రీనెవబుల్ వాటర్ టెక్నాలజీ’పై కలిసిపనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారికి కావాల్సింది ప్రతిభ ఉన్న ప్రాడక్ట్ డెవలపర్. అట్టి ప్రతిభ వారికి బాలాజీలో కనిపించింది. ఒక్కో అడుగు వేస్తు ఈ బృందం ‘ఉరవు ల్యాబ్స్’కు శ్రీకారం చుట్టింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్...మొదలైన రంగాలలో నిష్ణాతులైన 15 మందితో ఒక టీమ్ ఏర్పాటయింది. టాలెంట్ సంగతి సరే, మరి ఫండింగ్ సపోర్ట్? అదృష్టవశాత్తు ఎప్పటికప్పుడూ రకరకాల గ్రాంట్స్ అందడంతో కంపెనీకి ఇబ్బంది కాలేదు. ప్రతిష్ఠాత్మకమైన ‘వాటర్ అబాన్డెన్స్ ఎక్స్‌ప్రైజ్’ గ్లోబల్ లీస్ట్ టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. ఇది వారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. గాలీ నుంచి నీటిని తీయడానికి సంబంధించి తొంబై శాతం కంపెనీలు ఎయిర్–కండిషనింగ్ ఎఫెక్ట్ టెక్నాజీపై ఆధారపడుతున్నాయి. విద్యుత్‌రంగానికి సంబంధించి సౌర విద్యుత్, పవన విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయిగానీ ఈ రంగంలో మాత్రం ప్రత్యామ్నాయ ఆలోచనలు అరుదైపోయాయి. దీంతో ‘హండ్రెడ్ పర్సెంట్ రీనెవబుల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అంటూ రంగంలోకి దిగింది ఉరవు ల్యాబ్స్. ‘పవర్డ్ బై సోలార్ హీట్’ ‘పవర్డ్ బై వేస్ట్–హీట్ ఆఫ్ ఇండస్ట్రీస్’ ‘పరర్డ్ బై బయోమాస్ వేస్ట్’....అంటూ నినదిస్తున్న ‘ఉరవు’ గాలి నుంచి నీటి తయారీ ప్రక్రియలో చుక్కనీరు కూడా వృథా కాకుండా చూడడం తన లక్ష్యం అని చెబుతుంది. ‘సాంకేతిక విషయాలలో మాకు ఎలాంటి తడబాట్లు లేవు. తయారీ ప్రక్రియకు సంబంధించిన ఫిజిక్స్, ఇంజనీరింగ్‌ను బాగా అర్థం చేసుకున్నాం’ అంటున్నాడు ఫౌండర్స్‌లో ఒకరైన ప్రదీప్ గార్గ్. చిన్నస్థాయిలో 20–100 లీటర్లు, పెద్దస్థాయిలో 10,000 లీటర్ల సామర్థ్యం ఉన్న పరికరాలపై దృష్టి సారించింది ఉరవు. అనుకున్న స్థాయిలో ఈ కంపెనీ విజయం సాధిస్తే వాటర్ ఇండస్ట్రీలో గేమ్‌ఛేంజర్ అవుతుంది’ అంటున్నారు విశ్లేషకులు. ‘మన గ్రహంపై ఎక్కడైనా గాలి నుంచి నీరు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో భూమిపై ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నీరు అందాలి’ అంటున్నారు ఇన్వెస్టర్, వీసి ఫండ్ సీనియర్ సలహాదారు షిగేరు సుమిటోమో. -
AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబొరేటరీ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టడానికి ఐఏఎస్ మాజీ అధికారి సుజాతారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఐదేళ్లలో రూ.10వేల కోట్ల మేర ఖర్చుచేయాలని అప్పట్లో కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. చదవండి: బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..? కానీ, ఈ కమిటీ సూచించిన దానికన్నా అదనంగా సర్కారు నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.వేల కోట్ల ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్ధారణ పరీక్షలు (ఇన్‌హౌస్ ల్యాబొరేటరీ) ఏర్పాటుచేయాలని సుజాతారావు కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ల్యాబొరేటరీలు ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై వైద్యశాఖ ఓ కమిటీ వేసి, దాని సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటోంది. విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ అన్ని ఆసుపత్రుల్లో ల్యాబ్‌లకు ఉపకరణాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేపడుతున్నారు. అయితే, మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తగ్గట్టుగా వనరులు అందుబాటులోకి తెస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో 14, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35, సీహెచ్‌సీలో 78, ఏరియా ఆస్పత్రుల్లో 80, జిల్లా ఆస్పత్రుల్లో 136 రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా అవసరమైన ఉపకరణాలను ఏపీఎంఎస్ఐడీసీ సమకూరుస్తోంది. రసాయనాలు (రీఏజెంట్స్), డిస్టిలరీ వాటర్‌తో సహా అన్నింటినీ సరఫరా చేస్తున్నారు. నెలాఖరు నుంచి అందుబాటులోకి సేవలు సొంతంగా ల్యాబొరేటరీల నిర్వహణవల్ల వ్యయం తగ్గడంతో పాటు రోగులకు సేవలు మెరుగుపడతాయి. ఈ నెలాఖరుకు అన్ని ఆసుపత్రుల్లో సేవలు ప్రారంభించాలని చెప్పాం. గతంలో రీఏజెంట్స్ స్థానికంగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వాటిని కూడా సరఫరా చేస్తున్నాం. దీంతో అవి లేవు, ఇవి లేవు అని పరీక్షలకు బయటకు రిఫర్ చేయడానికి వీలుండదు. ప్రతి ఆసుపత్రిలో బోర్డు పెడతాం. ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఫోన్ నెంబర్‌నూ ప్రదర్శిస్తాం. – కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ -
డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటులో ఇంటెల్
న్యూఢిల్లీ: పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ వచ్చే ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు కళాశాలల ప్రాంగణాల్లో డేటా ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 100 పైచిలుకు యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ’ఉన్నతి’ ప్రోగ్రాంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటెల్ ఇండియా కంట్రీ హెడ్ నివృతి రాయ్ తెలిపారు. ఈ ల్యాబ్స్ ఏర్పాటుకయ్యే వ్యయాలను ఆయా విద్యా సంస్థలు భరించనుండగా, సాంకేతిక.. నాలెడ్జ్ భాగస్వామిగా ఇంటెల్ తోడ్పాటు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉన్నతి ప్రోగ్రాం కింద జట్టు కట్టే విద్యా సంస్థలు తమ బడ్జెట్, సాంకేతిక, మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి ల్యాబ్‌లో ఇంటెల్ సూచించే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కోర్స్ కంటెంట్ మొదలైనవి ఉంటాయి. విద్యార్థులకు కో–బ్రాండెడ్ సరి్టఫికెట్లు లభిస్తాయి. -
పర్యావరణ హిత పరిశ్రమల స్థాపనే లక్ష్యం: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక పాలసీ క్షేత్రస్థాయిలోకి ఏ స్థాయికి ఎలా వెళుతుందో, ఎలా అమలు జరుగుతుందో, దాన్ని ప్రభావాలను అంచనా వేయలన్న ఆలోచనల నుంచి పుట్టినదే ‘గవర్నెన్స్ ల్యాబ్‌లు’ అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కాన్ఫరెన్స్ ఆన్ ఇండియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ‘వేగవంతమైన వృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో గవర్నెన్స్ ల్యాబ్‌లు మైలురాళ్లు మారుతాయని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఇస్తోన్న ప్రోత్సాహక విధానాలు, పద్ధతులు సరిగ్గా లేవని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ప్రోత్సాహకాల విషయంలో ఒక పద్ధతి, బడ్జెట్ ఉండాలన్నారు. ప్రోత్సాహాల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకువస్తే చాలా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ లేని ప్రోత్సాహకాలే కాదు ఏదీ మంచిది కాదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయమని తెలిపారు. మారే పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మన ఆలోచనలను సరిదిద్దుకోవడమే అసలైన సంస్కరణ అని చెప్పారు. చైనాకు ప్రత్యామ్నాయం భారతదేశం మాత్రమేనని, పర్యావరణ హిత పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాలిచ్చే పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని వివరించారు. కరోనా సమయంలో పరిశ్రమలు ప్రభుత్వానికి అందించిన తోడ్పాటు మరవలేనిదని అన్నారు. మెడికల్ ఆక్సిజన్, బెడ్స్ వంటి సహా అనేక అంశాలలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ 19 ప్రతి మనిషి మీద అనేక రకాలుగా ప్రభావం చూపిందని, భౌగోళిక, భౌతిక, వాతావరణ మార్పులకు కరోనా మేల్కొలుపని అన్నారు. అభివృద్ధి సంబంధిత శాఖలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమం, సమాన అవకాశాలు, విలువైన విద్య, వైద్యం, విజ్ఞాన, పారిశ్రామిక వంటి అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు. సరికొత్త మార్పులకు తగ్గట్లుగానే సరికొత్త విధానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. -
19 కొత్తల్యాబ్ లు
-
కరోనా: ఏపీ సర్కార్ ప్రత్యేక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: కోవిడ్ దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీటీ స్కాన్, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 డాష్ బోర్డులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు. చదవండి: కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్ -
కరోనా: ప్రత్యేక ల్యాబ్‌లను ప్రారంభించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేక ల్యాబ్‌లను సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... ల్యాబ్‌ల ప్రారంభంతో టెస్టుల సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపారు. దేశంలో కరోనా బాధితుల రికవరి రేటు బాగా ఉందన్నారు. ప్రతి రోజు 10 లక్షల టెస్టులు చేయడమే లక్ష్యమని, ఇప్పటికే దేశంలో రోజుకు 5 లక్షల టెస్టులు జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. (చదవండి: ఏపీ: ఒక్కరోజే 3,234 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్) దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వరుసగా గత నాలుగు రోజుల నుంచి భారత్‌లో 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,661 కేసులు నమోదు కాగా.. 705 మంది బాధితులు మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,85,522కు, మరణాలు 32,063కు చేరుకున్నాయి. (చదవండి: కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు) -
కరోనా పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
కరోనా పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ల్యాబ్‌ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్‌లలో కోవిడ్ టెస్టులు జరపాలని, ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టుకి రూ.750 మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నమూనాని విఆర్డిఎల్ పరీక్షకు పంపితే రూ.2800 మించి వసూలు చేయొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. (పాజిటివ్ వ్యక్తులకు ‘దివ్య’ కషాయం) ప్రతి ల్యాబ్ పరీక్షల్లో ఐసీఎంఆర్ లాగిన్‌లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఎన్ఏబీహెచ్ ఆస్పత్రులు, ఎన్ఏబిఎల్ ల్యాబ్‌లు పరీక్షల నిర్వహణకు ముందుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్‌ల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించనున్నారు. ఇందుకోసం 197 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వం నాబార్డు సమర్పించింది. దీంతో నాబార్డు ఆర్ఐడీఎఫ్ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది. (కొత్తగా మరో పన్నెండు ప్రైవేటు ఆసుపత్రులు : సుచరిత) -
కరోనా ల్యాబ్.. హైరిస్క్ జాబ్
కంటికి కనిపించని కరోనా వైరస్ రక్త కణాల్లో అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఈ వైరస్ మనిషిని అతలాకుతలం చేసే మహమ్మారిగా వైద్యులు గుర్తించారు. ఇలాంటి ప్రాణాంతకమైన కోవిడ్–19 వైరస్‌ను పసిగట్టడంలో ప్రధాన యోధులు ల్యాబ్ టెక్నీషియన్లు. అనుమానితుల ముక్కు, గొంతు నుంచి స్వాబ్‌ను సేకరించడం మొదలు వ్యాధిని నిర్ధారించే వరకు వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెగిటివ్, పాజిటివ్‌గా తేల్చే పనిలో రెండు నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. సాక్షి, తిరుపతి : కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఎవరైనా దగ్గినా, తుమ్మినా, అనుమానం వచ్చినా ఆమడదూరం పారిపోవడం పరిపాటిగా మారింది. అయితే వారికి దగ్గరగా ఉంటూ స్వాబ్లు సేకరించి, వాటిని రెండు విధాలుగా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్లు కీలకంగా పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ల్యాబ్‌లను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి విస్తరించారు. దూరదృష్టితో ప్రతి జిల్లాలోనూ 2 నుంచి 4 వైరాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. (కరోనా: ‘మహా’ భయం! ) సకాలంలో ల్యాబ్‌లను సమకూర్చడంతో పాటు అవసరమైన టెక్నీషియన్లను, మైక్రోబయా లజీ అసిస్టెంట్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించారు. స్విమ్స్ కేంద్రంగా కోవిడ్–19 స్టేట్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్రంతో పాటు 20 రోజుల క్రితం వరకు తెలంగాణాకు చెందిన నమూనాల ఫైనల్ కరోనా ఫలితాలను నిర్వహించగలిగారు. రుయాలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐసీఎంఆర్ అనుమతితో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడే నమూనాల సేకరణ అనుమానితుల నమూనాల పరీక్షల కోసం మార్చి నెల వరకు పుణే ల్యాబ్‌కు పంపించేవారు. వైరస్ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తొలి కరోనా ల్యాబ్‌ను స్విమ్స్‌లో నెలకొల్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నమూనాలను తిరుపతికి తీసుకొచ్చి పరీక్షించేవారు. మార్చి మూడో వారానికల్లా ప్రభుత్వం ల్యాబ్‌లను, అవసరమైన టెక్నీíÙయన్లను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడే అనుమానితుల నుంచి స్వాబ్‌ను సేకరించి ట్రూనాట్ ద్వారా పరీక్షలు జరుపుతున్నారు. వీటి నుంచి పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను మరొకసారి నిర్ధారించుకునేందుకు స్విమ్స్, రుయా కోవిడ్ – 19 ల్యాబ్‌కు తరలిస్తున్నారు. ఈ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం ఫలితాలను ప్రకటిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషి యన్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. హైరిస్క్ జోన్లో విధులు జిల్లాలోని రెండు కోవిడ్ – 19 వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌లతో పాటు స్థానికంగా నమూనాలను సేకరిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రో బయాలజీ అసిస్టెంట్లు హైరిస్క్ జోన్లో విధులు నిర్వహిస్తున్నారు. రెండంచెల రక్షణ కవచాలను ధరించి, అనుమానితుల నుంచి నిర్భయంగా స్వాబ్‌ను సేకరిస్తున్నారు. ఆపై లేబరేటరీల్లో వ్యాధి నిర్ధారణ కోసం రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటికి కనిపించని ఈ వైరస్ నుంచి ఎవరికి వారు రక్షణ పొందుతూ వృత్తి ధర్మాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా.. కరోనా వైరస్ బారినపడిన వారిని సంరక్షించేందుకు వైద్య సిబ్బంది, టెక్నీషియన్లు రెండు నెలలుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఇంకొందరు పూర్తిగా శానిటైజేషన్ చేసుకుని ఇంట్లోనే కుటుంబ సభ్యులకు భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక గదిలో గడుపుతున్నారు. ఇంకొందరు ఇంటిలోని సభ్యులను సొంత ఊర్లకు పంపి విధులు నిర్వహిస్తున్నారు. చంటిబిడ్డలకు దూరంగా ఉంటూ కరోనాతో పోరాటం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతతో.. తిరుపతి రుయాలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా సంయుక్తంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల సంరక్షణ కోసం రెండింతల భద్రత కోసం అమలు చేస్తున్నాం. – డాక్టర్ మాధవి కొండేటి, ల్యాబ్ నోడల్ ఆఫీసర్ బిడ్డకు దూరంగా.. రెండు నెలలుగా నా బిడ్డకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాను. తిరుపతి మధురానగర్‌లో ఉంటున్నాం. విధులు పూర్తి చేసుకున్న తర్వాత పీపీఈ కిట్లను తొలగించి శానిటైజేషన్ చేసుకున్న తర్వాతే ఇంటికి వెళుతున్నాం. బయటే స్నానం చేసి, తర్వాత ఇంట్లోకి వెళుతున్నాం. రెండేళ్ల నా బిడ్డను ఎత్తుకుని రెండు నెలలవుతోంది. – అల్తాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్ -
‘ప్రైవేట్ కేంద్రాల్లోనూ పరీక్షలు చేయించుకోవడం ప్రజల హక్కు’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు, చికిత్సలపై తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్దమని హైకోర్టు పేర్కొంది. ప్రైవేట్ కేంద్రాల్లోనూ డబ్బులు చెల్లించి పరీక్షలు చేయించుకోవడం ప్రజల హక్కు అని కోర్టు తెలిపింది. (త్రీస్టార్.. తిరుపతి వన్) ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతినిచ్చారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రలు, ల్యాబ్‌లు ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కోర్టు కోరింది. ఆస్పపత్రులు, ల్యాబ్‌లలో వైద్యసిబ్బంది, సదుపాయాలను ఐసీఎంఆర్ పరిశీలించి నోటిఫై చేయాలని కోర్టు ఆదేశించింది. ఐపీఎంఆర్ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. (విజయవాడ చేరుకున్న 156 మంది ప్రవాసాంధ్రులు ) -
వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ (వ్యవసాయ పరీక్షా కేంద్రాలు) ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాస్థాయిలో 13 అగ్రిల్యాబ్స్‌తో పాటు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో నాలుగు అగ్రిల్యాబ్ ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. అగ్రిల్యాబ్స్‌లో పరీక్షించిన తర్వాతే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతులకు విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ప్రభుత్వ అగ్రిల్యాబ్స్ ద్వారా ఇచ్చే దృవపత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టడమే లక్ష్యంగా అగ్రిల్యాబ్‌లు పనిచేయనున్నాయి. ‘నాబార్డు’ ఆర్థిక సాయంతో ఏర్పాటు కానున్న అగ్రిల్యాబ్‌లను మార్కెటింగ్, పోలీస్ హౌసింగ్ శాఖలు నిర్మిస్తాయి. -
ప్రభుత్వ స్కూల్లో గూగుల్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గూగుల్ సహకారంతో ఏర్పాటు చేసిన గూగుల్ ల్యాబ్ సదుపాయంతో విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. ఓక్రిడ్జ్, గ్లోబల్, అరబిందో వంటి ఇంటర్నేషనల్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆధునిక గూగుల్ ల్యాబ్‌ను దేశంలో తొలిసారి విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ల్యాబ్‌లో 6 నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు వారంలో 2 క్లాస్‌లు డిజిటల్ బోధన అందించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల సిలబస్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి బోధనను నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. రొబోటిక్ ల్యాబ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. అదే స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. టీచర్లకు గూగుల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పా టు చేసుకుంటే సాఫ్ట్వేర్ సహాయం అందించడంతోపాటు టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ ముందుకు వచి్చందని విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులు 2 రోజుల కిందట తమతో సమావేశమై అంగీకారం తెలిపారన్నారు. ల్యాబ్‌ల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, వాటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చన్నారు. గూగుల్ ల్యాబ్ సదుపాయంతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీతోపాటు నగదున ఆయన అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి, జాయింట్ డైరెక్టర్లు రమేశ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా హబ్ వైట్ అప్రాన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ స్టూడెంట్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్య... ల్యాబ్స్, రసాయనాలు అందుబాటులో ఉండకపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని కాలేజీల్లో అయితే మరీనూ! నెల్లూరులో బీ–ఫార్మసీ చదివిన బ్రహ్మం పెద్దపోతులకూ ఇదే సమస్య. కానీ, తాను మాత్రం అక్కడితో ఆగిపోకుండా దీనికో పరిష్కారం చూపించాడు. రసాయనాలు, ల్యాబ్ పరికరాలు, వైద్య ఉపకరణాలను విక్రయించేందుకు ‘వైట్‌అప్రాన్. ఇన్’ ప్రారంభించాడు. మరిన్ని వివరాలు ‘స్టార్డప్ డైరీ’తో ఆయన మాటల్లోనే... ‘‘మాది వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల. నెల్లూరులో బీఫార్మసీ పూర్తయ్యాక.. చదువుకునేటపుడు నాకెదురైన ఇబ్బందులను పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నా. కానీ, సొంతంగా కంపెనీ పెట్టే ఆర్థిక స్థోమత లేకపోవటంతో ఉద్యోగంలో చేరా. జువెంటస్ లైఫ్ సైన్సెస్‌లో ఏడాది పాటు ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశా. తర్వాత 104లో చేరా. అక్కడి నుంచి సొంతంగా కంపెనీ పెట్టాలని ఈ ఏడాది జనవరిలో రూ.2 లక్షల పెట్టుబడితో తిరుపతి కేంద్రంగా వైట్‌అప్రాన్ ఈ–ఎడ్యు కామర్స్ ప్రై.లి. ప్రారంభించాం. మాది ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) ఇంక్యుబేట్ స్టార్టప్. ఫార్మా విద్యార్థులు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ల్యాబ్స్‌కు రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలను విక్రయించడం మా ప్రత్యేకత. హైదరాబాద్ వాటా 20 శాతం.. వైట్అప్రాన్లో రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాలుంటాయి. అల్యూమినియం అమ్మోనియం, కాల్షియం కార్బైడ్, గ్లూకోమీటర్స్, ఈసీజీ కేబుల్స్, టెస్ట్ ట్యూబ్స్, హెచ్పీఎల్సీ, సర్జికల్ సెట్స్ వంటి సుమారు 10 వేల వరకు ఉత్పత్తులన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.100. ప్రస్తుతం నెలకు రూ.30 లక్షల విలువ చేసే ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్‌పై 7–12 శాతం వరకు కమిషన్ ఉంటుంది. మా మొత్తం ఆర్డర్లలో 20 శాతం హైదరాబాద్ వాటా. తెలుగు రాష్ట్రాలతో పాటూ బిహార్, హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. రూ.50 కోట్ల ఆదాయం లక్ష్యం.. ప్రస్తుతం రసాయనాలు, ల్యాబ్, వైద్య పరికరాల విభాగంలో 60 మంది వర్తకులు నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి వెండర్స్ సంఖ్యను వెయ్యికి చేరుస్తాం. బిట్స్ పిలానీ, గీతం, నైపర్, ఎస్వీఎస్ వంటి 25 యూనివర్సిటీలు, కాలేజీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. గత నెలలో రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది కాలంలో రూ.50 కోట్ల ఆదాయాన్ని లకిష్యంచాం. రూ.15 లక్షల సమీకరణ.. ప్రస్తుతం తిరుపతి, హైదరాబాద్‌లో కార్యాలయాలున్నాయి. వచ్చే ఏడాది కాలంలో లక్ష ఉత్పత్తులతో పాటూ కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబై మార్కెట్లలో విస్తరించాలన్నది లక్ష్యం. ఆర్డర్ల డెలివరీ కోసం బెంగళూరుకు చెందిన షిప్కరో లాజిస్టిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే పోస్టల్ విభాగంతోనూ ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మా కంపెనీలో ఆరుగురు ఉద్యోగులున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 లక్షల నిధులను సమీకరించాం’’ అని బ్రహ్మం వివరించారు. -
డబ్బు జబ్బు..!
వైద్య పరీక్ష... ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు కొలమానం. లోపాలను నిర్ధారించేందుకు ఆధారం. ల్యాబ్‌లో ఇచ్చిన నివేదిక అనుగుణంగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అవే... నివేదికలు తప్పుడువైతే.. ఇక అంతే. ఎన్నిసార్లు పరీక్షలు చేయించుకున్నా.. ఎన్ని మందులు మింగినా, ఎంత డబ్బు ఖర్చయినా వ్యాధులు నయంకావు. ఇల్లుగుల్లకావడమే తప్ప ఆరోగ్యం కుదుటపడదు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇదే పరిస్థితినెలకొంది. అనుమతులు లేని ల్యాబ్‌లు, క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తప్పుడు నివేదికలతో బెంబేలెత్తిస్తున్నాయి. పరీక్షల పేరిట డబ్బులు దోచేస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. విజయనగరం ఫోర్ట్: ‘గంట్యాడ మండలానికి చెందిన ఎస్. శ్రీను అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన వెంటనే అతనిని పరీక్షించిన వైద్యులు వైద్య పరీక్షలకు రిఫర్ చేశారు. అక్కడే ఉన్న ల్యాబ్‌లో అతను పరీక్షలు చేయించుకోగా రూ.1000 తీసుకున్నారు. మందులు, ఫీజు నిమత్తం మరో రూ.1200 వరకు ఖర్చ యింది. జ్వరం మాత్రం తగ్గలేదు. మరో ఆస్పత్రికి వెళ్తే నివేదికలు తప్పు అని సెలవివ్వడంతో నిశ్చేస్టుడయ్యాడు’. ‘విజయనగరం మండలానికి చెందిన ఎస్. శంకర్ అనే యువకుడు కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు పరీక్షించగానే వైద్య పరీక్షలు రాసి అక్కడే ఉన్న ల్యాబ్‌లో చేయించుకోమని సెలవిచ్చాడు. రక్త పరీక్షల కోసం రూ.1200 వసూలు చేశారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉందంటూ అదే ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. మూడు రోజులకు రూ.15 వేలు వసూలు చేశారు.’ ఇది ఒక్క వీరి పరిస్థితే కాదు. జిల్లాలో అనేక మందిది. రోగులు ఆర్థికదోపిడీకి గురవుతున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేని ల్యాబ్‌లలో విద్యార్హతలు లేనివారుపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇచ్చేస్తున్నారు. వైద్యులు సైతం వాటినే కొలమానంగా తీసుకుని మందులు రాసేస్తున్నారు. మరిన్ని పరీక్షలు రాసే స్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గాయని, ఆరో గ్యం విషమంగా ఉందంటూ కొందరు భయపెడుతున్నారు. డబ్బుకోసమే వైద్యం అన్న ధోరణితో దోపీడీ చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఒంటిలో నలతగా ఉందని చెప్పినా అరవైఆరు పరీక్షలు రాసేస్తున్నారని, శరీరంలో ఉన్న రక్తాన్ని కాస్త పరీక్షల కోసం సూదులుతో లాగేస్తున్నారంటూ వాపోతున్నారు. పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్లినిక్‌లు, ల్యాబ్‌లు.. జిల్లాలో ప్రభుత్వ అనుమతి ఉన్న ల్యాబ్‌లు 38 మాత్రమే. వాస్తంగా అయితే జిల్లాలో 150 వరకు ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేటు క్లినిక్‌లు 200 వరకు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి కేవం 120 మాత్రమే. రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్‌లు, ల్యాబ్‌లు చాలా మంది నిర్వహిస్తున్నారు. రోగులకు అవసరం లేకున్నా వైద్యపరీక్షలు రాసేసి దోచుకుంటున్నారు. సాధారణ జ్వరాలకు సైతం రూ. 5 వేలు నుంచి రూ.10 వేలు వరకు దోచుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పరీక్షకు ప్రైవేటు ల్యాబ్‌లో రూ.200 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తుండగా, కొన్ని పరీక్షలకు రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలుతీసుకుంటాం ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాబ్‌లు, క్లినిక్‌లు నిర్వహించకూడదు. వైద్య ఆరోగ్య శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అనుమతి లేకుండా ఎటువంటి బోర్డులు కూడా పెట్టకూడదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ వరాల వెంకటరావు,డీఎంహెచ్ఓ -
జ్యోతి ల్యాబ్స్ 1:1 బోనస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 29 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.107 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.76 కోట్లకు తగ్గిందని జ్యోతి ల్యాబ్స్ తెలిపింది. తమ కంపెనీలో విలీనమైన హెంకెల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాల రద్దుకు సంబంధించి పన్ను రివర్సల్ కారణంగా నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.468 కోట్ల నుంచి రూ.558 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.424 కోట్ల నుంచి రూ.451 కోట్లకు పెరిగాయని వివరించింది. నిర్వహణ లాభం 46 శాతం పెరిగి రూ.88 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభ మార్జిన్ 3.5 శాతం వృద్ధితో 17.1 శాతానికి ఎగసిందని తెలిపింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 50 పైసల డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. అంతే కాకుండా ఒక ఈక్విటీ షేర్‌కు మరో ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా(1:1) ఇవ్వనున్నామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.204 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం తగ్గి రూ.179 కోట్లకు చేరిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,760 కోట్ల నుంచి రూ.1,813 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్ షేర్ 5 శాతం లాభంతో రూ.392 వద్ద ముగిసింది. -
కాలుష్యం మారింది..‘కాలింక్’గా!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: కాలుష్య సమస్యకు బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు పరిష్కారాన్ని కొనుగొన్నారు. కాలుష్యాన్ని ఎలాగూ అరికట్టలేకపోతున్నాం.. అలాంటప్పుడు దానిని రోజూ ఉపయోగించే వస్తువుగా మార్చేస్తే ఎలా ఉంటుందన్న వారి ఆలోచన నుంచి పుట్టిందే ‘కాలింక్’.. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును ఇది సరికొత్త ఆవిష్కరణే.. వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కాలుష్యాన్ని అనిరుధ్ శర్మ, నిఖిల్ కౌషిక్, నితేష్ కధ్యాన్లు ‘చిక్కనైన నల్లటి సిరా’గా మార్చివేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఫ్యాక్టరీల చిమ్నీలు, జనరేటర్లు, కార్ల ఎగ్జాస్ట్ పైపుల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని, మసిని సేకరించి అనంతరం శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఇంక్ రూపంలోకి మారుస్తున్నారు. ఈ చిక్కటి ఇంక్ ప్రింటర్ల కాట్రిడ్జ్‌లు, స్క్రీన్ ప్రింటింగ్, చిత్రకళకు కాలిగ్రాఫి పెన్లు, వైట్‌బోర్డు మార్కర్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. 2016 జూన్‌లో బెంగళూరులో నెలకొల్పిన ‘గ్రావికీ లాబ్స్’ ద్వారా ఈ ఇంక్ తయారీని కొనసాగిస్తున్నారు. పారిశ్రామిక, ఇతర కాలుష్య వ్యర్థాల్ని శుద్ధిచేసి వర్ణ ద్రవ్యాలుగా, సిరాగా మార్చడంతో పాటు వివిధదేశాల్లో ప్రాచుర్యం కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీలోని రోడ్లకు ఈ ఇంక్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగించబోతున్నారు.ఈ ప్రక్రియలో ఉత్పత్తయ్యే వ్యర్థాల్ని కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు రీసైకిల్ చేయడం విశేషం. విదేశాల్లోను ఎయిర్ ఇంక్‌కు ప్రాచుర్యం ప్రస్తుతానికి వీధులు, కూడళ్లలో గోడలపై చిత్రాలు గీసే కళాకారులు, డిజైనర్లకు ఈ ఎయిర్ ఇంక్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. విదేశాలతో సహా మన దేశంలోనూ గోడ, వీధి చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఇంక్‌ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు అనిరుధ్ అండ్ కో ప్రయత్నిస్తోంది. కళారంగం ద్వారానే ఈ ఇంక్‌కు మరింత ప్రచారం తీసుకురావాలని భావిస్తున్నారు. 45 నిమిషాల కాలుష్యంతో 30 మి.లీ. ఇంక్ ఎయిర్ ఇంక్‌కు 2013లో అనిరు«ధ్శర్మ పెట్టినపేరు కాలింక్. వాతావరణంలోకి కాలుష్యం చేరకముందే దాన్ని ఎలా బంధించాలన్న అన్న ఆలోచన నుంచి వచ్చిందే కాలింక్ ప్రయోగం.తర్వాత అనిరుధ్, కౌషిక్‌లు కలిసి ‘సిలిండ్రికల్ మెటల్ కాంట్రాప్షన్’ను రూపొందించారు. వాటిని కార్ల పొగ గొట్టాలకు, పారిశ్రామిక చిమ్నీలకు ఏర్పాటుచేసి కాలుష్య రూపంలో ఉన్న ముడిపదార్థాన్ని సేకరించారు. 45 నిమిషాలు వెలువడే కాలుష్యంతో ఒక ఎయిర్ ఇంక్‌లో పట్టే 30 మిల్లీలీటర్ల ఇంక్‌ను తయారు చేయవచ్చని గుర్తించారు. కిక్ స్టార్టర్ అనే వెబ్సైట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి ఎయిర్ ఇంక్ ఉత్పత్తికోసం పదిరోజుల్లో 14 వేల డాలర్ల(రూ.9 లక్షలు)కు పైగా సేకరించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలతో సహా, ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సంస్థలకు పెద్దమొత్తంలో కాలింక్ను సరఫరా చేసే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు కౌషిక్ చెప్పారు. పలువురు భారతీయ చిత్రకారులతో కూడా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు. గ్రావికీ ఆన్లైన్ స్టోర్స్ ద్వారా త్వరలో ఇంక్‌ను విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా వాటి కంటే ఎయిర్ ఇంక్ మార్కర్ల మన్నిక ఎక్కువని, ఇందులో వేరే రంగుల్ని జతచేసుకోవచ్చని కౌషిక్ చెప్పారు. -
ఆక్వా లాబ్స్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కాట్రేనికోన (ముమ్మిడివరం) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆక్వా ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కాకినాడ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ప్రిన్సిపాల్ పి.కోటేశ్వరరావు అన్నారు. ఆక్వా ల్యాబ్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ల్యాబ్‌లను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్ రిజిస్ట్రేషన్ బృందం సభ్యులు ఆదివారం విస్తృతంగా పర్యటించారు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, అమలాపురం, కాట్రేనికోనలో పలు ఆక్వా ల్యాబ్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఆక్వా ల్యాబ్ జీఓ నెం.49 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెట్ వర్కింగ్ ఆక్వా ల్యాబ్స్ ఎస్‌ఐఎఫ్‌టీ నోడల్ కేంద్రంగా పనిచేస్తాయన్నారు. నెట్ వర్కింగ్ ల్యాబ్ అనుసంధానంతో ల్యాబ్స్ నెల వారీ రిపోర్టింగ్, డీసీజ్ సర్వేలైన్స్ (వ్యాధులపై పర్యవేక్షణ, నిఘా), ల్యాబ్ సిబ్బంది రైతులకు అందిస్తున్న సేవలు, మొబైల్ ఆక్వా ల్యాబ్‌ల పనితీరుపై నిఘా ఉంటుంది. ప్రభుత్వ, ఫ్రైవేట్ ఆక్వా ల్యాబ్‌లు ఒక గొడుగు కిందకు తీసుకుని రావడంతో వివిధ ప్రాంతాలలో విజృంభిస్తున్న వ్యాధులపై పర్యవేక్షణ–నిఘా ఉంటుందన్నారు. రాష్ట్రంలో తూర్పుగోవారి జిల్లాలో 10, పశ్చిమ గోదావరిలో 35, కృష్ణాజిల్లా 39, గుటూరు 8, ప్రకాశం 12, నెల్లూరు 27, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 3 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయన్నారు. అనంతరం పల్లంలో బాక్స్ కల్చర్ విధానంపై మత్స్యశాఖ చేపడుతున్న పీతల కల్చరును పరిశీలించారు. ఈ బృందంలో కాకినాడ, అమలాపురం మత్స్యశాఖ డీడీలు రామ్మోహనరావు, జయరావు, ఏడి రామచంద్రరావు, శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం శాస్త్రవేత్త సందీప్, ఎస్‌ఐఎఫ్‌టీ మైక్రోబయాలజీ ల్యాబ్ ఎఫ్డీఓ షేక్ దిల్షాద్ తదితరులు ఉన్నారు.