సాక్షి, హైదరాబాద్ : నాబార్డ్ ఉద్దేశ్యం మొత్తం రైతు శ్రేయస్సు, రైతు అభివృద్ధికి లబ్ది చేకూరెందుకు కృషి చేస్తున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాబార్డ్ ‘ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2021’ శుక్రవారం హోటల్ మారి గోల్డ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నాబార్డ్ ప్రతినిధులు, రాష్ట్రవ్యాప్త బ్యాంకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఏడాది కూడా క్రెడిట్ ఏక్షన్ ప్లాన్ క్షేత్ర స్థాయిలో జరగాలని చెప్పినట్లు పేర్కొన్నారు. గత ఏడాది చెప్పిన అంశాలన్నీ చేశామని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే గత పాలకుల పాలనలో అనేక సమస్యలు ఉండేవని, కానీ కేసీఆర్ నాయకత్వం వచ్చిన తరువాత 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తోందన్నారు.
రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భీమా లాంటివన్నీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్ తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అనతి కాలంలోనే పూర్తయ్యాయని, ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల బెడద తప్పిందన్నారు. లేబర్, గోడౌన్స్, ప్యాకేజింగ్ లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయన్న మంత్రి కొత్త సమస్యలపై నాబార్డ్ దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ కూలీలు దొరక్క బడి పిల్లలు పనులకు వెళ్తున్నారని, రైతు పిల్లలను ఎంకరేజ్ చేయాలని అన్నారు. పత్తి తీయడానికి కొత్తగా మెషీన్లు వచ్చాయని, వాటి సబ్సిడీ కోసం ఎలా ప్రయత్నం చేయాలనేది ఆలోచించాలని సూచించారు. ఇంతకుముందు సీజన్ అయిపోయిన డబ్బులు రాకపోయేవని, కానీ ఇప్పుడు సీజన్ రాకముందే రైతులకు డబ్బులు అందుతున్నాయని, వారికి మెసేజ్‌లు కూడా వెళ్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment