NABARD
-
తక్కువ వడ్డీకే రుణాలివ్వండి.. నాబార్డు ఛైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్‌ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు.స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరిన సీఎం.. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్‌లు నిధులు మార్చి 31లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలని సీఎం అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు ఛైర్మన్ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. -
పశు పోషణతో పారిశ్రామికవేత్తలుగా..
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ .. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎమ్).కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకలు, పందులు, నాటుకోళ్ల పెంపకానికి 50 శాతం సబ్సిడీతో రుణ సదుపాయాన్ని అందిస్తోంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో అన్ని సామాజిక వర్గాలూ దీన్ని పొందవచ్చు. అయితే ఈ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు ఎన్.ఎల్.ఎమ్. ద్వారా అందుతున్న ముందస్తు సబ్సిడీ అవకాశం గురించి సిబ్బందికి చెప్పాలి. సిబిల్ స్కోర్ కూడా బాగుండాలి. సొంత లేదా కనీసం అయిదేళ్ల లీజు కింద ఎకరం నుంచి అయిదు ఎకరాల వరకు భూమిని కలిగి ఉండాలి. నాటుకోళ్లు, పందుల పెంపకానికైతే ఎకరం భూమి సరిపోతుంది. గొర్రెలు, మేకలకు సంబంధించి అయితే.. 500 గొర్రెలకు గడ్డిసాగు, షెడ్డులాంటి వాటికోసం అయిదు ఎకరాల భూమి కావాలి. తగిన అర్హతలుంటే ఒకే కుటుంబంలో ఎంతమందైనా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. దరఖాస్తుకు..ఉద్యమ్ మిత్ర పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు, వ్యక్తిగత గుర్తింపు, చిరునామా వగైరాలన్నిటికీ రుజువుగా పాస్‌పోర్ట్ లేదా ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్ వంటివి సమర్పించాలి. ఆదాయ రుజువు పత్రం, గడచిన రెండేళ్ల ఐటీఆర్, బ్యాంక్స్టేట్మెంట్,ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొటేషన్స్‌తోపాటు ఎక్కడైతే యూనిట్ పెట్టాలనుకుంటున్నారో ఆప్రాంతప్రాముఖ్యం, అక్కడ వ్యాపార అనుకూలతలు మొదలైన అంశాలతో పూర్తిప్రాజెక్ట్ రిపోర్ట్‌నూ సమర్పించాలి. పై వివరాలన్నిటిలో ఏ మాత్రం తప్పుల్లేకుండా చూసుకోవాలి. దరఖాస్తును,ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను పశుసంవర్ధక శాఖా సిబ్బంది పరిశీలించి, అప్రూవ్ చేసిన పత్రాన్ని సంబంధిత బ్యాంకుకు పంపిస్తారు. అప్పుడు బ్యాంకు ద్వారా రుణం పొంది, సొంతపెట్టుబడినీ కూడబెట్టుకోవాలి. సబ్సిడీకి కూడా అప్లయ్ చేసుకోవాలి. సబ్సిడీ పొందడానికి కొంత సమయం పడుతుంది. సబ్సిడీ పొందిన వెంటనే యూనిట్నుప్రారంభించవచ్చు. ఈలోపు ఎక్కడైతే యూనిట్‌ను పెట్టాలనుకుంటారో అక్కడ గ్రాసాన్ని పెంచాలి. ప్రభుత్వం సూచించిన నమూనాలోనే షెడ్డును నిర్మించాలి. అందులోని పశువులకు పోషకాహారం, పశువైద్య సౌకర్యం వంటివీ చూసుకోవాలి. ఇటు గ్రామీణ... అటు పట్టణ్రపాంతాల్లో విజయవంతంగా ముందుకు సాగుతోందీ పథకం.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
నాబార్డ్ పంట రుణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాల జారీలో రాష్ట్రస్థాయి బ్యాంకులే కాక... జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) కూడా చిన్నచూపే చూస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండగా, రైతుకు ఇచ్చే రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు లక్ష్యాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025–26 సంవత్సరానికి నాబార్డు విడుదల చేసిన ఫోకస్ పేపర్ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. 2025–26 సంవత్సరానికి తెలంగాణలో రుణాల లక్ష్యం రూ.3.86 లక్షల కోట్లుగా పేర్కొన్నప్పటికీ... ఇందులో కేవలం పంటలకు సంబంధించి పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం కేటాయించిన నిధులు రూ. 87,149 కోట్లు మాత్రమే. ఈ మొత్తం 2024–25లో పెట్టుకున్న రూ.90,794 కోట్ల లక్ష్యం కంటే రూ.3,645 కోట్లు తక్కువ కావడం గమనార్హం. ఐదేళ్లుగా లక్ష్యానికి దూరంగా రుణాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024–25 లక్ష్యానికన్నా రూ.3,645 కోట్లు తక్కువగా రుణ అంచనాను ప్రకటించిన నాబార్డ్ అంతకుముందు మూడేళ్లు కూడా పంటలకు ఇచ్చే రుణాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేదు. 2021–22లో పంట రుణాల కింద రూ. 59,440 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 42,854 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. 2022–23లో రూ.67,764 కోట్ల లక్ష్యాలకు గాను రూ. 59,060 కోట్ల వరకే ఇచ్చిoది. 2023–24లో అత్యధికంగా రూ.10వేల కోట్ల లోటు కనిపించింది. ఆ ఏడాది రూ. 73,437 కోట్ల లక్ష్యానికి గాను రూ. 64,940 కోట్లు మాత్రమే పంట రుణాలుగా ఇవ్వగలిగారు. రుణాలు, పెట్టుబడి 1.39 లక్షల కోట్లు పంటకు సంబంధించి రుణాలు 87,149 కోట్లు కా గా నీటి వనరులు, యాంత్రీకరణ, ప్లాంటేషన్, హార్టికల్చర్, అటవీ, బీడు భూముల వినియోగంతో పాటు పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి టర్మ్లోన్లు, పెట్టుబడి కలిపి 2025–26 సంవత్సరానికి నాబార్డ్ రూ.1.39 లక్షల కోట్ల రుణ అంచనా వేసింది. ఇందులో యాంత్రీకరణకు రూ. 5,608 కోట్లు, నీటి వనరులకు రూ.2,613 కోట్లు, అటవీ, బీడు భూముల సాగుకు రూ. 793 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకానికి రూ.16వేల కోట్ల వరకు కేటాయించారు. 53 శాతం నిధులు ఎంఎస్ఎంఈలకే.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు నాబార్డు అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బడ్జెట్లో 53 శాతం. వ్యవసాయ టర్మ్ లోన్లు 12 శాతం కాగా, వ్యవసాయ మౌలిక వసతులకు కేవలం 2 శాతం కేటాయించారు. -
మళ్లీ పొలంబాట..!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ కుటుంబాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ... గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పొలంబాట పట్టే కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. నాబార్డు 2016–17 సంవత్సరంలో నిర్వహించిన రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా... 2021–22లో నిర్వహించిన సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాలు 57 శాతానికి పెరిగాయి.దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు 9 శాతం పెరిగినట్లు ఈ సర్వే స్పష్టంచేసింది. ఇటీవల నాబార్డు ఆ సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీతో సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉండగా... 2021–22లో ఏకంగా 53 శాతానికి పెరిగాయి. మన రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, బిహార్, సిక్కిం, త్రిపుర, పంజాబ్, మిజోరాం, మణిపూర్లలోను వ్యవసాయేతర కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. -
వ్యవసాయ కుటుంబాల.. భూపరిమాణం తగ్గుతోంది
సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణం ఏటా తగ్గిపోతోంది. 2016–17లో ఇది 1.1 హెక్టార్లుండగా 2021–22లో అది 0.7కు పడిపోయింది. ఈ విషయాన్ని నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021–22 వెల్లడించింది. వ్యవసాయ గృహాల సాగు సామర్థ్యం, ఉత్పత్తి భూమి పరిమాణం గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో దేశంలోను వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు భూమి పరిమాణాన్ని ఐదు తరగతులుగా వర్గీకరించినట్లు సర్వే వెల్లడించింది. ఇక దేశంలో 38 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్లలోపే భూమి ఉంది.33 శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.41 హెక్టార్ల నుంచి 1.0 హెక్టార్ వరకు ఉంది. 15 శాతం వ్యవసాయ కుటుంబాలకు 1.01 హెక్టార్ల నుంచి 2.0 హెక్టార్ల వరకు భూమి ఉంది. 8 శాతం కుటుంబాలకు 2.1 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంది. ఆరు శాతం వ్యవసాయ కుటుంబాలకు 0.01 హెక్టార్లలోపే భూమి ఉంది. ఇలా దేశంలోని వ్యవసాయ కుటుంబాలు కలిగి ఉన్న సగటు భూమి పరిమాణం రాష్ట్రాల మధ్య విస్తృత వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. ఎనిమిది రాష్ట్రాల్లో ఒక హెక్టారు కన్నా ఎక్కువ.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబానికి సగటు భూమి ఒక హెక్టార్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది. మహారాష్ట్ర, నాగాలాండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఒక హెక్టార్ కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లు పేర్కొంది. మరో పది రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాలకు సగటు భూమి 0.4 హెక్టార్లలోపే ఉందని నివేదిక తెలిపింది. అసోం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో చిన్న భూ పరిమాణమే ఉందని సర్వే స్పష్టం చేసింది. -
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
దేశంలో కుటుంబ సగటు పరిమాణం 4.3
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గుతోంది. 2016–17తో పోల్చితే 2021–22లో గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గినట్లు ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ సర్వే 2021–22 వెల్లడించింది. 2016–17లో గ్రామీణ భారతంలో 4.5 ఉండగా 2021–22లో 4.3 ఉందని సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల పరిమాణం, కుటుంబ పెద్ద విద్యార్హతలపై నిర్వహించిన సర్వేను నాబార్డు విడుదల చేసింది. 2021–22లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాల సగటు పరిమాణం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. వ్యవసాయేతర కుటుంబాల్లో 4.0గా ఉండగా వ్యవసాయ కుటుంబాల్లో 4.5గా ఉంది. రాష్ట్రాల మధ్య గృహ పరిమాణాలలో వైవిధ్యాలను సూచిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మహారాష్ట్ర, సిక్కిం, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కుటుంబానికి సగటున నలుగురు కంటే తక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016–17తో పోల్చితే 2021–22లో స్వల్పంగా పెరిగింది. ఏపీలో 2016–17లో 3.5 ఉండగా 2021–22లో 3.7గా ఉంది. ఇక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల్లో 30 శాతం పెద్దలు నిరక్షరాస్యులుగా ఉండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 28 శాతం ఉన్నట్లు సర్వే తెలిపింది. -
వరి విత్తనాలు వేసే డ్రోన్ వచ్చేసింది!
డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్‌ను రూపొందించింది. పేటెంట్ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్ఎయు, నాబార్డ్ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్ డ్రోన్స్ విశేష కృషి చేస్తోంది. ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్ డ్రోన్స్ స్టార్టప్‌ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.ప్రొ. జయశకంర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), అగ్రిహబ్, నాబార్డ్ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్(ఎస్.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.వరి పంటపై పురుగుల మందు పిచికారీ..ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్‌ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్ ప్రొటోటైప్‌ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్‌తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్పిఓ లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.– ప్రేమ్ కుమార్ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్ డ్రోన్స్డ్రోన్ విత్తనాలు వెద పెట్టేది ఇలా..వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సహాయంతో సీడ్ డ్రిల్‌తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్ సీడర్‌ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్లాంటి సీడ్ డిస్పెన్సింగ్ డివైస్‌ను అమర్చుతారు. ఆ డివైస్‌కు డ్రోన్‌కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.హెక్టారుకు రూ.5 వేలు ఆదా..వెద వరి (డైరెక్ట్ సీడిండ్ రైస్– డిఎస్ఆర్) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్‌కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ అంచనా. డ్రోన్ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.700 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ..మారుత్ డ్రోన్స్ పిజెటిఎస్ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్ లైసెన్స్ వస్తుంది. వ్యవసాయ సీజన్లో డ్రోన్ పైలట్‌కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్ వివరించారు. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పేదల ఇళ్లకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్‌ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. -
ఏపీలో పంట సాగుదారుల హక్కు చట్టం భేష్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం–2019 బాగుందని నాబార్డు ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది. భూ యజమాని హక్కులకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా, వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదపడతోందని పేర్కొంది. భూ యజమాని అనుమతితో పంటసాగు హక్కు పత్రాలు(సీసీఆర్సీ) జారీ చేసి కౌలుదారులకు పంట రుణాలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుండటం హర్షణీయమంది. రాష్ట్రంలో సీసీఆర్సీ చట్టం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ముంబైలోని నాబార్డు మేనేజర్లు బెంజమిన్ థామస్, అరవింద్‌కుమార్, నాబార్డు కన్సల్టెంట్ ప్రణవ్ఖాత్రిల సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు శ్రీకారం చుట్టింది. తొలిరోజు గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి భూ యజమానులు, కౌలు రైతులతో ముఖాముఖిలో పాల్గొంది. చట్టం అమలు తీరుపై అధ్యయనం చేసింది. పకడ్బందీగా అమలు చేస్తే మరింత మేలు సీసీఆర్సీ కార్డుల జారీ, రుణాలతో పాటు సంక్షేమ ఫలాల అమల్లో ఎదురయ్యే ఇబ్బందులను బృందం సభ్యులు తెలుసుకున్నారు. ఈ చట్టం వల్ల తమకెన్నో ప్రయోజనాలున్నాయని, అయితే అంగీకార పత్రాలపై సంతకాలు చేయడానికి భూయజమానులు వెనుకంజవేస్తున్నారని కౌలు రైతులు నాబార్డు బృందం దృష్టికి తెచ్చారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి పంట రుణాల మంజూరులో కొంత మంది బ్యాంకర్లు ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. మరోవైపు, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తే భవిష్యత్‌లో లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన తమకుందని భూ యజమానులు చెప్పారు. సీసీఆర్సీ చట్టం రూపకల్పన చాలా బాగుందంటూ నాబార్డు బృందం సభ్యులు ప్రశంసించారు. చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే మెజార్టీ కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. చట్టంపై కౌలు రైతులతో పాటు భూ యజమానులకూ అర్థమయ్యే రీతిలో మరింత అవగాహన కచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రీతిలో కౌలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండే రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే మంచి ఫలితాలొస్తాయని అభిప్రాయపడ్డారు. 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులిచ్చామని అధికారులు వివరించారు. 14.13 లక్షల మందికి బ్యాంకర్ల ద్వారా రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయించగలిగినట్టు తెలిపారు. అత్యధికంగా ఈ ఏడాది 8.31 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా, వీరిలో 5.48 లక్షల మందికి రూ.1908 కోట్ల రుణాలు మంజూరైనట్టు తెలిపారు. పంట రుణాలే కాదు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పరిహారం, పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొంతమంది బ్యాంకర్లు చూపే సాంకేతిక కారణాలతో నూరు శాతం కార్డుదారులకు రుణాలు మంజూరు చేయలేకపోతున్నామని వివరించారు. పర్యటనలో నాబార్డు ఏపీ ఏజీఎం స్మారక్ మోహంతి, డీడీఎం అనిల్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్లోన్ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది. బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్ తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్‌రావు రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్‌స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్బీఐ జీఎం, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు విద్య రూ.2706.50 కోట్లు గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు ఇతర రంగాలు రూ.2283.51 -
రూ.242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. -
ధాన్యం దిగుబడిలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. మొదటి స్థానంలో పంజాబ్ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2022–23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిపై నాబార్డు నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్‌కు ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సస్య రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పైర్లపై వచ్చే వివిధ చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి, వాటి వలన పంటలకు ఏ విధమైన నష్టమూ వాటిల్లకుండా.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు ఆర్బీకేలు తోడుగా నిలుస్తున్నాయి. నిరోధక శక్తిగల వరి రకాలను ఎంచుకునేలాగ రైతులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విత్తన శుద్ధి పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నారు మడిలో సస్యరక్షణను పాటింపజేయడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. అలాగే నత్రజని ఎరువును సిఫారసుకు తగినట్టే వినియోగించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏ తెగుళ్లు సోకితే ఎంత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలో కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, దిగుబడిని పెంచే ఇన్పుట్లు మొదలైనవి రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో విత్తనం నుంచి పంట కోసి, విక్రయం వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తోంది. దీంతో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. -
మన మహిళ పొదుపులో అగ్రగామి
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా నాలుగేళ్లుగా అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. మన స్వయం సహాయక సంఘాలు పొదుపు విషయంలో, క్రెడిట్ లింకేజీలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, పొదుపు సంఘాల పనితీరుపై నాబార్డు 2022 – 23 వార్షిక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు నమోదైందని, ఈ విషయంలో రాష్ట్ర పొదుపు సంఘాలు అగ్రగామిగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు కూడా ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గాడిన పడ్డ సంఘాలు చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో గత నాలుగేళ్లుగా ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2022 – 23 మార్చి నాటికి) రూ.58,892.68 కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా పొదుపు సంఘాల పొదుపు రూ.28,968.44 కోట్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు రూ.18,606.18 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో అన్ని రాష్ట్రాల సంఘాల పొదుపులో ఏపీ స్వయం సహాయక సంఘాల పొదుపే 31 శాతం కావడం విశేషం. 2021–22తో పోలిస్తే 2022–23లో ఏపీ పొదుపు సంఘాల పొదుపు రూ.6,938 కోట్లు పెరగడం గమనార్హం. 2021–22 నాటికి రాష్ట్ర పొదుపు సంఘాల పొదుపు రూ.11,668 కోట్లు కాగా ఇప్పుడు రూ.18,606 కోట్లకు పెరిగింది. పరపతి పెరిగింది చంద్రబాబు పాలనలో రుణమాఫీ దగాతో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి క్షీణించింది. స్వయం సహాయక సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనకాడాయి. దీంతో సంఘాలు సి, డి గ్రేడ్లకు పడిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాలకు ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు చెల్లించారు. అంతేకాకుండా చంద్రబాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని కూడా పునరుద్ధరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగి ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా నిలిచాయి. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉండగా ఇప్పుడు 89 శాతం సాధించడం గమనార్హం. వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉంది. 2022–23లో వాణిజ్య, రీజనల్ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కలిపి ఏపీ పొదుపు సంఘాలకు దేశంలోనే అత్యధికంగా రూ.40,230.63 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం 2022–23లో దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో సంఘం సగటు పొదుపు అత్యధికంగా రూ.1,72,124 కాగా తెలంగాణలో రూ.85 వేలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022–23లో ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.43,940 నుంచి రూ.30 వేలకు పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. భారీగా తగ్గిన నిరర్థక ఆస్తులు నాడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసగించడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా వాటి నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయి. ఇప్పుడు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. పొదుపు సంఘాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో 5.86 శాతం నిరర్థక ఆస్తులుండగా 2022 – 23 నాటికి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.41 శాతానికి, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో 0.25 శాతానికే పరిమితమైనట్లు నివేదిక తెలిపింది. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం సకాలంలో రుణాలను చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీని రీయింబర్స్మెంట్ చేయడంతో పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని పేర్కొంది. పొదుపు మహిళల జీవనోపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రస్తావించింది. ఆసరా ద్వారా అందిస్తున్న డబ్బులతో వ్యాపారాలు నిర్వహిస్తూ పొదుపు సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలను చేసుకుని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
దేశంలో పెరిగిన పాల ధర
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్‌కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది. 30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సకాలంలో టీకాలు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది. -
రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 అని నాబార్డు తేల్చింది. 2012–13లో ఇది రూ.6,426 కాగా, 2018–19 నాటికి రూ.10,084కు పెరిగిందని తెలిపింది. అయితే సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయం మాత్రం అంతగా లేదని పేర్కొంది. ఈ మేరకు పరిశోధనాత్మక అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది. పంటలు, పశు సంపద, వ్యవసాయేతర వ్యాపారం వంటి అంశాలను కూడా అధ్యయనంలో పరిశీలించారు. ‘మొత్తంగా పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయం వాటా 38 శాతం కాగా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం వాటా 16 శాతంగా ఉంది. వ్యవసాయేతర రంగాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. కాగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణాతో పాటు జార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం అత్యధికంగా ఉంది. భూ పరిమాణం పెరిగినప్పుడు, వ్యవసాయ కార్యకలాపాల (పంటల ఉత్పత్తి, జంతువుల పెంపకం) ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. పెద్ద రైతులకు అంటే 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 91 శాతం, కాగా చిన్న సన్నకారు రైతులకు ఇలా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. ఈ విధంగా రైతు భూ పరిమాణాన్ని బట్టి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓబీసీ, ఇతర వర్గాల ఆదాయంతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాల ఆదాయం తక్కువగా ఉంది..’అని నాబార్డు నివేదిక వెల్లడించింది. భవిష్యత్ తరాలు వ్యవసాయానికి దూరం ‘భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 63 శాతం మంది రైతులు తమ భవిష్యత్ తరం వ్యవసాయంలో ఉండాలని కోరుకోవడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదని భావిస్తున్నారు. అందుకే కొత్త తరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం చేయడం రిస్‌్కగా వారు భావిస్తున్నారు. వ్యవసాయ భూపరిమాణం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగ డం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కీలకమైన కూలీల కొరత కూడా అనాసక్తికి కారణంగా ఉంది. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కూడా భవిష్యత్ తరం వ్యవసాయానికి దూరంగా ఉండటానికి కారణంగా కన్పిస్తోంది. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు గౌరవం, సామాజిక హోదా కూడా ఉండటం లేదు..’అని పేర్కొంది. లాభదాయకం కాదనే భావన.. ‘వ్యవసాయం లాభదాయకం కాదని రైతులు భావిస్తున్నారు. మార్కెటింగ్ సహా పటిష్టమైన సేకరణ వ్యవస్థ లేకపోవడం, మద్దతు ధరలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంపై అనాసక్తి చూపిస్తున్నారు. 62 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరకు స్థానిక విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 50 ఏళ్ల వయస్సున్న రైతుల్లో 70 శాతం మంది వరి సాగును కొనసాగిస్తున్నందున పంటల సాగులో వైవిధ్యం ఉండటం లేదు. కూరగాయలు, పండ్ల సాగు ద్వారా రైతుల్లో ఆదాయ ఉత్పత్తి గత 30 సంవత్సరాలలో తక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది..’అని నాబార్డు తెలిపింది. -
‘సూక్ష్మ’సాగే బాగు
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) రైతన్నలకు ఎంతో లాభదాయకమని నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ నాబ్కాన్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అవసరమైన చోట్ల మాత్రమే మొక్కలకు నీరు అందడం వల్ల కలుపు, చీడపీడల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. సూక్ష్మ సేద్యం ద్వారా కేవలం నీరు మాత్రమే కాకుండా విద్యుత్తు, కూలీల వ్యయంలో పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. తద్వారా అన్నదాతలకు సాగు వ్యయం, అనవసర ఖర్చులు తగ్గిపోయి అదనపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ అధ్యయనంతో తేలిందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం విధానంలో హెక్టార్‌కు గంటకు 1,553 కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. యూనిట్ విద్యుత్‌కు రూ.4 చొప్పున ఆదా అవుతుందని నాబ్కాన్స్ నివేదిక తెలిపింది. హెక్టార్‌కు 52 పనిదినాల కూలీల వ్యయం తగ్గుతుంది. రోజు కూలీ రూ.245 చొప్పున ఆదా అవుతుంది. హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుండగా అదనపు ఆదాయం రూ.1,15,000 సమకూరుతుంది. సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు రైతులకు బహుళ ప్రయోజనాలను అందించే కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎం కేఎస్‌వై) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీపై బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 11.91 లక్షల మంది రైతులు 13.41 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అనుసరిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది 75,000 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 60,500 హెక్టార్లకుపైగా ఈ పరిధిలోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరో 2,38,070 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల్లో 2.02 లక్షల రైతులు నమోదు చేసుకున్నట్లు సర్వే పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో 70 శాతం సూక్ష్మ సేద్యం చేయడం ద్వారా ఎంత మేరకు నీరు, విద్యుత్, కూలీల వ్యయం తగ్గుతుంది? సాగు ఖర్చులు ఎంత తగ్గుతాయి? రైతులకు అదనపు ఆదాయం ఎంత లభిస్తుందనే అంశాలపై నాబ్కాన్స్ గణాంకాలు రూపొందించినట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నీటి కొరతను అధిగమించేందుకు సూక్ష్మ సేద్యాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని నాబ్కాన్స్ నివేదిక సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యం విస్తీర్ణంలో 70 శాతం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉందని వెల్లడించింది. మిగతా రాష్ట్రాల్లోనూ సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
కూరగాయలకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: దేశంలో కూరగాయలకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2030 నాటికి దేశంలో కూరగాయల కొరత ఏర్పడుతుందని, దేశంలో అవసరాలకు తగినంతగా ఉత్పత్తి ఉండదని జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే మాంసం, పండ్లకు కూడా స్వల్పంగా కొరత ఏర్పడుతుందని పేర్కొంది. 2030 నాటికి దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లు కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తి పెరుగుతుందా లేదా అనే అంశంపై నాబార్డు అంచనా వేసింది. పంట తరువాత వృథాను కూడా తీసివేసిన తరువాత డిమాండ్, లభ్యతను లెక్కగట్టింది. 2030వ సంవత్సరానికి దేశంలో కూరగాయల డిమాండ్ 192 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, అయితే లభ్యత 160 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా 32 మిలియన్ టన్నుల కూరగాయల కొరత ఉంటుంది. అప్పటికి దేశంలో 103 మిలియన్ టన్నుల పండ్లు అవసరమైతే 93.1 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతాయని తెలిపింది. 9.9 మిలియన్ టన్నుల పండ్ల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో 5.54 శాతం వాటాతో భారతదేశం రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఎగుమతులు చేసినప్పటికీ, చేపల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని చెప్పింది. 2030 నాటికి చేపల డిమాండ్ 11.1 మిలియన్ టన్నులు ఉంటుందని, ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువగా 11.9 మిలియన్ టన్నులు ఉంటుందని వెల్లడించింది. గుడ్లు 5.8 మిలియన్ టన్నులు డిమాండ్ ఉండగా లభ్యత 5.9 మిలియన్ టన్నులు ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా పాలకు కొరత ఉండదని, అవసరానికంటే పాల ఉత్పత్తి ఎక్కువే ఉంటుందని వివరించింది. మాంసం అవసరానికంటే లభ్యత 1.2 మిలియన్ టన్నులు తక్కువ ఉంటుందని నివేదిక తెలిపింది. రైతులు పండించిన పంటలకు రవాణా వ్యయం తగ్గించేందుకు మార్కెటింగ్‌లో సమష్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. సన్న, చిన్న కారు రైతులతో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులకు మంచి ధరలకు హామీ లభిస్తుందని నివేదిక పేర్కొంది. వివిధ సమస్యలను అధిగమించేలా ఒప్పంద వ్యవసాయం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. -
మిల్లెట్స్ వాల్ క్యాలెండర్
2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ’ మిల్లెట్స్‌పై ఓ వాల్ క్యాలెండర్‌ను ప్రచురించింది. నాబార్డ్ సహాయంతో ఆర్.ఆర్.ఎ. నెట్‌వర్క్‌తో కలసి సహజ సమృద్ధ ఈ క్యాలెండర్‌ను ఆంగ్లం, తెలుగు, కన్నడ తదితరప్రాంతీయ భాషల్లోనూ రూపొందించింది. ఈ క్యాలెండర్లో వర్షాధార వ్యవసాయ పరంగా చిరుధాన్యాలప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు.. పౌష్టికాహార లోపాన్ని పారదోలే అద్భుత చిరుధాన్య వంటకాలను తయారు చేసుకునే పద్ధతులను,ప్రాసెసింగ్ యంత్రాల సమాచారాన్ని సైతం ఇందులో సచిత్రంగా వివరించారు. మిల్లెట్లను పునరుద్ధరించడంలో, సాంప్రదాయ మిల్లెట్ ఆహార వ్యవస్థను సజీవంగా ఉంచడంలో రైతులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నిర్వహిస్తున్న పాత్రను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తుంది. ఈ 24 పేజీల క్యాలెండర్. క్యాలెండర్ ధర రూ.150 (కొరియర్ ఖర్చుతో సహా). ఇతర వివరాల కోసం... 99720 77998 నంబరుకు కాల్ చేయవచ్చు. -
Andhra Pradesh కోవిడ్‌లో దున్నేసింది!
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని అధిగ మించి మరీ వ్యవపాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా 2019–20తో పోల్చితే 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీగా 20.75 శాతం మేర వృద్ధి నమోదైనట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఏపీ నుంచి 2020–21లో భారీగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తరువాత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కోవిడ్ విసిరిన సవాళ్ల మధ్య కూడా 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి నమోదు కావటాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 2019–20లో దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ.2.53 లక్షల కోట్లు ఉండగా కోవిడ్ మహమ్మారిని అధిగమించి 2020–21లో రూ.3.05 లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి. పది దేశాలకే అత్యధికం భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, సౌదీ ఆరేబియా, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, మలేషియా అది పెద్ద మార్కెట్‌గా నిలిచాయని, మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ దేశాలదే 52.2 శాతం వాటా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020–21లో దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల వాటా 21.4 శాతంగా ఉంది. తరువాత సముద్ర ఉత్పత్తులు 14.5 శాతం, సుగంధ ద్రవ్యాలు 9.7 శాతం, గేదె మాంసం 7.7 శాతం, చక్కెర 6.8 శాతంగా ఉంది. ప్రధానంగా ఈ ఐదు ఎగుమతుల వాటా 60.10 శాతంగా ఉన్నట్లు నివేదిక విశ్లేషించింది. తొలిసారిగా రాష్ట్రానికి 4వ స్థానం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం 2020–21లో రూ.23,505.2 కోట్ల విలువైన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. అయితే గత సర్కారు హయాంలో ఏ ఒక్క ఆర్థిక ఏడాదిలోనూ రూ.9,000 కోట్ల మేర కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగలేదు. టీడీపీ హయాంలో 2028–19లో ఏపీ నుంచి రూ.8,929.5 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏడు రాష్ట్రాల వాటా 88 శాతం ఉన్నట్లు తెలిపింది. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్‌లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ కార్యక్రమాలు అద్భుతం
సాక్షి, అమరావతి: నాబార్డ్ సాయంతో విద్యారంగంలో చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నాబార్డ్ చైర్మన్‌తో పాటు.. ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా నాబార్డ్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం వివరించారు. ఏపీలో 3 ఏళ్లలో మూడురెట్లు పెరిగిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో మూడు రెట్లు వ్యాపారం పెరగడం నిజంగా గొప్ప విషయమన్నారు. మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమ్మేళనం(బ్యాంకర్స్ కాంక్లేవ్)కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రూ.10 వేల కోట్ల టర్నోవర్ దాటిన తొలి బ్యాంక్‌గా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాంక్‌ను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాంకులు కూడా మారుమూల ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే రుణాల్లో కనీసం 40 శాతం సహకార బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పాడి, పశుపోషణ, మత్స్య అనుబంధ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు గ్రామాలకొకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఎసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాబార్డ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీలు పడవని, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అంతరాయం ఏర్పడదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీలో సహకార బ్యాంకులు సీడీ రేషియో 140 శాతం సాధించడం పట్ల ఎంపీ బాలశౌరి బ్యాంకర్స్‌కు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం: నాబార్డ్ చైర్మన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోందని, ఇందుకు కారణం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజి పేర్కొన్నారు. విజయవాడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడకి రావడానికి ముందు మచిలీపట్నం వెళ్లాను. ఆప్కాబ్ ఈ ఏడాదిలో మూడు రెట్లు పెంచుకోవడం అభినందనీయం. ఏపీ జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. సహకార రంగాల బలోపేతం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను డీడీటీ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది బ్యాంకింగ్ రంగానికి ఎంతో మేలు చేస్తోంది’ అని అన్నారు. సీఎం జగన్‌ను కలిసిన నాబార్డ్ ప్రతినిధుల బృందం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజితో పాటు నాబార్డ్ ప్రతినిధుల బృందం కూడా కలిసింది. సీఎం జగన్‌తో నాబార్డ్ బృందం సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నారు. నాబార్డ్ చైర్మన్ కీవీ షాజిని శాలువా కప్పి సత్కరించిన సీఎం జగన్.. వెంకటేశ్వరుని ప్రతిమను కూడా అందజేశారు. -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.85 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటించింది. ఈ మేరకు 2023–24కు సంబంధించిన ఫోకస్ పేపర్‌ను గురువారం విడుదల చేసింది. మొత్తం ప్రాధాన్యత రంగాల్లో రూ. 1,85,327 కోట్ల రుణ లక్ష్యం కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 1,12,762 కోట్లుగా లెక్కగట్టింది. వ్యవసాయ రుణాల్లో కీలకమైన పంట రుణాలకు రూ. 73,436 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. రుణ లక్ష్య ఫోకస్ పేపర్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. 2022–23 రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1,66,257 కోట్లు కాగా, అందులో వ్యవసాయ, అనుబంధాల రుణ లక్ష్యం రూ. 1.01 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది కంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 19,070 కోట్లు ఎక్కువగా ఉంది. సాగులో దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ: మంత్రి హరీశ్ రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి రోల్ మోడల్‌గా మారిందని, దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగుభూమి, పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19 శాతంగా ఉందన్నారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాటా కేవలం 3.5 శాతమేనని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 10 శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3 శాతంగానే ఉందని వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ భారీగా నిధులను వెచ్చించిందన్నారు. ఆయిల్‌పాం సాగుకు చేయుత ఇవ్వాలి... నాబార్డు మూడు అంశాలపై దృష్టిపెట్టి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తోందని, ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరిసాగులో నాట్లకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలు అందించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డును కోరారు. సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి త్వరగా అనుమతి ఇవ్వా లని నాబార్డు సీజీఎం సుశీల చింతలను కోరారు. తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలు: సీఎస్ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.75 లక్షలుగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు సమయానికి ఇప్పటికీ ఇది రెట్టింపు అయిందన్నారు. జీఎస్డీపీ దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామకృష్ణారావు, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సుచీంద్ర మిశ్రా అదనపు బాధ్యతల కింద చూస్తుండగా, ఆయన నుంచి స్వీకరించినట్టు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు ఇచ్చారు. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కరోనా తర్వాత, 2020 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకులు రూ.12 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 86,996 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏటీఎంలలో మోసాలు 2019-20లో రూ.116 కోట్ల మేర ఉంటే, 2020-21లో రూ.76 కోట్లకు తగ్గినట్టు చెప్పారు. ఇవీ చదవండి: టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాం వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్! ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
చిరుధాన్యాలతోనే విరుగుడు
సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది. ఇటీవల రాయచూర్‌లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్–సవాళ్లు స్టార్టప్‌ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది. చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది. ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. రైతులకు లాభసాటిగా చేయాలి చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది. విజయనగరంలో మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిల్లెట్స్ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది. మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎఫ్పీఓతో కలిసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది. చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే.. ► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి. ► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి. ► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ► అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి. ► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది. ► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి. ► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి. ► సాంకేతికత సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్ పరికరాలను ఏర్పాటుచేయాలి. -
పంజాబ్‌ను మించి ఏపీ.. నాబార్డు అధ్యయన నివేదిక ఏం చెప్పిందంటే?
సాక్షి, అమరావతి: గత దశాబ్ద కాలంలో దేశంలో వ్యవసాయ రుణాల పంపిణీ మూడు రెట్లు పెరిగినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. 2011–12లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల పంపిణీ రూ.5.11 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి మూడు రెట్లు పెరిగి రూ.15.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్లలో 11.9 శాతం వృద్ధి నమోదైంది. పంజాబ్‌ను మించి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణ లభ్యత మెరుగ్గా ఉండటం గమనార్హం. నాబార్డు నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు.. ♦2011–12 నుంచి స్వల్పకాలిక పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక టర్మ్ రుణాలు పెరిగాయి. 2017–18లో దీర్ఘకాలిక టర్మ్ రుణాల పంపిణీలో వృద్ధి 9.9 శాతం ఉండగా 2020–21 నాటికి 43.17 శాతానికిచేరింది. ♦వ్యవసాయ యాంత్రీకరణ, పంపు సెట్లు, నీటి పారుదల నిర్మాణాలు, తోటల అభివృద్ధి, ఫామ్ పాండ్లు, మైక్రో ఇరిగేషన్, పొలంలో ఉత్పాదక సామర్థ్యం పెంపు తదితరాలకు నాబార్డు, బ్యాంకులు దీర్ఘకాలిక టర్మ్ రుణాలను మంజూరు చేస్తున్నాయి. ♦బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి లభించినా బ్యాంకు రుణాల మంజూరులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయి. ♦దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయ రుణాల పంపిణీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో హెక్టార్‌కు రుణ లభ్యత మెరుగ్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల హెక్టార్‌కు రుణ లభ్యత రూ.లక్ష లోపే ఉంది. ♦2019 – 20లో ఆంధ్రప్రదేశ్‌లో హెక్టార్‌కు రూ.1.29 లక్షలు, పంజాబ్‌లో రూ.లక్షకు పైగా రుణ లభ్యత ఉంది. ♦వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంలో కిసాన్ క్రెడిట్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2019 మార్చి 31 నాటికి 1,896 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరయ్యాయి. ♦2011–12లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు రూ.3.96 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి రూ.8.85 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక టర్మ్ రుణాలు ఇదే సమయంలో రూ.1.14 లక్షల కోట్ల నుంచి రూ.6.73 లక్షల కోట్లకు పెరిగాయి. -
భారత్‌లో పాలు, మాంసానికి భారీ డిమాండ్.. నివేదికలో కీలక అంశాలు!
సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్‌కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది. పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్‌కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది. ఆహార అలవాట్లలో మార్పు 1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది. -
నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు. తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్‌లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్ఆర్బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది. -
మహిళా సంఘాలకు సీఎం జగన్ పాలనలో కొండంత అండ
-
పుష్కలంగా ఆహారం.. అయినా పోషకాహార లోపం..
సాక్షి, అమరావతి: దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. తిండి కొరతవల్ల కాకుండా ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువమంది ఈ లోపం బారిన పడుతున్నారు. నిజానికి.. దేశంలో తలసరి ఆహార ఉత్పత్తి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 1980 ప్రారంభంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక కిలోకంటే కొంత ఎక్కువగాను.. ఇటీవల కాలంలో 1.73 కిలోల ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య, పోషకాహార సూచికలు పేలవంగా ఉన్నాయని.. ఈ సూచికల క్షీణత ఆందోళన కలిగిస్తోందని నాబార్డు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2021 వెల్లడించింది. నివేదికలో పొందుపర్చిన సూచనలు, ఇతర ముఖ్యాంశాలివీ.. ► దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► 15–49 ఏళ్లలోపు మహిళల్లోని 57 శాతం మందిని కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. 2015–16తో పోలిస్తే పిల్లల్లోనూ, మహిళల్లోనూ ఇది పెరగడం ఆందోళన కలిగించే అంశం. ► ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధాన కారణం. ► పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లు కారణంగా ఈ లోపాలబారిన పడుతున్నారు. ► ఎక్కువగా కారం, నూనె, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడమే కారణం. ► ఈ లోపానికి పూర్తిగా కొనుగోలు సామర్థ్యం తక్కువగా ఉండటం కారణం కాదు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల వారిలో కూడా ఈ లోపాలున్నాయి. ► ఈ లోపంతో పిల్లలు బరువు తక్కువగా ఉండటం చాలా సాధారణమైంది. ► శరీరం పోషకాలను గ్రహించడం కూడా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. ► ఆరోగ్య సూచికలను మెరుగుపరచడానికి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ► ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి. ► రసాయన అవశేషాల వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి. -
జాతీయ ఆదాయంలో.. ‘వ్యవసాయం’ వాటా తగ్గుతోంది
సాక్షి, అమరావతి: జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గిపోతోందని, అదే సమయంలో దేశంలో సాగుచేసే వారి సంఖ్య పెరుగుతోందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే, ఇతర దేశాలతో పోలిస్తే వ్యవసాయ కూలీల సంఖ్య దేశంలో ఆశించిన స్థాయిలో తగ్గలేదని, రైతుల ఆదాయం కూడా పెరగడంలేదని ఆ నివేదిక పేర్కొంది. 21వ శతాబ్దంలో.. వ్యవసాయ రంగంలో సవాళ్లు–అనుసరించాల్సిన విధానాలపై నాబార్డు అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. నివేదిక ముఖ్యాంశాలు ఇవీ.. ► జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 1991లో 27.3 శాతం ఉండగా 2019 నాటికి 16.7 శాతానికి తగ్గిపోయింది. ► అయితే, ఇతర దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఉద్యోగుల సంఖ్య బాగా క్షీణించినప్పటికీ దేశంలో మాత్రం ఆ తగ్గుదల చాలా తక్కువగా ఉంది. ► 1993–94 ఆర్థిక సంవత్సరంలో సాగుచేసే వారి సంఖ్య దేశంలో 138 మిలియన్లుండగా 2019–20 నాటికి 166 మిలియన్లకు పెరిగింది. పురుషులతో పాటు మహిళా సాగుదారుల సంఖ్య కూడా పెరిగింది. ► సాగు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో రైతుల ఆదాయం పెరగడంలేదు. ఈ నేపథ్యంలో.. రైతుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిసారించాలి. వేగవంతమైన రేటుతో రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయోత్పత్తిలో మార్పు అవసరం. ► ఉత్పాదకత పెరుగుదల, సగటు వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరల కల్పించడం, విస్తరణ వంటి బహుముఖ వ్యూహం ద్వారా మార్కెటింగ్ అనుబంధ కార్యకలాపాలను చేపట్టాలి. ► అలాగే.. రైతులను వ్యవసాయేతర వృత్తుల వైపు మార్చడంపైన దృష్టిసారించాలి. ► ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం దేశంలో ఇంకా చాలామంది కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అయితే, ఇతర దేశాల్లో ఈ రంగంపై ఆధారపడిన కూలీల సంఖ్య బాగా తగ్గింది. ► వ్యవసాయం నుంచి శ్రామిక శక్తిని పారిశ్రామిక రంగం వైపు మళ్లించడంలో ఆ రంగం వైఫల్యాలే కారణం. అందుకే దేశంలో అత్యధిక సంఖ్యలో కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం నుండి తయారీ, సేవల వరకు అవకాశాలను కల్పించేందుకు అన్వేషించాలి. ► వ్యవసాయం, వ్యవసాయేతర ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడంపై ఆలోచన చేయాలి. సవాళ్లపై దృష్టిపెట్టాలి ఇక 21వ శతాబ్దంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిసారించడంతో పాటు అవసరమైన సంస్కరణలను తీసుకురావాలని నాబార్డు నివేదిక సూచించింది. అలాగే, కొన్ని దశల్లో వ్యవసాయంలో అధిక వృద్ధిరేటు.. దేశంలో ఆహార పదార్థాల వాస్తవ ధరలను తగ్గించలేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేయడానికి నైపుణ్యం అవసరమని.. ఇందులో భాగంగా, గ్రీన్హౌస్ సాగు, పాలీ హౌసెస్, టిష్యూ కల్చర్ విధానాలు అనుసరించడం ద్వారా సగటు వ్యయాన్ని తగ్గించి ఆదాయాన్ని పెంచుతుందని నివేదిక తెలిపింది. ప్రజల ప్రాధాన్యతలను, రైతుల ఆదాయాన్ని పెంచే జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పద్ధతులను అనుసరించాలని వివరించింది. -
Kakani Govardhan Reddy: ఏపీ వైపు దేశం చూపు..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఏపీని మోడల్‌గా తీసుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు నాబార్డు అందిస్తోన్న చేయూత ప్రశంసనీయమన్నారు. ఇదేబాటలో మిగిలిన బ్యాంకులన్నీ సహకరించాలని కోరారు. విజయవాడలో సోమవారం జరిగిన నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2021–22 సీజన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం రూ.39,708 కోట్ల రుణాలు నాబార్డు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి రైతుకు పీఎంఎఫ్‌బీవై వర్తింపజేయాలని సూచిస్తే పట్టించుకోకుండా.. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతోనే ఆ పథకం నుంచి వైదొలిగామన్నారు. నాబార్డు సహకారం వలనే 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయగలిగామని, మిగిలిన చెల్లింపుల కోసం సోమవారం మరో రూ.1,600 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ (ఆర్సీఎస్) అహ్మద్‌బాబు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, ఎస్బీఐ జీఏం ఓం.నారాయణ్ శర్మ తదితరులు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధి, విధాన రూపకల్పనలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నాబార్డు సీజీఎం ఎం.ఆర్ గోపాల్ మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో ప్రారంభమైన నాబార్డు నేడు రూ.7.6లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరిందన్నారు. నాబార్డు జీఎంలు బి.ఉదయభాస్కర్, ఎన్ఎస్ మూర్తి, ఆప్కాబ్ ఎండీ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
AP: సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. దేశంలో వ్యవసాయ సాంకేతికతపై నాబార్డు పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూక్ష్మ సేద్యంలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఏపీలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం ఈ తరహా సేద్యమే చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. అదే కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్ర 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్లో 22 శాతం సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక భూగర్భ జలాలు బాగా అడుగంటిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యం సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉండటంపట్ల నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పంజాబ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం కేవలం ఒక శాతమే ఉండగా.. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో పది శాతమే ఉంది. నిజానికి.. ఈ రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని, ఆయినా సరే నీటిని ఆదాచేసే మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీని వినియోగించడంలో ఇవి బాగా వెనుకబడి ఉన్నట్లు నివేదిక వ్యాఖ్యానించింది. అయితే, ఇక్కడ వరి సాగు ఎక్కువగా ఉండటం కూడా మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని వివరించింది. సూక్ష్మ సేద్యంలో వరిసాగుపై పరిశోధనలు మరోవైపు.. వరి సాగులో మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నాబార్డు నివేదిక తెలిపింది. సూక్ష్మ సేద్యంలో నీటి ఆదాతో పాటు పంటల ఉత్పాదకత బాగా పెరుగుతుందని.. అలాగే, విద్యుత్, కూలీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని పలు సర్వేల్లో వెల్లడైందని అందులో ప్రస్తావించింది. నీరు ఆదా కావడమే కాకుండా ఉత్పాదకత గణనీయంగా పెరిగినట్లు ఈ తరహా సాగు చేస్తున్న 60 శాతం రైతులు వెల్లడించారని నివేదిక పేర్కొంది. ప్రధానంగా అరటి, వేరుశనగ, పత్తి పంటల సాగులో మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకత పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలిందని వివరించింది. -
వేగంగా కొత్త వంతెనల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నదులు, కాలువలు, వాగులు దాటడానికి పడవలు, బల్లకట్లు, పుట్టిలు వంటి ప్రమాదకర ప్రయాణాల నుంచి ప్రజలకు విముక్తి కలగనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.2,205 కోట్లతో రహదారుల పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రధాన, మైనర్ వంతెనల నిర్మాణాన్ని కూడా వేగంగా చేపడుతోంది. నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ (నిడా) రెండో దశ కింద రూ.262.36 కోట్లతో 25 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒక్కోవంతెనతో కనీసం లక్ష మంది ప్రజలకు నదులు, వాగుల మీదుగా రాకపోకలు సులభంగా సాగించొచ్చు. రాష్ట్ర ప్రధాన రహదారుల్లో 16, జిల్లా ప్రధాన రహదారుల్లో 7, ఇతర రోడ్లపై రెండు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 8 వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. మిగిలిన 17 వంతెనల పనుల కోసం ఆర్ అండ్ బి శాఖ త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభించనుంది. ► రాష్ట్ర ప్రధాన రహదారుల్లో రూ.87.22 కోట్లతో 16 వంతెనల నిర్మాణాన్ని ఆర్ అండ్ బి చేపట్టింది. వాటిలో ఆరు వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితోపాటు మిగతా 10 వంతెనల పనులను ఏడాదిలోగా పూర్తి చేయనున్నారు. ► జిల్లా ప్రధాన రహదారుల్లో రూ.162.95 కోట్లతో ఏడు వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో రెండు వంతెనల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మిగతా ఐదింటి పనులను ఆర్ అండ్ బి శాఖ త్వరలో ప్రారంభించనుంది. ► ఇతర రహదారుల్లో రూ.12.19 కోట్లతో రెండు వంతెనల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పనకు 2021–22 బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం రూ.11,477 కోట్లు కేటాయించినట్లు నాబార్డు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఈ రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులపై నాబార్డు వార్షిక నివేదిక విశ్లేషించింది. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల కేటాయింపులు తిరోగమనంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏపీలో వ్యవసాయ రంగంలో స్టోరేజి, వేర్‌హౌసింగ్, సాగునీరు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల మౌలిక వసతులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగానే రైతులు పండించిన పంటల నిల్వ కోసం అవసరమైన గోదాములను సైతం నిర్మిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరిస్తున్న విషయం తెలిసిందే. రూ.2,269.30 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 10,315 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 2,287 భవనాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 1,948 భవనాలు తుది దశలో ఉన్నాయి. మొత్తం నిర్మాణాలను ఈ ఏడాది సెపె్టంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అలాగే, పాడి రైతుల కోసం రూ.399.01 కోట్ల వ్యయంతో తొలి దశలో 2,535 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. -
మత్స్యకారులకు మంచి రోజులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మత్స్యకారులకు మంచి రోజులు రానున్నాయి. మత్స్య సంపదను మార్కెట్‌కు తరలించే సందర్భంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా దళారులకు చెక్ పెట్టేందుకు ఐస్ ప్లాంట్లు, హేచరీలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో ఇటీవలే సాత్వా, ఢిల్లీ నుంచి అవస్థాపన బృంద సభ్యులు దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాల్లోని పలు తీర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో నాబార్డు నిధులతో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. మత్స్య సంపదే కీలకం కృష్ణా జిల్లాలోని తీరప్రాంత గ్రామాల్లో మత్స్య సంపదపైనా ఆధారపడి 1,12,977 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో 111 కిలోమీటర్ల మేర సముద్రంలో చేపల వేట సాగుతోంది. 2020–21 నివేదిక ప్రకారం కృష్ణా జిల్లా నుంచి 13.83 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఏటా ఎగుమతి అవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తీరప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు నాబార్డుకు అనుబంధంగా పనిచేస్తున్న సాత్వా, ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) బృందాల సభ్యులు దివిసీమలోని తీర గ్రామాలైన నాగాయలంక, కోడూరు మండలాల్లో ఇటీవల పర్యటించారు. నాబార్డు, సాత్వా బృంద సభ్యులు నీల్, అభిషేక్, పీఎంఎఫ్‌ఎంఈకి సంబంధించి కార్తికేయరెడ్డితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం కోడూరు మండలం బసవానిపాలెం, పాలకాయతిప్ప, నాగాయలంక మండలం జింకపాలెం, నాచుగుంట్ల గ్రామాల్లో పర్యటించింది. తొలగనున్న సమస్యలు 35 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించేందుకు నాబార్డు ముందుకొచ్చినట్టు బృంద సభ్యులు చెప్పారు. ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, హేచరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అవనిగడ్డతోపాటు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోనూ వీటి అమలుకు చర్యలు తీసుకుంటామని బృందాల ప్రతినిధులు చెప్పారు. ఇవి కార్యరూపం దాలిస్తే జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. -
చిన్న పరిశ్రమలకు సాయం చేద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈల) అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కరోనా కష్ట సమయంలో రీచార్జ్ ప్యాకేజితో పారిశ్రామిక రంగాన్ని ఆదుకుంది. ఎంఎస్ఎంఈల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు నాబార్డు కూడా దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. రాష్ట్రంలో 2022 –23 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.52,468.55 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇందులో మూల ధనం కింద రూ.18,400.93 కోట్లు, పెట్టుబడి రుణం కింద రూ.34,067.62 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపింది. పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహాయం అందించాలని చెప్పింది. మూత పడిన యూనిట్ల పునరుద్ధరణకు బ్యాంకులు ఆర్థిక సాయాన్ని అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై పారిశ్రామికవేత్తల్లో అవగాహన కల్పించాలని తెలిపింది. రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వైఎస్సార్ నవోదయం పేరిట వన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ పత్రంలో నాబార్డు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపింది. వ్యవసాయ రంగంలో రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
ఆర్బీకేలకు నాబార్డు చేయూత
సాక్షి, అమరావతి: ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సహకార సొసైటీల పరిధిలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ తీసుకురావడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ఆర్బీకే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్‌ను తీసుకు రావడం శుభపరిణామం అని చెప్పారు. సహకార రుణ పరపతి పునర్ వ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్పర్సన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్ క్యాపిటల్ కావాలంటే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఎంత కావాలంటే అంత సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫెషనల్‌గా తయారవుతాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60 వస్తుంటే, ప్రాసెస్ చేసి మార్కెట్లో రూ.200కు పైగా అమ్ముతున్నారని చెప్పారు. ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వాల్యూఎడిషన్ చేయడం అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూ చైన్ ఫైనాన్స్ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మనమిచ్చేది రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58 వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ పథకం 100% రీ పేమెంట్ జరుగుతోందన్నారు. అదే రీతిలో కౌలు రైతులను జాయింట్ లయబులిటి గ్రూప్స్ (జేఎల్‌జీ)గా ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చన్నారు. డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి, సహకార బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆప్కాబ్‌కు రూ.100 కోట్లు, డీసీసీబీలకు రూ.190 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్ఆర్ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఆర్బీకే–పీఏసీఎస్‌లను అనుసంధానించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా.. లేదా అనే అంశం పై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. మండలానికో బ్రాంచ్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంన్నారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. -
AP: ‘అగ్రి’లో నంబర్ వన్
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చాం. దీన్ని మరో మెట్టు పైకి తీసుకెళుతూ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉపకరణాల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అదనంగా పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. వీటికి మీ సహకారం కావాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనే వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలతో పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు)ల అనుసంధానం, బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నియామకంతో సహకార బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగేలా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తద్వారా రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాలకు రక్షిత మంచి నీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ నాబార్డు, బ్యాంకులు తగిన సహాయ, సహకారాలు అందించాలని కోరారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో వివిధ రంగాల్లో రుణ ఆవశ్యకత అంచనాలతో నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పత్రాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సుస్థిర ఆర్థిక ప్రగతికి రుణాలు దోహదం ► 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది. 2022 ఫిబ్రవరి 11 నాటికి దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.115 లక్షల కోట్లు. ఈ విషయంలో ఏటా 7.86 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం. ఈ విషయంలో కొత్త వ్యూహాల దిశగా అడుగులు వేయాలి. ► కోవిడ్–19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం, దాని అనుంధ రంగాలు 4.16 శాతం ప్రగతిని సాధించాయి. కోవిడ్ సమయంలో రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు మంచి సహకారం అందించినందుకు ధన్యవాదాలు. తద్వారా రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నాం. సాగు రంగంలో ఆర్బీకేలు కీలక పాత్ర ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసం రైతు భరోసా, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని పంట రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తోంది. ► ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ఇ–క్రాప్ చేస్తున్నాం. ఇదో విప్లవాత్మక చర్య. గతంలో కొంత మంది మాత్రమే చేసుకునే వారు. చేసుకోలేని వారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున నష్టపోయేవారు. ఇలా జరగకూడదని రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ► సబ్సిడీ మీద వ్యవసాయ ఉప కరణాలను రైతులకు వ్యక్తిగతంగా సరఫరా చేయడంతో పాటు సీహెచ్‌సీల(కస్టమ్ హైరింగ్ సెంటర్స్) ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 10,700 ఆర్బీకేలు సాగు రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ► ఆర్బీకేలు రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ చేదోడుగా నిలుస్తున్నాయి. రూరల్ నియోజకవర్గాల స్థాయిలో (147 నియోజకవర్గాలు) అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. బ్యాంకులతో కలిసి కార్యాచరణ ► సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం. ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు.. బ్యాంకులు, సొసైటీలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించాను. ► ఫుడ్ ప్రాసెసింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టి పెట్టాం. ఆర్బీకే, ఇ –క్రాపింగ్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు 542 సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం. ► బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. రుణ సదుపాయం కల్పనలో ఆర్బీకేలు సంధానకర్తలుగా ఉండాలి. అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణం అందాలి. ఈ మేరకు అమలు చేసేందుకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాళిక, ఎస్ఓపీ తయారు చేయాలి. ► ఇప్పుడు మనం నానోఫెర్టిలైజర్స్ వంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్న ఆధునిక యుగంలో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు రావాలని, వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామ స్థాయిలోనే అభివృద్ధి చేయాలనే నాబార్డ్ చైర్మన్ సూచనను పరిగణనలోకి తీసుకుంటాం. దాన్ని అందుకునే దిశగా వ్యవసాయ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై కూడా దృష్టి పెడతాం. విద్య, వైద్య రంగంలో వాస్తవిక సంస్కరణలు ► నాడు–నేడు ద్వారా విద్య, వైద్య రంగంలో వాస్తవిక సంస్కరణలు చేపట్టాం. 16 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 27 మెడికల్ కాలేజీలు వస్తాయి. ► నాడు–నేడు కింద స్కూళ్లలో నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. మంచి నీరు, శుభ్రమైన బాత్రూమ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, బ్లాక్ బోర్డ్స్, స్కూల్ అంతా మంచి పెయింటింగ్ వంటివి చేపట్టాం. ► ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నాం. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో బైలింగువల్ పాఠ్యపుస్తకాలను ముద్రించాం. భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా అభివృద్ధి చెందుతారు. ► తద్వారా గ్రామ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని.. దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఫ్లోరోసిస్ సమస్యను అధిగమించాలి ► ఫ్లోరోసిస్ సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని చోట్ల నీటి కొరత అధికంగా ఉండడం వల్ల రవాణాకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్ధితి. వీరికి రక్షిత తాగు నీటిని అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇలా ఎంపిక చేసిన చోట్ల బ్యాంకులు మరింత ముందుకొచ్చి సాయం చేయాల్సి ఉంది. ► మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వలస వెళ్లకుండా రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం. ► కరువు నివారణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్రాలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా ఎంఎస్ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ► ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పనితీరు ప్రశంసనీయం నాబార్డ్ అధికారులుగానీ, రిజర్వ్ బ్యాంకు అధికారులు గానీ రాష్ట్రాలకు వెళ్లి చర్చిస్తున్నప్పుడు క్రెడిట్ రేషియోను చూసి పనితీరు బాగోలేదంటూ చర్చను ప్రారంభించాల్సి వస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా భిన్నం. రాష్ట్రంలో క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి 140 శాతం నుంచి 150 శాతం దాకా ఉంది. ఇది గర్వపడాల్సిన విషయం. భూ రికార్డుల డిజిటలైజేషన్ గురించి వివిధ రాష్ట్రాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చూడండని చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయడమే కాకుండా, దాన్ని బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం చేయడం గొప్ప విషయం. ఇది దేశం మొత్తం జరగాలి. రైతులందరికీ రుణాలు లభించాలి. వ్యవసాయం సహా అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. ఆర్బీకేల విషయంలో రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్నాను. సీఎం జగన్ పట్టుదలతో పని చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఒక సమావేశంలో వీటి గురించి నాకు గొప్పగా చెప్పారు. వీటిని ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. – డాక్టర్ చింతల గోవిందరాజులు, నాబార్డ్ చైర్మన్ -
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకో: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం విన్నూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారని నాబార్డ్ చైర్మన్ ప్రశంసించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అనేక అంశాలను ప్రస్తావించారని జీఆర్ చింతల అన్నారు. గత ఏడాది కంటే నాబార్డ్ సహకారం మరింతగా ఉంటుందని ఆయన చెప్పారు. సహకార బ్యాంకుల సేవలను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేయమని సీఎం జగన్ చెప్పారు. రూ.16వేల కోట్లతో ప్రతి గ్రామంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. చంద్రబాబుకి వారసత్వంగా లోకేష్, అచ్చెన్నాయుడు ఓ వైపు ఇవన్నీ జరుగుతుంటే నాబార్డ్ చైర్మన్ వస్తున్నారని తెలిసి టీడీపీ బ్యాచ్ సిద్ధమైంది. రైతు సదస్సు పేరుతో సీఎంపై బురద జల్లడానికి అచ్చెన్నాయుడు ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ఎక్కడ ప్రకటించారో చూపించాలి. ఆనాడు వాళ్లు క్రాప్ హాలిడే ఇస్తే రైతులు ఆందోళనను పోలీసులతో అనగదొక్కించారు. చంద్రబాబుకి వారసత్వంగా లోకేష్, అచ్చెన్నాయుడు తయారయ్యారు. అచ్చెన్నాయుడు అబద్దాల్లో పుట్టిపెరిగినట్లుంది. ఆయన సీఎంపై మాట్లాడుతున్న బాష ఏమిటి..?. మూర్కుడు పరిపాలిస్తున్నాడు అంటారా..?. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన ఎలాంటి వారో ప్రజలకి తెలుసు. చంద్రబాబు ఎలా ఉంటే అందరూ అలా ఉంటారనుకుంటే ఎలా..?. అధికారంలో ఉంటే చంద్రబాబు నమస్కారం పెట్టినా ప్రతినమస్కారం పెట్టడని మీ పార్టీ వారే చెప్తున్నారు. 160 సీట్లొస్తాయని చెప్పుకుంటున్నారు. వాటిని పగటి కలలు మాత్రమే అంటారు. ఈ మధ్య మేమొస్తాం.. మీ సంగతి తెలుస్తాం అని బాగా చెప్పుకుంటున్నారు. చదవండి: (అందుకే వివేకా అల్లుడు ఆదినారాయణరెడ్డితో స్నేహం చేశాడు: తోపుదుర్తి) వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రగామి దేశంలో ఏపీ వ్యవసాయంలో అగ్రగామిగా ఉందని కేంద్రమే చెప్తోంది. మీరెన్ని సోకాలు పెట్టినా వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రగామి అయ్యి తీరుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వ్యక్తిగత పనిముట్లు ఇవ్వనున్నాం. త్వరలో రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రైతులకు అందించనున్నాం. వచ్చే ఏడాది నుంచి మార్కెట్ యార్డులను నాడు- నేడు కింద అబివృద్ది చేయనున్నాం. రాబోయే రోజుల్లో మీ ఊహకందని రీతిలో వ్యవసాయ రంగం అబివృద్ది చెందుతుంది. ఒక్క టీడీపీ మాత్రమే ఏ వర్గం సుఖంగా ఉండకూడదు అని కోరుకుంటుంది. ఉద్యోగుల వల్ల 2019లో ఓడిపోయాం అని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఉద్యోగ సంఘాలు మాపై మాట్లాడితే ఆహా అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ఉద్యోగులను తిడతారు. రాత్రికి రాత్రి గుడారం ఎత్తేశారు మూడు రాజధానులు ఉపసంహరించుకున్నాక ఎవరైనా రాజధాని అమరావతి అంటారు. కొన్ని కారణాల వల్ల ఆ బిల్లును ఉపసంహరించుకున్నాం. కేంద్రం రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా దీనిపై చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. అమరావతి భూములపై ఎవరికి శ్రద్ధ ఉందో దేశమంతా తెలుసు. రాత్రికి రాత్రి గుడారం ఎత్తి ఇక్కడకు వచ్చి ఒక్క రోడ్డేసిన పాపాన పోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అమరావతిలో చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిన తరుణంలో అప్పులు అనివార్యంగా చేయాల్సి వచ్చింది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. మీరేం సాధించారు. మీరు తెచ్చిన అప్పులతో ఒక్కరికైనా లబ్ది చేకూర్చారా..? చదవండి: (వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్) దీన్నే దమ్మున్న నాయకత్వం అంటారు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వను అని అన్న పెద్దమనిషి ఎవరు. ఇప్పుడు ఎవరూ డిమాండ్ చేయకముందే ఆ కేసును మేము సీబీఐకి రెఫర్ చేశాం. దీన్నే దమ్మున్న నాయకత్వం అని అంటారు. మీకు సీబీఐ గురించి మాట్లాడే అర్హత ఉందా..?. వాళ్లిచ్చిన లీకులను పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చు వేసుకొని మీరెలా మాట్లాడతారు. ఏ రోజైనా సీబీఐ విచారణ అపమని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా..?. అంతర్వేది సంఘటనను కూడా సీబీఐ విచారణ చేయాలని కోరాము. మీరు బంతిని నెలకేసి కొడితే ఎలా లేస్తుందో జగన్ అలానే లేస్తాడు. జగన్‌ను తగ్గించాలని చూసిన ప్రతి ప్రయత్నంలో ఆయన పైకి లేచారు' అని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. -
రైతుల కోసం అగ్రిల్యాబ్స్:సీఎం జగన్
-
నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం ► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం ► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి ► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం ► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య: ►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం ► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం ►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం ► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి ► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ ►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం ►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం ►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు ►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను ►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం ► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం ►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం ►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం ►16 కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నాం ►ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం ►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం.. ► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం ►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు ►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు ►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం ►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం ►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి ►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది ►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం చదవండి: గోదావరి గట్టెక్కింది -
సాగు రుణాలు రూ.లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్స రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల న్నింటికీ కలిపి రూ. 1,01,173 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు నిర్దేశించింది. ఇందులో పంట రుణాలను రూ. 67,863 కోట్లుగా పేర్కొంది. మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళికను రూ. 1,66,384.90 కోట్లుగా ఖరారు చేసింది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫోకస్ పేపర్ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునం దన్‌రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం వైకే రావు, ఎస్ఎల్బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొందరు, మరికొందరు నేరుగా పాల్గొన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రం గానికి రుణ పరపతి పెంచాలని బ్యాంకర్లను కోరారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని, నాబార్డు సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఈ పథకాల వల్ల తెలంగాణవ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయని, పంటల విస్తీర్ణం పెరగడంతోపాటు రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోందన్నారు. అయితే సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యాన్ని గుర్తించి పంటల వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్‌పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ధి రంగాల్లో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌలిక సదుపాయాలతోపాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకొని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలన్నారు. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చేలా... రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ స్టేట్ ఫోకస్ పేపర్లో వ్యవసాయం, ఆయిల్‌పామ్ సాగు, ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక ఆవిష్కరణల వంటి అంశాలపై దృష్టిసారించినట్లు నాబార్డు తెలిపింది. రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి పాడిపరిశ్రమ, మేకల పెంపకం, పందుల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ కార్యకలాపాలు అందించే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని సూచించింది. ఒక జిల్లా–ఒక పంట పథకం కింద ఉద్యాన పంటల క్లస్టర్ ఆధారిత ఉత్పత్తిని ప్రోత్సహించాలని నాబార్డు భావిస్తోంది. 2024–25 నాటికి తొమ్మిది జిల్లాల్లో 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ చేపట్టింది. దానికి అవసరమైన ఊతం ఇవ్వాలని నాబార్డు బ్యాంకర్లకు సూచించింది. కాగా, 2021–22లో వ్యవసాయ రుణాలు రూ. 83,368 కోట్లు ఉండగా 2022–23లో అవి రూ. లక్ష కోట్లు దాటనుండటం విశేషం. -
మౌలిక వసతుల కల్పనకు రూ.1,392 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు నాబార్డు చేయూతనిచ్చింది. వైఎస్సార్, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన బోధనాస్పత్రుల నిర్మాణానికి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డు రూ.1,392.23 కోట్ల రుణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్‌కుమార్ జన్నావర్ వెల్లడించారు. నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) కింద ఈ సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ► వైఎస్సార్, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు కానున్న మూడు బోధనాస్పత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపీడీలు, డయాలసిస్, బర్న్ వార్డు, క్యాజువాలిటీ వార్డు, స్పెషలైజ్డ్ క్లినికల్ కమ్ సర్జికల్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్.. వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాబార్డు సీజీఎం తెలిపారు. వైద్య విద్యకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ► మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ కన్సల్టేషన్ రూమ్‌లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూమ్, డయాలసిస్ వార్డు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఓటీ కాంప్లెక్స్, ఓపీడీ, జనరల్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు తదితర సౌకర్యాలు అందుబాటులోకొస్తాయని చెప్పారు. ► రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నాబార్డు తగిన తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. ► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా 3 వేల 92 కోట్ల రూపాయల సాయం అందించామని, ఈ నిధులతో 25 వేల 648 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం, మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించినట్టు చెప్పారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకూ నాబార్డు సాయం అందించినట్టు సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావర్ వివరించారు. -
10,778 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: సహజ సేద్యాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల్లో 10,778 ప్రత్యేక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు నాబార్డు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారని తెలిపారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. వ్యవసాయ, ఇతర ప్రాధాన్య రంగాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మంచి పనితీరు కనపరిచిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈ సెక్టార్‌కు మరింత ప్రాధాన్యం కల్పించాల్సి ఉందన్నారు. కోవిడ్ కారణంగా విద్యా, గృహ రుణాల పరిమితి కొంత మందకొడిగా ఉందని, వీటిపై కూడా మరింత దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ జన్నావర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆదాయం రెట్టింపే లక్ష్యం
శృంగవరపుకోట రూరల్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. వ్యవసాయ రుణాలు, పరికరాల కొనుగోళ్ల కోసం నాబార్డు నుంచి రూ.2.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నాబ్ కిసాన్–నాబ్ సంరక్షణ్‌లో భాగంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)లకు క్రెడిట్ గ్యారంటీ కింద రూ.1,200 కోట్లు కేటాయించామన్నారు. ఎఫ్‌పీవోలకు రుణాలిచ్చే బ్యాంకులకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొడ్డవర గ్రామంలో సేంద్రియ రైతు ఎం.రవీంద్రప్రసాద్ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌పీవోల కింద రైతులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో 340 ఎఫ్‌పీవోలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు కాండ్రేగుల సన్యాసినాయుడు, చెల్లయ్య, కె.జయవిష్ణు తదితరులతో నాబార్డు చైర్మన్ మాట్లాడారు. కార్యక్రమంలో నాబార్డు సీజీఎం జె.సుధీర్‌కుమార్, జీఎం ఎన్ఎస్ మూర్తి, డీజీఎం నాగేష్, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్‌కు చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేస్తున్న 26 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక చేయూతనివ్వాలని నాబార్డుకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య విజ్ఞప్తి చేశారు. ముంబైలోని నాబార్డు ప్రధాన కార్యాలయంలో సీజీఎం బి.రఘునాథ్‌తో గురువారం ఆమె సమావేశమయ్యారు. స్థానికంగా సాగు అయ్యే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు. వీరికి కావాల్సిన ముడిసరుకు(పంట)ను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు. వాటికొచ్చే లాభాల్లో కూడా రైతులకు కొంత భాగం ఇచ్చేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసిందన్నారు. స్థలాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, అవసరమైన ఆర్థిక చేయూతనందించాలని కోరారు. నాబార్డు సీజీఎం రఘునాథ్ మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నాబార్డు బృందం ఏపీలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) పెద్దపీట వేస్తోందని బ్యాంక్ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్‌కుమార్ జన్నావర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్‌లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు. 324 ఎఫ్‌పీవోలకు ప్రోత్సాహం... రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్ అంతా ఎఫ్‌పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. 200 వాటర్ షెడ్ పథకాలను ప్రోత్సహిస్తున్నాం. -
ఆర్థిక అవకతవకలకు ఆస్కారమివ్వొద్దు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సహకార వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్(నాబ్కాన్స్) కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. డీసీసీబీలు, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారందరికీ ఒకే రీతిలో జీతభత్యాలు ఉండాలన్న ఆలోచనతో హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు ఆస్కారమివ్వొద్దని ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌లకు సూచించారు. ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఆప్కాబ్) 59వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీలు పారదర్శకంగా పని చేయాలని సూచించారు. ప్రతి రూపాయి రైతుల కష్టార్జితమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మొహమాటానికో, తెలిసిన వారి కోసమో నిబంధనలను అతిక్రమించవద్దని చైర్మన్లకు హితవు పలికారు. నిబంధనలు పాటిస్తూ రైతులను ఆదుకునేందుకు ఉదారంగా రుణాలివ్వాలని ఆదేశించారు. బ్యాంకింగ్‌తో పాటు ఇతర సేవలందించడంపైనా ఆలోచన చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రూ.7,500 కోట్లతో మొదలైన ఆప్కాబ్ గతేడాదిలో రూ.21 వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే నంబర్ 1 సహకార బ్యాంక్‌గా నిలిచిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు. ఆప్కాబ్ పర్సన్ ఇన్చార్జ్ కమిటీ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ మాట్లాడుతూ.. రైతులకు మరింత చేరువగా ఆప్కాబ్‌ను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌తో పాటు రీజనల్ స్థాయిలో ప్రతిభ చూపిన విజయనగరం, గుంటూరు, కర్నూలు డీసీసీబీలకు అవార్డులను ప్రదానం చేశారు. శ్రీ రామలింగేశ్వర (తూర్పు గోదావరి), నందమూరి(కృష్ణా), కరవాడి (ప్రకాశం) పీఏసీఎస్‌లకు అవార్డులిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపర్చిన ఆప్కాబ్ ఉద్యోగులకు కూడా అవార్డులను బహూకరించారు. కార్యక్రమంలో సహకార మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ, నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్ఎస్ రెడ్డి, సీజీఎం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
'ఆర్బీకేలు' దేశానికే ఆదర్శం
(ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి, అమరావతి) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) వ్యవస్థ దేశానికే ఆదర్శమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకాలను రైతు ఇంటి ముంగిటే అందించడం దేశంలోనే సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్బీకేలను రైతులు సక్రమంగా ఉపయోగించుకుని ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన 50 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల జీవనరేఖలతో పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాగు వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తానీ విషయాన్ని చెప్పానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర వ్యవసాయ విధానానికి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నాబార్డ్ సంపూర్తిగా సహకరిస్తుందని, నిధులు సమకూర్చేందుకు వెనుకాడబోనని హామీ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్బీకేల పనితీరు బాగుంది ఆ మధ్య రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు నేనొక ఆర్బీకేను, రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పీవోను) స్వయంగా పరిశీలించా. అక్కడి రైతులు చెప్పిన దాన్నిబట్టి ఆర్బీకేల ప్రయోగం చాలా సక్సెస్ అయినట్టే. ఇప్పటికే రైతులు ఈ కేంద్రాల నుంచి లక్షలాది ఆర్డర్లు పెడుతున్నారు. ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలు తమ గ్రామానికి తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ఇలా జరగడమంటే రైతుకు చాలా వ్యయప్రయాసలు తప్పినట్టు. నాణ్యమైన ఉత్పాదకాలను 72 గంటల్లోగా రాబట్టడమే వ్యవసాయంలో కీలకం. అందుకే ఆర్బీకేల వ్యవస్థ ఆదర్శనీయం అంటున్నా. కాలాన్నిబట్టి రైతులు మారాలి మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులూ మారాల్సిన అవసరం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొద్దిమంది చేతుల్లో ఎక్కువ భూమి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 14 కోట్ల మంది రైతుల్లో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ తరహా రైతులు నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక్క పంట వేస్తే సరిపోదు. ఉన్న భూమిని పలు రకాలుగా వినియోగించుకోవాలి. ఆ భూమిలోనే ఆహారధాన్యాలు, పండ్లతోట, కూరగాయలు సాగుచేస్తూ.. కోళ్లు, పశువుల పెంపకం చేపట్టాలి. అప్పుడే రైతు సుస్థిరత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక పంట పోయినా మరొకటి ఆదాయాన్నిస్తుంది. అందువల్ల పంటల సరళి, ఆలోచనా ధోరణి మారాలి. వ్యవసాయ శాఖ, యూనివర్శిటీల కృషి పెరగాలి.. రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలన్న దానిపై ప్రధాన బాధ్యత వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలది. ఈ విభాగాల్లో ఉండే వాళ్ల కృషి ప్రధానం. ప్రస్తుతం కావాల్సింది ఉత్పత్తి కాదు. రైతు సాధికారత. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. ఏంచేస్తే రైతు ఆదాయం పెరుగుతుందో, పండించిన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఎలాగో రైతులకు చెప్పాలి. కమతాలు చిన్నవైన ప్రస్తుత తరుణంలో ఉన్న భూమిపై అదనపు ఆదాయం ఎలా సాధించవచ్చో చూపాలి. మాగాణిలోను నూనెగింజలు సాగుచేయవచ్చు వ్యవసాయ రంగంలో ఇప్పుడు హరిత, నీలి, వైట్, రెడ్ విప్లవాలు నడుస్తున్నా.. కావాల్సింది మాత్రం బ్రౌన్ విప్లవమే. నూనెగింజల్ని పండించడమే బ్రౌన్ విప్లవం. సుమారు రూ.1.10 కోట్ల విలువైన వంటనూనెల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ స్థాయిలో మన నూనెగింజల దిగుబడులు లేవు. రైతుకు అదనపు ఆదాయం రావాలంటే నూనెగింజల సాగు చేపట్టాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. నాబార్డ్ కూడా సహకారం అందిస్తుంది. ఏపీలో మాగాణి భూముల్లో కూడా నూనెగింజల్ని సాగు చేయవచ్చు. దీనిపై రైతులు దృష్టి సారించాలి. ఏయే రకాలు అనువైనవో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలదే భవిష్యత్.. సన్న, చిన్న, మధ్యతరహా రైతుల ప్రధాన సమస్య మార్కెటింగ్. వీళ్లకు బేరసారాలు చేసే శక్తి తక్కువ. అందువల్ల వీళ్లు సంఘటితం కావడం ఒక్కటే మార్గం. 10 మందికి తగ్గకుండా అన్నదాతలు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పీవోను) ఏర్పాటు చేసుకుంటే నాబార్డ్ సహకరిస్తుంది. ఈ సంఘం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించవచ్చు. ప్రాథమికంగా శుద్ధిచేసి నాణ్యత పెంచవచ్చు. వినియోగదారులను ఆకర్షించేలా ప్యాకింగ్ వంటివి చేయవచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇందుకు కావాల్సిన నైపుణ్య శిక్షణ కోసం సమీపంలోని నాబార్డ్ అధికారులను సంప్రదించవచ్చు. విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఉంది. రానున్న ఐదేళ్లలో కనీసం 4 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది నాబార్డ్ లక్ష్యం. నాబార్డ్ సంరక్షణ్ పథకం కింద సుమారు రూ.వెయ్యి కోట్లను ఎఫ్‌పీవోలకు రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రైతులు వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులను తీర్చిదిద్దుకోవాలన్నదే నా సలహా. వ్యవసాయ బిల్లులపై జరుగుతున్న ఆందోళనపై త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ ఉంది. ఆ బిల్లులను రద్దుచేసే అవకాశం ఉండకపోవచ్చనేది నా వ్యక్తిగత అభిప్రాయం. -
ఆంధ్రప్రదేశ్‌లో మోడరన్ బ్యాం‘కింగ్
సాక్షి, అమరావతి: ఒకప్పుడు నగదు విత్ డ్రా చేయాలన్నా.. నగదు జమ చేయాలన్నా గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. పనులన్నీ మానుకొని.. టోకెన్ నంబర్ ఎప్పుడు పిలుస్తారో అని కాచుకొని కూర్చోవాల్సి వచ్చేది. అదే ఏ అర్ధరాత్రో, అపరాత్రో డబ్బులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే.. పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల స్థానాన్ని వెనక్కి నెడుతూ.. పనులు వేగంగా, సులువుగా, సజావుగా జరిగేలా మోడరన్ బ్యాంకింగ్ దూసుకువచ్చింది. వీధివీధికి ఏటీఎంలు వెలిశాయి. యాప్‌ల రూపంలో చేతుల్లోకే బ్యాంకు సేవలు వచ్చేశాయి. చిటికెలో పనులు పూర్తయిపోతున్నాయి. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఏటీఎం, క్యూఆర్ కోడ్ తదితరాల ద్వారా పొందే ఆధునిక బ్యాంకింగ్ సేవలను రాష్ట్ర గ్రామీణ ప్రజలు అధికంగా వినియోగిస్తున్నారు. ఈ విషయం నాబార్డ్ ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే(ఎన్ఏఎఫ్ఐఎస్)లో వెల్లడైంది. మోడరన్ బ్యాంకింగ్, సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంతో పాటు ఎన్‌ఏఎఫ్ ఇండెక్స్‌లో దేశీయ సగటు కంటే మెరుగైన పనితీరును ఆంధ్రప్రదేశ్ కనబరిచింది. రూపే కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో ముందుకు.. ఎన్‌ఏఎఫ్ ఇండెక్స్‌లో దేశవ్యాప్త సగటు 0.337 పాయింట్లుగా ఉంటే ఏపీ మాత్రం 0.473 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది. మోడరన్ బ్యాంకింగ్ సేవల వినియోగంలో 0.703 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ విభాగాల్లో 1, 2, 3 స్థానాల్లో ఉన్నది గోవా, మణిపూర్, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలే. పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టేనని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్ లేదా, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించడంతో పాటు రూపే కార్డులు, ఆధార్‌తో అనుసంధానం, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. వారంతా ఇంటి వద్ద నుంచే బ్యాంకింగ్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,92,293 జన్‌ధన్ ఖాతాలుండగా.. అందులో 79 శాతం ఖాతాలకు రూపే కార్డులిచ్చారు. 89.15 శాతం ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. ఇక సంప్రదాయ బ్యాంకింగ్ సేవల వినియోగంలో ఏపీ 0.424 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, గోవా, హిమాచల్ప్రదేశ్లున్నాయి. పూర్తి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో మార్చాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలుత వైఎస్సార్ జిల్లాను 100 శాతం డిజిటల్ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంది. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 31,83,960 సేవింగ్ ఖాతాలుండగా.. అందులో ఇప్పటి వరకు 88 శాతం ఖాతాలకు రూపే కార్డులు మంజూరు చేశారు. 24 శాతం మందికి నెట్ బ్యాంకింగ్ సదుపాయం అందించగా.. 38 శాతం మంది మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. -
నెలాఖరులోగా ధాన్యం బకాయిలు చెల్లిస్తాం
సాక్షి, అమరావతి: ధాన్యం బకాయిల కింద కేంద్రం నుంచి రూ.5,056 కోట్లు రావల్సి ఉందని.. ఈ నెలాఖరులోగా రైతులకు బకాయిలు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. ఈనెల మూడో వారంలో రూ.1,600కోట్లు చెల్లిస్తామని చెబుతున్నారని ఆయనన్నారు. అలాగే, నాబార్డు నుంచి మరో రూ.1,600 కోట్లు రెండు, మూడ్రోజుల్లో (మంగళ, బుధవారాలు) రానున్నాయని.. ఇవన్నీ రాగానే రైతులకు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. తమది ప్రతిపైసా కచ్చితంగా చెల్లించే ప్రభుత్వమని.. 21 రోజుల్లోపే బకాయిలు చెల్లించాన్నది సీఎం జగన్ తనకు తాను విధించుకున్న విధానమన్నారు. 2018లో చంద్రబాబు నాటి బకాయిలను రైతులకు ఎగ్గొట్టి అధికారం నుంచి దిగిపోయిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో రూ.32వేల కోట్ల చెల్లింపు చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ధాన్యం కొనుగోళ్ల కింద రైతులకు ఏటా చెల్లించిన సగటు మొత్తం రూ.8,500 కోట్లు మాత్రమేనని కొడాలి నాని అన్నారు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక, ఈ రెండేళ్లలో ఏటా రూ.16 వేల కోట్ల చొప్పున మొత్తం రూ.32 వేల కోట్లు చెల్లించామన్నారు. తాము రైతుల డబ్బు వాడుకున్నామని బాబు, కొందరు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపడ్డారు. అలాగే, చంద్రబాబు హయాంలో (2014–2019 వరకు) ఏటా సగటున 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఏటా 83 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ధాన్యం సేకరించామని చెప్పారు. జగన్ పాలనలో పండే పంటతోపాటు కొనుగోళ్లు కూడా పెరిగాయన్నారు. రికార్డు స్థాయిలో పదవులు నామినేటెడ్ పదవుల భర్తీపై కొడాలి నాని స్పందిస్తూ.. ఒకేసారి 137 కార్పొరేషన్ పదవులు భర్తీచేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు ఏనాడూ ఒకేసారి ఇలా కార్పొరేషన్ పదవులు ప్రకటించలేదన్నారు. సామాజిక న్యాయం అంటే, బాబు కేవలం తన సామాజికవర్గానికే న్యాయం చేశారని ఎద్దేవా చేశారు. బాబుకు 2024లో విపక్ష హోదా కూడా రాదని.. అందుకే బిజేపీతో జత కట్టాలని చూస్తున్నారన్నారు. టీడీపీని బీజేపీలో కలిపేస్తే సరి అని నాని వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ నేతలు అర్ధంపర్ధంలేని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. ఆ పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్ కూడా రాదన్నారు. రాష్ట్రంలో ఓ మంత్రికి రూ.3 కోట్లతో కొందరు ఇల్లు కట్టించి ఇచ్చారంటున్నారని, ఆ వివరాలు చెబితే, ప్రభుత్వమే దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దు రైతులకు మొత్తం రూ.3,393 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 21 రోజులు దాటిన తర్వాత చెల్లించాల్సిన మొత్తం కేవలం రూ.1,204 కోట్లు మాత్రమేనన్నారు. రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి–సంక్షేమంతో ముందుకు సాగుతుంటే, రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలేదని చంద్రబాబు అర్థంపర్థంలేని విమర్శ చేస్తున్నారని నాని మండిపడ్డారు. బాబు తానా అంటే ఆయన అనుకూల మీడియా తందనా అంటూ విషప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. తన పార్టీ నేతలనే రైతులుగా చూపిస్తూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నెలాఖరులోగా రైతుల బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రి స్పష్టంచేశారు. -
పొదుపులో ఏపీ మహిళలే టాప్
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) ఇపుడు దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. 2019–20లో ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో నిలవగా... 2020–21లో ఏకంగా దేశంలో కెల్లా అగ్రస్థానం సాధించడం గమనార్హం. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పొదుపు పెరగడమే కాదు అప్పులూ తగ్గాయి స్వయం సహాయక సంఘాల పొదుపు పెరగడమే కాదు వారి అప్పులు కూడా తగ్గాయని నాబార్డు నివేదిక పేర్కొంది. 2019–20తో పోల్చితే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల పొదుపు ఏకంగా రూ.4,153.37 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో మన రాష్ట్ర సంఘాల పొదుపు 29.17 శాతం ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో అప్పులు రూ.5,940.97 కోట్ల మేర తగ్గాయి. ఈ రెండేళ్లలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేయడంతో పాటు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లించిన సంఘాలకు సున్నా వడ్డీ రాయితీలను అక్కచెల్లెమ్మల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో మహిళా సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొదుపు పెరగడం, అప్పులు తగ్గడంతో పురోగతి సాధించాయి. 2019 – 20లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉండగా.. 2020–21లో 69.12 శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదిక స్పష్టం చేసింది. పొదుపు సంఘాలు జీవం పోసుకున్నాయిలా.. స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు పైసా మాఫీ చేయకపోగా చివరికి సున్నా వడ్డీకి కూడా ఎగనామం పెట్టారు. ఫలితంగా స్వయం సహాయక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ఆ సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. గత సర్కారు తీరుతో స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని రెండేళ్లలోనే అమలు చేయడంతో స్వయం సహాయక సంఘాలు జీవం పోసుకున్నాయి. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను 4విడతల్లో చెల్లిస్తామని చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మంది మహిళలకు రూ.6,792.21 కోట్లు అందచేశారు. అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 87 లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద 2019–20లో రూ.1,400.8 కోట్లను చెల్లించారు. 2020–21లో సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.ఆసరా, సున్నావడ్డీతోపాటు చేయూత పథకం కూడా మహిళలు నిలదొక్కుకోవడానికి దోహదపడుతోంది. అలాగే రిసోర్స్ పర్సన్స్‌కి జీతాలు పెంచి మోటివేట్ చేయడమే కాక.. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
ఘరానా మోసగాడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల్ని మోసం చేసిన ఘరానా నిందితుడు దీపక్ కిండోను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు రూ.200 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన ఇతనిపై ఆయా రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం వెల్లడించారు. ఒడిశాలోని రూర్కెలా కేంద్రంగా పనిచేస్తున్న సంబంధ్ ఫిన్‌సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు దీపక్ ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. నాబార్డ్‌కు అనుబంధంగా పనిచేసే నవ్‌సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సంబంధ్ సంస్థ పేరుతో దీపక్ రూ.5 కోట్ల క్రెడిట్ ఫెసిలిటీ తీసుకున్నాడు. 2019 మార్చి ఒకటిన ఈ మొత్తాన్ని తన సంస్థ ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో నవ్‌సమృద్ధి నిర్వాహకులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తి పెరిగింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కోవిడ్ వేళ దేశంలో పంటల ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం నాబార్డ్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహారశుద్ధి రంగంలో విప్లవం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దేశ స్వయం సమృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరమని వ్యాఖ్యానించారు. గ్రామీణాభివృద్ధితోనే భారత స్వయం సమృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని సమీక్ష రేపు( మంగళవారం) ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీఎంలతో మోదీ మాట్లాడనున్నారు. ఇక మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా త్రిపురలో డెల్టాప్లస్ వేరియంట్ కేసులు రోజురోజుకు అధికమవుతున్న విషయం తెలిసిందే. -
మరో 332 మండలాల్లో డీసీసీబీ శాఖల ఏర్పాటు
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖమంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్‌లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్‌ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. డీసీసీబీ శాఖల విస్తరణ, ఇతర అంశాలపై ఆప్కాబ్‌ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో విజయవాడలో సమీక్ష జరిపారు. డీసీసీబీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు కౌలు రైతులకు అధికంగా రుణాలు ఇచ్చే విషయంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. దీని వల్ల ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో 675 మండలాలుండగా, వాటి పరిధిలో 416 బ్రాంచ్‌లున్నాయని తెలిపారు. వాటిలో 73 బ్రాంచ్‌లు పట్టణాలు, నగరాల్లో ఉన్నాయన్నారు. గడచిన మూడేళ్లలో 21 బ్రాంచ్‌లు కొత్తగా ఏర్పాటు చేయగా, ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 20,చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 4బ్రాంచ్‌లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆప్కాబ్ ద్వారా నాబార్డుకు పంపినట్టు అధికారులు వివరించగా, సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని మంత్రి సూచించారు. -
పీఏసీఎస్‌లకు 'ఆర్థిక' దన్ను
సాక్షి, అమరావతి: సాగులోనే కాదు వ్యక్తిగత అవసరాల్లో కూడా అన్నదాతలకు బాసటగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్, సొసైటీ)ను బహుళ సేవా కేంద్రాలు (మల్టీ సర్వీసెస్ సెంటర్స్)గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. వాటిలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సొసైటీని ‘వన్ స్టాప్ షాపు’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నాబార్డు చేయూతతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఆధ్వర్యంలో పనిచేసే 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ల పరిధిలో 1,992 పీఏసీఎస్‌లు అన్నదాతలకు సేవలందిస్తున్నాయి. వీటిని వైఎస్సార్ ఆర్బీకేలకు అనుబంధంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.1,584.61 కోట్లతో.. వ్యవసాయ సదుపాయాల నిధి కింద రూ.1,584.61 కోట్ల నాబార్డు రుణంతో పీఏసీఎస్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రతి సొసైటీకి కనీసం రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్ల వరకు నాబార్డు నుంచి రుణంగా అందించేలా చర్యలు చేపట్టింది. ఈ రుణంలో 10 శాతం పీఏసీఎస్‌లు భరిస్తే.. మిగిలిన మొత్తాన్ని 4 శాతం వడ్డీపై నాబార్డు అందిస్తుంది. గడువులోగా రుణాల్ని చెల్లిస్తే ఇంట్రస్ట్ సబ్వెన్షన్ కింద వడ్డీలో 3 శాతం సబ్సిడీ రూపంలో సొసైటీలకు తిరిగి ఇస్తారు. ఈ లెక్కన ఒక్క శాతం వడ్డీకే పీఏసీఎస్‌లకు రుణాలు అందుతాయి. తొలి దశలో రూ.659.48 కోట్లతో 1,282 పీఏసీఎస్‌ల్లోను, రెండో దశలో రూ.925.13 కోట్లతో 710 పీఏసీఎస్‌ల్లోను మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తొలివిడత పనులను 2021–22 ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సొసైటీల్లో కల్పించే మౌలిక సదుపాయాలివే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల కింద ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు, గిడ్డంగులు, ప్యాకింగ్ హౌస్‌లు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్స్, లాజిస్టిక్ సౌకర్యాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, రైపెనింగ్ (మగ్గించే) చాంబర్స్, కమ్యూనిటీ ఫార్మింగ్ ప్రాజెక్ట్ కింద సేంద్రియ ఉత్పత్తులు, బయో స్టిమ్యులెంట్ ప్రొడక్షన్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక సభ్యుల అవసరాలను బట్టి అద్దె ప్రాతిపదికన అందించే లక్ష్యంతో అధునాతన వ్యవసాయ పరికరాలతో వ్యవసాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల అంచనా వ్యయంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రూ.కోటి నుంచి రూ.2.50 కోట్ల వరకు హైటెక్, హై వేల్యూ ఫార్మ్ పరికరాలతో హబ్‌లు ఏర్పాటు చేస్తారు. వీటి కోసం ఇచ్చే రుణాలపై 40 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. పీఏసీఎస్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ద్వారా నాబార్డుకు పంపించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. -
ఆన్లైన్ చెల్లింపులకే సై
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ ఆరి్థక లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని నాబార్డ్ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. కోవిడ్–19 లాక్డౌన్, ఆ తరువాత ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధికమంది నగదు లావాదేవీలు, కార్యకలాపాలకు డిజిటల్, ఆన్‌లైన్‌లనే ఎంచుకున్నారు. 2019 డిసెంబర్లో జరిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి. గతంలో పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల చలామణి సమయంలో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్లో ఆర్థిక కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికన్నా ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్‌తో పాటు ఆన్లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లను అనుమతిస్తుండటంతో రిటైల్ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్ నివేదికలో పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్లైన్ చెల్లింపులు విస్తరిస్తున్నాయని తెలిపింది. -
మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మత్స్య రంగానికి రూ.3,450.92 కోట్ల రుణం అవసరమని నాబార్డ్ అంచనా వేసింది. ఇది గత ఏడాది కన్నా 26.81 శాతం అధికమని పేర్కొంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డ్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటోందని ప్రశంసించింది. మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని పెంచిందని, వేట నిషేధ సమయంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరుతో వరుసగా రెండేళ్లు వారికి ఆర్థికసాయం అందించిందని తెలిపింది. ఆక్వా రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుందని, రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన సర్టిఫైడ్ ఇన్పుట్స్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి రుణ అవసరం గతంతో పోలిస్తే బాగా పెరిగిందని నాబార్డ్ పేర్కొంది. -
పోలవరానికి రూ.333 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.333 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బహిరంగ మార్కెట్లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమీకరించాలని నాబార్డును ఆదేశించింది. నాబార్డు నిధులను సేకరించి ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ), పీపీఏ (పోలవరంప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన బిల్లులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకు పంపింది. వాటిని పరిశీలించిన పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్ చేయాలని తాజాగా ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలిస్తున్న కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదముద్ర వేసి, కేంద్ర ఆర్థికశాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకు రూ.17,153.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత చేసిన వ్యయం రూ.12,422.83 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.10,741.46 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా రూ.1,681.37 కోట్లను కేంద్రం బకాయిపడింది. రూ.1,681.37 కోట్లను రీయింబర్స్ చేయాలని పీపీఏకు రాష్ట్ర జలవరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలిస్తున్న పీపీఏ గత నెల రూ.333 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫార్సు చేసింది. ఈ నెలలో రూ.418 కోట్లను రీయింబర్స్ చేయాలని ప్రతిపాదనలు పంపింది. ఈ 418 కోట్లు రీయింబర్స్ చేసినా.. ఇంకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.930.37 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. -
పశు సంవర్ధకానికి రూ.12,606 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సహకార డెయిరీలను ప్రోత్సహించేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తగిన తోడ్పాటునందిస్తామని నాబార్డు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణ ఆవశ్యకత ఉన్నట్లు నాబార్డు అంచనా వేసింది. 2021–22లో మొత్తంగా పశు సంవర్ధక రంగానికి రూ.12,606 కోట్ల మేర రుణ ఆవశ్యతక ఉంటుందని రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 15.87 శాతం ఎక్కువని తెలిపింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. మొత్తం దేశంలోనే 4వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2019–20లో 152.63 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు తెలిపింది. దీని విలువ రూ.57,433 కోట్లుగా పేర్కొంది. ఏపీలో రోజూ 380 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. ఇందులో 46 శాతం రాష్ట్ర సొంత అవసరాల కోసం.. మరో 34 శాతం అసంఘటిత రంగాలు వినియోగిస్తుండగా, 18 నుంచి 20 శాతం సహకార, ప్రైవేట్ పాల ఉత్పత్తుల రంగాలకు వెళ్తున్నాయని నాబార్డు పేర్కొంది. డెయిరీ అభివృద్ధిపై దృష్టి.. పాడి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని.. ఈ నేపథ్యంలో తాము కూడా డెయిరీ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు నాబార్డు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మహిళలకు అందించిన ఆర్థిక సాయానికి తోడుగా బ్యాంకుల నుంచి కూడా రుణాలు మంజూరు చేయించి పశు సంపదను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే మహిళా పాడి రైతులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు వారి నుంచి ఎక్కువ ధరకు పాలు కొనుగోలు చేసేలా.. అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో అమూల్ సంస్థ ఇప్పటికే ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో పాల సేకరణ చేస్తోంది. అలాగే మహిళా డెయిరీ సహకార సంఘాలకు పూర్తి ప్రోత్సాహం అందించే విధంగా 9,899 గ్రామాల్లో ఆటోమేటిక్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాబార్డు కూడా ఈ ఆర్థిక సంవత్సరం పాడి అభివృద్ధికి రూ.8,232.33 కోట్ల మేర రుణాల ఆవశ్యకత ఉన్నట్లు అంచనా వేసింది. -
ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్‌కు రూ.3,766 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2021–22లో ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.3,766.25 కోట్ల రుణాలు అందించాలని నాబార్డు అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా 6.2 శాతం అధికమని తెలిపింది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలతో పాటు ఆక్వా, డెయిరీ, విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల పరిధిలోనే మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాల్లో డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ–మార్కెటింగ్, జనతా బజార్లు తదితర సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే 13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లపై తాము కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు నాబార్డు ఆ ఫోకస్ పత్రంలో పేర్కొంది. -
స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో..!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) రాష్ట్రంలోని రైతు ఉత్పత్తుల సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) స్వయం సమృద్ధిని సాధించేందుకు కార్పొరేట్ సంస్థలతో కలిసి మార్కెటింగ్ అవకాశాల కల్పన, ఇతరత్రా మెరుగైన వ్యవస్థ ఏర్పాటు విషయంలో కీలక భూమికను పోషించనున్నట్టు నాబార్డ్ రాష్ట్ర సీజీఎం వైకే రావు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంచేందుకు ఎఫ్‌పీవోలు ఒక్కటే మార్గమని, అందువల్లే వాటిని మరింత ప్రోత్సహించేందుకు తమ సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని 330 ఎఫ్‌పీవోలకు అవసరమైన సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళుతున్నట్టు, 2020–21లో నవకిసాన్ ద్వారా 57 ఎఫ్‌పీవోలకు నాబార్డ్ క్రెడిట్ లింకేజీని ఇచ్చిందన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి అవసర మైన సహాయ సహకారాలను నాబార్డ్ అందిస్తుందని చెప్పారు. మొత్తంగాచూస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో నాబార్డ్ రాష్ట్రానికి రూ.20,549 కోట్ల మేర సహకారాన్ని, మద్దతును అందించినట్టు, ఇది 2019–20తో పోల్చితే 25.09 శాతం ఎక్కువని ఒక ప్రకటనలో తెలిపారు. 2020–21లో బ్యాంకులకు రూ. 13,915.22 కోట్ల పంటరుణాలు, టర్మ్లోన్ల కింద అందజేసినట్లు, అందులో రూ.వందకోట్లు నాబార్డ్ మద్దతు అందించిన వాటర్‌షెడ్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రానికి రూ. 6,633 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్కింద మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం రూ. 4,600 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు రూ. 2,500 కోట్లు క్యాష్ క్రెడిట్ కింద మంజూరు చేసి పంపిణీ చేసినట్టు వైకేరావు వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సాహం -
ఎంఎస్ఎంఈలకు రూ.47,402 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) రూ.47,402.15 కోట్ల రుణాలు ఇవ్వాలని నాబార్డు ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర ఫోకస్ పత్రంలో అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంచాలని నిర్ణయించిందని ఆ పత్రంలో పేర్కొంది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు.. రూ.3,900 కోట్ల రుణాలను వైఎస్సార్ నవోదయం పేరిట వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నాబార్డు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకుందని.. రైతులకు, ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థికసాయం అందించాలని నాబార్డు సూచించింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. 2020–23 రాష్ట్ర పారిశ్రామిక విధానంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని నాబార్డు పేర్కొంది. -
రాష్ట్రానికి రూ.2.31లక్షల కోట్ల రుణసాయం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు బ్యాంకుల ద్వారా ప్రాధాన్యతా రంగాలకు రూ.2.31 లక్షల కోట్ల రుణ సహాయం అందించేందుకు అవకాశమున్నట్లు నాబార్డు (జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు)రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ వెల్లడించింది. దీనిలో వ్యవసాయ రంగానికి రూ.1.57 లక్షల కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.47,402 కోట్లు, ఎగుమతులు క్రెడిట్ కింద రూ.2,880 కోట్లు, విద్యా రంగానికి రూ.1,584 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.14,335 కోట్లు, రెన్యువల్ ఎనర్జీకి రూ.461 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వింగ్ బ్యాంకు క్రెడిట్ కింద రూ.513 కోట్లు, ఇతర రంగాలకు రూ.6,418 కోట్ల రుణాలు అందించేందుకు అవకాశముందని ఫోకస్ పేపర్లో పేర్కొన్నారు. ఈ పేపర్‌ను రిఫరెన్స్ డాక్యుమెంట్‌గా చేసుకుని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్టేట్ క్రెడిట్ సదస్సు శుక్రవారం నాబార్డు ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ ఫోకస్ పేపర్ 2021–22ను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలకు తోడ్పాటునందించాలి : మంత్రి కన్నబాబు అనంతరం.. వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రాథమిక రంగాల అభివృద్ధితోపాటు రైతుల ఆర్థిక ప్రయోజనాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టంచేశారు. వీటి సాధనకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► జనతా బజార్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు కూడా బ్యాంకులు సహకరించాలి. ► అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ రిటైల్ చైన్ అభివృద్ధికి, గ్రామస్థాయిలో వ్యవసాయానికి సంబంధించి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికీ సహకరించాలి. ► అదే విధంగా.. పాడి పరిశ్రమాభివృద్ధి రంగానికి, కౌలు రైతులకు మానవతా దృక్పథంతో వ్యవహరించి తగిన సహాయం చేయాలి. ► రాష్ట్ర ప్రగతికి నాబార్డు ఎంతగానో సహాయ పడుతోంది. ఇందుకు నాబార్డు చైర్మన్ గోవిందరాజులుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాబార్డు తోడ్పాటు అభినందనీయం : సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి వివిధ బ్యాంకులు, నాబార్డు అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు. నాబార్డు కేవలం వ్యవసాయ రంగానికే కాక నీటిపారుదల, విద్య, వైద్య రంగాల్లో కూడా సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలుకు మరింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని సీఎస్ ఆకాంక్షించారు. నాబార్డు రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. లక్ష్యానికి మించి సాయం: నాబార్డు సీజీఎం నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుదీర్‌కుమార్ జొన్నావర్ మాట్లాడుతూ.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రాష్ట్రానికి రూ.27,992 కోట్ల సహాయం అందించాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి రూ.32 వేల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా నాబార్డు తనవంతు తోడ్పాటును అందిస్తోందన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం కంటే 9 శాతం అధికంగా ప్రాధాన్యతా రంగంలో రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా స్టేట్ ఫోకస్ పేపరును రూపొందించామన్నారు. సమావేశంలో నాబార్డు జీఎం బి ఉదయభాస్కర్ అజెండా అంశాలను వివరించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్బీఐ జీఎం సుందరం శంకర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, స్పెషల్ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి, రిజి్రస్టార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఎ.బాబు తదితరులు మాట్లాడారు. -
‘మనబడి నాడు–నేడు’కు చేయూతనిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మనబడి: నాడు– నేడు’కు నిధులు ఇస్తామని నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు తెలిపారు. ఈ పథకానికి వచ్చే ఏడాది రూ.2 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. అదేమంత కష్టం కాదన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకనుగుణంగా రాష్ట్రంలోని పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాబార్డ్ చైర్మన్ హోదాలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన డాక్టర్ జీఆర్ చింతలతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) శుక్రవారం విజయవాడలో మీట్ ది మీడియా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మనబడి: నాడు – నేడును నాబార్డ్ విశేషంగా అధ్యయనం చేసిందన్నారు. ఇప్పటికే రూ.12 వందల కోట్లు ఇచ్చామని చెప్పారు. కూలడానికి సిద్ధంగా ఉన్న స్కూళ్లను బాగు చేసే ఈ పథకం చాలా బాగుందన్నారు. పిల్లలందరూ ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లే పరిస్థితి రావాలని చెబుతూ తాను సైతం సర్కార్ స్కూళ్లలోనే చదివానని గుర్తు చేసుకున్నారు. సహకార సంఘాల ఆధునికీకరణకు పెద్దపీట దేశంలో 95 వేల సహకార సంఘాలను ఆధునికీకరించి మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చనున్నట్టు జీఆర్ చింతల తెలిపారు. తొలిదశలో 5 వేల సంఘాలను మల్టీ సర్వీస్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించగా.. అందులో ఇప్పటికే 3,500 సంఘాలకు నిధులు మంజూరు చేశామన్నారు. ఏపీకి రూ.30 వేల కోట్లు, తెలంగాణకు రూ.20 వేల కోట్లు రుణాలు ఇచ్చామని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి.ఆంజనేయులు, నాబార్డ్ రాష్ట్ర శాఖ సీజీఎం సుధీర్‌కుమార్ జన్నావార్ పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులు భేష్: నాబార్డు చైర్మన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ చాలా బావున్నాయని, ఈ ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని నాబార్డు చైర్మన్ జీఆర్ చింతల స్పష్టం చేశారు. కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ తపనతో ఉన్నారని, ఆయన నవరత్నాల సీఎం అని ప్రశంసించారు. ముఖ్యమంత్రితో అనేక అంశాలపై చర్చించానని, సీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాల వల్ల వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. మంచి చదువు, మంచి వైద్యం ప్రజలకు అందు తాయన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు ఆర్థిక సాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రంలో విద్య, వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించి.. ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై నా బార్డు చైర్మన్ స్పందిస్తూ.. వీటిని పరిశీలించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ చాలా ముఖ్యమైన రంగం అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉం దని, ఈ రంగంలో తాము ఏరకంగా సహా య పడగలమో ఆలోచిస్తామని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నాబార్డు చైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం అంటూ జీఆర్ చింతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానించారు. అధికారులు నాబార్డ్ చైర్మన్‌కు విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి. ఈ రంగాలకు రుణ సాయం అందించండి ► ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కింద 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. తొలివిడతలో నాడు– నేడు కింద స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు రూ.652 కోట్లు ఇచ్చింది. మిగిలిన స్కూళ్లలో పనుల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాలి. ► వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. ప్రజారోగ్య రంగంలో కూడా నాడు– నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. వీటికి తగిన విధంగా రుణ సహాయం అందించాలి. ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆర్బీకేలు, మల్టీపర్పస్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు, జనతా బజార్లను తీసుకొస్తున్నాం. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టాం. వీటన్నింటికీ సహకరించాలి. ► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సహకార రంగం.. బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను పునర్ వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్కాన్స్) చేసిన సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు అంగీకరించారు. పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్ చేయించాలని, రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని చెప్పారు. మూడవ పార్టీతో (థర్డ్ పార్టీ) స్వతంత్రంగా విచారణ చేయించాలని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఏబీసీఓఎన్ఎస్ – నాబ్కాన్స్) సిఫార్సులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని, 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని చెప్పారు. రుణాలు తక్కువగా ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంట రుణాలకే పరిమితం అవుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. డీసీసీబీల పనితీరు మెరుగవ్వాలి డీసీసీబీల్లో మెరుగైన పనితీరు ఉండాలని, వీటి నుంచి చక్కగా రుణాలు అందాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రుణాలు ఎవరికి ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి అనే దానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలని, ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులకు ఆమోదం తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంకుల మార్కెట్ షేర్ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించారు. ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఎంఎస్ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల భావం పోవడంతో పాటు విశ్వాసం, నమ్మకం కలిగించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలని, ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఉండకూడదన్నారు. డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగడంతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు రావాలని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, దీనివల్ల ఆ కర్మాగారాలకు ఊరట లభిస్తుందని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు వ్యవసాయం అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీ పర్పస్ సెంటర్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్ 15 కల్లా టెండర్ల ఖరారు చేసి, ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు వెల్లడించారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్పస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్లు, డ్రైయింగ్ యార్డులు, కోల్డు రూమ్‌లు, పంటల సేకరణ కేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ బాబు ఏ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల వెల్లువతో రైతులకు మంచి రేటు పాల వెల్లువ కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. పాల వెల్లువతో మార్పు ఇదీ.. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఫార్సులపై చర్చ సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి. ► సమగ్ర బ్యాంకు సేవల కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలి. ► పీఏసీఎస్‌లు క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలు కూడా అందించాలి. ► పీఏసీఎస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలి. ఇందులో భాగంగా ప్రతి 3 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలి. ► ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలి. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలి. ► బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలి. బోర్డులో సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా ఏపీసీఎస్ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలి. పీఏసీఎస్‌లోనూ మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలి. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలి. -
బడి పిల్లలు పనులకు వెళ్తున్నారు: హరీశ్ రావు
సాక్షి, హైదరాబాద్ : నాబార్డ్ ఉద్దేశ్యం మొత్తం రైతు శ్రేయస్సు, రైతు అభివృద్ధికి లబ్ది చేకూరెందుకు కృషి చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాబార్డ్ ‘ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2021’ శుక్రవారం హోటల్ మారి గోల్డ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నాబార్డ్ ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్త బ్యాంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది కూడా క్రెడిట్ ఏక్షన్ ప్లాన్ క్షేత్ర స్థాయిలో జరగాలని చెప్పినట్లు పేర్కొన్నారు. గత ఏడాది చెప్పిన అంశాలన్నీ చేశామని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే గత పాలకుల పాలనలో అనేక సమస్యలు ఉండేవని, కానీ కేసీఆర్ నాయకత్వం వచ్చిన తరువాత 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తోందన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భీమా లాంటివన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్ తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అనతి కాలంలోనే పూర్తయ్యాయని, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల బెడద తప్పిందన్నారు. లేబర్, గోడౌన్స్, ప్యాకేజింగ్ లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయన్న మంత్రి కొత్త సమస్యలపై నాబార్డ్ దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ కూలీలు దొరక్క బడి పిల్లలు పనులకు వెళ్తున్నారని, రైతు పిల్లలను ఎంకరేజ్ చేయాలని అన్నారు. పత్తి తీయడానికి కొత్తగా మెషీన్లు వచ్చాయని, వాటి సబ్సిడీ కోసం ఎలా ప్రయత్నం చేయాలనేది ఆలోచించాలని సూచించారు. ఇంతకుముందు సీజన్ అయిపోయిన డబ్బులు రాకపోయేవని, కానీ ఇప్పుడు సీజన్ రాకముందే రైతులకు డబ్బులు అందుతున్నాయని, వారికి మెసేజ్‌లు కూడా వెళ్తున్నాయన్నారు. -
జలకళ పెంపు.. నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: బీడువారిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఉచిత బోర్లు వేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎక్కువ మంది రైతులకు లబ్ధి కలిగేలా.. పథకం ద్వారా అధిక ప్రయోజనం కలిగేలా నిబంధనలను మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నాబార్డు మార్గదర్శకాలను అనుసరించి తొలుత వైఎస్సార్ జలకళ పథకానికి నిబంధనలు రూపొందించారు. అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల వల్ల ఈ నిబంధనలు ప్రతికూలంగా మారాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భూగర్భ జల శాఖ గణాంకాలను విశ్లేషించిన అనంతరం నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆ మేరకు మార్పులు చేసేందుకు నిర్ణయించింది. సమస్యలు ఏమిటంటే.. వాస్తవానికి 200 మీటర్ల పరిధిలో వ్యవసాయ బోరు ఉంటే మరో బోరు మంజూరు చేయకూడదు. రాతి నేలల్లో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదనే నిబంధన ఉంది. ఇసుక నేలల్లో బోరు లోతుపై పరిమితి లేదు. కానీ.. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతాల్లో రాతి నేలలే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,200 అడుగల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. దీంతో ఇక్కడ 120 మీటర్ల నిబంధన వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. అలాగే ఒక రైతు భూమిలో బోరు ఉంటే పక్క రైతు భూమి వంద మీటర్ల పరిధిలోనే బోరు వేయాల్సి ఉంటుంది. అందువల్ల కనీసం 200 మీటర్ల దూరం దాటిన తర్వాతే మరో బోరు వేయాలనే నిబంధన రైతులకు అశనిపాతంగా మారింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పథకం నిబంధనలు సవరించాలని నిర్ణయించింది. తగిన సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కేంద్ర భూగర్భ జల శాఖ , గ్రామీణ నీటి సరఫరా, జల వనరులు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీకి రాష్ట్ర భూగర్భ జలశాఖ సంచాలకులు సభ్య కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సులతోపాటు రాష్ట్ర భూగర్భ జలశాఖ ఇచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని నిబంధనల్ని ప్రభుత్వం సవరించనుంది. నిబంధనల్ని సవరిద్దాం ‘ప్రతి రైతుకూ ఉపయోగపడేలా వైఎస్సార్ జలకళ నిబంధనలను సవరిద్దాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిఫార్సులు సమర్పించండి. రాయలసీమలో ఒక్కో రైతు 1,200–1,400 అడుగుల లోతు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితిని కళ్లారా చూశాం. వీటిని పరిగణనలోకి తీసుకోండి’ అని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. -
ఏపీ మహిళలే అత్యధికంగా పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి. నిరర్ధక ఆస్తులు తగ్గిపోయాయి. ఇదంతా ఏడాదిన్నర కాలంలోనే జరిగిందని నాబార్డు నివేదిక వెల్లడించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు నివేదిక రూపొందించింది. చంద్రబాబు సర్కారు తీరు వల్ల స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం కావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆ సంఘాలు తిరిగి గాడిలో పడటాన్ని నాబార్డు నివేదిక ప్రతిబింబిస్తోంది.క పేర్కొంది. రుణాల్లోనూ టాప్ దేశం మొత్తం మీద 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక పేర్కొంది. 2018–19 ఆర్థిక ఏడాదిలో 26.98 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.58,317 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, 2019–20లో 31.46 లక్షల సంఘాలకు రూ.77,659 కోట్లు మంజూరైంది. ► ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని, అత్యధికంగా దక్షణాది రాష్ట్రాల్లోనే రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల మంజూరు ఎక్కువగా ఉందని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోందని నివేదిక పేర్కొంది. ► 2018–19లో దేశ వ్యాప్తంగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి సగటున బ్యాంకులు 2.16 లక్షల రుణం మంజూరు చేయగా 2019–20లో 2.47 లక్షల రుణం మంజూరు చేశాయి. ఈ లెక్కన 14.35 శాతం వృద్ధి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే సగటున ఒక్కో సంఘానికి 3.35 లక్షల రుణం మంజూరు అయింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 15 శాతం పెరుగుదల. ఏపీలో అయితే ఏకంగా సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల రుణం మంజూరైందని నివేదిక స్పష్టం చేసింది. బాబు సర్కారుకు, ఇప్పటి జగన్ సర్కారుకు ఇదీ తేడా ► స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మాఫీ తూచ్ అన్నారు. దీంతో ఆయా సంఘాల మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ► ఈ తరుణంలో 2019 మే లో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మేనిఫేస్టోలో చెప్పిన మాటలను కొద్ది నెలల కాలంలోనే అమలు చేయడంతో తిరిగి స్వయం సహాయక సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. 2020 మార్చి 31 నాటికి నిరర్థక ఆస్తులు తగ్గిపోయాయని, 2019–20లో సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉందని నివేదిక తెలిపింది. సీఎం నిర్ణయం వల్లే ముందడుగు – పొదుపులో, రుణాలు పొందడంలో రాష్ట్రానికి చెందిన స్వయం సహాయక సంఘాలు ముందుండటానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలే. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను నాలుగు విడతల్లో ఇస్తానని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మహిళలకు రూ.6,792.21 కోట్లు ఇచ్చారు. – సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 90.37 లక్షల మహిళకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాలు గాడిలో పడి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. – ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మహిళలు వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో సర్కారు ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం
సాక్షి, అమరావతి: కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత మత్స్య రంగంపై ప్రభావం పడింది. దేశంలో కోవిడ్–19 లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై పడిన ప్రభావంపై నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల ఉత్పాదకత తగ్గడమే కాకుండా లాక్ డౌన్ సమయంలో ఉత్పత్తుల ధరలు తగ్గిపోయినట్లు సర్వే పేర్కొంది. దేశంలో 54 శాతం జిల్లాల్లో ధరలు తగ్గిపోగా 23 శాతం జిల్లాల్లో ధరలు యధాతథంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. లాక్డౌన్లో మార్కెట్లతో పాటు ప్రధాన ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు చెందిన రంగాలు మూత పడటంతో పాటు రవాణా నిలిచిపోవడం వల్ల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో ధరలు పడిపోయినట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్‌లో నెలలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రభావం అత్యధికంగా ఉన్నట్లు తేలింది. జంతు ఉత్పత్తులను వినియోగిస్తే కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారంతో పౌల్ట్రీ రంగం ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. ► మత్స్య, మేకలు, గొర్రెల ఉత్పత్తుల వినియోగం భారీగా పడిపోవడంతో ఈ రంగాల ఉత్పాదకత భారీగా తగ్గిపోయింది. పాల డిమాండ్‌పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ, డెయిరీ ఇతర ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగానే ఉంది. ► హోటల్స్, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, పార్లర్లు మూత పడటం, వీధి వ్యాపారాలు నడవక పోవడం వల్ల స్వీట్లు, పన్నీరు, క్రీమ్ ఉత్పత్తుల డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో పాడి రైతుల పాలకు సరైన ధర లభించలేదు. పర్యవసానంగా పాడి రైతులు తమ పశువులకు గ్రీన్, డ్రై దాణాను ఇవ్వడం తగ్గిచేశారు. తద్వారా పాల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ► ఒక్క ఏప్రిల్ నెలలోనే డెయిరీ ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగా పడింది. అయితే ఏప్రిల్ నాటికే రబీ పంటలు వచ్చేయడంతో వ్యవసాయ ఉత్పత్తులపై లాక్ డౌన్ ప్రభావం తక్కువగానే ఉంది. -
పోలవరానికి రూ.2,234.28 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్మెంట్ కింద ఎన్‌డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమ చేయనుంది. కాగా 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి . ఇప్పటివరకు రూ.8,507 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇంకా రూ.1788 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. -
పోలవరానికి రూ.2,234.288 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరఫున రీయింబర్స్మెంట్ నిమిత్తం రూ.2,234.288 కోట్లను మంజూరు చేస్తూ నాబార్డు డీజీఎం వికాశ్ భట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధులను జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. ఈ రూ.2,234.288 కోట్ల రీయింబర్స్మెంట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకు.. అంటే 2016 సెప్టెంబర్ 8 వరకు పోలవరానికి కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించి విడుదల చేసేది. ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో నాబార్డు నుంచి రుణం తీసుకుని పోలవరానికి నిధులిస్తామంటూ మెలిక పెట్టింది. అప్పటినుంచి అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేస్తూ వస్తోంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730.71 కోట్లను ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,529.42 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.8,614.16 కోట్లను నాబార్డు రీయింబర్స్ చేస్తూ ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏలకు విడుదల చేసింది. అందులో పీపీఏ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. దీంతో మిగతా రూ.4,022.16 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో రూ.2,234.288 కోట్లను రీయింబర్స్ చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. -
మల్లన్నసాగర్‌కు రూ.4,600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రుణం ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయడానికి రూ. 4,600 కోట్ల రుణం ఇవ్వనుంది. దీనిపై ప్రభుత్వం నాబార్డ్‌తో త్వరలోనే ఒప్పందం చేసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులను రూ.6,805 కోట్లతో ఆరంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనుల్లో ఏకంగా 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ కింద అన్ని ప్రధాన చానళ్ల ద్వారా మొత్తం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 9.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. -
సాగిపోదాం.. సాఫీగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ► జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ► రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► ఆర్ అండ్ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు. రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. ► గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. ► కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ జిల్లాలో పాడేరు నుంచి సుజనాకోట వరకు రూ.20 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. పెదబయలు మండలం దూడకోట పంచాయతీ కేంద్రం నుంచి అత్యంత మారుమూల జాముగూడ వరకు రూ.13.21 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో కెందుగూడ వరకు, ముంచంగిపుట్టు మండలం మారుమూల లబ్బూరు జంక్షన్ నుంచి మారుమూల గ్రామం బుంగాపుట్టు వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట–దోన్బాయి–వీరఘట్టం వరకు 25 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.24 కోట్లతో చేపట్టారు. డిసెంబర్‌కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రహదారులు వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాధాన్యత క్రమంలో రోడ్లను నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే రోడ్లు గుర్తించి వాటి మరమ్మతులు, నిర్వహణ చేపడుతున్నాం. డిసెంబర్ నాటికల్లా రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. గ్రామీణ రహదారులను విస్తరించడం, నిర్వహణ కోసం నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. రూ.1,089 కోట్ల ప్రతిపాదనల్లో రూ.440 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపట్టే ప్రణాళికలున్నాయి. – వేణుగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
పరపతి సంఘాలకు నాబార్డ్ చేయూత!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నాబార్డ్ చేయూతను అందిస్తోంది. రైతులకు విత్తనాలు మొదలు అన్ని రకాల సేవలు అందిస్తున్న వీటిని మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం రూ.3,321 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ► సంఘాల ఆధ్వర్యంలో గోడౌన్లు, కోల్డ్ రూములు, కలెక్షన్ సెంటర్లు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలతోపాటు సంఘాలకు అదనపు ఆదాయం లభిస్తుంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని సమగ్ర నివేదికలను అధికారుల ద్వారా నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందే ఏర్పాటు చేశారు. ► ఈ ప్రతిపాదనలకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు తొలి విడత రూ.1,250 కోట్ల విడుదలకు అంగీకరించారు. ► మరే రాష్ట్రంలో లేని విధంగా నామమాత్రపు వడ్డీకి ఈ రుణం లభించనుంది. నాలుగు శాతం వడ్డీకి రుణం ఇస్తున్నప్పటికీ సకాలంలో చెల్లిస్తే మూడు శాతం రాయితీ ఇవ్వడానికి నాబార్డ్ అంగీకరించింది. దీంతో కేవలం 1 శాతం వడ్డీతోనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రుణం పొందనున్నాయి. సహకార సంఘాలను పటిష్టం చేయడానికే.. ► రాష్ట్రంలో 2,043 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉంటే.. వీటిలో 800 నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ► ఈ సంఘాలు రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించలేకపోతున్నాయి. అదే విధంగా రుణాలను కూడా ఇవ్వలేకపోతున్నాయి. ► వీటితోపాటు మిగిలిన సంఘాలను ఆర్థికంగా పటిష్టపరిచి రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం రెండు నెలల క్రితం రూ.3,321 కోట్లకు డీపీఆర్‌లను రూపొందించింది. ► ఇందులో గోడౌన్ల నిర్మాణాలకు రూ.1,893 కోట్లు, పంటలను ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలకు రూ.207 కోట్లు, పీపీసీ ఎక్విప్మెంట్, డయ్యర్లు తదితర యాంత్రిక పరికరాలకు రూ.1,009 కోట్లు, ప్రొక్యూర్మెంట్, ఈ–ప్లాట్‌ఫామ్‌లకు రూ.212 కోట్లను కేటాయించింది. ► నాబార్డ్ రుణం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఆసక్తి, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంఘాలు.. గోడౌన్లు, కోల్డ్ స్టోర్ రూమ్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తే, వాటికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► సోమవారం ఇదే అంశంపై చర్చలు జరపడానికి సహకార, మార్కెటింగ్, నాబార్డ్ అధికారులు సమావేశం కానున్నారు. -
త్వరలో ‘క్రెడిట్ గ్యారంటీ స్కీం’
సాక్షి, హైదరాబాద్: నాబార్డ్ ఆధ్వర్యంలో రాబోయే 4, 5 నెలల్లో వ్యవ సాయరంగంలో ‘క్రెడిట్ గ్యారంటీ స్కీం’ను ప్రారం భించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ గోవిందరాజులు చింతల తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయంలో ఇలాంటి స్కీం లేదని, తొలిసారి నాబార్డ్ ప్రవేశ పెట్టబోతోందని వెల్లడించారు. దీనిద్వారా 85% గ్యారంటీ ఇస్తా మని, దీంతో బ్యాంకులు అనుమానాలు లేకుండా సొసై టీలు, తదితరాలకు సులభంగా రుణాలిచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ‘వ్యవసాయ రంగ వ్యవస్థలోనే బృహత్తర మార్పులకు అవసర మైన చర్యలు చేపడుతున్నాం. రైతులకు రెండింతల ఆదాయం వచ్చేలా సాగు ఖర్చులు తగ్గే దిశగా చర్యల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వ్యవసాయాన్ని మార్కెట్ కేంద్రీకృతంగా చేసేం దుకు గోడౌన్ల సంఖ్య గణనీయంగా పెంచి స్టోరేజీ నిల్వల సామర్థ్యం పెంపుదల వంటి చర్యలు తీసుకుంటాం’అని ఆయన చెప్పారు. నాబార్డ్ చైర్మన్‌గా నియమి తులయ్యాక తొలిసారిగా తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా జీఆర్ చింతలకు అధికారులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డ్ చేపడుతున్న కార్యక్రమాలు, తదితర అంశాలను వివరించారు. వ్యవసాయానికి కొత్త రూపు.. భారత్‌లో ‘కలెక్టివ్ ఫార్మింగ్’కు శ్రీకారం చుట్టి.. దీని ద్వారా దేశ వ్యవస్థలో వ్యవసాయానికి కొత్తరూపు నిస్తామని జీఆర్ చింతల చెప్పారు. నాబార్డ్ ఆధ్వర్యంలో క్రెడిట్ రేటింగ్ అండ్ స్కోరింగ్ మ్యాట్రిక్స్‌ను రూపొందించి, దీంట్లో 60 శాతం దాటిన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు లభించేలా రేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తామని తెలిపారు. ‘క్రెడిట్ గ్యారెంటీ విధానాన్ని బలోపేతం చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి చిన్నాచితకా కలిపి మొత్తం 98 శాతంగా ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, చిన్నవ్యాపారులకు రుణాలు అందేలా మార్పులు చేపడతాం. కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 31 వరకు రూ.80 వేల కోట్ల వరకు రుణాలిచ్చాం. రూ.25 వేల కోట్లు స్పెషల్ ఈక్విటీ ఫండ్ కింద ఇచ్చాం. ఈ ఏడాది నాబార్డ్ బిజినెస్ రూ.5.32 లక్షల కోట్ల నుంచి రూ.ఆరున్నర లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోగలదు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఇంతటి ఘనతను నాబార్డ్ సాధించింది. ఇందులో 40 నుంచి 42 శాతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచే బిజినెస్ ఉంటోంది. వాటిలో రూ.44 వేల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి’అని జీఆర్ చింతల వివరించారు. సహకార, గ్రామీణ బ్యాంక్‌ల బలోపేతం.. దేశంలోని కోటి 8 లక్షల గ్రూప్‌లను ఈ–శక్తి ప్లాట్ ఫాం మీదకు తెచ్చి, వారి క్రెడిట్ ఇంటెన్సిటీని 350 శాతం పెంచేందుకు నాబార్డ్ కొత్త కార్యక్రమాలను చేపడుతోందని జీఆర్ చింతల తెలిపారు. నాబార్డ్ బహుముఖ ప్రయత్నాల్లో భాగంగా సహకార, గ్రామీణ బ్యాంక్‌ల బలోపేతంతో పాటు సహకార రంగంలో పారదర్శకత పెంచేందుకు, రైతులు, కూలీలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ‘సంస్థాగతంగా ఆయా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గత 30 ఏళ్లలో జరగనిది కేవలం 90 రోజుల్లోనే సహకార సంఘాలకు 3 శాతం వడ్డీకే రుణాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాం. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళల ఆదాయం పెంచడంతో పాటు ఆయిల్‌సీడ్ ప్రొడక్షన్ చేపట్టాలని ప్రధాని మోదీకి సూచించగా దాని ప్రాతిపదికన వర్కింగ్ గ్రూప్స్ మొదలయ్యాయి. దీని ద్వారా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. గ్రామీణ బ్యాంక్‌ల కంప్యూటీకరణ, ఈ వ్యవస్థలో చివరి లింక్ అయిన ప్రైమరీ సొసైటీల వరకు కంప్యూటీకరణ పూర్తికి చర్యలు తీసుకుంటుంన్నాం. ఇందుకోసం సహకార అభివృద్ధి నిధి కింద ప్రతీ రాష్ట్రానికి రూ.5 కోట్లు ఇస్తున్నాం. తెలంగాణలో ఇప్పటికే ఇది పూర్తి అయినా ఆ మొత్తాన్ని ఇస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాబార్డ్ రుణాలిచ్చింది. రెండో ప్రాజెక్టుకు మరో రుణం ఇవ్వబోతున్నాం’అని చెప్పారు. తెలంగాణలో రూ.900 కోట్లతో చెక్ డ్యామ్‌లను నిర్మిస్తున్నామని, రుణమాఫీ అనేది రాజకీయ నిర్ణయమని, ఈ మాఫీలకు సంబంధించిన డబ్బులు పూర్తిగా బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే సరిపోతుందని ఒక ప్రశ్నకు జీఆర్ చింతల జవాబిచ్చారు. -
‘కరోనా వచ్చాక.. 80 వేల కోట్ల రుణాలు ఇచ్చాం’
సాక్షి, హైదరాబాద్ : కరోనా వచ్చాక మార్చి 1 నుంచి జూలై వరకు 80 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు అన్నారు. ఈ సంవత్సరం 5.30 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల బిజినెస్ టార్గెట్‌గా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడులనుంచే 42 శాతం బిజినెస్ ఉంటుందన్నారు. ‘కోటి 8 లక్షల మైక్రో గ్రూప్‌లు ఉన్నాయి. మహిళలకు 2.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం. దేశంలో కోటి 8లక్షల గ్రూప్‌లను ఈ శక్తి ప్లాట్ ఫాం మీదకు తీసుకురావాలనుకుంటున్నాం. నాబార్డ్ ద్వారా కొత్త పథకాలు తీసుకురావాలనుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళ గ్రూప్‌లను బలోపేతం చేయాలనుకుంటున్నాం. ప్రాథమిక సహకార సంఘాలకు కేవలం 3శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. కోఅపరేటివ్ సొసైటీలను అన్నింటినీ కంప్యూటరైజ్ చేయాలని నిర్ణయించాము. కోఅపరేటివ్, గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేస్తున్నాం. రైతుల ఆదాయం పెంపొందించేందుకు నాబార్డు ప్రయత్నం చేస్తోంది. అగ్రికల్చర్లో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకురాబోతున్నాం. పుడ్ ప్రాసెసింగ్ కోసం స్వయం సహాయక గ్రూప్‌లకు 5శాతానికే లోన్లు ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చాం.. రెండో ప్రాజెక్టుకు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో 900 కోట్లతో చెక్ డ్యామ్‌లను నిర్మిస్తున్నాం. రుణమాఫీ అనేది పొలిటికల్ నిర్ణయం. మాఫీ డబ్బులు పూర్తిగా బ్యాంకులకు చెల్లించాలి’ అని గోవిందరాజులు తెలిపారు. -
దేశ ధాన్యాగారంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సాగునీరు, వ్యవసాయ రంగాలతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కారణంగా తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా ఎదుగుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం గురువారం ఆన్లైన్ విధానంలో జరిగింది. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ రాజ్‌భవన్ నుంచి ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, చేపలు, గొర్రెల పంపిణీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో రాష్ట్రం ముందుకెళ్లడం సంతోషకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రకటించిన రూ.లక్ష కోట్ల వ్యవసాయ ప్యాకేజ్ ఆత్మనిర్భర్ భారతాన్ని సాకారం చేసే దిశలో వ్యవసాయ రంగాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డులు, ఇతర సంస్కరణలు వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే హరిత విప్లవం ద్వారా ఆహార భద్రత సాధించినా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో భూసారానికి, పర్యావరణానికి హాని కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగ సుస్థిరతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో కూడిన వ్యవసాయం కారణంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా సంప్రదాయ విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతికతలతో అనుసంధానం చేయాలని సూచించారు. దేశంలో పోషకాహార లోపం లేని విధంగా సమతుల పంటల సాగు ప్రణా ళికలు అమలు చేయాలని తెలిపారు. పప్పు లు, చిరు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పండించాలని, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా పండించటం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చని గవర్నర్ వివరించారు. రైతుబంధు ఓ ట్రెండ్ సెట్టర్: నాబార్డు చైర్మన్ గోవిందరాజులు స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నాబార్డు చైర్మన్ గోవిందరాజులు చింతల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఓ ట్రెండ్ సెట్టర్ అని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో ప్రభుత్వం సమర్థ నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తోందని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు, పశుపోషణను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అభినందించారు. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో హైటెక్ సాగు వి ధానాలను అవలంభించాల్సిన అవసరముం దన్నారు. పరిశోధనలకు గాను వ్యవసాయ వర్సిటీకి నాబార్డు నుంచి తగిన ఆర్థిక సా యం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా గోవిందరాజులుకు వర్సిటీ తరఫున ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ను ప్రదానం చేశారు. మొత్తం 12 మంది విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేషన్‌లో, 10 మందికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో బంగారు పతకాలను, 30 మంది స్కాలర్స్‌కు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని మేడిశెట్టి అనూహ్య కు ఔట్‌స్టాండింగ్ గోల్డ్‌మెడల్, కోమటిరెడ్డి భార్గవికి మూడు, ప్రవల్లిక అనే విద్యార్థినికి రెండు బంగారు పతకాలు లభించాయి. వ్య వసాయ వర్సిటీ వైస్‌చాన్సలర్ వి.ప్రవీణ్‌రావు, రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. నాబార్డు చైర్మన్‌కు ‘గ్రామోదయ బంధు మిత్ర’ నాబార్డు చైర్మన్ గోవిందరాజులు కు మరో అవార్డు లభించింది. గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టె క్నాలజీ (జీసీవోటీ) ఇటీవలే ప్రకటించి న ‘గ్రామోదయ బంధు మిత్ర పురస్కారం’ఆయనకు ప్రదానం చేశారు. గురువారం వ్యవసాయ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రవీణ్‌రావు.. గోవిందరాజులుకు ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. జీసీవోటీ వ్యవస్థాపకులు ఢిల్లీ వసంత్, సీఈవో ఎం.శ్రవణ్, సలహాదారులు దోనేపూడి చక్రపాణి, పులిజాల రాంచం దర్‌తో పాటు నాబార్డు తెలంగాణ సీజీఎం వైకె.రావు పాల్గొన్నారు. -
వ్యవసాయంపై వ్యతిరేక ధోరణి మారాలి
సాక్షి, హైదరాబాద్: భారతీయ జీవికలో, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం లాభ దాయకం కాదనే వ్యతిరేక దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిలషించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి భారతదేశం చేరుకోవాలని ఆకాంక్షిం చారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురు వారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సంద ర్భంగా ఆయనతోపాటు వచ్చిన నాబార్డు బృందంతో సమావేశమైన కేసీఆర్.. వ్యవసాయ రంగం అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువమంది ఆధారపడినది, ఆహారంతో పాటు ముడిసరుకును అందిస్తున్నది వ్యవసాయ రంగమేన న్నారు. వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టే భారతీయ వ్యవస్థ ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగు తున్నదన్నారు. వ్యవసాయరంగాభివృద్ధితో పాటు వ్యవ సాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డులాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. ‘దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. పరోక్షంగా మరిన్ని కోట్ల మంది ఆధారపడుతున్నారు. దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే. ఇంత జనాభా కలిగిన దేశానికి ప్రపంచంలో మరో దేశమేదీ తిండి పెట్టలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మన దేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీనికోసం నాబార్డు అధ్యయనం చేయాలి’ అని సీఎం సూచించారు. ( రెండు రాష్ట్రాలు సమానమే ) సంఘటిత వ్యవసాయమే శరణ్యం దేశంలో కొండ, శీతల, సముద్ర తీర ప్రాంతాల్లాంటి అనేక రకాల భూభాగాలున్నాయని, ఏ ప్రాంతానికి ఏ పంటలు అనువైనవో గుర్తించి వాటినే సాగు చేయించాలని, దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలని కేసీఆర్ కోరారు. పంటల మార్పిడి విధానం అవలంభించాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరగ్గానే సరిపోదని, దాని అనుగుణమైన మార్కెట్ లేకుంటే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, పంటలు పండించే విధానంతో పాటు మార్కెటింగ్ విధానం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులను వ్యవసాయమే అందిస్తున్నందున పారిశ్రామికీకరణ కూడా జరగాలని, దేశంలో వ్యవసాధారిత పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలన్నారు. రైతులు సంఘటిత వ్యవసాయం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే విధంగా ప్రోత్సహించేలా ప్రభుత్వాలు భూమిక కల్పించాలన్నారు. రైతులు సంఘటితంగా ఆహార ఉత్పత్తులను వినిమయ వస్తువులుగా మార్చి అమ్మితే ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉందని, రైతులు సామూహిక వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. రైతులే పంటలను ప్రాసెస్ చేసి అమ్మేలా యంత్రాలను అందించాలని, తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను పెట్టాలని నిర్ణయించిందని చెప్పారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు తగిన ఆర్థిక చేయూతనందించే పథకాలకు నాబార్డు రూపకల్పన చేయాలని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కూలీల కొరత సమస్యను అధిగమించడానికి వ్యవసాయ యాంత్రీకరణ జరగాలని, నాటు వేసేందుకు, కలుపు తీసేందుకు, వరి, ఇతర పంటలు కోసేందుకు యంత్రాలు ఎక్కువ సంఖ్యలో రావాలని, ఇందుకు తగిన ఆర్థిక సాయం, సబ్సిడీలను నాబార్డు అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. సహకార బ్యాంకులు మరింత సమర్థవంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎరబ్రెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ రవీందర్రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, నర్సింగరావు, రామకృష్ణ, సందీప్ సుల్తానియా, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, రొనాల్డ్‌రోస్, నాబార్డు సీజీఎం వైకే రావు, డీజీఎం ప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, మర్రి జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాబార్డు బృందానికి సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. -
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ ప్రోత్సహించాలి
-
నాబార్డ్ ఆర్థికసాయం చేయాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ల ఏర్పాటుకు నాబార్డ్ ఆర్థికసాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌తో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దేశంలో 15 కోట్ల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే. దేశంలో ఆహార ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి. వివిధ దేశాల్లో ఆహార అవసరాలను గుర్తించి, మనదేశం నుంచి ఎగుమతి చేసే విధానం రావాలి. దీని కోసం నాబార్డ్ అధ్యయనం చేయాలి. (కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!) వ్యవసాయ రంగాభివృద్ధికి కృషి చేయడంతోపాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ పోత్సహించాలి. కూలీల కొరత అధిగమించడానికి వ్యవసాయంలో యాంత్రీకరణ జరగాలి. నాటు వేసే, కలుపు తీసే, పంటలు కోసే యంత్రాలు అందుబాటులోకి రావాలి. వీటికి సంబంధించి సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. (పరీక్షలు వాయిదావేయాలని .. ఆమరణ నిరాహార దీక్ష) -
వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్‌ల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించనున్నారు. ఇందుకోసం 197 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వం నాబార్డు సమర్పించింది. దీంతో నాబార్డు ఆర్ఐడీఎఫ్ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది. (కొత్తగా మరో పన్నెండు ప్రైవేటు ఆసుపత్రులు : సుచరిత) -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాబార్డ్ చేయూత
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ రుణ వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. నాబార్డ్ సీజీఎం వైకే రావుతో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో నాబార్డ్ భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఐటీ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగు పరిచడం ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అది అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌కు రుణసాయం అందించాల్సిందిగా కోరారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించండి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు నాబార్డ్ ఇస్తున్న రుణాలను మరింత విస్తృతం చేయాలని కేటీఆర్ కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాల్లో అర్హులైన వారికి పాడి పశువులు అం దించేందుకు నాబార్డు ముందుకు వస్తే తాము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో నిర్మించే 500 గోదాములకు ఆర్థిక సాయం అందించాలని నాబార్డ్ సీజీఎంకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతుబంధు కమిటీలను బలోపేతం చేస్తున్నందున వీటి ద్వారా వ్యవసాయ రంగానికి రుణాలను అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. నాబార్డు స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యక్ర మాలు ఉన్నాయని బ్యాంకు సీజీఎం వైకే రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సీజీఎం వివి ధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. -
నాబార్డ్ చైర్మన్‌గా డాక్టర్ చింతల బాధ్యతలు
సాక్షి, అమరావతి: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ చింతల గోవిందరాజులు బుధవారం బెంగళూరులో పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రతిష్టాత్మక ఈ పదవికి ఓ తెలుగు వ్యక్తి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు రాజమండ్రికే చెందిన డాక్టర్ పీవీఎస్ సూర్యకుమార్ కూడా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సూర్య కుమార్‌తో పాటు మరో డీఎండీ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చింతల, సూర్యకుమార్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం కన్వీనర్ వలేటి గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. పలు బ్యాంకుల ప్రతినిధులు కొత్త చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. ఏజీ బీఎస్సీ వరకు ఏపీలోనే గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు చెందిన చింతల గోవింద రాజులు పొన్నూరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ బీఎస్సీ పూర్తి చేశాక ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ)లో పీజీ పూర్తి చేశారు. 1985లో క్యాంపస్ సెలక్షన్స్‌లో నాబార్డ్–బీ గ్రేడ్ ఆఫీసర్‌గా ఎంపికైన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ పదవికి సుమారు 30 మంది పోటీ పడగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ శర్మ నాయకత్వంలోని బ్యాంకుల బోర్డు బ్యూరో చింతలను ఎంపికచేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సహా పలువురు బ్యూరో సభ్యులు చింతల పేరును ప్రతిపాదించారు. పీవీఎస్.. ఇంటర్ వరకు రాజమండ్రిలో డిప్యూడీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన పీవీఎస్ సూర్యకుమార్ రాజమండ్రిలో జన్మించారు. కామవరపుకోటలో పదో తరగతి వరకు చదివారు. రాజమండ్రిలో ఇంటర్, బాపట్ల వ్యవసాయ కాలేజీలో అగ్రి బీఎస్సీ చేసారు. 84–86 వరకు ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పీజీ చేశారు. 1986లో నాబార్డులో చేరారు. వీరి తల్లిదండ్రులు వెంకట పేరిశాస్త్రి, నాగమణి. నాబార్డ్ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో బాపట్ల వ్యవసాయ కళాశాలకు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సుమారు మూడు వందల కోట్ల రూపాయల నాబార్డు నిధులు మంజూరు అయ్యేలా చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాల సిగలో మరో కలికితురాయి.... డాక్టర్ చింతల, సూర్యకుమార్ ఇద్దరూ ఈ కళాశాలలో చదివిన వారు కావడం, ఇద్దరూ పదోన్నతులు సాధించడంతో బాపట్ల వ్యవసాయ కళాశాల ఖ్యాతి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కళాశాలలో చదివిన అనేక మంది పద్మశ్రీ అవార్డులు పొందారు. మరికొందరు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లాం కూడా ఈ కళాశాల విద్యార్ధే కావడం గమనార్హం. కళాశాల పూర్వ విద్యార్థులు ఎంబీఎన్ రావు ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. -
ఆర్బీఐపై అమిత్ షా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆర్బీఐ సహాయం ద్వార దేశ ఆర్థిక రంగం కుదుటపడే అవకాశం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. కాగా నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు, ఎస్ఐడీబీఐకి 15 వేల కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్లు కేటాయిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఆర్బీఐ సహాయం ద్వారం దేశంలో రైతులకు, గ్రామీణా ప్రాంత ప్రజలకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా లాక్డౌన్ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
నాబార్డు నిధులతో రోడ్లకు మహర్దశ
నెల్లూరు(బారకాసు): జిల్లాలోని కావలి, గూడూరు డివిజన్లలో గల పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది. రూ.22.37 కోట్ల నాబార్డు నిధులతో ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులను ప్రారంభించారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో మూడు నెలల్లోపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులను సుందరంగా తయారు చేయనున్నారు. నాబార్డు నిధులతో 8 పనులు నాబార్డు నుంచి విడుదలైన రూ.22.37 కోట్లతో 8 రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కావలి డివిజన్లో ఆరు, గూడూరు డివిజన్లో రెండు వర్కులు వివిధ దశల్లో ఉన్నాయి. గూడూరు డివిజన్లో ఏర్పేడు నుంచి చెన్నూరు వరకు 3.5 కిలోమీటర్లు, బంగారుపేట నుంచి చెన్నై, కోల్‌కతా రోడ్డు వరకు 4.9 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పనులను ప్రారంభించారు. దీనికి రూ.6.85 కోట్లను వెచ్చించారు. కావలి డివిజన్లో ఆరు రోడ్ల పనులకు గానూ రూ.12.52 కోట్లు వెచ్చించారు. ఇందులో రెండు పనులు జరగ్గా, మిగిలిన నాలుగు పనులకు అటవీశాఖ అనుమతులివ్వకపోవడంతో నిలిచిపోయాయి. అల్లూరు నుంచి ఉడ్‌హౌస్‌పేట వరకు మూడు బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. కావలి నుంచి తుమ్మలపెంట వరకు 0.5 కిలోమీటర్ వరకు రోడ్డు పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయగిరి నుంచి బండగానిపల్లి, తిమ్మసముద్రం నుంచి చోడవరం, జంగాలకండ్రిగ నుంచి చెన్నూరు, కోవూరు నుంచి యల్లాయపాళెం వరకు జరగాల్సిన రోడ్డు పనులు అటవీ శాఖ అనుమతులు లభించక నిలిచిపోయాయి. త్వరలో ఎన్డీబీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం ఎన్డీబీ ప్రాజెక్ట్ ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టే రోడ్ల పనులకు చైనా వారు 70 శాతం నిధులను రుణంగా ఇవ్వగా, మిగిలిన 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. దీని కోసం ఆర్ అండ్ బీ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడెక్కడ చేపట్టాలో గుర్తించడంతో పాటు అందుకు ఎంత నిధులు అవసరమో కూడా నిర్ణయించారు. ఫేజ్ – 1కు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఫేజ్ – 2లో జరిపే పనుల కోసం అంచనాల్లో ఉన్నారు. నిధులను వెచ్చించనుంది ఇలా.. ఎన్డీబీ ప్రాజెక్ట్ ద్వారా రూ.428.62 కోట్లతో 15 రోడ్ల పనులు చేపట్టనున్నారు. ఆయా పనులను ఫేజ్ – 1, 2 ద్వారా పూర్తి చేయనున్నారు. ఫేజ్ – 1లో రూ.128.56 కోట్లతో ఆరు రోడ్ల పనులు, ఫేజ్ – 2లో తొమ్మిది రోడ్ల పనులకు రూ.300.06 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో ఫేజ్ – 1 ద్వారా తోటపల్లిగూడూరు నుంచి సీఎస్‌పురం, సూళ్లూరుపేట నుంచి సంతవేలూరు, రాజుపాళెం నుంచి ఇస్కపల్లి, కావలి నుంచి తుమ్మలపెంట, బుచ్చి నుంచి దగదర్తి, ముంబై హైవే రోడ్డు నుంచి కోవూరు వరకు ఆరు పనులు చేపట్టనున్నారు. అదే విధంగా ఫేజ్ – 2 ద్వారా నందనం నుంచి ఉదయగిరి, సంగం నుంచి కలిగిరి, సంగం నుంచి విరువూరు మీదుగా కలువాయి, నెల్లూరు నుంచి తాటిపర్తి, నెల్లూరుపాళెం నుంచి వింజమూరు, పాత మద్రాస్ రోడ్డు నుంచి కోట, విద్యానగర్ మీదుగా సముద్ర తీర ప్రాంతం వరకు, ఏర్పేడు నుంచి నాయుడుపేట వరకు, రాపూరు రోడ్డు, సూళ్లూరుపేట నుంచి నాయుడుపేట, దుగరాజపట్నం వరకు, గూడూరు నుంచి జయంపు వరకు రోడ్డు పనులు చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మూడు నెలల్లో పూర్తి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఆయా రోడ్డు పనులను మరో మూడు నెలల్లో పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాం. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది.– వివేకానంద, ఎస్ఈ, ఆర్ అండ్ బీ -
రాష్ట్రంలో కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రక్షాళన
-
‘కిసాన్’ కార్డుల వ్యవస్థ ప్రక్షాళన
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో కేసీసీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తూతూమంత్రంగా సాగుతున్న ఈ కార్డుల పంపిణీ తీరును సమీక్షించి నిజమైన సాగుదారులకు ఉపయుక్తంగా ఉండేలా వీటినిచ్చే పనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 3 లక్షల మందికి ఈ కార్డులివ్వాలని భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డులంటే.. బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆర్వీ గుప్తా కమిటీ సిఫార్సు మేరకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ఈ విధానాన్ని 1988 ఆగస్టు నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. స్వల్పకాలంలోనే కిసాన్ క్రెడిట్ కార్డులకు బహుళ ప్రచారం వచ్చినా అమలులో మాత్రం పెద్దగా పురోగతి లేదన్నది వ్యవసాయాధికారుల భావన. ఇక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతులకు పంట ఆధారిత రుణ పరిమితి ఉంటుంది. నిజానికి ఆ మొత్తాన్ని రైతు ఖాతాకు జమచేస్తూ కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వాలి. రైతు తనకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇతరత్రా వ్యవసాయ ఉత్పాదకాల కోసం ఈ కార్డును వినియోగించుకోవాలి. ఇదీ క్రెడిట్ కార్డుల ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉందంటే.. రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలైతే ఇస్తున్నాయిగానీ కార్డులు ఇవ్వడంలేదు. అలాగే, రైతులూ అడగడంలేదు. పంట కాలానికి ముందు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడమో లేదా రెన్యువల్ చేయించుకోవ డమో జరుగుతుంది. రెన్యువల్ అంటే బుక్ అడ్జస్ట్మెంట్ తప్ప (ఖాతా సర్దుబాట్లే) మరొకటి కాదు. ఒకవేళ కిందటి ఏడాది కన్నా పంట రుణ పరిమితి పెరిగితే ఆ వ్యత్యాస మొత్తాన్ని రైతుకు ఇస్తున్నారు. ఇలా రుణాలు తీసుకున్న వారందరికీ కార్డులు ఇచ్చినట్లేనని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఇప్పటికి సుమారు 46 లక్షల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులున్నట్లు అంచనా. ఎలా మార్చాలనుకుంటున్నారంటే.. లోపభూయిష్టంగా ఉన్న ఈ పద్ధతిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తలపెట్టి బ్యాంకర్లకు కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి.. - ఎవరికైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ఆయా పంటలకు ఇచ్చే రుణ పరిమితి) వర్తిస్తుందో వారందరికీ కార్డులు ఇవ్వాలని బ్యాంకర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. - డీ–ఫారం పట్టాలున్న వారు, కౌలు రైతులు సహా వాస్తవ సాగుదార్లందరికీ పంట రుణాలు ఇచ్చేలా ఈ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయాలి. - వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసేటప్పుడు నగదు రహిత లావాదేవీలు జరిపేలా చూడాలి. - ఏ ప్రయోజనం కోసమైతే రుణం ఇస్తున్నారో దాని కోసమే ఈ కార్డులను ఉపయోగించాలి. ఇది పక్కాగా అమలుకావాలంటే వాస్తవ సాగుదారులు ఎవరో గుర్తిం చాలి. ఏయే బ్యాంకు ఎంతెంత మందికి పంట రుణాలిచ్చిందో వారి జాబితాను వ్యవసాయ శాఖకు ఇచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ నేపథ్యంలో.. ఈ జాబితాను ఆయా గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయాధికారులతో పరిశీలన చేయించి రైతులను నిర్ధారించి అర్హులెవరో తేలుస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇలా చేయడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సున్నా వడ్డీకి ఎవరు అర్హులో లెక్కతేలుతుంది. అలా గుర్తించిన వారికి కిసాన్ క్రెడిట్ కార్డులిస్తే రీ పేమెంట్స్‌కు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే, వ్యవసాయ ఉత్పాదకాలు ఎక్కడ కొనుగోలు చేశారో కనిపెట్టడంతో పాటు బ్యాంకులిచ్చే రుణాలకూ సార్ధకత ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. -
ఎంఎస్ఎంఈలకు రూ.42,206 కోట్ల రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు రూ.42,206 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు అంచనా వేసింది. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు ఉద్యోగావకాశాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ పత్రంలో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రుణాలు తిరిగి చెల్లించే స్థోమత లేని 86 వేల ఎంఎస్ఎంఈలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘వైఎస్ఆర్ నవోదయం’ పేరిట ఒన్‌టైమ్ రుణాల పునర్వ్యవస్థీకరణ(రీస్ట్రక్చరింగ్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. ఇందులో భాగంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు చెందిన రూ.3,900 కోట్ల మేరకు రుణాలను ఒన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో బలహీనంగా ఉన్న 86 వేల ఎంఎస్ఎంఈల్లో 80 వేల ఎంఎస్ఎంఈలు రూ.పది లక్షలలోపు రుణాలు కలిగి ఉండగా వాటన్నింటినీ ఒన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిగతా ఎంఎస్ఎంఈలు పది లక్షల రూపాలయకుపైగా రుణాలు కలిగినవి ఉండగా, వాటిలో ఇప్పటివరకు 2,500కుపైగా ఎంఎస్ఎంఈల రుణాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఇప్పటికే నాబార్డు అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు, రైతులకు అవసరమైన నైపుణ్యత పెంపు, అలాగే ఇతర రంగాల్లో యువతకు నైపుణ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ ఫోకస్ పత్రంలో వివరించింది. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలకు కార్పొరేట్ బ్యాంకులు మరింతగా ఆర్థిక సాయాన్ని అందించాలని నాబార్డు కోరింది. రాష్ట్రంలో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. -
చెక్‌డ్యామ్‌లకు నాబార్డ్ రుణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లకు నిధుల కొరత లేకుండా నాబార్డ్ నుంచి రుణాలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యం లో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపులు కష్ట సాధ్యం కావడంతో ఈ మేరకు రుణాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకునేలా నాబార్డ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 410, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగిరం చేశారు. ఇలా 250 చెక్‌డ్యామ్‌లకు అనుమతులివ్వగా, 100 వరకు టెండర్లు పిలిచారు. మిగతా వాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వాటికి నిధుల కొరత లేకుండా ఈ మార్చి నెల వరకు నిర్మించే చెక్‌డ్యామ్‌ల అవసరాలకు రూ.150 కోట్లు, ఆ తర్వాత వార్షిక ఏడాదికి మరో రూ.1500 కోట్లు రుణాలు తీసుకునేలా చర్చలు జరుపుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘నాడు–నేడు’కు నాబార్డు చేయూత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమానికి నాబార్డు చేయూత అందిస్తోంది. ‘నాడు–నేడు’ ద్వారా మూడు దశల్లో ఆస్పత్రులు, పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కోరిన నేపథ్యంలో తొలిసారిగా ఎక్కువ మొత్తంలో సాయం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది. స్కూళ్లకు రూ.515.06 కోట్లు.. ఆస్పత్రులకు రూ.533.76 కోట్లు ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు రూ.1,048.82 కోట్లు మంజూరు చేసింది. తొలిదశలో నాడు–నేడు ద్వారా 15,715 పాఠశాలలను అభివృద్ధి చేస్తుండగా 510 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు నాబార్డు రూ.515.06 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి తొలి దశలో చేపట్టే 44 పనులకు రూ.533.76 కోట్లను మంజూరు చేసినట్లు నాబార్డు అధికారులు పేర్కొన్నారు. ఫోకస్ పత్రంలో నాడు – నేడు నాబార్డు గతంలో చాలా తక్కువ మొత్తంలో ఈ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నాబార్డు 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రస్తావించింది. దీనివల్ల విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనను నాబార్డు ఫోకస్ పత్రంలో పేర్కొంది. సామాజిక రంగ అభివృద్ధిలో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి ఇక ముందు కూడా నాబార్డు ఆర్థిక సాయాన్ని కొనసాగించనుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులను మంజూరు చేసిందని ముఖ్యమంత్రి అదనపు సీఎస్ పీవీ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. పశు వైద్యానికి రూ.150.33 కోట్లు క్షేత్రస్థాయిలో పశు వైద్యానికి రూ.159.33 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. వెటర్నరీ ఇన్స్టిట్యూషన్కు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. పశువుల టీకాలు, ఇతర వైద్య చికిత్సలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. -
పేదల ఇళ్లకు రూ.13,411 కోట్లు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో పేర్కొంది. ఉగాది సందర్భంగా మార్చి 25వ తేదీన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఐదేళ్లలో వారందరికీ గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందని 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.8,615 కోట్లు కేటాయించిందని, 2020–21లో గృహ నిర్మాణాల రుణ అంచనా రూ.13,411.22 కోట్లు అని పేర్కొంది. ఇది 2019–20 కంటే 6.44 శాతం ఎక్కువ. ఇళ్లకు జియో ట్యాగింగ్ వల్ల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నిర్మాణాల్లో జాప్యాన్ని నివారించవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు పొందుతున్న వారికే గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు కూడా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. గృహ నిర్మాణాలకు రుణాల మంజూరు విధానాన్ని మరింత సరళతరం చేయాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో తొలిసారిగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం వేల ఎకరాలను స్థలాల రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. -
నాబార్డ్ చైర్మన్‌గా గోవిందరాజులు
సాక్షి, అమరావతి: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్‌గా గుంటూరు జిల్లా వాసి చింతల గోవింద రాజులు ఎన్నికయ్యారు. ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా మొత్తం 31 మంది ఈ పదవికి పోటీ పడగా ప్రస్తుతం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న గోవింద రాజులును బ్యాంకుల బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఎంపిక చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు సమీపంలోని బ్రాహ్మణకోడూరు ఆయన స్వగ్రామం. గుంటూరు నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (అగ్రీ), ఎంఎస్సీ (అగ్రానమీ) చదివారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో సీడ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్ బీ అధికారిగా క్యాంపస్ రిక్రూట్ అయ్యారు. 35 ఏళ్లుగా నాబార్డ్‌లో వివిధ హోదాలలో పని చేశారు. నాబార్డ్ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా పాటు పడతానన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. నాబార్డ్ అందించే పథకాలలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీట వేసేలా ఏమేమి చేయవచ్చో అదంతా చేస్తానని, నిరుపేదలను అభివృద్ధి పథకాలలో భాగస్వాములను చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తామని వివరించారు. -
ఏపీడబ్ల్యూఆర్డీసీకి నాబార్డ్ భారీ రుణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి నాబార్డు రూ.1931 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మాణం పూర్తి చేయడానికి నాబార్డు ఆంధ్రప్రదేశ్ నీటివనరుల అభివృద్ధి సంస్థ( ఏపీడబ్ల్యూఆర్డీసీ)కి ఈ రుణాన్ని నాబార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్(ఎన్ఐడీఏ)కింద మంజూరు చేసిందని నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం సీజీఎం ఎస్ సెల్వారాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటనను బుధవారం విడుదల చేశారు. (చదవండి: ‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’) చింతలపూడి పధకం కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాల్లోని 410 గ్రామాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పధకం ద్వారా 4.80 లక్షల ఎకరాల ఆయకట్టకి ఖరీఫ్ పంటలకి మూడు దశల్లో 53.50 టీఎంసీల సాగునీటి సౌకర్యం కలుగుతుందని తెలిపారు. అంతే కాకుండా జల్లేరు వద్ద 14 టీఎంసీల సామర్థ్యం గల తాగునీటి రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు గ్రామాల్లో 26 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు మార్చి 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. (చదవండి: నగదు లేకున్నా ఆర్టీసీలో ప్రయాణం!) -
ప్రాధాన్యత రంగానికి లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాధాన్యత రంగానికి రూ.2,11,865.38 కోట్లు అవసరమని నాబార్డు రుణ అంచనాలు రూపొందించింది. ఈ మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫోకస్ పత్రాన్ని నాబార్డు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసింది. నాబార్డు రూపొందించిన రుణ ఆవశ్యకత పత్రం ఆధారంగా వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సిద్ధం చేయనుంది. సాగుకు అగ్రస్థానం.. ప్రాధాన్య రంగంలో వ్యవసాయానికి రూ. 1,46,301.95 కోట్ల రుణాలు అవసరమని నాబార్డు అంచనా వేసింది. ఇందులో పంటల ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్‌కి రుణ అంచనా రూ.1,05,033.62 కోట్లుగా పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 18.87 శాతం ఎక్కువని నాబార్డు ఫోకస్ పత్రంలో తెలిపింది. పంట రుణాలతోపాటు మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ క్లినిక్స్, అగ్రి బిజినెస్ కేంద్రాలకు నాబార్డు రుణాలను ప్రతిపాదించింది. జలవనరులు, ఉద్యానవన, మత్స్య, పశు సంవర్థక రంగాలకు నాబార్డు రుణ ప్రతిపాదనలు రూపొందించింది. గృహ నిర్మాణం, విద్య, ఎగుమతులకు రుణాల ప్రతిపాదనలున్నాయి. సామాజిక మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర ప్రతిపాదిక పథకాలకు నాబార్డు రుణాలను ప్రతిపాదించింది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడి రుణాలను నాబార్డు ఫోకస్ పత్రంలో పేర్కొంది. -
మాంద్యం వేళ వ్యవ‘సాయం’ చేయండి
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించాలి. ఈ కార్డులను రైతు భరోసా కేంద్రాలకు లింక్ చేసేలా చూడాలి. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఆర్థిక తోడ్పాటు అందుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం వైపు నుంచి కట్టాల్సిన వడ్డీలు కడతాం. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 5 వేల మందికి క్రెడిట్ కార్డులు ఇచ్చి, రూ.10 వేల చొప్పున రుణాలు అందిస్తే వారి జీవితాలు మెరుగు పడతాయి. వీరిని గ్రామ సచివాలయాలకు లేదా స్వయం సహాయక సంఘాలకు లింక్ చేయొచ్చు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొన్న తరుణంలో దాని ప్రభావం మొదట ప్రాథమిక రంగాలపైనే.. అంటే వ్యవసాయంపైనే ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయని, ఇక ముందు కూడా మరింత సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందని చెప్పారు. మరిన్ని కార్యక్రమాలకు నాబార్డు సహకారం అందించాలని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో 2020–2021కు సంబంధించిన నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్‌ను విడుదల చేశారు. (2020–21లో ప్రాథమిక రంగానికి రూ.2,11,865.38 కోట్ల రుణాలు ఇవ్వాలనేది నాబార్డు లక్ష్యం. చదవండి: రైతులకు అన్ని విధాలా భరోసా ఇందులో రూ.1,34,402.52 కోట్లు వ్యవసాయ రుణాలు) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారితమని, 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అపారమైన అవకాశాలున్నాయని, ఆక్వా, ఫిషరీస్ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు గతంలో ఎక్కడా అమలు చేయలేదని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా కింద 46 లక్షల మంది రైతులను ఆదుకున్నామని, 69 శాతం మంది రైతులకు ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉందని, సగం హెక్టార్ కన్నా తక్కువ ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని, వీరికి ఏటా రూ.13,500 రైతు భరోసా కింద అందిస్తున్నామని చెప్పారు. వారికి 80 శాతం వ్యవసాయ పెట్టుబడులు సమకూరుస్తున్నామని వివరించారు. ఇది వారికెంతో ఊరటనిచ్చే అంశమని, అలాగే వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే కడుతోందని, ఆ భారం రైతుల మీద లేకుండా చేశామని చెప్పారు. ఏ రైతు కూడా నష్టపోకుండా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకునేందుకు విపత్తు నిధి పెట్టామన్నారు. అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ప్రకటించామని, ఈ ధరల కన్నాతక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని సీఎం తెలిపారు. చదవండి: ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం రైతు భరోసా కేంద్రాలకు నాబార్డు సహకారం కావాలి ప్రతి 2 వేల జనాభాకు 10 మంది ఉద్యోగులతో ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశామని, వీటి పక్కనే వచ్చే ఖరీఫ్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11 వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలను పెడుతున్నామని, వీటికి నాబార్డు సహకారం అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, ఆక్వా అసిస్టెంట్లను గ్రామ సచివాలయాల్లో పెట్టామని, వీరు ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్, ఇంటర్నెట్ ఉంటుందని, నాణ్యమైన, ప్రభుత్వం పరీక్షించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్ముతారని సీఎం వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ కంపెనీలు మండలాల వారీగా హబ్‌లను ఏర్పాటు చేస్తాయని, ఆర్డర్ ఇచ్చిన 24 నుంచి 48 గంటల్లోగా రైతులకు కావాల్సినవి అందుతాయని సీఎం పేర్కొన్నారు. సేకరణ కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయని, ఏ పంట వేసుకోవాలన్న దానిపై సలహాలు కూడా ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమాలకు నాబార్డు సహకారం కావాలని కోరారు. కోల్డ్ స్టోరేజీల సంఖ్య పెరగాలి నాబార్డు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు సహకారం అందిస్తోందని, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న అగ్రిల్యాబ్స్‌కు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో సరిపడా గోదాములు అందుబాటులో లేవని, కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఉంచడానికి సరైన స్థలం లేదని, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామని, తర్వాత నెమ్మదిగా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. పోలవరంపై దృష్టి సారించాలి పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణాలో నీళ్లు రావడం లేదని, మరోవైపు గోదావరిలో నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని చెప్పారు. రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే.. దానిపై వడ్డీ సుమారుగా రూ.500 కోట్లకుపైగా కడుతున్నామని, సకాలానికి డబ్బులు రావడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఇచ్చిన సుమారు 1,800 కోట్లకుపైగా డబ్బులు నాబార్డు నుంచి పీపీఏకు వెళ్లాయని, అవి ఇంకా రాలేదన్నారు. ఈ సమస్య తీర్చడానికి నాబార్డు పూర్తి స్థాయి సహకారం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి కావాలంటే శరవేగంగా పనులు పూర్తి చేయాలని, కనీసం ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున ఆర్ అండ్ ఆర్ కింద కావాల్సి వస్తుందన్నారు. సివిల్ పనుల కోసం ఈ ఏడాదే రూ.6 వేల కోట్లు కావాల్సి ఉన్నందున, ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మానస పుత్రికలైన రైతు భరోసా కేంద్రాలకు నాబార్డు సహకారం అందించాలని కోరారు. బలమైన గ్రామ సచివాలయ వ్యవస్థను నాబార్డు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, నాబార్డ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్ బెహరా, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. పూర్తి సహకారం అందిస్తాం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నవరత్నాల కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రైతు భరోసా, వడ్డీలేని రుణాలు ఇతరత్రా కార్యక్రమాలను రైతుల కోసం అమలు చేస్తోంది. ఇవన్నీ రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే కార్యక్రమాలే. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధితో రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచింది. ప్రాథమిక రంగం బలోపేతానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. – సెల్వరాజ్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ -
‘పచ్చని’ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రుణ ప్రణాళికను నాబార్డు ప్రకటించింది. 2020–21 సంవత్స రానికి రూ.1,14,578 కోట్లతో రుణ ప్రణాళిక ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాం కులకు దిశానిర్దేశం చేస్తూ గురువారం రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను విడుదల చేసింది. ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు విడుదల చేసిన ఈ రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్లో మొత్తం రుణాల్లో 64% వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించాలని సూచిం చింది. కీలకమైన పంట రుణాలకు 44% కేటాయించారు. 2019–20 ఫోకస్ పేపర్లో రుణ ప్రణాళిక పరిమితి రూ.1,01,378 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ.13,199.59 కోట్ల అంచనాలు చూపడం గమనార్హం. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నం దున ఆ మేరకు కేటాయింపులు భారీగా పెంచాలన్నది నాబార్డు ఉద్దేశంగా కనిపి స్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి వివిధ రంగాలకు రుణ కేటాయిం పులు ఎలా ఉండా లన్న దానిపై నాబార్డు అన్ని జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా క్షేత్ర స్థాయి వివరాలను సేకరించింది. వాటిని క్రోడీ కరించి ఈ రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) త్వరలో విడుదల చేయనుంది. వ్యవసాయం.. అనుబంధ రంగాలు మొత్తం రుణ ప్రణాళికలో రూ.73,686.16 కోట్లు వ్యవ సాయం, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ సహా దాని అనుబంధ రంగాలన్నింటికీ రుణా లివ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలిపింది. అందు లో రూ.51,082.72 కోట్లు పంట రుణాలకు మార్కెటింగ్‌కే కేటాయిం చాలని తెలిపింది. గతేడాది ఫోకస్ పేపర్లో పంట రుణాలకు రూ.49,785.59 కోట్లు ప్రక టించారు. ఈసారి అదనంగా రూ.1,297.13 కోట్లు ఉండటం గమనార్హం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కీలకమైన డెయిరీకి రూ.1,848 కోట్లు, పౌల్ట్రీకి రూ.1,074 కోట్లు, గొర్రెలు, మేకల రంగానికి రూ.1,083 కోట్లుగా ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.2,843 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఫుడ్, అగ్రో ప్రాసెసింగ్‌కు రూ.1,232.66 కోట్లు చూపారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో మౌలిక సదుపాయాలు, గోదాములకు రూ.1,481 కోట్లు కేటాయించాలని సూచించింది. గృహ రుణాలకు రూ.8,149 కోట్లు, విద్యా రుణాలకు రూ.2,256 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. ఉత్పత్తి పెంచేలా హైటెక్ అగ్రికల్చర్.. ఈసారి హైటెక్ అగ్రికల్చర్‌పై దృష్టి సారించనున్నట్లు నాబార్డు పేర్కొంది. వచ్చే ఏడాది హైటెక్ అగ్రికల్చర్ థీమ్‌తో ముందుకు సాగనున్నట్లు తెలిపింది. ఇది పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో అనుకూలమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల ఉత్పత్తికి హైటెక్ వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడుతున్నట్లు వివరించింది. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఉత్పాదకత మెరుగుపర్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపింది. మట్టి రహిత (సాయిల్ లెస్) వ్యవసాయం, గ్రీన్హౌస్ రక్షిత సాగు, హైడ్రోపోనిక్స్ సాగు, ఏరోపోనిక్స్, వర్టికల్ సాగు హైటెక్ అగ్రికల్చర్లో భాగంగా ప్రోత్సహించనుంది. -
మార్కెటింగే పెద్ద సవాల్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు మార్కెటింగ్ పెద్ద సవాల్‌గా మారిందని ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వ్యవసాయ ఆధారిత రంగాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజి, ఎగుమతి రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. సాగునీటి వనరులు పెరగడంతో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయని, కానీ రైతుకు ఇప్పుడు ప్రధాన సమస్య మార్కెటింగ్ అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారానే అదనపు విలువ జోడించినట్లవుతుందన్నారు. దీనివల్లే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. 2020–21 రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను నాబార్డు సిద్ధం చేసింది. దాన్ని గురువారం మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ ఫోకస్ పేపర్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) ఖరారు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు దాని ఆధారిత రంగాలను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలనూ అంతే ప్రోత్సహించాలని నాబార్డును కోరారు. ఈ ఏడాది నాబార్డ్ హైటెక్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా, ఇప్పుడు సీఎంగా ఉన్నా రైతుగా నిత్యం పనిచేస్తున్నారని చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయానికి 30 శాతం.. బడ్జెట్ మొత్తంలో 30 శాతానికి పైగా వ్యవసాయ రంగానికే ఖర్చు చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. అందులో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుబీమా కోసం రూ.1,136 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గతంలో రుణమాఫీ అమలుచేశామని, ఇప్పుడు కూడా అందుకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ కోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, దీంతో రైతుల్లో భరోసా ఏర్పడిందన్నారు. దీంతో ఉన్నత చదువులు చదివినవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. రైతుల రెవెన్యూ రికార్డులను 96 శాతం పరిష్కరించామని, మరో 4 శాతం లీగల్ కేసులకు సంబంధించినవని చెప్పారు. పంట రుణాలకే పరిమితం కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా విరివిగా రుణాలు ఇవ్వాలని నాబార్డును, బ్యాంకర్లను కోరారు. గొర్రెల పంపిణీ వల్ల వాటి నుంచి 80 లక్షల కొత్త గొర్రె పిల్లలు పుట్టినట్లు వివరించారు. వీటి విలువ రూ.3500 కోట్లు ఉంటుందని తెలిపారు. మత్స్య సొసైటీలు దేశంలో అధికంగా తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 64 కోట్ల చేప పిల్లలను, 3.4 కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో ఉచితంగా వేశామన్నారు. ఫిషరీస్‌లో దేశంలోనే కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, సిద్దిపేట జిల్లా ములుగులో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టామన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత.. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు. పెద్ద రైతులకు ఉపయోగపడే యంత్రాలు కాకుండా, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా యంత్రాలకు సహకారం అందించాలని చెప్పా రు. వరి నాట్లు, కలుపు తీసే యంత్రాల కోసం ప్రభుత్వం రాయితీ ఇస్తోందని, దీనికి బ్యాం కులు సహకరించాలని కోరారు. వ్యవసాయ రంగానికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి, వ్యవసాయ యంత్రాలకు ఎక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం సరికాదన్నారు. కాబట్టి తక్కువ వడ్డీకే యంత్రాలు కొనుగోలు చేసేలా సౌలభ్యం కల్పించాలన్నారు. నాబార్డు నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. సమావేశంలో నాబార్డు సీజీఎం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరానికి రూ.1,850 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు)కు కేంద్ర ఆర్థిక శాఖ అండర్ సెక్రటరీ గౌతమ్ ఫలిత్ ప్రతిపాదనలు పంపారు. బాండ్లను జారీ చేయడం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి నిధులు సేకరించి పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాలని నాబార్డుకు దిశానిర్దేశం చేశారు. దీంతో సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పరిధిలో ఈ–ఆక్షన్ ప్లాట్ ఫామ్ ద్వారా బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,850 కోట్లను నాబార్డు సేకరించనుంది. ఐదారు రోజుల్లోనే పీపీఏ ద్వారా ఆ నిధులు ప్రాజెక్టుకు అందనున్నాయి. జూలై 24, 2018 అనంతరం పోలవరానికి కేంద్రం నిధులు మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, పోలవరం పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్ టెండరింగ్ ద్వారా సీఎం వైఎస్ జగన్ రూ.841.33 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారని, పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
ఇక సాగునీటి ప్రాజెక్టుల పనులు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. మిగిలిపోయిన పనుల వ్యయం.. ఆయకట్టు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, 2020 నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మిగతా ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) నుంచి తక్కువ వడ్డీకి రుణ సమీకరణ చేయడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కొరత ఎదురుకాకుండా చూడాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు నాబార్డు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన నాబార్డు తొలి విడతగా రూ.రెండు వేల కోట్లను అక్టోబర్ 15లోగా సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఏ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంత నిధులు అవసరమో తెలిపితే.. నిధుల లభ్యతను బట్టి సర్దుబాటు చేస్తామని సూచించింది. ఆంధ్రప్రదేశ్ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్డీసీ)కు పెండింగ్ ప్రాజెక్టులను బదిలీ చేసి, నాబార్డు నుంచి రుణాన్ని సమీకరించడానికి జలవనరుల శాఖ సిద్ధమైంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా తదితర నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి వాటిని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం చేపట్టారు. 2014 నాటికి జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులకు రూ. 80,559.98 కోట్లు వ్యయం చేశారు. 27 ప్రాజెక్టులను పూర్తిచేసి 52.05 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. ఒక్క ఎకరాకూ నీళ్లందించని చంద్రబాబు సర్కార్ జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగతా ప్రాజెక్టులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని జూలై 23, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 34.42 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. కానీ, ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయారు. అంచనాలను పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాను కొల్లగొట్టారు. పనుల్లో జాప్యం లేకుండా నిధుల విడుదల జలయజ్ఞం ప్రాజెక్టుల పనుల్లో ఈ ఏడాది హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ తొలిదశ, వంశధార, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, చింతలపూడి, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులను పూర్తిచేయాలని నిర్ణయించారు. మిగతా ప్రాజెక్టుల పనుల్లోనూ జాప్యం చేయకుండా చూడాలని సీఎం సూచించారు. 2019–20 బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 13,139.05 కోట్లను కేటాయించారు. పనుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు నెలవారీగా నిధులను విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు పెండింగ్ బిల్లులకు చెల్లింపులు చేస్తూ.. అక్రమాలు జరిగిన ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై జలవనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు. వర్షాలు తగ్గగానే శరవేగంగా పనులు జలయజ్ఞం ఫలాలను రైతులకు శరవేగంగా అందించడానికి ప్రణాళిక రచించాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులను నాలుగు విభాగాలుగా వర్గీకరించాం. వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ తొలి దశ, వంశధార, తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్, చింతలపూడి తదితర ప్రాజెక్టుల పనులను 2020 నాటికి కచ్చితంగా పూర్తి చేస్తాం. పనులకు నిధుల కోసం నాబార్డుతో చర్చలు జరిపాం. తొలి విడతగా రూ. 2 వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించింది. ఈనెలాఖరుకు వర్షాలు తగ్గుముఖం పడతాయి. నదుల్లో వరద తగ్గుతుంది. నవంబర్ నుంచి ప్రాజెక్టుల పనులను శరవేగంగా పూర్తి చేస్తాం. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ►దివంగత వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభ సంవత్సరం 2004 ►2014 నాటికి పూర్తయిన ప్రాజెక్టులు 27 ►వ్యయం రూ. కోట్లలో 80,559.98 ►సాగు నీరు అందిన భూమి విస్తీర్ణం52.05 లక్షల ఎకరాలు ►2019–20 బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం రూ. 13,139.05కోట్లు -
రూ.18 లక్షలు ఏమైనట్లు?
సాక్షి, కర్నూలు : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం జిల్లా కార్యాలయాన్ని నాబార్డు ఆర్ఐడీఎఫ్ నిధులు రూ.94 లక్షలతో నిర్మించారు. ఇందులో రూ.76 లక్షలు భవన నిర్మాణానికి కేటాయించగా.. రూ.18 లక్షలు ఫర్నీచర్‌కు విడుదల చేశారు. రూ.76 లక్షలతో భవనాన్ని నిర్మించారు. దీనిని ఇటీవలనే ప్రారంభించారు. అయితే ఫర్నీచర్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించినా ఇంతవరకు ఒక్క కుర్చీ కూడా సరఫరా కాలేదు. కలెక్టరేట్లో ఉన్న జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం కార్యాలయాన్ని 15 రోజులుగా పాతబస్టాండు సమీపంలోని బహుళార్ధ పశువైద్యశాలలో నిర్మించిన సొంత భవనంలోనే నిర్వహిస్తుండగా అక్కడ కూర్చునేందుకు కుర్చీలు కరువయ్యాయి. కార్యాలయానికి ఏసీలతో పాటు అవసరమైన బీరువాలు, కుర్చీలు, టేబుశ్లు, సమావేశ మందిరానికి అవసరమైన కుర్చీలు, టేబుళ్లను ఫర్నీచర్ కోసం కేటాయించిన నిధులతో సమకూర్చాల్సి ఉంది. ఇందులో ఒక్కటి కూడా సరఫరా కాకపోవడంతో నాలుగైదు పాతకుర్చీలు, టేబుళ్లతోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రూ.18 లక్షలు దారి మళ్లాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి కేంద్రం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్‌ను సంప్రదించగా... ఫర్నిచర్ కోసం ప్రత్యేకంగా రూ.18 లక్షలు కేటాయించామని, అయితే కార్యాలయానికి కనీసం ఒక్క కుర్చీ కూడా రాలేదని తెలిపారు. ఏసీలతో సహా పూర్తి స్థాయిలో ఫర్నిచర్ రావాల్సి ఉందని, ఎందుకు రాలేదో తెలియడం లేదని చెప్పారు. -
సాగుకు చేయూత..
సాక్షి, వరంగల్ రూరల్ : రైతులు పంటలు సాగు చేసేందుకు బ్యాంకులు చేయూతనిస్తున్నాయి. వ్యవసాయం కోసం పంట రుణాల పరిమితిని పెంచుతూ నాబార్డు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతులకు ఇది శుభవార్తే. వేసవిలో దుక్కులు సిద్ధం చేసుకొని, తొలకరి చినుకులు పడగానే వెంటనే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తారు. వీటిని కొనుగోలు చేయడగానికి రుణాలు ఎంతో అవసరం. ప్రతి ఏడు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణ పరిమితిని పెంచిన నేపథ్యంలో సకాలంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తే వ్యవసాయం సజావుగా సాగుతుంది. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో వ్యవసాయంతోనే జీవనం సాగిస్తున్నారు. గత ఏడు ఖరీఫ్‌లో జిల్లాలో 1,42,704 హెక్టార్ల సాగు కాగా ఈ ఏడు ఖరీఫ్‌లో 146910 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ తదితర పథకాలు అమలు చేసిన ఏటా ఎరువులు, విత్తనాలు, కూలీల ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి, సరైన సమయంలో ఖరీఫ్ యాసంగి రుణాలు మంజూరు చేయకపోవడంతో పెట్టుకోసం వడ్డీ వ్యాపారులు, మార్కెట్లోని దళారులను ఆశ్రయించి పంట దిగుబడి వచ్చిన తరువాత ధాన్యాన్ని వారికే విక్రయించి అప్పులు తీరుస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు సిండికేట్‌గా మారగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏటా రైతులు అప్పులే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట రుణాల పరిమితి పెంచడంతో రైతులకు కొంత ఊరట లభించినట్లయింది. ఆదేశాలు జారీ చేశాం పంట రుణ పరిమితిని ఈ ఏడు ఖరీఫ్‌కు పెంచుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీçసుకున్నాం. ఈ ఆదేశాలను ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు రుణాలు సకాలం అందించి రైతు అభివృద్ధికి కృషి చేయాలి. –హరిప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
ప్రభుత్వ లక్ష్యాలకు నాబార్డు అండ
సాక్షి, హైదరాబాద్: ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నాబార్డు పచ్చజెండా ఊపింది. ఈ రంగాలకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు దిశానిర్దేశం చేసింది. ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర రుణ ప్రణాళిక విధానపత్రంలో ఈ అంశాలను పేర్కొంది. వీటితోపాటు రాష్ట్రంలో ఏయే రంగా లపై దృష్టి సారించాలన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం సాధ్యమవుతుందని పేర్కొంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమపై దృష్టిపెట్టడం ద్వారా వ్యవసాయ పంట ఉత్పత్తుల్లో వృథాను అరికట్టడం, విలువ ఆధారిత అదనపు ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలను ఆర్జించడానికి వీలవుతుందని తెలిపింది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, కాటన్ సీడ్ ఆయిల్, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా అనేక రకాల వాటిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత కల్పించింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యూనిట్లు, రుణాలను ఖరారు చేసింది. 11వేల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.01 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించిన సంగతి తెలిసిందే. అందులో 70% అంటే రూ.70,965 కోట్లు వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్యశాఖ సహా అనుబంధరంగాలకే చెందాలని నిర్దేశించింది. వచ్చే ఏడాది 11,182 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఇందుకోసం రూ.1,145 కోట్లు రుణంగా ఇవ్వాలని సూచించింది. ప్రతిపాదిత అంశాల్లో 667 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, 899 డెయిరీ ప్రొడక్ట్ యూనిట్లు, 482 రైస్ మిల్లులు, 345 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రుణాలు ఇవ్వాలని సూచించింది. వీటితోపాటు కాటన్ సీడ్ ఆయిల్ యూనిట్లు 22, దాల్ మిల్లులు 74, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు 180, మసాలా గ్రైండింగ్ యూనిట్లు 84, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు 14, వేప నూనె మిల్లులు 3 ఉన్నాయి. వీటన్నింటినీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపలు వంటి వాటిని పంట కాలనీల ద్వారా నిర్దేశిత ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఈ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని నాబార్డు తెలిపింది. ట్రాక్టర్లు, పరికరాలకు 1,987 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాబార్డు నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల యంత్రాల కొనుగోలుకు రూ.2,833 కోట్లు కేటాయింపునకు సూచనలు ఇచ్చింది. అందులో కేవలం ట్రాక్టర్లు, పరికరాల కోసమే రూ.1,987 కోట్లు కేటాయించడం గమనార్హం. అంటే వచ్చే ఏడాది అత్యధికంగా ట్రాక్టర్ల రుణాలపైనే సర్కారు దృష్టిసారించింది. అందులో 2,585 సెకండ్ హ్యాండ్ లేదా మినీ ట్రాక్టర్లకు రూ.79 కోట్లు రుణంగా ఇస్తారు. అలాగే 25,356 ట్రాక్టర్లు, ఇతర పరికరాలకు రూ.1,906 కోట్ల రుణం ఇస్తారు. 180 ట్రాక్టర్ డ్రాన్ డైరెక్ట్ సీడింగ్ యూనిట్లకు రూ.1.22 కోట్లు ఇస్తారు. 68 ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్లకు రూ.63 లక్షలు ఇస్తారు. సగం రుణాలు పత్తి, వరి పంటలకే! నాబార్డు ప్రకటించిన విధాన పత్రంలో వచ్చే ఏడాది రూ.49,785 కోట్లు పంట రుణాలకు కేటాయించాలని సూచించగా, అందులో దాదాపు సగం అంటే రూ.24 వేల కోట్లు పత్తి, వరి పంటలకే ఇవ్వాలని ఆదేశించింది. పత్తి రైతులకు రూ.12,456 కోట్లు, వరి రైతులకు రూ.11,635 కోట్లు రుణంగా ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రతిపాదించింది. అలాగే మొక్కజొన్న సాగు చేసే రైతులకు రూ.4,250 కోట్లు కేటాయించింది. మిర్చి సాగు చేసే రైతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. విత్తనోత్పత్తి చేసే రైతులకు కేవలం రూ.142 కోట్లు మాత్రమే రుణంగా ఇవ్వనుంది. -
రాష్ట్ర రుణ ప్రణాళిక...లక్ష్యం రూ.లక్షకోట్లు
సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష కోట్లతో రాష్ట్ర రుణ ప్రణాళిక ఉండాలని నాబార్డు నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులకు దిశానిర్దేశం చేస్తూ బుధవారం ‘స్టేట్ ఫోకస్ పేపర్–2019–20’ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆధ్వర్యంలో విడుదల చేసిన ఈ పత్రంలో మొత్తం 70 శాతం పంట రుణాలకే కేటాయించాలని దిశానిర్దేశం చేయడం గమనార్హం. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఆ మేరకు కేటాయింపులు పెంచాలన్నది నాబార్డు ఉద్దేశంగా కనిపిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ రంగాలకు రుణ కేటాయింపులు ఎలా ఉండాలన్న దానిపై నాబార్డు అన్ని జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి ఈ ఫోకస్ పేపర్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగానే రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) త్వరలో విడుదల చేయనుంది. పంట రుణాలకు రూ. 49,785 కోట్లు... క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వేసిన అంచనా ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,01,378 కోట్ల రుణం లక్ష్యంగా ముందుకు వెళ్లాలంది. 2018–19 ఫోకస్ పేపర్లో రాష్ట్ర రుణ పరిమితి రూ. 83,388 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ. 17,990 కోట్లు కేటాయించాలని పేర్కొంది. రూ. 70,965 కోట్లు ఇచ్చి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలంది. అందులో రూ. 46,344 కోట్లు పంట రుణాలకు , అంటే 2018–19 లక్ష్య పత్రంతో పోలిస్తే అదనంగా రూ. 3,441 కోట్లు కేటాయించాలంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 2,833 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ మార్కెటింగ్‌లో మౌలిక సదుపాయాలు, గోదాములకు రూ. 1401 కోట్లు కేటాయించాలని సూచించింది. గృహ రుణాలకు రూ. 5,834 కోట్లు, విద్యా రుణాలకు రూ. 2,009 కోట్లు కేటాయించింది. 2019–20 నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ ప్రకారం రుణ ప్రణాళిక అంచనా అంశం కేటాయింపు (రూ. కోట్లల్లో) 1) పంట రుణాలు 49,785.59 2) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 21,179.58 3) సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు 21,065.98 4) విద్య రుణాలు 2,009.41 5) గృహ రుణాలు 5,834.94 6) రెన్యువబుల్ ఎనర్జీ 317.38 7) సామాజిక మౌలిక సదుపాయాలు 1008.92 8) ఇతరాలు 176.80 మొత్తం 1,01,378.60 -
నిజమైన సం.. క్రాంతి!
సం..క్రాంతి.. పండుగ కాంతి.. మట్టి పిసికే రైతు ఒంటరిగా ఉంటే విఫణిలో బేలగా నిలబడాల్సి వస్తుంది.. వ్యాపారుల నిలువు దోపిడీకి గురవ్వాల్సి వస్తుంది.. విత్తనాలు, ఎరువులు వ్యాపా రులు చెప్పిన (చిల్లర) ధరకు కొనాల్సి వస్తుంది.. దళారులు చెప్పిన (టోకు) ధరకే పంటను తెగనమ్మాల్సి వస్తుంది...! అటువంటి రైతులే, చేయీ చేయీ కలిపితే మహత్తర శక్తిగా మారొచ్చని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతన్నలు రుజువు చేశారు. ఐకమత్యంతో కదులుతూ చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద పండుగ వేళ లక్ష్మీపూర్ రైతన్నల ఆచరణ నుంచి మనమూ స్ఫూర్తి పొందుదాం.. ఒక్కతాటిపైకి వచ్చిన అన్నదాతలకు నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుదాం.. లక్ష్మీపూర్ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమష్టి శక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ చిన్న గ్రామం లక్ష్మీపూర్. తొలుత సహకార సంఘంగా ఏర్పడిన రైతులు అనతి కాలంలోనే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. లక్ష్మీపూర్ సొసైటీ 2016 డిసెంబర్లో రిజిస్టరైంది. సొసైటీ కన్నా మెరుగైన ప్రయోజనాల కోసం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ)ని రైతులు నాబార్డ్ తోడ్పాటుతో సెప్టెంబర్ 2018లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీకి కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు కూడా ఇటీవలే లభించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను, రాయితీలను, రుణాలను అందుకోవడానికి.. తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్ రైతులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అవకాశం ఏర్పడింది. సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఒకే చోట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే సంఘం రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నేరుగా సంఘానికి వస్తాయి. దీనివల్ల రైతులకు రవాణా భారం, ఖర్చులు తగ్గాయి. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు.. ఆ గ్రామంలో 90 శాతం రైతు కుటుంబాలే. దాదాపు 8 వేల జనాభా. వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టపడి చేస్తూ, ప్రతి పంటలోను తోటి గ్రామాల రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తుంటారు. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, టమాటోలు తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. వేరుశెనగ, కంది పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రతి భూమిలో కనీసం రెండు, మూడు పంటలు పండిస్తారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీ వారిదే. ఎన్నికలయ్యాక మాత్రం అందరూ ఒక్కటిగా మెలుగుతున్నారు. ఒకప్పుడు అందరు రైతుల మాదిరిగానే ఆ రైతులు పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎ.డి. అశోక్‌కుమార్ తోడై, రైతుల ఐకమత్యంతో ఏమేమి సాధించవచ్చో నూరిపోశారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే లక్ష్షీ్మపూర్ రైతుల పరస్పర సహకార సంఘం. సభ్యత్వ రుసుము రూ. 3,500 తొలుత ఐదుగురు సభ్యులు సహకార సంఘానికి బీజం వేశారు. వారి ఆలోచనలు నచ్చిన గ్రామంలోని రైతులందరు సంఘంలో సభ్యులైనారు. కేవలం నెలలోపే, ఎవరి ప్రమేయం లేకుండా 312 మంది రైతులు సభ్యులుగా చేరడం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా చెపుతుంటారు. రెండెకరాల రైతుకు అప్పట్లో సభ్యత్వ రుసుము రూ. 2,300 ఉండేది, ప్రస్తుతం రూ. 3,500కు పెరిగింది. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, మూడు నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సంఘం చైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను ప్రతి రెండేళ్ల కొకసారి ఎన్నుకుంటారు. వీరు సంఘం నిర్మాణం, పటిష్టత, వ్యాపారాలపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమవుతుంటారు. చైర్మన్ సహా ప్రతి సభ్యుడూ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులందరి ముందు ప్రమాణం చేస్తారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు సంఘానికి ప్రత్యేక నిబంధనలు రాసుకుని ముందుకు వెళ్తుండటంతో సొసైటీ విజయపథాన నడుస్తోంది. సర్వసభ్య సమావేశానికి రాకపోతే రూ. 500 జరిమానా, సంఘ డైరెక్టర్లు సమావేశానికి వెళ్లకపోతే రూ. 100 జరిమానా విధిస్తుంటారు. దీంతో, ప్రతి సమావేశానికి సభ్యులందరూ వచ్చి తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సంఘానికి ఆదాయం తెస్తూనే, సంఘ సభ్యుడైన రైతులకు లాభం ఉండేలా తొలుత ‘లక్ష్షీ్మపూర్ రైస్’ను తెర మీదకు తెచ్చి, సఫలీకృతులయ్యారు. ఆ కోవలోనే గ్రామ రైతులు పండించిన విత్తనాన్ని తోటి రైతులకు అందించాలనే ఆకాంక్షతో ‘లక్ష్మీపూర్ సీడ్’ను అమ్ముతున్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లక్ష్మీపూర్ నువ్వుల’ను సైతం మార్కెట్లోకి తీసుకువచ్చారు. క్వింటాలుకు రూ. వెయ్యి అదనపు రాబడి గ్రామంలో ఎక్కువగా బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం వరి రకాలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామస్తులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో, ఎకరాకు 28–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. రైతులు ఎవరికివారే వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, గ్రామంలోని మిల్లులో మర ఆడిస్తారు. అప్పుడు సంఘ ప్రతినిధి బృందం పరిశీలించి, బాగున్నాయనుకుంటేనే సంఘం తీసుకుని, గోదాములో నిల్వ చేస్తుంది. మార్కెట్ రేటు కంటే తక్కువకే నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు. బియ్యం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత సంఘానికి జమ చేసి, మిగతా డబ్బులను వెంటనే రైతులకు చెల్లిస్తుంటారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరూ సన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుతుండటంతో, ధాన్యాన్ని అమ్మిన దాని కంటే, బియ్యం అమ్మగా రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు లాభపడుతున్నారు. లక్ష్మిపూర్ సీడ్‌కు ఆదరణ గ్రామ రైతులు ప్రతి సీజన్లో లక్షల రూపాయలు పెట్టి రక రకాల కంపెనీల వరి విత్తనాన్ని తీసుకువచ్చి పంటే వేసేవారు. కానీ, విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల పంట దిగుబడులు వచ్చేవి కాదు. దీంతో, రైతులందరం కలిసి మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవడం కాదు, తోటి రైతులకు కూడా అందించాలని లక్ష్షీ్మపూర్ సీడ్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. పొలాస పరిశోధనా స్థానం నుంచి వరిలో కొత్త దొడ్డు రకం జెజిఎల్–24423ని దాదాపు 1000 ఎకరాల్లో సాగు చేసి, ఆ విత్తనాన్ని తోటి రైతులకు అమ్ముతున్నారు. వీటితో పాటు ఐఆర్–64, బతుకమ్మ, ఎంటియు–1010 రకాలను కూడా విక్రయిస్తున్నారు. విత్తన రైతులకు మార్కెట్ ధర కంటే రూ. 200 వరకు ఎక్కువ ధర వస్తున్నది. లక్ష్మీపూర్ రైతులు పసుపు పంట తర్వాత నువ్వులు వేస్తుంటారు. గ్రామంలో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు నువ్వులు పండుతాయి. నువ్వులు నాణ్యంగా ఉన్నప్పటికీ, దళారులు రంగ ప్రవేశం చేసి కిలో రూ 70–100 వరకు కొనుగోలు చేసేవారు. దీంతో, రైతులకు సరైన ఆదాయం రాక నష్టపోతుండేవారు. సీడ్స్, రైస్‌తో లక్ష్మీపూర్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చినందున, నువ్వులను సైతం విక్రయిస్తున్నారు. ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. లక్ష్మీపూర్ రైతులు ఐకమత్యంతో చేస్తున్న ప్రతి పనికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తోడ్పాటునిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవ వల్ల గ్రామంలో రూ. 4 కోట్లతో విత్తన శుద్ధి ప్లాంట్ ఏర్పాటైంది. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చైర్మన్ తిరుపతి రెడ్డి రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 2017లో రూ. 11 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు, 2018లో రూ. 14 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు అమ్మారు. సంఘం ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు రూ. 4 కోట్ల టర్నోవర్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు. రైతులు పండించే కూరగాయల అమ్మకానికి లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘటితం కావడం వల్ల రైతులు అధికాదాయం పొందుతున్నారు. సరసమైన ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు దొరుకుతుండటంతో వినియోగదారులూ సంతోషపడుతున్నారు. (వివరాలకు.. సంఘ ప్రతినిధులు మోహన్ రెడ్డి(95020 26069), రాంరెడ్డి(99484 52429) పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలి పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలన్నదే మా సంఘం ప్రధాన ఉద్దేశం. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటూనే సంఘాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. యువ రైతులను, ఖాళీగా ఉండే వెనుకటి పెద్ద మనుషులను సంఘ సలహాదారులు నియమించుకుంటున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒక చోట అందిస్తూనే, ముఖ్యంగా రైతులు పండించిన ప్రతి పంటను ఎలా మార్కెటింగ్ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నాం. అదే మాదిరిగా వినియోగదారులకు సైతం తక్కువ ధరలో ఉత్పత్తులు అందేందుకు ప్రయత్నిస్తున్నాం. – పన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్(93915 28529), లక్ష్మీపూర్ రైతుల సహకార సంఘం, జగిత్యాల జిల్లా సంకల్ప బలమే సక్సెస్‌కు కారణం లక్ష్మీపూర్ సొసైటీ రైతు లోకానికి మార్గదర్శిగా మారింది. ఇక్కడి రైతులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటంతో, చాలా గ్రామాల రైతులు సైతం లక్ష్మీపూర్ రైస్ మాదిరిగా ఆయా గ్రామాల పేర్లతో రైస్ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడి రైతుల్లో సంకల్పం, పట్టుదల, విజయం సాధిస్తామన్న నమ్మకం మెండుగా ఉంది. అందువల్లే ప్రతి పనిలోనూ సక్సెస్ కాగలుగుతున్నారు. – అశోక్‌కుమార్ (85004 28578), జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారు, జగిత్యాల ∙‘లక్ష్మీపూర్ నువ్వుల’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్ శరత్ నువ్వులు విక్రయిస్తున్న సంఘ సభ్యులు – పన్నాల కమలాకర్, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
లక్ష్యం మేరకు రుణాలు
మెదక్ అర్బన్: బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమావేశంలో నిర్దేశించిన రుణాలను మంజూరు చేయాలని సూచిస్తున్నా బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బ్యాంకు నెలలో కనీసం ఐదుగురు లబ్ధిదారులకు ముద్ర రుణాలను తప్పకుండా మంజూరు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు బ్యాంకు ఆ దిశగా మంజూరు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేసినా ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు గ్రౌండింగ్ చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. గ్రౌండింగ్ అయిన వాటి రుణాలకు సంబంధించి త్వరగా యూసీలను అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల వారీగా పెండింగ్‌లో ఉన్న ముద్ర, స్టాండప్, పీఎంఈజీపీతో పాటు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామిక రంగంలో ఆసక్తి ఉన్న వారికి టీ ప్రైడ్, స్టాండప్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసేందుకు బ్యాంకర్ల సహకారం తప్పనిసరి అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తులు అందిన వెంటనే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. నా బార్డు ద్వారా ప్రత్యేక రుణాలు.. 2019–20 సంవత్సరానికి గాను నాబార్డు ద్వారా రూ.2,091.94 కోట్లతో రూపొందించిన రుణ ప్రణాళికను కలెక్టర్ «ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాల కల్పన కింద డెయిరీ, మేకలు, గొర్రెలు, గేదెలు, వ్యవసాయ పనిముట్లు, భూమిని అభివృద్ధి చేసుకునేందుకు, గోడౌన్ల నిర్మాణాలకు రుణ సదుపాయాలను కల్పించనున్నట్లు నాబార్డు అధికారి తిమోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీతారామరావు, ఎల్డీఎం నాగరాజు, జీఎం డీఐసీ రత్నాకర్, కార్పొరేషన్ అధికారులు దేవయ్య, సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల సాగు..రైతుబంధుతో కాస్త బాగు
సాక్షి, హైదరాబాద్: అప్పులు అధికంగా తీసుకునే రైతుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని నాబార్డు స్పష్టం చేసింది. తెలంగాణలో 79.5 శాతం రైతు కుటుంబాలు అప్పులు చేస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై ఒకటో తేదీ నుంచి 2016 జూన్ 30 వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజన్) పేరిట నాబార్డు సర్వే నిర్వహించింది. వ్యవసాయ, వ్యవసాయేతర కుటుంబ ఆదాయాలు, వ్యవసాయ రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై సర్వే చేసింది. 29 రాష్ట్రాలలోని 245 జిల్లాల్లో 2,016 గ్రామాల్లో 40,327 కుటుంబాలను సర్వే చేసింది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆరు జిల్లాల్లోని 48 గ్రామాల్లో 958 కుటుంబాలను సర్వే చేసింది. వాటి వివరాలను తాజాగా బయటపెట్టింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, రైతుబంధుతో గ్రామాల్లో ప్రైవేటు అప్పులు తగ్గాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో సాగు, విత్తన ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తగ్గిందంటున్నారు. కూలీ ద్వారానే అధిక ఆదాయం దేశవ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారాకంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతు న్నారు. ఉదాహ రణకు వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ. 3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి పొలం పనుల ద్వారా రూ.3,025, ఉపాధి కూలీ ద్వారా రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. అలాగే చాలామంది వ్యవ సాయ కుటుం బాలకు వ్యవసాయ యంత్రాలు అందుబాటులో లేవు. కేవలం 5% మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారు. ఇందులో పంజాబ్‌లో అధికంగా 31%, గుజ రాత్లో 14%, మధ్యప్రదేశ్‌లో 13% ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పవర్ టిల్లర్స్ 1.8%, స్ప్రింక్లర్లు 0.8%, సూక్ష్మసేద్యం 1.6%, హార్వెస్టర్లు 0.2% ఉన్నట్లు సర్వే నివేదిక స్పష్టం చేసింది. ఇక మన రాష్ట్రంలో 2017 నుంచి రాష్ట్ర ప్రభు త్వం పెద్దఎత్తున సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసిందని, దీంతో ఇప్పుడు ట్రాక్టర్లు కలిగిఉన్న వారి శాతం పెరి గిందని ఒక వ్యవసాయాధికారి వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులకు వినియోగిస్తున్న యంత్రాలలో పవర్ టిల్లర్స్ (చిన్న సాగు యంత్రాలు)7 శాతం ఉన్నట్లు నాబార్డు సర్వే వెల్లడించింది. చదువుకోని వ్యవసాయ కుటుంబాలు 32 శాతం.. సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల్లో అసలు చదువుకోని (నిర క్షరాస్యులు) వారి శాతం దేశవ్యాప్తంగా 32.2% ఉంది. అలాగే కాస్తో కూస్తో చదవగలిగిన ప్పటికీ సాధారణ విద్య కూడా అభ్యసించని వారు 8% ఉన్నారు. వ్యవసాయేతర కుటుంబాల్లో సాధారణ విద్య అభ్యసించని వారు 7%గా ఉన్నారు. సగటున వ్యవసాయ కుటుంబాల్లో నెలవారీ ఆదాయం రూ.8,931గా ఉంది. అలాగే రాష్ట్రంలో నెలవారీ ఆదాయం రూ.7,811గా ఉంటే ఖర్చు రూ.6,813గా ఉంది. మిగులుతోంది కేవలం రూ.998 మాత్రమే కావడం గమనార్హం. పాడిపశువుల పోషణే ఆర్థిక భరోసా.. పాడి పశు పోషణ ద్వారానే రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నాబార్డు సర్వే స్పష్టం చేసింది. కరువుకాటకాలు వచ్చినప్పుడు, విపత్తులు సంభవించినపుడు పశుసంపదనే కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పశుసంపద కలిగిన దేశాల్లో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వ్యవసాయ కుటుంబాలు 50.7 శాతం పాడి పశువుల పోషణ చేస్తుండగా, దుక్కిటెద్దులు కలిగి ఉన్నవారు 10.8 శాతంగా ఉంది. కోళ్లు వంటివి 5 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వ్యవసాయేతర కుటుంబాల్లో కేవలం 5.7 శాతం మంది మాత్రమే పాడి పోషణ కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారికి, చిన్న, మధ్య తరహా, మహిళా రైతులకు కూడా పాడి ద్వారా ఉపాధి కలుగుతోంది. దీని ప్రకారం వ్యవసాయానికి అనుబంధంగా పాడి పోషణ ఉంటే నష్టాలు వచ్చినపుడు రైతులు నిలదొక్కుకోవచ్చునని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం బర్రెలు లేదా ఆవులు ఇవ్వడం వల్ల ఎంతోకొంత వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొంటున్నారు. -
93 ప్రాజెక్టులకు 65 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న 93 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు 65,634.93 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బ్యాంకు చైర్మన్ హర్షకుమార్ భన్వాలా వెల్లడించారు. పీఎంకేఎస్‌వై కింద మొత్తం 99 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నాబార్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున నిధులు సమకూరుస్తోంది. ఈ 99 ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 70 వేల కోట్ల రూపాయలను నాబార్డు అందించాల్సి ఉంది. భన్వాలా మాట్లాడుతూ 86 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 23,402.72 కోట్లను ఇప్పటికే ఇచ్చేశామనీ, 18 ప్రాజెక్టులు పూర్తవ్వగా మరో ఏడు ప్రాజెక్టుల నిర్మాణం తుదిదశలో ఉందని చెప్పారు. పీఎంకేఎస్‌వై కింద చేపడుతున్న ఈ 99 ప్రాజెక్టుల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణల్లోనూ పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. -
రుణాలే రైతుకు వెన్నెముక
సాక్షి, హైదరాబాద్: రైతుకు రుణాలే ఆధారంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 79.5 శాతం కుటుంబాలు అప్పులు తీసుకుంటున్నాయని నాబార్డు నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సగటున వ్యవసాయ కుటుంబాలు తీసుకుంటున్న రుణం రూ.1.04లక్షలు కాగా, వ్యవసాయేతర కుటుంబాలు తీసుకునేది రూ.76,731గా ఉంది. ఈ లెక్కన వ్యవసాయ కుటుంబాల్లో 52.5శాతం మంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారా కంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై 1నుంచి 2016 జూన్ 30వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) సర్వే నిర్వహించింది. మొత్తం 29 రాష్ట్రాలలోని 245 జిల్లాలో 2,016 గ్రామాలలోని 40,327 కుటుంబాలను సర్వే చేశారు. వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ.3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి రూ.3,025, ఉపాధి కూలీ రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. ఖర్చుల్లో అధికంగా ఆహార అవసరాలకు 51 శాతం, ఇతర అవసరాలకు 49 శాతం వినియోగిస్తున్నారు. అలాగే వ్యవసాయ కుటుంబాలు పెద్ద యంత్రాలను అధికంగా కలిగిలేరని పేర్కొంది. కేవలం 5 శాతం మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారని, పవర్ టిల్లర్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం 1.1 హెక్టార్లు కాగా, కౌలు తీసుకున్న రైతులు 10 శాతం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. కరువు కాటకాల్లో పాడి పశువుల పోషణ వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటోందని సర్వేలో వెల్లడైంది. 79.5శాతం రైతు కుటుంబాలకు రుణాలే ఆధారం నాబార్డ్ అధ్యయనంలో వెల్లడి -
రుణాల పంపిణీలో తాత్సారం వద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని గవర్నర్ నరసింహన్ అన్నారు. రుణాల పంపిణీ సకాలంలో జరిగితేనే పంటలసాగు ప్రక్రియ సులభతరమవుతుంద న్నారు. సూచించారు. గురువారం ఇక్కడ నాబార్డ్ కార్యాలయంలో జరిగిన 37వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో నాబార్డు కీలకపాత్ర పోషిస్తోందన్నారు. మహిళ, గిరిజన రైతులను ప్రోత్సహించాలని, ఆ మేరకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నా వ్యవసాయ అభివృద్ధికి అదేస్థాయిలో ప్రోత్సాహకాల రూపంలో ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, వీటిని క్షేత్రస్థాయిలో రైతాంగానికి తెలియజేయాలని, ఆమేరకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని పెంచాలని, దీంతో తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధించవచ్చని, ఖర్చు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయన్నారు. నీటి గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే వ్యవసాయ పురోగతి వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి.రాధాకృష్ణన్, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊళ్లో రాత్రిళ్లు సూర్యుడు!
సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో బంజేరుపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 124 కుటుంబాలు, 632 మంది జనాభా, 368 మంది ఓటర్లు ఉన్నారు. అంతా వ్యవసాయదారులే. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. అది ప్రతి ఇంటికీ సోలార్ లైట్లు ఉండటం విశేషం. విద్యుత్ కష్టాలతో విసిగి వేసారి.. మారుమూల గ్రామం బంజేరుపల్లి. నాలుగేళ్ల క్రితం విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి. చిన్న ఫ్యూజ్ పోయినా రాత్రంతా జాగారమే. ఇలా విద్యుత్ కష్టాలతోవిసిగివేసారినగ్రామస్తులకు నాబార్డు అధికారి రమేశ్.. ఒక రోజు గ్రామాన్ని పర్యటించి సౌర విద్యుత్ గురించి వివరించారు. నాబార్డు సబ్సిడీ, లబ్ధిదారులు చెల్లించాల్సిన డబ్బుల వివరాలు తెలియజేశారు. దీనికి గ్రామస్తులు సమ్మతించారు. ఫలితంగా 120 కుటుంబాలకు సౌర పలకలు బిగించారు. ఇంకేముంది గ్రామంలో ప్రతి ఇంట్లో సౌర వెలుగులు వచ్చాయి. నాబార్డు సహకారం.. ప్రభుత్వ సాయం.. సౌర విద్యుత్ అంటే పరికరాలు బిగించడానికి వేల రూపాయల ఖర్చుతో పాటు మరమ్మతులు చేయడం కష్టం. 500 యూనిట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు (నాలుగు ట్యూబ్‌లు, 5 ఫ్యాన్లు, కూలర్, టీవీ, ఫ్రిడ్జ్,వన్ హెచ్‌పీ మోటార్ మొదలైనవి వినియోగించేందుకు సరిపడా విద్యుత్) రూ.85,000 ఖర్చు అవుతుంది. అయితే, నాబార్డు చెల్లించే సబ్సిడీ 40 శాతం పోగా.. లబ్ధిదారుడు చెల్లించే వాటా కోసం స్థానిక బ్యాంకు నుంచి సులభ వాయిదాలతో రుణాలు ఇప్పించారు. మిగిలిన డిపాజిట్ కుటుంబానికి రూ.8,500 చొప్పున వసూలు చేశారు. వీటితో సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్ తెచ్చి నాబార్డు అనుబంధ మెకానిక్‌లు బిగించారు. పిడుగుపాటు నుంచి రక్షణగా లైట్నింగ్ అరెస్టర్లు కూడా బిగించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల, మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు గ్రామస్తులను అభినందించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నామమాత్రంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు.. ఊరంతా సౌర విద్యుత్ వినియోగించడంతో విద్యుత్ బిల్లులు నామ మాత్రంగానే చెల్లిస్తున్నారు. గ్రామం లో 120 గృహలకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా, గతం లో నెలకు గ్రామం మొత్తానికి కలిపి రూ.25 వేలకుపైగా బిల్లులు చెల్లించేవారు. సోలార్ విద్యుత్‌కు సంబంధించి 2 నెలలకోసారి మినిమం చార్జీ కింద రూ.12 వేలు చెల్లిస్తే సరిపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో వీధి దీపాల కోసం 60 యూనిట్లు బిగించారు. వీటి నిర్వహణ గ్రామ పంచా యతీ చూసుకుంటోందని గ్రామస్తులు తెలిపారు. -
చిరుధాన్యాల రైతుకు ఎకరానికి రూ.4 వేలు!
జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని, వినియోగాన్ని పెంపొందించడం ద్వారా పోషకాహార లోపాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ‘మిల్లెట్ మిషన్’ను 2018–19 నుంచి అమల్లోకి తెస్తున్నది. ఐదేళ్లలో రూ. 1,700 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. తొలి ఏడాదిలో రూ. 300 కోట్లు కేటాయించారు. చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సంచాలకులు డా. విలాస్ ఎ. తొనపి వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లో తొలుత మిల్లెట్ మిషన్ ఈ ఖరీఫ్ నుంచే అమల్లోకి వస్తుందని ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలు.. ► ‘మిల్లెట్ మిషన్’ విశేషాలేమిటి? హరిత విప్లవ కాలంలో వరి, గోధుమల సాగుపై దృష్టి కేంద్రీకరించడంతో పోషకాల గనులైన చిరుధాన్యాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో పౌష్టికాహార లోపం ఏర్పడడంతోపాటు జీవన శైలి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిని కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మిల్లెట్ మిషన్ అమలుకు తొలి అడుగు పడింది. తొలుత 13 రాష్ట్రాల్లో మిల్లెట్ మిషన్‌ను ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి తెస్తున్నాం. ఐదేళ్లలో రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తాం. 2018–19లో రూ. 300 ఖర్చు చేయనున్నాం. ► చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు..? జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలను సాగు చేసే రైతులతో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తాం. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ, నాబార్డు, ఐ.ఐ.ఎం.ఆర్. బాధ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ మిల్లెట్ మిషన్ అమలును పర్యవేక్షిస్తుంది. 2018–19 ఖరీఫ్ సీజన్ నుంచే చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల వరకు నేరుగా నగదు బదిలీ చేస్తాం. చిరుధాన్యాల ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో అత్యధికంగా చిరుధాన్యాలను సాగు చేస్తున్నది మన దేశమే. దేశంలో 1.7 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. 1.8 కోట్ల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి సంవత్సరం పది శాతం సాగు పెంచాలన్నది లక్ష్యం. ► ప్రోత్సాహకాలు రైతులకా.. రైతు బృందాలకా? రైతులకు వ్యక్తిగతంగా కాదు. చిరుధాన్యాలు పండించే రైతుల ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్.పి.ఓ.) ద్వారా అందిస్తాం. నాబార్డు ద్వారా ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును కూడా మిల్లెట్ మిషన్ నిధుల నుంచి కేటాయిస్తాం. తెలంగాణా రాష్ట్రంలో 8 జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సాహానికి ఏర్పాటు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక జిల్లాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా చిన్న చిరుధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగల సాగును విలేజ్ క్లస్టర్ల ద్వారా ప్రోత్సహించడం.. స్థానికంగానే వినియోగంలోకి తేవడానికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారిస్తున్నాం. స్వయం సహాయక బృందాల ద్వారా 100 మిల్లెట్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. ఎఫ్.పి.ఓ.లు కొన్నిటిని కలిపి ఫెడరేషన్‌గా ఏర్పాటు చేస్తాం. ► విత్తనం కోసం ఎవరిని సంప్రదించాలి? హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (డా.రఘునా«ద్: 99842 15020, డా. వెంకటేష్ భట్: 94406 44040)లో, నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (డా. సుబ్బారావు: 99896 25227), విజయనగరంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం(డా. పాత్రో: 97010 23194) చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ► ప్రాసెసింగ్ యంత్రాలపై సబ్సిడీ ఇస్తారా? పౌష్టికాహార లోపం, జీవనశైలి వ్యాధుల బెడద ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసుల్లో కూడా అధికంగానే ఉన్నాయి. అందువల్ల చిరుధాన్యాల వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా పెంచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు సాగు చేసిన చిరుధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి స్థానికంగానే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తాయి. రైతుల పొలాల దగ్గరలోనే ప్రాథమిక స్థాయి ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఎఫ్.పి.ఓ.లకు ప్రాసెసింగ్ మిషన్లను సబ్సిడీపై అందిస్తాం. చిరుధాన్యాలను నిల్వ చేసుకోవడానికి గోదాముల నిర్మాణానికి కూడా తోడ్పాటునందిస్తాం. ప్రభుత్వ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటాం. ప్రస్తుతం ప్రోసెసర్లు చిరుధాన్యాల రైతులను దోపిడీ చేస్తున్నారు. అలా కాకుండా రైతులకు సాగు ఖర్చులకు 50% అదనంగా ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ► చిరుధాన్య ఉత్పత్తులకు ప్రోత్సాహం చర్యలేమిటì ? హైదరాబాద్‌లోని ఐ.ఐ.ఎం.ఆర్.లో ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రత్యేక శిక్షణా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం వివరాలకు డా. దయాకర్‌రావు (99897 10405), డా. సంగప్ప (98800 45728)లను సంప్రదించవచ్చు. ► డాక్టర్ ఖాదర్‌వలి చిరుధాన్యాలకు సిరిధాన్యాలని పేరుపెట్టి.. రోగులకు ఔషధాలుగా ఇచ్చి జబ్బులు నయం చేస్తున్నారు. దీనిపై ఐ.ఐ.ఎం.ఆర్. అభిప్రాయం ఏమిటి.? అవును. మా దృష్టికి వచ్చింది. డాక్టర్ ఖాదర్ వలి గారు గొప్ప సేవ చేస్తున్నారు. ఆయనను ఆహ్వానించి గౌరవించాలనుకుంటున్నాం. ఆయన అనుసరిస్తున్న చికిత్సా పద్ధతిపై అధ్యయనం చేయించి.. చిరుధాన్యాల వినియోగం వ్యాప్తికి చేపట్టనున్న ప్రచారోద్యమంలో ఈ భావనను అంతర్భాగం చేస్తాం. ఈ కృషిలో ఆయుష్ శాఖ నిపుణుల తోడ్పాటు కూడా తీసుకుంటాం. (డా. తొనపిని 85018 78645 నంబరులో సంప్రదించవచ్చు. millets.icar@nic.in director.millets@icar.gov.in) -
'ఈ' పక్షి 'ముం'చేసింది
నిడదవోలు: 2006లో కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఈము పక్షుల పెంపకానికి సుమారు 400 మంది రైతులకు రుణాలు అందజేసింది. వంద పక్షులకు ఒక యూనిట్ చొప్పున ఒక్కొక్క యూనిట్‌కు రూ.30 లక్షల బాంకు నుంచి రుణంగా అందజేసింది. రుణాలతో పాటు రైతులు సొంత పెట్టుబడులతో పొలా లను లీజుకు తీసుకుని పక్షుల పెంపకాన్ని మొదలుపెట్టారు. ప్రారంభంలో వీటి మార్కెటింగ్ బాగానే ఉన్నా రాను రాను సరైన మార్కెటింగ్ లేదు. దేశ విదేశాల్లో ఈము పచ్చిమాంసాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెంపకందారులు తీవ్రంగా నష్టపోయారు. రైతును దగా చేసిన ప్రభుత్వం రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 27 లక్షలురుణమిస్తామంటూ ప్రభుత్వం రైతులను నమ్మించింది. నాబార్డు ద్వారా రూ.15 లక్షలు వడ్డీ లేని రుణం, రూ.12 లక్షలు బ్యాంక్ ద్వారా వడ్డీకి రుణం ఇచ్చారు. ఈ పెట్టుబడితో ఒక్కో రైతు యూనిట్‌కు 100 ఈము పక్షుల ఫామ్ ఏర్పాటు చేసుకుని పెంపకం చేశారు. పెంపకందారు నుండి తామే పక్షులను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నమ్మబలకడంతో అప్పట్లో వందలాది మంది రైతులు ఈ పక్షుల పెంపకానికి మొగ్గు చూపారు. అయితే ప్రభుత్వం మార్కెటింగ్ కల్పించకపోవడంతో పక్షులను కొనుగోలు చేసేవారు లేక రైతులు నిండా మునిగిపోయారు. ప్రోసెసింగ్ కేంద్రమే లేదు ఒక ఈము పక్షిని పెంచిన తరువాత 40 నుంచి 50 కేజీల వరకు మాంసం వస్తుంది. ఒక్కో ఈము పక్షి నుండి 8 లీటర్ల ఈము నూనె లభిస్తుంది. దీనిని లీటరు రూ.7 వేలు చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నాబార్డు ద్వారా ప్రచారం చేసింది. కేజీ మాంసం రూ. 700 లు, చర్మం రూ.4 వేల లెక్కన ఒక్కో పక్షికి సుమారు రూ.60 వేలు వరకు చెల్లించి ప్రోసెసింగ్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఊదరగొట్టింది. దీని నిమిత్తం అప్పట్లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో రైతులకు శిక్షణ నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈము పక్షి నుంచి మాంసం, నూనె, చర్మాలను వేరుచేసే ప్రోసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో రైతుల వద్ద పక్షులను కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడు. పక్షులకు రోగం వస్తే అంతే సంగతులు ఈము పక్షులకు రోగం వస్తే సరైన చికిత్స అందించలేకపోవడం దీని వైఫల్యానికి గల కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. పశువైద్యశాఖ వద్ద ఈము పక్షికి సంబంధించిన వ్యాక్సిన్లు లేవు. వర్షాకాలం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీటికి వచ్చే వ్యాధులను నయం చేసేందుకు మందులు లేకపోవడంతోపాటు వైద్యమే అందలేదని రైతులు వాపోతున్నారు. జబ్బుపడిన కొన్ని పక్షులు మృత్యువాతపడి చనిపోయాయి. పక్షికి రోజుకి రూ.30 తిండి ఖర్చు అవుతుంది. 100 పక్షులను పెంచే రైతుకు రోజు రూ.3 వేల వరకు పెట్టుబడి కావాలి. దీనితో పెంపకందారులు బెంబేలెత్తిపోయారు. భారీ పెట్టుబడులు పెట్టి 200 నుండి 300 పక్షుల వరకు పెంచే రైతుల్లో కొందరు వాటిని పూర్తిగా వదిలించుకున్నారు. తడిసి మోపెడు ఈము పక్షి ఫామ్ ఏర్పాటుకు ముందుగా రైతు తన వాటాకింద సొంత డబ్బులు రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలి. నాబార్డు ద్వారా రూ.15 లక్షలు వడ్డీలేని రుణం, రూ.12 లక్షలు బ్యాంకుల ద్వారా వడ్డీతో కూడిన రుణం అందించగా మొత్తం 30 లక్షలతో ఈము పక్షుల ఫామ్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఫామ్‌లో మొత్తం 100 పక్షులు పెంపకానికి రైతులు రంగం సిద్ధం చేసుకున్నారు. భూమి లేని రైతు ఎకరం పొలం లీజుకు తీసుకుని చుట్టూ కంచె, పక్షుల గుడారాలు, విద్యుత్ సదుపాయం, మంచినీటి సదుపాయంతోపాటు నలుగురు కూలీలను నియమించుకున్నారు. వీటికి ఖర్చు సుమారు రూ.6లక్షలు అవుతుంది. 100 పక్షుల కొనుగోలుకు రూ.3.50 లక్షలు, కూలీలు, పక్షుల ఆహారానికి సుమారు నెలకు రూ.లక్ష చొప్పున ఖర్చవుతుంది. ఇలా అన్ని పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారు. దీనితో పెట్టుబడులు రాక, నాబార్డు ఇచ్చిన రుణాలు చెల్లించలేక రైతులు కుదేలయ్యారు. కొంతమంది అయినకాడికి భూములు అమ్మి అప్పులు చెల్లించారు. మరి కొంతమంది మనోవేదనతో మంచం పట్టారు. కొంతమంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. జిల్లాలోనే అధికం రాష్ట్రంలో ఈము పక్షుల పెంపకంలో అప్పట్లో పశ్చిమగోదావరి జిల్లా ముం దంజలో ఉండేది. జిల్లాలో సుమారు 20 వేల పక్షులను పెంచారు. మొదట్లో ప్రభుత్వం ప్రోత్సాహం బాగుండటంతో జిల్లాలోని రైతులు వీటి పెంపకంపై ఆసక్తి చూపించారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, చింతలపూడి, ప్రగడవరం, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, జంగారెడ్డిగూడెం, చాగల్లు తదితర ప్రాంతాలలో సుమారు వంద మంది రైతులు ఈము ఫామ్‌లు నిర్వహించారు. నష్టాలు భరించలేక కొద్దికాలంలోనే అవన్నీ పూర్తిగా మూసివేశారు. నాబార్డు సబ్సిడీ7.50 లక్షలు ఎగనామం ఈము పక్షుల పెంపకంతో తీవ్రంగా నష్టపోయినందు వల్ల తీసుకున్న బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో రైతులు ఆందోళన చేశారు. ఈము పక్షుల పెంపకందారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రైతులు ధర్నాలు చేశారు. ఈము పక్షుల పెంపకం ద్వారా అధిక లాభాలు వస్తాయని ప్రభుత్వం ప్రోత్సహించడం వల్లే ఫామ్‌లను పెట్టామని రైతులు వాపోయారు. రైతులకు ప్రభుత్వం సరైన మార్కెట్ కల్పించకపోవడంతో నష్టపోయామన్నారు. నాబార్డు ద్వారా రైతులకు ఇవ్వాల్సిన 7.50 లక్షల సబ్సిడీ రుణాల్ని ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈము ఆయిల్‌కు మంచి గిరాకీ ఈము మాంసంతోపాటు ఈము ఆయిల్‌కు అరబ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పక్షి కొవ్వు నుంచి ఈము ఆయిల్‌ను తీస్తారు. విదేశాల్లో వివిధ ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. అమెరికాలో మంచి మార్కెట్ ఉన్నా ఆ దిశగా అధికారులు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుమతులు తీసుకోకపోవడంతో రైతులు నష్టపోయారు. 2014లో కృష్ణా జిల్లా నూజివీడులో ఓ ప్రయివేటు సంస్థ ఈము పక్షుల ప్రోసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే అది మూడు మాసాలకే మూతపడటంతో పక్షలకు మార్కెటింగ్ లేక రైతులు తీవ్రంగానష్టపోయారు. -
రుణ పరపతి రూ.83,400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రుణ పరపతి అంచనా రూ.83,400 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని నాబార్డు వెల్లడిం చింది. అందులో వ్యవసాయ, అనుబంధ దీర్ఘకాలిక రుణాలు రూ.16 వేల కోట్లు ఉంటాయని తెలిపింది. మంగళవారం ఈ మేరకు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. ఈ అంచనా ప్రకారమే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) రుణ ప్రణాళికను ఖరారు చేస్తుందని తెలిపారు. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు తరఫున రూ.12,200 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 అభివృద్ధి పథకాలకు రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన మిషన్ భగీరథకు రూ.6,791 కోట్లు మంజూరు చేశామని, అందులో ఇప్పటివరకు రూ.3,884 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో పాడి అభివృద్ధి, కూరగాయల సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, సమగ్ర వ్యవసాయ వ్యవస్థలకు తోడ్పాటు అందిస్తామని వివరించారు. 2022–23 నాటికి రైతు ఆదాయం రెట్టింపునకు తమ వంతు సాయం చేస్తామన్నారు. 2018–2023 మధ్య రాష్ట్రంలో వివిధ రకాల చెందిన 4.02 లక్షల యూనిట్లు స్థాపించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అందుకు రూ.5,639 కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 225 రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గతేడాది రుణ ప్రణాళికలో 78 శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు. రైతుబంధు పథకం కింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసినా వారు బ్యాంకు రుణాలు తీసుకుంటారని రాధాకృష్ణన్ అన్నారు. కౌలు రైతులకు కూడా వ్యక్తిగత రుణాలు ఇస్తామని, ఈ మేరకు తాము బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. -
ఏఐబీపీ ప్రాజెక్టులకు సత్వర రుణం
సాక్షి, న్యూఢిల్లీ : సత్వర సాగు ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద తెలంగాణలో ఎంపిక చేసిన 11 ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలంటే కేంద్రం నాబార్డు ద్వారా పూర్తిస్థాయిలో రుణం ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దీన్ని ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి పరిధిలోకి తీసుకురాకుండా మంజూరు చేయాలని సూచించారు. ఏఐబీపీ కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులపై వివిధ రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులతో గురువారం ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం నిర్వహించారు. ఏఐబీపీ కింద మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాజెక్టుల పనుల్లో పురోగతిపై ఈ భేటీలో గడ్కరీ సమీక్షించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హరీశ్‌రావు ప్రాజెక్టుల సత్వర పూర్తికి కేంద్రానికి పలు సూచనలు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటోందని, కేంద్రం ఆయా ప్రాజెక్టులకు గ్రాంట్స్ రూపంలో కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. అందువల్ల కనీసం రుణంగా ఇచ్చే నిధులనైనా వేగంగా ఒకేసారి పూర్తి స్థాయిలో నాబార్డు ద్వారా విడుదల చేయించాలని హరీశ్ సూచించారు. 11 ప్రాజెక్టుల్లో ప్రస్తుతానికి రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో ఆరు ప్రాజెక్టులను జూన్ నాటికి పూర్తి చేసి మిగిలిన వాటిని వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 450 కోట్ల నిధుల ప్రతిపాదనలు, భీమా ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 35 కోట్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని, వాటిని ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురాకుండా నాబార్డు ద్వారా రుణం మంజూరుకు సంబంధించి ఒక నోట్ తయారు చేయాలని.. దీన్ని ప్రధాని, కేబినెట్ ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు ఈ భేటీ అనంతరం హరీశ్ మీడియాకు తెలిపారు. నీటి లెక్కలు తేల్చకుండా సరికాదు.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డు పెండింగ్‌లో ఉండగా ప్రాజెక్టులను కృష్ణా నది బోర్డు పరిధిలోకి తీసుకురావడం సరికాదని హరీశ్ పేర్కొన్నారు. తొలుత నీటి కేటాయింపుల గురించి తేల్చాలని కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన జరిగిన గోదావరి, కృష్ణా బోర్డుల సమావేశంలో చెప్పామన్నారు. ఏపీ సర్కారు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తున్న నీటిలో తెలంగాణకు 45 టీఎంసీల హక్కు ఉందని, ఈ లెక్క తేల్చాలని కోరామన్నారు. నీటి లెక్కలు తేల్చిన తరువాత ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడం వల్ల బోర్డు కూడా రెగ్యులేట్ చేయగలుగుతుందని అన్నారు. తెలంగాణలో రాష్ట్ర పరిధిలోనే కాళేశ్వరం ద్వారా నీటి మళ్లింపు ఉంటుంది కాబట్టి ఇందులో ఏపీకి హక్కు ఉంటుందని చెప్పడం అవగాహనరాహిత్యమని హరీశ్ పేర్కొన్నారు. సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, తుదుపరి భేటీలో నీటి లెక్కలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు తెలంగాణ పెద్దపీట వేస్తోంది: గడ్కరీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధపై కేంద్ర మంత్రి గడ్కరీ ప్రత్యేకంగా ప్రశంసించారు. సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల భవిష్యత్తులో తెలంగాణ సత్ఫలితాలు అందుకుంటుందన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యం విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచించారు. బిహార్‌కు సంబంధించిన ఏఐబీపీ ప్రాజెక్టుల పనులపై సమీక్ష సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలమూరుకు అటవీ అనుమతులివ్వండి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి తొలి దశ అటవీ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్‌ను మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర మంత్రిని ఆయన కార్యాలయంలో కలుసుకున్న హరీశ్‌రావు... పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు, సీతారామ ఎత్తిపోతల పథకానికి వన్యప్రాణి బోర్డు నుంచి రావాల్సిన అనుమతులపై చర్చించారు. సీతారామ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి ఈ నెల్లో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హర్షవర్ధన్...అనుమతుల మంజూరుపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆహ్వానించగా గడ్కరీ, హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారన్నారు. -
పంట రుణ లక్ష్యం రూ.46 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.46,344.61 కోట్ల మేర పంట రుణాలు అందజేయాలని నాబార్డు లక్ష్యంగా నిర్దేశించింది. మొత్తంగా అన్ని రంగాలకు కలిపి గతేడాది కంటే 17 శాతం అధికంగా రూ. 83,388.87 కోట్ల రుణాలు అందజేయాలని నిర్ణయించింది. పంట రుణాలకు అదనంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశు సంవర్థక రంగాలకు అదనంగా రుణాలివ్వాలని.. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2,667 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. విద్యా రుణాలకు రూ. 1,206 కోట్లు, గృహ రుణాలకు రూ.3,759 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. నాబార్డు రూపొందించిన ‘2018–19 రుణ విధాన పత్రాన్ని హరీశ్‌రావు మంగళవారం విడుదల చేశారు. జూన్ నాటికే పంట రుణాలివ్వాలి. బ్యాంకులు తమ వద్ద తనఖాగా పెట్టుకున్న పాస్ పుస్తకాలను రైతులకు తిరిగి ఇచ్చేయాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇక ముందు పంట రుణాలు తీసుకోవడానికి పాస్ పుస్తకాలు అవసరం లేదు. రైతుల పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. బ్యాంకులు పరిశీలన పేరుతో పాస్ పుస్తకాలు తీసుకుని.. ఇప్పటికీ ఇవ్వలేదు. పాస్ పుస్తకాలను తిరిగి వెనక్కి ఇచ్చేలా నాబార్డు ఆదేశాలు జారీచేయాలి’’అని కోరారు. బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మే– జూన్ నెలల్లోనే లక్ష్యం మేరకు పంట రుణాలు అందజేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందన్నారు. కోల్డ్ స్టోరేజీలకు నాబార్డు రుణం అందజేయా లని కోరారు. ప్రభుత్వం ఎన్నికల కోసమే రైతులకు పెట్టుబడి సాయం వంటివి ఇస్తోందన్న ఆరోపణలు సరికాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశంలో 73 శాతం సంపద ఒక శాతం మంది చేతిలో ఉండటం మంచి పరిణామం కాదని.. సంపద అందరికీ చేరాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.సుబ్రమణ్యన్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మణికందన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు రెట్లు పెరిగిన నాబార్డ్ మూలధనం!
న్యూఢిల్లీ: నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచడానికి వీలుకల్పిస్తున్న బిల్లుకు గురువారం పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇంతకన్నా ఎక్కువ అవసరం అయితే, ఆర్బీఐతో సంప్రదింపుల ద్వారా కేంద్రం ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే వీలుంటుంది. ‘‘2017 స్థానంలో 2018’’ని చేరుస్తూ సవరించిన బిల్లును మంగళవారం రాజ్యసభ ఆమోదించగా... గురువారం లోక్‌సభ కూడా ఆమోదించింది. దీంతో బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లయ్యింది. దివాలా బిల్లుకూ ఆమోదం... ‘‘2017 స్థానంలో 2018’’ని చేరుస్తూ రాజ్యసభ ఆమోదించిన దివాలా సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. దివాలా ప్రొసీడింగ్స్ ద్వారా మొండి బకాయిల (ఎన్పీఏ) రికవరీకి సంబంధించిన వేలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఎన్పీఏ అకౌంట్ హోల్డర్లు బిడ్డింగ్ వేయకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అయితే ఆయా వ్యక్తులు తమ బకాయిలన్నింటినీ వడ్డీలు, చార్జీలతో సహా చెల్లించేసినట్లయితే, వారు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులవుతారు. -
ఆ కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై), నాబార్డ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సదరు కాంట్రాక్టర్ల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాబార్డ్, పీఎంజీఎస్‌వై పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పనులు, జాప్యానికి గల కారణాలపై ఈఈ, ఎస్ఈలతో చర్చించారు. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులను పూర్తి చేయడం ద్వారా కేంద్రం నుంచి అదనంగా నిధులను పొందేందుకు వీలుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 151 పనులకు టెండర్లు పూర్తి.. పీఎంజీఎస్‌వై కింద దాదాపు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని జూపల్లి వెల్లడించారు. ఇందులో రూ.300 కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని, మిగిలిన పనులను కూడా జూన్ 30లోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 154 పనులను పూర్తి చేసే లక్ష్యం రూపొందించుకున్నామని, ఇందులో 151 పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. -
రైతు రుణాల మాఫీ సరి కాదు
► నైతికత ప్రమాదంలో పడుతుంది ► నాబార్డ్ చైర్మన్ హర్ష కుమార్ భన్వాలా ముంబై: రైతుల రుణాల మాఫీ సరికాదని, దీంతో నైతికత ప్రమాదంలో పడుతుందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)చైర్మన్ హర్ష కుమార్ భన్వాలా వ్యాఖ్యానించారు. గంపగుత్తగా రైతులందరికీ రుణ మాఫీ చేయడం కాకుండా.. అవసరమైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు కల్పించవచ్చని ఆయన చెప్పారు. ‘రుణాల చెల్లింపు కోణం నుంచి చూస్తే రుణ మాఫీలనేవి నైతికతకు ప్రమాదకరం. అందరికీ మాఫీ చేసేయడం సరికాదు‘ అనిహర్ష కుమార్ అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.36,000 కోట్ల మేర రైతు రుణ మాఫీ ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా ఇటువంటి ప్యాకేజీలపై విముఖత వ్యక్తం చేయటం తెలిసిందే. తమిళనాడు, హరియాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా రుణాల మాఫీ డిమాండ్లు వస్తుండటంతో.. ఈ తరహా పథకాల వల్ల తలెత్తే నైతిక సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భన్వాలా చెప్పారు. అవసరమున్న రైతులకు మాత్రమే ఇలాంటి స్కీములను వర్తింపచేయడం మంచిదన్నారు. పన్నుల చెల్లింపుదారుల సొమ్మును రుణాల మాఫీ పథకాలకు మళ్లించడం సరికాదని భన్వాలా అభిప్రాయపడ్డారు. రుణ వితరణ లక్ష్యం అధిగమిస్తాం.. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన రూ. 9 లక్షల కోట్ల అగ్రి లోన్స్ లక్ష్యాన్ని ఆర్థిక సంస్థలు అధిగమించగలవని భన్వాలా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్ల టార్గెట్‌ను దాటగలవన్నారు. దీర్ఘకాలిక సాగు నిధిపై నాబార్డ్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని.. ఇందులో భాగంగా నిర్ధిష్ట ప్రాజెక్టులకు రూ. 25,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నదని భన్వాలా పేర్కొన్నారు. ఈ ఏడాది సూక్ష్మ–సాగు రంగంపై రూ. 2,000 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. తమ మొత్తం లోన్ బుక్‌లో దీర్ఘకాలిక రుణాల పరిమాణం రెండేళ్ల క్రితం 19 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 24 శాతానికి ఎగిసిందని భన్వాలా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో వెయ్యి మంది పైగా రైతులున్న పది గ్రామాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇక పెద్ద నోట్ల రద్దు తొలినాళ్లలో రీపేమెంట్లు ఒక్కసారిగా పెరిగాయని, ఆ తర్వాత రుణాలకు డిమాండ్ తగ్గిందని చెప్పారు. అయినప్పటికీ నిర్దేశిత రూ. 9 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. -
పోలవరం కల సాకారమెలా?
⇒ బడ్జెట్లో రూ.9 కోట్లు మాత్రమే కేటాయించిన రాష్ట్ర సర్కార్ ⇒ కేంద్రం నాబార్డు ద్వారా రూ.6,880 కోట్ల రుణం ఇప్పిస్తుందని అంచనా! ⇒ 2018 నాటికి పాక్షికంగా,2019 నాటికి పూర్తిగా ప్రాజెక్టు సిద్ధమవుతుందని హామీ అమరావతి: రాష్ట్రానికి వర ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్లో ప్రభుత్వం రూ.9 కోట్లను మాత్రమే కేటాయించింది. అయితే కేంద్రం.. నాబార్డు నుంచి రూ.6,880 కోట్లను రుణంగా ఇప్పిస్తుందని అంచనా వేసింది. కానీ గతేడాది డిసెంబర్ 26న నాబార్డు ద్వారా వచ్చిన రూ.1,981.54 కోట్ల వినియోగానికి సంబంధించిన వినియోగపత్రాలు పంపితేనే కేంద్రం మరో దఫా రుణం ఇప్పించే అవకాశం ఉంటుంది. అంతేతప్ప రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో కేంద్రం రుణం మంజూరు చేసే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2010–11 ఎస్ఎస్ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 నాటికే పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే.. ఆ ప్రాజెక్టు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఏప్రిల్ 1, 2014 నుంచి చేసిన ఖర్చును మాత్రమే రీయింబర్స్మెంట్ చేస్తామని స్పష్టం చేసింది. ఆ నిధులను కూడా నాబార్డు ద్వారా రుణం ఇప్పిస్తామని తేల్చిచెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.40,351.65 కోట్లకు పెంచేస్తూ ప్రతిపాదనలు పంపింది. ఏటా ధరల సర్దుబాటు కింద పది శాతం అంచనా వ్యయం పెరుగుతుందని.. 2019 నాటికి అంచనా వ్యయం రూ.42 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదించింది. ఏప్రిల్ 1, 2014 నుంచి గత ఫిబ్రవరి ఆఖరు నాటికి రూ.3,762.52 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇలా అరకొరగానే కేటాయింపులు చేస్తూ.. 2019 నాటి పోలవరంను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అలా పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభు త్వ అంచనాల ప్రకారమే మరో రూ.33 వేల కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.9 కోట్లు. మరోవైపు నాబార్డు రుణం మంజూరు అనుమానాస్పదమే. 2019 నాటికి పోలవరం ఎలా పూర్తవుతుందో చంద్రబాబే చెప్పాలి. -
రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం!
నాబార్డు నుంచి నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో రూ.వెయ్యి కోట్లతో సూక్ష్మ సేద్యం పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తద్వారా దాదాపు 3లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటు లోకి తేవాలని, జూన్ నాటికల్లా ఈ కార్యక్ర మాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నాబార్డు నుంచి రూ.874 కోట్లు మంజూరు కాగా, మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 2015–16 బడ్జెట్లోనూ 1.03లక్షల ఎకరాలకు రూ.308కోట్లు కేటా యించగా.. 2.63 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలని కోరుతూ 1.03 లక్షలమంది రైతులు దరఖాస్తు చేసుకున్నా రు. 2016–17లో 3.37లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం రూ.290 కోట్లు కేటాయించింది. అయితే లక్ష్యం చేరు కునేందుకు ఈ సొమ్ము సరిపోదు. దీంతో నాబార్డు నుంచి రూ.874 కోట్లు అప్పు తీసు కుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖా స్తుల న్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం పరికరాలు మంజూరు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం! సూక్ష్మ సేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా (100 శాతం సబ్సిడీ తో) అందజేస్తోంది. బీసీలకు, ఇతర సన్న చిన్నకారు రైతులకు ప్రస్తుతం 90శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల్లో 16.05 శాతం ఎస్సీ రైతులకు, 9.55 శాతం ఎస్టీ రైతులకు, 64.40 శాతం సన్న చిన్నకారు రైతులకు కేటాయిస్తారు. వర్షాభావ ప్రాంతా ల్లో తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసేందుకు.. నీరు వృథా కాకుండా ఉండేం దుకు సూక్ష్మ సేద్యం ఉపకరిస్తుంది. -
3.62 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం
• కేంద్రం నుంచి రూ. 250 కోట్లు వచ్చే అవకాశం • మరోవైపు నాబార్డు నిధులు రూ. 874 కోట్లు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండేళ్లలో 3.62 లక్షల ఎకరాలను సూక్ష్మసేద్యం కిందికి తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 250 కోట్లు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అదిగాకుండా ఇప్పటికే నాబార్డు నుంచి ఉద్యానశాఖకు సూక్ష్మసేద్యం కోసం రూ. 874 కోట్లు మంజూరైన సంగతి విదితమే. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ. 150 కోట్లు ఉంటుంది. వీటితో 2016–17, 2017–18 సంవత్సరాల్లో పెద్దఎత్తున సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వచ్చే బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిం చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రం నుంచి, నాబార్డు నుంచి నిధులు వస్తున్నందున కేటాయించే అవకా శాలు లేవని అంటున్నారు. వాస్తవంగా సూక్ష్మసేద్యానికి రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కానీ ఆ మేరకు నిధులు లేకపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. 2015–16 బడ్జెట్లోనూ 1.03 లక్షల ఎకరాలకు రూ. 308 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో 2.63 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యం కావాలని 1.03 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్యానికి మించి రెండున్నర రెట్లు డిమాండ్ వచ్చింది. దీంతో 1.60 లక్షల ఎకరాలకు చెందిన రైతుల దరఖాస్తులను సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వాటికి కూడా సూక్ష్మసేద్యం అందించాలంటే బడ్జెట్ కేటాయింపులకు తోడు అదనంగా రూ. 337.30 కోట్లు కేటాయించాలి. అప్పుడూ నిధుల సమస్య ఎదురైంది. 2016–17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం కోసం రూ. 290 కోట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ సొమ్ము సరిపోదు. ఇది ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఆ మొత్తంతో పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆయా రైతులందరికీ సూక్ష్మసేద్యం మంజూరు చేస్తారు. -
రూ.705 కోట్ల సహకార పంట రుణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సహకార పంటరుణాల కోసం నాబార్డు అదనంగా రూ.705 కోట్లు విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా సహకార పంట రుణాల మంజూరు మందగించడం, రబీలో రైతులకు పంట రుణాలు అందని నేపథ్యంలో ఆర్బీఐ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్)కు నాబార్డు ఈ నిధులిచ్చింది. వాస్తవానికి ఈ ఏడాది పంట రుణాలకు నాబార్డు రాష్ట్రానికి రూ.1,270 కోట్లు కేటాయించింది. రబీలో సహకార బ్యాం కుల ద్వారా రూ.2,200 కోట్ల రుణాలు అందజేయాల్సి ఉండగా నాబార్డు అదనం గా విడుదల చేసిన నిధులతో మరిన్ని పంట రుణాలు ఇచ్చేందుకు అవకాశం లభించింది. టెస్కాబ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 9 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో 272 బ్రాంచీలు ఉండగా వాటిల్లో 12 లక్షల మంది రైతులకు ఖాతాలున్నాయి. ఈ రైతులందరికీ ఆయా సహకార బ్యాంకు బ్రాంచీల్లో రూ.4 వేల కోట్ల వరకు డిపాజిట్లు న్నాయి. -
ఆ డబ్బెవరిది?
నాలుగు రోజులు.. రూ.43 కోట్లు.. డీసీసీబీ డిపాజిట్లపై నాబార్డు ఆరా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారుల బృందం నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లపై నాబార్డు ఉన్నతాధికార బృందం విచారణ చేపట్టింది. డిపాజిట్ల మాటున బ్లాక్ మనీని.. వైట్‌గా మార్చుకున్నారా? అనే దానిపై ఆరా తీసింది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం జిల్లాలోని కో–ఆపరేటివ్ బ్యాంకులను సందర్శించి డిపాజిట్లపై విచారణ చేపట్టింది. సుమారు మూడు రోజుల పాటు విచారణ జరిగింది. రూ.రెండు లక్షలు, అంతకు మించి డిపాజిట్ చేసిన ఖాతాలపై ఆరా తీసింది. అలాగే పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన ఖాతాలకు కేవైసీ ఉందా? లేదా? అనే కోణంలో విచారణజరిపింది. రూ.50 వేలకు మించి చేసిన డిపాజిట్లకు పాన్‌కార్డు జత చేశారా? వంటి అంశాలను పరిశీలించింది. డిపాజిట్ల సేకరణలో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించారా? లేదా? అనే అంశాలపై విచారణ జరిగింది. రాజకీయ నేతల పాలనలో నడుస్తున్న ఈ కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో బ్లాక్‌మనీని, వైట్‌గా మార్చారనే ఆరోపణలు పలు రాష్ట్రాల్లో వ్యక్తమయ్యాయి. దీంతో అప్రమత్తమవైన ఆర్బీఐ విచారణ చేపట్టాలని నాబార్డును ఆదేశించింది. ఈ మేరకు నాబార్డు ఉన్నతాధికార బృందం జిల్లాలో విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎక్కువ డిపాజిట్లు.. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 41 కో–ఆపరేటివ్ బ్యాంకులున్నాయి. వీటిలో సుమారు 1.30 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిమానిటైజేషన్ నేపథ్యంలో ఇతర బ్యాంకుల మాదిరిగా కో–ఆపరేటివ్ బ్యాంకులకు పాతనోట్ల ఎక్చే ్సంజీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి అనుమతి ఇవ్వలేదు. కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకునేందుకు వీలు కల్పించింది. గత నెల 9, 10, 11, 12 తేదీల్లో నాలుగు రోజులు మాత్రమే డిపాజిట్లు తీసుకునేందుకు అనుమతించిన ఆర్బీఐ 13వ తేదీ నుంచి ఈ డిపాజిట్ల స్వీకరణకు కూడా బ్రేకు వేసింది. ఈ నాలుగు రోజుల్లోనే జిల్లాలో సుమారు రూ.43 కోట్ల మేరకు డిపాజిట్లు వచ్చాయి. దీంతో ఇలా ఇతర జిల్లాల్లోని కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు రావడంతో ఆర్బీఐ నాబార్డును విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా నాబార్డు బృందం ఈ డిపాజిట్లపై ఆరా తీసింది. ఇందులో ఏమైనా నల్లధనాన్ని తెల్లదనంగా మార్చారా? అనేక కోణంలో ఆరా తీయడం సహకార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకుల్లో నామమాత్ర డిపాజిట్లపై విచారణల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం పలు ప్రైవేటు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనం మార్చుకునేందుకు కొన్ని ప్రైవేటు బ్యాంకులు యథేచ్ఛగా నల్ల కుబేరులకు సహకరించారనే అభిప్రాయం ఉంది. పాత నోట్ల మార్పిడితో పాటు, డిపాజిట్ల సేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. -
పోలవరం పబ్లిసిటీ
-
పోలవరానికి రూ. 1,981 కోట్ల నిధులు
-
పోలవరానికి రూ. 1,981 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తొలి విడత నిధులు మంజూరు చేసింది. నాబార్డు ద్వారా రూ. 1,981 కోట్ల నిధులు అందజేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిధులకు సంబంధించిన చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందేశారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... తొలిసారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు నాబార్డు నిధులు ఇస్తోందని తెలిపారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధులు అవసరమని అన్నారు. ఇరిగేషన్ నిధులకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయపడతామని హామీయిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ఉమాభారతి, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యానికి రూ.874 కోట్ల రుణం
వ్యవసాయశాఖ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికోసం నాబార్డు నుంచి రూ.874 కోట్ల రుణం మంజూరైందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్లతో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బిందు, తుంపర సేద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.126 కోట్లు ఇస్తుందని, లబ్ధిదారుల వాటాగా మరో రూ.92 కోట్లు మొత్తంగా రూ.1,092 కోట్లతో సూక్ష్మ సేద్యాన్ని చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణలో మొత్తం 3.15 లక్షల ఎకరాలకు పైగా డ్రిప్ , స్పింక్లర్ సేద్యం కిందకు రావడం ఓ రికార్డని చెప్పారు. పాలి హౌస్ కింద సబ్సిడీ రుణాలు భారీగా పెంచామని, ఇటీవలే హరియాణా బృందం రాష్ట్రంలో పర్యటించి ఈ పథకాన్ని అభినందించిందని అన్నారు. వెయ్యి మందికి పాలి హౌస్ కింద రుణాలు ఇవ్వడం కూడా ఒక రికార్డని, ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ వల్లే సాధ్యమైందన్నారు. -
నాబార్డు పనులు వేగవంతం చేయాలి
ఏలూరు (మెట్రో) జిల్లాలో నాబార్డు ద్వారా ఆర్ఐడిఎఫ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబరులో నాబార్డు ద్వారా ఆర్ఐడిఎఫ్ పనుల ప్రగతిని పంచాయతీరాజ్, ఆర్అండ్బి, మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్, గిరిజన సంక్షేమ శాఖలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకూ రు.373 కోట్లతో 228 ప్రాజెక్టులను చేపట్టామని అవి వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఆర్అండ్బి ద్వారా చేపట్టిన పనులను సమీక్షిస్తూ 6 నెలల నుండి ఎటువంటి ప్రగతి లేదనీ, వారం, వారం అడిగితే పనులు ఇంకా మొదలు కాలేదని టెండర్లు స్టేజిలో ఉన్నాయని చెబుతున్నారన్నారు. ఇదే కొనసాగితే ఇకపై ఆర్అండ్బి శాఖకు నాబార్డు ద్వారా పనులను ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారు. ప్రతిపాదనలు అనుమతి కోసం ప్రభుత్వం వద్ద పెడింగ్‌లో ఉన్నాయని ఆర్అండ్బి ఎస్ఇ నిర్మల చెప్పగా కలెక్టరు ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయాలని నాబార్డు డిజిఎం రామప్రభును ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఎర్రకాలువ, తమ్మిలేరు పనులను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ డిఇను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పొదుపుతోనే ఆర్థిక భద్రత
నాబార్డ్ ఏపీ సీజీఎం సత్యనారాయణ అమలాపురం టౌ¯ŒS : పొదుపుతోనే ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత లభిస్తుందని నాబార్డ్ ఏపీ సీజీఎం వీవీవీ సత్యనారాయణ అన్నారు. బ్యాంకుల సేవలను నూరు శాతం సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక భద్రత కల్పించుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఏఎస్ఎ¯ŒS కళాశాలలో శుక్రవారం జరిగిన వివిధ బ్యాంకర్లతో జరిగిన ఆర్థిక సమ్మిళిత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనాన్సియల్ సర్వీస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఫైనా¯Œ్స, జిల్లా లీడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జిల్లాకు చెందిన అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా శక్తి సంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు, రైతు క్లబ్‌ల ప్రతినిధులు, రైతు మిత్రులు కూడా హాజరై బ్యాంకుల నుంచి సేవలను పొందే విషయాలపై సందేహాలను అధికారుల ముందు ఉంచి నివృత్తి చేసుకున్నారు. వివిధ బ్యాంకుల అధికారులు సమన్వయం, సహకారంతో ఆర్థిక సమ్మిళితకు పాటు పడాలని సదస్సు నిర్ణయించింది. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బీవీఎం సుబ్రహ్మణ్యం, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, జిల్లా చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మ¯ŒS టి.శ్రీనివాసరావు సదస్సులో ప్రసంగించారు. సాంకేతిక సేవలను ఎలా ఉపయోగించుకుని ఆర్థిక భద్రత కల్పించుకోవాలని అనే అంశాలపై బ్యాంకుల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. -
రైతు ఉత్పత్తి దారుల అభివద్ధే నాబార్డు ధ్యేయం
లేపాక్షి : రైతు ఉత్పిత్తిదారుల అభివద్ధే నాబార్డు ధ్యేయమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ సాయిగుచ్చారావు తెలిపారు. సోమవారం లేపాక్షి వెలుగు కార్యాలయంలో ఎంపీపీ హనోక్ అధ్యక్షతన మహిళ సంఘం సభ్యులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు సాయిగుచ్చారావుతోపాటు గోదావరి నాలెడ్జి సొసైటీ డైరెక్టర్లు సుధాకర్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేసి,అందులో ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, ఉత్పత్తి విలువ పెంచడం, ఉత్పత్తి మార్కెటింగ్‌ను ఎలా చేయాలన్న వివరాలను తెలియజేశారు. సమగ్ర పాడి అభివద్ధి కింద జిల్లా ఆరు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఒక గొర్రెలు, మేకలకు సంబంధించిన గ్రూపును ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం సురేఖ, మండల సమాఖ్య అధ్యక్షులు అరుణ, సభ్యులు నాగమణి, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
రుణాలను రెన్యువల్ చేసుకోవాలి
రామన్నపేట : రైతులు తాము తీసుకున్న పంట రుణాలను నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకుంటేనే వడ్డీమాఫీ వర్తిస్తుందని నాబార్డు ఏజీఎం దయామృత స్పష్టంచేశారు. నాబార్డు సహకారంతో మిత్రఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రామన్నపేటలో ఏర్పాటుచేసిన ఆర్థిక అక్షరాస్యత ప్రచార సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరిపంటకు గ్రామం యూనిట్‌గా ఫసల్‌బీమా యోజన పథకం కింద బీమా వర్తిస్తుందని చెప్పారు. నాబార్డుద్వారా ఆవు, గేదెలు, జీవాలు కొనుగోలు చేసే ఎస్సీలకు 50శాతం సబ్సిడీ, బీసీలకు 30శాతం సబ్సిడీని అందిస్తుందని వివరించారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతీపౌరుడు బ్యాంకుఖాతాలను కలిగి ఉండాలన్నారు. మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక అక్షరాస్యత ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ అనుముల బ్రహ్మచారి, భానుప్రకాష్, ఆదర్శరైతులు పిశాటి సత్తిరెడ్డి, ఎస్. రమేష్, లతాశ్రీధర్, ప్రోగ్రాంఆఫీసర్ బి.ఆంజనేయులు, కోఆర్డినేటర్ వి.భరత్, రైతుక్లబ్‌సభ్యులు సిందం లింగయ్య, మోటె లింగస్వామి, బండ లింగస్వామి, గొరిగె బీరప్ప, కళాబృందంసభ్యులు వెంకటచారి, ఆంజనేయులు, క్రిష్ణ, శ్రీను, వేణు పాల్గొన్నారు. -
నాబార్డు నిధులతో పోలవరం : సుజనా
ఢిల్లీ : నాబార్డు నిధులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నాబార్డు రుణం వచ్చే నెల 15వ తేదీ తర్వాత విడుదలవుతుందన్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని సుజనా తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 అంచనా వ్యయం ప్రకారం నిధులు విడుదల చేయనున్నట్టు సుజనా చౌదరీ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం భరించనుండడంతో ఈ మొత్తాన్ని కేంద్రం.. నాబార్డు నుంచి రుణంగా పొందనుంది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం నాబార్డు నుంచి రుణంగా పొంది.. కేంద్ర సంస్థ అయిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)æ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనుంది. ఈ మేరకు నాబర్డ్–పోలవరం ప్రాజెక్టు డెవలెప్మెంట్ అథారిటీకి మధ్య ఒప్పదం కుదిరింది. ప్రాజెక్టుకు నిధుల విడుదల, వినియోగ పత్రాల సమర్పన తదితర అంశాలపై సోమవారం ఢిల్లీలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరీ సమక్షంలో నాబర్డ్– పోలవరం అథారిటీ– రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. నాబర్డ్ చైర్మన్ హర్షకుమార్ భన్వాల్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర‡ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను కేంద్ర మంత్రి సుజనా చౌదరీ మీడియాకు వెల్లడించారు. -
రైతు ఉత్పత్తిదారుల సంఘాల పటిష్టతకు కృషి
కర్నూలు(అగ్రికల్చర్): రైతు ఉత్పత్తిదారుల సంఘాల పటిష్టతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నాబార్డు డీడీఎం నాగేష్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లా సహకార కేంద్రబ్యాంకు సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సీఇఓలు, డైరెక్టర్లకు సంఘాలను ఏ విధంగా అభివద్ధి చేసుకోవాలనే దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నాబార్డు ఆధ్వర్యంలో తొమ్మిది సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఏసీ ఆధ్వర్యంలో మూడు సంఘాలు ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఏసీ రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివద్ధి కోసం మూడు పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఈక్విటి గ్రాంట్ కింద రూ.10 లక్షల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పేరుతో మరో పథకాన్ని అమలు చేస్తుందని ఇందులో ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. కోటి వరకు రుణ సదుపాయం ఉంటుందని తెలిపారు. -
సాయంపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) రాష్ట్రం నుంచి ఎంపికయిన ప్రాజెక్టులకు కేంద్రం రూ.9వేల కోట్ల మేర సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి, నాబార్డ్‌కి మధ్య ఈ నెల 7న ఢిల్లీలో కుదిరిన ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 11 ప్రాజెక్టులకు సాయం అందించనుంది. ఇందులో కేంద్రం గ్రాంటు కింద రూ.1108కోట్లు, నాబార్డ్ రూ.7,955కోట్లు రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రం నుంచి సానుకూలత వచ్చినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు,పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాధ్‌పూర్ , భీమా, వరద కాల్వ ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు కోసం మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇంతవర కు 10,428 హెక్టార్లు సేకరించారని, మిగతా 4,267 హెక్టార్లను త్వరితగతిన సేకరించాలని సూచించారు. దీంతో పాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురంభీం ప్రాజెక్టులకు మిగిలిపోయిన భూ సేకరణను వేగిరం చేసి పనులు సత్వరం పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
తెలంగాణ 11 ప్రాజెక్టులకు నాబార్డు నిధులు
-
తెలంగాణ 11 ప్రాజెక్టులకు నాబార్డు నిధులు
న్యూఢిల్లీ: నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేవి అవాస్తవాలని టీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ చెప్పేవి అసత్యాలు అని కొట్టిపారేశారు. వెంటనే మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నాబార్డు మధ్య ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశారు. అలాగే కేంద్ర వ్యవసాయశాఖమంత్రిని, మరో నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను కూడా ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అందాల్సిన సాయాన్ని గుర్తు చేయగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి 400 చెరువుల ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. తమకు మిషన్ కాకతీయ అత్యంత ప్రతిష్టాత్మకం అని అన్నారు. ట్రిపుల్ ఆర్ కింద నిధులు విడుదల చేయాలని కోరినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో 11 ప్రాజెక్టులకు నా బార్డు నుంచి నిధులు వస్తాయన్నారు. ఇక కందులు, పెసర వంటివాటికి మద్దతుదరతోపాటు ఇంటెన్సివ్ కూడా రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. తాము రాష్ట్రంలో నిర్మించబోయే గోడౌన్లకు గతంలో ఇచ్చినట్లే సబ్సిడీ ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెసలు, కందులు త్వరలోనే కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పారు. -
ఢిల్లీ వెళ్లిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్రం ‘నాబార్డ్’తో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. ఈ ఒప్పంద కార్యక్రమానికి జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో పాటు టీ.సర్కార్ తరపున హరీశ్ రావు హాజరు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు సమకూర్చనున్న ఈ పథకంలో రాష్ట్రానికి చెందిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీవాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెం వాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్ , భీమా, వరద కాల్వలు (మొత్తం 11 ప్రాజెక్టులు) ఉన్నాయి. అలాగే కృష్ణానది యాజమాన్య బోర్డు వైఖరిపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీశ్ ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రి వెంట అధికార బృందం కూడా ఢిల్లీ వెళ్లింది. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
చౌటుప్పల్ : ప్రతి మహిళ స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్టు జనరల్ మేనేజర్ బి.దయామృత అన్నారు. మండలంలోని దామెర గ్రామంలో నాబార్డు, శాంతి గ్రామీణాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు స్కూల్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వీరికి శుక్రవారం ఆమె సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు నూపుణ్యంతో స్కూల్ బ్యాగులు, ట్రావెల్ బ్యాగులు, పర్సులను తయారు చేయాలన్నారు. తద్వారా స్వయం ఉపాధిని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బక్క యాదయ్య, కోఆర్డినేటర్ చెక్క బాలకిషన్, విమల, సరస్వతి, స్వాతి, విజయమ్మ, రజిత, అనిత, సునీత, రజని తదితరులు పాల్గొన్నారు. -
విద్యారుణాలకు ప్రాధాన్యం
ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ బాలాజీచెరువు (కాకినాడ) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విద్యారుణాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ హరిదయాళ్ప్రసాద్ పేర్కొన్నా రు. జేఎన్టీయూకే స్టూడెం ట్ ఎమినిటీస్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్రాంచ్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిదయాళ్ ప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌తో పాటు మెడిసిన్ రంగంలో ఉన్నతవిద్యను అభ్యసించే విద్యార్థులకు సులభంగా విద్యారుణాలు అందజేసి వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి వ్యాపార రుణాలతో పాటు వాహన, గృహ రుణాలు మరింత సులభతరం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అశ్విన్ మెహతా, జనరల్ మేనేజర్ రవీంద్రపాండే, విజయవాడ సీఎం రాజీవ్కోహ్లి, ఆర్ఎం సాయిబాబా, జేఎన్టీయూకే బ్రాంచ్ మేనేజర్ కె.పి.శోభారాణి, కుప్పం శ్రీనివాస్, ముత్తా లక్ష్మణరావు పాల్గొన్నారు. -
‘ఈ–ఫ్రెష్’ ద్వారా రైతులకు సాంకేతిక సేవలు
నిజామాబాద్ రూరల్ : గ్రామీణ రైతులకు పూర్తి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే ఈ–ఫ్రెష్ రైతు సమృద్ధి సేవాకేంద్రాల లక్ష్యమని నాబార్డ్ రాష్ట్ర అధికారి, ఈ–ఫ్రెష్ జిల్లా కోఆర్డినేటర్ దశరథ్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ మండలంలోని నిజామాబాద్ సహకార పరపతి సంఘంలో రైతు సమృద్ధి సేవాకేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అతి తక్కువ ధరకు అందించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 140 సహకార సంఘాలుండగా, అభ్యుదయ సహకార సంఘాలుగా గుర్తించబడిన వంద సంఘా ల్లో రైతు సమృద్ధి సేవాకేంద్రాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లించేలా ఈ కేంద్రాల ద్వారా క్రయవిక్రయాలు జరుపనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ లాభాపేక్షతో కాకుండా రైతులకు సేవలు చేరాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నా రు. నిజామాబాద్ సొసైటీలో వీటిని ఏర్పాటు చేసేందుకు రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డా.పవన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు పంట భూములకు భూసార పరీ క్షలు చేయించుకోవాలని, పరీక్ష ఆధారంగా అధికారుల సల హాలు, సూచనల మేరకు ఎరువులు, క్రిమిసంహారక మం దులు వాడాలని రైతులకు సూచించారు. సమావేశంలో నిజామాబాద్ సొసైటీ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, వైస్ చైర్మన్ కిషన్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, సొసైటీ కార్యదర్శి సంతోష్, నాబార్డ్ రిసోర్స్ పర్సన్స్ కృష్ణమూర్తి, శ్రీనివాస్, సుధాకర్, రైతు కూలీ సంఘం నాయకులు పాపయ్య, నాగయ్య, శర్పసాయన్న, సంతోష్, కర్రన్న, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. -
సూక్ష్మసేద్యానికి రుణంపై నాబార్డు కొర్రీలు
రూ. వెయ్యి కోట్ల అప్పుపై సర్కారు హామీనీ పట్టించుకోని సంస్థ ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం రాయితీ వద్దని మెలిక 25 శాతం రైతులు చెల్లించాల్సిందేనని పట్టు అలాగైతేనే పథకానికి రుణం ఇస్తామని కుండబద్దలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం పథకం అమలుకు ప్రభుత్వం అడిగిన రూ. వెయ్యి కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డు కొర్రీలు పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థకు ఇచ్చే రుణంపై పూచీకత్తు ఇస్తామని సర్కారు హామీ ఇచ్చినా మార్గదర్శకాల పేరిట సాకులు చెబుతోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నూరు శాతం రాయితీ (బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ)ని 75 శాతానికి పరిమితం చేస్తేనే రుణం మంజూరు చేస్తామని మెలిక పెడుతోంది. ఈ అంశంపై ఉద్యానశాఖ అధికారులు మూడుసార్లు చేపట్టిన సమావేశాల్లోనూ నాబార్డు అధికారులు ఇదే వాదనను తెరపైకి తెచ్చారు. లబ్ధిదారులకు నూటికి నూరు శాతం సబ్సిడీ సరైంది కాదని... ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ మాత్రమే ఇవ్వాలని, మిగిలిన 25 శాతాన్ని రైతులు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని వారు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు క చ్చితమైన మార్గదర్శకాలున్నాయని... కాబట్టి నూటికి నూరు శాతం సబ్సిడీకి అంగీకరించబోమని చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ వ్యవహారం సీఎం వద్దకు వెళ్లినట్లు సమాచారం. ‘‘సబ్సిడీ ఎంతివ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఈ విషయంలో నాబార్డు జోక్యం సరైంది కాదు. వారిచ్చే రుణానికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. నిర్ణీత సమయంలో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత ప్రభుత్వానిది’’ అని ఉద్యానాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున సూక్ష్మసేద్యంతో తక్కువ నీటితో పంటలు పండించేలా చేయాలని భావించింది. గత రెండేళ్లలో 1.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేయగా... 2016-17లో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఈ పథకం కింద కేవలం 75 శాతమే రాయితీ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకం కింద గతేడాది నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఇస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది రూ. 290 కోట్లు కేటాయించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 190 కోట్లు కేటాయించగా... కేంద్రం తన వాటాగా రూ. 100 కోట్లు ఇవ్వనుంది. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని అందుకునేందుకు ఈ సొమ్ము సరిపోదని... అందువల్ల నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రం నిర్ణయించింది. నేరుగా రుణం తీసుకోవడానికి సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా రుణం తీసుకొని ఉద్యానశాఖ పరిధిలోని సూక్ష్మసేద్యానికి మరలించాలని నిర్ణయించింది. దుర్వినియోగం అవుతుందనేనా? లబ్ధిదారులకు నూరు శాతం సబ్సిడీ ఇస్తే సూక్ష్మసేద్యం పథకం దుర్వినియోగం అవుతుందని నాబార్డు అధికారులు చెబుతున్నారు. భారీ రాయితీ ఇస్తుండటంతో కొందరు రైతులు కూడా ఇష్టానుసారంగా తీసుకొని సూక్ష్మసేద్యం పరికరాలను ఉపయోగించుకోవడం లేదని అంటున్నారు. అందువల్ల రైతుల వాటా 25 శాతం ఉంటేనే బాధ్యతగా ఉంటారని పేర్కొంటున్నారు. అందుకే తాము రాష్ట్ర ప్రభుత్వానికి భారీ రాయితీ వద్దని సూచించామని ఒక అధికారి ‘సాక్షి’కి చెప్పారు. -
డిఫాల్టర్స్!
♦ ఇద్దరు డీసీసీబీ డెరైక్టర్లను ♦ వెంటాడుతోన్న నాబార్డు అప్పులు ♦ వాస్తవాలను మరుగుపర్చిన డీసీఓ కార్యాలయం ♦ సభ్యత్వం కోల్పోతాం...కాపాడండీ...: ♦ ఓ మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన వైనం ♦ ఆపై అండగా నిలుస్తోన్న డీసీసీబీ యంత్రాంగం ఆ ఇద్దరు డీసీసీబీ డెరైక్టర్లు. హ్యాండ్లూమ్స్ కోసం వీవర్స్ సొసైటీల పేరుతో రుణాలు తీసుకున్నారు. రూ.లక్షో.. రెండు లక్షలో కాదు ఏకంగా రూ.కోట్లలో రుణాలు తీసుకున్నారు. తర్వాత ఆ రుణాలను చెల్లించకుండా మొండికేశారు. దీనిని అధికారికంగా ధ్రువీకరిస్తే పదవులు కోల్పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో తమను తాము కాపాడుకునేందుకు గాడ్ఫాదరైన మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆపై అధికార యంత్రాంగం మద్దతు లభించింది. ఇంకేముంది డిఫాల్ట్ వ్యవహారాన్ని డీసీఓ కార్యాలయ వర్గాలు తొక్కిపెట్టేశారు. సాక్షి ప్రతినిధి, కడప: డీసీసీబీకే మచ్చతెచ్చే వ్యవహారమిది. డెరైక్టర్లు ఇద్దరు చేనేత సహకార సంఘాలకు ఆప్కాబ్, నాబార్డు ద్వారా హ్యాండ్లూమ్స్ ఏర్పాటుకు రుణాలు తీసుకున్నారు. చేనేత కుటుంబాలకు రుణాలు ఇవ్వకుండా స్వాహా చేయడమే కాకుండా, సబ్సిడీ పోనూ తక్కిన రుణం చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇద్దరు డెరైక్టర్ల పరిధిలో సుమారు రూ.2.5కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఒక్కరిదే దాదాపు రూ.2కోట్లు ఉన్నాయి. కాగా రుణాల గోల్మాల్ను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. కొందరు చేనేత సంఘాల నేతలు ఆప్కాబ్, నాబార్డులతోపాటు, డీసీఓ, డీసీసీబీలకు సైతం ఫిర్యాదు చేశారు. డీసీసీబీలో డెరైక్టర్లుగా ఉన్న ఆ ఇద్దరు డిఫాల్టర్స్‌గా ఉన్నారని చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే సిఫార్సులతో... డీసీసీబీ డెరైక్టర్లపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో విచారణ చేయాల్సిన యంత్రాం గం వారికే కొమ్ముకాస్తోంది. అందుకు ఉదాహరణ డీసీసీబీ యంత్రాంగం నేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డెరైక్టర్లకు వారిపై వచ్చిన ఫిర్యాదుల ప్రతులను అందజేయడమే. ఆ వెంటనే పాలకమండలికి గాడ్‌ఫాదర్‌గా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యేను డెరైక్టర్లు ఆశ్రయించినట్లు తె లుస్తోంది. ‘ఇదివరకు మీకు అండగా నిలి చాం. చైర్మన్ గిరీ కైవసం చేసుకునేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాం. తాజా పరిణామాల నేపథ్యంలో మీతోడ్పాటు అవసరం. మీరే ఈ గండం నుంచి గట్టెక్కించాలి’ అని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు డెరైక్టర్లకు అభయమిచ్చిన మాజీ ఎమ్మెల్యే డీసీసీబీ యంత్రాం గానికి, డీసీఓ కార్యాలయ వర్గాలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇంకేముం ది రికార్డులు పరిశీలించి ఆ డెరైక్టర్లు డిఫాల్టర్స్ అవునా కాదా? అన్న విషయాన్ని నిగ్గుతేల్చాల్సిన డీసీఓ కార్యాలయం నిర్లక్ష్యం చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకాధికారుల విచారణ..... డీసీసీబీ డెరైక్టర్లు ఇద్దరు డిఫాల్టర్స్‌గా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆప్కాబ్, నాబార్డు విభాగాలకు చెందిన ప్రత్యేకాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు చేనేత సహకార సంఘాల నిర్వహణ తీరుతెన్నులు, రుణాలు స్వాహా వైనంపై ఆరా తీసినట్లు సమాచారం. వ్యవహారం ఎటొచ్చి ఎటు తిరుగుతుందో తెలియదు కాబట్టి అంతవరకూ వేచిచూడాలనే ధోరణిలో డీసీసీబీ పాలకమండలి ఉన్నట్లు సమాచారం. వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంది నా పరిశీలనలో డీసీసీబీ డెరైక్టర్లపై ఫిర్యాదు రాలేదు. కర్నూల్ డీసీఓగా ఉన్న నేను మూడునెలల క్రితమే ఎఫ్ఏసీ బాధ్యతలు తీసుకున్నాను. దీనిపై వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంది. కార్యాలయానికి ఫిర్యాదు వచ్చిన విషయం కూడా నాకు సిబ్బంది తెలపలేదు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తాను. - డీసీఓ సుబ్బారావు