సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్‌ల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించనున్నారు. ఇందుకోసం 197 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వం నాబార్డు సమర్పించింది. దీంతో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది. (కొత్తగా మరో పన్నెండు ప్రైవేటు ఆసుపత్రులు : సుచరిత)
Comments
Please login to add a commentAdd a comment